breaking news
Politics
-
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్‌ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
ఏ బిల్లునూ ఇష్టారాజ్యంగా మార్చకూడదు: ప్రియాంకా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. -
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
ఏపీలో కమీషన్ల కోసమే ప్రైవేటు అప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. -
బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఓట్లలో తేడా ఎలా? ‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పారీ్టకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం ‘ఆస్క్ కవిత’హ్యాష్ ట్యాగ్‌పై ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. -
‘ప్రజావైద్యం కోసం మా నాయకుడు విశేషంగా పని చేశారు’
తాడేపల్లి :గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్లోకి తీసకెళ్లారు. ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. -
‘మాపై కేసులు.. అప్పులు.. తండ్రీకొడుకుల గొప్పలు ఇవే మిగిలాయి’
విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నార్ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు. మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు. రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు. -
‘పేదలకు అండ జగన్.. కార్పొరేట్లకు అండ చంద్రబాబు’
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారుఅన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్‌లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
కూటమి సర్కార్ విధానాలపై ప్రజాగ్రహం: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘రెడ్‌బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణవిజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీగోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్‌కు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్‌షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్‌బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్‌ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్‌ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్‌కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై, తీవ్ర విభేదాలు తలెత్తిన మూడేళ్ల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే తాజాగా ఇరు పార్టీల మధ్య మొదలైన మంతనాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. పీకే తాజా వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.బిహార్ వైఫల్యంతో పునరాలోచన?బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పేలవమైన ప్రదర్శన కనబరచడం ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా పోటీకి దిగిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థులలో 236 మంది (99.16%) తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు పీకే ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా బిహార్‌లో ఘోరంగా విఫలమైంది. 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ.నిన్నమొన్నటి వరకూ విమర్శించి..2022లో చర్చలు విఫలమైనప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ చోరీ’ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)గురించి పీకే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలా నిరంతర విమర్శల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ కీలక మహిళా నేత ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.2022లో ఎలా బెడిసికొట్టింది?రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్‌కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుండి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022, ఏప్రిల్‌లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ‘అధికార సాధికార బృందం’ (ఈఏజీ)లో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి.అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కోరడంతో..ఇదే తరుణంలో కాంగ్రెస్ నిర్దిష్ట బాధ్యతతో ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ పీకేని ఆహ్వానించింది. దీనికి పీకే వెంటనే స్పందించారు. ఈఏజీలో చేరి, ఎన్నికల బాధ్యత తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించారు. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని నాడు పీకే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తనకు అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కావాలని కోరారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి సీనియర్ నాయకత్వం విముఖత చూపిందని తెలుస్తోంది.ఇరు పార్టీలకు అవసరమై..ఇప్పుడు మూడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం మళ్లీ కాంగ్రెస్- పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా? అనేది అందరిలో పలు సందేహాలను లేవనెత్తుతోంది. బిహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చని పలువురు అంటున్నారు. అలాగే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం పీకేను తిరిగి సంప్రదించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తిన నేతల మధ్య జరిగిన తాజా భేటీ.. రాబోయే రాజకీయ సమీకరణలపై తప్పక ప్రభావం చూపనుంది.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
వల్లభనేని వంశీని కలిశారనే కోపంతో..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వచ్చా
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్‌రావుపై కోపంతో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్ఎస్ను వీడడానికి, హరీశ్‌రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్‌లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్‌లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.హరీశ్‌తో వార్ నడుస్తూనే ఉంటుంది..కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్‌రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తే, హరీశ్‌రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్‌నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్‌తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్‌లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్‌ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్‌గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్‌కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బలరాం రాంచందర్‌లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్‌లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్‌కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మోదీ అభినందనలు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్‌కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్‌ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్‌లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా.. బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్‌గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్‌కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్‌కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి. #BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025 -
కేంద్రం,ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. -
పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్సీపీకి వెయ్యి ఏనుగుల బలం.‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
బంగారు కొండ.. మానుకొండ అంటూ పోస్ట్!
విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్‌లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింంది. గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్‌రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
ఇండియా కూటమి కొనసాగుతుంది
సాక్షి, హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు రాకపోయినప్పటికీ దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమి కొనసాగుతుందని, కూటమి పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజన్ ఇండియా చర్చాగోష్టిలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శనివారం తాజ్‌కృష్ణ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయాలన్న ఏకైక ఆకాంక్షతో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్)ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. యూపీలో ఉన్న 25 కోట్ల ఓట్లలో మూడు కోట్లను తొలగించాలని చూస్తోందని, ఆ పార్టీ ఎక్కువగా ఓడిపోయే స్థానాల్లోనే ఈ ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని కంపెనీకి ఓటర్ల తొలగింపు కోసం ఉద్దేశించిన మ్యాపింగ్ యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. బూత్‌స్థాయి అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, వారి చేతిలో సాంకేతికత కూడా లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, ఈసీ అంటే ఓట్లు తొలగించడం కాదని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడమని అన్నారు. ఓటరు కార్డులు నకిలీవి తయారు చేయడానికి వీల్లేకుండా పటిష్ట కార్డులు అమల్లోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ తమకు పాత మిత్రుడని చెప్పారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ అంతకుముందు విజన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ (చర్చాగోష్టి)లో అఖిలేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాజీవనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందరికీ మంచి చేసేదే నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఏఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదని, అది సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సైబర్ నేరాలు, పాస్‌వర్డ్‌ల చోరీ తదితర అక్రమాలన్నీ ఏఐతోనే సాధ్యమవుతాయని, ఈ ఏఐని సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటయినా ఆశ్చర్యం లేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణలో పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ సంతృప్తి
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు ఒకే కారులో రాహుల్‌తో కలిసి వచ్చారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాందీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ అక్రమాలపై ప్రజాతీర్పు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడమే దీనికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులు తట్టుకుని ప్రజల మద్దతుతో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు శనివారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు, సర్పంచ్‌లు వందలాదిగా తరలిరావడంతో నందినగర్ నివాసం సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు ఉన్నారు. మరో వారం, పదిరోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచ్‌లను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్ హైదరాబాద్ మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. కేఫ్ యజమాని శరత్ ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలికి లంచ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్.. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను విజయవంతంగా నడుపుతుండటంపై యజమాని శరత్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా, లంచ్ అనంతరం కేటీఆర్, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు. -
మంత్రి సాక్షిగా బట్టబయలైన ఏపీ ప్రభుత్వం బండారం
విజయవాడ: ఏపీలోని రైతుల్ని దీనావస్థలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బండారం బట్టబయలైంది. మంత్రి పార్థసారథి ఎపిసోడ్‌తో ప్రభుత్వం గుట్టురట్టయ్యింది. రైతులు దీనావస్థలో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పింది.. ఇప్పుడు మంత్రి పార్థసారధి సాక్షిగా నిజమని తేలిపోయింది. అసల రైతుల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో సుస్పష్టమైంది.ఈరోజు(శనివారం) మంత్రికి రైతుల నుంచి సెగ తగలడంతో రెచ్చిపోయారు. బూతులతో మరీ రెచ్చిపోయారు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేయగా, దాన్ని అధికారుల మీదకు, మిల్లర్ల మీదకు నెట్టేసే యత్నం చేశారు. మీరు మీర కలిసి దోచుకోండి అంటూ మండిపడ్డారు. ఫలితంగా మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న వైనం బయటపడింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ‘ మీరు మీరు’ దోచుకోండి’ అంటూ అధికారుల్ని, మిల్లర్లపై ధ్వజమెత్తారు మంత్రి. నాణ్యత ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. మంత్రి పార్థసారథి సొంతగ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేయక కల్లాల్లోనూ , మిల్లుల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత ఉన్నప్పటికీ తేమ శాతం చూపించి మిట్లర్లు ధాన్యం కొనుగోలు చేయని క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇలా రెచ్చిపోతే రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనేది రైతుల ప్రశ్న. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
‘2 లక్షల 66 వేల కోట్లు అప్పులు.. ఒక్క కొత్త పెన్షనైనా ఇచ్చారా?’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్‌లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందిచంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదురాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారుచంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు.. -
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్‌పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్‌కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్‌లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
రెడ్‌జోన్‌లో కూటమి 80 శాతం ఎమ్మెల్యేలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు. -
ఒక్కో కార్పొరేటర్‌కు రూ.40 లక్షలు..?
