cricket news
-
పాకిస్తాన్ క్రికెటర్లకు సువర్ణావకాశం
నలుగురు పాకిస్తాన్ క్రికెటర్లు లక్కీ ఛాన్స్ కొట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ దేశవాలీ సీజన్ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్ అబ్బాస్, సుఫియాన్ ముఖీమ్‌ను డెర్బీషైర్.. ఉసామా మిర్‌ను వార్సెస్టర్‌షైర్ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్ నవాజ్ టీ20 బ్లాస్ట్ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి పొందాడు. వీరందరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్, ఉసామా మిర్‌కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్ ముఖీమ్ జూన్ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్ అబ్బాస్‌కు సీజన్ మొత్తానికి అనుమతి లభించింది.స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మొహమ్మద్ నవాజ్, స్పిన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ T20 బ్లాస్ట్‌లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్ బౌలర్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు. నవాజ్, ముఖీమ్, ఉసామా మిర్ T20 బ్లాస్ట్‌లో ప్రతిభను చూపి, పాకిస్తాన్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం. -
జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి ఒక కీలక విషయం బయటకొచ్చింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు జైస్వాల్ క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పంచుకున్నాడు. నిజానికి ముంబైతో మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జైస్వాల్ భారీ షాట్లు ఆడాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌కు చిన్న క్రాక్ వచ్చింది. బ్యాట్‌కు క్రాక్ వచ్చిన విషయాన్ని జైస్వాల్ కోచ్ విక్రమ్‌కు చూపించాడు. అయితే విక్రమ్ మాత్రం ఏం పర్లేదు.. విరిగిన బ్యాట్‌తో ఆడితే ఫలితం బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై విక్రమ్ రాథోర్ స్పందిస్తూ.. ‘నిజానికి జైస్వాల్ బ్యాట్‌కు చిన్న పగులు మాత్రమే వచ్చింది. ఎంత గట్టి షాట్లు ఆడినా బ్యాట్‌కు తట్టుకునే సామర్థ్యముంది. అందుకే నేను జైస్వాల్‌ను అదే బ్యాట్‌తో బరిలోకి దిగమని చెప్పాను. అతడి నమ్మకమే అతడి బలం.’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పుంచుకోవడంతో వైరల్‌గా మారింది. అలా జైస్వాల్ చిన్నపాటి క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఇరగదీశాడు. అసలే ముంబై ఇండియన్స్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న జైస్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77), సూర్యవంశీ (39), పరాగ్ (20) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు! -
అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ దూకుడు మాములుగా లేదు. అన్ని జట్లతో పోలిస్తే రాజస్తాన్ తుది జట్టులోని స్వదేశీ ఆటగాళ్లలో అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయినప్పటికీ యువరక్తం కావడంతో జోష్ రెండింతలు అయినట్లుంది. జట్టులో రవీంద్ర జడేజా మాత్రమే టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. జడేజాను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లకు అనుభవం తక్కువే. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టులో కూడా ఒకరిని మించి మరొకరు చెలరేగిపోతుండడం వారికి సానుకూలాంశంగా మారింది. జైస్వాల్ నుంచి ఆర్చర్ దాకా బ్యాటింగ్ చేసే వాళ్లే ఉండడం రాజస్తాన్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సమతుల్యతతో ఉండడం కలిసొచ్చే అంశం.భయపెడుతున్న వైభవ్..52, 31, 39.. ఇవి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన పరుగులు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ అతడి దనాధన్ బ్యాటింగ్ ప్రభావం ప్రత్యర్థి జట్లపై గట్టిగానే చూపిస్తోంది. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే పరమావధిగా పెట్టుకున్నసూర్యవంశీ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి తన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లో బుమ్రా, దీపక్ చాహర్ పదునైన బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు అభినందనీయమని చెప్పొచ్చు.జైస్వాల్ మోత..సాధారణంగా యశస్వి జైస్వాల్ చూడ్డానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ అతడి ఆటతీరు మాత్రం అసాధారణమని చెప్పొచ్చు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. రాజస్తాన్‌కు ఓపెనర్లిద్దరే సగం బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చే ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో జురేల్ 75 పరుగుల ఇన్నింగ్స్ రాజస్తాన్ గెలుపుకు కారణమైంది.పరాగ్ నాయకత్వం..జట్టు విజయాలు సాధిస్తుంటే తప్పులు పెద్దగా కనిపించవు. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో మెరుపులు లేనప్పటికీ అతని కెప్టెన్సీలో రాయల్స్ చెలరేగిపోవడం అతని వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం లేదు. నాయకుడిగా మూడు మ్యాచ్‌ల్లో సక్సెస్ అయిన పరాగ్ బ్యాటింగ్‌లోనూ అదరగొడితే రాయల్స్‌కు తిరుగు లేనట్లే. హెట్‌మైర్, జడేజా వంటి అనుభవజ్ఞులు తమదైన రోజున ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బౌలింగ్‌లోనూ అదుర్స్..బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ రాజస్తాన్ అదుర్స్ అనిపిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లో ఉండడం, స్పిన్నర్లు రవి బిష్ణోయ్, జడేజాల స్పిన్ మాయజాలాం, నండ్రీ బర్గర్ సూపర్ బౌలింగ్, తుషార్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర ఉండడంతో అంతా మ్యాచ్ విన్నర్లుగానే కనిపిస్తున్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి తొలి టైటిల్ ఎగరేసుకుపోయిన రాజస్తాన్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. శాంసన్ వచ్చిన తర్వాత రాయల్స్ ఆటతీరు మారడమే గాక 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పుడు శాంసన్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న పరాగ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ సీజన్ మొత్తం ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026చదవండి: కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి! -
కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేకేఆర్‌కు ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకసారి భారీ స్కోరు చేసి కూడా గెలవకపోవడం, మరొకసారి తక్కువ స్కోరుకే ఆలౌటయ్యి పరాజయం మూటగట్టుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి శుభారంభం చేయాలనుకున్న కేకేఆర్ ఆశలపై వరుణుడు అమాంతం నీళ్లు చల్లాడు. సీజన్లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కూడా పడకుండానే రద్దవ్వడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్‌ను ఉద్దేశించి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా శ్రేష్ట్ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది. 'మా పంజాబీల మనసు చాలా పెద్దది. అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చేశాం. బతికి బట్టకట్టండి’ అని పంజాబీలో వ్యాఖ్యానిస్తూ డ్యాన్సులు చేసింది. అయితే శ్రేష్ఠ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రేష్ఠ వ్యాఖ్యలపై కేకేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ అన్న కెప్టెన్సీలోనే కేకేఆర్ విజేతగా నిలిచిందన్న సంగతి మరిచిపోయారా! అంటూ ట్రోల్ చేశారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్‌కు పోయింది. దాంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే శ్రేష్ట అయ్యర్ కేకేఆర్‌ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది.తాజాగా శ్రేష్ఠ అయ్యర్ తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చింది. ‘నేను ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. ఫన్నీ తరహాలోనే పెట్టాను. ఆటను ఆటగానే చూడండి. నాకు ఏ జట్టుపైన ద్వేషం లేదు. ప్రతి ఒక్కరు దీనిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. ఎవరినీ ట్రోల్ చేయాలనుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని మీరు భూతద్ధంలో నుంచి చూస్తున్నారు. దయచేసి శాంతించండి’ అని పేర్కొన్నారు.కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచు కుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29)చదవండి: ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు! -
ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు!
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్థశతకాలతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించిన ఆటలో జైస్వాల్ 32 బంతుల్లోనే 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లోనే జైస్వాల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.ఐపీఎల్ కెరీర్లో యశస్వి జైస్వాల్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో, 2021లో సీఎస్కేతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్‌సెంచరీలు సాధించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు సాధించాడు. 19 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్ అజింక్యా రహానేతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో బట్లర్, సంజూ శాంసన్‌లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డులకెక్కాడు. వంద సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్‌కు 69 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. జైస్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌లు), రిషబ్ పంత్ (68 ఇన్నింగ్స్‌లు), శివమ్ దూబే (59 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.ఐపీఎల్లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌లాడిన జైస్వాల్ ఖాతాలో రెండు సెంచరీలు, 17 అర్థసెంచరీలున్నాయి. కాగా ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు షేన్ వాట్సన్ (109), బట్లర్ (135), శాంసన్ (192) ఉన్నారు.Guwahati still needs an umbrella! ☔️6️⃣🔥 pic.twitter.com/2oCGPHyP7O— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2026చదవండి: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ -
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ మాట్లాడాడు.‘పవర్ ప్లే మాకు మూడు ఓవర్లు మాత్రమే అన్న విషయం నా మైండ్‌లో ఉంది. అందుకే బౌలర్లు ఎవరొచ్చినా ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని తెలుసుకొని అతడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఆ తర్వాత బుమ్రా బాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రా సంగతి వైభవ్ సూర్యవంశీ చూసుకుంటాడులే అని మనసులో అనుకున్నా. ఆ తర్వాత ఎవరొచ్చినా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూశాం. మూడు ఫార్మాట్లలో ఇదే తరహా ఆటతీరును ఆడొచ్చా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రతీ మ్యాచ్‌లో వినూత్నమైన షాట్లను ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఆడుతున్న తీరు అమోఘం. అతడు కష్టపడుతున్నాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాడు. ఆటతీరు మార్చుకోమని చెప్పలేను కానీ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది. వైభవ్ సూర్యవంశీకి స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛను అతను చక్కగా ఆస్వాదిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రతీసారి మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ సీజన్లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించడం వెనుక నా సీక్రెట్ అదే. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం! -
ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం!
బంగ్లాదేశ్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివాదాలతో సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌కు తాజా మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ క్రికెట్ ఉనికినే దెబ్బతీసేలా ఉందని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన సీజేకేఎస్ టాలెంట్ కప్ 2026లో ఏడుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 3న జరిగిన టీ20 టోర్నమెంట్లో బాకలియా ఏకాదశ, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాకలియా ఏకాదశ జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఉమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహ్మద్ ఇక్బాల్ మరియు నాజ్ముల్ ఇస్లాంలు కావాలని ఔటయ్యారు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. వారు ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఈ ఫిక్సింగ్ ఉదంతంలో కేవలం ఆటగాళ్లే కాకుండా కోచ్ అమీనుల్ హక్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనిని తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఛట్టోగ్రామ్ జిల్లా క్రీడా సంస్థ, కోచ్ అమీనుల్ హకు ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది. అలాగే సదరు ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని దేశీయ లీగ్‌లో అమలు చేయాలని బీసీబీకి అధికారికంగా లేఖ రాసింది.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)కూడా గతంలో ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. బీసీబీ డైరెక్టర్ ముఖైసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 2025 సీజన్ లో ఆరుగురు జాతీయ ఆటగాళ్లతో సహా మొత్తం 10 మంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం నిఘాలో ఉండటం గమనార్హం. అయితే భారత్‌తో తిరిగి సత్సంబంధాలు కోరుకుంటున్న బంగ్లాదేశ్ త్వరలోనే మహిళల బంగ్లా ప్రీమియర్ లీగ్‌లోకి భారత మహిళా క్రికెటర్లను ఆహ్వానించాలని బంగ్లా బోర్డు యోచిస్తోంది. ఇక మంగళవారం బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) నూతన చైర్మన్‌గా మాజీ క్రికెటర్‌గా తమీమ్ ఇక్బాల్ ఎన్నికైన సంగతి తెలిసిందే.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం! -
పంజాబ్ నటితో భారత క్రికెటర్ ప్రేమాయణం!
టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్షదీప్ ఇటీవలే తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడం సోషల్‌మీడియాను ఊపేసింది. ఈ టీమిండియా స్టార్ షేర్ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. అర్షదీప్ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. పంజాబ్‌కు చెందిన మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉండటంతో, ఆమె అర్షదీప్‌తో లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. పంజాబ్‌కు చెందిన సమ్రీన్ (26), పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్షదీప్ కానీ, అటు సమ్రీన్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో విషయం ఉందన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో అర్షదీప్ పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: 18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా! View this post on Instagram A post shared by NAUGHTYWORLD (@naughtyworld) View this post on Instagram A post shared by Samreen (@samreenkaur__) -
18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా!
ఐపీఎల్ 2026 సీజన్లోకి మరో ఇద్దరు విదేశీ స్టార్లు త్వరలోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ, మతీశా పతీరానాలు త్వరలోనే ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్లో హసరంగ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పతీరానా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు. హసరంగను రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో దక్కించుకోగా, పతీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. పతీరానా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఫుంజుకునే అవకాశముంది. నిఖార్సైన బౌలర్ లేక కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే పరాజయాలనే మూటగట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయాలతో హసరంగ, పతీరానాలు మేజర్ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొడ వెనుక కండరాల్లో చీలిక రావడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పతీరానా కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు కొలంబోలోని ఫిట్నెస్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. లంక క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో హసరంగ, పతీరానాలు చోటు దక్కడంతో బయటి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ తప్పనిసరి. ప్రస్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్దరు ఫిట్నెస్ టెస్టు పాసయ్యేందుకు శ్రమిస్తున్నారు. అయితే వీరిలో హసరంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.పతీరానా మాత్రం ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరన్స్ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో కలిసే అవకాశముంది. ఇక పతీరానా ఐపీఎల్లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇక హసరంగ ఐపీఎల్లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదురవ్వగా.. పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణమయింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో గెలిచి సీజన్లో బోణీ చేసింది.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం! -
అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (సీఎస్కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.గతంలో సీఎస్కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది. అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.కెప్టెన్‌గా రుతురాజ్ విఫలం..2024 సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్లో మాత్రం అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.సంజూకు ఏమైంది?రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్‌లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.పసలేని బౌలింగ్..బ్యాటింగ్‌లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్‌లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.అదంతా గతం..ఇక కెప్టెన్‌గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్‌లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.చదవండి: ‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’ -
‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కేకేఆర్ పంజాబ్ కింగ్స్‌తో పోరులో ఎలాగైనా గెలిచి ఖాతా తెరవాలని భావించింది. కానీ వరుణుడి అడ్డంకితో మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో పాయింట్ల ఖాతా తెరిచినప్పటికీ విజయం మాత్రం ఇంకా దరిచేరలేదు. అయితే తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రహానే బౌలింగ్‌కు బదులు బ్యాటింగ్ తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. బహుశా తాను టాస్ గెలిచి ఉంటే బౌలింగ్‌కు మొగ్గు చూపేవాడినని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొనడంతో రహానేపై విమర్శలు పెరిగిపోయాయి. ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్‌ఫించ్ సైతం రహానే నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఫించ్ మాట్లాడుతూ.. ‘కేకేఆర్ కెప్టెన్ రహానే తీసుకున్న నిర్ణయం ఒక రకంగా అర్థం లేనిది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న సంగతి రహానేకు ముందే తెలుసు. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం, వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంలో అర్థం లేదు. రహానే చేసింది ఎంత పెద్ద తప్పు అనేది కాసపటికే కేకేఆర్‌కు తెలిసొచ్చింది. 25 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్‌పై ఉండే పచ్చికను ఉపయోగించుకోవాల్సింది పోయి రహానే గుడ్డిగా బ్యాటింగ్ ఎంచుకోవడం విమర్శలకు తావిచ్చింది. రహానే ఇటీవల తన కెప్టెన్సీపై అసూయ పడేవారు పెరిగిపోయారని పేర్కొన్నాడు. కానీ రహానే వ్యాఖ్యలు నన్ను నిరాశపరిచాయి. ఒక జట్టుకు నాయకుడిగా ఉన్న ఆటగాడికి ఏకాగ్రత దెబ్బతిన్నప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మనల్ని విమర్శించివారిని తిరిగి దూషించడం కెప్టెన్‌గా సరైన చర్య ఎంతమాత్రం కాదు. రహానే నువ్వు చాలా మంచి ఆటగాడివి. ఓపెనర్‌గా కొనసాగిస్తున్న దూకుడు అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. తొలి మ్యాచ్‌లో 220 పరుగులు చేసి కూడా ఓటమి పాలవ్వడం, రెండో మ్యాచ్‌లో ఛేదనలో చతికిలపడడం చూస్తుంటే జట్టులో సమతుల్యం దెబ్బతిన్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆటతో పాటు నాయకత్వంపై కూడా దృష్టి పెడితే బాగుంటుంది’ అని పించ్ పేర్కొన్నాడు.చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! -
‘త్యాగాలు చేశా.. ఐపీఎల్ వల్ల కెరీర్ నాశనమైంది’
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్ల తన కెరీర్ నాశనమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబర్ రన్వీర్ అల్లాబ్దియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మొదలైన 2008లో ఒకేఒక్క ఇంగ్లండ్ క్రికెటర్ డిమిత్రి మస్క్‌రెనాస్ మాత్రమే ఆనాటి లీగ్‌లో ఆడాడు. కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈసీబీ నిషేధించడమే అందుకు కారణం. 2009లో బ్రిటిష్ ఆటగాళ్లు ఐపీఎల్ బరిలో దిగేందుకు ఈసీబీ అనుమతించినా..దాన్ని మూడు వారాలకే పరిమితం చేసింది. దాంతో కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ లీగ్‌కే తొలి ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా ఈసీబీతో అతడికి అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో పీటర్సన్‌ను ఈసీబీ జాతీయ జట్టుకు దూరం చేసింది. పీటర్సన్ మాట్లాడుతూ..‘2008లో ఐపీఎల్ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, ఇంగ్లండ్ బోర్డు మమ్మల్ని ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతించేది కాదు. కానీ అప్పట్లో బోర్డు నిర్ణయానికి నేను వ్యతిరేకంగా గళం విప్పాను. అందుకోసం నేను పెద్ద త్యాగమే చేశాను. అలా ఐపీఎల్ కోసం నా కెరీర్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే అప్పట్లో బోర్డులోని ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మారారు. దీంతో 33 ఏళ్లకే నా కెరీర్ ముగిసిపోయింది. నిజానికి నేను ఇంగ్లండ్ తరఫున 150 నుంచి 160 టెస్టులు ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్ బోర్డుతో విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదు. అంతేకాదు ఆ సమయంలో నాపై వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోర్డు కొన్ని వార్తా సంస్థలను కూడా వాడుకుంది. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదని, ప్రస్తుతం నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా. నేను పడ్డ ఇబ్బందుల వల్లే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇవాళ స్వేచ్ఛగా ఐపీఎల్ సహా ఇతర ప్రైవేటు లీగుల్లో ఆడుతున్నారు. ఇటీవల జోస్ బట్లర్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయమై నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. నేను చేసిన పోరాటం వల్లే ఇప్పుడు మా ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫలాలను అనుభవిస్తున్నారు’ అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2009 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున పీటర్సన్ తొలిసారి బరిలోకి దిగాడు. 2011లో డెక్కన్ చార్జర్స్‌కు, 2012 సీజన్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు పీటర్సన్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పీటర్సన్ ఇంగ్లీష్ జట్టు తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.చదవండి: కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి🔥 Kevin Pietersen said it LOUD & CLEAR“If you come to India as a cricketer and don’t enjoy it… something’s wrong with you.”And then dropped the mic 🎤“The level of service here is better than anywhere else in the world.”#KevinPietersen #India #IPL #Cricket pic.twitter.com/H36dAlVkBF— ND Sport (@SportsByND) April 5, 2026 -
కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి
ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 2026 సీజన్లో మాత్రం ఇంకా బోణీ చేయలేదు. సోమవారం పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ సాధించినప్పటికీ విజయం మాత్రం ఇంకా ఆ జట్టు దరి చేరలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సమయంలో కెమెరాలు ఒక్కసారిగా డ్రెసింగ్ రూమ్‌వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ షారుక్ ఖాన్ కేకేఆర్ సీఈవో వైంకీ మైసూర్‌తో సుదీర్ఘ చర్చలో మునిగినట్లు కనిపించింది. ముఖ్యంగా సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, కామెరున్ గ్రీన్ వైఫల్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంపై కూడా షారుక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. మ్యాచ్ జరిగి ఉంటే కేకేఆర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేదేమో అని భావించినట్లు తెలుస్తోంది.ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఓటములపై కూడా విశ్లేషించినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా కేకేఆర్ ప్లాఫ్ షోపై షారుక్ ఖాన్ అసం తృప్తిగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేకేఆర్ ఓడిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇక సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 227 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులకే ఆలౌటైంది. కనీసం మూడో మ్యాచ్ ద్వారానైనా సీజన్లో బోణీ కొట్టాలని భావించిన కేకేఆర్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ లభించినప్పటికీ ఉపయోగం లేదు. కనీసం ఏప్రిల్ 9న లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా కేకేఆర్ విజయం సాధించి సీజన్లో ఖాతా తెరవడంతో పాటు షారుక్ ఖాన్ శాంతించేలా చేస్తుందేమో చూడాలి. pic.twitter.com/HaBuw3lHz8— Nihari Korma (@NihariVsKorma) April 6, 2026చదవండి: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో! -
హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో విఫలమై హ్యాట్రిక్ నమోదు చేశాడు. సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టినప్పటికీ ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. జేవియర్ బార్ట్లెట్ వేసిన అవుట్ స్వింగర్ బంతిని బ్యాట్‌తో ముద్దాడి కీపర్ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 18, 2, 4 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్‌ల్లో గ్రీన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేసి 10 కంటే తక్కువ సగటు నమోదు చేయడం కోల్‌కతా మేనేజ్మెంట్ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత ఇస్తాడని భావించి భారీ ధర పెట్టి కొనుగోలు చేసినందుకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా సందేశం మేరకు బౌలింగ్‌కు దూరంగా ఉన్న కామెరున్ గ్రీన్ ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ దారుణంగా ఆడుతూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రూ. 25.2 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన గ్రీన్ ఇప్పుడు కేకేఆర్‌కు భారంగా మారిపోయాడు. కనీసం తర్వాతి మ్యాచ్‌లోనైనా ఫుంజుకొని తనకు పెట్టిన ధరకు న్యాయం చేస్తాడేమో చూడాలి. మరోవైపు కేకేఆర్ అభిమానులు మాత్రం గ్రీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న కేకేఆర్‌కు పంగనామం పెడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కామెరున్ గ్రీన్ పెద్ద ని ఖార్సైన ఆల్‌రౌండర్ కాదన్న సంగతి అతని గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 37 టెస్టులాడిన గ్రీన్ 1736 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 7 అర్థసెంచరీలున్నాయి. 31 వన్డేల్లో 782 పరుగులు, 28 టీ20ల్లో 638 పరుగులు సాధించాడు. ఈ మాత్రానికే కేకేఆర్ అంత డబ్బులు పెట్టి గ్రీన్‌ను ఎందుకు కొనుగోలు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఇక వర్షం పడే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ కష్టమైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంటే, సీజన్లో ఇప్పటికీ బోణీ చేయని కేకేఆర్ ఒక పాయింట్‌తో 8వ స్థానంలో కొనసాగుతుంది.చదవండి: ‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం -
‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వచ్చిన సంజూ ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్‌ఫామ్‌ను ఐపీఎల్ 19వ సీజన్లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది.రాజస్తాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఓటమి చవిచూస్తే.. శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్లో సీఎస్కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆటతీరుతో బలహీనంగా మారిపోయాడు. శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంజూ శాంసన్ ఆటతీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్‌కు గురి చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్‌గా అదరగొట్టిన శాంసన్ సీఎస్కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్‌లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్కే అభిమానులు పేర్కొంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్‌కు సలహాలు ఇస్తున్నారు. మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్‌లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని పేర్కొన్నారు. కెమెరాలన్నీ శాంసన్వైపు తిరిగిన ప్రతీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంసన్ ఫీలవుతున్నాడని, సీఎస్కేలోకి వచ్చాకా ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటినుంచైనా కాస్త శ్రద్ద పెడితే బాగుంటుందని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.Dear @IamSanjuSamson,If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే! -
ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!
మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.. ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్ గెలవడంలో ఈ ఇద్దరు కీలకపాత్ర పోషించారు. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలవడంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భువనేశ్వర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు ధోని హయాంలో బాగా రాటుదేలిన భువనేశ్వర్‌కు రానురాను అవకాశాలు తగ్గిపోయాయి. స్వింగ్ డెలివరీలతో ముప్పతిప్పలు పెట్టిన భువనేశ్వర్ దశాబ్ద కాలం పాటు టీమిండియాకు మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ప్రధాన బౌలర్‌గా సేవలందించాడు. 2022లో టీమిండియా తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ అప్పటినుంచి ఐపీఎల్‌లోనే కనిపిస్తున్నాడు.భువీ కథ అలా ఉంటే టీమిండియా పేసర్ మహ్మద్ షమీది మరో కథ. నిలకడకు మారుపేరుగా నిలిచే షమీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీయడంలో నేర్పరి. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ పైనల్ చేరడంలో షమీ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఆ టోర్నీలో భారత్ తుదిమెట్టుపై బోల్తా పడినప్పటికీ షమీ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన షమీ 24 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టెస్టుల్లోనూ తనదైన మార్క్ చూపిన షమీకి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే వస్తోంది. గాయాల పేరుతో అకారణంగా జట్టు నుంచి తప్పించిన షమీ టీమిండియాలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు.తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో అటు భువనేశ్వర్.. ఇటు మహ్మద్ షమీ తమ సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు నేలకూలుస్తూ తమను పరిగణలోకి తీసుకోవాల్సిందేనంటూ బీసీసీకి పరోక్షంగా సందేశాలు పంపుతున్నారు. లేటు వయసులోనూ పదునైన బౌలింగ్‌తో అందరి దృష్టి ఆకర్షిస్తున్న షమీ, భువనేశ్వర్ ఐపీఎల్ 19వ సీజన్‌తో మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడినట్లే.గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌లో కొనసాగిన షమీని లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో షమీ తన ప్రాముఖ్యతను రుచి చూపించాడు. 4 ఓవర్లు వేసిన షమీ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన షమీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో షమీ 122 మ్యాచ్‌లాడి 136 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న భువనేశ్వర్ కుమార్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2016లో ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్ చాలాకాలం పాటు ఆ జట్టుకే ఆడాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అయితే గత సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వెళ్లిన భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఆర్సీబీ జట్టులోనూ భువీ బాగమయ్యాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ 192 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు తీశాడు.దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షమీ, భువనేశ్వర్‌లు తాజాగా లేటు వయసులోనూ ఇరగదీస్తున్నారు. ఓవరాల్‌గా షమీ అన్ని ఫార్మాట్లు కలిపి 462 వికెట్లు పడగొడితే.. భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లు కలిపి 294 వికెట్లు తీశాడు. లేటు వయసులో ఇరగదీస్తున్న భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by MOHAMMAD SHAMI (@mdshami.11)చదవండి: భయంతో ఆడిన పంత్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్! -
భయంతో ఆడిన పంత్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతికి విజాయన్ని అందుకుంది. కాగా రిషబ్ పంత్ (68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ మార్కరమ్ (45) మరోసారి మెరిశాడు. అయితే పంత్ తన శైలికి విరుద్ధంగా ఎక్కువ బంతులాడి అర్థసెంచరీ సాధించడం ఆసక్తిగా కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. ఇద్దరు సీరియస్‌గా చర్చించుకున్న వీడియోలు బయటికి వచ్చాయి. ఆ తర్వాత లక్నో ఫ్రాంచైజీ దీనిపై స్పష్టతనిస్తూ పూర్తి వీడియోనూ విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌లో మాత్రం ఆ భయం పోలేదనిపిస్తుంది. ఈసారి కూడా ఓటమి చవిచూస్తే తమ బాస్ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని పంత్ భావించినట్లున్నాడు. అందుకే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంత్ ఆఖరిదాకా నిలబడి జట్టును గెలిపించాడు. ఫలించిన మొక్కులు..మ్యాచ్ విజయం అనంతరం పంత్ దగ్గరకు వచ్చిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం నవ్వుతూ అతన్ని హగ్ చేసుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినందుకు అతన్ని మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో లక్నో గెలవాలని సంజీవ్ గోయెంకా పదేపదే తన వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు మొక్కడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#LucknowSuperGiants owner taking blessings of #LordVenkateswaraOm Namo Venkatesaya 🕉️pic.twitter.com/jqY6bfB4Se— Milagro Movies (@MilagroMovies) April 6, 2026ఇక ఎస్ఆర్హెచ్పై విజయం అనంతరం సంజీవ్ గోయెంకా తన జట్టును మెచ్చుకుంటూ ట్విటర్లో పోస్టు పెట్టాడు. ‘ఐపీఎల్ అనేది సుదీర్ఘంగా సాగుతుంది. ఒక జట్టు విజయం సాధించాలంటే సమయం, సహనం, జట్టు ఐకమత్యం అవసరం. ఇవాళ ఆ మూడు మా లక్నో జట్టులో ప్రతిబింబించాయి. పంత్ కెప్టెన్‌గా జట్టును దిశానిర్దేశం చేస్తే ఆటగాళ్లంతా క్రమశిక్షణతో దానిని అనుసరించారు. జట్టులో ఉండే సమన్వయం ఎదుగుదలకు తోడ్పతుంది. ఈ విజయం మాకు ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మున్ముందు మా ఆటలో మరింత పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మిడిలార్డర్లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు అర్థసెంచరీలతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే! -
ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైన సీఎస్కే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అంతేకాదు పరమ చెత్త ఆటతీరుతో (-2.157) దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్ ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తానే మొత్తం బాధ్యత తీసుకుంటానని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమయ్యానని, అందుకే ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా. అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అతడి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావడం మా దురదృష్టకరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా బంతిని బాదాడు. అతడు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖచ్చితంగా హ్యాట్సాఫ్. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్‌లోనూ పదును పెంచుకుంటున్న భువనేశ్వర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గానూ భువనేశ్వర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీమిండియా తరఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి ఆటగాడిగా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు పడగొట్టాడు. తాజాగా భువనేశ్వర్ 192 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. భువనేశ్వర్ తర్వాత కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ 191 మ్యాచ్‌ల్లో 193 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్లకు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్‌ను అధిగమించిన తొలి బౌలర్‌గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలు కూడా భువనేశ్వర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఇక మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ ఖాతాలో మరో రికార్డు..రికార్డులు పెట్టడానికే కోహ్లీ పుట్టినట్లున్నాడు. తాజగా సీఎస్కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మరో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 28 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఆ జట్టుపై 1,174 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇంతకముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 1,161 పరుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్‌ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం! -
ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!
భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) సముచిత స్థాయిలో గౌరవించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని రెండు ఎండ్లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ద్రవిడ్, కుంబ్లే ఎండ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు... ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ... ‘ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఈ మైదానం వల్లే. కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు’ అని అన్నాడు. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించిన ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్లో 24, 177 పరుగులు చేయగా... కుంబ్లే ఓవరాల్‌గా 956 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే! -
‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తార్ రాయల్స్ రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. తాజగా శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. 'ఈ విజయం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు మేమనుకున్న ప్లాన్‌ను సక్రమంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు సంతోషంగా అనిపించింది. 19వ, 20వ ఓవర్లు ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా. ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నా. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 19వ ఓవర్‌ను ఆర్చర్‌కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది. ధ్రువ్‌జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ముంబైపై ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారిస్తాం. ఈసారి గట్టిగా కొడతాం' అని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.JOFRA ARCHER AND TUSHAR DESHPANDE MASTERCLASS SEALS THE MATCH FOR RR. - An aggressive celebration by captain Riyan Parag. 🥶🔥 pic.twitter.com/sqnwXamNqV— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2026చదవండి: సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే! -
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఎస్ఆర్హెచ్పై లక్నో విజయం
SRH vs LSG Live Score, IPL 2026: ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడతున్నాయి.లక్నో ఘన విజయంఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రిషబ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లు, 68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. అతడితో పాటు కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే రెండు, శివాంగ్ కుమార్, మలింగ తలా వికెట్ సాధించారు.విజయానికి చేరువలో లక్నోఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో విజయానికి చేరవైంది. 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లక్నో విజయానికి 19 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్(48), అబ్దుల్ సమద్(16) ఉన్నారు.లక్నో నాలుగో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్.. రనౌటయ్యాడు. లక్నో విజయానికి 47 పరుగులు కావాలి.లక్నో మూడో వికెట్ డౌన్అయూశ్ బదోని రూపంలో లక్నో మూడో వికెట్లు కోల్పోయింది. 12 పరుగులు చేసిన బదోని.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో రెండో వికెట్ డౌన్‌లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అయూశ్ బదోని వచ్చాడు.9 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(45),రిషబ్ పంత్(16) ఉన్నారు. లక్నో విజయానికి 81 పరుగులు కావాలి.లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు లక్నో స్కోర్: 38/13 ఓవర్లకు లక్నో స్కోర్ ఎంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(16), మిచెల్ మార్ష్(8) ఉన్నారు.అదరగొట్టిన క్లాసెన్, నితీశ్..లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. సిద్దార్ద్, దిగ్వేష్ తలా వికెట్ పడగొట్టారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఎస్ఆర్హెచ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అవేష్ ఖాన్ వేసిన 19 ఓవర్లో మొదటి బంతికి హెన్రిచ్ క్లాసెన్ ఔట్ కాగా.. తర్వాతి బంతికి హర్ష్ దూబే ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 56 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.నితీశ్ కుమార్ రెడ్డి ఫిప్టీలక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను నితీశ్ అందుకున్నాడు.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 123/416 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(49), హెన్రిచ్ క్లాసెన్(50) దూకుడుగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 97 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.దూకుడుగా ఆడుతున్న నితీశ్..12 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(19), నితీశ్ కుమార్ రెడ్డి(23) స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్26 పరుగుల వద్ద లివింగ్ స్టోన్ (16) ఔట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 26పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ఇషాన్ (1), త్రావిస్ హెడ్(7) పరుగులు చేసి పెవీలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం హెచ్ఆర్ఎస్ 6 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్మొదటి ఓవర్ పూర్తయ్యాక రాథీని బౌలింగ్ నుంచి తీసేశారు. ఆయన స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చాడు. తన మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ ఇషాన్ కిషన్‌కి బంతిని లోపలికి స్వింగ్ చేసి ఆఫ్ స్టంప్‌ను కూల్చేశాడు. దాంతో ఎస్ఆర్హెచ్ స్కోరు 11/3గా పడిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్ఎచ్ లియామ్ లివింగ్‌స్టోన్, హైన్రిచ్ క్లాసెన్‌పై భారం పడింది. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్రెండో వికెట్ తీసిన మహ్మద్ షమీ2.1వ బంతికి భారీ షాట్ ఆడిన ట్రావిస్ హెడ్ (7)క్యాచ్ అందుకున్న మార్క్రమ్రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయిందిమహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని అభిషేక్ ఫ్లిప్ చేశాడుబ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్‌ను తాకి బంతి గాల్లోకి లేచింది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ప్రారంభమైన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి)తో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని ఇరు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ సొంతగడ్డపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎల్ఎస్జి ఈ సీజన్లో తొలి పాయింట్ల కోసం వేటాడుతోందిసన్రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హైన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ఇంపాక్ట్ సబ్స్: ఈషాన్ మలింగ, డేవిడ్ పేన్, సలిల్ అరోరా, శివమ్ మావి, జీషాన్ అంసారీలక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరి, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఎం. సిద్ధార్థ్ఇంపాక్ట్ సబ్స్ : అన్రిచ్ నోర్కియా, హిమ్మత్ సింగ్, షాహ్బాజ్ అహ్మద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్జ్కే -
సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే!
టీమిండియా సీనియర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అతడి సొంతం. చేజింగ్‌లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్‌లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జట్టు గుండెలపై హాయిగా చేయి వేసుకొని నిద్రపోతాయి. టీమిండియా తరఫున ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక ఐపీఎల్లో 19 సీజన్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ చేజింగ్‌లో లెక్కలేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్లో కూడా కోహ్లీకి ఒక ఫేవరెట్ జట్టు ఉంది. ఆ జట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్‌లో పూనకం వచ్చేస్తుంది. ఆ జట్టు పేరే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఐపీఎల్ 2026 సీజన్లో ఆదివారం డబుల్‌హెడర్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ తమ హోంగ్రౌండ్లో సీఎస్కేతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజయంపై కన్నేయగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటములతో పట్టికలో చివరి స్థానంలో ఉన్న సీఎస్కే ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. కాగా సీఎస్కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్లో సీఎస్కేతో 35 మ్యాచ్‌లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1146 పరుగులు సాధించాడు. చెన్నైపై అత్యధిక స్కోరు 90 నాటౌట్‌గా ఉంది. ఇందులో 10 అర్థసెంచరీలున్నాయి. మరో 14 పరుగులు చేస్తే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా తన రికార్డును తానే బద్దలుకొట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 1159 పరుగులు సాధించాడు.చదవండి: ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! -
ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానున్న మ్యాచ్ మధ్యలో వర్షం పడే చాన్స్ ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు వెదర్ రిపోర్ట్ చూపిస్తోంది. ప్రస్తుతానికి ఎండ బాగానే కాస్తున్నప్పటికీ మ్యాచ్ సమయానికి వాతావరణం చల్లబడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసింది. మరోవైపు పంత్ సారథ్యంలోని లక్నో మాత్రం తొలి మ్యాచ్‌లో ఓడి ఇంకా బోణీ కోసం ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ ఐదో స్థానంలో ఉంటే.. లక్నో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. సొంతగడ్డపై భారీ విజయంతో ముందంజ వేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంటే.. లక్నో మాత్రం ఎలాగైనా ఉప్పల్‌లో గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. ఇరుజట్లు ముఖాముఖి పోరులో ఆరుసార్లు తలపడితే లక్నో 4 విజయాలు.. ఎస్ఆర్హెచ్ రెండు విజయాలు సాధించాయి. గతేడాది ఇదే ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది.చదవండి: అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా? -
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే గాక రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో రిజ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. అయితే 2025 సీజన్‌కు ముందు రిజ్వీని విడుదల చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీని కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్కే అభిమానులు ఆ జట్టు యాజమాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. ‘చెన్నై జట్టులో ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడేమో ఢిల్లీ తరఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్లగొడుతున్నాడు’.. ‘సమీర్ రిజ్వీని వదిలేసి సీఎస్కే దిద్దుకోలేని తప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమీర్ రిజ్వీ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించడం విశేషం.Sameer Rizvi's last 3 knocks for Delhi Capitals:vs PBKS - 58(25)vs LSG - 70(47)vs MI - 90(51)& u know what? CSK let him go to DC for just 95 lakhs when he showed glimpses of his unlimited potential in very 1st game. CSK is worse team for youngsters!pic.twitter.com/zmDEOe9SMB— Rajiv (@Rajiv1841) April 4, 2026🚨 BIG BLUNDER FROM CSK> CSK bought Sameer Rizvi in 2024 for 8.40 CR> Played him mostly at No.6> Didn't give him chances> Released him in 2025> Delhi Capitals bought him for just ₹95 lakh> Backed him at No. 4 and now he’s winning matches for thempic.twitter.com/bjZBi0KipG— Tejash (@Tejashyyyyy) April 4, 2026చదవండి: కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! -
మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు!
భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరీ అశోక్ శర్మ?రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు! -
రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే మొదట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్, జైస్వాల్ మెరిస్తే.. ఆ తర్వాత బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే సూపర్ బౌలింగ్‌తో రాజస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గ్లెన్ పిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలు రవి బిష్ణోయ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయడం ద్వారా రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్‌గా, 9వ స్పిన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రవి బిష్ణోయ్ గతలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా తరఫున 44 టీ20లు ఆడిన రవి బిష్ణోయ్ 64 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంతరం కడదాకా పోరాడిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకు పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’ -
‘ఆ తప్పిదం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్ రాయల్స్‌నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్‌పై ఓవర్‌కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్‌గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో రాణిస్తాం. మా రెగ్యులర్ కెప్టెన్ గిల్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్‌ను రోహిత్ శర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్‌కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్‌ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్‌తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్‌తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే! -
పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బలమైన బ్యాటింగ్ శక్తితో లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. రెండు మ్యాచ్‌లు కలిపి పంజాబ్ మొత్తం 23 సిక్సర్లు బాదింది. ఇందులో గుజరాత్‌పై 14, చెన్నైపై 9 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న పంజాబ్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దాగున్న రహస్యాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు. పంజాబ్ వరుస విజయాల్లో జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. పవర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉపయోగించిన స్క్వాష్ బాల్ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారిందని తెలిపాడు. పాంటింగ్ కోచ్‌గా వచ్చిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్‌లో బలం పెరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్‌సిమ్రన్ సింగ్‌లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్‌తో ఉన్న అనుబంధం గురించి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు అతడు మా కోచ్‌గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్‌ను పెంచేందుకు పాంటింగ్ కొత్త పద్దతిని ఉపయోగించాడు. ప్రాక్టీస్ సమయంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మధ్యలో స్క్వాష్బాల్ను ఉంచేవాడు. దీనివల్ల చేతి కింది భాగంలో బ్యాట్‌ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారముండదు. దీంతో మన హిట్టింగ్‌లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వల్లే అప్పట్లో నేను చాలా మ్యాచ్‌ల్లో సులువుగా సిక్సర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. వాస్తవానికి ఎవరైనా సిక్సర్లు కొడతారు. కానీ స్వ్కాష్బాల్ టెక్నిక్ వల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వచ్చినా సులువుగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఏమిటీ స్క్వాష్‌బాల్ టెక్నిక్?పాంటింగ్ ఉపయోగించే స్క్వాష్‌బాల్ టెక్నిక్‌లో స్వ్కాష్ బంతిని బ్యాటర్ చేతి గ్లోవ్స్ మధ్య ఉంచుతారు. దీనివల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్పడి బ్యాట్ గట్టిగా పట్టుకోలేము. దీనివల్ల బ్యాట్‌కు గ్రిప్ రావడంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు వారి కోచ్ బాబ్ మ్యూల్మన్ సలహా మేరకు ఇలాంటి టెక్నిక్‌ను ఉపయోగించే అలవోకగా సిక్సర్లు బాదడం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్‌ను పాంటింగ్ పంజాబ్ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’ -
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందింది. రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవడంపై నేను ఒక్కటే ఆలోచించాను. ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందనుకున్నా. కానీ మా స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాము. అయితే మాది యువ జట్టు. అనవసరమైన అంచనాలతో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న పంజాబ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. తాజాగా చెన్నైతో మ్యాచ్‌లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఈసారి కెప్టెన్‌తో పాటు జట్టు ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కౌన్సిల్ మాట్లాడుతూ..‘చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన పంజాబ్ జట్టుపై చర్యలు తీసుకుంటున్నాం. అయితే కెప్టెన్ అయ్యర్‌కు ఇది0 రెండో స్లో ఓవర్‌రేట్ కావడంతో అతని మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షలు కోత విధిస్తున్నాం. అంతేకాదు జట్టులోని 11 మంది ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఆరు లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో వెల్లడించింది.మళ్ళీ తప్పు చేస్తే నిషేధం!ఈ సీజన్లో పంజాబ్ జట్టు మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు తలా 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధించబడుతుంది. అంతేకాదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే 73 పరుగులతో రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!
