ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్‌లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్‌లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్‌తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్‌పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందుతోంది. భారత్‌లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్‌లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్‌ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్‌ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్‌పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్‌లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
కొన్నాళ్ల క్రితం వరకు ఎక్కువ మంది నోట వినిపించిన పేరు మడ్వి హిడ్మా. ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాను అభినవ భగత్‌సింగ్ అని, మరో అల్లూరి సీతారామరాజు అంటూ కొందరు కీర్తించగా.. హిడ్మా పేరిట ఉన్న క్రైం రికార్డుల మాటేమిటని మరికొందరు ప్రశి్నస్తున్నారు. కానీ ఇరువర్గాలను తల్లడిల్లిపోయేలా చేస్తోన్న ఒకే అంశం హిడ్మా తల్లి పొజ్జి. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ ఆమెను కలిసినప్పుడు తొలిసారిగా పొజ్జి వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత హిడ్మా అంత్యక్రియల సమయంలో ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన వారి మనుసులు బరువెక్కాయి. ఇప్పుడా పొజ్జి ఎలా ఉంది.. ఏం చేస్తోందని పలువురు ఆరా తీస్తుండగా ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పూవర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఓయ్ పారా అనే చిన్న పల్లెలో ఊరికి చివరగా అడవికి దగ్గరగా పాకలో మడ్వి పొజ్జి నివసిస్తోంది. ఆ పాకలో తిండి గింజలు దాచుకునేందుకు వీలుగా చుట్టూ కర్రలతో కట్టిన ఒక గది ఉంది. ఆ గదికి ఉన్న కర్ర తలుపులు జంతువులు లోపలికి పోకుండా తాళ్లతో కట్టి ఉన్నాయి. తాళం కూడా లేని ఇంట్లో ఆమె జీవిస్తోంది. గోండి భాషలో ఆమె చెప్పిన విషయాలను అక్కడ తెలుగు తెలిసిన మరో ఆదివాసీ యువకుడు తర్జుమా చేసి చెప్పిన వివరాల ఆధారంగా... ‘నా కొడుకు ఉన్నప్పుడు ఎవరూ ఇటు రాలేదు.ఇవన్నీ నాకెందుకు ? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కొందరు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నారు. ఇంకొందరు డబ్బులు ఇస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా, దాచమని నీ కొడుకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు అని అడుగుతున్నారు. వాడు (హిడ్మా) పార్టీలోకి వెళ్లిన తర్వాత నన్ను కలిసింది తక్కువ. మాట్లాడింది తక్కువ. నాకు వాడు ఇచ్చిన, మీరు ఇచ్చినా... అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? అసలు వాటితో నాకు ఏం అవసరం ఉంది’అంటూ పూవర్తిపైకి దండెత్తి వస్తున్న మీడియా బృందాలపై పొజ్జి కోప్పడింది. ఆయన మాటలు నమ్మాను‘ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ మా ఊరికి వచ్చాడు. మాతో మాట్లాడాడు. మాతో కలిసి అన్నం తిన్నాడు. ‘నీ కొడుకును లొంగిపొమ్మని చెప్పమ్మా’అని అడిగాడు. ‘వాడు నా మాట వినడయ్యా.. జనం కోసమని పోయిండు, నేను రమ్మంటే రాడు’అని చెప్పిన. ‘లేదమ్మా! మేము చెబితే అతను రావడం లేదు. నీ కొడుకు నీ మాట వింటాడు, నువ్వు చెబితే తప్పకుండా వస్తాడు. ఒక్కసారి అజ్ఞాత జీవితం వదలి రమ్మని అతనికి నువ్వు చెప్పు’అని అడిగాడు. అంత పెద్దమనిషి మా ఊరికి వచ్చి అడుగుతున్నాడు కదా అని మనసులో ఇష్టం లేకపోయినా లొంగిపో కొడుకా అని చెప్పాను. (హిడ్మాను లొంగిపొమ్మంటూ ఆమె చెబుతున్నట్టుగా వీడియోను గతంలో షూట్ చేసి రిలీజ్ చేశారు). ఆయన (విజయ్ శర్మ) మాటల మీద నమ్మకం ఉంచుకున్న.నా కొడుకు లొంగిపోయి ఇంటికి వస్తాడని ఆశలు పెట్టుకున్న. కానీ కొన్ని రోజులకే నా కొడుకును శవంగా మార్చి ఇంటికి పంపారు. ఆ రోజు (విజయ్ శర్మ పూవర్తికి వచ్చిన రోజు)న జరిగింది గుర్తుకు వస్తేనే అంటూ చెప్పే ప్రయత్నంలో ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. మాటలు ఆగిపోయాయి, కానీ కన్నీళ్లు ఆగలేదు. కొద్ది సేపటికే దుఃఖం నుంచి తేరుకుంది. చేతిలో కొడవలి పట్టుకొని, నాకు పని ఉంది అంటూ ఆమె నివసిస్తున్న పాకను ఆనుకొని ఉన్న పొలం వైపు అడుగులు వేసుకుంటూ సమీపంలోని అడవిలోకి పొజ్జి వెళ్లింది.:::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
