breaking news
Tollywood
-
జీ తెలుగులో కొత్త సీరియల్ 'లక్ష్మీ రావే మా ఇంటికి'
జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక 'లక్ష్మీ రావే మా ఇంటికి'. భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో దీన్ని రూపొందించారు. డిసెంబర్ 22 నుంచి ఇది ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10గంటలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్లో హర్ష్ నాగ్‌పాల్, దర్శిని గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మీర్ సయ్యద్, ఐశ్వర్య, ఇందు ఆనంద్, వెంకట్ గౌడ్, శ్రీవాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాలే ఈ సీరియల్ స్టోరీ. అనాథగా పెరిగిన తెలివిగల అమ్మాయి శ్రీలక్ష్మి(దర్శిని గౌడ), ఊహించని విధంగా ధనవంతుడైన మధుసూదన్(హర్ష్ నాగ్‌పాల్) జీవితంలో అడుగుపెడుతుంది. అనేక సమస్యలతో సతమతమయ్యే లక్ష్మి ఆత్మవిశ్వాసంతో మధుసూదన్ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో లక్ష్మి ఎదుర్కొనే ఇబ్బందులేంటి? లక్ష్మి ఎలా మధుసూదన్ మనసు గెలుచుకుంది అనేదే స్టోరీ. -
Jinn Movie: ‘నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’
అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాశ్ తుమినాడ్, రవి భట్, సంగీత లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ‘జిన్ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్ చేయాలి, నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘థియేటర్స్‌లో కరెక్ట్‌గా భయపెడితే ఆడియన్స్ హారర్ చిత్రాలను ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘జిన్’ ట్రైలర్ నచ్చింది’’ అన్నారుసోహెల్ మాట్లాడుతూ .. ‘తెలుగు ఆడియెన్స్ అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ .. ‘‘మా ‘జిన్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని చూడండి. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తామ’ని అన్నారు. -
‘ఎర్రచీర’కు ఏ సర్టిఫికేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు.చిత్ర దర్శకులు సుమన్ బాబు మాట్లాడుతూ "కొన్ని సినిమాల్లోని సోల్ మనకు అనుభూతి చెందాలంటే, ఖచ్చితంగా వాటిని థియేటర్లోనే చూడాలి. మా 'ఎర్ర చీర' సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఉన్న సౌండింగ్ మరియు విజువలైజేషన్ అనుభూతి మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అన్నారు. -
డేంజర్ జోన్లో 'రామ్ పోతినేని' కెరీర్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సరైన విజయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ (2019) విజయం తర్వాత తనకు సరైన హిట్ దక్కలేదు. రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఏదీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. రీసెంట్గా విడుదలైన ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, పట్టుమని రెండు వారాలైన గట్టిగా థియేటర్స్‌లో రన్ కాలేకపోయింది. ప్రస్తుతం రామ్ 40ఏళ్లకు దగ్గర్లో ఉన్నాడు. కొద్దిరోజులుగా తన పెళ్లి వార్తలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్ కూడా పెద్దగా చెప్పుకునే విధంగా లేదు. ఇలాంటి సమయంలో ఆయన నిర్ణయం ఎటూ అనేది తేల్చుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి. స్కంద వంటి మాస్ సినిమాను కూడా జనం చూడలేదు. డబుల్ ఇస్మార్ట్ అని చెప్పినా సరే థియేటర్ వైపు ప్రేక్షకులు చూడలేదు. సరే అని ఆంధ్రా కింగ్ తాలుకా అంటూ కొత్త ప్రయత్నం చేస్తే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, ప్రేక్షకులు లేరు. దీనికి కారణం తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ మూవీ కోసం మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. చివరకు నష్టాలను చూసింది. ఇప్పుడు రామ్ ఎలాంటి సినిమా తీస్తే జనాలు చూస్తారనే క్లారిటీ కూడా లేదు. కథ పరంగా ఎలాంటి జోనర్ టచ్ చేసినా సరే.. ఫెయిల్యూర్ వెంటాడుతూనే ఉంది. ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ లేవు. వరుస పరాజయాల కారణంగా తన సినిమాలకు థియేటర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక హీరోకు కనీసం రూ. 20 కోట్లు కలెక్షన్స్ కూడా రాకుంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓటీటీ మార్కెట్ సంగతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వార్2తో ఎన్టీఆర్, గేమ్ ఛేంజర్ చిత్రంతో రామ్ చరణ్ కూడా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కానీ, వారికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో త్వరగానే బౌన్స్‌బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, రామ్ పోతినేనికి బలమైన కథతో పాటు సరైన దర్శకుడు దొరికితేనే నిలిదొక్కుకునే అవకాశం ఉంది. -
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
పాన్ ఇండియా సినిమాకే కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్‌లో మన సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదు.మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్ చెక్కుచెదరలేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం చిరంజీవి ఫ్లాప్ అవ్వాలి. గాడ్ ఫాదర్ చిత్రంతో పాన్ ఇండియాలో మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో నటించినా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దరుణంగా బోల్తా పడింది. దీంతో చిరు పాన్ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్ అయితే చాలు..పాన్ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక బాలయ్య కూడా పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. అఖండ 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్లో అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.ఇక వెంకటేశ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో రాణించాలని ‘సైంధవ్’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలపైనే ఫోకస్ పెట్టాడు.మనో సీనియర్ హీరో నాగార్జున కూడా అంతే. పాన్ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్ సీనియర్లంతా పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్ కొడతారో చూడాలి. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరీ బ్యూటీ!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమా గుర్తుందా? చూసిన వాళ్లు అయితే ఆ సినిమాను అంత ఈజీగా మార్చిపోరులేండి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఓ చిన్నారు గుర్తుంది కదా? మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి..మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్‌తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారు ఇప్పుడు హీరోయిన్గా కాదు కాదు.. ‘పాన్ ఇండియా హీరోయిన్’ మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్!రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’లో హీరోయిన్గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.ఏడాదిన్నరకే నటనబాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్‌లో నటించి మెప్పించింది. తొలి యాడ్‌కి మంచి స్పందన రావడంతో సారాకు వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్నవయసులోనే దాదాపు 100పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటంచింది. . మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.ఆరేళ్లకే వెండితెరపైకోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్.. తన మూవీ ‘దైవ తిరుమగల్’లో చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ టైటిల్‌తో రిలీజైంది. విక్రమ్ కూతురుగా నటించిన సారా.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్‌గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది.అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ..సారాకి మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటుంది. ‘డంకీ’ సినిమాకిగాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్మాప్ నేర్చుకుంది. కరాటేతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా’ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. -
హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్
తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్‌ను శాసించే రేంజ్‌కు చేరుకున్నాయి. పుష్ప2,కల్కి, కార్తికేయ2, హనుమాన్ వంటి సినిమాలు అక్కడ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్గా మిరాయ్ కూడా హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణాది కంటే హిందీ బెల్ట్‌లోనే మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలు బాగా రన్ అవుతాయి. అందుకే మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ చిత్రం కూడా కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ, అఖండ2 మాత్రం హిందీ మార్కెట్లో టోటల్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా ఇంతే.. అసలు ఆ సినిమా హిందీలో విడుదలైన విషయం కూడా జనాలకు తెలియదు.అఖండ్ హిట్.. సీక్వెల్ ఫట్అఖండ పార్ట్-1 హాట్స్టార్లోకి స్ట్రీమింగ్కు వచ్చాక హిందీలో భారీ హిట్ అయింది. ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు కూడా షేర్ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌కు హిందీలో కూడా అదే ఆదరణ లభిస్తుందని మేకర్స్ విశ్వసించారు. ఈ నమ్మకంతోనే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా నార్త్ ప్రేక్షకులపై ఆశలు పెట్టుకుని అఖండ 2ని రూపొందించారు. ఈ క్రమంలోనే శివుని తాండవం, హనుమంతుడి స్వరూపంతో పాటు భక్తి వంటి అంశాలను చేర్చడం.. ఆపై సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలను కథ డిమాండ్‌కు మించి చేర్చారు. కథలో బలం ఉండి దానికి ఈ అంశాలు జోడిస్తే అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ, ప్రస్తుతం హిందీలో అఖండ2 పేలవమైన కలెక్షన్స్‌తో నిరాశపరిచింది.ప్రెస్ మీట్ ఖర్చులు కూడా రాలేదుమొదటిసారిగా, నందమూరి బాలకృష్ణ కూడా హిందీ వెర్షన్‌ను చురుకుగా ప్రమోట్ చేశారు, కొన్ని హిందీ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉత్తర భారత మార్కెట్‌తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి చాలా కష్టపడ్డారు. అయితే, వారి వ్యూహం ఫలించలేదు. ఆపై అఖండ 2 తెలుగులో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ఉత్తర అమెరికా మార్కెట్లో నిరాశపరిచే విధంగా మొదటిరోజు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో హిందీ వెర్షన్ నుండి అంచనాలు త్వరగా తగ్గిపోయాయి. హిందీ-డబ్బింగ్ విడుదల పూర్తిగా వాష్అవుట్గా నిరూపించబడింది. మొదటి మూడు రోజుల్లో, హిందీ వెర్షన్ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసిందని నివేదించబడింది. కనీసం ముంబై ప్రెస్ మీట్ ఖర్చులను కూడా అఖండ రాబట్టలేదని కథనాలు వచ్చాయి. తమిళం, కన్నడ వంటి ఇతర భాషలలో ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కొంతవరకు ఊహించినప్పటికీ, హిందీలో దారుణమైన స్పందన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ పెద్ద షాక్ ఇచ్చింది. -
లిఫ్ట్ ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు దర్శకుడు కీర్తన్ కుమారుడు సోనార్ష్ మరణించారు. పొరపాటున లిఫ్ట్‌లో ఇరుక్కోవడం వల్ల చిన్నారి సోనార్ష్ ప్రాణాలు కోల్పోయాడు. పలువురు సినీ ప్రముఖులు చిన్నారికి నివాళులు అర్పిస్తూ.. కీర్తన్, సమృద్ధి దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కేజీఎఫ్ వంటి హిట్ సినిమాకు ప్రశాంత్ నీల్ వద్ద సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కీర్తన్ పనిచేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హారర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Samrudhi Patel Nadagouda (@samrudhikirtan) -
రూ. 100 కోట్ల క్లబ్ చేరువలో 'మమ్ముట్టి' సినిమా
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరో భారీ హిట్ అందుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన హీరోగానే కాకుండా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతోనూ మెప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘కలాంకావల్’(Kalamkaval)లో తాను విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 5న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరనుంది.ఈ ఏడాది ప్రారంభంలో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్ సినిమాతో మెప్పించిన మమ్ముట్టి(Mammootty) ఇప్పుడు కలాంకావల్(Kalamkaval) అనే మూవీతో భారీ విజయం అందుకున్నారు. ఎప్పుడూ కూడా వైవిధ్యమైన పాత్రలతో, కథలతో మమ్ముట్టి ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. ఈ చిత్రంలో కూడా ఆయన మానసిక రోగి పాత్రను పోషించారు. దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విమర్శకులు, ప్రేక్షకుల నుండి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. రెండు వారాలకు గాను ‘కలాంకావల్’ చిత్రం కేవలం మలయాళంలోనే రూ. 75 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చాలా థియేటర్స్‌లో మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. దీంతో మరో వారంలోపు రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కలాంకావల్’లో వినాయకన్, మీరా జాస్మిన్, జిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్కు రానుంది. -
ఊరి నేపథ్యం ‘దండోరా’.. ప్రేక్షకుల ఊహకు అందదు : డైరెక్టర్
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మురళీకాంత్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనుకుని, నాకు ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ‘దండోరా’ సినిమా కథ రాసుకున్నాను. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టే వరకు జరిగే కథే ‘దండోరా’. ఈ సినిమా కథ ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఓ వ్యక్తిని ఆ ఊర్లో ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? అన్నదే కథ. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. బిందు మాధవి, మనిక, రాధ్య, మౌనిక... ఇలా వీరు చేసిన పాత్రలు, తీసుకునే నిర్ణయాలే టర్నింగ్ పాయింట్స్‌గా ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. ముందుగా ఈ మూవీ కోసం వేరే టైటిల్ అనుకున్నాను. ఇది నాకు మూడేళ్ల జర్నీ. ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్‌ను అందరూ చూసి డల్‌గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్‌తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండాలని నిర్మాత అన్నారు. అలాంటి టైంలో ఓ ఫ్రెండ్ ‘దండోరా’ అని సలహా ఇచ్చారు. అలా ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది’ అన్నారు -
పతంగ్ సినిమాకి హిట్ కళ కనిపిస్తోంది
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఇదొక కొత్త రకమైన సినిమా. ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్ ఫీలయ్యాను. యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. వంశీ పూజిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పేరు విస్కి. పక్కా హైదరాబాదీగా మాస్ ΄ాత్ర చేశాను. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యేలా ఈ ‘పతంగ్’ చిత్రం ఉంటుంది. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా పెద్ద సినిమా ఇది. పతంగుల పోటీ సన్నివేశాలను చాలా కష్టపడి తీశాం. నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన మా అమ్మానాన్నకు హిట్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్‌ను ఇస్తుంది’’ అని చె΄్పారు సహ నిర్మాత రమ్య వేములపాటి. ఈ కార్యక్రమంలో రాహుల్ మోపిదేవి, ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, సంపత్ మక తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా దుమ్మురేపారు.థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది. అనంతరం అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.థామా స్టోరీ ఏంటి..?'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఖైదీ– 2కి శ్రీకారం ఎప్పుడో..?
తమిళసినిమా: కొన్ని చిత్రాలు ఎప్పుడు తెరకెక్కుతాయో తెలియదు. అదే విధంగా కొన్ని చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇటీవల నటుడు కార్తీ నటించిన, నటించనున్న చిత్రాల పరిస్ధితి ఇలానే ఉంది. కార్తీ హీరోగా లోకేశ్‌కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి భారీ చిత్రం ఖైదీ. ఈ చిత్రంలో ముందు వేరే చిన్న నటుడు నటించాల్సి ఉంది. అయితే నిర్మాతలు అందులో నటుడు కార్తీ నటిస్తే చిత్రం పెద్దది అవుతుందని, ఆయన్ని నటింపజేశారు. ఆ చిత్రం సంచనలన విజయాన్ని సాధించింది. దీంతో అప్పుడే ఖైదీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్, నటుడు కార్తీ ఇతర చిత్రాలతో బిజీ అవడంతో ఖైదీ– 2 ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. అయితే త్వరలోనే మొదలవుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిపై రకరకాల ట్రోలింగ్స్ వైరల్ అయ్యాయి. అదే విధంగా ఆయన కూడా హీరోగా అవతారమెత్తారు. ఆ చిత్రం తరుదాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఖైదీ– 2 చిత్రం గురించి నటుడు కార్తీ ఓ భేటీలో పేర్కొంటూ ఆ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఈయన నటించిన తాజా చిత్రం వా వాద్ధియార్ ఈ నెల12న విడుదల కావలసి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదల వాయిదా పడింది. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. -
యాక్టర్‌ని చాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది: బాబీ సింహా
బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ ఇచ్చారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు.ఈ సందర్భంగా బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘యాక్టర్‌ని చాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. ఈ చిత్రంలోని తాత పాత్రలో భరణిగారు నటిస్తున్నారని తెలిసి, హ్యాపీ ఫీలయ్యాను. యువ ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్’’ అని చెప్పారు. ‘‘దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను’’ అన్నారు మోహర్. ‘‘నా స్నేహితుడు మెహర్ చెప్పిన ఈ కథ వినగానే నాకు బాబీ సింహాగారే గుర్తొచ్చారు. కథ నచ్చి, ఈ సినిమా చేస్తానని బాబీగారు చెప్పడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని తెలిపారు యువకృష్ణ. ‘‘బాబీ సింహాకి ఇది చాలెంజింగ్ స్క్రిప్ట్’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ సినిమాకు సంగీతం: సిద్ధార్థ సదాశివుని. -
గుమ్మడికాయ కొట్టారు
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య 46’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్ జరిపారు.ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మరో కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
మెగా కోడలికి ప్రతిష్టాత్మక అవార్డ్.. సోషల్ మీడియాలో పోస్ట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి అవార్డ్ వరించింది. మోస్ట్ పవర్‌పుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఉపాసన. అయితే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల అవార్డ్ తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. Receiving the Most Powerful Women in Business Award by @business_today is truly humbling 🧿 @NSEIndia Sorry, I couldn’t make it in person, unable to travel due to my pregnancy. 🤰🏼 🥰At @_ur_life_ , our focus has always been on creating positive change mentally & physically.… pic.twitter.com/ZrInWT93QG— Upasana Konidela (@upasanakonidela) December 15, 2025 -
సతీమణి బర్త్ డే.. మెగా హీరో స్పెషల్ విషెస్!
మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు. ఇవీ చూసిన అభిమానులు లావణ్య త్రిపాఠికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బర్త్ డే విషెస్ తెలిపింది. కాగా.. నాగబాబు కుమారుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. కాగా.. మట్కా మూవీ తర్వాత.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
అడివి శేష్ డకాయిట్.. ఒకే రోజు రెండు భాషల్లో రిలీజ్..!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్'. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్‌ను పంచుకుంది.ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్లో హిందీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగే ఈవెంట్లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 2 LANGUAGES. 2 TEASERS.2 CITIES.Gear up for the #DacoitTeaser on December 18th ❤🔥Grand launch event at Gaiety Galaxy, Mumbai from 11 AM onwards on Dec 18th 🤩Media Meet & Greet event at AAA Cinemas, Hyderabad from 6.30 PM onwards on Dec 18th 💥#DACOIT GRAND RELEASE… pic.twitter.com/KuHsIamvIs— Annapurna Studios (@AnnapurnaStdios) December 15, 2025 -
పాన్ ఇండియా బ్యాచిలర్స్ వీళ్లే.. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరీ
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు యువత.. అదంటేనే భయపడుతున్నారు. సరే సరైన జాబ్ లేదు, పోషించేందుకు డబ్బులు లేవు కదా వివాహానికి నో చెబుతున్నారని అనుకోవచ్చు. బోలెడంత ఫేమ్, కోట్లాది ఆస్తి ఉన్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా కొందరు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయారు. అలాంటి కొందరి గురించి ఈ స్టోరీ.ఇండియన్ స్టార్స్‌లో బ్యాచిలర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్లో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో రిలేషన్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి గానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా ఇతడికున్న అనారోగ్య సమస్యలు కావొచ్చు. లేదంటే తన స్నేహితుల వైవాహిక జీవితంలో సమస్యల ప్రభావం కావొచ్చు సల్మాన్.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇతడికి 59 ఏళ్లు. ఇకపై చేసుకునే అవకాశమే లేదు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరస సినిమాలు చేస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తాం అని చాలాసార్లు చెప్పారు. కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ అన్నదే దొరకట్లేదు. గతంలో హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి గానీ తామిద్దరం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. అయితే ఇటు ప్రభాసే కాదు అటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ఇకపై కూడా వీళ్లిద్దరికీ(వేర్వేరుగా) జరుగుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో లేదు.రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ 'ధురంధర్'లో విలన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అక్షయ్ ఖన్నా కూడా బ్యాచిలరే. ప్రస్తుతం ఇతడి వయసు 50 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి చాలానే కారణాలున్నాయి. గతంలో కరిష్మా కపూర్‌తో ఇతడికి వివాహం సెట్ అయి, రద్దయిందని.. అప్పటినుంచి అక్షయ్ ఖన్నా ఒంటరిగానే ఉండిపోయాడనేది టాక్. అలానే మరో వ్యక్తి బాధ్యత తీసుకోవడం తనకు సూట్ కాని పనికాని కూడా అక్షయ్ చెప్పాడు. చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ లిస్టులో తర్వాతి నటి టబు. ఈమె వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. మరి పెళ్లి చేసుకుంటే నటిగా కెరీర్ ముగిసిపోతుందని భయపడిందో ఏమో గానీ అస్సలు ఆ వైపు చూడను కూడా చూడలేదు. ఇప్పటికీ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణాన్ని కూడా గతంలో చెప్పింది. జీవితంలో కలిసిన కొందరు పురుషులు.. చాలా నిరాశపరిచారని చెప్పింది. అలానే తను దత్తత తీసుకున్న పిల్లల (రెనీ, అలీసా) ప్రాధాన్యత.. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం లాంటివి కూడా కారణమని చెప్పుకొచ్చారు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లినప్పటికీ దేవుడే తనని రక్షించాడనేది ఈమె నమ్మకం.తమిళ హీరో శింబు జీవితంలో చాలా ప్రేమకథలే ఉన్నాయి. నయనతార, నిధి అగర్వాల్ లాంటి పలువురు హీరోయిన్లతో ఇతడు డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. పెళ్లి కూడా జరుగుతుందని మాట్లాడుకున్నారు. తీరా చూస్తే 42 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉండిపోయాడు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి జీవితంలోనూ విషాదం ఉంది. హీరోయిన్ రష్మికతో చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ ఇది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా పోయింది. (ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?) -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. టైటిల్ రివీల్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అనే టైటిల్ ఖరారు చేశారు. మొత్తానికి హీరో పేరుతోనే మూవీ టైటిల్ పెట్టడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
అనసూయ క్రేజీ లుక్.. మీనాక్షి కుందనపు బొమ్మలా!
కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న మీనాక్షినిషా కళ్లతో చూస్తూ మాయ చేస్తున్న అనసూయజిమ్ వేర్లో రచ్చ లేపుతున్న నభా నటేశ్పింక్ కలర్ డ్రస్‌లో అందంగా దివ్యభారతిభర్తతో ప్రియాంక చోప్రా క్యూట్ జ్ఞాపకాలు View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
విశ్వక్-అనుదీప్ సినిమా.. చెప్పిన టైం కంటే ముందే రిలీజ్
గత కొన్ని సినిమాలతో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న విశ్వక్ సేన్.. ఈసారి కామెడీ రూట్లోకి వచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే టీజర్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. గత నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో మూవీ విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రెండు నెలల ముందుకు తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ముందు చెప్పినట్లు ఏప్రిల్‌లో కాకుండా ఫిబ్రవరి 13న 'ఫంకీ' విడుదలవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే షూటింగ్‌తో పాటు మిగిలిన పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్‌కి చాలా కీలకం.టీజర్ బట్టి చూస్తే ఇదో సినిమా డైరెక్టర్ కథ. దర్శకుడిగా విశ్వక్ కనిపిస్తుండగా.. హీరోయిన్ పాత్రలో నిర్మాత కూతురిగా కాయదు లోహర్ చేస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో రెగ్యులర్ ఫన్ ఉండబోతుందనే అనిపిస్తుంది. మరి ఈసారి విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Your ticket to a crazy, fun-filled experience with #FUNKY arriving on 13th FEB! 🕺Fun for all. Madness for everyone. 100% Entertainment guaranteed. 😎In cinemas #FunkyFrom13thFeb 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/kGHEGd2QkC— Sithara Entertainments (@SitharaEnts) December 15, 2025 -
'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?
ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసారీ విజువల్స్, స్టోరీ గ్రాండియర్ అదే రేంజులో ఉండబోతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. కానీ మన దగ్గర ఈ మూవీ వస్తుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. హైప్ అంత తక్కువగా ఉంది మరి! అసలు దీనికి ఏంటి కారణం? మూడో భాగంలో స్టోరీ ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)1997లో 'టైటానిక్' లాంటి బ్లాక్ బస్టర్, ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరున్ దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఓ విజువల్ వండర్ సృష్టించాడు. అదే 'అవతార్'. 2009లో ఇది రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.18-19 వేల కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ఇది ఫ్రాంచైజీలా వస్తుందని కామెరూన్ ప్రకటించాడు. కాకపోతే రెండో భాగం రావడానికి చాలా ఆలస్యమైంది. 2022 డిసెంబరులో 'అవతార్ 2' విడుదలైంది. తొలి భాగంతో పోలిస్తే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. వసూళ్లు మాత్రం కళ్లు చెదిరేలా వచ్చాయి.ఈ వారం మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే దీనిపై అనుకున్నంత బజ్ లేదు. తొలి పార్ట్ రిలీజైనప్పుడు విజువల్స్, పండోరా ప్రపంచం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్ వచ్చేసరికి చూసిన కంటెంట్‌లానే ఉంది కదా అనిపించింది. దీంతో రెండో భాగానికి మన దేశంలో రూ.450-480 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు రాబోయే మూడు పార్ట్ ట్రైలర్ కూడా విజువల్‌గా బాగున్నప్పటికీ స్టోరీ.. తొలి రెండు భాగాల్లో చూపించిందే ఉండబోతుందా అని సందేహం కలిగేలా చేస్తోంది. హైదరాబాద్ లాంటి చోట్ల బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. బహుశా రిలీజైన తర్వాత అదిరిపోయిందనే టాక్ వస్తే జనాలు దీనిపై ఆసక్తి చూపిస్తారేమో?(ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)అవతార్ విషయానికొస్తే.. ప్రకృతినే ప్రాణమని భావించే 'నావి' జాతి వాళ్లకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానుషులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా థీమ్. ఇందులో యాక్షన్‌ని మించిన లవ్‌స్టోరీ దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలని హత్తుకుంది. అలానే పంచభూతాలైన భూమి గురించి తొలి పార్ట్‌లో చూపించారు. నీటి గురించి రెండో భాగంలో, ఇప్పుడు అగ్ని గురించి మూడో భాగంలో చూపించబోతున్నారు.'అవతార్' 22వ శతాబ్దంలో పండోరా అనే గ్రహంపై జరుగుతుంది. ఇక్కడ మానవులు 'అన్బ్టేనియం' అనే విలువైన ఖనిజం కోసం వచ్చి, స్థానిక 'నావి' తెగపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వికలాంగుడైన మాజీ మెరైన్ జేక్ సుల్లీ.. నావి తెగలో ఒకడిగా మారేందుకు తన 'అవతార్' శరీరం ద్వారా వారి సంస్కృతిని అర్థం చేసుకుని, వారి ప్రేమలో పడి, చివరికి నావి పక్షాన నిలబడి మానవులతో పోరాడి గెలుస్తాడు. పండోరని రక్షించుకుంటాడు. ఇదే పార్ట్-1 స్టోరీ.(ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) కథ.. మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది. దశాబ్దం గడిచిపోతుంది. జేక్ సుల్లీ, నెయితిరి తమ ఐదుగురు పిల్లలతో కలిసి పండోరాలో కొత్త జీవితం ప్రారంభిస్తారు. తర్వాత మనుషుల దాడుల నుంచి తమ కుటుంబాన్ని, తమ జాతిని కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటంలో భాగంగా మరో చోటకు వెళ్లిపోతారు. నీటిలో నివసించే మెట్కైయినా తెగతో కలిసి మనుగడ సాగిస్తారు. కానీ మనుషులు తిరిగి రావడంతో మళ్లీ పోరాడతారు. పాత శత్రువు కల్నల్ క్వారిచ్తోనూ మరోసారి తలపడతారు.అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కథ.. రెండో భాగంగా ముగిసిన చోటనే మొదలవుతుంది. ఈసారి కల్నల్ క్వారిచ్.. నావి తెగలోని మనుషుల్లా మారిపోతాడు. ఇదే జాతికి చెందిన ఓ మహిళతో కలిసి జేక్, అతడి బృందంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఏమైంది? జేక్, అతడి కుటుంబం ఈసారి ఎలా తప్పించుకుంది? ఇందులో యాష్ తెగ పాత్ర ఏంటనేది మూడో భాగం స్టోరీ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ) -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్‌కు కారణాలివే!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్ టాప్ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్ చేశారు. కామనర్ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...నలిగిపోయిన భరణిభరణి మొదట ఎలిమినేట్ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.ఫ్యామిలీ వీక్‌తో మార్పుకానీ దివ్య ఫెవికాల్లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.విమర్శలుభరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్ ఎంట్రీలో మాత్రం ఫైర్ చూపించాడు. ఆ ఫైర్ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి -
బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఆయన విగ్రహం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దీన్ని పెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బాలు విగ్రహం వద్దని అంటూ పలు ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కొన్నిరోజులుగా ఈ తతంగం నడిచింది. విగ్రహావిష్కరణ రోజు(డిసెంబరు 15) రావడంతో మళ్లీ వ్యతిరేకత కనిపించింది. దీంతో పోలీసులు.. భారీ బందోబస్తు సిద్ధం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహావిష్కరణ చేస్తారు.ఈ వేడుకకు వచ్చిన బాలు చెల్లి, గాయని ఎస్పీ శైలజ.. అన్నయ గురించి, విగ్రహ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నారు. ఇప్పుడు వాయిద్య బృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని శైలజ చెప్పుకొచ్చారు. వివాదం గురించి అడగ్గా.. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు నాకు తెలియదు, కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. బాలు తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈ విషయంలో వివాదం చేయడం సరికాదని అన్నారు. -
నేనెప్పుడూ నీవైపే.. ఒట్టేసి చెప్తున్నా: శిల్ప శిరోద్కర్
శిరోద్కర్ సిస్టర్స్ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్ ఇస్తూ గతేడాది హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.పర్ఫెక్ట్ బర్త్‌డే డిన్నర్ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "నా పర్ఫెక్ట్ కూతురికి పర్ఫెక్ట్ బర్త్‌డే డిన్నర్.. ఫ్యామిలీ, ఫుడ్, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్ కూడా ఉన్నాడు.ఎంత ఎదిగిపోయావో..అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్ వీడియోను సైతం షేర్ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్‌డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!
గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్‌కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?)ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్‌ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్‌లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
కొత్త వారితో 'పతంగ్'.. ట్రైలర్ విడుదల
నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం పతంగ్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా ఇందులో నటించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. -
అఖండ2 సినిమాపై 'సనాతని' సైలెన్స్.. ఎందుకు?
'అఖండ 2' సనాతన హైందవ ధర్మం కోసం తీసిన సినిమా అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇదీ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదంటూ.. ప్రపంచ సినిమా అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం మూలాలతో పాటు ధర్మం, గర్వం, తేజస్సు కలగలిపిన చిత్రమిదని బాలయ్య అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీలో అఖండ2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అఖండ2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరి ఏపీలో అవతరించిన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్‌కు అఖండ చూపించరా..? ఓజీ కోసం బాలయ్య త్యాగం చేశారు. అలాంటిది అఖండ గురించి ఒక్కమాటైన పవన్ మాట్లాడరా..? అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మాత్రమే రాజకీయాల్లో సనాతన ధర్మం చాంపియన్‌గా రేసులో ఉంటే.. ఇప్పుడు అఖండతో బాలయ్య క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఏమైనా సందేహం వస్తుందా…?ఈ దశాబ్దన్నర కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయం కోసం చే గువేరా, గద్దర్, పెరియార్ రామస్వామి వంటి విప్లవకారుల అభిమానిగా గతంలో తాను చెప్పుకుని యువతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అయితే, సందర్భం ఏదైనా సరే పవన్ నోటి నుంచి వచ్చే మొదటి మాట సనాతన ధర్మం.. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దాని విలువలు ఏమిటో కూడా తెలియదు. కేవలం తన రాజకీయ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఓపెన్‌గానే చెబుతుంటారు. మరి అఖండ సినిమా కూడా సనాతన హైందవ ధర్మం కోసం తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా సినిమా చూసి బాగుందని సనాతన హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చూపించారని మెచ్చుకుంటున్నారు. కొన్ని వీడియో క్లింప్స్ కూడా షేర్ చేస్తూ బాలయ్య, బోయపాటిని అభినందిస్తున్నారు. కానీ, సనాతన బోధనలు చెప్పే పవన్ కల్యాణ్ మాత్రం కనీసం ట్వీట్ కూడా వేయలేకపోయారు.అఖండపై పవన్ కల్యాణ్ మౌనం గురించి సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అతను తరచుగా తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముద్ర వేసుకుంటారని అలాంటింది అఖండ గురించి ఎందుకు స్పందించడంలేదని నెట్టింట చర్చ జరుగుతుంది. మరోవైపు అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. సనాతన ధర్మంతో సంబంధం ఉన్న మరికొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు. కానీ, పవన్ నుంచి నో కామెంట్.. కనీసం తన సినిమా ఓజీ కోసం అఖండను వాయిదా వేసుకున్నందుకైనా కృతజ్ఞతగా పవన్ స్పందించలేదు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగం. దీంతో అతని మౌనం మరింత చర్చనియాంశంగా మారింది. సనాతన ధర్మం కోసం తీసిన ఒక సినిమాపై అతని స్పందన లేదా ప్రమోషన్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీని వల్ల బాలకృష్ణ అభిమానులు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అఖండ గురించి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ షేర్ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తీసిన సినిమాను చూడమని ప్రేక్షకులను ఎందుకు ప్రోత్సహించడం లేదని బహిరంగంగానే వారు ప్రశ్నించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ మౌనం వెనుక ఏదైనా లెక్క ఉందా..? అనేది వారికే తెలియాలి. -
తిండీనిద్ర మానేసి మందు తాగడం.. మాజీ భర్త వల్లే!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 350కి పైగా సినిమాలు చేసింది. 2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి సంతానం. రెండో పెళ్లిఅయితే భార్యాభర్తలు ఎంతోకాలం కలిసుండలేదు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ప్జాపతి అని ఓ కుమారుడు సంతానం. ఇటీవలే శివప్రసాద్ దర్శకుడిగా మారిపోయాడు. తన మొదటి పెళ్లి ఎందుకు విఫలమైందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందరూ కలిసి తాగేవారుఊర్వశి మాట్లాడుతూ.. మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణమే తేడాగా అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ ఆధునిక జీవన విధానాన్ని కొనసాగించేవారు. కలిసి తాగడం, తినడం చేసేవారు. తల్లీపిల్ల తేడా లేకుండా అంతా ఒక్కచోట కూడి సిట్టింగ్ చేసేవారు. వాళ్ల మధ్య నేను ఇమడగలుగుతానా? లేదా? అని భయపడ్డాను.షూటింగ్ అవగానే తాగడంఅడ్జస్ట్ అవడానికి ప్రయత్నించాను. వాళ్ల పద్ధతుల్ని నేర్చుకున్నాను. షూటింగ్స్‌కు వెళ్లడం.. రాగానే మందు కొట్టడం ఇదే పని! నన్ను నేను కోల్పోతున్నాను అన్న విషయం నెమ్మదిగా అర్థమైంది. అప్పటికే ఇంటి పోషణ బాధ్యత నా భుజాలపై పడింది. ఇష్టం లేని పనులు బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఆరోగ్యం నాశనం చేసుకున్నానా అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించేవారు కాదు. గొడవలు జరిగేవి.. అప్పుడు కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీనిద్ర మానేసి మరీ తాగుతూ కూర్చునేదాన్ని. చేజేతులా ఆరోగ్యం నాశనం చేసుకున్నాను. నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడ్డాను అని ఊర్వశి చెప్పుకొచ్చింది. -
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి మిచెల్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని తమ నివాసంలో వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వారిద్దరిని చూసి అభిమానులు చలించిపోయారు. శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడింది వారి కుమారుడు నిక్ రైడర్ అని అమెరికా వార్తా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగించే వాడినని నిక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి దర్శకత్వంలో నిక్ ఒక సినిమాలో కూడా నటించి ప్రశంసలు పొందాడు. అయితే, తన తల్లిదండ్రులనే హత్య చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. రాబ్ రైనర్ గత ఐదు దశాబ్దాలకు పైగా హాలీవుడ్లో ఉన్నారు. ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు కూడా లభించాయి. వెన్ హ్యారీ మెట్ సాలీ , స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, తదితర సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు. -
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఒకే వారం వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్‌లో టాప్ 5 మిగిలారు. వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించే బాధ్యతను ప్రేక్షకుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఈ మేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయం కాస్త పక్కనపెడితే ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..ప్రైజ్‌మనీతో ఏం చేస్తారు?బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రైజ్‌మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఈ ప్రైజ్‌మనీ మీ సొంతమైతే ఏం చేస్తారని నాగ్ అడిగాడు. భరణి వృద్ధాశ్రమానికి సాయం చేస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్.. తన ఇంటి అప్పు తీర్చేయడంతో పాటు ప్రియురాలిని బాగా చదివిస్తానన్నాడు. అలాగే తన అక్క పిల్లల చదువు, బాగోగులు అన్నీ చూసుకుంటానన్నాడు. డిమాన్ పవన్.. తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బు వాడతానన్నాడు. అలాగే అమ్మానాన్న కోసం ఓ ఇల్లు కడతానన్నాడు.విరాళంగా ఇస్తా..ప్రైజ్‌మనీని హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావ్? అని అడగ్గా.. కల్యాణ్‌కు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. ఇద్దరం కామనర్స్ కాబట్టి తనతో పంచుకుంటానన్నాడు. తర్వాత సంజనా.. మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సంఘానికి కొంత విరాళం ఇస్తాను. కాళ్లు లేని పిల్లల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తాను, నా పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంది. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానంది.బంగారం కొనిస్తాకల్యాణ్.. అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుని వాళ్ల బాగోగులు చూసుకుంటాను. మా అమ్మకు వీలైనంత ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు. తర్వాత తనూజను సెకండ్ ఫైనలిస్ట్‌గా, పవన్‌ను మూడో ఫైనలిస్ట్‌గా, ఇమ్మాన్యుయేల్‌ను నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రకటించారు. చివరగా భరణి, సంజన మిగిలారు. వీరిలో భరణి ఎలిమినేట్.. సంజనా ఐదో ఫైనలిస్ట్ అని ప్రకటించగానే ఇమ్మూ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నాన్న దగ్గర ఆశీర్వాదంభరణి వెళ్లిపోయేముందు తనూజ అతడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. గతంలో ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్‌లోకి వచ్చిన భరణి.. ఈసారి బాగానే ఆడాడు. కానీ, ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అది సరిపోలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్ 5లో ఉన్న ఐదుగురు ఫైటర్స్ అని ప్రశంసించాడు. కళ్యాణ్‌కు సైనికా, వందనం అంటూ సెల్యూట్ చేశాడు. కప్పు గెలవాలిసుమన్, కల్యాణ్‌ను ఏ రోజూ నామినేట్ చేయలేదు. కప్పు గెలిచే అర్హత నీకుంది అని బూస్ట్ ఇచ్చాడు. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కానీ, నీకివ్వాల్సిన ప్రాధాన్యత నీకిచ్చాను. నాన్నా అని దగ్గరకు వస్తే దూరం తోసేంత దుర్మార్గుడిని కాదు. నువ్వు, దివ్య, సుమన్.. నాకు బెస్ట్ బెడ్డీస్ అన్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన భరణి.. తనూజ మాత్రం కప్పు గెలవాలని కోరాడు. -
బిజినెస్ మేన్‌గా ఏషియన్ సినిమాస్‌తో మహేశ్ బాబు.. నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్‌తో కలిసి AMB బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత కొత్త థియేటర్లు ఇతర నగరాల్లో కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో AMB సినిమాస్ ఉంది.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్ నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం హకీంపేట్‌లో కొత్త థియేటర్ నిర్మాణం జరుగుతోంది. 2027లో ప్రారంభం అవుతుందని అంచనా.. అయితే, మహేష్ బాబు తన ప్లాన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్నారు. మహేష్‌బాబు వేసిన దారిలో అల్లు అర్జున్ (AAA సినిమాస్), విజయ్ దేవరకొండ (AVD సినిమాస్), రవితేజ (ART సినిమాస్) వంటి స్టార్స్ కూడా అడుగులు వేస్తున్నారు. అయితే, మహేష్ మాత్రం ఈ రంగంలో చాలా దూకుడుగా ఉన్నారు. మొదట మెట్రో నగరాలను టార్గెట్ చేసిన ఆయన త్వరలో విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మహేష్ ప్లాన్ చేస్తున్న మూడో ప్రాజెక్ట్ హకీంపేట్(AMB Hakimpet)లో రానుంది. అక్కడ ఐమాక్స్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా టాప్ రేంజ్ మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్న మహేష్ బెంగళూరులో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేశారు. కపాలి థియేటర్ ప్రాంగణంలో AMB Cinemas Kapali త్వరలో ఓపెన్ కానుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమాను బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ బ్రాండ్‌గా AMB నిలవనుంది.మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌తో కలిసి AMB Cinemasను లగ్జరీ బ్రాండ్‌గా రూపొందించారు. 7 స్టార్ లగ్జరీ, 7 3D స్క్రీన్స్, Dolby Atmos సౌండ్ సిస్టమ్‌తో గోవా, చెన్నై వంటి నగరాల్లో కూడా విస్తరణ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ డాల్బీ అట్మాస్, IMAX వంటి cutting-edge టెక్నాలజీని తీసుకువస్తున్నారు. -
నువ్వు నాకు నచ్చావ్ రీరిలీజ్ మాత్రమే కాదు!