గెలిచినోడి కంటే ఓడిపోయినవాడి మీదే సానుభూతి ఎక్కువగా ఉంటుంది. జట్టును గెలిపించినోడు హీరో అవుతాడన్నది కాదనలేని మాట. కానీ అదే సమయంలో ఓడిపోయిన జట్టు నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు అభిమానుల మనసులు గెలుచుకుంటాడు. ఇది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుశ్ మాత్రేకు సరిగ్గా నప్పుతుందని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఆయుశ్ మాత్రే వాడిన బ్యాట్ విషయంలో అంపైర్ అడ్డుపడడం, ఆ తర్వాత అదే బ్యాట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరిని మెప్పించడం విశేషం. గతేడాది అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌కు వచ్చేసరికి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చెన్నైకి ఓటమి ఎదురైనా ఆయుశ్ మాత్రే రూపంలో సక్సెస్ లభించిందని చెప్పొచ్చు.ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే చెన్నై ఓటమి చవిచూసినప్పటికీ ఆ జట్టు ఆటగాడు ఆయుశ్ మాత్రే మాత్రం సూపర్‌సక్సెస్ అయ్యాడు. ఆయుశ్ మాత్రే గతేడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు. గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే 2026 ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భావించాడు. కానీ ఈ సీజన్ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్లెట్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.అంపైర్ పొరపాటు..సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఔటయ్యాకా మూడో స్థానంలో ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు. అయితే మొదట తీసుకొచ్చిన బ్యాట్ కాస్త అనుమానంగా ఉండడంతో అంపైర్ దానిని పరిశీలించాడు. కానీ బ్యాట్ గేజ్ నుంచి పాస్ కాకపోవడంతో వేరే బ్యాట్‌ను తీసుకొని వచ్చాడు. కానీ ఈసారి కూడా బ్యాట్ గేజ్‌ను దాటకపోవడంతో టెస్టులో మరోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే మాత్రే తొలుత తీసుకొచ్చి బ్యాట్‌ను అంపైర్ మరోసారి చెక్ చేశాడు. అయితే ఇక్కడ అంపైర్ తన పొరపాటు వల్లే బ్యాట్‌కు గేజ్‌ను సరిగ్గా పెట్టడంలో విఫలమైనట్లు గుర్తించాడు. ఆ తర్వాత మాత్రే తన ఫస్ట్ బ్యాట్‌తోనే ఇన్నింగ్స్ కొనసాగించాడు.ఎవరీ ఆయుశ్ మాత్రే?జూలై 16, 2007లో మహారాష్ట్రలోని నల్లసొపారా జిల్లాలో ఆయుశ్ మాత్రే జన్మించాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఆయుశ్ మాత్రేకు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆరాధ్య క్రికెటర్. అతని ఆటను చూస్తూ పెరిగిన ఆయుశ్ మాత్రే పదిహేనేళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కలను నెరవేర్చుకునేందుకు ముంబైలోని విరార్ నుంచి చర్చ్‌గేట్ వరకు రోజు 80 కిలోమీట్లరు ప్రయాణం చేసి ప్రాక్టీస్ కొనసాగించాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 660 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. 2024 అండర్-19 టీ 20 ప్రపంచకప్ గెలిచిన యంగ్ ఇండియా జట్టులో ఆయుశ్ మాత్రే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2025లో అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆయుశ్మాత్రే ఆసియాకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలిపాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఆయుశ్ మాత్రే టీమిండియా టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 214 పరుగులు సాధించాడు. అంతేకాదు ఆయుశ్ మాత్రే సారథ్యంలోనే యంగ్ ఇండియా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు -
‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్‌లో కెప్టెన్ రహానే 10 బంతులాడి 8 పరుగులే చేయడం విమర్శలకు దారి తీసింది. అయితే రహానే మాత్రం తనపై వచ్చిన విమర్శలకు ధీటుగానే బదులిచ్చాడు. తన సక్సెస్‌ను చూడలేకనే కొంతమంది తన స్ట్రైక్‌రేట్ విషయంలో ఒక అజెండాతో విమర్శలు చేస్తున్నారని రహానే తెలిపాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో విఫలం కావడంతోనే విమర్శలు చేయడం సరికాదన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేకేఆర్(KKR) కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడాడు.‘2023 నుంచి నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ అత్యుత్తమంగా ఉందని నేను భావిస్తున్నా. అయితే నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడుతున్న వారంతా బహుశా నా ఆటను చూడకపోవచ్చు లేదంటే ఒక అజెండాతో నాపై నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నార నిపిస్తుంది. వాస్తవానికి నేను ఆడడం వారికి ఇష్టం లేదనుకుంటా. అందుకే నా ఆటను చూసేందుకు ఇష్టపడడం లేదు. నా సక్సెస్ చూసి వారికి అసూయ కలిగినట్లు అనిపిస్తోంది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే చూసి నేను సరిగ్గా ఆడడం లేదని పేర్కొనడం తగదు. అజింక్యా రహానే ఆటను మార్చుకున్నాడంటే అస్సలు సహించడం లేదు. అంతిమంగా రహానే గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అది పాజిటివ్ లేదా నెగెటివ్ కావచ్చు. ఏదైనా సరే నేనేమీ మాట్లాడుకుండా వారిని అడ్డుకోను.’అని చెప్పుకొచ్చాడు.కాగా అజింక్యా రహానే 2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరిన తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు. హిట్టింగ్‌కు అధిక ప్రాధాన్య మిచ్చిన రహానే ఆ సీజన్లో సీఎస్కే తరఫున 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఆ సీజన్లో చెన్నై టైటిల్ కొట్టడంలోనూ రహానే ఓపెనింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అయితే 2024 సీజన్ రహానేకు అంతగా కలిసిరాలేదు. 2024లో రహానే 123.47 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రహానేను సీఎస్కే విడుదల చేయడంతో 2025 సీజన్‌కు ముందు అతడిని కేకేఆర్ కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ 18వ సీజన్లో రహానే మరోసారి మెరిశాడు. కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గా 13 మ్యాచ్‌ల్లో 147 స్ట్రైక్‌రేట్‌తో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2026 ఐపీఎల్ సీజన్‌ను కూడా రహానే మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అర్థసెంచరీ సాధించి తన విలువను చాటిచెప్పాడు.Ajinkya Rahane did not hold back in the post-match press conference 😮#KKRvsSRH #IPL2026 pic.twitter.com/b9IxVcrQJZ— Cricbuzz (@cricbuzz) April 2, 2026చదవండి: కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ! -
కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఆసక్తి కలిగించింది. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ గతంలో ధోని, కపిల్ దేవ్ల గురించి ఆరోపణలు చేయడమే క్షమాపణకు కారణమని యువీ వెల్లడించాడు. కాగా యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని తండ్రి యోగ్రాజ్ పలు సందర్భాల్లో ధోనిపై ఆరోపణలు చేశారు. యువరాజ్‌కు కెప్టెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం ధోనినేని బహిరంగంగానే విమర్శలు చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. తాజాగా యువరాజ్ ఒక పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ మాట్లాడుతూ.. 'నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను' అని అన్నారు. తన తండ్రి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందని అడగ్గా.. 'అది సరైంది కాదని మా నాన్నకు చెప్పాను' అని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా యోగ్రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్‌పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1980ల్లో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'కపిల్ దేవ్ కెప్టెన్ అయినప్పుడు నన్ను అనవసరంగా జట్టులోంచి తీసేశారు. అప్పట్లో నా పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతని తల్లి అక్కడ ఉండటంతో వదిలేశాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని, నా కొడుకు యువీతో ఆడిస్తానని నిర్ణయించుకున్నాను' అని యోగ్ రాజ్ గతంలో గుర్తు చేసుకున్నారు.బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి వారు ఆటగాళ్లను సరిగ్గా గౌరవించలేదని, మన కెప్టెన్ల వల్లే జట్టు నాశనమైందని ఆయన బహిరంగంగా విమర్శలు చేసేవారు. అయితే తన తండ్రి చేస్తున్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల యువరాజ్ సింగ్ ఇప్పుడు క్షమాపణలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.15 ఏళ్ల పాటు భారత క్రికెట్లో ప్రముఖ పాత్ర వహించిన యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌కు నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం రాలేదు. 2000లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: ‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’Do tune in tomorrow as the Yuvraj Singh Podcast drops at 12 noon Friday on @sports_tak @YUVSTRONG12 pic.twitter.com/jGOZhiJBkz— Vikrant Gupta (@vikrantgupta73) April 2, 2026 -
‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’
లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై బీసీసీఐ నిషేధం విధించాలని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం అనంతరం సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్‌ల మధ్య వాడివేడి సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. వీడియోలో ఇద్దరి మధ్య సంభాషణ వినిపించనప్పటికీ, గోయెంకా ముఖ కవళికలు, పంత్ సమాధానం చెబుతున్న తీరు గమనిస్తే ఎంతో తీవ్రతతో కూడిన చర్చగానే కనిపించింది. తాజాగా లలిత్ మోదీ సంజీవ్ గోయెంకా ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ‘లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఒక లూజర్, జోకర్. అతని ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడుతున్నాను. మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను తీసుకొచ్చాము. అంతేకానీ క్రికెట్‌కు ఎటువంటి సంబంధం లేని ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఆటగాళ్లపై అజమాయిషీ చెలాయించాలని చూడడం ఎంతమాత్రం సరైనది కాదు. ఒకవేళ ఇప్పటికీ నేను ఐపీఎల్ చైర్మన్‌గా ఉండుంటే సంజీవ్ గోయెంకాపై తక్షణమే నిషేధం విధించడంతో, జట్టులో అతని యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. సంజీవ్ గోయెంకా ఒక అవకాశవాది. నిజానికి ఐపీఎల్ నిబంధనల్లో ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకునేందుకు ఒక క్లాజ్‌ను ఏర్పాటు చేశాం. బీసీసీఐ ఆ క్లాజ్‌ను పరిశీలించి సంజీవ్ గోయెంకాపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజాయితీకి అధిక ప్రాధాన్యమిస్తే మంచిదని నా అభిప్రాయం.’ అని చెప్పుకొచ్చాడు.I told you this guy @DrSanjivGoenka owner of @LucknowIPL is a complete looser and joker of the highest order - i am seriously embarrassed with his behaviour. I created the @IPL for fans and players alike. Not for this to happen every time every year. If I was still Chairman and… https://t.co/5mHzg8RAY1— Lalit Kumar Modi (@LalitKModi) April 2, 2026కనిపించేదంతా నిజం కాదు..అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంజీవ్ గోయెంకా, పంత్ సంభాషణకు సంబంధించిన వీడియోపై లక్నో యాజమాన్యం స్పందించింది. ‘మీ కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. పంత్, గోయెంకాల మధ్య సీరియస్ చర్చ జరుగుతున్న వీడియో క్లిప్పింగ్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్చేశారు. కానీ అంతకముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వీడియోను మీ ముందు ఉంచుతున్నాం. నిజం తెలుసుకోండి’ అంటూ పోస్ట్ చేసింది.లక్నో యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో పంత్, గోయెంకాలు మాట్లాడు కోవడానికి ముందు నవ్వుతూ ఒకనొకరు ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ మ్యాచ్‌కు సంబంధించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్కాగా 2024 సీజన్లో అప్పటి లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కూడా గోయెంకా ఇలాగే ప్రవర్తించిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. బహిరంగంగానే కెప్టెన్‌పై గోయెంకా అసహనం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. తాజగా పంత్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడని భావిస్తున్న తరుణంలో లక్నో ఫ్రాంచైజీ కొత్త వీడియోను రిలీజ్ చేసి అనుమానాలకు తెరదించింది.Not everything you see is the true story, here’s the unfiltered post match vibes, when cameras don’t cut. pic.twitter.com/EiPMWrmlkQ— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2026చదవండి: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం!
ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్లో బోణీ చేసింది. తెలుగు కుర్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి తనకున్న ఆల్‌రౌండర్ ట్యాగ్‌కు న్యాయం చేస్తూ మొదట బ్యాట్‌తో, ఆపై బంతితో మెరిసి జట్టు విజయంలో భాగం కావడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగాను. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. గత సీజన్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం సాగలేదు. ఆ సీజన్లో నేను గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు నా బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాను. నేను పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో నితీశ్‌కుమార్ మొదట బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 39 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోరు 200 దాటడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రింకూ సింగ్, అనుకుల్‌రాయ్‌లను ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు బ్రేక్ అందించాడు. Ishan Kishan has been brilliant in his captaincy: Nitish Kumar Reddy#IPL2026 #KKRvsSRHpic.twitter.com/FW8x1rzwXw— Khan (@ccricket713) April 3, 2026చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్! -
గెలుపు జోష్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో అభిషేక్ అసభ్య పదజాలం వాడినట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.మ్యాచ్‌లో ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ అంగీకరించాడు. ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్ ల నుండి కూడా సస్పెన్షన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు.అరుదైన రికార్డు..గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. పనిలో పనిగా అభిషేక్ తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున వంద సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ (143 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (101 సిక్సర్లు), క్లాసెన్ (89 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (64 సిక్సర్లు), హెడ్ (50 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 🚨 Meet Abhishek Sharma a FAILURE product of IPL 🚨- Matches: 78- Runs: 1822- AVERAGE : 26.79Strike Rate: 162.39- Ducks- 3- Fifties - 9- Centuries - 1Look at his average 26.79 which is below average of any player.pic.twitter.com/BjRi1v8aMz— manzur shaban (@Manzurshaban123) April 2, 2026చదవండి: రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా! -
రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ ఒకడు. రూ. 25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్లకే జాక్పాట్లు తగులుతున్నాయి. అయితే గ్రీన్ అంత హార్డ్ హిట్టర్ బ్యాటర్ కూడా కాదు. వన్డే ఫార్మాట్లో మంచి బ్యాటర్ అయిన కామెరున్ గ్రీన్ టీ20ల్లో స్ట్రైక్‌రేటు కూడా సాధారణంగానే ఉంటుంది. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోని గ్రీన్ తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. దీనికి తోడు అతడిని దురదృష్టం వెంటాడింది. మలింగ ఓవర్లో రఘువంశీ నేరుగా షాట్ కొట్టగా బంతి బౌలర్ కాలికి తగిలి కొద్ది దూరం వెళ్లింది. ఇదే అదనుగా రఘువంశీ, గ్రీన్ కాస్త సంకోచిస్తూనే పరుగు ప్రారంభించారు. అయితే వెంటనే తేరుకున్న మలింగ బంతిని అందుకొని నాన్‌స్ట్రయికర్ ఎండ్ వైపు స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో రఘువంశీ తాను రనౌట్ అయినట్లుగా భావించి తిరుగుముఖం పట్టాడు. కానీ బౌండరీ లైన్ వద్ద అతడిని ఆపిన అంపైర్లు రీప్లేను పరిశీలించారు. పరుగు తీసే క్రమంలో ఇద్దరూ బ్యాటర్లు దాదాపు ఒకే లైన్లో ఉన్నారు. గ్రీన్ ఇంకా రఘువంశీని దాటలేదు. దాంతో నిబంధన ప్రకారం గ్రీన్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రీన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురయ్యాడు. ‘రనౌట్ అయి బతికిపోయాడు.. లేదంటే మరోసారి విమర్శలకు గురయ్యేవాడే’..‘ 25 కోట్లు దండగ అని మరోసారి నిరూపించాడు’ అని కామెంట్లు చేశారు.A confusion between Raghuvanshi and Green. pic.twitter.com/wljEeRqlHF— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2026చదవండి: కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు! -
కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఛేదనలో మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీనికి తోడు టార్గెట్ ఎక్కువగా ఉండడం కూడా కేకేఆర్ కొంపముంచింది. అయితే జట్టు ఓడినా ఒక్క ఆటగాడు మాత్రం గెలిచాడు. అతడే జింబాబ్వేకు చెందిన బ్లెసింగ్ ముజరబానీ.ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మాత్రం ముజరబానీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన ముజరబానీ 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ పరంగా చూసుకుంటే ఓవర్‌కు 10 పరుగుల చొప్పున ఇచ్చినప్పటికీ బ్యాటింగ్ పిచ్‌పై ముజరబానీ ప్రదర్శన తీసిపారేయలేము. పైగా అతడు తీసిన నాలుగు వికెట్లలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్లో సికందర్ రజా తర్వాత జింబాబ్వే నుంచి ఆడుతున్న క్రికెటర్ ముజరబానీ మాత్రమే. మొదట వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడినా తన ప్రదర్శనతో మాత్రం అభిమానుల మనుసులు గెలుచుకున్నాడు.వేలంలో అమ్ముడుపోలేదు..జింబాబ్వే ఆటగాడు అయిన బ్లెసింగ్ ముజరబానీకి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగిన ముజరబానీని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అయితే అదృష్టం ముజరబానీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఇతర కారణాల రీత్యా బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకూడదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో బీసీసీఐ ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్న బంగ్లా ఆటగాళ్లను బహిష్కరించాలని సందేశాలు పంపింది. దీంతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.వెతుక్కుంటూ అవకాశం..అతడి స్థానంలో నిఖార్సైన బౌలర్ కోసం వెతికింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే తరఫున 6 మ్యాచ్‌లాడిన బ్లెసింగ్ ముజరబానీ 7.88 ఎకానమీ రేట్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. మొదట అసలు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిన ముజరబానీపై కేకేఆర్ కన్ను పడింది. దీంతో ముస్తాఫిజుర్ స్థానంలో ముజరబానీని రీప్లేస్ చేస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది.ఎవరీ ముజరబానీ?29 ఏళ్ల ముజరబానీ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఏడేళ్ల ప్రాయంలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ముజరబానీకి అతని హైట్ ప్లస్ అయింది. 6 అడుగుల 8 అంగుళాల పొడవు ఉండే ముజరబానీ వేసే బౌన్సర్లు బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాయి. అలా 2017లో జాంబాబ్వే మాజీ క్రికెటర్ తెటెండా తైబు కళ్లలో పడిన ముజరబానీ రైజింగ్ స్టార్స్ అకాడమీలో మూడు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకొని బౌలింగ్‌లో మరింత రాటుదేలాడు. 2017లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముజరబానీ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 67 వికెట్లు, 57 వన్డేల్లో 70 వికెట్లు, 88 టీ20ల్లో 105 వికెట్లు పడగొట్టాడు.మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 243 వికెట్లు పడగొట్టిన ముజరబానీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడంలో ముజరబానీదే కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో ముజరబానీ 17 పరుగులకే 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అంతేకాదు రిచర్డ్ నగరవా, సికందర్ రజా తర్వాత జింబాబ్వే తరఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్‌గానూ ముజరబానీ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన నితీశ్‌కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?The creative says it 😌 pic.twitter.com/Ta6bZ4lm5B— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026Petition to change the word 𝐬𝐚𝐟𝐞 in dictionary to 𝐑𝐢𝐧𝐤𝐮 😌💜pic.twitter.com/3q7gcyXvVo— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026 -
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. -
‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెటర్లలో తనకు స్నేహితులెవరు లేరని, తన ఆరాధ్య క్రికెటర్ మా నాన్న సచిన్ టెండూల్కర్ ఎంతమాత్రం కాదని అర్జున్ చెప్పడం ఆసక్తిగా అనిపించింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్‌జెయింట్స్‌కు ట్రేడ్ అయిన అర్జున్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అవకాశం వస్తుందా? రాదా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు అర్జున్ టెండూల్కర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు ’ అని అడిగిన ప్రశ్నకు అర్జున్ చాలా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘గోవాలోని నా ఇంట్లో ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటితో ఆడుకుంటూ సమయం గడుపుతాను. అదే నా ప్రశాంతతకు అసలు కారణం' అని అర్జున్ వివరించాడు. ఒత్తిడితో కూడిన క్రికెట్ ప్రపంచం నుండి దూరంగా ఉండటానికి ఈ మూగజీవాలు తనకు ఎంతో సహాయం చేస్తాయని తెలిపాడు.సాధారణంగా ఆటగాళ్లకు ఎక్కువగా తోటి క్రికెటర్లే స్నేహితులుగా ఉంటారు. కానీ అర్జున్ మాత్రం తాను ఇందుకు విరుద్ధమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నాకు నిజంగా క్రికెటర్ స్నేహితులు లేరు. నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి క్రికెట్‌తో పెద్దగా పరిచయం కూడా లేదు. అందుకే నేను వారితో కలిసినప్పుడు అస్సలు క్రికెట్ గురించి మాట్లాడను’ అని చెప్పాడు. దీనివల్ల ఆట నుంచి తనకు మంచి విరామం దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు.క్రికెట్ దిగ్గజం కుమారుడు కావడంతో అర్జున్ టెండూల్కర్ తరచూ విమర్శలకు గురవ్వడం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ‘విమర్శలంటే మీకు భయమా?’ అని అడిగిన ప్రశ్నకు, అర్జున్ ఏమాత్రం తడబడకుండా.. ‘లేదు, నాకు అస్సలు భయం లేదు’ అని చాలా ధీమాగా సమాధానమిచ్చాడు. ఇక తన ఫేవరెట్ క్రికెటర్ తన నాన్న సచిన్ టెండూల్కర్ కాదని, మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ఆరాధ్య క్రికెటర్ అని పేర్కొనడం విశేషం. అతని బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు.ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ తన తండ్రిలా మాత్రం టీమిండియాలో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. తండ్రి అండతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు పలు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. IPL-2026 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్లో 5 మ్యాచ్‌లాడిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్Shubhankar: How do you keep yourself so calm and cool?Arjun: I have 5 dogs in Goa & I spend time playing with them.Shubhankar: Do you have friends who are cricketers?Arjun: I don’t really have cricketer friends, most of my friends don’t play cricket.pic.twitter.com/gZJMrcO7Df— Cricketopia (@CricketopiaCom) March 31, 2026 -
మ్యాచ్ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్‌పై ప్రశంసలు
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ హీరో కచ్చితంగా కూపర్ కనోలీనేనని, అతడి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గిల్‌పై శ్రేయస్ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. శ్రేయస్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్‌తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్‌తో కూడా చెప్పాను. శుభ్‌మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్‌కు అనర్హత -
వాళ్లకు కంటగింపుగా ఉన్నా.. గంగూలీకి సంతోషమే!
భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్టులు నిర్వహించా లన్నాడు. ఇటీవల 2026–27 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. ఇందులో విఖ్యాత క్రికెట్ మైదానం ‘ఈడెన్ గార్డెన్స్’ను కాదని ఆస్ట్రేలియాతో టెస్టు కోసం గువాహటి వేదికను ఎంపిక చేసింది. కోల్‌కతా వాసులు, క్రికెట్ అభిమానులకు ఇది కంటగింపుగా ఉన్నా.. బోర్డు నిర్ణయాన్ని తాజాగా గంగూలీ సమర్థించాడు. ‘మాజీ క్రికెటర్‌గా, బెంగాలీగా, క్యాబ్ అధ్యక్షుడిగా ఈడెన్‌లో ఆ్రస్టేలియా లాంటి గట్టి ప్రత్యర్థితో టెస్టులు జరిగితే చాలా సంతోషిస్తాను. అలాగే ఓ సగటు భారతీయుడిగా దేశంలోని మిగతా వేదికల్లోనూ గొప్పగొప్ప మ్యాచ్‌లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. రెగ్యులర్‌గా ఐపీఎల్ పోటీలకు ఈడెన్ గార్డెన్స్ క్రమం తప్పకుండా ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ నిర్వహించడం ఎంత బాగున్నా... మిగతా వేదికలను కూడా పట్టించుకోవడం అంతే ముఖ్యం. దేశంలోని పలు నగరాల్లోని క్రికెట్ మైదానాలన్నీ బాగున్నాయి. అలాంటపుడు టెస్టుల్ని కేవలం కొన్ని నగరాలకే పరిమితం చేయడం సమంజసం కాదు’ అని దాదా వివరించాడు. గువాహటి, రాంచీ సహా మిగతా నగరాల్లోనూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు దీటైన వేదికల్ని సిద్ధం చేశారని గంగూలీ కితాబిచ్చాడు. చదవండి: పోరాటానికి పరిమితులెందుకు? -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతీ సీజన్లో తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లో అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కనోలీ. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా కడదాకా నిలిచి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా’ నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూపర్ ఐదో స్థానంలో ఉన్నాడు. కూపర్ కంటే ముందు మెక్కల్లమ్ (158 నాటౌట్), మైక్ హస్సీ (116 నాటౌట్), షాన్ మార్ష్ (84 నాటౌట్), కైల్ మిల్స్ (73) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒక దశలోఈజీగా గెలవాల్సిందే. కానీ ప్రసిధ్ క్రిష్ణ సూపర్ స్పెల్ వేసి శ్రేయస్, స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను ఔట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన కూపర్ కనోలీ కడదాకా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన కూపర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్నా వెన్ను గాయం కారణంగా లీగ్‌లో అతను బౌలింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడతాడని పంజాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనోలీ కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.ఎవరీ కూపర్ కనోలీ?ఆస్ట్రేలియాకు చెందని కూపర్ కనోలీ 2003, ఆగస్టు 22న పెర్త్‌లో జన్మించాడు. 22 ఏళ్ల కూపర్ ఆస్ట్రేలియా తరఫున 2024 సెప్టెంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన నాలుగు నెలల్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కూపర్ అరుదైన ఘనత సాధించాడు. 2022-23 బీబీఎల్ ఫైనల్లో కూపర్ ప్రదర్శన అతడికి గుర్తింపునిచ్చింది. కూపర్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు...ఇంగ్లండ్‌కు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ... ఐపీఎల్లో ఏడు సెంచరీలు సహా నాలుగు వేలకు పైగా పరుగులు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర... గత ఏడాది కూడా గుజరాత్ తరఫున 163 స్ట్రయిక్ రేట్‌తో 538 పరుగులు... కానీ ఇప్పుడు జోస్ బట్లర్ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. బౌండరీలు కాదు కదా సింగిల్ తీయడమే కష్టంగా మారిపోయింది. తనపై వస్తున్న విమర్శలకు బట్లర్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్తాడేమో చూడాలి..ఇటీవల టీ20 ప్రపంచకప్‌లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 87 పరుగులే చేసిన బట్లర్ ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. నిజానికి రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో బట్లర్ ఆట ఏమాత్రం బాగా లేదు. గత నాలుగు ఐసీసీ టోర్నీల్లో కలిపి (రెండు టీ20 ప్రపంచకప్‌లు, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ) ఇంగ్లండ్ తరఫున 28 ఇన్నింగ్స్‌లలో బట్లర్ ఒకే ఒక అర్ధసెంచరీ చేయడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. అయితే ఐపీఎల్‌కు వచ్చేసరికి అన్నీ వెనక్కి తోసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి చెలరేగుతాడని ఆశించిన టైటాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లో ఉన్నంత సేపు బట్లర్ చాలా ఇబ్బందిగా కనిపించాడు. అసలు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. తన తొలి 30 బంతుల్లో అతను 11 డాట్ బాట్స్ ఆడాడు. ఆ తర్వాత లెక్క సరి చేసేందుకు అతను చాలా శ్రమించాడు. స్వీప్, రివర్స్ స్వీప్‌లు ప్రయత్నించినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. చివరకు చహల్ బౌలింగ్‌లో వరుసగా రెండు డాట్ బాల్స్ తర్వాత అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కేవలం 115.15 స్ట్రయిక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ముగించడం బట్లర్ స్థాయికి సరిపోదని క్రికెట్ ఫ్యాన్స్ వాపోయారు.2022లో ఆరెంజ్ క్యాప్..2022 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 868 పరుగులు చేసిన బట్లర్ ఆ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 2023, 2024 సీజన్లలోనూ బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫునే ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2025 మెగావేలంలో బట్లర్‌ను దక్కించుకునేందుకు రాజస్తాన్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరకు బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 15.06 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో గుజరాత్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 538 పరుగులు సాధించాడు. లెక్క సరిచేయాలి..కానీ ఈ సీజన్లో మాత్రం బట్లర్ బ్యాట్ మూగబోయినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ అయినప్పటికీ బట్లర్ ఆడిన తీరు అతడు ఫామ్‌లేమితో సతమత మవుతున్నట్లు అర్థమవుతుంది. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బట్లర్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు. రాబోయే మ్యాచ్‌ల్లో బట్లర్ మెరవాలని కోరుకుందాం. చదవండి: చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో! -
ఐపీఎల్ 2026లో విషాదం
ఐపీఎల్ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ ముంబైలోని తన హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఆయన పని చేశారు. ఆ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది స్పేర్ లాక్‌తో డోర్ ఓపెన్ చేసి చూడగా లాంగ్‌ఫోర్డ్ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాంగ్‌ఫోర్డ్ కెరీర్ బ్రిటిష్ సిటిజన్ అయిన లాంగ్‌ఫోర్డ్ ఐపీఎల్ 2026లో ZOOM కమ్యూనికేషన్స్ తరఫున ఫ్రీలాన్స్ విజన్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్ లీగ్, 2024 పారిస్ ఒలింపిక్స్, 2010 FIFA వరల్డ్ కప్ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్స్‌లో కూడా పని చేశారు. లాంగ్‌ఫోర్డ్‌కు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి అసైన్మెంట్గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (78), ర్యాన్ రిక్ల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై ఇండయన్స్ ఘన విజయం సాధించింది. -
చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్కే ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో చెన్నై సూపర్‌కింగ్స్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేకపోవడం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసినట్లయింది. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓటమితోనే సీఎస్కేను తప్పు బట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కూర్పు గందరగోళం..కానీ మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోయే ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సీజన్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకుంటాయి. దీంతో సీజన్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జట్లు గెలవాలనే సంకల్పంతోనే ఆడుతుంటాయి. వాస్తవానికి సీఎస్కే జట్టు కూర్పు కొంత గందరగోళంగానే కనిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడంతో సర్ఫరాజ్‌ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దింపితే వేరుగా ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సర్ఫరాజ్ ముంబై తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ సీఎస్కే సర్ఫరాజ్ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.మిడిలార్డర్ ఫెయిల్సాధారణంగా మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు పరుగులకే పరిమితం కావడం, అండర్-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరడం సీఎస్కేను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్, సంజూ శాంసన్, దూబే మినహా మిగతావారంతా జూనియర్లే. దూబే విఫలం..ఈ నేపథ్యంలో బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు నిర్లక్ష్య ఆటతీరుతో వికెట్లు పారేసుకోవడం కూడా సీఎస్కే కొంపముంచింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే ఫినిషర్‌గా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సీన్‌ను ఇప్పుడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున పునరావృతం చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వచ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించినప్పటికీ.. అప్పుడున్న పరిస్థితుల్లో సిక్సర్లు బాదడం కంటే ఇన్నింగ్స్ నిర్మించడంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే తర్వాత బ్యాటర్లు పెద్దగా లేరు. అయితే సీఎస్కే తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ ఓవర్టన్కు దూబే నుంచి సహకారం అంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. దూబే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే కనీసం 170 పరుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజరీలో దూబే నిలబడి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అతడి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్కే లో స్కోరింగ్ మ్యాచ్‌లను కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కనిపించిన ధోని లోటు!అయితే అప్పుడు ధోని మాస్టర్ మైండ్‌లా వ్యవహరించి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడంలో సలహాలు, సూచనలు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావడంతో ఆ ప్రభావం కనిపించింది. ధోని ఉన్నప్పుడు కూడా సీఎస్కే మ్యాచ్‌లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు.కానీ ధోని కేవల సీఎస్కే ఆటగాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజన్లుగా చివర్లోనే బ్యాటింగ్ వస్తున్నాడు. కాని అతడిచ్చి సలహాలు సీఎస్కే కెప్టెన్లు తప్పకుండా పాటించి ఫలితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫీల్డింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. కానీ నిన్నటి రాజస్తాన్ మ్యాచ్‌లో ఆటగాళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రమాదకర సూర్యవంశీ క్యాచ్‌ను కార్తిక్ శర్మ విడిచి పెట్టడం, ఆ తర్వాత బౌండరీ వెళ్లకుండా బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఓటమికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజన్లో తొలి మ్యాచ్ మాత్రమే కావడంతో రాబోయే మ్యాచ్‌ల్లో తప్పులను సరిదిద్దుకొని ఆడాల్సిన అవసరం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్, ధోని ఎప్పుడు ఆడతారన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి వీరిద్దరు జట్టులోకి వచ్చేలోపూ తొలి హాఫ్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-4లో నిలిచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 17 ఏళ్ల తర్వాత తన సొంత గూటికి చేరాడు. తనను వెలుగులోకి తీసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమవారం సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే జడేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే తనకు ప్రత్యర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ మ్యాచ్ గెలవడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. ముఖ్యంగా సీఎస్కే ఆల్రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్‌తో పని సులువు చేశారు. లోస్కోరింగ్, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్ఆర్హెచ్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్‌కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్‌కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. తాజాగా 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్కే జడేజాను రాజస్తాన్‌కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు.జడ్డూ ఎమెషనల్2012 నుంచి 2025 వరకు సీఎస్కే జట్టులో కొనసాగిన రవీంద్ర జడేజా సోమవారం మ్యాచ్‌లో భాగంగా సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఎమెషనల్ అయినట్లు తెలుస్తోంది. 9వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నిలబడిన జడేజాను చూస్తూ అభిమానులు సీఎస్కే.. సీఎస్కే అంటూ అరవడం కనిపించింది. ఇదే సమయంలో కెమెరాలు జడేజా వైపు తిప్పగా, జడ్డూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నట్లుగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జడేజా సీఎస్కే వదిలి వెళ్లినప్పటికీ తమ మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్‌గా జడేజా ఐపీఎల్లో 255 మ్యాచ్‌లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm— rocket.jadeja (@sherjedeja) March 30, 2026చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై పెద్దగా నిరాశ చెందడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతాము. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, దీంతో జట్టులో అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
‘దొరికితే అంతే సంగతి.. అందుకే తప్పించుకున్నా’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యవంశీ సీఎస్కేతో మ్యాచ్ ముగిసిన అనంతరం దూకుడైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..‘ నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేక్ కటింగ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోయాను. ఇక సీఎస్కేతో మ్యాచ్ విషయానికొస్తే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. అయితే మొదట్లో బ్యాటింగ్ కాస్త కష్టమనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ నా పని సులువయింది. డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ సీఎస్కే విధించిన లక్ష్యం చిన్నది కావడంతో పవర్ ప్లేలో వీలైనంత స్కోర్ చేయాలని భావించాం. ఒకవేళ స్కోర్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ నేను ఎక్కడా ఆ అవకాశం తీసుకోలేదు. మా కోచ్‌లు కూడా ప్రతి బౌలర్పైనా అటాకింగ్ గేమ్ ఆడమని చెప్పారు. నేను వాళ్ల మాటలను తూచా తప్పకుండా పాటించాను. ఇక ప్రతీ బంతి తర్వాత జైస్వాల్‌తో మాట్లాడుతూనే వచ్చాను. అతను ఎక్కువగా సింగిల్స్ తీసి నాకు స్ట్రైకింగ్ ఇచ్చి ప్రోత్సహించడంతో స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడగలిగాను’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన ఆట మొదలుపెట్టేశాడు. అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ అర్థసెంచరీ సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురి రికార్డులకు చెక్ పెట్టాడు ఈ బీహార్ చిన్నోడు. మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్లలో 16 బంతుల్లో అర్థసెంచరీలు సాధించిన సురేశ్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. చెన్నై విధించిన టార్గెట్ చిన్నది కావడంతో చప్పగా సాగుతున్నమ్యాచ్ను సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన జాబితాలో రెండు సూర్యవంశీ పేరిటే ఉండడం విశేషం. 2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. తాజాగా సీఎస్కేపై 15 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని తన రికార్డును తానే సవరించుకున్నాడు. కాగా 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన జైస్వాల్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 2018లో జాస్ బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 18 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అంతేకాదు లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మరికొన్ని రికార్డులు కూడా మ్యాచ్‌లో నమోదయ్యాయి. First ball of IPL 2025: SIX 😮💨Second ball of IPL 2026: SIX 😮💨pic.twitter.com/oJjCeUhf5p— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లలో రాజస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌తో కలిసి సంయుక్తంగా ఉన్న రాజస్తాన్ సీఎస్కేపై తాజా దానితో కలిపి 16 విజయాలు నమోదు చేసింది. తొలి స్థానంలో ముంబై (21 విజయాలు) ఉంది. 13 విజయాలతో ఆర్సీబీ మూడో స్థానంలో, 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో, 11 విజయాలతో కేకేఆర్ ఐదో స్థానంలో ఉన్నాయి.2020 నుంచి చూసుకుంటే సీఎస్కేతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ రాయల్స్ 9 విజయాలు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో నిలవడం విశేషం.ఐపీఎల్లో 120 ప్లస్ స్కోర్లను అత్యంత తక్కువ ఓవర్లలో ఛేదించిన నాలుగో జట్టుగా రాజస్తాన్ నిలిచింది. గతంలో ఎస్ఆర్హెచ్ (9.4 ఓవర్లలో), పంజాబ్ కింగ్స్ (11.1 ఓవర్లలో), డెక్కన్ చార్జర్స్ (12 ఓవర్లలో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: రాయల్స్ రాజసం -
టైటాన్స్‌తో పంజాబ్ ఢీ.. పంజా విసిరేదెవరు?
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్‌తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్‌రేట్‌పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్‌తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చదవండి: సినెర్దే మయామి మాస్టర్స్ -
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
-
IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఖరీదైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఖరీదైన జట్టుగా మాత్రమే గాక క్యాచ్ రిచ్ లీగ్‌లో అత్యధిక టైటిల్స్ కొట్టిన జట్టుగానూ ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో కలిసి సమానంగా ఉంది. ముంబై ఇండియన్స్ యాజామాన్యం ఎవరన్నది అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ముకేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓనర్. అంబానీ ఫ్యామిలీ ఏది చేసినా రిచ్‌గానే కనిపిస్తుంటుంది. ఐపీఎల్‌లోనూ అది ఎన్నోసార్లు స్పష్టంగా తెలిసొచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలిచిన ప్రతీసారి అందులో ఉండే ఆటగాళ్లకు అంబానీ ఫ్యామిలీ ఎన్నో విలువైన కానుకలు కూడా అందించింది. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడింది. ముంబై ఇండియన్స్ విజయం సంగతి పక్కనబెడితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.అదేంటంటే.. కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ ఫ్యామిలీకి వాంఖడే స్టేడియం డగౌట్‌కు సమీపంలో వేసిన ప్రత్యేక బ్లూ సోఫాలో ఆసీనులయ్యారు. మ్యాచ్ ఆద్యంతం అక్కడే కూర్చుని నీతా అంబానీ జట్టు సభ్యులను చీర్ చేశారు. అయితే అభిమానులకు ఇక్కడే ఒక సందేహం కలిగింది. వాస్తవానికి ఏ ఫ్రాంచైజీ ఓనర్ అయినా బాక్స్‌లో లేదా అభిమానుల మధ్యలో కూర్చొని మ్యాచ్ వీక్షించడం ఆనవాయితీ. కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేసి మైదానం డగౌట్లో ప్రత్యేక సోఫాలో అంబానీ ఫ్యామిలీని ఎందుకు కూర్చోబెట్టా రన్నది ఆసక్తి కలిగించింది. మరి అంబానీ ఫ్యామిలీకే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్లకు ఎందుకు వేయరన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తాయి. గతంలోనూ అంబానీ కుటుంబం ఎందుకు మైదానం సమీపంలో వేసిన సోఫాలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షిస్తారనే ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి.నీతా అంబానీ టీమ్ ఓనరే కాదు.. ఆమె ముంబై జట్టుకు సీఈవో. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి నీతా అంబానీ తరచూ హాజరవుతూ ఉంటారు. ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు అంబానీ ఫ్యామిలీ వేరే టీమ్ ఫ్రాంచైజీకి కూడా స్పాన్సర్‌గా వ్యవహరి స్తుంటారు. దీనికి తోడు భారత్‌లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ వద్ద డబ్బులకు కొదవ లేకపోవడంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐకి కూడా అంబానీ ఫ్యామిలీ స్పాన్సర్‌గా వ్యవరిస్తున్నట్లు వార్తలున్నాయి. అందుకే బీసీసీఐ కూడా అంబానీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడం లేదనిపిస్తోంది. బహుశా ఈ కారణం చేతనే ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా మైదానం డగౌట్ సమీపంలో బ్లూ సోఫాను ఉంచుతున్నట్లుగా అనిపి స్తోంది. ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరోసారి వైరల్‌గా మారాయి. Nah man Nita Ambani just showed her power on live television😭😭 pic.twitter.com/tNXU262FTx— ` (@McgMadMan) March 30, 2026చదవండి: టైగర్‌వుడ్స్‌కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్! -
అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!