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.సాక్షి పొలిటికల్ టాస్‌్కఫోర్స్: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్‌పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్ కట్ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్‌బై చెప్పి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్‌తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ.. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ రంగప్రవేశంతో సీన్ రివర్స్ వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు. క్యాషే.. క్యాషునిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్ రంగప్రవేశంతో వీరికి డిమాండ్ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు. -
మెస్సీతో మేస్త్రీ ఫుట్‌బాల్.. ఆసుపత్రుల్లో గురుకుల విద్యార్థులు: హరీష్
సాక్షి, కోఠి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు.బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ శనివారం ఉదయం విద్యార్థులను పరామర్శించి.. ఫుడ్ పాయిజన్‌కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో వసతులు, భోజనం కూడా సరిగా లేదు. 90 మంది బాగ్‌లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఫుట్‌బాల్ ఆడటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారు. మెస్సీతో మేస్త్రీ ఫుట్‌బాల్ ఆట కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కబ్జాలు, కమీషన్లకే రేవంత్ రెడ్డి పరిమితం.. పిల్లలను పట్టించుకోవడం లేదు. 61 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. పిల్లలను పరామర్శించరా?. రేవంత్‌ది విజన్ 2047 కాదు.. పిల్లల పాలిటి పాయిజన్ 2047.మొన్న శామీర్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌లో 43 మంది విద్యార్థులు కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు. దొడ్డు బియ్యం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఫుట్‌బాల్ ఆడటంలో రేవంత్ బిజీగా ఉన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం సోకులు తీర్చుకుంటున్నారు. కబ్జాలు, కమీషన్లకే టైమ్ సరిపోవడం లేదా?. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. బాత్ రూమ్‌లు కడిగే బ్రష్‌లతో.. వంట సామన్ కడుగుతున్నారట.చలి తీవ్రత పెరిగింది. చల్ల నీళ్లతో అమ్మాయిలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. విద్యా కమిషన్ ఎక్కడికి పోయింది?. పేదల మనసులు చదువుతా అని డైలాగ్స్ కొట్టడం కాదు.. పేద పిల్లల ఆకలి తీర్చండి. రాహుల్ గాంధీ పేదల కోసం రాడు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడు. ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ వస్తారట. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాహుల్ ఎందుకు అడగడం లేదు?. కోఠి, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిగి తెలుసుకోవాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారులు.. నేను పోను గురుకుల పాఠశాలకు అన్నట్లుగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేను వస్తున్నానని రోడ్లు వేశారు..
హైదరాబాద్: ఇరవై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే నన్ను తీసి రోడ్డుపై వేశారని.. తాను మొండిదానినని ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ‘జాగృతి జనం బాట’కార్యక్రమం మూడో రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, నాగమయ్యకుంట బస్తీలలో పర్యటించి అనంతరం రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అడిగే వారు ఉంటే ఏ సమస్యకైనా ముందడుగు పడుతుందన్నారు. అందులో భాగంగానే సమస్యలపై నిలదీసేందుకు తాను ముందుకు వచ్చానని తెలిపారు. నేను వస్తున్నానని అంబర్‌పేటలో రోడ్లు వేశారు.. తెలంగాణ రాకముందు హైదరాబాద్ బస్తీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేరుకు హైదరాబాద్‌లో ఉన్నామే తప్ప గ్రామాల్లో ఉన్న దానికంటే ఘోర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి అంబర్‌పేటలో రాత్రికి రాత్రి రోడ్లు వేశారని, యాకత్‌పురాలో మంచినీటి కాలుష్య సమస్యను పరిష్కరించారని చెప్పుకోచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచి్చన ఏ హామీని పరిష్కరించలేదన్నారు. అంతకు ముందు బోనాలతో, గుర్రపు బగ్గీలతో కవితకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహేందర్, శివారెడ్డి, మనోజ్‌గౌడ్, డేవిడ్, మీనా తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలి కాచిగూడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ముసారాంబగ్ బ్రిడ్జి పనులపై ఆరా..అంబర్‌పేట: అంబర్‌పేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిశీలించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ సరీ్వసు రోడ్డు, అలీకేఫ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ముసారాంబగ్ బ్రిడ్జి పనులను ఆమె జాగృతి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం అంబర్‌పేట మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. -
ప్రేమతో పిలిస్తే కాదనగలమా?
శివాజీనగర: ‘రోజూ స్థానికుల్లో ఎవరో ఒకరు, మా నియోజకవర్గం వారు ప్రేమతో భోజనం తీసుకొచ్చి ఇస్తున్నారు. భోజనం వద్దని అనగలమా? ప్రేమతో ఆహ్వానిస్తారు.. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కో చోటుకు భోజనానికి వెళుతున్నాం. ఇది ఏ విందు భోజన సమావేశమూ కాదు’ అని డీసీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బెళగావి సర్క్యూట్ హౌస్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ సమాధానం చెప్పారు. బెళగావి శివార్లలో గురువారం రాత్రి ఎమ్మెల్యేలు విందు భోజనం చేశారనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నా నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ పని చేస్తున్నాడు. అతని ఇంటి నుంచి ముద్ద, పప్పు, చారు తయారు చేసి పంపిస్తామని చెప్పాడు. ఇలా ప్రేమతో ఆహ్వానించినప్పుడు రాలేనని చెప్పగలమా?’ అని అన్నారు. ‘దొడ్డణ్ణ బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, నా మిత్రుడు. వారిది పెద్ద కుటుంబం. గత 15 సంవత్సరాల నుంచి తమ ఇంటికి భోజనానికి రావాలని పిలుస్తుండేవారు. మా కాంగ్రెస్ కుటుంబం వారిని మరవటానికి సాధ్యమా? అందువల్ల నాతో పాటు కొంతమంది ప్రజలు భోజనానికి వెళ్లాం.. అంతే! అందులో ఎలాంటి విందు భోజన సమావేశమూ లేదు’ అని తెలిపారు. శనివారం తమను ఆసిఫ్ సేఠ్, ఫిరోజ్ సేఠ్‡ భోజనానికి పిలిచారన్నారు. చిన్నస్వామిలో క్రికెట్ మ్యాచులకు గ్రీన్‌సిగ్నల్ చిన్నస్వామి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచుల నిర్వహణకు అనుమతి కలి్పంచిన విషయమై అడిగిన ప్రశ్నకు డీకే స్పందిస్తూ.. బెంగళూరు గౌరవాన్ని కాపాడేందుకు తాము అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చిన్నస్వామి క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచులకు అనుమతి కలి్పంచామన్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల బాధ్యతను హోంమంత్రి పరమేశ్వర్‌కు అప్పగించామన్నారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ బృందం, పోలీసు అధికారులు కూర్చొని చర్చిస్తారన్నారు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్‌లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్‌లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్‌నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్‌నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్‌లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్‌లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటు వేయలేదని..