సిరిసిల్ల: పాడె పైనుంచి పోస్ట్‌మార్టం హాల్‌కి..
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్‌లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. గాలి నాణ్యత ‘తీవ్ర’స్థాయికి
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
కధానాయిక...కదిలేనా ఇక?
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
‘కల్కి’ కంటే ముందే శంబాల టైటిల్‌ని ఫిక్స్ చేశాం
రాడికల్ నేత ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో యూనస్ ప్రతిజ్ఞ
పాక్‌తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
నువ్వే కావాలి.. మళ్లీ రావాలి
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
.. వాలంటీర్లలా దీన్ని ఎత్తేద్దామంటే కుదరడం లేదు.. జగన్ గుర్తు రాకుండా పేరు మార్చేస్తున్నారు!
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. గాలి నాణ్యత ‘తీవ్ర’స్థాయికి
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
కధానాయిక...కదిలేనా ఇక?
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
‘కల్కి’ కంటే ముందే శంబాల టైటిల్‌ని ఫిక్స్ చేశాం
రాడికల్ నేత ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో యూనస్ ప్రతిజ్ఞ
పాక్‌తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
నువ్వే కావాలి.. మళ్లీ రావాలి
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
.. వాలంటీర్లలా దీన్ని ఎత్తేద్దామంటే కుదరడం లేదు.. జగన్ గుర్తు రాకుండా పేరు మార్చేస్తున్నారు!
ఫొటోలు
పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)
వైఎస్ జగన్.. అరుదైన (రేర్) ఫొటోలు
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)
కలర్‌ఫుల్ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్ కోసం ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
సినిమా
శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం..!
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్ సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.కాగా.. ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఇందులో రవి మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. Actor #ShivaKarthikeyan narrowly escapes danger as another car hits his vehicle from behind in Kailash, Chennai. Thankfully, he walked away safe.Follow 👉 @FilmyBowlTamilpic.twitter.com/K6yaUm1BhG— FilmyBowl Tamil (@FilmyBowlTamil) December 20, 2025
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చాలా కనిపిస్తాయి. అలాంటి ఓ మూవీ 'జోజో రాబిట్'. సాధారణంగా యుద్ధం బ్యాక్ డ్రాప్ అనగానే యాక్షన్ లేదంటే ఎమోషన్స్ చూపిస్తారు. దీనికి మాత్రం కామెడీ టచ్ ఇచ్చారు. ఓ పిల్లాడి కంట్లో నుంచి ప్రపంచ యుద్ధాన్ని చూస్తే ఎలా ఉంటుందనేదే ఈ మూవీ స్టోరీ. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఉంది? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.2019లో థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ దక్కించుకున్న సినిమాల్లో ఇది ఒకటి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో 2020లో ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది. హిట్లర్, నాజీ సైన్యంపై తీసిన మూవీనే అయినప్పటికీ కాస్త వ్యంగం జోడించి తెరకెక్కించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇది హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.