శార్దూల్ ఠాకూర్.. ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌలర్ కాదు.. స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్‌లోనూ పెద్దగా వైవిధ్యత కనిపించదు. కానీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమవుతూ వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకొని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.అయితే శార్దూల్ ఠాకూర్ టీ20 క్రికెట్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో ఎక్కడైనా బౌలింగ్ చేయడంలో సమర్థుడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లనూ పవర్ ప్లేలో ఒకటి, మిడిల్ ఓవర్లలో ఒకటి, డెత్ ఓవర్లలో ఒకటి ఇలా మూడు వికెట్లు తీశాడు. సాధారణంగా ఒక బౌలర్ వికెట్లు తీస్తూ ఫామ్‌లో ఉన్నట్లయితే అతడితో వరుస ఓవర్లు వేయించి ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జట్టు కెప్టెన్‌కు బౌలింగ్ విషయమై ముందే క్లారిటీ ఇస్తాడట. అందుకే కెప్టెన్లకు అవసరమైనప్పుడు బౌలింగ్‌కు వచ్చి వికెట్లు తీయడం శార్దూల్‌లో ఉన్న ప్రత్యేకత. అంతేకాదు శార్దూల్ తన బౌలింగ్‌లో ఒకే రకం శైలిని ఎక్కువసార్లు ఉపయోగించు. సీమ్, పేస్‌ను మిక్స్ చేస్తూ వచ్చే స్లోపేస్ బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ శార్దూల్ దానినే ఫాలో అయ్యాడు. అందుకే ఫిన్ అలెన్, అజింక్యా రహానే, కామెరూన్ గ్రీన్‌లు ఔటైన విధానం పరిశీలిస్తే శార్దూల్ బౌలింగ్‌పై మరింత స్పష్టత వస్తుంది. ఇక 2012 వరకు ముంబై ఇండియన్స్‌కు నెట్‌బౌలర్‌గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జట్టుకు బుమ్రా తర్వాత ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్ పదేళ్లలో ఆరుజట్లు మారాడు. పదేళ్ల తర్వాత కానీ సొంత జట్టుకు ఆడే అవకాశం రాలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని శార్దూల్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా తరఫున 13 టెస్టుల్లో 377 పరుగులు, 33 వికెట్లు; 47 వన్డేల్లో 329 పరుగులు, 65 వికెట్లు; 25 టీ20ల్లో 69 పరుగులు సహా 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 106 మ్యాచ్‌లాడి 325 పరుగులు చేయడంతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’ -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపరింగ్ వివాదం పీఎస్ఎల్లో కలకలం రేపుతోంది. ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖలందర్స్ బంతిని ట్యాంపరింగ్ చేసినట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారణకు వచ్చిన అంపైర్ లాహోర్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా 14 పరుగుల నుంచి 9 పరుగులకు తగ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్ఎల్లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు! -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్‌లో రోహిత్ ఫుట్‌వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్‌తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్‌తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్‌తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్‌లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రహానే కేకేఆర్ కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్‌తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్‌లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల తర్వాత ఆ దేవుడు తమను కరుణించాడని పేర్కొన్నాడు. సీజన్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాండ్యా మాట్లాడాడు. ‘ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం. గత 13 సీజన్లను ఓటమితోనే ప్రారంభించాం. కానీ ప్రతీ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను గెలవాలనే బలమైన సంకల్పంతోనే బరిలోకి దిగేవాళ్లం. 2013 నుంచి 2025 వరకు మాకు ఓటములే ఎదురయ్యాయి. కేకేఆర్‌పై విజయం పట్ల మా జట్టు పూర్తి సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ లక్ష్యాలను ఛేధించడం అంత సులువు కాదు. తొలి ఇన్నింగ్స్‌లో కేకేఆర్ పవర్ ప్లేలో మా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు గాడిన పడి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. లేదంటే కేకేఆర్ 240 లేదా 250కి పైగా స్కోరు చేసి ఉండేదేమో. కళ్ల ముందు భారీ టార్గెట్ కనిపిస్తున్నప్పటికీ మా టాప్ ఓపెనర్లు రోహిత్- రికిల్టన్లు తమ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అదే సమయంలో రికిల్టన్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే డికాక్‌ను కాదని రికిల్టన్కు అవకాశమివ్వడం రిస్క్ అనిపించినా అతడు తన బ్యాటింగ్‌తో మా అనుమానాలను పటాపంచలు చేశాడు. ఇక రోహిత్ భయ్యా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. టీ20 క్రికెట్‌కు గ్యాప్ వచ్చినప్పటికీ గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ పాత రోహిత్‌ను గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ కేవలం మా జట్టు ఆటగాడు మాత్రమే కాదు అతను మాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ తన సొంత జట్టుకు ఆడడం లేదన్న ఫీలింగ్ అతనికి ఉండేది. నాకు తెలిసి ఇవాళ్టితో శార్దూల్‌కు ఆ ఫీలింగ్ పోయి ఉండాలి (నవ్వుతూ). ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌కు అర్థం శార్దూల్ ఠాకూర్. ఇవాళ మ్యాచ్ హీరో శార్దూల్ అని కచ్చితంగా చెప్పగలను’ అంటూ ముగించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన శార్దూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ -
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్‌పై రోహిత్ శర్మ 36 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్‌తో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్‌ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్‌ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 36 మ్యాచ్‌ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై (36 మ్యాచ్‌ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్‌పై( 32 మ్యాచ్‌ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
టీ20 వరల్డ్ కప్ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్ 2026కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడు సాధారణ టికెట్‌ను రూ. 25000కి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2026 భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను, ఓవరాల్‌గా మూడో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికా మినహా జింబాబ్వే, వెస్టిండీస్‌పై అద్భుత విజయాలు సాధించి, సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. -
ఫేవరెట్‌గా ముంబై.. భయం గుప్పిట్లో కేకేఆర్!
ఐపీఎల్ 19వ సీజన్లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ముంబై కనిపిస్తున్నప్పటికీ కేకేఆర్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ రెండు జట్లలో కేకేఆర్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్లో కేకేఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఓడించగలిగింది. వాంఖడేలో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే 10 సార్లు ముంబై విజయం సాధించడం విశేషం. అయితే ఈసారి దానిని తిరగరాసి విజయంతో సీజన్‌ను ఆరంభించాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు ముంబై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నప్పటికీ, దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఓటమితోనే ప్రారంభించిన దాఖలాలున్నాయి. మరి ఈసారి తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి దానికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) చాంపియన్స్‌గా నిలిచింది. 2020లో చివరిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై అప్పటినుంచి ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే వస్తోంది. మూడుసార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్ మరో టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పటిరవరకు 35 సార్లు తలపడగా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించింది. బలబలాల విషయానికొస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలోని నలుగురు (పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రా) ముంబై జట్టులో ఉండడం బలమని చెప్పొచ్చు. వీరితో సహా రూథర్‌ఫోర్డ్, రికిల్టన్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్లుగా మయాంక్ లేదా శార్ధూల్ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, కివీస్ మాజీ బౌలర్ బౌల్ట్ కూడా ప్రమాదకారే.ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే రహానే, సునీల్ నరైన్, సీఫెర్ట్, రఘువంశీ, రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రమణ్‌దీప్, కామెరున్ గ్రీన్‌లు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీ కీలకం. కేకేఆర్‌పై రోహిత్ శర్మ 127 స్ట్రైక్‌రేట్‌తో 967 పరుగులు సాధించగా, సునీల్ నరైన్ ముంబైతో ఆడిన మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.ముంబై తుది జట్టు అంచనా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, గజన్ఫర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్లు: మయాంక్ మార్కండే/ శార్దూల్ ఠాకూర్కేకేఆర్ తుది జట్టు అంచనా: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్)/ ఫిన్ అలెన్, కామెరున్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ త్రిపాఠి/ కార్తిక్ త్యాగి చదవండి: ‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’ -
‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’
బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చవి చూసినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కోచ్ డానియెల్ వెటోరి అభిప్రాయం వ్యక్తం చేశాడు. పడిక్కల్, కోహ్లీ, పటిదార్లు తమ బౌలింగ్ బలహీనతను ఆసరాగా చేసుకొని పరుగులు రాబట్టారని పేర్కొన్నాడు. మ్యాచ్ ఓటమి అనంతరం వెటోరి మాట్లాడుతూ.. ‘నిజానికి బంతితో మాకు మంచి ఆరంభమే లభించింది. ప్రమాదకర ఫిల్ సాల్ట్‌ను తొందరగానే పెవిలియన్ చేర్చడంలో సఫలమయ్యాం. కానీ ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించలేకపోయాం. సాల్ట్ ఔటైన తర్వాత క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టులో జాకబ్ డఫీ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాడు. కానీ మా బౌలర్లు ఆ స్థాయి బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచే గెలవాలని అన్ని జట్లకు ఉంటుంది. ఆరంభం ఘనంగా ఉంటే ఆ తర్వాత అంతా మెరుగ్గా ఉంటుందని నా నమ్మకం. ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించి మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. మా బౌలింగ్ పూర్తిగా గాడి తప్పింది. విరాట్ కోహ్లీకి, పడిక్కల్‌కు మా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇది మా రోజు కాదు. రాబోయే మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో తప్పుల్ని సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేస్తాం. డేవిడ్ పైన్, హర్ష్ దూబే వంటి బౌలర్లు రాబోయే మ్యాచ్‌ల్లో కీలకం కానున్నారు. మేము 200 పరుగులు చేసినప్పటికీ చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై ఆ స్కోరు ఏమాత్రం సరిపోదని తాజా మ్యాచ్ ద్వారా స్పష్టమవుతోంది.ఇషాన్ కిషన్, క్లాసెన్ మినహా మిగతావారు రాణించకపోవడం కూడా ఒక కారణమే. అయితే మా ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే ఔటవడం కూడా ప్రభావం చూపించింది. బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేవు. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జాకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కావ్యా మారన్‌కు అనన్య చెక్! -
కావ్యా మారన్‌కు అనన్య బిర్లా చెక్!
ఐపీఎల్లో కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానిగా ఉన్న కావ్యా మారన్ తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఎస్ఆర్హెచ్ గెలిచినా, ఓడినా కావ్యా మారన్ ఇచ్చే హావభావాలు హైలైట్‌గా నిలుస్తుండేవి. అలాంటి కావ్యా మారన్‌కు పోటీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కావ్యా మారన్‌ను పరిచయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ బెంగళూరు కావ్యా మారన్ ఎవరనే కదా మీరు అనుకుంటున్నారు. అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు అనన్య బిర్లా. బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా పెద్ద కుమార్తె. ఇటీవలే ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చేతులు మారిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టును నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎస్) సంస్థ తాజాగా.. రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకున్నాయి. బిర్లా కుమారుడు 28 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు అనన్య బిర్లా, ఆర్యమాన్ బిర్లా హాజరయ్యారు. ఆర్సీబీ జెర్సీ ధరించిన అనన్య బిర్లా చేతితో ఆర్సీబీ జెండాను ఊపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె ఇచ్చిన హావభావాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు స్టాండ్స్‌లో కావ్యా మారన్ తన ఎస్ఆర్హెచ్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తుంటే.. మరో స్టాండ్ నుంచి అనన్య బిర్లా కావ్యా మారన్‌కు పోటీగా ఆర్సీబీ జెండాను ఊపుతూ కనిపించింది. ఇది చూసిన అభిమానులు కావ్యామారన్ లాగే అనన్య బిర్లా కూడా సీజన్లో ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచ్‌లకు హాజరైతే బాగుంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి వారి కోరికను అనన్య బిర్లా మన్నించి తర్వాతి మ్యాచ్‌లకు కూడా హాజరవుతుందేమో చూడాలి. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి అనన్య మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఎవరీ అనన్య బిర్లా?1994లో ముంబైలో జన్మించిన అనన్య.. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ఆడే మిగతా మ్యాచులకు కూడా అనన్య హాజరవుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.Ananya Birla at the Chinnaswamy Stadium wearing RCB jersey. pic.twitter.com/dLWhmgwX4f— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2026 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) చదవండి:వణికిపోయిన ఇషాన్ కిషన్! -
పాపం.. వణికిపోయిన ఇషాన్ కిషన్!
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇషాన్ కిష మ్యాచ్ ఆద్యంతం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి రావడం, కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో భయంతో కనిపించాడు. బ్యాటింగ్‌లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం టెన్షన్‌తో కీపింగ్ కూడా సరిగా చేయలేకపోయాడు.ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి.బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై విన్ని అందుకుంది.మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘మొదటి 3-4 ఓవర్ల తర్వాత వికెట్ ఖచ్చితంగా బాగా సహకరించిందని నేను భావిస్తున్నాను. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాము, వచ్చేసారి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే, రెండో ఇన్నింగ్స్ వికెట్‌ను చూస్తే, బ్యాటింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంది. బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తోంది. కాబట్టి అవును, వచ్చేసారి మేము షాట్ ఎంపికలో మరింత వివేకంతో వ్యవహరించాలి’ అని చెప్పుకొచ్చాడు. -
విన్యాసాల వీరుడు.. ఫిల్ సాల్ట్
‘క్యాచ్స్ విన్ మ్యాచెస్’ అని ఊరికే అనలేదు. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు. ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. 14వ ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలోక్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైనప్పటికీ ఎస్ఆర్హెచ్తో అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి అని చెప్పొచ్చు. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కిన ముగ్గురు (ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్) డేంజర్ బ్యాటర్లే. ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ అడ్డుగోడలా నిలిచాడు. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో జాకబ్ డఫీ వేసిన బంతిని హెడ్ బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చున్న సాల్ట్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన రివర్స్ క్యాచ్ తీసుకున్నాడు. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఏదీ ఏమైనా సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ కూడా కాస్త క్లిష్టతరమైనదే. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను సాల్ట్ అందుకున్న తీరు నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్‌కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్ కొట్టిన బంతిని సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్‌లో ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను ఒడిసిపట్టడం అప్పట్లో ట్రేడ్‌మార్క్ క్యాచ్‌గా నిలిచిపోయింది. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించి విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు.𝐒𝐓𝐎𝐏 𝐖𝐇𝐀𝐓 𝐘𝐎𝐔 𝐀𝐑𝐄 𝐃𝐎𝐈𝐍𝐆 𝐀𝐍𝐃 𝐖𝐀𝐓𝐂𝐇 𝐓𝐇𝐈𝐒! 🛑🎥 Phil Salt with an absolute one-handed screamer at the ropes 🫡Do we already have the Catch of the Season on Day 1 of #TATAIPL 2026 🤔Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH |… pic.twitter.com/pPax3pVNt9— IndianPremierLeague (@IPL) March 28, 2026That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026Picking up where he left off... 🔥🔥Never change, Phil Salt. Never change. 🙏#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvSRH pic.twitter.com/gGu6BD388g— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసలైన చాంపియన్ ఆటతీరును ప్రదర్శించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల టార్గెట్‌ను ఉఫ్ అని ఉదేసింది. పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే.. కోహ్లీ మాత్రం లక్ష్య ఛేదనలో తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్కడలేని ఊపు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్టర్‌ను వెతుక్కుంటూ రికార్డులు వస్తుంటాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 4027 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత వార్నర్ (3,285), రోహిత్ శర్మ (3,238), శిఖర్ ధావన్ (2,843), రాబిన్ ఊతప్ప (2,832) వరుసగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్తో గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 100, 42, 51, 43, 69* పరుగులు చేయడం ద్వారా మరో రికార్డు లిఖించుకున్నాడు. మరిన్ని రికార్డులు..ఇక కోహ్లీకి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్‌ను కూడా అర్థసెంచరీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు. తాజాగా ఎస్ఆర్హెచ్పై అర్థసెంచరీతో ఈ సీజన్లో బ్యాటింగ్‌ను షురూ చేశాడు.ఇక ఐపీఎల్లో 200 పరుగులకు పైగా ఛేదనను అతి తక్కువ ఓవర్లలో చేధించిన జట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగులు లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో అందుకుంది.ఐపీఎల్లో 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది నాలుగోసారి. గతంలో 2025లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2024లో గుజరాత్ టైటాన్స్‌పై 200 ప్లస్ స్కోర్లు ఛేదించింది. -
సాల్ట్ వివాదాస్పద క్యాచ్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బోణీ కొట్టింది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్‌లో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ హడలెత్తించగా, ఆ తర్వాత ఛేదనలో పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొడితే.. చివరివరకు నిలిచిన మాస్టర్ చేజ్ కోహ్లీ యాంకర్ పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలో సునాయాసంగా పట్టిన సాల్ట్.. క్లాసెన్ క్యాచ్‌ను బౌండరీ వద్ద అనూహ్య రీతిలో అందుకున్నప్పటికీ అది వివాదాస్పదంగా మారింది.షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. థర్డ్ అంపైర్ మరో కోణం నుంచి పరిశీలించకుండానే నిర్ణయం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి వివాదం లేకుండా 16వ ఓవర్ చివరి బంతికి ఇషాన్ కొట్టిన భారీ షాట్‌ను సైతం సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టాడు. సూపర్ క్యాచ్‌లతో ఆకట్టుకున్న సాల్ట్... క్లాసెన్ పట్టిన అలాంటి క్యాచ్‌కే పెవిలియన్ చేరడం కొసమెరుపు. That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026చదవండి: ఆర్సీబీ అదరగొట్టింది... -
ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ
ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కొంతకాలం ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు ముందు ఈ వార్త వెలువడింది. స్టోక్స్ కౌంటీ జట్టు (డర్హమ్) కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.అతని మాటల్లో.. స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు అందుబాటులో ఉండాల్సింది. కానీ వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండవపోవచ్చు.క్యాంప్‌బెల్ ఇచ్చిన ఈ సమాచారం మేరకు స్టోక్స్ సమీప భవిష్యత్తులో క్రికెట్ ఆడటం కష్టమేనని స్పష్టమవుతుంది. స్టోక్స్ ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బంతి ముఖానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీని వల్ల అతని ముఖానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. గాయమైన ముఖంతో స్టోక్స్ పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలైంది.స్టోక్స్ చివరిగా జనవరి 8న సిడ్నీలో జరిగిన యాషెస్ టెస్ట్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌కు ముందు కూడా అతను గాయపడ్డాడు. వరుస గాయాలు అతని కెరీర్‌ను సందిగ్దంలో పడేశాయి. స్టోక్స్ వ్యక్తిగతంగా, నాయకుడిగా విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇటీవలి యాషెస్ సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. ఈ దారుణ పరాభవం తర్వాత కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్‌ను టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా గాయం స్టోక్స్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మర్చేసింది.ఆటకు దూరంగా ఉన్నా, స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్‌కు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు అతను కోచ్‌గా సేవలందిస్తున్నాడు. -
IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌తోనే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఎస్ఆర్హెచ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వయసు 27 సంవత్సరాల 253 రోజులు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలో కెప్టెన్‌గా జట్టును నడిపించనున్న రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ నిలవ నున్నాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను ఇషాన్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 2018లో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు విలియ మ్సన్ వయసు 27 సంవత్సరాల 244 రోజులు. గతంలో శిఖర్ ధావన్, మనీష్‌పాండే, భువనేశ్వర్ కుమార్‌లు కూడా తక్కువ వయసులోనే ఎస్ఆర్హెచ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను నొప్పితో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుతూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే కమిన్స్ ఈ సీజన్లో మొదటి సగం మ్యాచ్‌లకు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఎస్ఆర్హెచ్ కోచ్ డేనియల్ వెటోరి కమిన్స్ ఆడడంపై స్పష్టతనిచ్చాడు. కమిన్స్ ఫిట్‌గానే ఉన్నాడని, మరో 10 నుంచి 12 రోజుల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు కమిన్స్ ఫిట్‌నెస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించిందని తెలిపాడు. వరుస గాయాలతో ఇప్పటికే యాషెస్, టీ20 ప్రపంచకప్‌కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్‌కుమార్‌రెడ్డిలతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ సహా దేశవాలీ క్రికెటర్లు కీలకం కానున్నారు.చదవండి: వివాదంలో యువరాజ్ తండ్రి! -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం!
ఐపీఎల్ అభిమానులకు సీఎస్కే యాజమాన్యం షాకింగ్ వార్త చెప్పింది. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. చెన్నై యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై యాజమాన్యం వివరాల ప్రకారం.. ‘ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం రీహాలిటేషన్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రెండు వారాల పాటు ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘తలా’ తొందరగా కోలుకోవాలి!’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది. అయితే ధోని ఆడకపోయినప్పటికీ సీఎస్కేకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు, మూడు సీజన్లుగా ధోని జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లోనే వస్తున్న ధోని ఫీల్డింగ్‌లో మాత్రం తన మాస్టర్‌మైండ్‌కు పని చెబుతున్నాడు. కెప్టెన్‌కు విలువైన సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకుడి పాత్రకు ధోని మారిపోయాడు. 2023లో చివరిసారి ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రస్తుత సీజన్ ధోనికి ఆఖరిదని ప్రచారం జరుగుతున్న వేళ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు సీఎస్కే జట్టులో భారీ మార్పులు చేసింది. ‘డాడీస్ ఆర్మీగా’ పేరు పొందిన సీఎస్కే మినీ వేలంలో యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత చూపింది. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి అన్‌క్యాప్ ప్లేయర్లను చెరో 14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ట్రేడింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శామ్సన్ను దక్కించుకున్న సీఎస్కే జడేజా, సామ్ కరన్‌లను వదిలేసింది. మొత్తంగా ఈసారి సరికొత్తగా కనిపిస్తున్న సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్!Official StatementMS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026 -
పంతమే నెగ్గింది.. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు!
ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్‌కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్‌లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్‌సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్‌సీఏ ముందుకు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్‌ను రాయ్‌పూర్‌కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. #WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc— ANI (@ANI) March 27, 2026చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్! -
బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ షురూ కానుంది. మండు వేసవిలో రెండు నెలల పాటు సాగనున్న క్రికెట్ వినోదం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈసారి కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 30న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో ఆడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బుమ్రా శుక్రవారం సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో మెడికల్‌స్టాఫ్ పర్యవేక్షణలో బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. దీంతో కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమైతే మాత్రం ఆకాశ్ మధ్వాల్ ముంబై తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ శుక్రవారం రాత్రి మాత్రం ముంబై జట్టుకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ అక్కడికి రావడం, రోహిత్‌ను చూసిన ఆకాశ్ మధ్వాల్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం కనిపించింది. దీనికి బదులుగా రోహిత్ అతన్ని హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతానికి నెట్ బౌలర్‌గా ఉన్న ఆకాశ్ మధ్వాల్ కచ్చితంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికే ముంబై యాజమాన్యం అతన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మరో బౌలర్ అథర్వ అంకోలేకర్ కూడా దూరమవ్వడంతో ముంబై జట్టుకు ఇబ్బంది ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆకాశ్ మధ్వాల్ గతంలో (2023, 2024 సీజన్లు) ఇదే ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ మధ్వాల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆకాశ్‌ను జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్లో ఆకాశ్ రాజస్థాన్ తరఫున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు విడుదల చేయగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.చదవండి: గాయాలతో సతమతం.. ఆటకు గుడ్‌బైWe are sure you were not expecting this meet up 🥹💙 pic.twitter.com/MBbC2wMEAT— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎవిన్ లూయిస్‌కు చోటు దక్కలేదు. దీంతో 34 ఏళ్ల ఎవిన్ లూయిస్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం వైట్‌బాల్ క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)కే పరిమితమైన లూయిస్ తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ (టెస్టు ఫార్మాట్)లోనూ తాను ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఎవిన్ లూయిస్ 22 మ్యాచ్‌ల్లో 1,229 పరుగులు సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఎవిన్ లూయిస్ 67 వన్డేల్లో 2,175 పరుగులు చేశాడు. 65 టీ20 మ్యాచ్‌ల్లో 1,782 పరుగులు సాధించాడు. ఇందులో వన్డేల్లో 5 శతకాలు, టీ20ల్లో రెండు సెంచరీలు సాధించాడు. 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో ఎవిన్ లూయిస్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 176 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన క్రికెటర్‌గా లూయిస్ రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విండీస్ తరఫున అత్యధిక స్కోరు (125 నాటౌట్) సాధించిన ఆటగాడిగాను రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సంచలనాల సూర్యవంశీ! -
సంచలనాల సూర్యవంశీ!