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్‌సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్‌సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్‌సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్‌రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్‌రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు. పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది బ్యాలెట్ పేపర్‌పై మూడు వరుసల్లో గుర్తులుమఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ సర్పంచ్ స్థానానికి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపరులో మొదటి వరుసలో 8 గుర్తులు, రెండో వరుసలో 8 గుర్తులు, మూడో వరుసలో ఇద్దరు అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తు ముద్రించారు. ఓటు కోసంపంచాయతీ ఎన్నికల వేళ దశాబ్దల తర బడి పరిష్కారానికి నోచుకోని బాట సమస్యకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు ఓట్ల కోసం ఓ వార్డు అభ్యర్థి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు. ఓట్ల కోసం గుట్ట ఎక్కిన మొదటి వ్యక్తి వినోద్ కావడం గమనార్హం.‘పంచాయతీ’తో పరిష్కారం » పోలింగ్‌కు ముందే రోడ్డు నిర్మాణం పూర్తి » నెరవేరిన హన్వాడ రైతుల దశాబ్దాల కలఇది మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ–బుద్ధారం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి. దీని కోసం దాదాపు 100 కుటుంబాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు చేయని ప్రయత్నం లేదు.. కలవని నేతలు లేరు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు.. ఇస్నాతి వంశస్తులకు సంబంధించిన పక్కా పట్టా స్థలం. అందులోనూ సాగులో ఉన్న భూమి. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఆ అన్నదాతల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఆ వంశానికి చెందిన సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం ఆ రైతులకు వరమైంది. తమ పొలాలకు రహదారి వదిలితే వంద మంది రైతు కుటుంబాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రతిపాదించడం.. ఇన్నాళ్లూ అంగీకరించని సదరు యజమాని తమ దాయాదులతో మాట్లాడి ఒప్పించడం.. ఆ వెంటనే రైతులు సొంత డబ్బులతో కిలోమీటర్‌కు పైగా (సుమారు ఎకరా) మట్టి రోడ్డు వేయడం చకచకా జరిగింది. వెతుకుతున్న తీగ కాలుకు తగిలినట్టు సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల సమస్య తీరింది. రోడ్డును ఆనుకునే 36 ఎకరాల్లో ఇస్నాతి వంశస్తుల వ్యవసాయ భూమి ఉండగా.. దానికి ఆనుకొని వెనుకవైపు 400 ఎకరాల వరకు పంటలు సాగవుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతోంది. హన్వాడలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. తనకు మద్దతుగా నిలవాలని సదరు సర్పంచ్ అభ్యర్థి వేడుకుంటున్నాడు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్సర్పంచ్గా గెలిపిస్తే.. పంచాయతీకి రూ.30 లక్షలు ఇస్తా మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్‌రావు తన సొంత డబ్బులు రూ.30లక్షలు వెచ్చిస్తున్నట్టు బాండ్ పేపర్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులు వచ్చే వరకు ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని చెక్కుతో కూడిన బాండ్ పేపర్ జీపీకి రాసిచ్చాడు. రెండో విడతలో ఆదివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.20 కిలోమీటర్లు నడిచి.. ఓటు అభ్యర్థించి..పెనుగోలు గుట్టపైకెళ్లి ప్రచారం చేసిన వార్డు అభ్యర్థి వినోద్వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు గ్రామంగుట్టలపై ఉంటుంది. కొంగాలనుంచి మూడవ వార్డుకు పోటీ చేస్తున్న లేగల వినోద్.. పెనుగోలు గ్రామస్తుల ఓట్లు తన వార్డులో ఉండటంతో 20 కిలోమీటర్లు కాలి నడకన గుట్టలపైనున్న పెనుగోలుకు చేరుకున్నాడు. ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరాడు. ఈ గ్రామానికి మూడవ విడత ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.సర్పంచ్‌గా గెలిపిస్తే ఎకరం భూమి ఇస్తాంబాండ్పేపర్పై అగ్రిమెంట్ రాసిచ్చిన ఇద్దరు అభ్యర్థులు భూదాన్‌పోచంపల్లి : సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం చిన్న గ్రామపంచాయతీ. ఇక్కడ మొత్తం 546 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయ్యింది. పంచాయతీ పరిధిలో రసాయన పరిశ్రమలు ఉండటంతో సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మి జంగారెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుమ్మి నరేందర్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి వస్పరి రాకేశ్ పోటీపడుతున్నారు. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి గుడి నిర్మాణం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గుమ్మి జంగారెడ్డి, గుమ్మి నరేందర్‌రెడ్డిలు పోటాపోటీగా బాండ్‌పేపర్లపై అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.తమ్ముడి ఓటమి తట్టుకోలేక..అక్క మృతికథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ సర్పంచ్‌గా పోటీ చేసిన పోతు శేఖర్ ఓటమిపాలయ్యారు. శేఖర్ గెలవాలని కోరుట్లకు చెందిన అతడి అక్క కొక్కుల మమత(40) కొన్నిరోజులు ప్రచారం చేశారు. తమ్ముడు ఓటమి పాలయ్యాడని తెలియగానే గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శుక్రవారం మార్గమధ్యలోనే మమత మృతి చెందింది. ‘వార్డు’ అభ్యర్థి మృతిధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్ పంచాయతీలోని రెండోవార్డుకు సమ్మని రామయ్య(62) పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ తన వార్డులో ప్రచారం చేశారు. అనంతరం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. ఓడిపోయి.. సెల్‌టవర్ ఎక్కి రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి రంగా శుక్రవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, రెవెన్యూ అధికారులు రంగాతో ఫోన్లో మాట్లాడి నచ్చచెప్పగా, మధ్యాహ్నం రెండు గంటలకు కిందకు దిగొచ్చాడు.గ్రీన్ మ్యాట్‌తో పోలింగ్ బూత్ బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో అధికారులు గ్రీన్మ్యాట్లతో డేరాలు కట్టి పోలింగ్ బూత్‌లు మార్చారు. -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్‌ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
కేటీఆర్‌తో అఖిలేష్‌యాదవ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. తిరస్కరిస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఆయన.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.నంది నగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానన్నారు.కేటీఆర్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించారు. దేశంలో మూడో స్థానంలో పార్టీని నిలిపారని కేటీఆర్ అన్నారు. -
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్‌కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్‌ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్‌తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్‌కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
‘నాడు వైఎస్ జగన్ చెప్పిందే.. ఇప్పుడు బాబు చెబుతున్నారు’
విశాఖపట్నం: నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వ.జమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా? అని నిలదీశారు. కేవలం ఏపీలోనే రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఈ రోజ(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్.. ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చిందన్నారు. నాడు జగన్ ఏం చెప్పారో.. చంద్రబాబు అదే చెబుతున్నారువిశాఖ గురించి నాడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చెప్పారో.. నేడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారని, ఇప్పుడు అదే మాట చంద్రబాబు కూడా చెబుతున్నారన్నారు. 2014లో విశఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారన్నారు. ‘ రాష్ట్రానికి పరిశ్రమల రావడం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్..ిశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖ వచ్చింది కాబట్టి మిగతా ఐటీ పరిశ్రమలు విశాఖ నగరానికి తరలివస్తున్నాయి.టిసిఎస్ విశాఖ రావడానికి జగన్ కృషి ఉంది. పెద్ద కంపెనీలకు భూమి ఇవ్వడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్ట బేడుతున్నారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారు?, మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికి ఇస్తామంటే ఎలా..?, సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారు?, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి తక్కువ రేటుకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు ఇస్తారా?, లులు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొంటారు. మన రాష్ట్రంలో నామమాత్రపు ధరకు కట్టబెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు. లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదు. వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాశారు. చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటూ వార్తలు రాస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ తో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారు.. నేడు ప్రకటనల్లో మోడీ పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయి’ అని విమర్శించారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్‌పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్‌రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్‌రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్‌ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్‌కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్‌ని డైరెక్టర్‌గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