కథేంటి?అది రెండో ప్రపంచయుద్ధ సమయం. జర్మనీలోని ఓ ఊరిలో జోజో అనే పదేళ్ల పిల్లాడు ఉంటాడు. హిట్లర్ సైన్యంలో పిల్లల విభాగంలో ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇతడికి మాత్రమే కనిపించే 'ఊహజనిత హిట్లర్'.. అన్ని విషయాల్లోనూ గైడ్ చేస్తుంటాడు. అలాంటి జోజో జీవితంలో ఈ యుద్ధం ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. తల్లి రోజ్, ఇతడి ఇంట్లో రహస్యంగా ఉంటున్న యూదు అమ్మాయి ఎల్సా.. ఇతడి ప్రయాణంలో ఎలాంటి మలుపులకు కారణమయ్యారు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?చూడగానే ఇది పిల్లల సినిమాలా అనిపిస్తుంది గానీ రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, జర్మనీలోని నాజీ సైన్యం, యూదులు.. ఇలా పలు విషయాల్ని వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. వీళ్లు గురించి ఏం తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే వాటి కంటే జోజో అనే పదేళ్ల పిల్లాడు, అతడి ప్రపంచం మనకు నచ్చేస్తుంది. తోటి పిల్లలతో ఉండే కామెడీ, తల్లి, ఎల్సాతో ఉండే ఎమోషనల్ సీన్స్ మనం ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేస్తాయి.రెండు గంటల కూడా ఉండదు ఈ సినిమా. అయితేనేం డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. జోజోతో పాటు మనం కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. జోజో తల్లి, తండ్రి.. యూదులకు మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. జోజోకి మాత్రం హిట్లర్, అతడి సైన్యం అంటే చచ్చేంత ప్రేమ. అలాంటి ఈ పిల్లాడు.. ఇంట్లోనే రహస్యంగా ఉంటున్న ఎల్సాతో స్నేహం చేయడం, యూదుల గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అదే టైంలో ఆకట్టుకుంటాయి.కాకపోతే రెగ్యులర్ ఉండే డ్రామా కంటే ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి సగటు ప్రేక్షకుడి ఇది నచ్చకపోవచ్చు. లేదు ఏదైనా డిఫరెంట్‌గా టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొచ్చు. మరీ ముఖ్యంగా జోజో పాత్రలో నటించిన రోమన్‌తో ప్రేమలో పడిపోతాం. ఇతడి తల్లిని హిట్లర్ ఆర్మీ చంపి, ఊరి మధ్యలో వేలాడాదీసే సీన్ అయితే మనల్ని కూడా కంటతడి పెట్టిస్తుంది.- చందు డొంకాన
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్‌పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్‌కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్‌పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025
క్రీడలు
అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది: హర్భజన్
జాతీయ జట్టు సెలెక్టర్ల పని ఎప్పుడూ కత్తిమీద సామే. వారు ఎంపిక చేసిన జట్టు గెలిస్తే శెభాష్ అంటారు. అదే ఒక్క ఓటమి ఎదురైనా చాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్దానంలో రింకూ సింగ్.. జితేష్ శర్మ ప్లేస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు పదికి పది మార్కులు వేశాడు. కిషన్‌తో పాటు ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు."టీ20 వరల్డ్‌కప్‌కు అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్, మెనెజ్‌మెంట్‌కు 10కి 10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమైనప్పటికి.. జట్టు కూర్పుకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ టీ20ల్లో ఇదే అతడికి చివరి అవకాశం కాదు. గిల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు ఉంది.రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతడికి రాక జట్టుతో మరింత పటిష్టంగా మారింది. అదేవిధంగా జితేష్ శర్మ స్ధానంలో సెకెండ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. ఎందుకంటే 7 లేదా 8వ స్థానాల్లో ఆడే బ్యాటర్లు ఇప్పటికే జట్టులో చాలా మంది ఉన్నారు. టాప్ ఆర్డర్లో మెరుపులు మెరిపించే పవర్ హిట్టర్ జట్టుకు కావాలి. ఆ బాధ్యతను ఇషాన్ నెరవేరుస్తాడన్న నమ్ముతున్నాను" అని భజ్జీ పేర్కొన్నాడు.
