పేరుకే ‘మిల్లీమీటర్’.. ఎలాన్ మస్క్‌ను టార్గెట్ చేస్తున్న పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతు అందిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘జోన్ ఎఫెక్ట్’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ప్రస్తుతం లో-ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్‌లింక్ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్ యుద్ధంలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్‌లింక్‌ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్‌లింక్‌పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్ సూచిస్తోంది.
మయన్మార్‌లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్‌లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్‌యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్‌యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్‌కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్‌లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్‌తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహం.. బాలిక ప్రాణం తీసింది
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పసిడి @ 1.38 లక్షలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి, వెండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలకు దూసుకెళ్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,685 మేర పెరిగింది. రూ. 1,38,200కి ఎగిసింది. అటు వెండి ధర కూడా కిలోకి రూ. 10,400 మేర పెరిగి మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 2,14,500కి చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండటం, అక్కడి ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరింతగా పసిడి, వెండివైపు మళ్లుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇటు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్మెంట్ కోణం నుంచి డిమాండ్ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్లు కోటక్ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) ఒక దశలో 80.85 డాలర్లు పెరిగి 4,420.35 డాలర్లకు ఎగిసింది. వెండి సైతం 2.31 డాలర్లు పెరిగి ఔన్సుకి 69.45 డాలర్లు తాకింది.
గురజాలలో ప్రజాస్వామ్యానికి తూట్లు
స్టార్‌లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
టీడీపీ నాయకుల ఆధిపత్య పోరు.. పల్నాడులో జంట హత్యలు
ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో మందుల కొరత
కదం తొక్కిన సీఆర్ఎంటీలు
నేడు పులివెందులకు వైఎస్ జగన్
పసిడి @ 1.38 లక్షలు
రూ.350 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు
పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్’!
కలెక్టరేట్లోనే కరెంట్ కట్
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
అవసరమా ‘అఖండ’ కావరం?
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
Bigg Boss: టైటిల్ గెలిచినా.. స్టార్డమ్ రాలేదు?
నాకీ బిడ్డ వద్దు!
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
ఎన్నో విజయాలు సాధించా - పతాక స్థాయికి ట్రంప్ స్పోత్కర్ష
ఫుడ్ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్..
గురజాలలో ప్రజాస్వామ్యానికి తూట్లు
స్టార్‌లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
టీడీపీ నాయకుల ఆధిపత్య పోరు.. పల్నాడులో జంట హత్యలు
ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో మందుల కొరత
కదం తొక్కిన సీఆర్ఎంటీలు
నేడు పులివెందులకు వైఎస్ జగన్
పసిడి @ 1.38 లక్షలు
రూ.350 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు
పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్’!
కలెక్టరేట్లోనే కరెంట్ కట్
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
అవసరమా ‘అఖండ’ కావరం?
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
Bigg Boss: టైటిల్ గెలిచినా.. స్టార్డమ్ రాలేదు?
నాకీ బిడ్డ వద్దు!
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
ఎన్నో విజయాలు సాధించా - పతాక స్థాయికి ట్రంప్ స్పోత్కర్ష
ఫుడ్ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్..
ఫొటోలు
దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)
ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)
బిగ్‌బాస్-9 విజేతగా కల్యాణ్.. ట్రోఫీతో ఎక్స్ కంటెస్టెంట్స్ (ఫోటోలు)
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)
సినిమా
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)
ఫారిన్ ట్రిప్‌లో శ్రీలీల.. 'జైలర్' బ్యూటీ గ్లామర్
విదేశీ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీలబ్లాక్ డ్రస్‌లో అందంగా రకుల్ ప్రీత్ సింగ్'జైలర్' బ్యూటీ మిర్నా గ్లామరస్ పోజులుఫ్రెండ్ పెళ్లిలో కీర్తి సురేశ్ ఫుల్ హంగామాఅద్దం ముందు ఆషిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్బీచ్లో ఫుల్ చిల్ అయిపోతున్న దీపిక పిల్లి View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli)
శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రిలీజ్
గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్‌గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత)
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్‌గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
క్రీడలు
యంగ్ ఇండియాకు ఏమైంది.. తుది సమరాల్లో ఏమిటీ తడబాటు..?
నిన్న (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో యంగ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలై, భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ టోర్నీ ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడటాన్ని, అందులోనూ పాక్ చేతిలో ఓడిపోవడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.అంతవరకు తిరుగులేని శక్తిగా కనిపించిన భారత్.. అమీతుమీ పోరులో ఎందుకలా చతికిలబడిందని అంతా లెక్కలేసుకుంటున్నారు. కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. ఒత్తిడే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయినా యువ భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో ఒత్తిడికి చిత్తవడం ఇది కొత్తేమీ కాదు. గత ఎడిషన్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఇలానే చిత్తైంది.స్టార్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఎందుకో యంగ్ ఇండియాకు ఫైనల్ ఫోబియా పట్టుకుంది. ఒత్తిడి మినహా కారణాలేమీ కనబడటం లేదు. ఎందుకంత ఒత్తిడా అన్ని పరిశీలిస్తే.. తాజా ఉదంతంలో (2025 ఎడిషన్ ఫైనల్లో) భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సమర్పించుకోవడం కారణంగా తెలుస్తుంది.అలాగని బౌలింగ్ విభాగం బాగా లేదా అని చూస్తే అదీ లేదు. హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్ లాంటి సీనియర్ స్థాయి మీడియం పేసర్లు.. కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోవడం భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవడానికి కారణమని తెలుస్తుంది. భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే టాస్ గెలిచినా పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడని టాక్ వినిపిస్తుంది. ఇదే భారత్ కొంపముంచిదని అనిపిస్తుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకున్నారు. ఓ దశలో పాక్ 400 స్కోర్ దాటేలా కనిపించినా 347 పరుగులకే పరిమితం చేయగలిగారు.భారీ లక్ష్య ఛేదనను సైతం భారత్ ఆత్యవిశ్వాసంతోనే ప్రారంభించింది. తొలి బంతినే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్‌గా మలిచి పాక్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇక్కడే పాక్ బౌలర్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. భారత బ్యాటర్లను, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని బంతితో కట్టడి చేయలేమని తెలిసి నోటికి పని చెప్పారు. పదేపదే కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీని మాటలతో, దురుసు ప్రవర్తనతో రెచ్చగొట్టారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన యంగ్ ఇండియా బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు పారేసుకొని పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత ఓటమి తొలి 10 ఓవర్లలోనే ఖరారైపోయింది. టాప్-5 ప్లేయర్లు 9.4 ఓవర్లలో 68 పరుగులకే ఔటైపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏదో ఆడాలని ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కునైనా దాటగలిగింది.మొత్తంగా చూస్తే.. నిన్నటి రోజున భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పిచ్‌ను అంచనా వేయడం నుంచి పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ వలలో పడటం, అలాగే ఒత్తిడి లోనవడం వంటివి జరిగిపోయాయి. ఈ టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు అంతిమ పోరులో సత్తా చాటలేకపోవడం భారత ఓటమికి మరో కారణం. గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా అదే విశ్వాసాన్ని తుది సమరంలో కొనసాగించలేకపోవడం ఇంకో కారణం. అంతిమంగా భారత్ అన్ని విధాల అర్హమైన ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ టోర్నీ చరిత్ర చూస్తే.. భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 12 ఎడిషన్లు జరగ్గా భారత్ 8 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చివరిగా 2021 ఎడిషన్‌లో టైటిల్ సాధించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది 'చివరి కిక్'
మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు. ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారు.టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రోహిత్ ముంబై జట్టులో, కోహ్లి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్‌మన్ గిల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై) కూడా వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.ముంబై జట్టుకు రోహిత్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిథ్యం వహించనుండగా.. ఢిల్లీ జట్టులో కోహ్లితో పాటు రిషబ్ పంత్ (కెప్టెన్), హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ లాంటి టీమిండియా ప్లేయర్లు, ప్రియాంశ్ ఆర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు, రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారధులుగా వ్యవహరించనున్నారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు.వీరే కాక సంజూ శాంసన్ (కేరళ), మహ్మద్ షమీ (బెంగాల్), కేఎల్ రాహుల్ (కర్ణాటక), తిలక్ వర్మ (హైదరాబాద్) లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు. అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమతమ దేశవాలీ జట్లకు అందుబాటులో ఉంటారు.టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే అన్ని మ్యాచ్‌లు.. లేకపోతే కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
Ashes: ‘ఆసీస్’ చెత్త జట్టు.. ఇప్పటికీ అదే మాట అంటాను!