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కె విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీరిలీజ్ చేయనున్నట్లుగా స్రవంతి రవికిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీరిలీజ్ కాదు, నూతన సంవత్సరాన్ని (2026 జనవరి 1) కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని చెప్పారు. A story that made generations smile and continues to touch hearts across ages! ❤️A True Masterpiece in Telugu cinema, #NuvvuNaakuNachav returns with a theatrical re-release on Jan 1st, 2026! A #Trivikram Writings.Overseas Release by @PrathyangiraUS @VenkyMama… pic.twitter.com/RvFCMZOa0j— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 14, 2025 -
అత్యధిక రెమ్యునరేషన్‌తో 'బిగ్‌బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్-5 ఎవరనేది తేలిపోయింది. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేసులో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్‌బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే, శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే, రీఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు.ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌గా వచ్చినట్లు సమాచారం. కానీ, భరణి 8వ వారంలో హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరు వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో రూ. 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రూ. 42లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా భరణి రికార్డ్ క్రియేట్ చేశారు. -
రెజీనాకు మరోసారి ఛాన్స్ ఇస్తున్న స్టార్ హీరో
అజిత్ తన 64వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్ట్రేలియాలో జరుగుతున్న అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అజిత్ ఇంతకుముందు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత కార్ రేస్ పోటీల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మరోపక్క ఈయన నటించనున్న తన 64వ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీలతోపాటు మరో నాయకి కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె ఎవరో కాదు రెజీనా. ఈమె ఇంతకుముందు అజిత్‌తో కలిసి విడాముయర్చి చిత్రంలో నటించారన్నది గమనార్హం. అందులో ఆమె ప్రతినాయకి పాత్రలో నటించారు. అలాంటిది తాజా చిత్రంలో రెజీనా పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నది గమనార్హం. -
వెండితెర సోగ్గాడు తిరిగొస్తున్నాడు
‘సోగ్గాడు’ తిరిగొస్తున్నాడు. శోభన్‌బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడు (1975)’. జయచిత్ర, జయ సుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. 1975 డిసెంబరు 19న ఈ సినిమా విడుదలైంది. ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవం జరగనుంది. అదే రోజు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఆదివారం ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ మా సంస్థకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. నేటి టెక్నాలజీని ఉపయోగించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. అలాగే మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం’’ అని చెప్పారు. మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ సినిమా తీశాను’’ అని అన్నారు. ఇంకా పలువురు దర్శక–నిర్మాతలు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. -
అఖండ 2 కేవలం తెలుగు సినిమా కాదు
‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు. భారతీయ చిత్రం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. సనాతన హైందవ ధర్మం పరాక్రమాన్ని చూపించిన చిత్రం. ఈ సినిమా చూశాక సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆంచట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఆదివారం యూనిట్ నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మన సినిమాను గెలుపించుకోవాలని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఆర్టిస్టు, టెక్నిషియన్ కు థ్యాంక్స్. ఆ శివుడే మా వెనకాల ఉండి నడిపించాడు’’ అన్నారు. ‘‘అఖండ 2’కు మ్యూజిక్ ఇవ్వడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా సక్సెస్ అవుతుందని ధైర్యంగా అనుకున్నాం’’ అని చెప్పారు తమన్ . ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బోయపాటిగారు బాలకృష్ణగారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్‌ను డిజైన్ చేసి, ఒక సూపర్ హీరోని చేయడం అది బాలకృష్ణ, బోయపాటిగార్లకే చెల్లింది. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే మేం పే చేసిన దానికి 70 శాతం రెవెన్యూ రికవరీ అయ్యింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో విజీ చంద్రశేఖర్, గంగాధర శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాలు తొలి పాటకు అరవై ఏళ్లు
‘నా పాట పంచామృతం’ అన్న బాలు వాక్కులు నిజంగానే ‘బ్రాహ్మి’ (సరస్వతి) వాక్కులే!! నెల్లూరు జిల్లాలో కోనేటం పేటలో పుట్టిన ఈ బాలుడు పాటల కోనేటిరాయడై అఖిల భారతీయుల అభిమానాన్ని చూరగొంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలు సైతం సినీ గాయకుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఆయనను ఇంజనీర్‌గా చూడాలనేది తండ్రి సాంబమూర్తి కల. కానీ ఆ కలకు భిన్నంగా బాలు తన ప్రతి భతో పాటల ఇంజనీరింగ్‌నే మార్చి ఆరు దశాబ్దాలు అప్రతిహతంగా సినీ సంగీత ప్రపంచానికి రారాజు అయ్యారు.కలయా... నిజమా....1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో బాలు ప్రతిభను మరో సంగీతదర్శకుడు ఎస్.పి. కోదండపాణి గమనించి, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి బాలు కొన్నాళ్లు ఎదురు చూశారు. ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ప్రవేశించారు కానీ సినీరంగ ప్రవేశం మాత్రం జరగలేదు. బాలు కూడా క్రమంగా ఆ విషయం మరచిపోయారు. ఓ రోజు కోదండపాణి హడావుడిగా వచ్చి, బాలు గది తలుపు తట్టి, ‘ఏమయ్యా పంతులూ... నీ అడ్రస్ ఇవ్వకపోతివి... చాలా కాలంగా నీ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఉంటివా’ అని చీవాట్లు వేసి ‘పద్మనాభం ఓ సినిమా తీయబోతున్నారు. పాట పాడడానికి నీకు అవకాశమిస్తాను... ఎ.వి.ఎం స్టూడియోలో రికార్డింగ్ ఉంది’ అని చిరునామా వివరాలు ఇచ్చి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. బాలుకు తల గిర్రున తిరిగింది... తనేంటి? కలయా... నిజమా అనుకున్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది... తన ఫ్రెండ్ మురళితో కలిసి బాలు సైకిల్ పై ఎ.వి.ఎం. స్టూడియోకి వెళ్ళారు.గేటు దగ్గరే నిలబెట్టేశాడుగేట్మేన్ బాలును ఆపి లోనికి పోవడానికి వీల్లేదని, నీలాంటి వారు రోజూ ఇలాగే వస్తుంటారని అడ్డుకున్నాడు. గేటు దగ్గరే నిలబెట్టేశాడు. చివరికి కనీసం మురళినైనా లోపలికి పంపించి, కోదండపాణిగారికి తను వచ్చిన విషయం చెప్పండని, ఒకవేళ ఆయన రావద్దంటే తిరిగి వెళ్లిపోతామని బాలు అనగానే గేట్‌మేన్ అంగీకరించి, మురళిని అనుమతించగానే ఆయన వెళ్లి కోదండపాణికి విషయం చెప్పడం, ఆయన స్వయంగా గేటు వద్దకు వచ్చి గేట్ మేన్‌ను తిట్టి బాలును లోనికి తీసుకెళ్ళడం జరిగింది.రావే కావ్య సుమబాల...ఆ రోజు 15 డిసెంబర్ 1966... మధ్యాహ్నం 2.30 ని.లకు బాలు తొలిసారిగా తన గళం విప్పారు. నటుడు, నిర్మాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం అది. వీటూరి రాసిన ‘ఏమి ఈ వింతమోహం’ పాటను సుశీల, పీబీ శ్రీనివాస్, కె. రఘురామయ్య వంటి ఉద్దండ గాయకులతో కలిసి పాడారు. అది ఘంటసాల పాడాల్సిన వెర్షన్. ఆయన బదులు కొత్తవాడైన బాలు పాడ టం పద్మనాభానికి ఇష్టం లేదు. ఆ పాట కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్, రామకృష్ణ, రాజశ్రీ వంటి తారలపై చిత్రించే మల్టీ స్టార్ సాంగ్ కావడం వలన ఆయన ఒప్పుకోలేదు. ఘంటసాల అనారోగ్యం వలన బాలుతో పాడిస్తున్నానని, ఒకవేళ బాగా లేకుంటే మళ్ళీ ఘంటసాలతో పాడిద్దామని కోదండపాణి ఒప్పించి రికార్డింగ్ పూర్తి చేశారు. వందకు పైచిలుకు వాద్యకారులున్న ఆర్కెస్ట్రా అది. ఆరు నిమిషాల రాగమాలికైన ఆ పాటలో కల్యాణి రాగంలో కంపోజ్ చేసిన ‘రావే కావ్య సుమబాల’ అనే చరణాన్ని బాలు పాడారు. బాలు పాడిన చరణాన్ని తెరపై శోభన్‌బాబు అభినయించారు. మరునాడు ఘంటసాలను ఆహ్వానించి, ఆ పాటను వినిపించగానే, ఆ మహానుభావుడు ఎంతో ఆనందించారు.అబ్బాయి బాగా పాడాడు...‘అబ్బాయి బాగా పాడాడు... ఎవరినీ అనుకరించలేదు... ఎంతో సహజంగా పాడాడు... ప్రతి సంగతిని చక్కగా వేశాడు. నేను పాడక్కరలేదు... ఈ పాటను ఇలాగే ఉంచండి..’ అని చెప్పి కొత్త గొంతును పరిచయం చేసినందుకు అభినందించారు. ఘంటసాల మాటలకు పద్మనాభం ఎంతో సంతోషించి, బాలుకు అదే చిత్రంలో మరో పాటను, పద్యాన్ని పాడడానికి అవకాశం ఇవ్వడం విశేషం.ఘంటసాలకు సిసలైన వారసుడుబాలు పాడిన మొదటి పాట రికార్డుని తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు వినిపించి, అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. తొలి పాట పాడాక బాలుకు వెంటనే రెండవ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఎం.ఎస్. రెడ్డి. ఆయన ‘కాలచక్రం’ అనే తమిళ డబ్బింగ్ సినిమాలో పాడించారు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు బాలు. అందుకే అమర గాయకుడు ఘంటసాల ‘తన తరువాత బాలు మాత్రమే తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడు’ అని చెప్పిన జోస్యాన్ని బాలు నిజంగానే నిరూపించుకున్నారు. ఘంటసాల తెలుగు మినహా వేరే భాషల్లో పాడలేదు. బాలు దేశంలోని దాదాపు భాషలలో పాడి, లక్షలాది అభిమానులను సంపాదించుకొన్నారు.శంకరాభరణంతో...బాలు 1966 నుండి సినిమాలలో పాడుతున్నప్పటికీ ఆయన శాస్త్రీయ గీతాలను సైతం సశాస్త్రీయంగా పాడగలరని నిరూపించిన చిత్రం ‘శంకరాభరణం’ (1980). దానికి ముందు ఘంటసాల జీవించిన కాలంలో బాలుకు ఎక్కువ శాతం రొమాంటిక్ పాటలు పాడడానికే ఆహ్వానాలు అందేవి. అయితే కోదండపాణి తరువాత బాలులోని ప్రతిభను గుర్తించిన సంగీత దర్శకులలో సత్యం ఒకరు. హరనాథ్ హీరోగా నటించిన ‘ప్రతీకారం’ (1970) చిత్రంలో ‘నారీ రస మాధురి లహరి’ అనే పాటను సత్యం హంసానంది రాగంలో స్వరపరచి బాలుతో పాడించిన తొలి లలిత శాస్త్రీయ గీతం. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ పాట కూడా ఎవరికీ అంతగా తెలియదు.స్వర పారిజాతం‘కన్నె వయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటను బాలుతో పాడించారు సత్యం. ఆ పాట క్లాసిజానికి మురిసిన జానకి తనతో కూడా పాడించాలని పట్టు పట్టడంతో ఆమెతో కూడా పాడించారు. జానకి అంచనా నిజమైంది... ఆ పాట బాలుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, ఆయనను నిజంగా ఈ భువిలో విరిసిన స్వర పారిజాతంగా మలచింది... ఘంటసాల మరణించాక (1974) గాయకునిగా బాలు విశ్వరూపమే ప్రదర్శించారు.రోజుకి పదహారు పాటలు...‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దూజే కే లియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ‘త్యాగయ్య, అన్నమయ్య, సంగీత సామ్రాట్, భైరవ ద్వీపం’ చిత్రాలలో బాలు శాస్త్రీయ సంగీతంలో పాడిన పాటలే విమర్శకుల నోళ్ళు మూయించాయి... ఓ దశలో రోజుకు 16 పాటలు మూడు షిఫ్టులలో పాడి, బాలు తన అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు.అరుదైన రికార్డుఅలనాటి రాజేశ్వర రావు మొదలు ఆధునిక యువ సంగీత దర్శకులందరికీ బాలు ఒక ఫేవరెట్ సింగర్. బాలు తన మిమిక్రీ కళతో రాజ్ బాబు, పద్మనాభం, మాడా, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, కమల్‌హాసన్ తదితరుల నటుల గొంతుకలకు అతి సన్నిహితంగా పాడి భళా అనిపించుకున్నారు. 50 ఏళ్ళకు పై సినీ ప్రస్థానంలో 40 వేల పాటలకు పైగా 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. ఆయనతో కలిసి ఆయన సమక్షంలో అనేక కార్యక్రమాల్లో పాటలు పాడిన అదృష్టం ఈ వ్యాస రచయితకు కూడా ఉన్నది.ఆ స్వరాలు అజరామరంబాలు 1993 ఫిబ్రవరి 14న లలిత కళాతోరణంలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత 2003లో రవీంద్ర భారతి ప్రాంగణాన ఘంటసాల విగ్రహం స్థాపించడానికి మూల కారణమైన బాలు... ఆ మహనీయునితో కలిసి పాడుతానని కానీ మరణించిన తరువాత ఆయన విగ్రహం చెంతనే తన ప్రతిమ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు సినీ కళామ తల్లికి ఘంటసాల, బాలు రెండు కళ్ళ వంటివారు. వారు దివంగతులైనా ఆ స్వరాలు అజరామరం.– డా. వి.వి. రామారావురచయిత, గాయకుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత -
సినిమాలకు డిసెంబరు ఇలా కలిసి వచ్చేస్తుందేంటి?
సాధారణంగా డిసెంబరు నెల సినిమా ఇండస్ట్రీలకు సీజనే. కాకపోతే ఓ మాదిరి హిట్స్, కలెక్షన్స్ మాత్రమే వస్తుండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సీన్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్‌కి తెగ కలిసొచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీస్ అయితే కొన్ని వారాల పాటు ఆడేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ డిసెంబరు సంగతేంటి? ఏయే సినిమాలకు ఎలా కలిసొచ్చిందనేది చూద్దాం.డిసెంబరు అంటే చలికాలం. క్రిస్మస్ పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి చాలావరకు ఈ ఫెస్టివల్ టార్గెట్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. కానీ కొవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇదే నెలలో వివిధ తేదీల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. 2021 నుంచి ప్రతి ఏడాది ఏదో ఓ సినిమా ప్రేక్షకుల్ని అలరించి వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది.2020లో కరోనా రావడం వల్ల పెద్ద సినిమాల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. చాలా చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలా 2021 డిసెంబరులో తొలుత 'పుష్ప' వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు నెలరోజుల పాటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. వారం పదిరోజుల తర్వాత వచ్చిన రిలీజైన 'అఖండ' కూడా హిట్ అయింది. 2022లో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం టాలీవుడ్ నుంచి రాలేదు.2023 డిసెంబరులోనూ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే నెల మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' వచ్చి దుమ్ములేపింది. దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లంతా హిందీ యాక్టర్సే అయినప్పటికీ తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. నెల చివరలో వచ్చిన ప్రభాస్ 'సలార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.600 కోట్ల మేర వసూళ్లు సొంతం చేసుకుంది.గతేడాది జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' మేనియాని కొనసాగిస్తూ సీక్వెల్‌ని గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి పార్ట్ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. దీనికి మాత్రం అంతకు మించి అనేలా స్పందన వచ్చింది. తెలుగు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఉత్తరాదిలో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ కళ్లు చెదిరిపోయాయి. చెప్పాలంటే మూవీ టీమ్ కూడా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఊహించి ఉండదు.ఈ ఏడాది కూడా డిసెంబరులో బాగానే కలిసొచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ మూవీ 'దురంధర్'.. అదిరిపోయే టాక్‌తో పాటు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రమే ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట కూడా హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఇక 'అఖండ 2' సీక్వెల్ తాజాగానే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడే దీని ఫలితం గురించి చెప్పలేం. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే ఇందులో కాస్త అతి ఎక్కువైందని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇలా కొవిడ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు డిసెంబరు అనేది లక్కీగా మారిపోయింది. చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే ఇకపై సంక్రాంతి, దసరాలానే డిసెంబరు కూడా సినిమాలకు సీజన్ అయిపోతుందేమో చూడాలి? -
గ్లామర్ బ్యూటీస్ క్లాస్ టచ్.. శ్రీలీల ఇలా మృణాల్ అలా
మరాఠీ స్టైల్లో చీరకట్టుతో మృణాల్ ఠాకుర్చీరలో అందాల ముద్దుగుమ్మలా అనసూయతెల్లని డ్రస్‌లో అతిలోక సుందరిలా శ్రీలీలబ్లాక్ అండ్ వైట్ శారీలో ముద్దొచ్చేలా నిహారికబెలూన్తో హీరోయిన్ అనన్య నాగళ్ల ఫన్నీ గేమ్జీన్స్లో రచ్చ లేపేస్తున్న ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఇది సుమన్‌కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్లో భరణిని పంపించేయనున్నారు.ఒక్క కారణం..సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.నవ్విస్తాడనుకుంటే..సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.ఒక్క స్టెప్పేస్తే చాలువీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.అందుకే 14 వారాలుకేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన! -
నిధి అగర్వాల్‌తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
తమిళ్లో నాకు ఛాన్సులివ్వరు, ఇక్కడ ఆ ఐక్యత లేదు!
మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట. కిక్ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. మాస్కే పరిమితం కాకుండా క్లాస్, లవ్ ఎంటర్టైనర్ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్.ఇండస్ట్రీ కలుషితంతాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్‌కు తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.ప్రాంతీయభావం ఎక్కువతమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు. పీఆర్‌తో పనివాళ్లందరూ పీఆర్ టీమ్‌ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్‌గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? నా వల్లకాదు! -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘అడవి’.. స్టార్ హీరోల చూపులన్నీ అటువైవే!
టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీల హవా నడిచేది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లవ్‌స్టోరీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ రాజ్యమేలాయి. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై ఆసక్తి చూపిస్తున్నారు. పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. అడవి నేపథ్యంలో వచ్చిన కాంతార 1&2 బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురమ్ భీమ్ ఎపిసోడ్‌తో పాటు అల్లూరీ యాక్షన్ సీన్ అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ సినిమా విజయం కీలక పాత్ర పోషించాయి. ఇలా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో .. మరికొంత మంది స్టార్ హీరోలు కూడా అడవి నేపథ్యం కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.అందులో అతిపెద్ద సినిమా ‘వారణాసి’. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ మూడు గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ అడవి నేపథ్యంలోనే సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.అక్కినేని హీరో నాగచైతన్య కూడా అడవి బాటనే పట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలోని కీలక సీన్లన్ని అడవి నేపథ్యంలోనే తెరకెక్కస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఇక మేగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా అడవినే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుది.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే సాగుతుందట. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అవుతుందట. శ్రీవిష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ చిత్రాల్లో కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాపే హైలెట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ఈ తెలుగు హీరో గుర్తున్నాడా? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
ఇండస్ట్రీలో హీరోగా చేసి హిట్ కొట్టడం గొప్పకాదు. వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం గొప్ప. అలా చేయలేకే చాలామంది హీరోలు కనుమరుగవుతున్నారు. అలాంటి ఓ హీరోనే ఇతడు. 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి తీసిన తొలి మూవీ హీరో ఇతడే. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ ఇతడెవరు? ఇప్పుడేం చేస్తున్నాడు?(ఇదీ చదవండి: 'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?)పైన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మంగం శ్రీనివాస్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. 'ఈ రోజుల్లో' హీరో శ్రీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2012లో ఈ సినిమా రిలీజైంది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే హీరోగా చేసిన శ్రీ కూడా చాలానే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. కాకపోతే సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్ల కేవలం మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయాడు.'ఈ రోజుల్లో' సినిమా తర్వాత శ్రీ.. రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్.. ఇలా మూడునాలుగేళ్లలో 12 వరకు మూవీస్ చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. శ్రీ కూడా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పాడు. హీరోగా చేస్తున్న టైంలో తాహతుకు మించిన పనులు చేశానని, తన చిత్రాలు రిలీజ్, షూటింగ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే సొంత డబ్బులు ఇచ్చానని.. అలా ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడు. ఇది శ్రీ కుటుంబ బిజినెస్. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి ఇతడికి వచ్చింది. 2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోవడంతో ఈ బిజినెస్‌లోకి వచ్చానని శ్రీ చెప్పాడు. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో ఉందని అన్నాడు. పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్నానని, భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుందని కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తొలి సినిమాతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఈ హీరో.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. 'అరోమలే' ఓటీటీ రివ్యూ) -
సినీ నటి ప్రత్యూష బయోపిక్ ప్లాన్.. ఆమె మృతి కేసులో ఏం జరిగింది..?
తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసు 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడు. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ.. అతనికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, ప్రత్యూష బయోపిక్ త్వరలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆమె కథన రష్మిక ఇప్పటికే విన్నారని, త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఫిల్మ్ నగర్ టాక్.(Actress Pratyusha Biopic)ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. సుమారు 23ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తీర్పు రాలేదు. న్యాయం కోసం ఆమె తల్లి పోరాటం చేస్తూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. న్యాయపరంగా ఇది లాంగ్-రన్నింగ్ కేసు, 23 ఏళ్ల తర్వాత కూడా తీర్పు రాకపోవడం న్యాయవ్యవస్థలో ఆలస్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యూష మరణం ఆత్మహత్యగా పరిగణించబడినా, సిద్ధార్థరెడ్డి పాత్రపై వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే గానీ పూర్తి విషయాలు వెలుగులో వస్తాయి.ప్రత్యూష కేసులో సీబీఐ నివేదిక ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. హైదరాబాద్‌లోనే వారిద్దరూ ఇంటర్ పూర్తి చేశారు. అయితే, చదువుకు ఫుల్స్టాప్ పెట్టిన ప్రత్యూష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, సిద్ధార్థరెడ్డి మాత్రం ఇంజినీరింగ్‌లో చేరాడు. కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు రావడతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇద్దరూ విషం తాగారు. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నిందితుడు సిద్ధార్థరెడ్డి ఎక్కడ ఉన్నాడు..?ప్రత్యూష హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. హైకోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ, అప్పీల్ కారణంగా ఆయన జైలు శిక్షను తప్పించుకుని బయట ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కారణంతోనే ప్రత్యూష తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది నవంబర్ 20 సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ఆయన భవిష్యత్తు స్పష్టమవుతుంది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవేఅది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్‌కెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది. సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. (Actress Pratyusha Death Mystery)కేర్ నుంచి నిమ్స్కిపోస్ట్మార్టమ్ నిమ్స్‌లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు. పొరపాటు చేశాం.. ఖననం చేసి ఉంటే..!ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది.ప్రత్యూష సినిమా విశేషాలుసినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్. -
'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?
రీసెంట్గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్‌లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది. దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్‌కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్‌గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) -
కాపీరైట్స్ కేసులలో 'ఇళయరాజా'ది తప్పేనా.. వారికి మాత్రమే నోటీసులు ఎందుకు?
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తరచుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. అనుమతి లేకుండానే తన పాటలను నేటి సినిమాల్లో వినియోగించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూనే నష్టపరిహారం కూడా చెల్లించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంలో ఆయన్ను సమర్ధించే వారు ఉన్నారు. మరికొందరు వ్యతిరేఖిస్తున్నారు.ఇళయరాజా సంగీతం అందించిన 5వేల పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో నేటి తరం సినిమా నిర్మాతలు అందరూ సోని మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకుని రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. రీసెంట్గా డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలో అదే జరిగింది. మైత్రీ మూవీస్ కూడా ఇదే పేర్కొంది.ఇళయరాజాకు కౌంటర్ ఇస్తున్న లాయర్లుఒక సినిమా కోసం ఇళయరాజా పాటలు స్వరపరిచినందుకు నిర్మాత డబ్బులు చెల్లిస్తారు. అదే పాటను ఆ సంగీత దర్శకుడు మరో పది సినిమాలకు అమ్ముకోలేరని కౌంటర్ వేశారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను తమ సినిమాలో ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా దర్శకుడు, నిర్మాత ఇష్టంపైనే ఉంటుందని గుర్తుచేశారు. సంగీతమనేది తన కష్టానికి ఫలితమైనప్పటికీ.. ఒక సినిమా కోసం దానిని అమ్మేసిన తరువాత యాజమాన్య హక్కులు ఎట్టిపరిస్థితిలోనూ కోరలేడని న్యాయవాదుల పేర్కొన్నారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను ఎవరైన నిర్మాత ఉపయోగించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ పాటను మరో సినిమాకు సంగీత దర్శకుడు అమ్మలేరని తెలిపారు.తన పాటలను వేదికలపై పాడొద్దని ఎస్పీబాలు, చిత్ర, ఎస్పీ చరణ్‌లకు కూడా గతంలో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారనే విషయం తెలిసిందే.. నోటీసులు అందుకోగానే ఇళయరాజా పాటలు పాడటం ఆపేస్తున్నట్లు బాలు ప్రకటించారు. చట్టం గురించి తనకు తెలియకపోవడం వల్ల కచేరీలలో ఇళయరాజా పాటలు పాడానని బాలు చెప్పారు. ఇకపై షోలలో ఆయన పాటలు పాడలేనని సోషల్‌మీడియాలో ప్రకటించారు.1980 కాలంలో ఇళయరాజా టైమ్ కొనసాగుతుంది. ఆ సమయంలో ఆయన ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. తనకు ఏదైనా సినిమా ఆఫర్ వస్తే దాని ఆడియో హక్కులు కూడా సొంత కంపెనీకే ఇవ్వాలని షరతు పెట్టేవారు. ఇలాంటి డీలింగ్స్ అన్నీ కూడా తన మేనేజర్ కల్యాణం చూసుకునేవారు. కనీసం తన ఫైనాన్స్ విషయంలో కూడా ఆయన వేలు పెట్టరు. ఇళయరాజా చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. తనకు టాలెంట్‌తో పాటు డబ్బు విలువ బాగా తెలుసు. ఇళయరాజా వల్లనే ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ముందే కాపీ రైట్స్ తన కంపెనీ చేతిలో పెట్టుకున్నారు.ఇళయరాజా అందరికీ నోటీసులు పంపారా..?తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇశయరాజా అందరికీ నోటీసులు పంపలేదు. చాలామంది సరదాగా ఆయన పాటలు పాడుతుంటారు. సినిమా పాట అంటేనే ఇలాంటివి సహజం. ఆయన ఎప్పడూ కూడా మామూలు జనాలకు నోటీసులు ఇవ్వలేదు. చిన్నాచితక ఆర్కెస్ట్రా వారికి కూడా ఇవ్వలేదు. తన పాట ఎక్కడా కూడా వినిపించకూడదనే కండీషన్ పెట్టలేదు. ఆయన అభ్యంతరం చేసింది కేవలం సినిమా వాళ్లనే.. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి వారు సామాజిక ప్రయోజనాల కోసం ఇళయరాజా పాటలు పాడలేదు. వారు కూడా కమర్షియల్ కార్యక్రమంలోనే పాడారు. తద్వారా ఈవెంట్ నిర్వాహుకులకు డబ్బు వస్తుంది కదా అనేది ఇళయరాజా పాయింట్.. భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా తన పాటలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం ఏమిటి అని ఇళయరాజా భావించి ఉండొచ్చు. అందుకే ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు. -
నాగార్జున వాయిస్ ఓవర్.. 'ఇట్లు అర్జున' టీజర్ రిలీజ్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతో అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందించారు. నాగార్జున చేతుల మీదుగా రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.Loved doing the voice over for this love story!!To everyone who loved, But never said "I love you" ♥️Introducing #Aniesh as #NewGuyInTown in @WhatNextEnts’ Production No.1 - #ItlluArjuna ✨God bless🙏Discover the #SoulOfArjuna 💕🔗 https://t.co/E1KSWtAZOy@NewGuyInTown06…— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 14, 2025 -
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్‌తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్ అంటూ పోస్టర్‌ను షేర్ చేసింది.అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥🎟️ https://t.co/HHe863GdbEA @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY— People Media Factory (@peoplemediafcy) December 14, 2025 -
మరో కాలానికి వెళ్లడం ఆసక్తిగా ఉంటుంది
రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చాంపియన్ ’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్(Mickey J Meyer) మాట్లాడుతూ – ‘‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో ‘చాంపియన్’ సినిమా రూపొందింది. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం నాకు ఇలా ఇష్టం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి మరో టైమ్‌లోకి వెళ్లి మరో కాలాన్ని చూడడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది. ‘చాంపియన్’లో నిజాం బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ‘సల్లంగుండాలి, గిర గిర గిర గింగిరాగిరే..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిళితం చేసి ఒక జానర్‌ను క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఈ కథలో హీరోకు సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. నేను కూడా సికింద్రాబాద్‌లోనే పెరిగాను. నాకు ఆ కల్చర్ పై అవగాహన ఉంది. యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా... ఇలా రోషన్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రదీప్ చక్కగా డైరెక్ట్ చేశాడు’’ అని చెప్పారు. -
మెస్సీ అంటే ఇష్టం లేదు: అల్లు అర్హ
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ సైతం వెళ్లారు.అర్హ, అయాన్ వీడియో వైరల్మెస్సీ కోసం వచ్చావా? అని ఓ విలేఖరి అడిగితే.. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానని ఆన్సరిచ్చాడు అయాన్. ఫుట్‌బాల్‌లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే రొనాల్డో అని చెప్పాడు. తర్వాత అర్హను ప్రశ్నలడిగారు. మెస్సీ అంటే ఇష్టమా? అని అడగ్గా.. తనకు ఇష్టం లేదని అర్హ నిర్మొహమాటంగా బదులిచ్చింది. మెస్సీ మ్యాచ్‌కు వచ్చి మెస్సీ అంటేనే ఇష్టం లేదని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.Ayaan bhAAi asalu vere unnadu😂🤣Yela ra asalu ila 😭💯📈Entertainer "Ayaan" bolthe 💥🥁#ayaan #alluarjun pic.twitter.com/ekWkTYEHe6— sai (@nenupapinii) December 14, 2025 చదవండి: థియేటర్లో సుమ కన్నీళ్లు -
థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అఖండ-2 రావడంతో ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.అయితే ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ నటులు బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో మెప్పించారు.మోగ్లీ కథేంటంటే..తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో తెరకెక్కించిన కథే మౌగ్లీ. కొడుకు @RoshanKanakala విజయం చూసి తల్లి @ItsSumaKanakala ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. #Mowgli 👋 pic.twitter.com/qUcMowK03Z— Milagro Movies (@MilagroMovies) December 13, 2025 -
'బిగ్‌బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అప్పుడు రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో విజేతకు అందే ప్రైజ్ మనీని నాగార్జున రివీల్ చేశారు.బిగ్‌బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షలు అందుతాయని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, అందులో నుంచి ఎక్కువగా ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందని అందరికీ తెలిసిందే. గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్‌లో ఎవరికి ఎంత ఇస్తావని భరణిని నాగార్జున అడిగారు. తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్‌లో ఇమ్మాన్యుయేల్, పవన్‌లు ఉంటారని భరణి అన్నారు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని పవన్ చెప్పారు. -
OTT: ‘త్రీ రోజెస్ సీజన్ 2’ రివ్యూ
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ ఇది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి త్రీ రోజెస్ సీజన్ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (3 Roses Season 2 Review)కథేంటంటే.. రీతూ అలియాస్ రిత్విక (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్) , సృష్టి (కుషితా కల్లపు) ముంబైలో ఒకే హాస్టల్ ఉంటారు. సమీర్‌తో బ్రేకప్ తర్వాత రీతూ కెరీర్‌పై ఫోకస్ పెడుతుంది. వీరభోగ వసంత రాయలు(సత్య)తో విడాకులు తీసుకున్న మేఘన.. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ మాజీ భర్త ఇచ్చిన భరణంతో లైఫ్ లీడ్ చేస్తుంది. సృష్టికేమో కొరియన్ డ్రామాల పిచ్చి. ప్రతీది కొరియన్ కళ్లతోనే చూస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఓ యాడ్ ఏజెన్సీ పెడతారు. కానీ వారికి ఒక్క యాడ్ కూడా రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. చివరగా వీరికి ప్రసాద్(హర్ష చెముడు) గోల్డ్ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ప్రసాద్ ఎంట్రీతో ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పేంటి? వీరిని ట్రాప్ చేయాలనుకున్న వారి నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణతమకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకునే ముగ్గురు అమ్మాయిల కథ ఈ సిరీస్. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతల గురించి ఈ సిరిస్‌లో వినోదాత్మకంగా చర్చించారు. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అని తెలుసుకొని.. ఫేక్ బంధాల నుంచి బయటపడటంలోనే అసలైన ఆనందం ఉంటుంది అంటూ మంచి సందేశం అందించారు.సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా..ప్రస్తుతానికి మాత్రం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్లో ప్రధాన పాత్రల పరిచయం మాత్రమే ఉంటుంది. ఇక రెండో ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. సీజన్ 1 లాగే సీజన్ 2లో కూడా కామెడీ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. అయితే సీజన్ 1లో ముగ్గురు యువతులకు వేరు వేరు సమస్యలు ఉండగా...ఇందులో ముగ్గురు కలిసి ఒకే సమస్యను ఎదుర్కొంటారు.సొంతకాళ్లపై బతికేందుకు ముగ్గురు అమ్మాయిలు యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలో గతంలో రిలేషన్షిప్లో ఉన్నవారే మళ్లీ రీతూ లైఫ్‌లోకి రావడం... మరోవైపు ఒంటరిగా ఉన్న అమ్మాయిల బలహీనలతను ఆసరాగా చేసుకొని.. తమకి అనుకూలంగా మార్చుకునేవాళ్లు.. ఈ క్రమంలో వచ్చే సీన్లన్నీ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇందులో మంచి సందేశం ఇచ్చారు. ఏది ప్రేమ, ఏది వ్యామోహమో తెలియకుండా ఎలా మోసపోతున్నారనేది చూపించిన తీరు బాగుంది. నాలుగు ఎపిసోడ్స్ ఇంకా రిలీజ్ కాలేదు..కాబట్టి పూర్తి కథనం చూసిన ఫీలింగ్ రాలేదు. రొటీన్ కథే అయినా.. కథణం బాగుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు కూడా చాలా బాగా నటించారు. గ్లామర్ పరంగాను అలరించారు. సత్య కామెడీ నవ్వులు పూయించింది. ఇక అమ్మాయిల పిచ్చి ఉన్న పాత్రలో ప్రభాస్ శ్రీను కూడా తన పరిధిమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. వైవా హర్షతో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి ప్లస్ అయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనబడుతుంది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
దసరా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇవాళ దర్శకుడు శ్రీకాంత్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ది ప్యారడైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 'రక్తం పడిన తర్వాత చరిత్ర ఓపెన్ అవుతుంది' అని చెబుతూ.. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ డైరెక్టర్ కనిపించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు. -
రామ్, భాగ్యశ్రీ ప్రేమ గీతం.. ఫుల్ వీడియో వచ్చేసింది
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. నవంబర్ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. అయితే, నెటిజన్లలో కొందరు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్ని గుండెలో’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదుర్స్ అని ప్రశంసలు వచ్చాయి. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను మెర్విన్, సత్య యామిని ఆలపించగా.. వివేక్- మెర్విన్ స్వరాలు సమకూర్చారు. ఇందులో కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. -
బిగ్‌బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్‌టైమ్ రికార్డ్‌గా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వారమే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ, అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకులను మెప్పించాడు. 97వ ఎపిసోడ్లో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో కేవలం 6 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నేడు ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. అప్పుడు టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యూయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులు అతని రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. 14 వారాలు హౌస్‌లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకున్నవారిలో సుమన్ శెట్టి నిలిచారని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే. -
ఓటీటీకి ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.ప్రేమంటే కథేంటంటే..మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ. Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025 -
Kuttram Purindhavan Review: ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ సిరీస్ కుట్రమ్ పురిందవన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఒక సినిమా ఊహకందని సన్నివేశాలతో నడిస్తే అది దర్శకుడి ప్రతిభగా చెప్పొచ్చు. దానినే సినీ పరిభాషలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అంటారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఇటీవల సోనీలివ్ ఓటీటీ వేదికగా విడుదలైన ఓ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అదే ‘కుట్రమ్ పురిందవన్’(Kuttram Purindhavan Review ). ఈ సిరీస్‌కి సెల్వమణి ముని యప్పన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఆఖరి రెండు ఎపిసోడ్ల ట్విస్టులు చూస్తే మతి పోవడం ఖాయం. అంతలా ఈ సిరీస్‌లో ఏముందో, కథాంశం ఏంటో చూద్దాం. తమిళనాడులోని ఓ కుగ్రామంలో జరిగే జాతర నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఉద్యోగ రీత్యా ఫార్మసిస్ట్ అయిన భాస్కర్ తన మనవణ్ణి జాతర మధ్యలోనే ఇంటికి తీసుకువెళుతుంటాడు. దారి మధ్యలో తన ఇంటి పక్కన ఉన్న స్టీఫెన్ తాగి రోడ్డుకు అడ్డదిడ్డంగా నడుస్తూ కనబడతాడు. ఇంటికి వచ్చిన కాసేపటికి భాస్కర్ ఇంటి తలుపులు ఎవరో బాదుతుంటారు. తలుపు తీస్తే... ఇందాక కనిపించిన స్టీఫెన్ స్పృహ తప్పిపోయిన అతని కూతురు మెర్సీని తీసుకువచ్చి కాపాడమని భాస్కర్ని అడుగుతాడు. తనకి అంత పెద్ద వైద్యం తెలీదన్నా భాస్కర్ చేతుల్లో మెర్సీని పెట్టి బయటకు వెళతాడు స్టీఫెన్. మెర్సీని చూసి భాస్కర్ కంగారుపడుతుండగా స్టీఫెన్ ఆ అంతస్తు నుంచి కిందపడి చనిపోతాడు. ఇవతల మెర్సీ కూడా చనిపోయి ఉంటుంది. ఇక్కడ మెర్సీ, అక్కడ స్టీఫెన్ ఎలా చనిపోయారో తెలియక భాస్కర్ కంగారు పడుతుంటాడు. ఈలోపల మెర్సీ బాడీని మాత్రం తన ఫ్రిజ్‌లో దాస్తాడు భాస్కర్. మరోవైపు తన మనవడి సర్జరీ కోసం తన పెన్షన్ డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భాస్కర్. మర్డర్ కేస్ తన మీదకు వస్తే ఆ డబ్బులు ఆగిపోతాయన్న భయంతో మెర్సీ బాడీని దాస్తాడు భాస్కర్. ఆ తరువాత ఆ మిస్టరీ ఎలా వీడుతుంది? అన్నది మాత్రం సిరీస్‌లో చూడవలసిందే. ముఖ్యంగా ఈ సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్టులను ఎవ్వరూ ఊహించలేరు. పిల్లలు తప్ప పెద్ద వాళ్ళకి ఇదో అద్భుతమైన వీకెండ్ సిరీస్... మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. #Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025 -
సూపర్ స్టైల్
‘‘మై డియర్ వెంకీ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వెక్కడ ఉన్నా నీ చుట్టూ పాజిటివిటీ పంచుతుంటావు. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ షూటింగ్లో మనం గడిపిన ప్రతి క్షణాన్ని నేనెంతో మధురంగా గుర్తు చేసుకుంటాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. డిసెంబరు 13 వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో ఆయన చేసిన కీ రోల్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రంలో వెంకటేశ్ సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ చేశారని లుక్ స్పష్టం చేస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నామని శనివారం నిర్వహించిన విడుదల తేదీ ప్రకటన వేడుకలో దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి 'టాలీవుడ్' కన్ఫ్యూజన్.. పరిష్కారమే లేదా?