టి20 సమరానికి సై
సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా 11 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు... ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది. అందుకు లంకతో సిరీస్‌ను ప్రాక్టీస్‌గా వినియోగించుకోవాలని చూస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమలిని, వైష్ణవి శర్మను ఎంపిక చేశారు. 17 ఏళ్ల కమలిని ఇప్పటికే అండర్–19 ప్రపంచకప్‌తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటింది. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు వైష్ణవి అండర్–19 ప్రపంచకప్‌లో 17 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి వచి్చంది. రాధ యాదవ్ గైర్హాజరీలో ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకం కానుంది. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మంధాన ఎలాంటి ప్రదర్శన చేస్తుందోచూడాలి. క్రికెట్ కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని ఇప్పటికే స్పష్టం చేసిన స్మృతిపై అందరి దృష్టి నిలవనుంది. ఇక అనూహ్యంగా వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకొని ఫైనల్లో అదరగొట్టిన షఫాలీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది. 17 ఏళ్ల శశి్నని, 19 ఏళ్ల రషి్మక, 23 ఏళ్ల కావ్యను ఈ మ్యాచ్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది.
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత పురుషుల ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట 21–10, 17–21, 13–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్ దశలో ఈ జోడీపై సులువుగా గెలిచిన భారత జంట... సెమీస్‌లో అదే ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది. తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న తర్వాత... అనవసర తప్పిదాలతో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత షట్లర్లు ప్రత్యర్థి కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. అదే జోరులో తొలి గేమ్ సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ దాన్ని కొనసాగించలేకపోయారు. రెండో గేమ్‌లో 3–6తో వెనుకబడిన భారత ప్లేయర్లు ఆ తర్వాత 7–7, 11–11తో స్కోరు సమం చేశారు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగగా కీలక దశలో పాయింట్లు సాధించిన చైనా జంట గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక అదే జోరులో మూడో గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి రెచ్చిపోగా... భారత జంట పోటీనివ్వలేక పరాజయం వైపు నిలిచింది.
పోరాడుతున్న వెస్టిండీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్‌నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేయగా... జాన్ క్యాంప్‌బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్‌బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.
న్యూస్ పాడ్‌కాస్ట్
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
బిజినెస్
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలుకొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్‌ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్‌లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.ఫ్యూయెల్ ఆదా కోసంరైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్‌గా యాక్సిలరేట్ చేయాలి.ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్‌లో బండి నడపాలి.ఎక్కువ సేపు స్టాప్‌లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్‌ఫామ్‌లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.మెటాపై విమర్శలుమోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.మెటా తన ప్లాట్‌ఫామ్‌లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!చైనాలో ఫేస్బుక్ & ఇన్‌స్టాగ్రామ్‌లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.మెటా స్పందనమెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్‌ఫామ్‌ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?
26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్‌గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్‌ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం ఈ కథనంలో..జనవరి: స్థిరమైన ఆరంభం2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు – రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.మార్చి: వేగం పుంజుకున్న ధరలుమార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000–రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయిఏప్రిల్ నెల బంగారం మార్కెట్లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.మే–జూన్: స్వల్ప ఊగిసలాటమే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000– రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.సెప్టెంబర్: మళ్లీ జోరుసెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులుదసరా–దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్‌టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.డిసెంబర్: స్వల్ప తగ్గుదలడిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు – రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది.