ఇంగ్లండ్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు కోల్పోయింది. సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కంగారూలు... మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.సంపూర్ణ ఆధిపత్యంఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యంతో గెలిచిన ఆసీస్.. మూడో టెస్టులోనూ దుమ్ములేపింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. ఆసీస్ విధించిన 435 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 207/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 102.5 ఓవర్లలో 352 పరుగుల వద్ద ఆలౌటైంది.ఇక 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ సిరీస్ కోల్పోని కంగారూలు... ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబర్చగా... అప్పటి నుంచి కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. చెలరేగిన బౌలర్లుఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (83 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడగా... అతడికి విల్ జాక్స్ (137 బంతుల్లో 47; 3 ఫోర్లు), బ్రైడన్ కార్స్(64 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు.జేమీ స్మిత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించిన జాక్స్... ఎనిమిదో వికెట్‌కు కార్స్‌తో 52 పరుగులు జతచేశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్‌కు ఆశలు చిగురించగా... స్టార్ పేసర్ స్టార్క్... స్మిత్, జాక్స్, ఆర్చర్ (3)లను ఆవుట్ చేసి ఇంగ్లండ్‌కు పరాజయం ఖాయం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 349 పరుగులు చేసి ప్రత్యర్థికి రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లండ్ పని పూర్తి చేయలేక సిరీస్ ఓటమి రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొంది.అత్యంత చెత్త జట్టు ఇదిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. సిరీస్ విజేత ఆసీస్ జట్టును ఉద్దేశించి.. ‘చెత్త’ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. కాగా యాషెస్ సిరీస్‌కు ముందు బ్రాడ్ మాట్లాడుతూ.. ‘‘2010-11 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇది. ఇదొక ఆప్షన్ కాదు. ఇదే నిజం’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.ఇప్పటికీ ఇదే మాట అంటానుఈ క్రమంలో మరోసారి సిరీస్ గెలుచుకున్న అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. బ్రాడ్‌కు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించిన బ్రాడ్.. ‘‘నేను పశ్చాత్తాపపడుతున్నానా? అస్సలు కాదు.ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ అతి గొప్పగా ఆడాల్సింది. అయితే, ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఏమీ ఆడలేదు’’ అని ‘ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే, మిచెల్ స్టార్క్ అద్భుత రీతిలో చెలరేగి వారు లేని లోటు కనబడకుండా చేశాడు. ఇక మూడో టెస్టుతో కమిన్స్ తిరిగి రాగా.. హాజిల్‌వుడ్ మాత్రం గాయం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా?
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.డఫీకి పేస్‌తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్‌లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో డఫీ ప్రదర్శనలు..తొలి టెస్ట్: 5-34 & 3-122రెండో టెస్ట్: 1-33 & 5-38మూడో టెస్ట్: 4-86 & 5-42టెస్ట్‌ల్లో విశ్వరూపం2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్‌ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.లీడింగ్ వికెట్టేకర్టెస్ట్ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్‌గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు. డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్‌కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్‌గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు..టీ20లు- 35 వికెట్లుటెస్ట్లు- 25 వికెట్లువన్డేలు- 21 వికెట్లుఓ క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు..జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు)రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79)డేనియల్ వెటోరి (2008లో 76)ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్‌లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
బిజినెస్
ధర ఎక్కువైనా.. 24 గంటల్లో కొనేశారు!
బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.ఇదీ చదవండి: అందుకే.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్!కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్‌లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ కనిపిస్తాయి.
ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్
కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.ముందంజలో జియోఈ విప్లవంలో రిలయన్స్ జియో కేవలం భారతీయ లీడర్‌గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 24 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్‌లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్‌వర్క్‌కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యంఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్‌ఫైబర్ సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.100 కోట్ల దిశగా ప్రయాణంభారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలనదేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయంఅమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170 గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితిఅమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.చైనాలో కూడా పనిగంటలు భారత్‌తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్‌లో ఎందుకీ పరిస్థితి?భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్‌లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.భారత్‌లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్‌ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్‌పై నిఘా
ఫ్యామిలీ
స్ట్రోక్‌కు సూపర్ హీరోలు!
రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతే వచ్చే స్ట్రోక్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయితే, ఈ ప్రాణహానికి అడ్డుకట్ట వేయడానికి స్విస్ శాస్త్రవేత్తలు కొత్త సూపర్‌హీరోలను సృష్టించారు. అవే మన రక్తనాళాల్లో పరిగెత్తే సూక్ష్మ రోబోలు! ఈ చిన్న రోబోలు రక్తప్రవాహంలో తేలికగా ప్రయాణిస్తూ, రక్తనాళం ఎక్కడైనా మూసుకుపోయిందని గుర్తిస్తే వెంటనే అక్కడికి చేరి గడ్డను కరిగించే మందును నేరుగా ఆ ప్రదేశానికే పంపిస్తాయి. రక్తం ఎంత వేగంగా ప్రవహించినా, ఇవి అంతే వేగంగా, చురుకుగా కదులుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు వీటిని బాహ్య అయస్కాంత క్షేత్రాల సాయంతో కచ్చితంగా నియంత్రించగలమని నిరూపించారు. అంటే వైద్యులు రక్తనాళాల సన్నని దారుల్లో ఈ రోబోలను నిశితంగా నడిపించగలరు. సడ¯Œ గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఇప్పటి చికిత్సలు, మందులు, శస్త్రచికిత్స సమయం తీసుకుంటాయి. కాని, ఈ రోబోలు, మొదటి నిమిషాల్లోనే గడ్డపై నేరుగా దాడి చేసి, ప్రాణాలను రక్షించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, స్ట్రోక్ చికిత్సలో ప్రాణరక్షక సేనగా మారబోతున్నాయి.
మానవాళి రక్షణకై ప్రబావించిన యేసుక్రీస్తు