టికెట్ రేట్ల పెంపు అనేది తెలంగాణలో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ పదేపదే జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్ అనే సందేహం వస్తోంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా?టాలీవుడ్లో టికెట్ రేట్ల పెంపు చాన్నాళ్లుగా ఉన్నదే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గతేడాది డిసెంబరులో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం మీకు తెలిసే ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్‌కి అనుమతి ఇవ్వబోం, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోం అని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.కొన్నాళ్ల పాటు ప్రభుత్వం.. టికెట్ రేట్ల విషయంలో చెప్పిన మాటపై నిలబడింది. తర్వాతే మెల్లమెల్లగా సడలింపులు మొదలయ్యాయి. కొన్నాళ్ల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయమై ఒకరు హైకోర్టుని ఆశ్రయించగా.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడ్డాయి. సరే ఇకనైనా పాటిస్తారేమో అనుకుంటే.. తాజాగా 'అఖండ 2' విషయంలో ఏకంగా హైకోర్ట్ ఆదేశాల్నే ధిక్కరించారు.ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ ధరల్ని పూర్తిగా తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నిర్మాతలు వీటిని పాటించలేదు. ఇదే విషయమై మరో పిటిషన్ వేయగా హైకోర్టు.. చిత్రబృందాన్ని ప్రశ్నించించింది. హైకోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాతలు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది.'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా అధికారులు జీవో జారీ చేశారని, ఇకపై దర్శకనిర్మాతలు ఎవరూ తమ దగ్గరకు రావొద్దని అన్నారు. అయితే మంత్రికే తెలియకుండా జీవో జారీ చేసే అవకాశముందా? అనేది ఇక్కడ అర్థం కాని విషయం! ఇలా ప్రతిసారి 'టాలీవుడ్' విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంది.సరే 'అఖండ 2' విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుందాం. రాబోయేది సంక్రాంతి సీజన్. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి చెప్పినట్లు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారేమో చూడాలి? లేదంటే మళ్లీ జీవో జారీ చేసి హైకోర్టుతో చెప్పించుకుంటారా అనేది చూడాలి?ఏదేమైనా టికెట్ రేట్ల పెంపు విషయమై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒకచోట కూర్చుని ఓ క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేదంటే ప్రతిసారి ఇలా గందరగోళపడటమే అవుతుంది. టికెట్ రేట్ల పెంపు ఏమో గానీ ప్రేక్షకుడు క్రమక్రమంగా తెలుగు సినిమాకు దూరమవుతూనే ఉన్నాడు. థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. దర్శకనిర్మాతలు హీరోలకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో? -
చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ప్రకటన
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
మృణాల్ మెల్టింగ్ లుక్.. రాశీఖన్నా గ్లామర్ చూస్తుంటే
బ్లాక్ డ్రస్‌లో మృణాల్.. డిసెంబరు జ్ఞాపకాల ఫొటోలుసఫారీ ట్రిప్‌లో మాళవిక.. గ్లామరస్‌గా కనిపిస్తూఫిన్లాండ్లో కలర్‌ఫుల్ ఆకాశంతో 'దృశ్యం' పాపదుబాయి ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన కృతిశెట్టిటెన్నిస్ కోర్టులో గ్లామర్ చూపించేస్తున్న యుక్తి'అఖండ 2' షూటింగ్.. దూడపిల్లతో హర్షాలీ మల్హోత్రా View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) -
సామాజిక అసమానతలు ప్రశ్నించేలా 'దండోరా' టైటిల్ సాంగ్
'దండోరా' సినిమా టైటిల్ గీతాన్ని శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించాడు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తీసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉండనున్నాయి.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
సరికొత్తగా స్మిత సాంగ్ 'మసక మసక చీకటిలో'..
స్మిత పాడిన "మసక మసక చీకటిలో" పాట ఆమె కెరీర్లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సాంగ్‌గా గుర్తింపు పొందింది. - దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్‌కు నచ్చేలా అదే సాంగ్‌కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. "మసక మసక చీకటిలో" పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. పాత పాటకు కొత్త రీమిక్స్ రూపం ఇచ్చి, యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికీ ఆమె సిగ్నేచర్ హిట్‌గా గుర్తించబడుతోంది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. -
'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా ట్రైలర్
గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశంగా ఈ మూవీ ఉండనుంది. బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. -
అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత
పాప్ సింగర్ స్మిత ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ 2000ల్లో మాత్రం 'మసక మసక చీకటిలో..' అనే ఆల్బమ్ సాంగ్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు ఆల్బమ్ గీతాలు చేసింది. కాకపోతే రీసెంట్ టైంలో మాత్రం పెద్దగా బయట కనిపించట్లేదు. తాజాగా 'మసక మసక' అని సాగే కొత్త పాటతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. హైదరాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్.. శనివారం సాయంత్రం జరిగింది.(ఇదీ చదవండి: కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్)ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మిత.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేశానో మరోసారి చెప్పుకొచ్చింది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. 'గాయనిగా నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో ఓ పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మనకు చెప్పేది ఒకటి అక్కడ ఉండేది ఒకటి. ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను' అని స్మిత చెప్పుకొచ్చింది.స్మిత సింగర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ నటి, యాంకర్, బిజినెస్‌ఉమన్ గానూ పేరు తెచ్చుకుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతానికైతే మళ్లీ సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చే బిజిలో ఉంది. ఈ సాంగ్ ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్
భారతదేశంలో దేవుడిపై భక్తి అనేది అత్యంత లోతైన, విస్తృతమైన ఆధ్యాత్మిక భావన. అందుకే సినిమాల రూపంలో చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. విజయం సాధించాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ 2 కూడా అదే పాయింట్ మీద వచ్చింది. బాలయ్య అభిమానులు కూడా భక్తి, సనాతన ధర్మం మీద బాలయ్య పోరాటం అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారు. దేవుడిని నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, మోక్షం కోసం ఆరాధించడం భక్తి యొక్క మూలం. విశ్వాన్ని సృష్టించి నడిపే, శాసించే అజ్ఞాత శక్తే దైవం అని మన శాస్త్రాలు వివరణ ఇస్తున్నాయి. భగవంతుడే సర్వోన్నతుడని భక్తుడు భావించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదు. కానీ ,ఇందులోకి మతం చొచ్చుకు రావడంతో సమాజంలో వైశ్యామ్యాలు ఏర్పడుతున్నాయి. భక్తి అంటే దైవంతో వ్యక్తిగత అనుబంధం, ప్రేమను చూపడం. మతం అంటే దైవాన్ని పూజించే పద్ధతులు, నమ్మకాలు, సంప్రదాయాల వ్యవస్థ అని తెలిసిందే. కానీ, నేటి దర్శకనిర్మాతలు డబ్బు కోసం ఈ రెండిటిని జోడించి సినిమాలుగా తీయడమే అసలు సమస్య వస్తుంది. భక్తి సినిమాలు పెరగడం వల్ల ప్రజల్లో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.భక్తి సినిమాలకు భారీ డిమాండ్భారత్లో భక్తి సినిమాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతా కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు వీటిని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. భక్తి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. భక్తి సినిమాలు ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తాకుతూ.. బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన విజయాలు సాధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురాణ, ఇతిహాస ఆధారిత సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఈ జానర్‌కు మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.భక్తిని డబ్బుగా మలుచుకుంటున్న సినిమా ఇండస్ట్రీభక్తి సినిమా అంటేనే చాలా ప్రత్యేకం.. అందుకే సినిమా పరిశ్రమ టార్గెట్ భక్తి మార్గమే అయింది. పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా తప్పుగా చూపించడం వివాదాలకు దారితీస్తుంది. ఇలాంటి వివాదంలో చాలా సినిమాలు చిక్కుకున్నాయి. భక్తి సినిమాలు ఎప్పటికీ ఆధ్యాత్మికతను, విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలి. అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. మతసామరస్యం, కులవ్యవస్థ వ్యతిరేకత, ప్రజలకు ఆధ్యాత్మికత చేరువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలి.సినిమా పేరుతో దందాఒకప్పుడు ప్రజల్లో భక్తిని నింపే చిత్రాలు వచ్చేవి.. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, కన్నప్ప శ్రీ రామ రాజ్యం, దేవుళ్లు, షిరిడి సాయి వంటి సినిమాలకు ఎవరూ పేరు పెట్టరు కూడా.. అయితే, 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలే ప్రేక్షకులను మెప్పించాయి. అప్పట్లో వారు భక్తితో పరవశించారు. అయితే, ఇప్పడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు వివాదాలకు తావిస్తున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలను వక్రీకరించడమే కాకుండా వాటికి కాస్త కల్పితాలను జోడించి నిర్మిస్తున్నారు.అఖండ భక్తి సినిమానేనా.. ఏం చెబుతుంది?రీసెంట్గా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు అందించాడు. తన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ, పూర్తిగా భక్తితో నిండిన సినిమాను మనోళ్లు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం మన సినిమా ట్రెండ్ సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఇలా ఏదో ఒక పాయింట్ ఉంటే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. కానీ, అఖండలో అన్నీ కలిపి కొట్టేశారు. బాలయ్య పాత్ర మొత్తం డివోషినల్గా ఉంటుంది. కానీ, మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్‌ను ఇందులో చేర్చారు. కేవలం విజిల్స్ కోసమే దేవుడి పేరును ఉపయోగించారు. దేవుళ్లను ఇలా ఎలివేషన్స్ కోసం దర్శకులు ఉపయోగించడం ఏంటి అనే సందేహాలు రావడం సహజం. అఖండ2లో బాలయ్య పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ, ప్రేక్షకుల చేత విజిల్స్ వేపించేందుకు హనుమాన్ను గ్రాఫిక్స్ చేసి సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్లో స్కోప్ లేకున్నా సరే హనుమాన్ను చేర్చడం విడ్డూరంగానే ఉంటుంది. అఖండలో శివుడి పాత్ర అదుర్స్.. తన భక్తురాలి కోసం భగవంతుడే దిగొస్తాడని చూపించిన తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. -
రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్‌కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.రాంబాయికి కలిసొచ్చిన 99నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్‌లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్‌ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్‌లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు. అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారుఅందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్‌కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్‌లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. -
యూట్యూబ్‌లో అలరిస్తున్న 'మెన్షన్ హౌస్ మల్లేష్' సాంగ్
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. -
ఏడాది చివరలో దుమ్మురేపుతున్న బాలీవుడ్..
ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ విజయాల జోరు కొనసాగించింది. 2025లో హిందీ సినిమాలు ఆధిపత్యం కొనసాగించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గానే మిగిలాయి. అయితే, ఈ ఏడాది కాస్త పర్వాలేదు. చాలా సినిమాలు మినిమమ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినవే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే ఛావా వంటి సినిమాతో ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సైయారా కూడా రూ. 600 కోట్ల మార్క్‌ను దాటేసింది. గతంలో అక్కడ టాలీవుడ్ సినిమాలు కల్కి, పుష్ప-2 వంటి సినిమాలు సత్తా చాటాయి. అయితే, ఈసారి మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు.డిసెంబర్ నెలలో కూడా బాలీవుడ్ చిత్రాలు మెప్పిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ. 300 కోట్ల మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ.180 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కేవలం డిసెంబర్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇప్పటికే రెండు ఉంటే.. మరోకటి భారీ అంచనాలతో రానుంది.క్రిస్మస్ వీకెండ్లో డిసెంబర్ 31న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ విడుదల కానుంది. అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో రూమిగా అనన్య, రే పాత్రలో కార్తిక్ కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో బాలీవుడ్లో తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సౌత్ నుంచి కాంతార-2 మాత్రమే బాలీవుడ్లో సత్తా చాటింది. 2025లో సౌత్ సినిమాలను వెనక్కి నెట్టిసి తన పట్టును హిందీ సినిమా నిలిబెట్టుకుంది. -
ప్రేమంటే ఇదేరా.. ఫస్ట్ చాయిస్ ఎవరంటే?
కథ రాసుకోవడంతో సినిమా అయిపోదు, అక్కడే అసలు కథ మొదలువుతుంది. ఆ కథలోని పాత్రల ఎంపిక దగ్గరే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడుతుంటారు. విక్టరీ వెంకటేశ్ "ప్రేమంటే ఇదే రా" సినిమా విషయంలో ఇదే జరిగింది. జయంత్ సి. పరంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది.ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్యఇందులో వెంకీ సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను తీసుకున్నారు. అయితే ప్రీతి కంటే ముందు చాలామందినే సంప్రదించారు. ఆ విషయం గురించి జయంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్ ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకు కథ బాగా నచ్చి డేట్స్ కూడా ఇచ్చింది. కానీ అప్పటికే తన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తిదీంతో ఆమె ఐరన్ లెగ్ అని పక్కన పెట్టాం. అలా తనను వద్దని వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లాం. అమీషా పటేల్, రేణూ దేశాయ్‌ను స్క్రీన్ టెస్ట్ చేశాం. భూమిక చావ్లా, రీమా సేన్.. ఇలా చాలామందిని అనుకున్నాం. ఇంకో మూడునాలుగురోజుల్లో ముహూర్తం ఉందనగా రామానాయుడు స్టూడియోలో ఒంటరిగా కూర్చుని.. ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలి? అని తల పట్టుకున్నాను. ఐదు నిమిషాల్లో హీరోయిన్ ఫిక్స్సరిగ్గా అప్పుడే అనిల్ కపూర్ వచ్చి పలకరించాడు. నా సమస్య చెప్పాను. ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రీతి జింటాను తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాతి రోజే తనతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆమెతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే తనే నా మూవీ హీరోయిన్ అని ఫిక్సయ్యాను అని చెప్పాడు. అలా ప్రేమంటే ఇదే రా మూవీతో ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.రీరిలీజ్ వాయిదా1998లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్ సాంగ్స్ అందించారు. అన్నీ కలిసొస్తే నేడు (డిసెంబర్ 13న) ప్రేమంటే ఇదేరా రీరిలీజ్ అయ్యేది. కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది.చదవండి: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలు వీళ్లే -
సస్పెన్స్ థ్రిల్లర్ గా మ్యాజిక్ మూవ్ మెంట్స్
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు. హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్‌లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్‌ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..అఖిల్ - జైనబ్కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్‌తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరుహీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్‌గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిలటూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీచిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. -
పాకీజాకు ఆశ్రయం కల్పించిన కోనసీమ వాసి
ఒకప్పటి సినీ నటి వాసుకి (పాకీజా) కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె మోహన్‌బాబు హిట్ సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, మేజర్ చంద్రకాంత్, బ్రహ్మ ఇలా అనేక సినిమాలో ఛాన్స్ దక్కింది. దీంతో పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది. అయితే, ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సోషల్‌మీడియాలో కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆత్రేయపురంలోని శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమంలోనే పాకీజా ఉన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో పాకీజా కొంత కాలంగా ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే ఆమె ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం నుంచి పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆమెకు కాస్త ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని కేశవరావు కోరారు. ఇప్పటికే తన వద్ద చాలామంది వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తనను తెలుగువారికి పరిచయం చేసిన మోహన్‌బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిదని పాకీజా అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మంచు విష్ణు తన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. తన కళ్లకు శస్త్రచికిత్స చేయించారని ఆమె తెలిపారు. పాకీజాకు ఇప్పటికే చిరంజీవి ఆర్థిక సాయం చేశారనే విషయం తెలిసిందే. -
‘బ్యాడ్ గాళ్స్’ వచ్చేస్తున్నారు
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ "మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇటీవల విడుదల అయినా 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు మరియు టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి" అని తెలిపారు. -
అఖండ 2: శివుడి పాత్ర చేసిందెవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2: తాండవం. ఇది 2021లో వచ్చిన హిట్ సినిమా అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దైవభక్తిపై ఆధారపడి తీసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే సినిమాలో కొన్ని సీన్లు లాజిక్‌తో సంబంధం లేకుండా మరీ ఓవర్‌గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.అఖండ 2లో శివుడుఅయినా బాలయ్య డైలాగులు, యాక్షన్ 'అతి' లేకుండా ఉండవని అందరికీ తెలిసిందే! అయితే సినిమాలో శివుడి పాత్ర మాత్రం బాగుందంటున్నారు. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో భక్తిభావంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ముఖ్యమైన సీన్లో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీస్తున్నారు.హిందీ సీరియల్స్‌లో ఫేమస్అతడు మరెవరో కాదు హిందదీ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ, రామ్ సియాకె లవ్‌కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్ రామాయణ్, వీర్ హనుమాన్: బోలో బజ్రంగ్ బలీకీ జై, కాల భైరవ్ రక్ష శక్తిపీఠ్ కే వంటి పలు సీరియల్స్‌లో ఈశ్వరుడిగా వేషం కట్టి మెప్పించాడు.పర్ఫెక్ట్!అందుకే ఈ పాత్రకు తనైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అంచనా నిజమైంది. తరుణ్ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సీన్ వెండితెరపై బాగా పేలిందని టాక్ వినిపిస్తోంది. తరుణ్ ఖన్నా (Tarun Khanna).. చంద్రగుప్త మౌర్య సీరియల్లో చాణక్య పాత్ర పోషించాడు.చదవండి: 25 ఏళ్లుగా డిన్నర్‌కే వెళ్లలేదంటున్న బాలీవుడ్ స్టార్ -
'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. 300 కోట్లు దాటిందా..?
'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయి. అధికారికంగా 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. టీడీపీకి చెందిన ఒక యూట్యూబర్ చెప్పినట్లు 3 కోట్ల టికెట్లు తెగలేదు. అది కూడా కేవలం హైదరాబాద్‌లో అని చెప్పడం మరీ అశ్చర్యాన్ని కలిగించే అంశమే అని చెప్పాలి. ఒకవేళ ఇదే నిజమైంటే టికెట్ ధర రూ. 100 ఉన్నా కూడా మూడు వందల కోట్లు వచ్చేవి. పుష్ప-2 రికార్డ్ కూడా దాటేది.. ఇలాంటి మ్యాజిక్‌లు ఏమీ జరగవని తెలిసిందే. కానీ, మెగా హీరోలను ట్యాగ్ చేస్తూ మా బాలయ్య రేంజ్ ఇదీ అంటూ ఆ వీడియోను సోషల్‌మీడియాలో కొందరు షేర్ చేయడం విశేషం. అయితే, తాజాగా కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఫేక్ ప్రచారం ఎందుకు అంటూ పోస్టులు పెడుతున్నారు.అఖండ2 ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ 59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్ షోలతో కలిపి ఈ కలెక్షన్స్ అన్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. సాక్నిల్క్ వెబ్సైట్ ప్రకారం అఖండ సుమారు రూ. 36 కోట్ల నెట్ రాబట్టినట్లు పేర్కొంది. అంటే అధికారికంగా ప్రకటించిన గ్రాస్ కలెక్షన్స్‌కు సమానంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.75 కోట్లు, హిందీలో రూ. 50 లక్షలు, కేరళలో రూ. 3 లక్షలు, తమిళనాడులో రూ. 1.13 కోట్లు మాత్రమే ఈ మూవీ రాబట్టింది.The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025 -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
Suma Kanakala: అది మా డేటింగ్ స్పాట్..