శశి థరూర్.. మళ్లీనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన అగ్రనేత నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే.. ఆయన ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అదీ పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. థరూర్‌తో మరో సీనియర్ నేత, ఛండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ కూడా గైర్హాజరు అయ్యారు. అయితే..థరూర్ గత రాత్రి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండటంలేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్, తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం.శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు..నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్‌కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని అన్నారాయన. కానీ, ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి(90) వెంట ఉండాల్సి రావడంతోనే హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. థరూర్ వరుసగా ఇలా ఎగ్గొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలికగా తీసుకోవడం లేదు.పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఐదేళ్ల కిందటే మొదలై..2020లో కాంగ్రెస్‌లో జీ-23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గ్రూప్‌లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) ఓ తిరుగుబాటులాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ చెబుతూ వస్తున్నారు. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
కూటమి కొత్త కుట్రను తిప్పి కొట్టిన కడప మేయర్
సాక్షి, వైయస్సార్ జిల్లా: కడప మేయర్ పదవి దక్కకపోవడంతో కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీకి చెందిన నూతన మేయర్ పాకా సురేష్ పేరిట అభ్యంతకర పోస్టర్లను అచ్చేయించింది. అయితే ఈ కుట్రను ఆయన అంతే సమర్థవంతంగా తిప్పికొట్టారు. కడప సిటీలో మేయర్ పాకా సురేష్‌పై కొన్ని పోస్టర్లు వెలిశాయి. కోర్టులో ఉన్న అంశాన్ని వక్రీకరిస్తూ.. పన్ను కట్టలేదంటూ ప్లెక్సీలు వేయించారు టీడీపీ నేతలు. అయితే.. ఈ పరిణామంపై ఇటు వైఎస్సార్సీపీతో పాటు అటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ బీసీ నేత మేయర్ కావడాన్ని ఓర్వలేకపోతున్నారని అంటున్నాయి. ఈ మేరకు ప్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. తాజాగా ఈ పోస్టర్ పరిణామాలపై సురేష్ స్పందించారు..‘‘నేను 10 ఏళ్లుగా నేను పన్ను కట్టడం లేదని ఆరోపణలు చేశారు. ఈ కూటమి ఏడీపీ సర్వే చేసి నగరంలో 20వేల ఇళ్లకు పన్నులు భారీగా పెంచారు. దానిపై నేను స్వయంగా పోరాటం చేస్తున్నాను. చట్ట ప్రకారం పన్ను పెంచాలంటే ముందు నోటీసులు ఇవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా 20వేల మందిపై బాదుడు వేశారు. కార్పొరేషన్ పాలకవర్గం ఈ పెంపుపై తీర్మానం కూడా చేశాం. పన్ను పెంపుపై మా తల్లి కూడా రివిజన్ పిటిషన్ వేశాం. అన్ని అనుమతులు చూపించాం. పన్ను తగ్గిస్తామని కూడా అధికారులు చెప్పారు. రివిజన్ పన్ను కట్టాలని అధికారులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. 20వేల మంది పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు.. .. వ్యక్తిగతంగా నాపై కక్షతో ఇలాంటి ప్లెక్సీలు వేసి టైమ్ వెస్ట్ చేసుకుంటున్నారు. నేను మేయర్ కావడాన్ని తట్టుకోలేక ఇలాంటి తప్పుడు చర్యలకు దిగుతున్నారు. మా పార్టీ నేతలు ఏకాభిప్రాయంతో నన్ను మేయర్ గా ఎన్నుకున్నారు. మేయర్ అయిన మొదటి రోజే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను మేయర్ కావడం గిట్టని వారు నాపై ప్లెక్సీలు పెట్టారు. మీ వ్యక్తిగత ఎజెండాతో ఇలా ప్లెక్సీలు పెట్టే బదులు నగరంపై దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలపై ఎవరు సలహాలు ఇచిన తీసుకుంటాను. అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఏవైనా నగర అభివృద్ధికి సహకరించాలి’’ అని పాకా సురేష్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. -
కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి షాక్
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీలో పార్టీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి ఊహించని షాకిచ్చారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో, టీడీపీలో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుల దోపిడీని బయటపెట్టారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాకిచ్చారు. ఈ క్రమంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు సంధించారు.‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అని సటైర్లు వేశారు. దీంతో, తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి. -
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్‌లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్‌గా ఉండడం రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్‌ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్‌పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఒక్క ఓటు తేడాతో విజయం.. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, వనపర్తి: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఘనపూర్ మండలంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో, అక్కడ రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, ఘర్షణలు నెలకొంది.వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్థానిక మహిళ, కాంగ్రెస్ అభ్యర్థి సింధు.. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి, శ్రేణులు.. రీకౌంటింగ్ చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం, రీకౌంటింగ్ చేసినా కూడా ఓడిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ససేమిరా అంటూ నిరసనలు చేపట్టారు. దీంతో, బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం, పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థిని మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
రాజకీయాలు అంటే సినిమా కాదు.. పవన్‌కు కన్నడ మంత్రి చురకలు
సాక్షి బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచుకుపడ్డారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, తెలుగు సినిమాలో మాత్రమే ఆయన హీరో అని, రాజకీయాల్లో కాదని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్. లాడ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌కళ్యాణ్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘ప్రజాసేవ అంటే సినిమా కాదు. జిమ్మిక్కులు, గిమ్మిక్కులు, నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు.అయినప్పటికీ బలవంతంగా రాజకీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు’.. అంటూ మంత్రి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెళగావిలో మంత్రి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌కళ్యాణ్‌కు ఒక మనవి చేస్తున్నా. మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే ఇది సినిమా కాదు.సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం? పేదవారికి, శ్రామికుల కోసం, రాష్ట్రాభివృద్ధిపట్ల ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్డీఏ సర్కారులో భాగమైన మీరు విద్యా, ఉద్యోగాల విషయాలపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి’.. అంటూ ఆయన హితవు పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కనీస వేతనం ఎంత? ఈ విషయం పవన్‌కు తెలుసా? ఇప్పుడెందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు. -
కర్ణాటక సీఎం మార్పు కొలిక్కి!?