‘క్రిస్టోస్’, ‘మాస్సే’ అనే రెండు పదాల నుంచి క్రిస్మస్ అను మాట వచ్చింది. దాని అర్థం క్రీస్తును ఆరాధించుట. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. క్రిస్మస్ పరమార్థాన్ని గుర్తించి దేవుని ఆరాధించుటలో తప్పులేదు గాని దానిని ఆచార ‡సంబంధమైన ఓ పండుగగా భావించి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే! ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినం క్రిస్మస్. క్రిస్మస్ సమయంలో ప్రతి చర్చిలోను, ప్రతి కార్యక్రమాలలోను క్రైస్తవులు ఈ బైబిల్ వాక్యాలను తప్పక చదువుతారు. ‘‘ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంటుండగా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే, ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు.ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు’ అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను’’– (లూకా 2:814).ఇంగ్లండు దేశంలో జన్మించిన చార్లెస్ వెస్లీ తన జీవితకాలంలో సుమారుగా 6500 పాటలు రచించాడు. తన అన్న జాన్‌వెస్లీ తన ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే, చార్లెస్ వెస్లీ తన పాటల ద్వారా అనేకులను దేవునివైపు నడిపించాడు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన చార్లెస్ దేవుని పట్ల అపారమైన భయభక్తులు కలిగియున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చిన సందర్భాన్ని తాను వ్రాసిన పాటలలో అద్భుతంగా వివరించాడు. వాటిల్లో ఒక పాట ఇలా ఉంటుంది. ‘‘దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి... ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందున. భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున మ్రోగుపాట చాటుడి.’’ దాదాపుగా అన్ని సంఘాల్లో ఈ పాట పాడి క్రిస్మస్ ఆత్మీయ అర్థాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ‘నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును’ అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? సకలలోక సృష్టికర్తయైన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన శరణు కోరిన వారిని పవిత్రపరుస్తాడు. పాపము విడిపించి ఆత్మశుద్ధిని దయచేస్తాడు. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకున్నాయి కూడా. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న ‘అపోలో–11’ అనే రాకెట్ మీద అక్షరాలా 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి, మహనీయుడైన దేవుని మనసారా స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘‘నిన్ను కాపాడువాడు’’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టియే ఇంత అద్భుతంగా ఉంటే, దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా!నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళి వచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి, కొన్ని పరిశోధనలు చేసి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు కూడా తీసుకువచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి, ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి.ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణలలో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచారు. ప్రతి సభలోనూ ఆయన ప్రకటించిన సత్యం... ‘‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు అదీ గొప్ప విషయం.’’ నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భువిపై జన్మించారన్నది లేఖన సత్యం. క్రీస్తు ప్రభువు జన్మ స్థలమైన బేత్లెహేము ప్రపంచంలోని కోట్లాదిమంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ బేత్లెహేము ఒకప్పుడు స్వల్ప గ్రామమైనను నేడు అది ప్రత్యేక ప్రదేశంగా విరాజిల్లుతోంది. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). దేవుడు తన ప్రజల జీవితాల్లో తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బేత్లెహేము నుంచి వస్తాడు అని చెప్పబడిన ప్రవచనం చాలా గొప్పది. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. రక్షకుడు పుట్టే స్థలము మాత్రమే గాక ఆయన గుణలక్షణమును, విశిష్ట అధికారాన్ని మీకా తెలియచేశాడు. దేవుడు నిత్యుడు. అందుకే ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరికి నిత్య సంపదలు అనుగ్రహిస్తాడు. నిత్యజీవం ఆయన ఇచ్చే బహుమానములలో ప్రధానమైనది. సృష్టికర్త పుడమిపై పవళించిన ఆ స్థలము పరమ పావనమై పునీతమైంది. బేత్లెహేము చరిత్రను మనం క్లుప్తంగా గమనించగలిగితే ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు విశదమౌతాయి. పరిశుద్ధ గ్రంథంలో బేత్లెహేమునకు విశిష్టమైన స్థానం ఉంది. బేత్లెహేము అనేమాటకు రొట్టెల గృహము (హౌస్ ఆఫ్ బ్రెడ్) అని అర్థం. ఇది జెరూషలేముకు దక్షిణంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాకోబు కాలంలో ఈ ప్రాంతాన్ని ‘ఎఫ్రాతా’ అని పిలిచేవారు. ఇక్కడే యాకోబు తన భార్యయైన రాహేలును పాతిపెట్టాడు. ‘‘రాహేలు మృతిబొంది బేత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.’’ పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఘట్టం రూతు చరిత్ర. రూతు కూడా తన అత్తయైన నయోమితో కలిసి మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చెను. దేవుడు రూతును బహుగా హెచ్చించెను. రూతు బోయజును వివాహమాడి ఓబెదును కనెను. ఓబెదు యెష్షయిని, యెష్షయి దావీదును కనెను. (రూతు 4:21). మోయాబు దేశం నుండి వచ్చిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడం నిజంగా ఆశ్చర్యమే కదా! దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిస్తే తన దివ్య ప్రణాళికలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడతాయి అనడానికి రూతు జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. బేత్లెహేములోని పొలాలను బోయజు పొలాలు అని కూడా పిలుస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు బేత్లెహేములోనే జన్మించి బేత్లెహేమీయుడుగా పిలువబడెను. దానినే దావీదుపురము అని కూడా కొన్ని సందర్భాలలో పిలిచారు. కారణం అది దావీదు జన్మస్థలము కాబట్టి.మరియకు ప్రధానం చేయబడిన యోసేపు కూడా బేత్లెహేములో జన్మించాడు. అది అతని జన్మస్థలము కాబట్టి ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకొనుటకు నజరేతు నుంచి ప్రయాణం చేసి బేత్లెహేము వరకు వచ్చెను. ఏ బేత్లెహేముకైతే అత్యంత పురాతన చరిత్ర ఉన్నదో అదే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించెను. బెత్లెహేము అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం అయితే, యేసుక్రీస్తు ‘‘జీవపు రొట్టె’’గా జీవాహారముగా ఆ ప్రాంతములో జన్మించి ఆ పేరును స్థిరపరచెను.ఈ బేత్లెహేము పొలములోనే గొర్రెల కాపరులు క్రీస్తు ఆగమన సందేశాన్ని పొందారు. రాత్రివేళ భయముతో తన మందను కాచుకొనుచున్న ఆ గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం మాత్రమే గాక వారి జీవితాలను కూడా క్రీస్తు ప్రేమ అనే వెలుగుతో నింపివేసెను. హల్లేలూయ! యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించాడని బైబిల్లో ఆయాచోట్ల తెలియచేయబడింది.రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసుపుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ‘‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి’’ అని చెప్పిరి. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుంచి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుంచి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? అనిరి (యోహాను 7:42). చర్చ్ ఆఫ్ నేటివిటీప్రపంచంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు, కట్టడాలు వున్నాయి. నిత్యం వేలాది యాత్రికులు ఆ ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్, చైనాలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇండియాలో ఉన్న తాజ్‌మహల్– ఇంకా ఎన్నో వింతలుగా పేర్కొనబడుచున్నవి. కాని, వీటికంటే ఉన్నతమైన రీతిలో ఒక ప్రాంతం ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకర్షిస్తూ ఉంది. అదే బేత్లెహేములో ఉన్న చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఎంతో విశాలమైన ప్రాంతంలో నిర్మించబడిన ఈ చర్చ్ ప్రాముఖ్యత మనకందరికి విదితమే! ఇదే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన స్థలం. పుడమిపై శాంతిదూత వెలసిన పుణ్యస్థలం. ఏటా కోట్లాదిమంది అనేక దేశాల నుంచి ఇక్కడకు వచ్చి దైవభక్తితో క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ బేత్లెహేములో ఉంది. ఇది ప్రపంచ నగరాలలో పోలిస్తే చాలా చిన్నది కాని, జగద్రక్షుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టీస్ మార్టెర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా; 3వ శతాబ్ద చరిత్రకారులైన ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. గొప్ప చరిత్రకారుడు, బైబిల్‌ను లాటిన్ భాషలోనికి అనువదించిన సెయింట్ జెరోవ్ు కూడా క్రీ.శ.384 సంవత్సరంలో ఇక్కడే పాతిపెట్టబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. కానీ క్రీ.శ 614వ సం.లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు.ఆశ్చర్యమేమిటంటే వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే ఆ చర్చ్‌లో వారు చూసిన కొన్ని దృశ్యాలు, యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చ్‌ని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చ్‌లో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు ప్రభువువారు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది.ఈ చర్చిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే తల వంచి వెళ్ళాలి. ఆ చర్చి ముఖద్వారం చాలా చిన్నగా ఉండడమే దానికి కారణం. ప్రపంచంలోని ఎంత గొప్పవ్యక్తి అయినా, తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే! మొన్నీ మధ్య అమెరికా ప్రెసిడెంటు కూడా తలవంచి లోపలికి వెళ్ళారు. అయితే చిన్న పిల్లలకు ఆ సమస్య లేదు. వారు చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ‘‘చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి. ఈలాటి వారిదే పరలోక రాజ్యము’’ అని ప్రభువు చెప్పిన మాట ఆ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. బేత్లెహేము నక్షత్రమని పిలువబడిన ఈ నక్షత్రాన్ని అసిస్సి వాసియగు ఫ్రాన్సిస్ సంబంధీకులు క్రీ.శ. 1717లో వుంచారు.అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అని అక్షరాలు చెక్కబడియున్నవి. క్రొత్తనిబంధన కాలంలో ఉన్న మనకు ప్రభువే ముఖ్యుడు. ప్రాంతం మనకు ముఖ్యం కాదు. క్రీస్తు రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేమునందు జన్మించడం వలన ఆ చిన్న గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినట్లుగా నేడు మనం ఆయనను మన హృదయాలలోనికి ఆహ్వానిస్తే కీర్తి, ఘనత, ఆశీర్వాదం మన సొంతమవుతాయి. మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను వ్రాయబడిన క్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీలను చూస్తాం. వాస్తవానికి సమాజంలో కొంతమంది స్త్రీలను చిన్న చూపు చూస్తుంటారు. స్త్రీ బలహీనమైనదని, ఆమెపట్ల పక్షపాతం చూపిస్తారు. యూదుల వైఖరికూడా స్త్రీల పట్ల చులకనగానే వుంటుంది. కానీ దేవుని దృష్టిలో స్త్రీ, పురుషులని భేదం లేదు. అందరికీ సమానంగా తన కృపను చూపించుచున్నాడు అనే విషయం తన వంశావళిలో స్త్రీల పేర్లను ప్రస్తావించుటను బట్టి తేటతెల్లమయ్యింది. ఏ యూదుని వంశావళిలోనూ స్త్రీ పేరు కనబడదు. స్త్రీలకు బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన స్థానం కల్పించబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన తరువాత పురుషులు, దేవదూతలతో పాటు స్త్రీలు కూడా ఆనందించారు. బైబిల్ గ్రంథంలో పురుషులు చేసిన సేవను గుర్తించిన విధంగా స్త్రీలు చేసిన పరిచర్యను కూడా ప్రభువు గుర్తించారు. పాతనిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా సేవలందించారు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా స్త్రీల సహాయం చాలా గొప్పది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతిని శిష్యులకు తెలియజేసినది కూడా స్త్రీలే. అంత గొప్ప ప్రాధాన్యతను ప్రభువు వారికి అనుగ్రహించి, స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ వారు కాదని, వారిపట్ల కూడా దేవుడు అపారదృష్టి కలవాడని నిరూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో కూడా స్త్రీలను ప్రస్తావించుట ద్వారా దేవాదిదేవుడు వారికెంత విలువ, గౌరవం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో క్రొత్తనిబంధనలో ఇద్దరు సువార్తికులు యేసుక్రీస్తు వంశావళిని వ్రాశారు. సువార్తికుడైన లూకా యోసేపు వంశావళి క్రమాన్ని అనుసరించి దావీదు కుమారుడైన నాతాను క్రమం నుంచి వ్రాసుకొస్తే, మత్తయి సువార్తికుడు మాత్రం మరియ వంశ క్రమాన్ని దావీదు కుమారుడైన సొలొమోను క్రమం నుంచి వ్రాసుకుంటూ వచ్చాడు. వీరిద్దరిలో మత్తయి పేర్కొన్న వంశావళిలో ఐదుగురు స్త్రీలను గూర్చి ప్రస్తావించాడు. పరిశుద్ధాత్ముడు అనుమతించాడు గనుకనే వీరిపేర్లు దైవగ్రంథంలో చిరస్మరణీయంగా లిఖించబడినాయి. దేవునిలో లింగభేదం, వయోభేదం, కుల మత భేదాలు లేవని; అందరినీ సమానంగా ప్రేమించుచున్నాడని దానినిబట్టి అవగతమవుతుంది. మత్తయి సువార్తికుడు ప్రస్తావించిన ఐదుగురు స్త్రీలను గూర్చి ధ్యానిద్దాం!మొదటిగా తామారు. ఆమెను గూర్చిన వివరణ ఆదికాండం 38వ అధ్యాయంలో చూడగలం. యూదా కనానీయుని కుమార్తెను పెండ్లి చేసుకొనెను. ఆమె యూదాకు ఏరు, ఓనాను, షేలా, అను ముగ్గురు కుమారులను కనెను. యూదా తన పెద్దకుమారుడైన ఏరుకు తామారును ఇచ్చి వివాహం చేసెను. అయితే ఆమెయందు సంతానమేమీ కలగకుండానే ఏరు చెడునడతను బట్టి చనిపోయాడు. తదుపరి రెండవ కుమారుడైన ఓనానుకు తామారు ఇవ్వబడింది. ఓనాను కూడా తన స్వార్థపు బుద్ధితో సంతానం లేనివాడాయెను. అప్పటికి యూదా మూడవ కుమారుడు షేలా చిన్నవాడై యుండుట వలన తామారును తన తండ్రి ఇంటికి పంపివేసెను. రోజులు గడుచుచుండగా తామారు మారువేషంలో యూదాను కలుసుకొనగా వారిరువురకు పెరెసు, జెరహు అను కుమారులు కలిగి యూదా వంశం కొనసాగించబడింది.ఇక్కడ తామారును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలోనికి అనుమతించడానికి గల కారణం ఆమె యూదాకు సంతతి కలుగజేసి, అతని వంశమును నిలువబెట్టాలనుకోవడమే! ఎందుకంటే మెస్సీయా ఈ గోత్రం నుంచే వస్తాడు గనుక సాతాను ప్రాముఖ్యంగా ఈ గోత్ర నిర్మూలనకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. సంఖ్య 24:17లో వ్రాయబడినట్లు ‘‘నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును’’అను వాక్యం నెరవేరునట్లుగా యూదా సంతతి కొరకు దేవుడు తామారును ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు, యూదా వంశమును కొనసాగించుటకు తామారు తీసుకొన్న నిర్ణయం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే హర్షించదగినదే! యూదా వంశమును కొనసాగించుటకు ఆమె తనకు తాను తగ్గించుకొని అనేకుల చేత నిందలనిపించుకొనుటకైనా సిద్ధపడింది. ఆమె సమాజం దృష్టికి నీచమైనదిగా కనబడినప్పటికీ ప్రభువు ఆమెను, ఆమె తగ్గింపును గుర్తించి తన వంశావళిలో స్థానం కల్పించాడు. రెండవ స్త్రీ రాహాబు. యెరికో ప్రాకారం మీద నివసించిన ఒక వేశ్య. ఈమె ఆ ప్రాంతంలో నివసిస్తూ అనేకులను పాపం వైపు ఆకర్షిస్తుంది. యెరికో అనే మాటకు ‘‘సువాసన’’ అని అర్థం. అయితే ఆ యెరికో ప్రాకారాల మీద నివసించు స్త్రీలు కొంతమంది ఆ సువాసన కల్గించే వాటిని ఉపయోగించి బాటసారులను పాపమునకు ఆకర్షించేవారు. పేరు మంచిదే గాని, దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిదిగా లేదు. మంచి పేరు ఉండడం తప్పు కాదు కాని, ఆ పేరుకు తగ్గ జీవితం వున్నదా లేదా అనేది ముఖ్యం. రాహాబు భయంకర పాపములో జీవిస్తుండేది. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును ముట్టడి వేయడానికి ముందు ఆ పట్టణమును వేగుచూచుటకు రాగా రాహాబు వారిని తన ఇంట చేర్చుకొని ఆ ప్రాంతపు రాజు చేతినుండి తప్పించెను.అందువలన ఇశ్రాయేలీయుల చేతిలో యెరికో పట్టుబడెను గాని రాహాబు, తన కుటుంబము మాత్రమే తప్పించబడెను. రాహాబు ఇశ్రాయేలీయులలోని శల్మాను అను వ్యక్తిని పెండ్లి చేసుకొని క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించెను. లోకరీతిగా వేశ్యలకు అంత విలువ, గౌరవం ఉండదు. కాని, ప్రభువు మాత్రం ఎంతో గొప్ప స్థానం కలుగజేశాడు. ఎందుకనగా రాహాబు జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆమె దేవుని ప్రణాళికలో భాగస్థురాలయింది. రాహాబు తన గతాన్ని సమాధి చేసి ఓ మంచి దైవికమైన భవిష్యత్తు కొరకు తనను తాను సిద్ధపరచుకున్నది. ఒక వ్యక్తి గతమెంత భయంకరమైనదైననూ ఆ వ్యక్తి ప్రభువును అంగీకరించుట ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవచ్చు అని రాహాబు ఋజువు చేసింది. మూడవది రూతు. ఆమె మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. ఇశ్రాయేలు దేశంలో కరవు వచ్చినప్పుడు నయోమి తన భర్తను, కుమారులను తీసుకొని మోయాబుకు వెళ్ళింది. అక్కడ తన కుమారులకు వివాహాలు చేసింది. పది సంవత్సరాలలో భర్త, కొడుకులు చనిపోయారు. తిరిగి బేత్లెహేముకు రావాలని నిర్ణయించుకుంది. ఒక కోడలు అత్తను విడిచి వెళ్లిపోయింది. అయితే, రూతు తన అత్తను హత్తుకొని ఆమె కోసం నిలబడింది. ఇక మంచి అత్తాకోడళ్ళ బంధాన్ని వీరిలో స్పష్టంగా చూడవచ్చు. రూతు తన అత్తతో పాటు యూదా దేశానికి వస్తున్నప్పుడు ‘‘నీ దేవుడే నా దేవుడు’’ అని పలికింది. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉందని, బహుమానం ఇచ్చువాడని గ్రహించి ఆ దేవుని విడువక హత్తుకుంది. మోయాబు దేశాన్ని విడచి దేవుని ప్రజలతో ఉండాలని బెత్లేహేమునకు వచ్చింది. బేత్లెహేములో సంపన్నుడైన బోయజు ఉన్నాడు. అతని పొలంలోకి పరిగె ఏరుకొనుటకు ఒక పరదేశిగా ప్రవేశించింది. పూర్వదినాలలో భూస్వాములు తమ పంటలో కొంత భాగాన్ని పరదేశుల కోసం విడిచిపెట్టేవారు. ఏ పొలంలోనికైతే యవలు ఏరుకొనుటకు వెళ్ళిందో తన సత్ప్రవర్తననుబట్టి ఆ పొలానికి యజమానురాలు అయ్యింది. బోయజు ఆమెను పెండ్లిచేసుకొని, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మోడుబారిన జీవితాలను సర్వశక్తుడైన దేవుడు చిగురింపచేయగలడు అనే సందేశాన్ని రూతు ప్రపంచానికి ఇచ్చింది. నాల్గవదిగా బత్షెబ. ఈమె గూర్చి సువార్తికుడైన మత్తయి ‘‘ఊరియా భార్య’’ అని ప్రస్తావించాడు తప్ప ఆమె పేరును మాత్రం తెలుపలేదు. ఈమెను గూర్చి 2 సమూయేలు 11వ అధ్యాయంలో చదువగలము.