మా కుటుంబం మెట్టుగూడలో ఉండేది.. తరచూ సంగీత్ థియేటర్లో సినిమాలు చూసేందుకు వచ్చే వాళ్లం. రాజీవ్ కనకాలతో నా డేటింగ్ స్పాట్ అదే. ఇక్కడే పాప్‌కార్న్ తింటూ, కూల్‌డ్రింక్స్ తాగుతూ టైంపాస్ చేసే వాళ్లం. – సుమ, ప్రముఖ యాంకర్ రీల్ టు హీల్..సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులో 1969లో వెలిసిన సంగీత్ థియేటర్ ఇంగ్లిష్ సినిమాలకు ఐకానిక్ వేదిక. ఎలాంటి మలీ్టఫ్లెక్స్లు లేని సమయంలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో పాటు అనేక బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 2008లో ఈ థియేటర్ మూతబడడంతో అదే స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మితమైంది. ప్రస్తుతం ఈ స్థలంలో 300 పడకల మెడికవర్ ఆస్పత్రి వచ్చింది . అప్పటి రీల్ నుంచి ఇప్పుడు రోగాలను హీల్ చేసే ఆస్పత్రిగా అవతరించింది. అప్పట్లో తెరపై అనేక మంది నటుల హీరోయిజాన్ని ప్రదర్శించిన ఈ ప్రదేశంలో.. నేడు అనేక మంది ప్రాణాలను కాపాడుతూ నిజమైన హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అయితే ఇప్పటికీ సంగీత్ ల్యాండ్ మార్క్ అలాగే స్థిరపడి ఉండగా రానున్న రోజుల్లో దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘మోగ్లీ’మూవీ రివ్యూ
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించగా.. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. నేడు (డిసెంబర్ 13) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి..మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్లో సైడ్ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్(సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సందీప్ రాజ్ గతంలో తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమా మాదిరే.. ఇది కూడా ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ లవ్‌స్టోరీ. సినిమా షూటింగ్ నేపథ్యంలో కథనం సాగుతుంది. అయితే కర్మ సిద్దాంతం టాపిక్‌ని ఈ ప్రేమకథకి యాడ్ చేయడం కొత్త ప్రయత్నం. ఇదొక్కటి తప్పితే.. మిగతా స్టోరీ అంతా రొటీనే. హీరో తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. విలన్ ఆమెపై మోజు పడడం.. చివరకు హీరో అతన్ని అంతం చేయడం.. ఇలా గతంలో చాలా ప్రేమ కథలు వచ్చాయి. మోగ్లీ కథనం కూడా అలాగే సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సందీప్ తెరకెక్కించిన కలర్ఫోటోతో పాటు జయం, వాన..లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. టేకింగ్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. బండి సరోజ్ కుమార్ పాత్రను భయంకరంగా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఎస్సై నోలన్‌కు అమ్మాయిలంటే పిచ్చి అనేది ఒకే ఒక సీన్‌తో చూపించాడు. ఆ తర్వాత మోగ్లీగా హీరోగా పరిచయ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. అతని నేపథ్యం కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సినీ నిర్మాత..హీరోయిన్‌పై మోజు పడడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ ట్విస్టు ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కథనం పరుగులు పెట్టినా.. కాసేపటికే మళ్లీ సాగదీత సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పోలీసు స్టేషన్ సీన్ ఒక్కటి బాగుంటుంది కానీ దాన్ని కూడా మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కర్మ సిద్దాంతాన్ని జోడిస్తూ.. సాగే సన్నివేశాలు బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మోగ్లీ పాత్రకి రోషన్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. తొలి సినిమాతో పోలిస్తే..ఇందులో నటన పరంగా చాలా మెచ్యూరిటీ కనిపించింది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక చెవిటి, మూగ అమ్మాయి జాస్మిత్లాగా సాక్షి మడోల్కర్ బాగా చేసింది. ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇరగదీశాడు. హీరో రేంజ్లో ఆయన పాత్రకు ఎలివేషన్స్ ఉన్నాయి. వైవా హర్ష నవ్వించడంతో పాటు కొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లను ప్రాణం పోశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
మోగ్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో రోషన్ కనకాల
‘‘ఫలానా జానర్లోనే సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నటుడిగా అన్ని రకాల జానర్ సినిమాలూ చేయాలనుకుంటున్నాను’’ అని రోషన్ కనకాల చెప్పారు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘మోగ్లీ 2025’ హానెస్ట్ లవ్‌స్టోరీ ఫిల్మ్. ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా సందీప్ రాజ్ రేసీ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఈ సినిమా కథ ముందుకు వెళుతుంది.మోగ్లీ క్యారెక్టర్, ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ కథలో కామెడీ, యాక్షన్... ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక రొమాంటిక్ లవ్‌స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమాలు కమిట్ అయ్యాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నటన పరంగా మా అమ్మ (వ్యాఖ్యాత–నటి సుమ కనకాల), నాన్న (నటుడు రాజీవ్ కనకాల)ల సలహాలను అవసరమైనప్పుడు తీసుకుంటుంటాను’’ అని తెలిపారు. -
ఛూ మంతర్!
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘ఆషికీ 3’ సినిమాతో బాలీవుడ్లో, ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హిందీలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే రెండో సినిమా ‘ఛూ మంతర్’లో నటించే చాన్స్ అందుకున్నారట శ్రీలీల.తరుణ్ దుడేజా దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుత అనన్యాపాండేను సంప్రదించారు మేకర్స్. ఆమె సరే అన్నప్పటికీ... తన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ రెండో సీజన్‌తో డేట్స్ క్లాష్ కావడంతో ‘ఛూ మంతర్’ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోనున్నారట. ఇప్పటికే మేకర్స్ సంప్రదించగా.. ‘ఛూ మంతర్’లో నటించేందుకు శ్రీలీల సుముఖంగా ఉన్నారని టాక్. -
మంచి కామెడీ రైడ్‌లా ఉంటుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జయకాంత్ మాట్లాడుతూ– ‘‘కొత్త నిర్మాతలంటే ఏదైనా లవ్‌స్టోరీ, యూత్‌ఫుల్ కంటెంట్‌తో తొలి సినిమా చేస్తుంటారు. కానీ మేం డార్క్ కామెడీ జానర్లో ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమా చేశాం. ఈ కథ విని, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేస్తానని అన్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.ఆ తర్వాత మరో యంగ్ హీరో కథ విని, ఓకే చెప్పారు. కానీ ఆ హీరో ఈ సినిమా చేయలేదు. ఈ క్రమంలో నరేశ్ అగస్త్యకు ఈ సినిమా కథ వినిపించగా, ఓకే అన్నారు. ‘గుర్రంపాపిరెడ్డి’పాత్రలో నరేశ్ బాగా నటించారు. ఈ చిత్రంలో సౌదామినిపాత్రలో ఫరియా అబ్దుల్లా మంచి రోల్ చేశారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో ఉన్నట్లుగా బ్రహ్మానందంగారు–ఫరియాల మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంది. రీసెంట్ టైమ్స్‌లో బ్రహ్మానందంగారు ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ఇదే.దర్శకుడు మురళీ మనోహర్ బాగా తెరకెక్కించారు. ఓ ఫన్ రైడ్ మూవీలా మా ‘గుర్రంపాపిరెడ్డి’ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. అమర్ బురా మాట్లాడుతూ– ‘‘తెలివిలేని వాళ్లు తెలివైనవాడిని ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. సందేశాల కోసం ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే ఫన్, కామెడీ మా సినిమాలో ఉన్నాయి. మా ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమాను 140 స్క్రీన్స్‌లో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. టికెట్ ధరలను కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ΄్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. -
డ్రాగన్ రిటర్న్స్
కొంత గ్యాప్ తర్వాత ట్రీ ఇస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ యాడ్ షూట్లో ఎన్టీఆర్ గాయపడటం, ఎన్టీఆర్ న్యూ మేకోవర్ కోసం కొంత టైమ్ పట్టడం వంటి కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దాదాపు 25 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో ముఖ్యంగా రాత్రివేళ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మరో ఓటీటీలో 'శశివదనే' స్ట్రీమింగ్
‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శశివదనే’. అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. ఇప్పటికే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో కూడా తాజాగా విడుదలైంది.'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ. -
తండ్రీ కొడుకుల ఎమోషనల్ సాంగ్
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు. దర్శకుడు నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళ్, కన్నడ, హిందీలో విడుదల కానుంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ పతాకంపై రానున్న ఈ మూవీని మూన్లైట్, థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ వంటి హాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్ కూడా దక్కింది. -
'మోగ్లీ' కోసం రోషన్ కష్టం.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్ సీన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బండి సరోజ్‌కుమార్, బండి సరోజ్, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు. -
గ్లామరస్ నిధి అగర్వాల్.. స్టన్నింగ్ ప్రియాంక చోప్రా
రెడ్ డ్రస్‌లో బోలెడంత గ్లామర్‌గా నిధి అగర్వాల్ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే అంతే'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ వేడుకలో రాశీ హొయలునల్ల చీరలో నాజుగ్గా మెరిసిపోతున్న ఈషా రెబ్బామాయ చేస్తున్న పొడుగు కాళ్ల సుందరి రకుల్చీరలో వయ్యారంగా అనుపమ పరమేశ్వరన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) -
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్ ఆచంట
వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్ అయ్యారు.అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందన్నారు. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్డ్ రిపోర్ట్ ఉందని రామ్ ఆచంట తెలిపారు. -
తొలి వార్షికోత్సవం.. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి వీడియో
సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?
రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉన్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) -
రజనీకాంత్ కళ్యాణ మండపం.. ఫస్ట్ పెళ్లి ఎవరిదంటే..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు డిసెంబర్ 12న 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఆయన నిర్మించిన కల్యాణ మండపం గురించి వైరల్ అవుతుంది. రాఘవేంద్ర కల్యాణ మండపం పేరుతో ఒక పెద్ద, విలాసవంతమైన సౌకర్యాలతో ఆయన మండపాన్ని నిర్మించారు. ఇది ఆయన సొంత నిధులతో నిర్మించారు. పలు కమ్యూనిటీ కార్యక్రమాలకు కూడా వేదికగా ప్రస్తుతం ఉపయోగపడుతుంది. ఈ మండపం విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఈ వేదికపై మొట్టమొదటి ఎవరి వివాహం జరిగింది అనే అంశం గురించి ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు.ప్రముఖ నటుడు శుభలేఖ సుదాకర్, సింగర్ శైలజల వివాహం 1989 డసెంబర్ 21న ఘనంగా జరిగింది. అయితే, వీరి పెళ్లి వేడుక రజనీకాంత్ కల్యాణ మండపంలో జరగడం విశేషం. ఆ వేదికపై జరిగిన ఫస్ట్ పెళ్లి కూడా ఈ జోడిదే కావాడం విశేషం. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో చాలా లగ్జరీగా ఈ మండపాన్ని నిర్మించినట్లు అప్పట్లో రజనీ పేర్కొన్నారు. ఫుల్ ఏసీ కండీషన్‌తో నిర్మించిన హాల్లో ఓకేసారి 2వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏసీ కళ్యాణమండపం ఇదే. వంద కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం అక్కడ ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆ కళ్యాణ మండపం ధర రూ. 30 కోట్లకు పైగానే ఉండొవచ్చు. -
హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ రోజుల్లో వైవిధ్యభరితమైన కథలు ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్ లో "జిన్" అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ చిన్మయ్ రామ్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్‌రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథనే కాదు టైటిల్ లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని, ఈ మూవీ థియేటర్స్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ అవుతుందని అంటున్నారు. -
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్ నటి
స్టార్ నటులు రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.సర్జరీ చేయించుకోమని సలహాఅయితే కెరీర్ తొలినాళ్లలో తన లుక్‌పై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్‌లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!ఫేమస్ డైరెక్టర్ మూవీఒకసారి ఓ హారర్ సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్ సినిమా కాబట్టి సరిపోయింది. తెలుగులో సినిమాలుకానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటం సాంగ్ చేసింది. జాట్‌లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) -
గేమ్‌లో సడన్‌గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్‌కు!
టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది. -
మమ్ముట్టి డిటెక్టివ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు' చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సుమారు 10నెలల తర్వాత ఓటీటీలోకి రానున్నడంతో నెట్టింట పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. తమిళ ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, మమ్ముట్టి సొంత ప్రోడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. గోకుల్ సురేష్, సుష్మిత భట్ తదితరులు నటించారు.డిసెంబర్ 19న జీ5 వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్గా నటించారు. ఒక కేసుకు సంబంధించి పూజా అనే యువతి పర్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మిస్సింగ్ కేసును సరికొత్తగా ఎలా దర్యాప్తు చేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాను తెరకెక్కించారు. పూజా అనే యువతికి, ఈ పర్సుకు ఉన్న లింక్ ఏంటి..? ఆమెను ఎవరు హత్య చేశారు..? ఇందులో ఆమె బాయ్‌ఫ్రెండ్ పాత్ర ఉందా..? వంటి అంశాలను చాలా చక్కగా చూపించారు. -
సినిమా టికెట్ల రేట్లు పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు ప్రతిసారి వివాదాస్పదంగా మారుతుంది. ప్రభుత్వ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం.. దాన్ని సవాల్ చేస్తూ ఎవరో ఒకరు కోర్టుమెట్లు ఎక్కడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుపై కూడా ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా హైకోర్టు.. ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై టికెట్ ధరలకు పెంచమని సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ తమ వద్దకు రావొద్దని కోరారు.. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరిమన్నారని మంత్రి ప్రశ్నించారు. తక్కువ ధరలు ఉంటేనే ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూస్తుందని, అందుకే ఇకపై తెలంగాణలో రేట్లను పెంచబోమని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కాగా, అఖండ 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ షోలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్యూలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. దీంతో రాష్ట వ్యాప్తంగా అఖండ 2 టికెట్ల రేట్లు యాథావిధిగా కొనసాగనున్నాయి. -
క్యాన్సర్‌తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..దయచేసి కాపాడండికొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్‌ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ వాహిని?వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్ -
హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?
'అఖండ 2' సినిమాకు తొలిరోజే హైదరాబాద్‌లో 3 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయా? సోషల్ మీడియాలో ఈ మూవీ టికెట్స్, కలెక్షన్స్ గురించి కొందరు చెబుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓ యూట్యూబ్ జర్నలిస్ట్, గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు ఏకంగా 3 కోట్ల టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పింది. చెబుతున్నది అతి అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతోంది.(ఇదీ చదవండి: కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. 'అఖండ 2' టీమ్ పై హైకోర్ట్ ఆగ్రహం)హైదరాబాద్ ప్రస్తుత జనాభా దాదాపు కోటి 20 లక్షలు. అందరూ సినిమా చూసినా సరే 3 కోట్ల టికెట్స్ సేల్ కావుగా? ఈమె మాత్రం తొలిరోజే కోట్లాది టికెట్స్ విక్రయించేశారని చెబుతోంది. సరే జనాభా విషయం కాసేపు పక్కనబెడదాం. హైదరాబాద్‌లో దాదాపు 241 థియేటర్లు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ 120 వరకు ఉండగా వీటిలో సుమారు 1.2 లక్షల సీట్లు ఉన్నాయి. మల్టీఫెక్స్‌లు దాదాపు 120 వరకు ఉండగా వీటిలో 2.2-2.5 లక్షల సీట్లు ఉన్నాయి. అంటే సిటీలో మొత్తంగా చూసుకున్నా అన్ని థియేటర్లలో మూడున్నర నుంచి నాలుగు లక్షల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాబోయే పదిరోజులకు కలిపి టికెట్స్ సేల్ చేసినా సరే 40 లక్షల కంటే దాటవు. అలాంటిది 3 కోట్ల టికెట్స్ అనడం అతికే పరాకాష్ట!'అఖండ 2' సినిమా ఎలాగైతేనేం థియేటర్లలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాలి. కానీ నిర్మాతలు అప్పుడెప్పుడో చేసిన అప్పుల కారణంగా కోర్టుల చుట్టూ మూడు నాలుగు రోజులు తిరిగి, అంతా సెటిల్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేశారు. గురువారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడ్డాయి. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షోలు వేశారు. సినిమా ఫలితం గురించి చెప్పుకొంటే అభిమానులకు మాత్రమే నచ్చగా.. మిగతా వాళ్లకు కనీసం అంటే కనీసం నచ్చట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ‘అఖండ 2: తాండవం’ సినిమా రివ్యూ) -
కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. హైకోర్ట్ ఆగ్రహం
బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' సినిమాకు ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు ఇచ్చింది. ఈ మేరకు బుకింగ్స్ ప్రారంభించారు. కానీ గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ రేట్లు తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పెంచిన ధరలతోనే టికెట్స్ అమ్మారు. షోలు పడ్డాయి. దీంతో ఇప్పుడు మరో న్యాయవాది ఈ విషయమై పిటిషన్ వేశారు. న్యాయస్థానం చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్ట్.. చిత్రబృందంపై, బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్క లేదా ? ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని బుక్ మై షోని హైకోర్టు ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో సమాధానమివ్వగా.. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారా లేదా? అని ప్రశ్నించింది. ఎందుకు మీపై కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని సీరియస్ అయింది. మధ్యాహ్నం మళ్లీ విచారణ జరగనుంది.మరోవైపు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్.. లంచ్ మోషన్ దాఖలు చేసింది. అఖండ-2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను, డివిజన్ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీలు చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్‌లో అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉతర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది.అలానే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. కోర్ట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదు? హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వులు పట్టవా? సీనియర్ అధికారులు అయి ఉండి ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారు? ప్రతిసారి ఈ మెమొలు ఇవ్వడం ఎందుకు ?? కోర్టు ఉత్తర్వులు తర్వాత విత్‌డ్రా చేయడం ఎందుకు?? అని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025 -
ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్
రీసెంట్ టైంలో సినీ ప్రముఖులు వ్యక్తిగత హక్కుల్ని పరిరక్షించుకోవడంలో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున ఇలా చేయగా.. ఈ మధ్యే ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు వీళ్ల దారిలోనే పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు.సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కులని ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని పవన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పవన్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ వేశారు. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ.. వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్!
బిగ్‌బాస్ హౌస్‌లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ పోటీలో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజనా మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్ అయిపోయాడు.భరణి కంటతడిదీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి.. తన దగ్గరున్న పాయింట్స్ సగం తనూజకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరికి పెట్టిన పలు గేమ్స్‌లో చివరకు తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తనూజ తాను డైరెక్ట్‌గా ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.తనూజ గొప్ప నిర్ణయంప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతానంది. ఈ వారం జనాలు తనను సేవ్ చేస్తేనే ఫైనల్స్‌కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనూజకు నేటి ఎపిసోడ్ మరింత ప్లస్ అవడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే అవకాశం భరణి, సంజనాలలో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది. చదవండి: నీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్ -
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03— Thiruveer (@iamThiruveeR) December 12, 2025 -
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్!
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణిని సైడ్ చేశారుఅలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్. మళ్లీ భరణి టార్గెట్అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్ అప్పీల్అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది. -
బ్యాడ్ గర్ల్స్ మూవీ.. చంద్రబోస్ రాసిన ఫుల్ వీడియో సాంగ్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. బ్యాడ్ గర్ల్స్ ఆంథమ్ పేరుతో ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..వాగ్దేవి ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశానని డైరెక్టర్ మున్నా గతంలో చెప్పారు. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలనదే కాన్సెప్ట్ అని అన్నారు. -
ఐకాన్ స్టార్‌ను కలిసిన కోర్ట్ మూవీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కోర్ట్ మూవీ టీమ్ కలిశారు. బన్నీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఐకాన్ స్టార్‌తో ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.కోర్ట్ కథేంటంటే..కాగా.. మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్‌గా ప్రియదర్శి నటించారు. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ మూవీని హీరో నాని నిర్మించారు. రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.What an Ikonic moment…@alluarjun Anna ❤️🙏🫂#Court pic.twitter.com/eBMCtTyEsQ— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 11, 2025 -
అది నా కళ్లారా చూశా.. అందుకే క్షమాపణలు: మౌగ్లీ నటుడు
సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పడంపై మౌగ్లీ నటుడు బండి సరోజ్ కుమార్ స్పందించారు. ఈ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీగా డబ్బులు ఖర్చు చేయడం నా కళ్లారా చూశానని అన్నారు. ఈ సినిమాను నా బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ఈ చిత్రానికి ఆటంకం కలగకూడదనే సెన్సార్ బోర్డ్‌కు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ నేరవేర్చానని అన్నారు. నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా బయటికొచ్చి ప్రమోషన్స్ చేశానని అన్నారు. మీరు సినిమా చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి ఆడియన్స్‌కు సూచించారు. కాగా.. మౌగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.#Mowgli సినిమా ని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాత నా కళ్ళ ముందే డబ్బును భారీగా ఖర్చుపెట్టడం చూసాను. దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా introvert behaviour నుండీ బయటకు వచ్చి ఆల్ ఔట్ ప్రమోషన్ చేశాను. Censor board వాళ్లు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ ను సినిమాకు…— Saroj (@publicstar_bsk) December 11, 2025 -
తెలివైనవాళ్లు తెలివి తక్కువ పని చేస్తే..!
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ– ‘‘శివ, నాయకుడు’ వంటి సినిమాలు చూసి, సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి కలిగింది. ఎమ్బీఏ పూర్తి చేసిన తర్వాత లండన్‌లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. వార్నర్ బ్రదర్స్ సినిమాలకు టెక్నికల్ వర్క్ చేశాను.ఆ తర్వాత ఇండియా వచ్చాను. 2010 నుంచి టాలీవుడ్లోనే ఉంటున్నాను. సంపత్ నందిగారి దగ్గర వర్క్ చేశాను. ‘సింబా’ చిత్రంతో ఆయన నన్ను డైరెక్టర్‌గా లాంచ్ చేశారు. నా దర్శకత్వంలోని తాజా సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. తెలివైనవాళ్ళు, తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశం. కథలో కొందరు తమ తెలివితక్కువ పనులతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ల ఇబ్బందులు మనకు నవ్వు పుట్టిస్తాయి.సినిమాలో మంచి ఆర్గానిక్ కామెడీ ఉంది. నాకు రెగ్యులర్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. నా తొలి సినిమా ‘సింబా’తో పోలిస్తే, ‘గుర్రం పాపిరెడ్డి’ పూర్తిగా విభిన్నమైన చిత్రం. నరేష్ అగస్త్య నటించిన గత చిత్రాలు చూసి, ఈ సినిమాలోని గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్ కోసం అతన్ని తీసుకున్నాను. బ్రహ్మానందంగారు జడ్జ్ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా నటించారు. ఇక ఈ చిత్రనిర్మాతలతోనే ఓ హారర్ మూవీ కమిట్మెంట్ ఉంది. అలాగే ఓ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. -
Akhanda 2: అఖండ 2 ట్విటర్ రివ్యూ.. నెటిజన్స్ ఏమంటున్నారు?