సాక్షి బెంగళూరు: కన్నడనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎం మార్పు అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ పోరుకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 9న డీకే శివకుమార్ కల తీరనున్నట్లు సమాచారం. అయితే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంఘర్షణ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్న 30 రోజుల పాటు మహామౌనం వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.వివాదానికి యతీంద్ర ఆజ్యం..బెళగావి శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో సిద్దరామయ్యే మళ్లీ సీఎం అంటూ ఆయన తనయుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు ఉండదని ఆయన పదేపదే వ్యాఖ్యానిస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. దీంతో సీఎం మార్పు వివాదం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీకి అస్త్రంగా మారింది. నిజానికి.. ఈ అంశం బీజేపీకి అస్త్రం కాకూడదని పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌ను హెచ్చరించినప్పటికీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల అభిమానులెవ్వరూ లెక్కజేయకుండా మాట్లాడుతూ పార్టీని ఇరకాటంలోకి పెడుతున్నారు.జనవరి రెండో వారంలో డీకే సీఎం?ప్రతిపక్షాలను బాహాటంగా చీల్చిచెండాడే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇందుకు అసలు కారణం జనవరి 9గా తెలుస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ హైకమాండ్ జనవరి రెండో వారంలో సీఎం కుర్చీపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. అప్పటివరకు పార్టీకి ఇబ్బంది కలిగించకుండా మౌనం వహించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని డీకే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. డీకే శివకుమార్‌కు దాదాపు సీఎం పీఠం ఖరారవుతున్న తరుణంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన లక్ష్యాన్ని దూరం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పైగా.. హైకమాండ్పట్ల విధేయత, క్రమశిక్షణ కనబరిచిన వాడిగా గుర్తింపు పొందాలని డీకే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.తనయుడికి సిద్దరామయ్య హితబోధ..ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాల కారణంగా ఈ సీఎం కుర్చీ పోరు కాస్తా నెమ్మదించినా సమావేశాల అనంతరం మళ్లీ రాజుకునే అవకాశముంది. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్ర చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇవి డీకే వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు తన కుమారునితో సిద్దరామయ్య చర్చించారు. సున్నితమైన అంశాలను మీడియా సమక్షంలో ప్రస్తావించవద్దని తన కుమారునికి హితవు పలికినట్లు సమాచారం. ఇక యతీంద్ర వ్యాఖ్యలతో డీకే శివకుమార్ వర్గం కూడా అప్రమత్తమైంది. విధానసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం తన మద్దతుదారులతో సభలోనే డీకే ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. -
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవాను చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కుయుక్తులు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్‌తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైఎస్సార్సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. కడపలో మరోమారు సత్తా చాటుకున్న వైఎస్సార్సీపీ కడప నగరపాలక సంస్థ మేయర్‌ను అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు.. మేయర్ పదవిని చేజిక్కించుకొనేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్సార్సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్సార్సీపీ సొంతమైంది. కడప మేయర్‌గా 47వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో, చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. కడప మేయర్ పాకా సురేష్ టీడీపీకి ఒకే కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్‌ను ఎంపిక చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్‌గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్ షఫీ బలపర్చారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఏకగ్రీవంగా ఎంపీపీలు వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండల ప్రజాపరిషత్ అ«ధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన శరవణ ఎన్నికయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీకి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిండ్ర, విజయపురంలో దౌర్జన్యమే గెలిచింది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగిన రెండు ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏర్పేడు ఎంపీపీ గీత రాజీనామా, ముసలిపేడు ఎంపీటీసీ రమణమ్మ మృతితో 14 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. వీరిలో పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ కావడంతో ఆమెకే పదవి దక్కాలి. అయితే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి ప్రత్యేక శిబిరంలో దాచారు. గురువారం ఉదయం 11 గంటలకు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. వారు టీడీపీ కండువాలతో ఎన్నికలో పాల్గొన్నారు. పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో మిగిలిన 5 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థి పి.ఆదిలక్ష్మి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు ఎమ్మెల్యే సు«దీర్ రెడ్డి టీడీపీ కండువా కప్పడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి. ఎంపీపీగా గెలవాలంటే ఐదుగురి మద్దతు అవసరమౌతుంది. అధికార పార్టీ అంగబలం, అధికార బలం, దౌర్జన్యం ప్రదర్శించినా రెండు మండలాల్లోనూ నాలుగు ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించారు. విజయపురంలో వైఎస్సార్సీపీ తరఫున మంజు బాలాజి, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీచేశారు. నిండ్రలో వైఎస్సార్సీపీ తరఫున విజేష్, టీడీపీ మద్దతుతో ఇండిపెండెడెంట్ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి పోటీ పడ్డారు. అధికారుల చేతివాటంతో లాటరీలో విజయపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ఎంపీపీలుగా ఎంపికయ్యారు. నా పేరే వచ్చింది ఎన్నికల అనంతరం విజయపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంజు బాలాజి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించారని, డిప్లో తన పేరే వచ్చిందని, అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్లు చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకు వెళతానని తెలిపారు. నిండ్ర, విజయపురంలో అధికారుల దుర్మార్గంపై కలెక్టర్‌కు ఫిర్యాదు నిండ్ర, విజయపురం ఎంపీపీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) కూటమి నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా మండలాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు గెలిస్తే ఆర్వోలు మరొకరు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. ఎమ్మెల్యే పీఏలు ఎన్నికల కేంద్రాల్లోకి ప్రవేశించారని, అభ్యర్థులను, ఎంపీటీసీలను మాత్రం లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పిల్లల చేత లాటరీ తీయించకూడదని, అయినా ఓ చిన్న పాపకు ముందుగా గుర్తులు చెప్పించి లాటరీ తీయించారని తెలిపారు. బహిరంగంగా నిర్వహించాల్సిన లాటరీ ప్రక్రియను గుట్టుగా చేశారని చెప్పారు. మరొక ఆర్వో ఒకే వ్యక్తి పేరును ఐదు చొప్పున రాసి లాటరీ తీశారని తెలిపారు. ఆర్వోలతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి, ఎంపీపీ ఎన్నికల వీడియోలను శుక్రవారం మధ్యాహ్నం లోగా పంపాలని ఆదేశించారు. బెదిరింపులకు బెదరని కళ్యాణదుర్గం కౌన్సిలర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బెదరలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 మంది వైఎస్సార్సీపీ, 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగిలిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. ఆస్తులున్నాయి జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. చివరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కింది. దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ స్థానం కైవసం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు కూటమి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురిచేసి, బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని.. ఆమెకే ఎంపీపీ పదవి అప్పగించారు. ఈ ఎన్నికల్లో 9 మంది సభ్యులకు