ఈమె ఏలీయాము అనువాని కుమార్తె, ఊరియా అను హిత్తీయుని భార్య. ఊరియా దావీదు సైన్యంలోని నమ్మకమైన సైనికుడు. దావీదు ఊరియా భార్యయైన బత్షెబతో పాపం చేసి, దానిని దాచుకొనుటకు తనభర్తయైన ఊరియాను యుద్ధంలో చంపించెను. తరువాత దావీదు బత్షెబను వివాహమాడి ఆమెయందు నాతాను, సొలొమోను అను ఇద్దరు కుమారులను కనెను. దావీదు బత్షెబతో పాపం చేయడం ద్వారా పుట్టిన మొదటి కుమారుడు చనిపోయెను. ప్రవక్తయైన నాతాను ద్వారా దావీదు గద్దింపబడినప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది దేవునివైపు తిరిగెను. దేవుని మహాకనికరం అతని మీద కుమ్మరించబడెను. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా తన సింహాసనం తనకు నిత్యం స్థిరపరచుదునన్న మాటను నెరవేర్చుటకు దేవుడు బత్షెబను దీవించాడు. చివరగా మరియ. గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది’. వివాహం కాకుండా గర్భం ధరించుట వలన ఎన్ని నిందలు అవమానాలు వస్తాయో ఊహించలేనంత పరిస్థితిలో మరియ లేదు. ప్రపంచం ఎదురు తిరిగినా తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంది.దూత ప్రకటన వినిన తదుపరి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని రక్షకుని ఆగమనానికి సహకరించింది. తాను పొందబోయే శ్రమల కంటే దేవుని కృప గొప్పదని గుర్తించింది. ‘‘నీవు కృప పొందితివి’’ (లూకా 1:30). ఆ ఒక్క మాట చాలు! దేవుని కృప ద్వారా ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోవచ్చు. నిండు చూలాలిగా ఉన్నప్పుడు నజరేతు నుంచి బేత్లేహేముకు ప్రయాణం, తమకు తెలియని ఈజిప్టు దేశంలో చిన్నబాలుడైన యేసుతో పాటు రెండు సంవత్సరాలు నివసించడం, అన్ని విషయాల్లో బాలుడైన యేసును అతి జాగ్రత్తగా చూసుకొనే విషయాల్లో మరియ దేవుని కృపమీద ఆధారపడింది. ∙∙ ఇకపోతే, యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే ప్రశ్నను చాలామంది లేవదీస్తున్నారు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘‘యేసు గ్రీకో–రోమన్ తత్త్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల మానసిక ఆవిష్కరణయే గాని, వాస్తవం కాదు. క్రొత్తనిబంధన ఒక పురాణమే గాని, వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు’’. దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు. ‘‘ప్రపంచంలోని చాలా విషయాలకు ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా, కేవలం మనుష్యుల ఆలోచనలపై ఆధారపడియున్నవి.కాని క్రైస్తవ్యం అటువంటిది కాదు’’. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బ్రూస్ అనే వ్యక్తి పరిశీలనాత్మకంగా ప్రకటించిన సత్యమిది. వాస్తవాలను క్రోడీకరించే ప్రతి చరిత్రకారునికి జూలియస్ సీజర్ చారిత్రకత ఎంత స్పష్టమో, యేసుక్రీస్తు చరిత్ర అంతకన్నా ఎక్కువ స్పష్టం.యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు, ఆయన మొదటి శతాబ్దకాలంలో ఈ భూమిపై సంచరించాడని, ఆయన రక్షకుడు మరియు దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రాజకీయవేత్త. రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటు కాలంలో గలిలయలోని తిరుగుబాటు దళమును నడిపిన వ్యక్తి. వెస్పాసియన్ అనే రాజుచేత చెరపట్టబడి మిగిలిన తిరుగుబాటు కాలమంతా రోమీయులకు మధ్యవర్తిగానూ, తర్జుమాదారునిగానూ పనిచేశాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు వ్రాశాడు. అవి: ‘‘ద జ్యూయిష్ వార్స్ ’’, ‘‘జ్యూయిష్ యాంటిక్విటీస్’’ ఫ్లావియస్ అనుపేరు రోమా పేరు కాగా జోసఫస్ అను పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు ‘‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’’ ఫ్లావియస్ జోసఫస్ అత్యంత అద్భుతమైన చరిత్రకారుడు. ఆయన వ్రాసిన చరిత్ర సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జన్మను, మరణాన్ని, పునురుత్థానాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గూర్చి సవివరంగా వ్రాయబడ్డాయి. ఆ సువార్తికులు ఎవరనగా– మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరిచే సువార్తలన్నీ క్రీ.శ. 70వ సంవత్సరంలోపే వ్రాయబడ్డాయి. అనగా యేసు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాలలోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. క్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతి తక్కువ సమయంలోనే వ్రాయబడింది గనుక వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనంగా బైబిల్ నిలిచింది.క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరి దేని గురించి అతడు ఆలోచించడు.కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి; వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుంచి అపరాధముల నుంచి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుచున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘‘ఏ భేదము లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు’’ అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి.పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి తన సిలువ మరణం ద్వారా విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం తరువాత కూడా ఓ ఉన్నతమైన జీవితం ఉందనే సత్యాన్ని తెలిపి మనిషికి నిరీక్షణ ప్రసాదించాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’’ అనే మాట బైబిల్లో ఉంది. ఒక మంచి వ్యక్తిని ప్రేమించడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో గాని, పాడైపోయిన మనిషిని దేవుడు ప్రేమించాడు. నిస్వార్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు లోకప్రేమల వెంటబడి తన జీవితాన్ని వృథాపరచుకోడు. క్రీస్తు ప్రభువు బోధలో చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రేమ. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాట ద్వారా నేడు అనేకులు ప్రేమ ఔన్నత్యాన్ని తెలుసుకొని సమసమాజ నిర్మాణంలో తన బాధ్యతను నెరవేస్తున్నారు.క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కాని, క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. చెట్టి భానుమూర్తి వ్రాసిన శ్రేష్టమైన ఈ పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడు మరచిపోదు. ‘రారె చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానది తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే. బాలుడిడిగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నా«థుడు’. సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.⇒ గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది.⇒ దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.⇒ ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత క్రొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి ఆ వయోలిన్ తనకిమ్మని సంఘ సేవకుణ్ణి అడిగాడు.ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి, దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయించాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి
సింపుల్ స్వాగ్!
యంగ్ బాలీవుడ్ జనరేషన్స్ కి కొత్త స్టయిల్ మూడ్ సెట్ చేస్తున్న అనన్యా పాండే, ఫ్యాషన్స్ లో పెద్ద హంగామా కాకుండా, తానెలా ఫీలవుతుందో అలా ధరించడమే తన సీక్రెట్ అంటోంది. ఆ స్టయిల్ విషయాలే ఇక్కడ మీ కోసం!‘ఫ్యాషన్స్ అంటే ఓ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ . నేను ఎలా ఫీలవుతున్నానో, అదే నా లుక్. డ్రెస్ ఏదైనా అయినా, నా స్టయిల్ నచ్చేలా ఉన్నప్పుడు అది సింపుల్ అయినా, క్లాసీ అయినా నిజంగా స్టయిలిష్‌గా కనిపిస్తుంది.’ జ్యూలరీ బ్రాండ్: జడావూ జ్యూలర్స్ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర.. బ్రాండ్: మనీష్ మల్హోత్ర ధర రూ. 2,25,000గ్లామర్ తాళ్లు! శారీ బ్లౌజ్ వెనుక దారాలు అంటే ఒకప్పుడు కేవలం కట్టుకునేందుకు మాత్రమే ఉండేవి కాని, ఇప్పుడు అవే దారాలు మన లుక్‌ని ‘ఓహ్ వావ్!’ అనిపించే స్టయిల్ స్టేట్మెంట్గా మారిపోయాయి. ముఖ్యంగా వెనుక భాగంలో రకరకాలుగా కట్టే డోరీస్కి గంటలు, తారలు, త్రెడ్ టసెల్స్ జత చేస్తే బ్లౌజ్ బ్యాక్ ఒక ఆర్ట్‌లా మెరిసిపోతుంది. అదేవిధంగా సారీ పల్లు దారాలను కూడా డిజైన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రత్యేకంగా పండగలు, పెళ్లిళ్లు, హల్దీ లాంటి ఫంక్షన్లలో ఈ డోరీస్ ఎంత డిజైనర్‌గా ఉంటే అంత రిచ్‌గా కనిపిస్తాయి.అలాగే ఏ రంగు శారీ అయితే దానికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ లేదా టోన్స్ ఆన్స్ టోన్స్ దారాలు ఎంచుకుంటే బాగా సెట్ అవుతాయి. బ్లౌజ్ డోరీస్ అయితే కొంచెం మృదువుగా ఉండే వెల్వెట్ లేదా సిల్క్ తాళ్లు మంచివి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటే చర్మానికి గాట్లు పడే అవకాశం ఉంటుంది. పల్లు దారాలు మాత్రం కొంచెం బీడ్స్‌తో ఉంటే మంచిది, ఎందుకంటే అవే పల్లు స్లిప్ కాకుండా పట్టేసి ఉంచుతాయి. మొత్తానికి ఈ దారాలు అటూ ఇటూ ఊగుతూ అందరి మనసులు లాగేస్తాయి!