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘అఖడ 2- తాండవం’. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 5నే విడుదల కావాల్సింది కానీ..చివరి నిమిషంలో ఆగిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బొమ్మ పడిపోయింది.దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అఖండ 2 ఎలా ఉంది? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..తదితర విషయాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో అఖండ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్ అని కొంతమంది అంటుంటే.. అసలే బాగోలేదని ఎక్కువ మంది చెబుతున్నారు. కథ-కథనం ఊహకందేలా ఉందని, యాక్షన్ సీన్లు కూడా రొటీన్‌గా ఉన్నాయని చెబుతున్నారు. మరికొంత మంది నెటిజన్స్ అయితే బాలయ్య రిటైర్ అయిపోతే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. (Akhanda 2 Movie Twitter Review)The Cinephile in me pushed me to watch #Akhanda2Thaandavam today.. Hugely disappointed 👎.. it's just the Typical illogical movie from Joker Balayya whose only USP is Religion.Rating: ⭐✨ (1.5/5)Humbly request Joker Balayya to retire with grace.#Akhanda2 #Akhanda2Thandavam pic.twitter.com/ZW0r7Z3tqX— Shubham Tripathi (@TripathiVerse) December 11, 2025 నాలోని సినీ ప్రియుడు అఖండ 2 చూడమని ప్రేరిపించాడు. సినిమా చూసి చాలా నిరాశ పడ్డాను. బాలయ్య నుంచి వచ్చిన ఒక లాజిక్‌లెస్ మూవీ ఇది. బాలయ్య దయచేసి రిటైర్ అయిపో’ అంటూ ఓ నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.Just finished watching #Akhanda2 Ah parama shivudu Bhakthulu sanatana Dharma followers kuda kapadaleni cringe max pro teesadu Boya Lucha 🙏🙏Rating : 2/5#Akhanda2Thaandavam #Akhanda2 pic.twitter.com/gWqbYzELh0— Ran Vijay Singh (@fitcrunch30) December 11, 2025 ఇప్పుడే సినిమా చూశాను. ఆ పరమశివుడి భక్తులు, సనాతన ధర్మ ఫాలోవర్స్ కూడా ఈ సినిమాను కాపాడలేరు. క్రింజ్ సినిమా అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు. TFI first 👍👍Ok hatred pakkana pedithe #Akhanda2#Akhanda2Thaandavam genuine review Positives - Cancer advertisement for awareness ❤️Heroine introduction 🌝Limited prices at canteen 👌Interval break 15 mins ❤️🔥❤️🔥Climax end credits 🥵🥵Negatives- Balakrishna https://t.co/k7duKtEHc2 pic.twitter.com/qZ4T3nXTXy— Mike Tyson🚩 (@tyson4jsp) December 11, 2025#Akhanda2 An Underwhelming Mass Entertainer with a few mass sequences that work but the rest disappoints!The story continues from the first part with a typical Boyapati style treatment. A few mass sequences work, like the intro, interval block, and a block in the second half.…— Venky Reviews (@venkyreviews) December 11, 2025My honest review of #Akhanda2 film:The whole movie is a mixture of many mental bal movies 3)balayya gari pichi puk acting, poor screen presence diminished the scenes4) No proper care has been taken on the looks of Balayya garu 4)modda la undhi movie #Akhanda2 is a DISASTER https://t.co/F1MrspxXS9— hero (@hollarrrr_) December 11, 2025 -
పోలీస్ స్టేషన్లో పాట... ఫైట్
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ‘స్పిరిట్’ ఒకటి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో ప్రభాస్ సెట్స్‌లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీక రిస్తున్నారు సందీప్. ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను రూపొందిస్తున్నారట మేకర్స్. ఈ సెట్లో ప్రభాస్‌కు ఒక వైల్డ్ ఎంట్రీ సాంగ్ ఉంటుందట.అంతేకాదు... ఇదే సెట్లో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ పాట, ఫైట్ షూట్లో ప్రభాస్ పాల్గొంటారట. ఈ ఎపిసోడ్స్ ‘స్పిరిట్’కి హైలైట్‌గా నిలుస్తాయని ఫిల్మ్‌నగర్ టాక్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ‘సౌండ్ స్టోరీ’ పేరుతో టీమ్ ఒక యునిక్ ఆడియో టీజర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
హైదరాబాద్ టు ఢిల్లీ
చిన్న బ్రేక్ తర్వాత పెద్ది’ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘పెద్ది’ టీమ్ చిన్న బ్రేక్ తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్లోనేప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేసింది.జనవరి నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీమ్ ప్లాన్ చేసింది. ‘‘పెద్ది’ షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. -
తేదీ తారు మారు
తార్ మార్ తక్కర్ మార్ అన్నట్లు... ఈ వారంలో విడుదల కావాల్సిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల అటూ ఇటూ కావడంతో ఈ వారంలో విడుదల కావాల్సిన కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే కార్తీ ‘అన్నగారు వస్తారు’ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా శుక్రవారం (డిసెంబరు 12) విడుదల కావడం లేదు. ఈ చిత్రం కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తారు. ఇక... వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం.అన్నగారు... కమింగ్ సూన్ కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 12న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణాల వల్ల ఈ చిత్రం నేడు విడుదల కావడం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ గురువారం తెలిపారు.లాక్ డౌన్ మరోసారి వాయిదా అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాక్ డౌన్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ ప్రకటించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్లో రూపొందిన తమిళ చిత్రం ‘లాక్ డౌన్’. కరోనా సమ యంలో ఏర్పడిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను నవంబరు 23న గోవాలో జరిగిన 56వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది.అయితే చెన్నైలో వర్షాల కారణంగా 5వ తేదీ నుంచి 12కు వాయిదా వేశారు. కానీ నేడు కూడా విడుదల చేయడం లేదంటూ... రిలీజ్‌కి ఒక్క రోజు ముందు (గురువారం) లైకా ప్రోడక్షన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొన్ని పరిస్థితుల వల్ల మా ‘లాక్ డౌన్’ విడుదలను వాయిదా వేస్తున్నాం. మా మూవీ వాయిదా వల్ల ప్రేక్షకులకు, థియేటర్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది కలుగుతున్నందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని లైకా ప్రోడక్షన్స్ సంస్థ పేర్కొంది.న్యూ ఇయర్‌కి సైక్ సిద్ధార్థ శ్రీ నందు హీరోగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’. యామినీ భాస్కర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్‌తో శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ డిసెంబరు 12న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాను జనవరి 1కి వాయిదా వేశారు.వారం ఆలస్యంగా సఃకుటుంబానాంరామ్ కిరణ్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. ఈ సినిమా నేడు (డిసెంబరు 12న) రిలీజ్ కావాల్సింది. కానీ ఈ నెల 19కి వాయిదా వేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘బాలకృష్ణగారి ‘అఖండ 2: తాండవం’ డిసెంబరు 12న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో మా సినిమా రిలీజ్‌ను 19కి వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది.ఆలస్యంగా మిస్ టీరియస్ ‘రక్త కన్నీరు’ సినిమా ఫేమ్, దివంగత నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్‌తో పాటు రోహిత్ సహాని, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెల 19న రిలీజ్ చేస్తామని జై వల్లందాస్ తెలిపారు. -
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : అఖండ 2: తాండవంనటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంటరచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనుసంగీతం: తమన్ ఎస్ ఎస్సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్,సంతోష్ డేటాకేఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: డిసెంబర్ 12, 2025 సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘అఖండ 2’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Akhanda 2 Review In Telugu).ఎలా ఉందంటే.. బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో జనాలకు ఓ అంచనా ఉంది. అందులోనూ బోయపాటితో సినిమా అంటే.. లాజిక్ అనే పదాన్ని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ విషయం తెలిసి థియేటర్స్‌కి వెళ్లినా కూడా మన ఊహకు మించిన అనుభవం ఈ సినిమాలో ఎదురవుతుంది. లాజిక్స్ పక్కకి పెట్టి చూసినా కూడా సినిమాలోని కొన్ని సీన్లకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. దైవశక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దృష్టశక్తిని తీసుకొచ్చి.. చివరిలో దేశభక్తితో ముగించాడు. మధ్య మధ్యలో సనానతధర్మం గురించి క్లాసులు తప్పితే..ఒక్క సీన్ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే..ఇక ఆసక్తి ఎలా పెరుగుతుంది?ఇక యాక్షన్ సీన్ల దగ్గరకు వస్తే..ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం..ఇటు తిప్పడం తప్ప కొత్తగా ఏమి ఉండదు. పైగా కొన్ని యాక్షన్ సీన్లు చూసినప్పుడు.. ‘బాలయ్య సినిమా కదా..అంతే..అంతే’అనుకోవాల్సిందే. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా.. త్రీశూలంతో హెలికాఫ్టర్ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా... ఒక్కడే చైనా వెళ్లి ఆర్మీ సైన్యాన్ని మొత్తాన్ని చంపాలన్న.. ‘బాలయ్య సినిమాల్లోనే సాధ్యం’ అని మన మనసుకు నచ్చజెప్పుకోకపోతే.. క్లైమాక్స్ వరకు థియేటర్స్‌లో కూర్చోలేం. అసలే రొటీన్ కథ.. దానికి తోడు యాక్షన్ సీన్లు కూడా రొటీన్‌గా ఉండడంతో కథనం మొత్తం సాగదీతగా అనిపిస్తుంది.అఖండ సినిమాకు కొనసాగింపుగా కథను ప్రారంభించారు. ఆ చిత్రంలోని చిన్నపాప పెరిగి పెద్దదై.. సైటిస్ట్గా మారుతుంది. మరోవైపు అఖండ సోదరుడు బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే అయినట్లు చూపించారు. బాలయ్య 1 ఎంట్రీ సీన్‌కో ఎలివేషన్.. బాలయ్య 2 ఎట్రీ సీన్‌తో ఎలివేషన్ అవి తప్ప మొదటి అరగంట కథే ఉండదు.పైగా శివుడు ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో బాలకృష్ణ ఎలివేషన్ తప్ప.. శివుడికి ఎలివేషన్ ఉండదు. ఒకటి రెండు సీన్లలో శివుడిని పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ మొత్తం రొటీన్‌గా సాగుతూ...ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. విరామానికి ముందు వచ్చే యాక్షన్ సీన్లు బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే..నార్మల్ ప్రేక్షకులు మాత్రం ‘అరె..ఎంట్రా ఇది’ అనుకుంటారు. ఉన్నంతలో సెకండాఫ్‌లో కథనం కాస్త పరుగులు తీస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం..ఓ క్లాస్ తీసుకోవడం బోర్ అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలయ్య చెప్పే కొన్ని డైలాగులు అయితే.. అక్కడ సీన్‌తో సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు కానీ ఒక్కటి కూడా అర్థం కాదు. పైగా ఇప్పుడెందుకు ఈ డైలాగు చెప్పాడు? అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆది పినిశెట్టి పాత్ర కూడా అనవసరంగా చొప్పించినట్లు అనిపిస్తుంది. దైవశక్తి కాన్సెప్ట్ ఉంది కాబట్టి.. దుష్టశక్తి సీన్లను కూడా చూపించాలనుకొని ఆది పాత్రను క్రియేట్ చేశారనిపిస్తుంది. ఆ పాత్ర ఎపిసోడ్ మొత్తం తీసేసినా.. అసలు కథకు ఎలాంటి ఇబ్బంది కలగదు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లు కొంతమేర ఆకట్టుకుంటాయి. మొత్తంగా అఖండ 2 బాలయ్య అభిమానులకు కాస్త నచ్చవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తూ బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. బాలయ్య ఎప్పటి మాదిరే తెరపై హుషారుగా కనిపించే ప్రయత్నం చేశాడు.అయితే ఈ సారి మాత్రం తెరపై ఆయన వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిచ్చింది. ముఖ్యంగా అఖండ పాత్రలో ఆయన ముసలితనం మొత్తం బయటపడింది. ఇక యంగ్ బాలకృష్ణ పాత్ర లుక్ బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా.. ఒక్కటి కూడా అర్థం కాదు. మాస్ పాట కోసం ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకోకపోగా..ట్రోలింగ్కి మెటీరియల్‌గా మిగిలిపోయాయి. విలన్‌గా ఆది పినిశెట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాలో అనవసరం అనే ఫీలింగ్ కలుగుతుంది. సంయుక్త పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. శివుడు పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు. పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. (Akhanda 2 Movie Positives And Negatives)సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రామ్‌ప్రసాద్, సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.(Akhanda 2 Review) -
మలయాళ స్టార్‌కు మన ‘కింగ్’ అపూర్వ అభినందన
ఎంచుకున్న రంగంలో ఏ స్థాయికి ఎదిగామన్నది కాదు... ఎంత ఎదిగినా, దాన్ని తలకెక్కించుకోకుండా ఎంత హుందాగా, సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరితో ఎంత గౌరవంగా ప్రవర్తించామన్నది ముఖ్యం. అందరినీ ఆకట్టుకొనే ఆ తరహా ప్రవర్తనను అగ్ర నటుడు నాగార్జున మరోసారి ప్రదర్శించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ‘జియో – హాట్ స్టార్’ వారి ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఆయన తన సీనియర్ నటుడు – మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో, మరో అగ్ర తమిళ నటుడు విజయ్ సేతుపతితో కలసి వేదిక పంచుకున్నారు. ఆ సందర్భంగా వేదిక మీదకు వస్తూనే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? పక్కనే ఉన్న విజయ్ సేతుపతి చేతి నుంచి చొరవగా ముందుగా మైకు తీసుకొని, మోహన్ లాల్‌ను అభినందించడం.క్లాప్స్ కొట్టడం తప్ప మరేమీ చేయలేం!మలయాళ చిత్రాల్లోనే కాక తెలుగు, హిందీ సహా వివిధ భాషల్లో నటించిన నటుడు మోహన్‌లాల్‌ను ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, సత్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలిసారిగా వ్యక్తిగతంగా కలుస్తున్న మోహన్‌లాల్‌ను సభాముఖంగా నాగార్జున ఆత్మీయంగా అభినందించారు. “వెండితెర మీద ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల అరుదైన నటుడు మోహన్‌లాల్ గారు. ఏ తరహా పాత్ర అయినా సరే, అందులోకి పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా పండిస్తారు. ఆయన ఏదైనా చేయగలరు. అలాంటి అభినయాన్ని చూసినప్పుడు చప్పట్లు కొట్టి, హర్షం వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయలేము” అంటూ నాగ్ తన మనసులో మాట ఆత్మీయంగా పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువా, పుష్పగుచ్ఛంతో మోహన్‌లాల్‌ను సత్కరించారు.అడిగినా... అక్కినేని చెప్పలేదట!ఆ సందర్భంగా నాగార్జున తన తండ్రి – సీనియర్ అగ్ర నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుతో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. సినీ రంగంలో కృషి చేసినవారికి భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత పురస్కారమైన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ గారు అన్ని విధాలా అర్హులైన నటుడు. ఈ అవార్డు ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే, కొన్నేళ్ళ క్రితం స్వయంగా మా నాన్న గారికి వచ్చింది. ఆ తరువాత ఫాల్కే అవార్డు విజేత ఎంపిక కమిటీలో మా నాన్న గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఒకసారి ఆ కమిటీ మీటింగ్ జరిగి, ఫాల్కే అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించారు. ఇంకా పేరు బయటకు ప్రకటించాల్సి ఉంది. ఇంటికొచ్చాక నాన్న గారితో, ఈసారి ఫాల్కే అవార్డు ఎవరికిస్తున్నారని అడిగాను. ఎంత అడిగినా, ఆయన ఆ సంగతి చెప్పలేదు. గోప్యంగానే ఉంచారు. అంత నిజాయతీగా, నిఖార్సుగా ఇచ్చే అవార్డ్ గనకనే ఫాల్కే అవార్డ్ రావడమంటే అంత గొప్ప. అందుకే, మోహన్‌లాల్ గారికి ఈ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని నాగార్జున పాత సంగతులు ప్రస్తావించారు.ఆ ఆటోగ్రాఫ్‌కు ఫ్రేమ్ కట్టుకున్న విజయ్ సేతుపతి!వేదికపై ఉన్న తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం మోహన్ లాల్‌కు సత్కారం చేయడమే కాక, భావోద్వేగానికి గురవుతూ, “మోహన్‌లాల్ గారికీ, ఆయన నటనకూ నేను వీరాభిమానిని. ఏ పాత్ర ఇచ్చినా ఆయన అంత సునాయాసంగా ఎలా చేస్తారో అర్థం కాదు. వీరాభిమానిగా నేను ఆయన దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను భద్రంగా ఫ్రేమ్ కట్టి, ఇంట్లో దాచుకున్నాను. అలాంటి గొప్ప నటుడికి ఫాల్కే అవార్డ్ దక్కడం ఎంతో ఆనందం. ఆయనతో కలసి ఇలా వేదిక పంచుకోవడం, ఆయన ఎదురుగా మాట్లాడడం ఓ చెప్పలేని అనుభూతి” అని వ్యాఖ్యానించారు.అనుకోని రీతిలో జరిగిన ఈ ఆత్మీయ అభినందనకు మోహన్‌లాల్ సైతం అంతే వినయంగా, ఆత్మీయంగా స్పందించారు. తనను అభినందించిన తోటి నటులకు కృతజ్ఞతలు చెబుతూనే, అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఏయన్నార్‌తో కలసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయంటూ, “బాలకృష్ణ హీరోగా దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో తీసిన ‘గాండీవం’ (1994) చిత్రంలో ఆయనతో కలసి నేను ఓ పాటలో (‘గోపబాలుడొచ్చెనమ్మ గోకులానికి...’ పాట) నటించాను. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఏయన్నార్ గారి నటన, ప్రవర్తన నేను మర్చిపోలేను. ఎందరికో స్ఫూర్తిదాత అయిన ఆయన నాకు మంచి ఆత్మీయులయ్యారు” అని మోహన్‌లాల్ వివరించారు. ఇలా పరస్పర గౌరవం, ఆత్మీయ అభినందనలు చూసి, ప్రేక్షకులు పెద్దయెత్తున హర్షధ్వానాలు చేశారు. - రెంటాల జయదేవ -
శారీలో ఉప్పెన భామ అందాలు.. బ్లాక్ డ్రెస్‌లో మానుషి చిల్లర్!
బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర వింటేజ్ లుక్..ఉప్పెన భామ కృతి శెట్టి శారీ అందాలు..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న మెహరీన్..బ్లూ శారీలో అనసూయ అందాలు..శాలీ మొహబ్బత్ ప్రమోషన్స్‌తో బిజీగా రాధికా ఆప్టే..బ్లాక్ డ్రెస్‌లో బొమ్మలా అందాల భామ మానుషి చిల్లర్..వేకేషన్ ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్.. View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోతాం'..ఆసక్తిగా పురుష పోస్టర్!