ఫ్యామిలీ
నెల్లూరు చేపల పులుసు
కావలసినవి: చేప ముక్కలు (కొరమీను / వంజరం / బొచ్చ చేప) – అర కిలో; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి); టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 3–4 (నిలువుగా కట్చేసినవి); వెల్లుల్లి రెబ్బలు – 8–10 ( నిలువుగా కట్చేసినవి); అల్లం – చిన్న ముక్క; కరివేపాకు – 2 కొమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; చింతపండు రసం – కప్పు (పులుపు తగినంత); నూనె – 3 టేబుల్ స్పూన్లు; పులుసు మసాలా: కారం – 2 టీ స్పూన్లు; ధనియాలపోడి – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్రపోడి – పావు టీ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్.తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టాలి. మట్టిపాత్ర లేదా మందమైన వెడల్పాటి పాత్రలో నూనె వేసి, వేడి చేయాలి. అందులో మెంతులు వేసి, వేగాక ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాలపోడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేయాలి. కదపకూడదు. మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పులుసు నుంచి నూనె పైకి తేలినప్పుడు జీలకర్రపోడి, కొత్తిమీర వేసి మంట తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.దాల్ మఖనీసంప్రదాయ ఉత్తర భారతీయ వంటకం కావలసినవి: మినప్పప్పు – కప్పు; రాజ్మా – పావు కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది); టమాటా గుజ్జు – 2 కప్పులు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి); కారం∙– టీ స్పూన్; ధనియాలపోడి – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పాల మీగడ – పావు కప్పు; కొత్తిమీర – అలంకరణకు;తయారీ: పప్పులు రాత్రిపూట నానబెడితే ఉదయానికి ఉడికించడానికి రెడీగా ఉంటాయి. నానబెట్టిన పప్పులను కుకర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి పాన్ లో నూనె, టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి టమాటా గుజ్జు వేసి, నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాలపోడి, ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన మినప పప్పు, రాజ్మా పై మిశ్రమంలో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మెల్లగా మరిగించాలి. సన్నని మంటపై అరగంటసేపు ఉడికిస్తే రుచి మరింత బాగుంటుంది. చివరగా మిగిలిన వెన్న, మీగడ, గరం మసాలా వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆఫ్ చేయాలి. పై నుంచి మరికొద్దిగా పాల మీగడ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలిదాల్ మఖానీని నాన్, రోటీ, జీరా రైస్ లేదా కుల్చాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.మటన్ రోగన్ ఘోష్ఇది కాశ్మీర్‌కు చెందిన ప్రసిద్ధ వంటకం. ఘుమఘుమలాడే మసాలా, మృదువైన మటన్ ముక్కలు, ప్రత్యేకమైన రంగు, రుచి ఈ వంటకం ప్రత్యేకత. కావలసినవి: మటన్ – పావు కిలో; పెరుగు – కప్పు; ఉల్లి పాయలు – 2 (సన్నగా తరిగినవి); అల్లం – వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్లు; కారం – పావు టీ స్పూన్ ; ధనియాలపోడి – రెండు టీ స్పూన్లు; జీలకర్రపోడి – టీ స్పూన్; సోంపుపోడి – 1 టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; యాలకులు – 3; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ – 1; నూనె లేదా నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – అలంకరణకు.తయారీ: మటన్‌కు కొద్దిగా ఉప్పు, సగం అల్లం–వెల్లుల్లి పేస్ట్ రాసి, 30 నిమిషాలు ఉంచాలి. పాన్ లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె/నెయ్యి వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలిపి 5–7 నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కశ్మీరీ కారం, కారం, ధనియాలు, జీలకర్ర, సోంపుపోడులు, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బయట గిన్నెలో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మూత తీసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉంచి, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.రోటీ, నాన్ లేదా అన్నంతో ఈ మటన్ రోగన్ ఘోష్ ను వడ్డించాలి.
లఘు చిత్ర వైభవం..
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. అన్సెసావో.. 30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు. జహాన్–ది లాస్ట్ గిఫ్ట్.. రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే.