చిన్న ప్రపంచంలో పెద్ద వెలుగులు
క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్బౌల్లో మినియేచర్ డెకర్ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్ డెకర్ బౌల్‌ను టేబుల్, షెల్ఫ్, కార్నర్లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్ క్రిస్మస్ డెకర్ బౌల్స్, జార్స్ రెడీమేడ్‌గా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.గ్లాస్ బౌల్ డెకర్పారదర్శకంగా ఉండే క్రిస్మస్ మినియేచర్ బౌల్స్, జార్స్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆకాశమే హద్దు... నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్ ఆర్ట్‌కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్ ఫిగర్స్, పైన్కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్ఈడీ ఫెయిరీ లైట్స్‌తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు. స్నో గ్లోబ్ స్టయిల్తెల్లటి ఫేక్ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్ ఫిగర్‌తో మినిమలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు. క్రిస్మస్ విలేజ్ థీమ్చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్ పాత్, ఎల్ఈడీ స్ట్రీట్ ల్యాంప్స్‌తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు. ఎక్కడ ఉంచాలంటే.. సిద్ధం చేసుకున్న మినియేచర్ క్రిస్మస్ బౌల్‌ను లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్‌సైడ్ లాంప్ పక్కన, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్‌గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. - ఎన్నార్
అంతర్జాతీయం
కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత?
కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.వారికి మినహాయింపు 2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయులపై ప్రభావంఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్‌లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్‌బర్డ్స్
రష్యన్ జనరల్ హత్య.. ఉక్రెయిన్ ప్రమేయం?
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మృతిచెందారు. రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ‘ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్’ అధిపతిగా పనిచేస్తున్న సర్వరోవ్, తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. వాహనం కింద అమర్చిన పదార్థం కారణంగానే పేలుడు సంభవించి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు కమిటీ ధృవీకరించింది.ఈ హత్య వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక నిగూఢ సేవల (Special Services) ప్రమేయం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో, ఇది ఉక్రెయిన్ గూఢచారి సంస్థల పథకమేనని రష్యా అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు.కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఫ్లోరిడాలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు నిర్మాణాత్మక రీతిలో సాగుతున్నాయని క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఒడేసాలోని ఓడరేవు లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 27 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని వాహనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం
పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్‌బర్డ్స్
Kim Woo-bin, Shin Min-ah Wedding దక్షిణ కొరియాకు చెందిన నటి ,మోడల్ 41 ఏళ్ల షిన్ మిన్-ఆహ్ తన చిరకాల ప్రియుడు కిమ్ వూ-బిన్ను పెళ్లాడింది. డిసెంబర్ 20న సియోల్‌లోని జంగ్-గులోని ది షిల్లా హోటల్లోని రాయల్ హాల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గత పదేళ్లుగా సెలబ్రిటీ కపుల్‌గా పేరుతెచ్చుకున్న వీరిద్దరి వెడ్డింగ్‌కు దక్షిణ కొరియాలోని ఎంటర్టైన్మెంట్ రంగానికి పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరిలో BTS V , PD నాహ్ యుంగ్-సుక్, దర్శకుడు చోయ్ డాంగ్-హూన్, రచయిత కిమ్ యున్-సూక్, కో డూ-సిమ్, లీ బైయుంగ్-హున్, పార్క్ క్యుంగ్-లిమ్, ఉహ్మ్ జంగ్-హ్వా, గాంగ్ హ్యో-జిన్, కిమ్ యుయి-సుంగ్, యూన్ క్యుంగ్-హో, బే సియోంగ్-వూ, ఇమ్ జూ-హ్వాన్, కిమ్ టే-రి, ర్యు జున్-యెయోల్, అన్ బో-హ్యూన్, నామ్ జూ-హ్యూక్, బే జంగ్-నామ్ తదితరులు ఉన్నారు.షిన్ మిన్-ఆహ్ బ్రైడల్ గౌనుమిన్-ఆహ్ ఐకానిక్ లెబనీస్ ఫ్యాషన్ హౌస్ ఎల్లీ సాబ్ బ్రైడల్ గౌనును ఎంచుకుంది. స్ప్రింగ్ 2026 బ్రైడల్ కలెక్షన్లోని అందమైన తెల్లని గౌనులో అందంగా మెరిసింది. సొగసైన నెట్టెడ్ వీల్ భారీ గౌను ధర రూ. 25.6 లక్షలు. కిమ్ వూ-బిన్ రాల్ఫ్ లారెన్ పర్పుల్ లేబుల్ సూట్‌ను ధరించాడు. ప్రియుడికి కేన్సర్ వచ్చినపుడు మరింత ప్రేమతోషిన్ మిన్-ఆహ్, కిమ్ వూ-బిన్ మొదటిసారి 2015లో ఒక ప్రకటన వాణిజ్య ప్రకటనలో కలుసుకున్నారు. 2015 నుంచి డేటింగ్ ప్రారంభించారు. 2017లో కిమ్ వూ-బిన్‌కు నాసోఫారింజియల్ క్యాన్సర్ సోకినపుడు షిన్ అతనికి సపోర్ట్‌గా నిలిచింది.పరస్పరం గౌరవించుకుంటూ, కరియర్లో ఎంతో కీర్తిని, ప్రజాదరణ పొందారు. దాదాపు దశాబ్దం తర్వాత,వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరికి కోట్లాది మంది అభిమానులు శుభాకాంక్షలు అందించారు.
Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత భారీ అణు విద్యుత్ ప్లాంట్ ‘కాషివాజాకి కరివా’ త్వరలో తెరుచుకోనుంది. జపాన్‌లోని ఈ ప్లాంట్ గత 15 ఏళ్లుగా పలు కారణాలతో మూతపడివుంది. ఇప్పుడు జపాన్ ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధం అవుతోంది. అణు విపత్తు మిగిల్చిన భయానక జ్ఞాపకాలు వెంటాడుతున్నా, దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు జపాన్ ఈ ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన రంగంలోనే జపాన్‌కు అతిపెద్ద ‘టర్నింగ్ పాయింట్’గా మారనుంది.పెను విపత్తు తర్వాత..2011లో సంభవించిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంట్‌లో కూలింగ్ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా రేడియోధార్మికత వెలువడింది. ఈ నేపధ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మూతపడిన జపాన్ అణు ఇంధన రంగం మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. నీగాటా ప్రాంతంలోని ‘కాషివాజాకి-కరివా’ అణు విద్యుత్ ప్లాంట్ పునఃప్రారంభంపై తాజాగా జరిగిన ప్రిఫెక్చురల్ అసెంబ్లీ ఓటింగ్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సారధ్యంలో ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ హిడెయో హనాజుమి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇది కేవలం ఒక ప్లాంట్ ప్రారంభం మాత్రమే కాదు, జపాన్ ఇంధన విధానంలో వస్తున్న పెను మార్పుకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.విపత్తు జ్ఞాపకాలు.. నిరసనల హోరుఒకవైపు జపాన్ ప్రభుత్వం ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నీగాటా అసెంబ్లీ వెలుపల దాదాపు 300 మంది నిరసనకారులు.. ముఖ్యంగా వృద్ధులు 'నో న్యూక్స్' (అణుశక్తి వద్దు) అంటూ గొంతెత్తారు. ఫుకుషిమా ప్రమాదం కారణంగా నాడు తమ ఇళ్లను వదిలి వెళ్లిన బాధితులు ఇప్పటికీ ఆ భయానక జ్ఞాపకాలతో పోరాడుతున్నారు. 60 శాతానికి పైగా నివాసితులు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ నిర్వహణపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అణు ప్రమాదాల వల్ల కలిగే నష్టం మాకు ప్రత్యక్షంగా తెలుసు, ఇలాంటివి మరెక్కడా జరగకూడదు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్ధిక భారాన్ని మోసేందుకు..శిలాజ ఇంధనాల నుండి విముక్తి పొందేందుకే జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, ఇంధన భద్రత మొదలైనవి జపాన్‌కు అత్యంత భారంగా పరిణమించాయి. గత ఏడాది జపాన్ శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏకంగా 10.7 ట్రిలియన్ యెన్ల (రూ. 6,08,947 కోట్లు) భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. దేశ విద్యుత్ అవసరాలకు 60-70 శాతం మేరకు బొగ్గు, గ్యాస్ దిగుమతి చేసుకోవలసి రావడంతో ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సొంతంగా చౌకైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునుందుకు అణుశక్తిని పునరుద్ధరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి సనే తకైచి ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీదే బాధ్యతగతంలో ఫుకుషిమా ప్లాంట్‌ను నిర్వహించిన ‘టెప్కో’ సంస్థే ఈ కాషివాజాకి-కరివా అణు విద్యుత్ ప్లాంట్‌ను నడపనుంది. ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ‘టెప్కో’ రాబోయే 10 ఏళ్లలో నీగాటా ప్రాంతంలో 100 బిలియన్ యెన్ల పెట్టుబడి పెడతామని హామీనిచ్చింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, ఫుకుషిమా వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జనవరి 20 నాటికి ఈ ప్లాంట్‌లోని మొదటి రియాక్టర్‌ను యాక్టివ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్జపాన్ జనాభా కొంతమేరకు తగ్గుతున్నప్పటికీ, విద్యుత్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), భారీ డేటా సెంటర్ల స్థాపన వల్ల విద్యుత్ అవసరాలు మరింతగా పెరుగుతున్నాయి. 2040 నాటికి దేశ విద్యుత్ పరిశ్రమలో అణుశక్తి వాటాను 20 శాతానికి పెంచాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి 'డీకార్బనైజేషన్' లక్ష్యాలను చేరుకోవడానికి కూడా అణుశక్తి అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఈ ప్లాంట్ ప్రారంభించేందుకు జపాన్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్లాంట్లను నడపడం, రెండోది ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడం. ఈ దిశగా జపాన్ ముందుకు సాగుతోంది. ఇది కూడా చదవండి: విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు
జాతీయం
శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సద్య..!
అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు. (చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్..!)
అత్యవసర పరిస్థితి... ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (AI887) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం కుడి వైపు ఇంజిన్ (ఇంజిన్ నంబర్ 2)లో ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై, వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 100 మందికి పైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా విమాన ఇంజిన్ భాగాలు వేడెక్కకుండా, సజావుగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంతో కీలకం. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోవడం అనేది విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. దీనివల్ల ఇంజిన్ మంటలు అంటుకోవడం లేదా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, బోయింగ్ 777-337 ER విమాన సిబ్బంది సరైన సమయంలో స్పందించి ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.గత కొద్ది రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం (డిసెంబర్ 18న) గన్నవరం విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా ఇలాంటి ఇంజిన్ సమస్యే తలెత్తింది. ఆ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందే ఈ లోపాన్ని గుర్తించి,విమానాన్ని రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు విమానాల నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, పర్యాటక సీజన్ కావడంతో విమానయాన సంస్థలు తమ విమానాల కండిషన్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో నిలిచిపోయిన విమానానికి సమగ్ర సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి క్లియరెన్స్ వచ్చాకే విమానాన్ని తిరిగి సర్వీసులోకి తెస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్‌పై మునీర్ సంచలన వ్యాఖ్యలు
విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు
తమిళనాడు రాజకీయాల్లో ఆ పార్టీ పేరు మార్మోగుతోంది.. అదే ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే). దశాబ్దాలుగా డీఎంకే (డీఎంకే)కి కంచుకోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని టీవీకే అధినేత, నటుడు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రచిస్తున్న ‘మైనారిటీ’ వ్యూహం, స్టాలిన్ సర్కార్‌ను కలవరపెడుతోంది. తమిళనాడులో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు డీఎంకే వెన్నంటే ఉంటూ, ఆ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం రావడంతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే ఆందోళన డీఎంకే క్యాంపులో మొదలైంది.మారిన సమీకరణలుతమిళ సినీ రంగంలో అగ్రనటునిగా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. క్రైస్తవ మత నేపథ్యం ఉండటం విజయ్‌కు ఒక అదనపు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయకంగా డీఎంకే వెన్నంటి ఉండే క్రైస్తవ, ముస్లిం ఓటర్లలో ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, అధికార పార్టీలో కలవరం మొదలైంది. యువతలో ఉన్న క్రేజ్‌కు తోడు మైనారిటీల మద్దతు కూడా తోడైతే విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చెన్నై నుంచి తిరునల్వేలికి..డీఎంకే పార్టీ తన వార్షిక క్రిస్మస్ వేడుకలను సాధారణంగా రాజధాని చెన్నైలో వైభవంగా నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా ఆ వేదికను దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలికి మార్చింది. ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. దక్షిణ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న డీఎంకే, ముందస్తుగా మైనారిటీలను ఆకట్టుకునేందుకు నెల్లైను వేదికగా ఎంచుకుని తన బలాన్ని ప్రదర్శించింది.నేతలతో స్టాలిన్ ఆత్మీయ భేటీతిరునల్వేలిలో జరిగిన 'క్రిస్తువ నల్లెన్న ఇయక్కం' సమ్మేళనం కేవలం పండుగ వేడుకలా కాకుండా ఒక రాజకీయ సభలా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల ఆర్చ్ బిషప్‌లు, సీనియర్ సువార్తికులు పాల్గొని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. చర్చి పెద్దల సమక్షంలో స్టాలిన్ ప్రార్థనలు చేయడం ద్వారా మైనారిటీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేశారు.ముఖ్యమంత్రి వరాల జల్లుసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ క్రైస్తవ వర్గాల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయక విద్యాసంస్థల నియామక ప్రక్రియలో విశ్వవిద్యాలయ నామినీ పాత్రను తొలగించడం ద్వారా ఆయా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. పురాతన చర్చిల పునరుద్ధరణకు గ్రాంట్లు పెంపు, తీర్థయాత్రలకు సబ్సిడీలు, స్మశానవాటికలకు భూమి కేటాయింపు వంటి వరాలను ప్రకటించడం ద్వారా మైనారిటీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.లోలోపల అసంతృప్తి సెగలుపైన పటారం లోన లోటారం అన్నట్లుగా, డీఎంకే ప్రభుత్వపై మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకట్టుకుని ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని చర్చి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యం పట్ల కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తే, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.బీజేపీపై విమర్శలుమరోవైపు బీజేపీని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఒకే మతం, ఒకే భాష పేరుతో వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకేను కూడా మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. మైనారిటీల రక్షణ కేవలం డీఎంకేతోనే సాధ్యమనే భరోసా ఇచ్చారు.ప్రతిపక్షాల ఎదురుదాడిస్టాలిన్ విమర్శలపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సమాజంలో విభజన తెస్తున్నారని, మతాల మధ్య విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇదంతా చూస్తుంటే.. మైనారిటీ ఓట్ల కోసం జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.విజయ్ క్రిస్మస్ ప్లాన్ఈ రాజకీయ పోరులో విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. త్వరలో విజయ్ కూడా క్రిస్మస్ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నేతగా ఆయన ఇచ్చే సందేశం మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే, అది 2026లో డీఎంకే విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ‘మైనారిటీ ఓటు’ గెలుపు గుర్రాన్ని నిర్ణయించే కీలక అస్త్రంగా మారింది.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్
చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ
కలబురగి (కర్ణాటక): అస్సాంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే ఆదివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు పునాదులు వేస్తున్నప్పుడు, అస్సాంను తూర్పు పాకిస్థాన్‌లో కలిపేందుకు కుట్ర పన్నారని, ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయిందని మోదీ ఆరోపించారు. కేవలం గోపీనాథ్ బార్డోలోయ్ మాత్రమే సొంత పార్టీని ఎదిరించి అస్సాం అస్తిత్వాన్ని కాపాడారని ప్రధాని స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. దీనిపై ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి రక్షణ కల్పించడంలో విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మీరు విఫలమైన ప్రతిసారీ విపక్షాలపై బురద చల్లడం తగదు. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’.. అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేయడంపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాడి వంటిదన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, ధనవంతులకు బానిసలుగా మార్చడానికే మోదీ ఈ చట్టాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేపడతామని ఖర్గే హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన మూకదాడి ఘటనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం వెంటనే ఆ దేశంతో మాట్లాడి హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి’.. అని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్ఆర్ఐ
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ)
శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ
జార్జియాలోని కమ్మింగ్‌లోని వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్, శంకర నేత్రాలయ USA సంవత్సరాంతపు మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడంతో సంస్కృతి, కరుణ యొక్క శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ భారతదేశంలో కంటి సంరక్షణను గరిష్టంగా విస్తరించడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవ విస్తరణకు మద్దతు ఇచ్చే దాతృత్వ వేడుక. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో స కళ,సేవ శక్తిని ప్రదర్శించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఇలా నొక్కిచెప్పారు. “వైద్య మిషన్‌కు మించి, MESU సానుభూతి ఉద్యమంగా నిలుస్తుంది. ప్రయాణించిన ప్రతి మైలు దృష్టి, ఆశ పునరుద్ధరించబడుతుందనే హామీని అందిస్తుంది. ”అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరై SNUSA బృందం, దాతలు, స్వచ్ఛంద సేవకులను ప్రశంసించారు. "నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో SNUSA నా అంచనాలను మించిపోయింది. బాల రెడ్డి ఇందూర్తి నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డాక్టర్ జగదీష్ శేత్, డాక్టర్ కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల బోర్డు సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. సన్మాన కార్యక్రమంలో, గౌరవ భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబును శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుగా అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.ఆత్మ వెలుగుతో కలిసిన వేళ: ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి దాతృత్వం, నాయకత్వం మా లక్ష్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. 2025 వ్యవస్థాపకుడు సౌత్‌వెస్ట్ అవార్డు ఫైనలిస్ట్ ట్విస్టెడ్ ఎక్స్ గ్లోబల్ బ్రాండ్స్ వెనుక చోదక శక్తిలా ఆవిష్కరణ, స్థిరత్వం, కరుణను కలిగి ఉన్నారు. సత్కార సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు—అది దానిని రూపొందిస్తోంది. ఆవిష్కరణ, కరుణ కలిసి పురోగమించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం నాకు గర్వకారణం. ” ఘంటసాల బయోపిక్ “ఘంటసాల ది గ్రేట్” సృష్టికర్త దర్శకుడు సిహెచ్. రామారావు గారు, ఘంటసాలకు అసాధారణ నివాళి అర్పించినందుకు వేదికపై సత్కరించారు. మరుసటి రోజు, ఈ చిత్రాన్ని అట్లాంటాలోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో, లార్డ్ బాలాజీ గర్భగుడి క్రింద ప్రదర్శించారు.తపన స్వరాన్ని కలిసిన చోటు: ఈ సాయంత్రం కార్యక్రమం టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళిల హృదయపూర్వక సంగీత ఆవాహనతో ప్రారంభమైంది. వారి భక్తి, శాస్త్రీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. దీని తరువాత నటరాజ నాట్యాంజలి కూచిపూడి నృత్య అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి ప్రముఖ అట్లాంటా నృత్య, సంగీత అకాడమీల నుంచి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు జరిగాయి. గార్డియన్స్ ఆఫ్ సైట్: $1.625 మిలియన్లను సేకరించడం ద్వారా మన అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ల స్ఫూర్తిని గుర్తించారు. మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల నిరంతర మద్దతు ద్వారా దాదాపు $1.625 మిలియన్ల కీలకమైన నిధులను సమీకరించింది. శ్రేయోభిలాషులు, డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాష్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం,MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, డాక్టర్. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా మరియు డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్,దివంగత డాక్టర్ ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్ -లావణ్య, ఆది మొర్రెడ్డి-రేఖ రెడ్డి, డాక్టర్ మంజుల మంగిపూడి, డాక్టర్ రూపేష్ రెడ్డి-మాధవి, వెంకట్ కన్నన్, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు -రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ బిందు, నారాయణ రేకపల్లి -శైలజ,డాక్టర్ ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డాక్టర్ సుజాత &సూరి గున్నాల, డాక్టర్ శేషకుమారి మూర్తి -డాక్టర్ శ్రీనివాస మూర్తి, శివాని నాగ్‌పాల్, డా. సందీప్ శాండిల్య, డాక్టర్ నీతా సుక్తాంకర్ -విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ-శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డాక్టర్ రఘువీర్ రెడ్డి, మరియు పురప్రముఖులు రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన $1.625 మిలియన్ల దాతృత్వం సుమారు 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు ఉపయోగపడింది. సేకరించిన నిధుల ద్వారా శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు (MESUలు) మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వేలాది మందికి దృష్టిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దాతలు సేవలు అందని ప్రాంతాలలో వందలాది ఉచిత శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ ఆశ, కరుణ, అవకాశాన్ని తెస్తాడు, గ్రామాలను దృష్టి ఆశతో ప్రకాశింపజేస్తాడు. శంకర నేత్రాలయ USA తరపున, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సృజనాత్మకత కరుణను స్వీకరించే చోట: సాయంత్రం శంకర నేత్రాలయ USA మిషన్‌కు మద్దతునిస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాణం పోసిన నృత్య ఉపాధ్యాయులు, గాయకులు, ప్రదర్శనకారులను సత్కరించారు. తెరవెనుక, SNUSA అట్లాంటా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డాక్టర్ మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలం, కమిటీ సమన్వయకర్తలు నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా. కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, చాప్టర్ లీడ్స్ వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డాక్టర్ జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు, కార్యక్రమ వ్యాఖ్యాత వసంత చివుకుల గార్లకు కృతజ్ఞతలు. అమెరికా వివిధ నగరాల నుంచి విచ్చేసిన SNUSA అతిథులు శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, నారాయణరెడ్డి ఇందుర్తి, డా. శ్వేతా త్రిపాఠి, చంద్ర మౌళి సరస్వతి, శ్రీని గుప్తా, శశాంక్ రెడ్డి ఆరమడక, బుచ్చిరెడ్డి గోలి, తిరుమల్ మునుకుంట్ల, జగదీశ్ జొన్నాడ, వెంకట్రామిరెడ్డి మద్దూరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది సాధ్యం చేసిన హృదయాలకు, చేతులకు నివాళిలాజిస్టిక్స్ నిర్వహణకు కోశాధికారి మూర్తి రేకపల్లికి; వేదిక, అలంకరణలు, ప్రదర్శనకారులను సమన్వయం చేసినందుకు సాంస్కృతిక చైర్ నీలిమా గడ్డమణుగుకు; భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలంకు; హోటల్, రవాణా ఏర్పాట్లను నిర్వహించినందుకు ట్రస్టీ మెహర్ లంకకు ప్రత్యేక ధన్యవాదాలు. టీవీ వీడియోలను రూపొందించిన EVP శ్యామ్ అప్పాలి, ప్రెస్ నోట్స్ సిద్ధం చేసిన డా. రెడ్డి ఊరిమిండి, సోషల్ మీడియా ప్రమోషన్‌ను నిర్వహించిన వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి గార్లకు కృతజ్ఞతలు. అతిథులు ఆచిస్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆస్వాదించారు. ఈవెంట్ ఫ్లైయర్లను రూపొందించినందుకు చెన్నై బృందం - త్యాగరాజన్, దీన్ దయాళన్ అండ్ సురేష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. (చదవండి: డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం)
క్రైమ్
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది.
అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..
బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు. అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు.
దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.
విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ హోటల్లో నిందితులు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. అయితే కారు పార్కు చేసి రావాలని నిందితుడికే తాళాలు అప్పగించడంతో అతడు పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని మధురానగర్, సింగ్‌నగర్‌కు చెందిన నిందితులిద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు ఎండీఎంఏ అలవాటైంది. అలా తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడ తెచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20న అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి రూ.36వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు.వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నిందితుల్లో ఒకడి స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన మరో యువకుడు తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. అయితే.. అప్పటికే బెంగళూరులో ఉన్న నిందితుల్లో ఒకడు పోలీసుల నిఘా ఉందని చెప్పాడు. తర్వాత బతిమిలాడి ఒప్పించి డబ్బులు పంపించాడు. బెంగళూరు నుంచి రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడవారు కొంత డ్రగ్స్ తీసుకున్నారు. అయితే.. కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురూ విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి, వీరిని పట్టుకుని 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎండీఎంఏ అమ్మిన ఇద్దరి కోసం మరో బృందం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం గమనార్హం. అయినా కూడా మాదకద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోలు
పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ
దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు
వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే
థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్
రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు
దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు
టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గురజాలలో ఉద్రిక్తత