గాను నలుగురే హాజరయ్యారు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలనే నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. వచి్చన వారిలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎన్నిక పూర్తవుతుందనే సరికొత్త నిబంధన తెచి్చ, ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుపొందింది. పోలీసుల అండతో మాచవరం ఎంపీపీ కైవసం పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీని కూడా టీడీపీ దౌర్జన్యంగా గెల్చుకుంది. టీడీపీకి తగిన బలం లేకపోయినా, పోలీసులతో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. వాస్తవంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి ఉన్న బలం నాలుగే. దీంతో గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీల బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి సభ్యుల వివరాలు తెలపాలని ఒత్తిడి తెచ్చారు. చెన్నాయపాలెం ఎంపీటీసీ లక్ష్మిబాయి బంధువు బాలు నాయక్‌ను దాచేపల్లి సీఐ భాస్కరరావు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బెదిరించినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో బాలు నాయక్ తన బంధువైన ఎంపీటీసీ లక్ష్మీబాయి మద్దతు టీడీపీకి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పిల్లుట్ల –1 ఎంపీటీసీ మంగమ్మ బాయినీ అలాగే బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. మరికొందరిని కూడా బెదిరింపులకు గురి చేసి, టీడీపీ అభ్యర్థి కొక్కెర అంజమ్మను గెలిపించుకున్నారు. -
84.28% పోలింగ్ నమోదు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 84.28 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యా హ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్టుగా ఎస్ఈసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే బారులు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్పేపర్తో బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే ఒంటిగంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్‌లలో క్యూలైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా ఓటింగ్ సరళిని ఎస్ఈసీ కార్యాలయం నుంచి లైవ్ లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు కూడా పోలింగ్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. అర్థరాత్రి దాటినా కౌంటింగ్ ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో.. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. -
పంచాయతీ ముచ్చట్లు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైనా గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రాగా, టాస్‌లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు.టెంట్ల కిందే ఓటింగ్..దుద్యాల్ /దండేపల్లి: పాఠ శాల గదుల్లోనో, పంచాయతీ భవనంలోనో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలను ఈసారి టెంట్ల కింద పూర్తిచేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సట్రకుంటతండాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల స్కూల్, జీపీ భవనాలు మంజూరైనా, ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక టెంట్ల కింద పోలింగ్ జరిపించారు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కగూడెంలో ప్రభుత్వ పాఠశాల లేదు. పైగా పంచాయతీకి పక్కా భవనమూ లేదు. అంగన్వాడీ కేంద్రం కూడా ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రం ఆవరణలోనే టెంట్లు వేసి పోలింగ్ నిర్వహించారు.ఫ్యామిలీ పాలిటిక్స్తల్లిపై కూతురు విజయంకోరుట్లరూరల్/ ఉట్నూర్‌రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయి పల్లె సర్పంచ్ పదవికి తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లపు సుమలత పోటీ పడగా, కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆరుగురు బరిలో ఉన్నా, ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజీతండా సర్పంచ్‌గా జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్ విమల బాయిపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మాయ భర్త జాదవ్ హరినాయక్‌ను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే గ్రామ పంచాయతీకి జాదవ్ హరినాయక్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగాడుకోరుట్లరూరల్/ శంషాబాద్ రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పోలింగ్ బూత్‌కు పిట్టల వెంకటి ఓటు వేసేందుకు వచ్చాడు. పోలింగ్ సిబ్బంది ఆయనకు సర్పంచ్, వార్డు సభ్యుడికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసి తీసుకురమ్మన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటి తెలుపు కలర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ నములుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి పిట్టల వెంకటిని జీపులో ఎక్కించుకొని పోలింగ్ స్టేషన్‌కు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు.తప్పు జరిగిందని బ్యాలెట్ పేపరు చించివేత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండాలోని పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేసేందుకు ముడావత్ సత్యనారాయణ వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే మరో అభ్యర్థికి వేసినట్టు గుర్తించి, ఆ బ్యాలెట్ పేపరును చించివేశాడు. గమనించిన ఎన్నికల అధికారి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సత్యనారాయణ పోలింగ్ ఏజెంటుగా తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.బ్యాలెట్లో వార్డు అభ్యర్థి గుర్తు గల్లంతునాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. దీంతో గంటపాటు పోలింగ్ నిలిపివేయించి.. కొత్త బ్యాలెట్స్ తెప్పించి ఓట్లు వేయించడంతో వివాదం ముగిసింది.నాగారంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయంనాగారం: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారుపై 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి తన స్వగ్రామానికి సర్పంచ్‌గా సేవ చేయాలన్న కల సాకారమైంది. తండ్రి గెలుపు కోసం కుమారులు జగదీశ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు కృషి చేశారు. యువతతో పోటీ పడుతూ ఈ వయసులో రామచంద్రారెడ్డి విజయం సాధించడంపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలిపారు.సర్పంచ్‌గా గెలిచిన 80 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల సర్పంచ్ బరిలో ముగ్గురు నిలిచారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.చెక్కు చెదరని అభిమానంచనిపోయిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు సర్పంచ్‌గా గెలిచినట్టు ధ్రువీకరించిన అధికారులు వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేము లవాడ మండలం చింతాల్ ఠాణా సర్పంచ్ పదవికి 1,717 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెర్ల మురళికి 739 ఓట్లు, సమీప ప్రత్యర్థులు సురువు వెంకటికి 369, కొలాపూరి రాజమల్లయ్యకు 357 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈ నెల 4వ తేదీన చెర్ల మురళి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమానంతో ఓట్లు వేశారు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసిన మురళికి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు.ఆయనకు 160 ఓట్లు..మహబూబా బాద్ రూరల్ : మహబూబా బాద్ జిల్లా నడి వాడ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్ద తుతో రాగిపాటి బుచ్చిరెడ్డి పోటీ చేశాడు. ఈ నెల 9న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బుచ్చిరెడ్డి భార్య సావిత్రమ్మ గ్రామ ప్రజల కోరిక మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలోనూ గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమా నాన్ని చాటుకుంటూ ఓటేశారు. దివంగత బుచ్చిరెడ్డికి 160 ఓట్లు వేశారు.ఓటు.. బాధ్యతకొడుకు చనిపోయిన బాధలో ఉన్నా...దుద్యాల్/బోధన్ /ఇబ్రహీంపట్నం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్‌కు చెందిన భూకల వెంకటయ్య–పద్మమ్మల కొడుకు మల్లేశ్‌యాదవ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంట్లో మృతదేహం ఉండగానే, రోదిస్తూనే వెళ్లి ఓటు వేశారు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు.అంబులెన్స్‌లో వచ్చి.. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి మల్లవరపు ఆరోగ్యరాజు అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్‌లో తీసుకొచ్చారు.ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాఅహ్మద్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తన ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీఐపీ విలేజ్ ఆ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి (కాంగ్రెస్) స్వగ్రామం రంగారెడ్డిగూడెం (రాజాపూర్) గ్రామపంచాయతీలో బీజేపీ మద్దతుదారు కాటేపాగ రేవతి విజయం సాధించారు. తొలుత రేవతికి 6 ఓట్ల మెజార్టీ రాగా.. అధికార పార్టీ నాయకుల డిమాండ్‌తో రీకౌంట్ చేయడంతో రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. \వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్ఎస్‡ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్ట మండలం గంగిమాన్‌దొడ్డి పంచాయతీలో బోయపద్మ (ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గం) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టల్లపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొలను ప్రశాంత్‌రెడ్డి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఊరు తరలినా.. ఓట్లు అక్కడే.. కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ వాసులను పునరావాసంలో భాగంగా ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామా నికి తరలించారు. అయినా వీరి ఓట్లు ఉడుంపూర్ పరిధిలోనే ఉన్నాయి. దోసండ్ల లచ్చన్న గ్రామస్తుడి సహాయంతో మోటారుసైకిల్‌పై 32 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లచ్చన్నకు కళ్లు సరిగ్గా కనబడకపోయినా ఓటేసేందుకు అంత దూరం వెళ్లడం విశేషం.ఓటేసిన శతాధిక వృద్ధుడు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పంచాయతీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధుడు లాడే లింగన్న ఓటేశాడు. హుషారుగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన లింగన్నను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.హరిత పోలింగ్ కేంద్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్‌పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలు. ఓటరు దేవుళ్లకు దండాలు..వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న మద్దతుదారులు.. లక్కీ.. లక్కీచాన్స్..చీటీ తీసి... సర్పంచ్ ఎంపిక టేక్మాల్/రఘునాథపల్లి /రాజాపేట/కొందుర్గు /మంథనిరూరల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి సర్పంచ్ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా, 3 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య, కాంగ్రెస్ బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. రెండుసార్లు కౌంటింగ్ చేసినా, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేర ఐదైదు చీటీలు రాశారు. ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది. దీంతో ఆయన్ను సర్పంచ్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు.టాస్‌తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికి సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండుమార్లు రీకౌంటింగ్ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థిని జోజి వరించింది.లక్ష్మక్కపల్లిలో...యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండ లం లక్ష్మక్కపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతు దారుడు ఇండ్ల రాజయ్య టాస్ ద్వారా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట ఇండ్ల రాజ య్యకు 147 ఓట్లు, వేముల సురేందర్‌రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయ డంతో ఇండ్ల రాజయ్యకు ఒక్క ఓటు వచ్చింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానం అయ్యాయి. ఎన్ని కల అధికారులు టాస్ వేయగా, రాజయ్యను అదృష్టం వరించింది. ఇదే పంచాయతీ పరిధి లోని 3వ వార్డులో బీమనపల్లి కృష్ణకుమార్, అయిల కిరణ్‌లకు చెరి 27 ఓట్లు రాగా, టాస్ వేయగా, కృష్ణకుమార్‌ను గెలిచాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులకు సమానంగా 392 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి మెండే రాజ య్య, బీఆర్ఎస్ నుంచి కనవేన కొమురయ్య బరిలో నిలిచారు. డ్రాలో కనవేన కొమురయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.కోటినాయక్ తండాలో... ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటినాయక్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టి టాస్‌లో విజేతగా నిలిచింది. ధరావత్ చిట్టికి, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు ధరావత్ తులసికి 315 చొప్పున ఓట్లు సమానంగా రాగా.. అధికారులు టాస్ నిర్వహించారు. టాస్‌లో ధరావత్ చిట్టి గెలుపొందింది. పోస్టల్ ఓటుతో సమానం..ఆపై టాస్‌తో గెలుపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాఠి రాజ్ కుమార్‌కు 211, గోపి రాములుకు 212, వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా, రాజ్‌కుమార్‌కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజ్‌కుమార్, రాములుకు ఓట్లు సరిసమానం అయ్యాయి. టాస్ వేయగా, రాజ్‌కుమార్‌ను విజయం వరించింది. వాసాలమర్రిలో... తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మాట అనురాధకు, బీఆర్ఎస్ బలపరిచిన పలుగుల ఉమారాణికి ఓట్లు 615 చొప్పున సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు టాస్నిర్వహించగా దొమ్మాట అనురాధను విజయం వరించింది. డ్రా ఫలితంపై అభ్యంతరం.. లాఠీచార్జ్ సాక్షి, సిద్దిపేట: మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులే. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మి కి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచి్చందో పూర్తిగా చూపించకుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. ఒక్క ఓటుతో విజయం..గూడూరు/ రేగోడ్ /మంథనిరూరల్: మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు సనుప సుజాత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. పంచాయతీ పరిధిలో 1,140 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ మద్దతుదారు నూనావత్ స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారు సుజాత అభ్యంతరం చెబుతూ రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. రీ కౌంటింగ్‌లో సుజాతకు 550 రాగా, స్వాతికి 549 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరగా, మరోసారి రీ కౌంటింగ్ చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో రిటర్నింగ్ అధికారులు సుజాతను విజేతగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ హాల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొండాపూర్‌లో...: మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ సర్పంచ్‌గా బేగరి పండరి ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. ఓట్ల కౌంటింగ్‌లలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తయ్యకు 287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ మద్దతులో పోటీలో ఉన్న బేగరి పండరికి 288 ఓట్లు వచ్చాయి. ఇదే మండల పరిధిలో గజ్వాడ సర్పంచ్‌గా మున్నూరి సరోజన 570 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్‌గా ఒక్క ఓటుతో బీఆర్ఎస్ మద్దతుదారు తోంబూరపు సుజాత విజయం సాధించారు. ప్రత్యర్థి కోరవేన వైష్ణవికి 559 ఓట్లు రాగా సుజాతకు 560 ఓట్లు వచ్చాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.ఓటు కోసం పల్లెబాటచౌటుప్పల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పెద్ద సంఖ్యలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరుగుపయనమయ్యారు. దీంతో హైదరాబాద్ మార్గంలోనూ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
కాంగ్రెస్‌దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో గురువారం 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా..మరి కొన్నిచోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటీపోటీగా ఉన్నట్లు కనిపించింది.కాంగ్రెస్ విజయ దుందుభి మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీనితో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి..ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల (అధికార పార్టీ నేతలు) గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్లు సమాచారం. సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 364 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.చనిపోయినా సర్పంచ్‌గా గెలుపు ఈ ఎన్నికల్లో 95 సంవత్సరాల వృద్ధుడు సర్పంచ్‌గా ఎన్నికవగా.. మరోచోట ఎన్నికల బరిలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల తల్లిపై కూతురు, అత్తపై కోడలు విజయం సాధించిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,835 సర్పంచ్ స్థానాలతో పాటు 27,628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి. -