అంతర్జాతీయం
ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్‌ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు. Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq— ANI (@ANI) December 20, 2025
సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) దళాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలను టార్గెట్ చేసి అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. కాగా, ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్‌కు చెందిన ఉగ్రవాది దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. ఈ సందర్బంగా సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు.- The U.S. Armed Forces launched Operation Hawkeye Strike, a large-scale retaliatory operation targeting dozens of Islamic State (ISIS) and ISIS-affiliated military sites across northern and central Syria.The strikes were conducted in direct respo...pic.twitter.com/dcxWpkV28p— Ashley Williams (@ashley_wil38239) December 20, 2025ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ దాడులు ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సమూహాన్ని లక్ష్యంగా చేసుకునే అమెరికా ప్రయత్నానికి పూర్తిగా మద్దతు ఇస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక. మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినవలసి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు.CENTCOM releases footage from Operation Hawkeye Strike , a massive retaliatory assault on ISIS in Syria.Over 100 precision munitions used by U.S. & Jordanian forces to destroy 70+ ISIS targets across northern & central Syria. pic.twitter.com/xsC15zkqOe— TRIDENT (@TridentxIN) December 20, 2025మరోవైపు, పీట్ హెగ్సెత్ స్పందిస్తూ.. సిరియాలోని ఐసిస్ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్ ప్రారంభించాయని తెలిపారు. అయితే, ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. U.S. forces deliver decisive retaliation against ISIS in Syria following the attack that claimed the lives of two American soldiers. Operation Hawkeye Strike is underway, A-10 Warthogs, Apache helicopters, and other assets launching into the night to dismantle ISIS targets.… pic.twitter.com/ouxNAl6cfp— Freyja (@FreyjaTarte) December 20, 2025
తైవాన్‌లో దారుణం.. మెట్రో వద్ద విచక్షణారహిత దాడి
తైపీ: తైవాన్ రాజధాని తైపీలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జనంపై కత్తి, పొగ గ్రనేడ్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత నిందితుడు ఓ భవనం ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని 27 ఏళ్ల చాంగ్ వెన్గా గుర్తించారు.ఈ సందర్భంగా తైవాన్ ప్రీమియర్ చో జంగ్-తాయ్ మాట్లాడుతూ.. రాజధాని తైపీలోని మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు చాంగ్ వెన్కు నేర చరిత్ర ఉంది. అతడిపై వారెంట్లు కూడా ఉన్నాయి. అతను ఉద్దేశపూర్వకంగా స్మోక్ బాంబులను విసిరి.. ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశాడు. ఇందుకోసం పొడవైన కత్తిని ప్రయోగించినట్లు కనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. BREAKING: 3 killed, 5 injured as knife attacker goes on rampage in central Taipei, Taiwan after setting off smoke bombs at main train station — Reuters pic.twitter.com/04zgmAZs8T— Rapid Report (@RapidReport2025) December 19, 2025
ఉక్రెయిన్‌పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సైతం నేరుగా లైవ్‌లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
జాతీయం
మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ అవినీతి, బంధుప్రీతి కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. ఇక్కడ మహా జంగిల్‌రాజ్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉండేదని, సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అదే ఫలితం బెంగాల్లోనూ పునరావృతం కాబోతోందని తేల్చిచెప్పారు. బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. బెంగాల్ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టంచేశారు. మహా జంగిల్‌రాజ్‌ను కచ్చితంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో బెంగాల్లో బీజేపీ విజయానికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ ‘‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా మాకు అభ్యంతరం లేదు. కానీ, ప్రజలను ఎందుకు వేధిస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. అవినీతి, బంధుపీత్రి, బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇక్కడ ప్రగతి ఆగిపోయింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. కట్ మనీ, కమీషన్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. బెంగాల్ నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే బీజేపీని గెలిపించాలి. మాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం. తృణమూల్ కాంగ్రెస్ అకృత్యాల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ అనే నినాదం రాష్ట్రంలో మార్మోగిపోతోంది. అందుకే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారు చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం సిగ్గుచేటు. వారిని కాపాడేందుకే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తిస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి. బంగ్లాదేశ్‌లో మతపరంగా వేధింపులకు గురై మన దేశంలోకి వచ్చినవారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించాం. దానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బాధితులను బెదిరించాలని చూస్తోంది’’ అని మోదీ విమర్శించారు. తాహెర్‌పూర్‌లో ప్రధాని మోదీకి బదులుగా బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు రూ.3,200 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ యూటర్న్ భారీ పొగమంచు కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మోదీ హెలికాప్టర్లో కోల్‌కతా నుంచి తాహెర్‌పూర్ చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉండగా, పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో చేసేది లేక హెలికాప్టర్‌ను మళ్లీ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. మోదీ కోల్‌కతా నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి తాహెర్‌పూర్‌లో సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగించే సభకు వెళ్తుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీల్డా–కృష్ణానగర్ సెక్షన్‌లోని తాహెర్‌పూర్, బడ్కుల్లా రైల్వేస్టేషన్ల మధ్య పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపా రు. కార్యకర్తల మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నాం.. గౌహతి ఎయిర్‌పోర్టులో నూతన టెరి్మనల్ ప్రారంభించిన మోదీ గౌహతి: అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎజెండాలో ఈశాన్య రాష్ట్రాలు ఏనాడూ లేవని ఆక్షేపించారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయన శనివారం అస్సాంలో పర్యటించారు. రాజధాని గౌహతిలో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.4,000 కోట్లతో నిర్మించిన నూతన టెరి్మనల్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అస్సాం అటవీ భూములను ఆక్రమించుకొని రాష్ట్ర గుర్తింపునకు ముప్పుగా మారిన చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే దీని అక్ష్యమన్నారు. కొందరు దేశ ద్రోహులు ఇప్పటికీ చొరబాటుదారులను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అస్సాంను గతంలో తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)లో విలీనం చేయడానికి కుట్రలు జరిగాయని, కాంగ్రెస్ కూడా ఇందులో భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఆ కుట్రను గోపీనాథ్ బార్డోలోయి విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అస్సాం రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోకుండా కాపాడారని కొనియాడారు. ఇండియాకు, ఆసియాన్ దేశాలకు మధ్య అస్సాం అనుసంధానంగా మారిందన్నారు. కీలక రంగాల్లో దేశ అభివృద్ధికి అస్సాం ఒక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రశంసించారు. గౌహతిలో మెగా రోడ్ షో గౌహతిలో మోదీ శనివారం సాయంత్రం 3.8 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీజీ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ జనం నినదించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ షో ముగిసింది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బలాన్ని చాటేలా ఈ రోడ్ షో జరిగింది. బీజేపీ నాయకులతో భేటీ ప్రధాని మోదీ అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
యాప్స్‌తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేధోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అపైŠల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సర్వీస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో.. » ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు. » నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు » కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు. » 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు..» భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. » రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. » ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. » మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. భారత్ అప్రమత్తం
త్రిపుర: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రికతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రం త్రిపురాలో భద్రతా చర్యల్ని కఠినతరం చేసింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఆదేశాలతో సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.బంగ్లాదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రికత్తగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు,బీఎస్ఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నీ రక్షణ చర్యల తీసుకుంటోందని త్రిపురా సీఎం స్పష్టం చేశారు.మరోవైపు,బంగ్లాదేశ్‌లో అశాంతి కొనసాగితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ అశాంతి త్రిపురా, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చు.త్రిపురా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలు భద్రతా చర్యలను స్వాగతిస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతోంది.
యాప్స్‌తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేథోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సరీ్వస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో.. ⇒ ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు.⇒ నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు⇒ కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు.⇒ 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు.. ⇒ భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒ రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. ⇒ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. ⇒ మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది.
ఎన్ఆర్ఐ
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన)
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
క్రైమ్
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది.
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్‌లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు.
వీడియోలు
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
కోతుల కోసం చింపాంజీ ఐడియా
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