పవన్ కళ్యాణ్ బత్తులను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ పురుష. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారుత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, క్యాప్షన్స్ చూస్తుంటే ఫుల్‌గా నవ్వించే కథతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ ఫుల్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్ర్లలో నటించారు. -
ఈ ఫోటోలోని సిస్టర్స్.. టాలీవుడ్లో ఫేమస్ సింగర్స్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులను మళ్లీ వస్తే బాగుండని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. బాల్యం, స్కూల్ లైఫ్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకోని వారు ఉండరేమో. అంతటి మధురమైన చిన్ననాటి చిలిపి పనులు తలచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. బాల్యం నాటి మన ఫోటోలు చూస్తే మనమేనా అన్న డౌట్ వచ్చేస్తుంది. అలాంటి అరుదైన ఫోటోలు దొరికితే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.అలాంటి మధురమైన జ్ఞాపకాలను టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ పోస్ట్ చేసింది. చిన్నప్పుడు అక్క మంగ్లీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇది చూసిన అభిమానులు వావ్ బ్యూటీఫుల్.. నేచురల్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ.. అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ అయింది. మంగ్లీతో పాటే సిస్టర్ ఇంద్రావతి చౌహన్ జానపద గాయని కావడం విశేషం. ఇద్దరు సిస్టర్స్ సింగర్స్‌గా తెలుగు వారిని తమ అలరిస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Indravathi Chauhan (@indravathi__chauhan) -
ఫ్రైడే ఓటీటీ మూవీస్ ధమాకా.. ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం మొదలైందంటే చాలు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల సందడే సందడి. ఇక ఈ వారంలో బిగ్ స్క్రీన్‌పై అలరించేందుకు అఖండ-2, మౌగ్లీ చిత్రాలు వచ్చేస్తున్నాయి. గత వారమే రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్ చేయడం లేదు. కేవలం మౌగ్లీ మాత్రమే అఖండతో పోటీ పడనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ కాంత మాత్రమే ఈ ఫ్రైడే కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇది మినహాయిస్తే తెలుగులో 3 రోజేస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏ నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12జియో హాట్స్టార్అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12అమెజాన్ ప్రైమ్టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12ఆహా3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12 జీ5సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12సన్ నెక్స్ట్అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12ఆపిల్ టీవీ ప్లస్ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12మనోరమ మ్యాక్స్ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12 -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
మౌగ్లీ నటుడు కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్లో పేర్కొంది.మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్‌లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.People Media Factory extends its sincere apologies to the Censor Board and the Censor Officer for the unfortunate incident yesterday.An unintended remark was made by our actor, Bandi Saroj, regarding the Censor Board and the Officer’s reactions. We wish to clarify that we hold… pic.twitter.com/rXfqTjqPU3— People Media Factory (@peoplemediafcy) December 11, 2025 -
నాపై దారుణమైన ట్రోల్స్.. వారికి నా సమాధానం ఇదే: ప్రగతి
ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులను నవ్వించిన టాలీవుడ్ నటి ప్రగతి(Pragathi) క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. సినిమాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ క్రీడాకారిణిగా మారిపోయింది. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. దీంతో టాలీవుడ్ మొత్తం ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆమె టాలెంట్‌ను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.తాజాగా ప్రగతి తెలుగు వెబ్ సిరీస్ 3 రోజెస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆమె పంచుకున్నారు. ఎక్కడ ట్రోల్ చేస్తారోననే భయంతో తాను మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రగతి తెలిపారు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది తనను ట్రోల్ చేశారని గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు వచ్చాయని అన్నారు. జిమ్‌కి చీరలు కట్టుకుని వెళ్లలేం కదా.. అందరూ అలా తిడుతుంటే చాలా బాధపడ్డానని తెలిపింది. నీకు ఈ వయసులో అవసరమా? అని చాలామంది అన్నారని ప్రగతి ఆవేదన వ్యక్తం చేసింది. (ఇది చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!)నాపై ఆ ట్రోల్స్ చూసి తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డానని.. నా ఎదిగిన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని బాధపడ్డానని ప్రగతి తెలిపింది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేశానని.. ట్రోల్స్ చేసిన వారికి పతకాలతోనే సమాధానం ఇచ్చానని ప్రగతి కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు నా పతకాలను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశానికి ఇంత మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని అన్నారు. తన నెక్ట్స్ మూవీ తమిళంలో చేస్తున్నానని ప్రగతి వెల్లడించారు.ప్రగతి మాట్లాడుతూ..'నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నేను సినిమాలు ఎప్పటికీ మానేయను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీనే. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఎప్పటికీ వదిలుకోను. తుదిశ్వాస వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అలా సెట్లోనే కన్నుమూయాలని కోరుకుంటా' అని అన్నారు. -
అఖండ-2 నిర్మాతలకు భారీ షాక్..!
అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తాజాగా హైకోర్ట్ ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసింది. దీంతో అఖండ-2 నిర్మాతలు ప్రీమియర్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆడియన్స్‌లో సస్పెన్స్ నెలకొంది. -
‘అఖండ 2’ సినిమాకు మరో భారీ షాక్.. హైకోర్టులో పిటిషన్!
మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సిన అఖండ-2 కు ఊహించని షాక్ తగిలింది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.కాగా, ఇప్పటికే అఖండ 2(Akhanda 2 ) రిలీజ్ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్ కమల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ప్రీమియర్స్‌ని రద్దు చేయడంతో పాటు టికెట్ల రేట్ల పెంపుకు ఇచ్చిన మోమోని సస్పెండ్ చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. మరికాసేపట్లో హైకోర్టు(Telangana High Court) దీనిపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.అఖండ 2 విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. -
ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలివే!
సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రామాణికమైన వేదిక Imdb..2025 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించింది.1) టైటిల్: ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్నటీనటులు: బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్దర్శకత్వం: ఆర్యన్ ఖాన్ (షారుఖ్ ఖాన్ కుమారుడు)ఓటీటీ: ‘నెట్‌ఫ్లిక్స్’2) టైటిల్: బ్లాక్ వారెంట్నటీనటులు: జహాన్ కపూర్, అనురాగ్ ఠాకూర్, పరం వీర్ సింగ్, రాహుల్ భట్దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ ఓటీటీ : 'నెట్ ఫ్లిక్స్'(7 ఎపిసోడ్స్)3) టైటిల్: పాతాళ్‌లోక్ సీజన్-2నటీనటులు: జైదీప్ అహ్లవత్, గుల్‌పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్దర్శకత్వం: అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో4) టైటిల్:పంచాయత్ సీజన్ 4నటీనటులు: జితేంద్ర కుమార్, నేనా గుప్తా,రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్ఓటీటీ:'అమెజాన్ ప్రైమ్ వీడియో5) టైటిల్: మండల మర్డర్స్నటీనటులు: వాణీ కపూర్, వైభవ్ రాజ్, సుర్విన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, జమీల్‌ఖాన్, అదితి సుధీర్దర్శకత్వం: గోపి పుత్రన్, మనన్ రావత్ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్6) టైటిల్: ఖాఫ్నటీనటులు: మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి దర్శకత్వం: పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో7) టైటిల్: స్పెషల్ ఓపీఎస్2నటీనటులు: కేకే మేనన్, తాహిర్ రాజ్ బాసిన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త, సయామీ ఖేర్, ప్రకాశ్రాజ్దర్శకత్వం: నీరజ్ పాండేఓటీటీ:జియో హాట్‌స్టార్8) టైటిల్: ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)నటీనటులు: జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ దర్శకత్వం: డెబాత్మ మండల్, తుషార్ కాంతి ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్9) టైటిల్: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3నటీనటులు: మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, షరీబ్ హష్మి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, సందీప్ కిషన్దర్శకత్వం: రాజ్ అండ్ డీకే, సుమన్ కుమార్, తుషార్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో10) క్రిమినల్ జస్టీస్ 4నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్దర్శకత్వం : రోహన్ సిప్పిఓటీటీ: హాట్స్టార్టాప్ 10 సినిమాలివేసయారామహావతార్ నరసింహఛావాకాంతారా: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1కూలీడ్రాగన్సితారే జమీన్ పర్దేవారెయిడ్ 2లోక ఛాప్టర్ 1: చంద్ర -
మా తాత భూమి కబ్జా చేసి బెదిరిస్తున్నారు: ఎస్వీ రంగారావు మనవడు
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. తెలుగు సినిమా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని ఆయన మనవడు జూనియర్. ఎస్వీ రంగారావు ప్రెస్‌మీట్ పెట్టి మరీ బయటపెట్టాడు. పోలీసులు కూడా తనని బెదిరిస్తున్నారని చెప్పి వ్యక్తం చేశాడు.ఎస్వీ రంగారావు మనవడు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ శాంతి నగర్లో 1960ల్లో రంగారావు ఓ స్థలాన్ని కొనుగోలు చేసి భవంతి కట్టుకున్నారు. ఆయన తదనంతరం ఇది వారసులకు చెందింది. అయితే 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి దీన్ని అద్దెకు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత సరిగా అద్దె కట్టకపోవడంతో రంగారావు కూతురు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో శ్రీనివాస్.. వెంటనే బిల్డింగ్‌ని ఖాళీ చేయడంతో పాటు ఇవ్వాల్సిన అద్దె కూడా చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.(ఇదీ చదవండి: 'అన్నగారు' రావట్లేదు.. కార్తీ సినిమా మళ్లీ వాయిదా?)ఈ విషయమై సదరు శ్రీనివాస్.. హైకోర్ట్‌ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత కాలంలో ఫోర్జరీ చేసి ఈ స్థలం తనదే అని వాదించసాగాడు. అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం సదరు స్థలంలో ఉన్న భవంతిని కూల్చి కొత్తగా బిల్డింగ్ కడుతున్నారని తెలిసి ఎస్వీ రంగారావు మనవడు మళ్లీ కోర్ట్ని ఆశ్రయించాడు. దీంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. అయినా సరే శ్రీనివాస్.. నిర్మాణ పనులు చేస్తున్నారని, దీని గురించి అడిగేందుకు వెళ్తే తనని బెదిరిస్తున్నాడని ఎస్వీ రంగారావు మనవడు చెప్పుకొచ్చాడు.కొన్నిరోజుల క్రితం కూడా ఇదే విషయమై తనని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కి పిలిచారని, అక్కడికి వెళ్తే అడిషనల్ డీజీపీ సి.ఆనంద్.. తనని ఆ స్థలంలో అడుగుపెట్టడానికి వీల్లేదని అన్నారని ఎస్వీ రంగారావు మనవడు పేర్కొన్నాడు. మా తాత ఎస్వీ రంగారావు కొన్న భూమిని ఒక వ్యక్తి అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మాపై బెదిరింపులకు దిగుతున్నాడని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రంగారావు మనవడు ఆవేదన వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి) -
'అన్నగారు' రావట్లేదు.. కార్తీ సినిమా మళ్లీ వాయిదా?
గతవారం సరిగ్గా థియేటర్లలో విడుదలకు కొన్ని గంటలు ఉందనగా బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు.. గతంలో తీసుకున్న డబ్బుని ఈరోస్ సంస్థకు సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం. అయితే కోర్ట్ బయటే సమస్య పరిష్కారమైంది. డబ్బంతా నిర్మాతలు చెల్లించడంతో అఖండ సీక్వెల్‌కి మార్గం సుగమమైంది. సేమ్ దీనిలానే కార్తీ చిత్రం కూడా రిలీజ్‌కి రోజు ముందు వాయిదా పడింది.కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వా వాతియర్'. తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాల్సింది. కానీ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి)దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని గతవారమే ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి జ్ఞానవేల్ రాజా.. ఈ మొత్తాన్ని రేపటిలోపు(డిసెంబరు 12) కడతారా లేదా అనేది చూడాలి? చూస్తుంటే 'అన్నగారు వస్తారు' వాయిదా పడినట్లే అనిపిస్తుంది. అన్నీ క్లియర్ అయిపోతే శనివారం (డిసెంబరు 13) విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.కార్తీ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తీరా ఇప్పుడు విడుదల చేసేందుకు సిద్ధమైతే పాత అప్పుల కారణంగా కోర్ట్.. రిలీజ్‌పై స్టే విధించింది. మరి ఇప్పుడు నిర్మాత జ్ఞానవేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి) -
రోషన్‌ని చూస్తుంటే ‘చిరుత’లో చరణ్‌ని చూసినట్లుంది: రానా
‘‘మోగ్లీ 2025’ సినిమాలో రోషన్ ను చూస్తుంటే, ‘చిరుత’ సినిమాలో చరణ్‌ని చూసినట్లు నాకు అనిపించింది. రోషన్‌కి ఆల్ ది బెస్ట్. ‘కలర్‌ఫోటో’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ‘మోగ్లీ 2025’ సినిమా తీయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని సందీప్ బాధపడుతున్నాడు. కానీ, సమయం గడిచిపోతుంది. సినిమాలు నిలిచిపోతాయి. ‘కలర్‌ఫోటో’లానే ‘మోగ్లీ 2025’ సినిమా కూడా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హీరో రానా. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా, హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మోగ్లీ 2025’(Mowgli Movie). సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా ఈ సినిమా టికెట్‌ను కొనుగోలు చేయగా, మరో అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత మారుతి ‘మోగ్లీ 2025’ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రోషన్ మాట్లాడుతూ–‘‘ప్రతి మనిషిలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రేమ కోసం ఈ మోగ్లీ చేసిన యుద్ధాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘అమెరికా షెడ్యూల్లో మాకు కేటాయించిన థియేటర్స్ మళ్లీ మాకు దొరకవు కనుక, మరొక రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఓ పెద్ద సినిమాతో పాటు వస్తున్నాం’’అని తెలిపారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మా సినిమా దారి తప్పదు. ఒక్క శాతం కూడా మిస్ కాదు’’అని సందీప్ రాజ్ అన్నారు. నటులు బండి సరోజ్ కుమార్, హర్ష మాట్లాడారు. -
మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి
సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏదోలా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతూనే ఉంటుంది. నిర్భయంగా తన అభిప్రాయాల్ని చెప్పే ఈమెపై ట్రోలింగ్స్, విమర్శలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఈమె ఫొటోని మార్ఫింగ్ చేసిన కొందరు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సైకోలతో మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.(ఇదీ చదవండి: కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)'ఈరోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన నా చిత్రాన్ని తీసుకొని పోలీసులను ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది సమస్య కాదు. మా కుటుంబాన్ని వేధించడానికి గత 8-10 వారాలుగా డబ్బు చెల్లించి ఇలాగే చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారు. ఈ సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి' అని చిన్మయి చెప్పుకొచ్చింది.పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే ఇలాంటి అబ్బాయిలకు అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలా? అని చిన్మయి ప్రశ్నించింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడొద్దని, కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్మయి సూచించింది. ఇదే కాదు గత నెలలో ఈమె భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ద గర్ల్‌ఫ్రెండ్' మూవీ రిలీజైంది. అప్పుడు కూడా చిన్మయి, రాహుల్‌పై దారుణమైన విమర్శలు వచ్చాయి.(ఇదీ చదవండి: తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఇక హైదరాబాద్‌లో ఐఫా
తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా)తో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల పాటు ఐఫా వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా వేడుకలకు హైదరాబాద్ వరుసగా మూడేళ్ల పాటు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా మూడేళ్లపాటు ఐఫా ఉత్సవం నిర్వహించడం ద్వారా దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా, సినిమా ఆధారిత పర్యాటకం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ కేంద్రంగా మా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం అని చెప్పుకొచ్చారు.గత 25 ఏళ్లుగా గ్లోబల్ కల్చరల్ సూపర్ బ్రాండ్‌గా వెలుగొందుతున్న ఐఫా.. లండన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్, సింగపూర్, అబుదాబి, మాడ్రిడ్ లాంటి ప్రపంచ రాజధానులలో ఓ ఐకానిక్ లెగసీని నిర్మించింది. అలాంటిది రాబోయే మూడేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఈవెంట్స్ జరగబోతుండటం చాలా విశేషం అని చెప్పొచ్చు. -
‘అఖండ–2’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న విడుదల కానున్న ‘అఖండ–2’సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అను మతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ఆదేశా లు జారీ చేసింది. 12వ తేదీ నుంచి 14 వరకు 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకోవచ్చని స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. 20 శాతం ఆదాయం ఫిల్మ్ వర్కర్ల సంక్షేమానికి.. పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు జమ చేయాలని థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని నిర్వహించడానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఖాతా తెరుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించే ప్రకటనలు తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. -
మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి
ప్రభాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల సంక్రాంతి బరిలో ఉంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడు మారుతి వద్దని అభిమానులు గోలగోల చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ దర్శకుడిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే అలా తిట్టకపోతే తాను 'రాజాసాబ్' తీసేవాడిని కాదని మారుతి చెప్పుకొచ్చాడు.'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ రెండో సీజన్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు వచ్చిన మారుతి.. తనపై వచ్చిన విమర్శల గురించి, ట్రోల్స్ గురించి ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇప్పుడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొన్న నటి ప్రగతి.. రీసెంట్‌గానే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కూడా గెలుచుకుంది. ఈమె గురించి కూడా మారుతి మాట్లాడారు.(ఇదీ చదవండి: రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?)'నటి ప్రగతి గారికి ఇదో ఎమోషనల్ డే అని అర్థమైంది. మేడమ్.. మిమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారని ఏం అనుకోవద్దు. ఎందుకంటే అలా తిట్టకపోతే మీరు గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు. నేను 'రాజాసాబ్' తీసేవాడిని కాదు. ట్రోలర్స్ నిజంగా పనులన్నీ మానుకుని మనకోసం టైమ్ కేటాయించి, పాజిటివిటీ అంతా చంపుకొని, బ్రెయిన్‌లోకి నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని నాలుగు తిట్లు తిడుతున్నారు. పాపం వాళ్ల దగ్గరున్న నెగిటివిటీనే పంచుతున్నారు''వాళ్ల దగ్గర నాలుగు బూతు మాటలు.. నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయి. అవే పంచుతున్నారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ చూసినప్పుడు.. ఒరేయ్, ఇది తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదా అనుకుంటాను. ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. మీరు కూడా మిమ్మల్ని తిట్టేవాళ్లని ఎతుక్కోండి. లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే, మేము ఎదుగుతూ ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నెగిటివ్ కామెంట్స్ చేసే వారందరికీ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము.. మేము సాధించలేం' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో మిస్ అవుతున్న 'నవ్వు') -
వానర వస్తున్నాడు
అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘వానర’. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించగా, నందు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్. -
సస్పెన్స్... థ్రిల్
అబిద్ భూషణ్, రోహిత్ సహాని హీరోలుగా, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘మిస్ టీరియస్’ ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదట నటించిన సినిమా ‘శ్రీ తాతావతారం’. ఆ సినిమాలో హీరో నరేశ్‌గారి కాలేజ్ ఫ్రెండ్స్ పాత్రల్లో నేను, మహి కోమటిరెడ్డి కలిసి నటించాం. ‘మిస్ టీరియస్’లో నేను నటించకపోయినప్పటికీ మహి వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని కోరారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని మహి కోమటిరెడ్డి చెప్పారు. ‘‘150 థియేటర్స్‌లో మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు జై వల్లందాస్. -
డల్లాస్‌లో హీరోయిన్ శ్రీలీల చిల్.. బ్లాక్ డ్రెస్‌లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అందాలు..!
డల్లాస్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి..బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ భామ ఆలియా భట్ అందాలు..టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాంటి లుక్స్..కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోదావరి టూర్..బ్యూటీఫుల్ డ్రెస్‌లో ప్రియమణి హోయలు..డిఫరెంట్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ పిక్స్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
అఖండ-2 రిలీజ్.. మరో టీజర్ వచ్చేసింది
బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో ఈ శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్ పేరుతో విడుదలైంది.తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు. -
అఖండ-2 రిలీజ్.. బన్నీ వాసు కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ చిత్రాన్ని వేశారు. ఈనెల 5న విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 12న దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్ రాజ్ మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్ మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్‌కు అడ్డంకిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.ఈ ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్ చేశారు.అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసు వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్‌పై రావాల్సిన ఈ చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.ఇండస్ట్రీ లో అందరు తప్పక "Jai Balayya" అని తప్పుకుంటున్నారా ?"Highway మీద పెద్ద vehicles కి దారి ఇవ్వకపోతే మనకే risk" - #BunnyVas#Akhanda2 #Balakrishna pic.twitter.com/p0ujehI0kR— Daily Culture (@DailyCultureYT) December 10, 2025 -
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి
‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.⇢ నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.⇢ కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.⇢ డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.⇢ నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.⇢ హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.⇢ నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.⇢ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.⇢ ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి. -
వెంకీమామ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్‌కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా వెంకీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్‌డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.#PremanteIdera re-release postponed!Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025 -
బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ.. లుక్ అదిరింది!
బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్‌బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. -
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. హీరోయిన్గా ఏకంగా మిస్ యూనివర్స్..!
తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కమెడియన్ సత్య. బ్రహ్మనందం, అలీ తర్వాత టాలీవుడ్‌కు దొరికిన ఆణిముత్యం ఆయనే. ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సత్య.. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సత్య నటిస్తోన్న తాజా చిత్రం జెట్లీ. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇవాళ రియా సింగా పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీతోనే రియా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా-2024 టైటిల్ విన్నర్ కావడం విశేషం. కమెడియన్ సత్య సరసన ఏకంగా మిస్ యూనివర్స్ హీరోయిన్గా కనిపించడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. జైపూర్‌కు చెందిన రియా సింగా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. మిస్ యూనివర్స్ ఇండియా కంటే ముందు.. ఆమె మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥 Introducing #RheaSingha, landing from the world of #JETLEE ✈️Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳A @RiteshRana's turbulence 🛫Starring #Satya, #RheaSingha, @vennelakishoreProduced by… pic.twitter.com/1h0pYj6I6T— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025