అతడు కూడా అందరిలా సాధారణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్దగా గుర్తింపు వచ్చేది కాదేమో. కానీ 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడకముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ పట్టి కదనరంగంలోకి దూకిన తర్వాత బ్యాట్‌కు అలుపొచ్చిందేమో కానీ అతడి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.14 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ బుడతడు ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ తన ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 55 బంతుల్లోనే 175 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే పవర్‌హిట్టింగ్‌తో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ.ఇవాళ వైభవ్ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సచిన్ లాగే 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలని తహతహలాడుతున్న వైభవ్ సూర్యవంశీ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే టూ వైభవ్ సూర్యవంశీ..క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మరో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్యవంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది తన చిరకాల కోరిక అని వైభవ్ పేర్కొన్నాడు. త్వరలో జాతీయ జట్టులోకి..ఇప్పటికే అండర్-19 జూనియర్ స్థాయి క్రికెట్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనే 175 పరుగుల ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు కనీసం 15 ఏళ్లు ఉండాలన్నది నిబంధన. తాజాగా వైభవ్ సూర్యవంశీ 15వ ఏట అడుగుపెట్టడంతో సీనియర్ జట్టు లోకి తొందర్లోనే పిలుపు వచ్చే అవకాశముంది. అండర్-19 క్రికెట్లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ 18 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి.హోంగ్రౌండ్లో వేడుకలు..ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్‌తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం.ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డు లిఖించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 1.1 కోట్లకు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.ద్రవిడ్ పర్యవేక్షణలో..రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్‌డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. రైతు కొడుకు నుంచి క్రికెటర్ దాకా..2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌పై వైభవ్ పెంచుకున్న మక్కువ అతని తండ్రి సంజీవ్‌కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అలా ఇంటి వెనుక వైభవ్ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్ కోచింగ్ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్‌ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్‌గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్ క్రికెట్ కోచింగ్ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.కొడుకు కోసం పొలం అమ్మి..ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్‌లోని తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి పొలం అమ్మిన విషయం తెలిసి వైభవ్ క్రికెట్‌ను ప్రాణం పెట్టి నేర్చుకున్నాడు. సమస్తిపూర్‌లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్‌కు మంచి క్వాలిటీ కోచింగ్ కూడా అందింది. ఆయన కోచింగ్ వైభవ్‌కు ఎంతో ప్లస్ అయింది. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే.A boy with a dream who picked up a bat and has made it his mission to achieve it all 🔥Today is your day, Vaibhav Sooryavanshi 💗🎂 pic.twitter.com/oEJWupOgXp— Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2026Wishing a very happy birthday to our very own Boss Baby, Vaibhav Suryavanshi. He consistently delivers explosive performances and lights up the field with his dynamic play. All the very best for IPL 2026 Vaibhav.#Vaibhavsooryavanshi #happybirthdayVaibhavSooryavanshi pic.twitter.com/8yyl49eZTq— 𝐈𝐂𝐓 ᴬᵁᴿᴬ🇮🇳 (@AURAICTT) March 26, 2026చదవండి: భారత ఫుట్‌బాల్ జట్టుకు అవమానం! -
‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’
పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజే బంతి విషయంలో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుపు రంగు బంతి కాస్తా ఉదారంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇక బంతి ఇలా వేరే రంగులోకి మారిపోవడం తన క్రికెట్ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదంటూ హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ పేర్కొన్నాడు. లబుషేన్ మాట్లాడుతూ.. 'నిజానికి రెండో ఓవర్లోనే బంతి రంగు మారడాన్ని గమనించాను. ఇదే విషయమై అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాను. అసలు ఏం జరుగుతోంది? బంతి రంగు ఎందుకు మారుతోందంటూ అంపైర్లను అడిగాను. అయితే బంతి దుస్తులకు అదే పనిగా రాయడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నా. కానీ నా కెరీర్లో ఇలాంటి ఘటన మాత్రం ఎన్నడూ చూడలేదు. అయితే బ్యాట్‌పై ఉన్న ఏదైనా స్టిక్కర్‌పై బంతి పడి అది దానికి అతుక్కుపోవడం వల్ల బంతి రంగు మారడం చూశాను.కానీ దుస్తులకు బంతిని పదే పదే రుద్దడం ద్వారా వేరే రంగులోకి మారడం మాత్రం అరుదైన విషయమని చెప్పొచ్చు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి జరగకుండా లీగ్ నిర్వాహకులు జాగ్రత్త పడతారని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ తమ ‘ఎక్స్’ వేదికగా..‘ తొలి పింక్ బాల్ మ్యాచ్‌లో విజయం సాధించిన లాహోర్ ఖలందర్స్‌కు మా అభినందనలు’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.🚨🚨Marnus Labuschagne on the change of ball color"I did say to the umpires after the second over, What’s going on? The ball is red, it must be from the clothes or something like that. I’ve never seen anything like pic.twitter.com/VHSXouHZYx— SheR•ALI (@Sher__Ali) March 26, 2026చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!
ఆంక్షల నడుమ మొదలైన పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజునే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ సందర్భంగా బంతి రంగు మారడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వైట్‌బాల్‌ను ఉపయోగించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా బంతి గులాబీ రంగులోకి మారిపోయింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓవర్ ముగిసిన తర్వాత బంతిని పరిశీలించిన అంపైర్లు దాని స్థానంలో మరొక బంతిని తీసుకొని మ్యాచ్‌ను కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకోవడంతో ఉన్నపళంగా వైరల్‌గా మారిపోయింది. క్రీడాభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోయారు. 'బౌలర్లు పదేపదే బంతిని రుద్దడం వల్లే తెల్లబంతి కాస్తా గులాబీ రంగుకు మారిపోయి ఉంటుంది'.. 'ఇది పీఎస్ఎల్ కాదు పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా'.. 'ఇది అంతర్జాతీయ క్రికెటా లేక గల్లీ క్రికెటా అన్నది అర్థం కావడం లేదు'.. అని కామెంట్లు చేశారు. ప్రేక్షకులు లేకుండానే మొదలైన పీఎస్ఎల్లో తొలి మ్యాచ్ షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్, లబుషేన్ నేతృ త్వంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.Peak Pakistan Super League standards 😭During the very first match of PSL 11, the ball literally turned pink every time Hyderabad Kingsmen players rubbed it on their kit.Did they get knockoff kits instead of authentic ones?International league or gully-level experiment? 🤡 pic.twitter.com/Beq5zhmSkb— Brutal Truth (@sarkarstix) March 26, 2026During today’s PSL match, the ball turned pink as early as the second over because players kept rubbing it on their pants, causing the dye to transfer onto the ball.Paisa Shortage League for a reason 🤣 pic.twitter.com/QQf7wlc2qG— Tejash (@Tejashyyyyy) March 26, 2026చదవండి: ధోనిపై మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు! -
టీమిండియా హోం షెడ్యూల్ విడుదల
2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా హోం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ సీజన్లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు (9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్ట్‌లు) జరగనున్నాయి.ఈ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో మొదలవుతుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో.. టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. 🚨 FULL HOME SCHEDULE OF TEAM INDIA IN 2026-27 HOME SEASON 🇮🇳- Great work by BCCI to announce the schedule way earlier. pic.twitter.com/bWopsVcmVu— Johns. (@CricCrazyJohns) March 26, 2026డిసెంబర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటలో మూడు వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. మూడు టీ20లు రాజ్‌కోట్, కటక్, పూణేలో షెడ్యూల్ అయ్యాయి. వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు ఉంటాయి. ఇవి కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. ఈ హోం సీజన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ 21వ తేదీ నుంచి నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. తరువాతి మ్యాచ్‌లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో జరుగుతాయి. -
డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బెన్ డకెట్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే టెస్టు కెరీర్‌పై దృష్టి సారించడంతో పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు డకెట్ పేర్కొన్నాడు. తాజాగా డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బుధవారం తొలిసారి స్పందించింది. ‘బెడ్ డకెట్ తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని మాకు ముందే చెప్పాడు. బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. డకెట్ స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే పేర్కొంటాం.’ అని చెప్పుకొచ్చింది. అయితే డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే లీగ్ నిబంధనల ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డకెట్ విషయంలో ఫిట్నెస్, గాయం లాంటి అంశాలు లేవు. టెస్టు కెరీర్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు ఫ్యామిలీతో సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నప్పటికీ డకెట్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని డకెట్ అది ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు కలిపి కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బెన్ డకెట్ తాజాగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో టెస్టులపై దృష్టి సారించేందుకు డకెట్ కౌంటీల్లో నాటింగ్హమ్షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడనున్నాడు.చదవండి: కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా -
కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
సొంతగడ్డపై సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న కివీస్ మహిళలు తాజాగా చివరి టీ20లోనూ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజేక్కించుకొని స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. క్రైస్ట్‌చర్చి వేదికగా బుధవారం జరిగిన ఐదో టీ20లో సౌతాఫ్రికా మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (55 బంతుల్లో 105; 19 ఫోర్లు, 1 సిక్సర్) అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీతో ఆకట్టుకోగా.. బ్రూక్ హాలిడే (26), జార్జియా పిల్మర్ (27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సఫారీ బౌలర్లలో కాకా, తుమి సెకుహునేలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వుమెన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది. అన్నిరే డెర్క్సెన్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. నూజిలాండ్ బౌలర్లలో లియా తాహుహు 3 వికెట్లు తీయగా, సోఫీ డివైన్, అమేలియా కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అమేలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది.రికార్డులకు పాతర..ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా అమేలియా కెర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఐదో టీ20లో సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకుంది. అంతేకాదు టీ20 క్రికెట్లో వరుసగా 11సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా అమేలియా కెర్ చరిత్రకెక్కింది. సఫారీలతో జరిగిన నాలుగో టీ20లోనే ఈ రికార్డు అందుకున్నప్పటికీ తాజాగా సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. అమేలియా కెర్ కంటే ముందు చమేరీ ఆటపట్టు, రెబెక్కా బ్లేక్‌లు చెరో 9సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. పురుషుల క్రికెట్లో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మలు చెరో ఏడుసార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో 669 పరుగులు చేసిన అమేలియా బౌలింగ్‌లోనూ 12 వికెట్లు పడగొట్టింది. ఇటీవలే మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా అమేలియా కెర్ నిలిచింది.చదవండి: క్రికెటర్ నుంచి చైర్మన్ దాకా.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా? -
క్రికెటర్ నుంచి చైర్మన్ దాకా.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) అత్యంత ఆకర్షణీయమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గతేడాది ఐపీఎల్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్య హక్కులు తాజాగా చేతులు మారాయి. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) సంస్థ 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,706 కోట్లు) ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలకు అమ్మేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఆర్యమాన్ విక్రమ్ బిర్లాపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గతంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ ఆడని ఆర్యమాన్ బిర్లా ఇవాళ ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. మరి ఎవరీ ఆర్యమాన్ బిర్లా? అతని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమాన్ బిర్లా. 28 ఏళ్ల ఆర్యమాన్ ఒకప్పుడు క్రికెటర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దేశవాళ్లీల్లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు.. 9 మ్యాచుల్లో 414 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ‘క్రికెట్లో మానసిక ఒత్తిడి’ని తట్టుకోలేనంటూ 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆర్యమాన్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. తరువాత 2020 సీజన్‌కు ముందు ఆర్యమాన్‌ను రాజస్థాన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత దేశవాలీ క్రికెట్లో కానీ, ఐపీఎల్లో కానీ అవకాశాలు రాలేదు. దీంతో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన ఆర్యమాన్ బిర్లా ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్న ఆర్యమాన్ ఆ తర్వాత బేయర్స్ బిజినెస్ స్కూల్ నుంచి గ్లోబల్ ఫైనాన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆర్యమాన్ ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.ఇక ఆర్సీబీని కొనుగోలు చేయడంపై ఆర్యమాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘ఆర్సీబీ తదుపరి దశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అని ఆర్యమాన్ తెలిపాడు. ఈ సందర్భంగా తన పేరుతో ఉన్న ఆర్సీబీ జెర్సీ ఫోటోతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న ఫోటోలను కూడా ఆర్యమాన్ షేర్ చేసుకున్నాడు. చదవండి: విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్ ముద్దు! View this post on Instagram A post shared by Aryaman Vikram Birla (@aryamanvb) -
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం!
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు అరుదైన గౌరవం కల్పించింది. గత సీజన్లో రస్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ రసెల్ జెర్సీ నంబర్ 12కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేకేఆర్ ‘నైట్స్ అన్ప్లగ్డ్’ పేరిట ప్రీ సీజన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రస్సెల్ జెర్సీ నంబర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ‘రస్సెల్.. నీకు కేకేఆర్ ఇస్తున్న బహుమానం ఇదే. నీ జెర్సీ నంబర్ 12కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. ఇక మీదట 12 జెర్సీ నంబర్ నీకే సొంతం’ అని తెలిపారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫ్రాంచైజీ ఆటగాడి జెర్సీ నంబర్‌కు అధికారిక రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన రస్సెల్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘దశాబ్దానికి పైగా ఈ జట్టుతో ఎన్నో విజయాలు సాధించాను. రెండు టైటిల్స్ గెలిచాం. ఆ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. అది చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రతి మ్యాచ్‌ను నా చివరి మ్యాచ్‌లా ఆడాను’ అని వెల్లడించాడు.దశాబ్దానికి పైగా..కేకేఆర్ జట్టుతో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగిన రస్సెల్.. 2014, 2024 టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ తరఫున రస్సెల్ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు.గతంలో సచిన్, ధోని..ఇది వరకు భారత క్రికెట్లో బీసీసీఐ మాత్రమే జెర్సీ నంబర్లను రిటైర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10, ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7లను రిటైర్ చేశారు. అయితే ఐపీఎల్లో ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు. తాజా సీజన్‌కు ముందు రస్సెల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆసక్తికరంగా అతను వేలంలోకి వెళ్లకుండా కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరించి ‘పవర్ కోచ్’గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఇకపై యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నాడు.ICYMI: Jersey no. 12 forever belongs to DRE RUSS 💜 pic.twitter.com/D1cFfhuYvI— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 చదవండి: ‘ఐపీఎల్ మరో స్థాయికి వెళ్లిపోయింది’ -
‘ఈ దెబ్బతో మరో స్థాయికి ఐపీఎల్’
ఐపీఎల్లో ఫ్రాంచైజీలుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌లుగా పేరు పొందిన ఎన్బీఏ, ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ స్థాయికి సమానంగా నిలిచిందని వ్యాఖ్యానించాడు.ఇది ఐపీఎల్‌కు దక్కిన అరుదైన గౌరవమని చెప్పుకొచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది ఐపీఎల్‌కు నిజంగా శుభవార్త. 2008లో తొలిసారి నేను ఐపీఎల్ మ్యాచ్ ఆడేటప్పుడే రానున్న కాలంలో ఈ లీగ్ అత్యంత ఖరీదైనగా మారుతుందని చెప్పాను. ఇప్పుడు నా మాటలు అక్షరాల నిజమయ్యాయి. 18 సీజన్లు ముగించుకొని 19వ సీజన్‌కు విజయవంతంగా అడుగుపెట్టిన ఐపీఎల్ ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. నా దృష్టిలో ఐపీఎల్ కూడా ఎన్బీఏతో సమానం. ఐపీఎల్ ప్రసార హక్కులు ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) కూడా దాటేశాయి. సంవత్సరానికి కేవలం రెండున్నర నుంచి మూడు నెలలు మాత్రమే ఆడే ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి.’ అని గంగూలీ పేర్కొన్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. మరోవైపు లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) సంస్థ నుంచి రూ. 16,706 కోట్ల ధరకు ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు దక్కించుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. చదవండి: పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు -
రాజస్థాన్‌లోకి షనక.. కీలక సూత్రధారి అతడే!
న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ గాయంతో జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో ఫ్రాంచైజీ షనకను ఎంపిక చేసుకుంది. షనకను రూ. 2 కోట్లకు రాజస్తాన్ తీసుకుంది. దీంతో అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకొని ఐపీఎల్ ఆడనున్నాడు. ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరగా... ఇప్పుడా జాబితాలో షనక చేరనున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో షనకను ఏ ఫ్రాంచైజీ తీసుకోక పోగా... పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ జట్టు అతడిని ఎంపిక చేసుకుంది. ఇప్పుడు రాజస్తాన్ కోచ్ సంగక్కర ప్రోత్సాహంతో అతడు ఐపీఎల్‌లోకి రానున్నాడు. ఐపీఎల్లో బరిలోకి దిగడం షనకకిది రెండోసారి. 2023లో అతను గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో 34 ఏళ్ల షనక శ్రీలంక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. శ్రీలంక తరఫున షనక ఇప్పటి వరకు 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్‌స్వీప్
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 40 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో మెరిసింది. చివర్లో నికోలా కేరీ (24 నాటౌట్), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో సగం పరుగులు జార్జియావే ఉండడం విశేషం. కాగా జార్జియా వోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయగా, జాజ్రా క్లాక్స్టన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్పెర్రీ, మేగన్ స్కాట్,లూసీ హామిల్టన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసి డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది.చదవండి: IPL 2026: ‘పరాగ్‌కు అంత సీన్ లేదు’ -
IPL 2026: ‘పరాగ్‌కు అంత సీన్ లేదు’
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపికవడం వెనుక ఫ్రాంచైజీ పెద్దల నుంచి ప్రత్యేక మద్దతు గట్టిగా ఉందంటూ భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ కెప్టెన్‌గా పరాగ్ ఎంపిక తనను ఆశ్చర్చపరిచిందన్నాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. ఎందుకంటే అది రాజస్థాన్ ప్రాంచైజీ పెద్దల నిర్ణయం. అక్కడ రియాన్ పరాగ్‌ను వాళ్లు రాజులా చూసుకుంటారు. రాజస్థాన్ పరాగ్‌ను ఆకాశానికెత్తుతోంది కానీ అతడికి అంత సీన్ లేదు. గతేడాది పరాగ్‌కు అంతగా కలిసిరాలేదు. సంజూ శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్‌గా సేవలందించిన పరాగ్‌లో నాయకత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని ఈ సీజన్లోనూ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు చెన్నై ట్రేడింగ్ చేసుకున్నప్పటికీ అతడి స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. జడేజా, జైస్వాల్, ధ్రువ్ జురేల్ లాంటి నాయకత్వ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిచ్చాడు.‘గత సీజన్‌తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా వీరికి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. టాప్ ఐదుగురిలో ఇద్దరు రాణించినా రాజస్థాన్‌కు తిరుగుండదు. జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు పెద్ద బలం కానుంది. హెట్‌మైర్, జడేజా, షనక, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 50-50 శాతమే’ అని తెలిపాడు. ఇక రియాన్ పరాగ్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 393 పరుగులు సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2017 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న రియాన్ పరాగ్ ఇప్పటివరకు 84 మ్యాచ్‌ల్లో ఏడు అర్థశతకాలతో 1566 పరుగులు సాధించాడు. అయితే పరాగ్‌లో నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే! -
IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మ్యాచ్ రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అనుమతి ఉండదని పేర్కొంది.కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు..ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్‌పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్లను రెండవ జట్టుకు ఇవ్వరాదు.మ్యాచ్ జరిగే రోజులలో ప్రాక్టీస్‌కు అనుమతి ఉండదు. మ్యాచ్ జరిగే రోజున ప్రధాన ప్రాంగణంలో ఎలాంటి ఫిట్నెస్ పరీక్ష జరగదు.ప్రాక్టీస్ రోజుల్లో (ప్రీ టోర్నమెంట్, టోర్నీ జరుగుతున్న సమయంలో), గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్‌లోకి, మైదానంలోకి అనుమతిస్తారు.ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనంలో ప్రయాణిస్తారు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే అవకాశం వీరికి కల్పిస్తారు.అదనపు సహాయక సిబ్బంది (త్రో డౌన్ స్పెషలిస్ట్/నెట్ బౌలర్లు) జాబితా వివరాలను బీసీసీఐకి సమర్పించాలి. బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాతే వీరికి గుర్తింపు పత్రాలు జారీ చేయబడతాయి.ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు వచ్చేటప్పుడు టీమ్ బస్సును మాత్రమే ఉపయోగించాలి. జట్లు రెండు బృందాలుగా ప్రయాణించవచ్చు.మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్, ఫిట్నెస్ టెస్ట్‌కు సంబంధించి ఎలాంటి అభ్యర్థన వచ్చినా స్థానిక మేనేజర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.మ్యాచ్ రోజు మార్గదర్శకాలు..పీఎంవోఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజున తమ గుర్తింపు పత్రాన్ని తీసుకురావడం తప్పనిసరి. మొదటిసారి గుర్తింపు పత్రాన్ని తీసుకురాని పక్షంలో, హెచ్చరికతో సరిపెడతారు. కానీ రెండోసారి అదే తప్పు చేస్తే ఆయా జట్టుకు జరిమానా విధించబడుతుంది.ఆటగాళ్లు నారింజ లేదా ఊదా రంగు టోపీలు ధరించాలి. ఒకవేళ ఆటగాళ్లు టోపీలు ధరించకపోతే, ప్రసారంలో కనిపించేంత వరకు మొదటి రెండు ఓవర్ల పాటు ఆ క్యాప్‌లను ధరించాలి.మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో ఫ్లాపీలు, స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. ఆటగాళ్లు రూల్‌ను పాటించకపోతే తొలిసారి హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారి మాత్రం జరిమానా విధించడం జరుగుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ మాదిరిగానే, మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్‌తో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పు ఉన్నట్లయితే, ఆయా ఫ్రాంచైజీలు నిబంధనల ప్రకారం 24 గంటల ముందే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. చదవండి: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన -
‘గంభీర్.. మొరటుతనం తగ్గించుకో’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్‌గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్‌ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే కోచ్‌గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్‌ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాల్ ముందుంది.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్బాల్క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్‌బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్‌కు ఒక ఉదాహరణ. కోచ్‌గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు. భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. ఇం2్లండ్లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్‌కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది.చదవండి: ‘ఆ రూల్‌కు నేనెప్పుడూ వ్యతిరేకమే’! -
‘ఆ రూల్‌కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
ఐపీఎల్లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్‌రౌండర్‌గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్‌రౌండర్‌ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్‌ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్‌రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్‌ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు. అక్షర్‌పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది. -
విమర్శలొచ్చినా వెనక్కి తగ్గని రహానే!
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నిరాశజనక ప్రదర్శన చేసింది. జట్టుగా కేకేఆర్ విఫలమైనా, బ్యాటర్‌గా మాత్రం టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రహానే సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వైదొలగింది. రహానే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టు ఓటములపై ప్రభావం చూపించింది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా కేకేఆర్ టైటిల్ కొట్టాలని రహానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని జట్లు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాయి. సోమవారం రాత్రి కేకేఆర్ జట్టు కూడా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రహానే బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి బ్యాటింగ్‌లో గేర్ మార్చిన రహానే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లోనూ రహానే అదే జోరు కనబరిచాడు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో బ్యాటర్ కామెరున్ గ్రీన్ కూడా 30 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. న్యూజిలాండ్ సంచలనం ఫిన్ అలెన్ కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాయపడిన ఆకాశ్‌దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌరబ్ దూబే ఫిన్ అలెన్‌ను వెనక్కి పంపించాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈడెన్ గార్డెన్లో స్పిన్ వనరులను వినియోగించుకోవడంలో విఫలమైన రహానే కెప్టెన్‌గా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టుపై ప్రభావం చూపించాయి. అయితే తాజా సీజన్ ప్రారంభానికి ముందే బ్యాటర్‌గా తానేంటో నిరూపించుకున్న రహానే కెప్టెన్సీలోనూ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.చదవండి: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు! -
విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ ఆటగాళ్లను హెచ్చరిస్తూ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్‌కు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ పంచుకున్న లేఖను ఇస్లామాబాద్ పోస్ట్ తన ‘ఎక్స్’లో పంచుకుంది. ‘కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కైబర్ పంక్తున్వా, బెలూచిస్థాన్ ఫ్రావిన్స్‌కు చెందిన అమాయక ప్రజలపై పాకిస్థాన్ అమానుష దాడులకు పాల్పడుతుంది. మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టీకాలన్నింటిని గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాకిస్థాన్‌కు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లకు ఇదే మా హెచ్చరిక. పీఎస్ఎల్ ఆడేందుకు పాకిస్థాన్‌కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు అంతగా బాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజానికి మేము క్రికెట్‌కు వ్యతిరేకులం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీఎస్ఎల్ నిర్వహించడం మంచిది కాదు. పీఎస్ఎల్ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్‌కు రాకపోవడమే మంచిది. ఒకవేళ వస్తే పాక్ విడిచి వెళ్లిపోతే మంచిదని మా అభిప్రాయం.’ అని లేఖలో పేర్కొంది. పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్‌తో వైరం కారణంగా పీఎస్ఎల్లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతలో పాకిస్థాన్ వ్యతిరేక శక్తుల నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భద్రతా, ఇతర కారణాల రీత్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్కు గుడ్‌బై చెబుతున్నారు. షనక, ముజరబానీ, స్పెన్సర్ జాన్సన్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్ఎల్లో ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా మొయిన్ అలీ (ఇంగ్లండ్), డెవన్ కాన్వే (న్యూజిలాండ్) ఇలా చాలా మందే ఉన్నారు. కానీ తాజా బెదిరింపులతో అసలు పీఎస్ఎల్ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.చదవండి: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!🔴 JUST IN 🇵🇰 Armed opposition groups in Pakistan have issued a statement urging all foreign players participating in the Pakistan Super League (PSL) cricket matches to avoid traveling to Pakistan, stating that their security is not guaranteed and there is a risk of harm.The… pic.twitter.com/caf7Tim1ep— Islamabad Post (@ISBPost) March 23, 2026 -
60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!
తనకు 60 ఏండ్లు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేర్కొనడం చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం 44 ఏండ్లు ఉన్న ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరిదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విషయంలోకి వెళితే.. ఆదివారం సీఎస్కే ఫ్యాన్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోని రిటైర్మెంట్ విషయమై శివకార్తికేయన్ మాట్లాడాడు. ‘ధోని సార్ మీరు రిటైర్ అవ్వొద్దు. అలా చేస్తే చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులు బాధపడతారు. 44 ఏళ్ల వయసులోనూ మీరు యంగ్‌గానే కనిపిస్తున్నారు.కనీసం 60 సంవత్సరాల వరకైనా క్రికెట్ ఆడి మమ్నల్ని అలరించాలి’ అని పేర్కొన్నాడు. దీనిపై మహేంద్ర సింగ్ ధోని వెంటనే స్పందించాడు. ‘రోజురోజుకు ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ కూడా తగ్గుతూ వస్తోంది. అయినా సరే 60 ఏళ్లు వచ్చే వరకు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని ధోని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న ధోనికిది 19వ సీజన్. ఇప్పటివరకు ధోని ఐపీఎల్లో 278 మ్యాచ్‌లాడి 5,349 పరుగులు సాధించాడు. 2024లో సీఎస్కే కెప్టెన్‌గా వైదొలగడానికి ముందు ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్స్ అందించి జట్టు ప్రయాణంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ధోని పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మున్ముందు తేలనుంది. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ఈ సీజన్‌కు ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. అయితే ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో సంజూ శాంసన్ సీఎస్కేకు రావడంతో కీపింగ్ బాధ్యతలు అతడే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధోనికిది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సీఎస్కే ట్రేడింగ్‌లో ఏరికోరి శాంసన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.A CSK fan at heart, Our star SK in the house 🥳#Roar26 #WhistlePodu pic.twitter.com/Sl8aG0xmGH— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ -
Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్లు ముగిసినప్పటికీ టైటిల్ గెలవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆకలి మాత్రం తీరడం లేదు. జట్టు పేరు మార్చినా, ఆటగాళ్లను మార్చినా, దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించినా ఢిల్లీ తలరాత మాత్రం మారలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలో సెమీఫైనల్ చేరింది. తర్వాతి సీజన్లో కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక మధ్యలో 2012లో మరోసారి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా ఆరు సీజన్ల పాటు లీగ్ దశకే పరిమితమైంది. అయితే 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. పేరు మార్చిన తర్వాత వరుసగా మూడు సీజన్లు (2019, 2020, 2021) అదరగొట్టింది. పుష్కర కాలానికి..ఐపీఎల్ ప్రారంభమైన పుష్కరకాలం తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. 2021లో మరోసారి ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ కథ 2022 నుంచి మళ్లీ మొదటికే వచ్చింది. గత సీజన్లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.బ్యాటింగే బలం..ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్‌పైన బలంగానే కనిపిస్తుంది. పేపర్‌పై ఉన్న బలాన్ని మైదానంలోనూ ప్రదర్శిస్తుందా లేక గత సీజన్ల మాదిరే చతికిలపడుతుందా అన్నది చూడాలి. జట్టుకు కేఎల్ రాహుల్ పెద్ద బలం అని చెప్పొచ్చు. గత సీజన్లో కేఎల్ రాహుల్ 539 పరుగులతో జట్టు టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోసారి రాహులే జట్టుకు కీలకమవ్వనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు బెన్ డకెట్, పాతుమ్ నిసాంక, పృథ్వీ షా, అభిషేక్ పొరేల్, నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించగల సమర్థుడు.మిచెల్ స్టార్క్ఆడేనా?బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడతాడా లేదా అన్న సంశయం ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. నటరాజన్, ముకేశ్ కుమార్‌కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న కశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై కూడా జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్, విప్రజ్ నిగమ్‌లతో బలంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి తయారైంది. ఐపీఎల్ 19వ సీజన్లోనైనా మెరిసి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కల నెరవేరాలని ఆశిద్దాం.ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: అక్షర్‌పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిసాంక, నితీశ్ రానా, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వీ/కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, కుల్దీప్యాదవ్, అకిబ్ నబీ, స్టార్క్, ముకేశ్ కుమార్/నటరాజన్.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్: 2020 (రన్నరప్); 2019, 2021 (ప్లే ఆఫ్స్); 2008, 2009 (సెమీఫైనల్స్)చదవండి: భారత స్టార్‌కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే! -
భారత స్టార్‌కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టోర్నీలోని అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. కొన్ని జట్లలోని ఆటగాళ్లు ఇంట్రాస్వ్కాడ్లుగా విడిపోయి మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ లీగ్‌కు ఊపు తెస్తున్నారు. ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి తుది జట్టులో ఎవరెవరికీ చోటు దక్కుతుందనే దానిపై మాజీ క్రికెటర్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ తమ ప్రాబబుల్ ఎలెవెన్‌ను ప్రకటించే పనిలో పడ్డారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే తాను ప్రకటించిన జట్టులో భారత బౌలర్ తుషార్ దేశ్‌పాండేకు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ తుషార్ దేశ్‌పాండేను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అశ్విన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా వైభవ్ సూర్యశంశీ, జైశ్వాల్‌లు, మూడో స్థానంలో కెప్టెన్ రియాన్ పరాగ్‌కు చోటు కల్పించాడు. మిడిలార్డర్లో హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, ఫెరీరాలకు అవకాశమిచ్చాడు. జడేజాను ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆర్చర్, బిష్ణోయి, సందీప్ శర్మలకు చోటు కల్పించాడు. ‘నా దృష్టిలో హెట్‌మైర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమం. టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్మురేపాడు. అందుకే నాలుగోస్థానం అతడికి సరైనది. ఫినిషింగ్ బాధ్యతలు జడేజా, ఫెరీరాలు చూసుకుంటారు. నా వరకు ఇది బెస్ట్ టీం. నేను ప్రకటించిన జట్టులో ఒకటి, రెండు మార్పులుండే అవకాశముంది.’అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో రాజ స్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది. ఇక అశ్విన్ ఐపీఎల్లో 221 మ్యాచ్‌లాడి 833 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 187 వికెట్లు పడగొట్టాడు.అశ్విన్ రాజస్థాన్ ఎలెవెన్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయి, సందీప్ శర్మచదవండి: కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్! -
పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ది ఘనమైన చరిత్ర. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. 2020లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ అప్పటినుంచి మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. నాలుగేళ్లలో మూడుసార్లు లీగ్ దశకే (2021, 2022, 2024) పరిమితమైన ముంబై 2023, 2025 సీజన్లో మాత్రం ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఆరోసారి టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయింది. ముంబై టైటిల్ గెలిచిన ఐదుసార్లు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విజయవంతమైన హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అదే తరహా విజయాన్ని అందుకున్నాడు. అయితే 2024లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరాడు. పాండ్యాకు బాధ్యతలు..ఆ సీజన్లో రోహిత్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాను కెప్టెన్ చేశారు. అప్పట్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మైదానంలోనే హార్దిక్ పాండ్యాను గేలి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు ముంబై ఇండియన్స్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పెరిగిన విమర్శలు..దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు పెరిగిపోయాయి. అయితే 2025 సీజన్లో ముంబై పరిస్థితి కాస్త కుదుటపడింది. పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కూడా మరోసారి కెప్టెన్సీ విషయంలో ముంబై అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ లేదా రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ బ్యాటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్కెప్టెన్సీ విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘కెప్టెన్సీ మార్పుతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడుతుందేమో. కెప్టెన్సీ విషయంలో జట్టు యాజమాన్యం రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా మంచి కెప్టెనే కావొచ్చు.. కానీ జట్టులో భారత్‌కు రెండు టీ20 ప్రపంచకప్‌లు అందించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. నాయకత్వ మార్పు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాబట్టి ముంబై యాజమాన్యం ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. కెప్టెన్ మారితే జట్టు అదృష్టం మారే అవకాశం లేకపోలేదు. అందుకే సూర్యకుమార్‌కు పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది.సూర్య అయితే బాగుంటుంది..అయితే కెప్టెన్ ఎవరనే అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే. పాండ్యాను కాదనుకుంటే సూర్యకుమార్‌కు బాధ్యతలు అప్పగించొచ్చు. కానీ అది ముంబై ఇండియన్స్ అంతర్గత వ్యవహారం. కాబట్టి వాళ్లంతా కలిసి కూర్చోని మాట్లాడుకొని సమస్యకు ముగింపు పలకాలి. నా వరకు సూర్యకుమార్ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగలడు’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ అందించాడు. దీంతో హార్దిక్‌పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగించాలని బీసీసీఐ మాజీ సెలెక్టర్లు కూడా పిలుపునిచ్చారు. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కేకేఆర్‌తో ఆడనుంది.చదవండి: పీఎస్ఎల్ద్దు.. ఐపీఎల్ ముద్దు! -
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు!
శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ షనకను అదృష్టం వరించింది. తంతే బూరల బుట్టలో పడ్డట్టుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన షనక తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతని స్థానాన్ని షనకతో భర్తీ చేయాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షనక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి షనక వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ కూడా షనకను సంప్రదించిందని, జట్టులో జాయిన్ అయ్యేందుకు అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని, సంతకాలు మాత్రమే మిగిలాయని రాజస్థాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు స్విచ్ అవుతున్న రెండో ఆటగాడు దాసున్ షనక. ముజరబానీ కూడా..గతంలో జింబాబ్వే ఆటగాడు బ్లెసింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వనున్నాడు. ముజరబానీ పీఎస్ఎల్లో షమర్ జోసెఫ్ స్థానంలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడేందుకు 1.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అనూహ్యంగా కేకేఆర్ నుంచి పిలుపు రావడంతో ఐపీఎల్ ఆడేందుకే మొగ్గుచూపాడు. వాస్తవానికి గతేడాది అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో షనకను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. దీంతో షనక అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వేలంలో పాల్గొన్నాడు. అయితే షనకను లాహోర్ ఖలండర్స్ 75 లక్షలకు దక్కించుకుంది.షనక దారిలోనే స్పెన్సర్..ఇక స్పెన్సర్ జాన్సర్ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు రానున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే షనక, స్పెన్సర్లు పీఎస్ఎల్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు రావడంతో ఆయా ఫ్రాంచైజీలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. కానీ విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కార్బిన్ బోష్ కూడా ఇదే విధంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకొని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. పరాగ్ సారథ్యంలో..రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నైకి వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బదులుగా సీఎస్కే వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్‌కు బదలాయించింది. కాగా జడేజా 2008 ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.చదవండి: పంత్‌ను తీసేద్దామనుకున్నారా? -
పంత్‌ను తీసేద్దామనుకున్నారా?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడికి అంత ధర చెల్లించడం అదే తొలిసారి. అంతేకాదు కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే పంత్ మాత్రం గత సీజన్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. పంత్ తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు మాత్రమే చేయడమే గాక కెప్టెన్‌గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పంత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలన్న ఆలోచన లక్నో సూపర్‌జెయింట్స్‌కు కలిగినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. బ్యాటింగ్‌లో విఫలమైన పంత్ అటు కెప్టెన్‌గానూ విఫలం కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేయాలని లక్నో యాజమాన్యం భావించిందట. ఖండించిన గోయెంకా..అయితే ఒక్క సీజన్‌కే పంత్‌ను తప్పించడం సరికాదని మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలనుకున్నట్లు వచ్చిన వార్తలను తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఖండించారు. పంత్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని జట్టు నుంచి తొలగించాలని ఎన్నడూ అనుకోలేదని తెలిపారు. ‘నిజానికి గత సీజన్లో పంత్ కెప్టెన్ాా బాగానే చేశాడు. కానీ జట్టుకు కీలకమైన నలుగులు బౌలర్ల సేవలు కోల్పోతే అతడు మాత్రం ఏమి చేయగలడు. దీంతో పంత్ తన జట్టులో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకొనే జట్టును సమర్థంగా నడిపించాడు. రిషబ్ పేలవ ప్రదర్శనతో జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు చూసి నేను చాలాసేపు నవ్వుకున్నా. సోషల్ మీడియా కేవలం తమ వ్యూస్‌ను పెంచుకోవడం కోసమే ఇలాంటి కల్పిత వార్తలను సృష్టించే పనిలో పడ్డాయి. పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు. ప్రతీ విషయంలో సూటిగా స్పష్టంగా ఉంటాడు. ఫ్రాంచైజీ కోసం నూటికి నూరుశాతం కష్టపడతాడు. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్సీకి వంద శాతం న్యాయం చేశాడు. ఒక ఆటగాడి నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించలేము. ’ అని చెప్పుకొచ్చారు. ఇక పంత్ ఐపీఎల్లో 125 మ్యాచ్‌లాడి 3,553 పరుగులు సాధించాడు.రాహుల్‌తో విభేదాలు..2022లో ఐపీఎల్లో గుజరాత్ ఐటాన్స్తో కలిసి అరంగేట్రం చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ కూడా జట్టును సమర్థంగా నడిపించాడు. అయితే 2024 సీజన్లో కేఎల్ రాహుల్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీనికి తోడు ఆ సీజన్లో లక్నో లీగ్ దశకే పరిమితమైంది. దీంతో కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయడంతో పాటు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: అభిమానుల కన్నీటి పర్యంతం -
న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అమేలియా కెర్ వరుసగా పదోసారి 30కి పైగా పరుగులు సాధించడం విశేషం. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే పురుషుల,మహిళల క్రికెట్లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా తన పేరిట లిఖించుకుంది. గతంలో అమేలియా కెర్ సహా శ్రీలంకకు చెందిన చమేరి ఆటపట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్‌లు 9 సార్లు వరుసగా 30కి పైగా స్కోర్లు సాధించారు.తాజాగా వీరిని వెనక్కినెట్టిన అమేలియా కెర్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్లో రోహిత్ శర్మ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), హ్రిస్టో లాకోవ్లు వరుసగా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్‌లో మరో కివీస్ బ్యాటర్ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్‌లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన సోఫీ డివైన్.. దక్షిణాఫ్రికా జట్టుపై 10సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. గతంలో బాబర్ ఆజమ్ (వర్సెస్ న్యూజిలాండ్), స్మృతి మంధాన (వర్సెస్ ఇంగ్లండ్), బెత్ మూనీ (వర్సెస్ భారత్) తొమ్మిదేసి సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం కివీస్ మహిళలు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామమాత్రమైన ఐదో టీ20 బుధవారం జరగనుంది.చదవండి: IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం! -
IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!
ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్‌కప్‌లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది. అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్‌ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్’ అనే కారణం కూడా ఉండొచ్చు. కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’లో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.Thala Dharisanam 🦁#Roar26 #WhistlePodu pic.twitter.com/RST5EpXKct— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: 21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం! -
21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని స్వస్తిక్ లీగ్‌లో 69 బంతుల్లోనే 195 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్‌పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. 69 బంతుల్లో 195 పరుగులు బాదిన స్వస్తిక్ చికారా ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే 126 పరుగులు వచ్చాయంటే ఊచకోత ఏ రేంజ్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. ఈ దశలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అలరించినప్పటికీ డబుల్ మార్క్‌కు ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అనంతరం 308 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ కు దిగిన హిండన్ టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఎవరీ స్వస్తిక్ చికారా?భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధ్య క్రికెటర్‌గా భావించిన స్వస్తిక్ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్‌లో 499 పరుగులు సాధించిన స్వస్తిక్ చికారా టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్‌లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేసింది. కానీ వేలంలో స్వస్తిక్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.చదవండి: క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!Swastik Chikara hammered 195*(69) at the Ayodhya Premier League .5 short of a double ton in t20s 🤯😵.He is unsold in IPL 2026 auction pic.twitter.com/QwVPP59AmP— Mithun 🧢 (@Mithun71389478) March 22, 2026 -
క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!
పశ్చిమాసియాలో భీకర యుద్ధం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై ప్రభావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇంధన ధరలు పెరగడం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని పీఎస్ఎల్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ క్రికెట్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. 'పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్రజలందరూ తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధాని కోరారు. పరిస్థితులన్నింటిని గమనించి, మా భద్రతా సంస్థలతో చర్చించిన తర్వాతే ప్రేక్షకులు లేకుండా పీఎస్ఎల్ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. 10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్లో అన్ని మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతాయి. ఫైనల్ వరకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఆలోచిస్తాం. ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్, కరాచీ వేదికల్లోనే జరుగుతుంది. అంతేకాదు చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశాము. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండడంతో గేట్ రెవెన్యూలో వచ్చిన నష్టానికి ఫ్రాంచైజీలకు నష్టపరిహారం చెల్లించనున్నాం. అఫ్గానిస్థాన్‌కు సరిహద్దుగా ఉండడంతో పెషావర్ స్టేడియంను మ్యాచ్‌ల నిర్వహణ నుంచి తొలగించినందుకు కూడా నఖ్వీ క్షమాపణలు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.చదవండి: లక్నో సూపర్‌జెయింట్స్ కథ మారేనా? -
లక్నో సూపర్‌జెయింట్స్ కథ మారేనా?
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్‌కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. 2024 సీజన్లో లీగ్ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్‌ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్లోనూ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది. అదొక్కటే ఊరట!మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్ ఖాన్, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.లక్నో జట్టులో హార్డ్హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్లో తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే.విదేశీ ప్లేయర్లే బలం..ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మార్కరమ్.. మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్‌తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక కెప్టెన్ పంత్ ఫామ్ కొంత ఆందోళన కల్గిస్తున్నది. గత సీజన్లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్లను ట్రేడ్ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్లో దుమ్మురేపాడు.షమీ కథేంటి?తన సూపర్ స్వింగ్‌తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ మంజూరు కాలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది! -
సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్!
న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్‌హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్‌గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్‌మన్, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్థసెంచరీతో మెరిసిన ఎస్తర్‌హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్‌లు రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత కఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. ఎస్తర్‌హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్, డియాన్ ఫెరస్టర్‌లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది. -
పంజాబ్ కింగ్స్‌లో లుకలుకలు!
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్‌ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్‌లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు. పఠాన్ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ (అప్పటిక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)ప్లేఆఫ్స్‌కు చేరింది. తొలి సీజన్ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్‌లు ఇద్దరూ క్రికెట్‌పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి. ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్‌కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్‌ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు. చదవండి: '250 స్కోర్ కొట్టినా.. సన్‌రైజర్స్ ఓడిపోతుంది' -
అంచనాలు అందుకుంటాం!
ఐపీఎల్ 2026 సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన బలం. గతేడాది సీజన్లో కెప్టెన్‌ా అయ్యర్ పంజాబ్‌ను ఫైనల్ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్‌కే పరిమితమయింది. కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ కప్పు కొల్లగొడతామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్‌గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్‌బ్యాక్ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్‌కు వచ్చాం. రన్నరప్‌గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్‌తోనే మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ తెలిపాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు -
అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు
ఐపీఎల్ 2026 సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్ఐతో తెలిపాడు.ఐపీఎల్లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది. -
‘ఐసీసీ మా యజమాని కాదు’
బంగ్లాదేశ్‌లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్ఎస్సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్‌ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది. ఈ గెజిట్ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అష్రఫుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది. అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయడం కూడా బంగ్లా క్రికెట్ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ సమయంలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం! -
కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రానా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఆకాశ్‌దీప్ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్ దీప్ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.‘ఆకాశ్ దీప్ నడుము కింది భాగం స్ట్రెస్‌కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్‌దీప్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. కోటికి కొనుగోలు చేసింది. మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెసింగ్ ముజరబానీ, కార్తిక్ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్ బౌలింగ్‌ను ప్రారంభించింది.చదవండి: అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం! -
అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసరకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా కేకేఆర్ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్ నైట్స్, గోల్డెన్ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్ అలెన్ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్ అలెన్ సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్ వేయగా ఫిన్ అలెన్ వికెట్ నుంచి పక్కకు జరిగి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్ అలెన్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్ నైట్స్ 6 వికెట్ల తేడాతో గోల్డెన్ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (45), సార్థక్ రాజన్ (37), రింకూ సింగ్ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్ఆర్హెచ్, పంజాబ్, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’ -
‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’
బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. శివరామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026 -
‘వస్తారు కోట్లు పట్టుకెళ్తారు.. ప్రయోజనమెవరికీ’!
ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్ మిచెల్ స్టార్క్ గాయంతో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్ యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్ ఐపీఎల్లో తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. ప్రస్తుతం ఫెర్గూసన్ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు. -
పాక్ క్రికెట్లో విష సంస్కృతి ఎక్కువ!
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్ క్రికెట్ ప్రధాన కోచ్‌గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్‌స్టన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కిర్‌స్టన్ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్ కల్చర్ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. కిర్‌స్టన్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్‌గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్‌పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. టీమ్ బాగా ఆడకపోతే కోచ్‌ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్‌ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్‌స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్‌పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్‌స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్‌తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో లీగ్ స్టేజీలోనే పాకిస్థాన్ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్‌స్టన్ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్‌పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని పాక్ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.చదవండి: IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా? -
IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం పంజాబ్ కింగ్స్ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) మళ్లీ 2014 ఐపీఎల్ సీజన్లో ఫైనల్ ఆడింది. ఆ సీజన్లో కేకేఆర్ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్‌కే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్‌ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్ అయ్యర్ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న పంజాబ్ రన్నరప్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సై అంటోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారైనా ‘కింగ్స్’ అవుతుందా? అనేది చూడాలి.అయితే పంజాబ్‌కు విదేశీ ఆల్‌రౌండర్లు ప్రధాన బలం. మార్కస్ స్టొయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఒవెన్, కూపర్ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్‌రౌండర్ల సొంతం. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్ చేసిన ఆర్యా రెండో బెస్ట్ స్ట్రయిక్ రేట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్ ఎలాగూ ఉంటాడు. అర్ష్‌దీప్, ఫెర్గూసన్, యాన్సెన్, చాహల్‌తో పేస్, స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అదనపు బలం.పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్ కింగ్స్ బలహీనత. కెప్టెన్ అయ్యర్ మినహా ప్రియాన్ష్, శశాంక్ సింగ్, వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, వైశాఖ్‌లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్ లేకపోవడం లోటు.పంజాబ్ కింగ్స్ జట్టు:స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెగ్డే, విష్ణు వినోద్ (కీపర్), యశ్ ఠాకూర్, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్.విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ ఒవెన్, ఫెర్గూసన్, కూపర్ కానొలీ, బెన్ డ్వార్షూయిస్.చదవండి: జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ -
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్ల) బిడ్డింగ్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజస్థాన్‌కు ఇప్పుడొచ్చిన బిడ్ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్‌ను కాదనుకొని రాజస్థాన్ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్ రాయల్స్ కోసం పెద్ద మొత్తంలో బిడ్‌ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్‌బర్డ్ క్యాపిటల్‌కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగానే బిడ్‌ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ గెలుచుకుంది. షేన్ వార్న్ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ ఆ తర్వాత 2015, 2018 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరింది. 2022లో శాంసన్ సారథ్యంలో రన్నరప్‌గా నిలిచింది. 2025 సీజన్లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి లీగ్ దశకే పరిమితమైంది.చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’ -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్‌లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా?
భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్‌ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్ టీమ్‌తో హర్మన్ బృందం వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్ (52), కెప్టెన్ అంజుమ్ చోప్రా (80), మిథాలీరాజ్ (55), హేమలతా కలా (64), మమతా మబెన్ (50) అర్థసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..డిసెంబర్ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్ జట్టుతో వార్మప్మ్యాచ్డిసెంబర్ 9: తొలి వన్డే, పోచెఫ్స్ట్రూమ్డిసెంబర్ 12: రెండో వన్డే, బ్లోమ్ఫోంటైన్డిసెంబర్ 15: మూడో వన్డే, కేప్‌టౌన్‌డిసెంబర్ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్, గెబెర్హాచదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’ -
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకాలం అండర్-19 క్రికెట్లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఇక ఐపీఎల్లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రియాన్ పరాగ్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వైభవ్ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్ ఓపెనర్ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్‌గా వైభవ్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్‌లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. కాగా గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్ స్థానంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చారు.చదవండి: ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా! -
అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ టామ్ లాథమ్ (55 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో టెయిలెండర్ కొబాని మొకినా (26 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా, జార్జ్ లిండే (23) పర్వాలేదనిపించాడు. అయితే సౌతాఫ్రికా టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో సఫారీలు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అయితే తొలి రెండు టీ20 మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఛేదనలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. కాన్వే, టామ్ లాథమ్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కాన్వే ఔటైనా లాథమ్ చివరి వరకు నిలిచి జట్టుకు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన లోకీ ఫెర్గూసన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.చదవండి: IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ! -
IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోని ఆయా జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్‌లకు భువనేశ్వర్ మెంటార్‌గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్‌లిస్టులో ఇరవై పేర్లు! -
ధోని జెర్సీ నంబర్ మారనుందా?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్లో తన జెర్సీ నంబర్ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు ఆడిన ధోని ఏడు నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లోనూ సీఎస్కే తరఫున అదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్ జెర్సీని పంచుకున్నాడు. ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్ ఒక ఎమోషన్ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్‌ను వాడుతున్నాడు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్‌ను ఐపీఎల్లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘కెరీర్ ముగింపు మన చేతుల్లో ఉండదు’ -
బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్’ గ్రేడ్‌ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్‌లు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్‌కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్‌లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్‌లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా టాప్-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్‌ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.చదవండి: ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ -
ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాగా ఎస్ఆర్హెచ్ 2026 సీజన్లో ఆరంభం రోజునే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ వైస్ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.అభిషేక్ సంగతి పక్కనబెడితే రిషబ్ పంత్,జితేశ్ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్ దూరమయ్యాడు. ఇక కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో కమిన్స్ సారథ్యంలోనే ఎస్ఆర్హెచ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ సీజన్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్ నుంచి గేర్ మార్చిన ఎస్ఆర్హెచ్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్‌స్టోన్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్ఆర్హెచ్ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రెయిన్స్ ఫెల్టూరా, సకిబ్ హుసేన్, ఒంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨 Pat Cummins will miss a few games while recovering from injury.Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026 -
రికార్డు స్థాయి బిడ్.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!
ఐపీఎల్లో 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్‌ఫిషర్ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కోల్‌బెర్గ్ క్రావిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం! -
ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 18వ సీజన్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్ గ్రీన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్ గ్రీన్ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్ అంతగా ఆకట్టుకోలేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్‌కు ఒక రకంగా బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున కామెరున్ గ్రీన్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సందర్భంగా ఆసీస్ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్‌ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్ లభించింది. కచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్‌లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్ ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ బ్యూకాసన్.. గ్రీన్ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్ ర్యాంకు! -
గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్ ర్యాంకు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘాను రనౌట్ చేయడం వివాదం సృష్టించింది. అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అఘా బ్యాటింగ్ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలోనూ సల్మాన్ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ కెప్టెన్ షహీన్ అఫ్రిది ఆల్‌రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్‌మన్ గిల్ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్ రాహుల్ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్యాదవ్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ అక్షర్‌పటేల్ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో భారత్ నుంచి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్‌లు టాప్-10లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మెరిసిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: ‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు! -
‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు!
హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై భారత్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై పాకిస్థాన్ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు. అందుకే ఒకసారి నాకు కాల్ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశం మాత్రం సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే తాజాగా భారత్‌లో ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్ మోదీ.. కావ్యామారన్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్ -
దిగ్గజ క్రికెటరన్న గౌరవం లేదా?
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్‌రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్‌పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్‌లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.This is absolutely ridiculous & should be condemned ..How are these comments acceptable? I don’t care how many runs you have scoredVile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026చదవండి: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్! -
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు. క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్‌ను 2010లో ఇంగ్లండ్‌పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్‌తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్‌లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx— Kakarot (@MidOffMind) March 15, 2026ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు."లండన్‌లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్‌టైమ్‌గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్‌ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్‌ను బాగు చేసిన తర్వాత అందులో మజార్‌కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్‌లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.చదవండి: ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్‌ను నాశనం చేస్తోంది! -
ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్‌ను నాశనం చేస్తోంది!
భారత క్రికెట్లో ఇటీవలి కాలంలో ఫ్యాన్ ఆర్మీ,సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్వార్ పెరిగిపోతుందన్నాడు. కోల్‌కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం. కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్‌రూమ్‌లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్ వెల్లడించాడు. చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు! -
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్‌కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్‌ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్‌తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక! -
పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. తాజాగా ఆసీస్ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్ జాల్మీ పేరుతో పీఎస్ఎల్లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే పాక్-ఆఫ్గన్ యుద్ధం కారణంగా పెషావర్ ప్రస్తుతం ‘నో ట్రావెల్ జోన్’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్‌లు ఆడేందుకు పెషావర్‌కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. పెషావర్ జాల్మీ జట్టులోనే ఆరోన్ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్ ప్రేజర్ మెక్‌గుర్క్ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్‌ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్ఎల్ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్ఎల్ సీజన్‌కు తెరలేవనుంది.చదవండి: ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా! -
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్ కరన్‌లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి -
సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ తజ్మిన్‌బ్రిట్స్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కెర్, జెస్ కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అమెలియా కెర్ (18 బంతుల్లో 32) టాప్ స్కోరర్‌గా నిలవగా ఇజీ షార్ప్ (29) పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్లా రెనెకెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్ -
‘పీసీబీవన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు’!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్ ఓటమి అనంతరం షాహిద్ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే. ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్ ఆజమ్ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉంది. కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్ కమిటీ తప్పిదమేని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. దేశవాలీ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ASports (@asportstv.pk)చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త! -
ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్‌లకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే రెండో హోమ్ గ్రౌండ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణసింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్లో ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, జస్టిస్ కున్హా నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలను ప్రవేశపెట్టినట్లు కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు.ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు మూడు నుంచి నాలుగు గంటల ముందే స్టేడియం గేట్లను తెరుస్తారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న వారికి బెంగళూరు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.చదవండి: రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్! -
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్‌క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్‌గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్‌గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్‌లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్‌కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్‌మన్ గిల్‌కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై టెస్టు సిరీస్‌లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026 -
రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్‌కు గురైన బుమ్రా!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్‌కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్‌కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్ తెలిపాడు. బుమ్రా పోస్ట్‌పై సంజనా గణేశన్ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్ క్యాప్షన్ యార్’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్ చేసుకుంది. ఇక స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’ View this post on Instagram A post shared by S A N J A N A G A N E S A N (@sanjanaganesan) -
‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’
క్రికెట్లో భారత్ ప్రపంచాన్ని శాసించడం చూడాలనుకున్న తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని టీమిండియా మహిళా దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. ఆదివారం బీసీసీఐ నమన్ అవార్డ్స్ సందర్భంగా మిథాలీరాజ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గ్లోబల్ క్రికెట్లో భారత్ అన్ని విభాగాల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తోంది. గత రెండు మూడేళ్లలో పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్-19 జట్లు ట్రోఫీలు కొల్లగొట్టి భారత క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక మహిళల క్రికెట్లోనూ గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు బీసీసీఐతో పాటు జైషాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో భారత మహిళల క్రికెట్ జట్టు ఎంతో పరిణితి చెందడంతో పాటు ఆటలోనూ దూకుడు పెరిగింది. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడానికి నన్ను అందరూ ఐకాన్‌గా చెప్పుకుంటున్నారు. కానీ నేను నిజానికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సర్ల నుంచి ప్రేరణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నిలిచాను. మహిళల జట్టుకు ప్రేరణ మాత్రం ఎప్పుడు పురుషుల జట్టే అని బలంగా చెప్పగలను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత క్రికెట్ గత రెండు మూడేళ్లలో ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదిగింది. గత రెండేళ్లలో చూసుకుంటే పురుషుల జట్టు రెండుసార్లు, మహిళల జట్లు ఒకసారి, అండర్-19 జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టాయి. తొలుత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్ సాధించింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సూర్య సారథ్యంలో టీమిండియా మూడోసారి కైవసం చేసుకుంది. ఆ తర్వాతి ఏడాది మహిళల జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అండర్-19లోనూ అటు పురుషులు, మహిళల విభాగంలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.చదవండి: మెద్వదెవ్‌ను దెబ్బకొట్టిన సిన్నర్ -
‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’
హండ్రెడ్ మెన్స్ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ లీడ్స్‌కు సంబంధించి ‘ఎక్స్’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సన్‌రైజర్స్ పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది హండ్రెడ్ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ పాక్ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలోనూ పాక్ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్ 2008 సీజన్ మినహా పాక్ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. కానీ తాజాగా సన్‌రైజర్స్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. సదరు ఫ్రాంచైజీ పాక్ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీంతో తెలిసీ తెలియకో సన్‌రైజర్స్ లీడ్స్ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ గతేడాది చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.చదవండి: నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో -
రహానేకు మరోసారి అవకాశం!
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలకు మాత్రమే పరిమితమయిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యవహరించాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రహానే సూపర్ సక్సెస్‌అయ్యాడని చెప్పొచ్చు. 37 ఏళ్ల రహానే 13 మ్యాచ్‌లాడి 390 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రహానేనే కావడం విశేషం. గత సీజన్లో ఎక్కువగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించే స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అందుకే ఈసారి కూడా రహానేకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే కృతనిశ్చయంతో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 13 రోజులు సమయం ఉండడంతో ఈలోగా కేకేఆర్ కెప్టెన్ పేరును ఖరారు చేయనుంది. అయితే రహానే ఈ సీజన్లోనూ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐపీఎల్లో రెండు పర్యాయాలు (2012, 2014) గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన కేకేఆర్ 2024లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో మూడో టైటిల్ అందుకుంది. అయితే అనూహ్యంగా గతేడాది సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో శ్రేయస్ అయ్యర్ సహా పలు కీలక ఆటగాళ్లను వదులుకొని కేకేఆర్ మూల్యం చెల్లించుకుంది. కానీ ఈసారి మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకుంది. ఇటీవలే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ సహా టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరున్ గ్రీన్‌లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే విదేశీ కోటాలో సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని, రోవ్‌మెన్ పావెల్, పతిరానా ఉన్నారు. మరి ఇంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. ఇక పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.చదవండి: కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే! -
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్‌లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్‌ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. తాజాగా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్‌గా విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్ టీ20 ఓపెనర్‌గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రశ్న వేసింది. అయితే మొదట సచిన్, సెహ్వాగ్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ చాయిస్లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్‌ను కాదని ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్‌కే ఓటేశాడు. రోహిత్, సెహ్వాగ్ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్‌గా గేల్ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలవాలన్న కోరిక గేల్‌లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. ఇక గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్లో 267 మ్యాచ్‌ల్లో 132 స్ట్రైక్‌రేట్ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి. 2025 సీజన్లో కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్ కింగ్స్‌పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.చదవండి: ‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’ -
‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్‌ను చూసి అసూయపడేవారు! -
తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు!
పాకిస్థాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. ఢాకా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమిమ్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో తౌహిద్ హృదోయ్ (44 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు),లిటన్ దాస్ (51 బంతుల్లో 41) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 3 వికెట్లతో రాణించాడు. టాస్ గెలిచి బౌలింగ్‌కు మొగ్గు చూపిన పాకిస్థాన్ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బౌలింగ్‌తో బంగ్లాను కట్టడి చేయాలని భావించిన పాకిస్థాన్‌కు ఆది నుంచే హంసపాదు ఎదురయ్యింది. ఓపెనర్లు తంజిద్, సైఫ్ హసన్‌లు తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. 36 పరుగులు చేసిన సైఫ్ హసన్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత నజ్ముల్ హసన్ (27)తో కలిసి తంజిద్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ దశలో 107 బంతుల్లో తంజిద్ తన వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆఖర్లో లిటన్ దాస్, తౌహిద్ హృదోయ్ ధాటిగా ఆడడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే చెరో వన్డే మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే సిరీస్ విజేత ఎవరో తేల్చనుంది.Moment to remember! ✨🏏 Tanzid Hasan Tamim celebrates his first ODI hundred with signature flair. 🔥🐯#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/0mkKFILekx— Bangladesh Cricket (@BCBtigers) March 15, 2026చదవండి: 12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్ -
12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్
టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. కారులో అతడి పక్కనే తన గర్ల్‌ఫ్రెండ్ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ అభిమాని తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్ రాయ్స్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవీవో, లంబోర్గిని యూరస్, మెర్సిడెస్ -ఏజీఎం జీ63, రేంజ్ రోవర్., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 160 స్ట్రైక్‌రేట్ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు! Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026 -
అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్‌తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్‌స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్‌పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది. అయినా కూడా బంగ్లాదేశ్ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం. పాక్, బంగ్లాదేశ్ నాటకాలు ఫలించలేదు.ఐసీసీ చైర్మన్‌గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్ వ్యూయర్షిప్ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. భారత్‌కు అమెరికా, పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు నేపాల్ ఓటమి భయం చూపించింది. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రత్యేక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం -
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా. అయితే ఈ సీజన్లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్) కామెంట్రీ బాక్స్‌లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్లో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్కల్లమ్ కోచ్‌గా వచ్చిన కొత్తలో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. కానీ క్రమంగా బజ్‌బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్‌కల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: రోహిత్ బాటలో రిషబ్ పంత్! -
రోహిత్ బాటలో రిషబ్ పంత్!
టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 18వ సీజన్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పంత్ బరువు తగ్గే విషయమై భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను అనుసరిస్తున్నాడు. గతంలో రోహిత్ శర్మ కూడా తన బరువు తగ్గే క్రమంలో కఠినమైన డైట్ పాటించాడు. తాజాగా పంత్ కూడా బరువు తగ్గేందుకు మిత ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక పంత్ ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పంత్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘పంత్.. మీరు ఎంత బరువు తగ్గారో చెప్పగలరా?’ అని మీడియా ప్రశ్నించింది. అందుకు పంత్ ‘ఆ విషయం మాత్రం అడగొద్దు’ అంటూ బదులిచ్చాడు. ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్‌లేమీ పంత్‌ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడేందుకు టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సలహాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా యూవీ పంత్‌కు పలు సలహాలు, బ్యాటింగ్ నైపుణ్యానికి సంబంధించి మెలుకువలు అందించాడు. అయితే గతంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు కూడా ఇదే తరహాలో ఫామ్ కోల్పోయినప్పుడు యూవీ ఇలాగే సాయం చేశాడు. 2025 ఐపీఎల్లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం ఈ ఏడాది అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు ముందు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కోసం బీసీసీఐ పంత్‌ను పరిగణలోకి తీసుకుంది. కానీ అనూహ్యంగా పంత్ గాయపడడంతో జితేశ్ శర్మ పేరు తెర మీదకు వచ్చింది. కానీ అతను కూడా గాయంతో బాధపడుతుండడంతో ఆ అవకాశం ఇషాన్ కిషన్‌ను వరించింది. గతేడాది ఐపీఎల్లో పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున 14 మ్యాచ్‌లాడి 269 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!