పార్టీకి ఆదరణ ఉన్నా నేతలు విఫలం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ పరిస్థితి, తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవ డంలో నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీలతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో పార్టీ పనితీరు, నేతల వ్యవహారంపై మోదీ గరం గరం అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రం నుంచి 8 మంది చొప్పున బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సైతం వెనుకబడుతున్నారంటూ మందలించారు. విభేదాలు వీడి పార్టీ ఎదుగుదల కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని, పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి..‘సమష్టి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాలి. కేంద్రం అంది స్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కేంద్రం అందిస్తున్న నిధుల గురించి వివరించాలి. మండలం నుంచి పార్లమెంట్ స్థాయి వరకు క్రీడా పో టీలు నిర్వహించాలి. యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలి. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటినుంచే మరింత బలంగా పనిచే యాలి..’ అని ప్రధాని మోదీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రధాని విందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలుగురువారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. మోది నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ విందుకు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు..బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేష్ హాజరయ్యారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
నెల్లూరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కిడ్నాప్
సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే.. నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మేయర్‌పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్‌ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్‌ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది. -
నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. -
విజయ్‌కు ఝలక్.. తెరపైకి మరో కొత్త పార్టీ
తమిళనాడులో అధికారం హస్తగతం చేసుకోవడానికి పుదుచ్చేరిని గేట్వేగా వాడుకోవాలని భావిస్తున్న స్టార్ హీరో విజయ్‌కు బ్రేక్ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పెట్టిన వ్యక్తి కూడా తన పార్టీకి చెందిన కీలక నేత బంధువువే కావడం గమనార్హం. కొత్త పార్టీతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్.. తాను సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ 'జేసీఎం మక్కల్ మాండ్రం'ను (JCM Makkal Mandram) రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు వెల్లడించారు. ఆ పార్టీకి 'లక్ష్య జననాయక కచ్చి' (Latchiya Jananayaka Katchi) అని పేరు పెడతామని, డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ బావమరిదే చార్లెస్ మార్టిన్. చార్లెస్ సోదరి డైసీ మార్టిన్‌ను అర్జున్ వివాహం చేసుకున్నారు.మార్పు తెస్తాపుదుచ్చేరికి 1954లోనే స్వాతంత్ర్యం వచ్చినా, దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేదని చార్లెస్ మార్టిన్ (Charles Martin) అన్నారు. పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో డిసెంబర్ 14 ఒక 'చారిత్రాత్మక ఘట్టం' కానుందని పేర్కొన్నారు. తనకు అండగా నిలబడి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.సింగపూర్ చేస్తా2026 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చార్లెస్ మార్టిన్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిజాయితీగా లేవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోయాయని చార్లెస్ విమర్శించారు. పాలనలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. సింగపూర్ తరహాలో పుదుచ్చేరిని అభివృద్ధి చేయడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని 'ఇండియా టుడే'తో అన్నారు.జట్టు కడతారా?కాగా, మంగళవారం పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహించిన విజయ్.. ముఖ్యమంత్రి రంగస్వామి నాయకత్వంలోని ఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడులోని డీఎంకే సర్కారుకు చురకలు అంటించారు. రంగస్వామి ప్రభుత్వంపై విజయ్ సానుకూలంగా మాట్లాడటంతో.. పుదుచ్చేరి ఎన్నికల్లో వీరిద్దరూ జట్టు కడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.చదవండి: విజయ్, రంగస్వామి మెగా ప్లాన్ -
మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా, సాక్షి: ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) పై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మొదటినుంచీ ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. కృష్ణానగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..మహిళలా? బీజేపీ? తేల్చుకుందాంఅంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు. అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో, ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు. అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని ఏదీ తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాయపడిన పులి చాలా డేంజర్గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్‌పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
చంద్రబాబుని లెక్క చేయని మంత్రులు!
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకుంటున్నారా?. పద్దతి మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా.. తమ దారి తమదేనన్న రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం, దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రోటీన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో.. ఇవాళ కేబినెట్ మీటింగ్‌లోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. ఇంతకీ ఎందుకు అంటారా?.. మంత్రులు కాస్త లేట్‌గా కేబినెట్ మీటింగ్‌కు వచ్చారట!. దీంతో నా అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీనే పట్టించుకోరా? అని మండిపడ్డారట!. ఆపై ఏమనుకున్నారో ఏమో కాస్త శాంతించి.. మంత్రులు అయ్యి ఉండి మీరే టైంకి రాకపోతే ఎలా?.. అని కాస్త తగ్గిన వాయిస్‌తో చంద్రబాబు మాట్లాడారట. అలా లేట్‌గా వచ్చిన వాళ్లలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్‌లు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో ఆయనలోని కోపధారి బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. బుధవారం ఏం జరిగిందంటే.. రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ‘‘చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలి’’ అన్నారు. అలాగే.. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్‌ప్లాప్ అవుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి. -
ఓట్ చోరీ.. అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు: రాహుల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరినా అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ..‘ఓటు చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు.నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు అని ఆరోపించారు. దీంతో, రాహుల్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. -
‘పోలీసులను అడ్డుపెట్టుకుని మా నేతలను నిర్బంధించారు’
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్భందిస్తున్నారన్నారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెళ్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలు ఉన్నారని ఎస్పీనే చెప్పారనే సంగతిని మాజీ మంత్రి విడదల రజిని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. ప్రతి ఒక్కరి సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
బాబూగోరిజం అంటే ఇదే మరి...
ఇజాలు నిజాలు వేర్వేరు...ఇజం నిజం కానక్కర్లేదు...నిజానికి ఇజం అక్కర్లేదు..ఇదే మన ముఖ్యమంత్రి బాబుగారి సిద్ధాంతమేమో అనిపిస్తోంది. చెప్పొచ్చేదేంటంటే...సర్కారు సంక్షేమ కాడిని కిందికి పడేసి...ప్రైవేటు భుజాన పెట్టేయడమే వారి దృష్టిలో అసలు సిసలు సంస్కరణ. మీకు డౌటనుమానమా? అయితే ఏపీలో కాస్త లుక్కేయండి...బాబుగోరు పవర్ లోకి వచ్చాక ఎన్ని విప్లవాలు పుట్టుకొచ్చాయో....వైద్యవిద్యను దెబ్బకు ప్రైవేటు పరం కానిచ్చి పరమానందంగా అలా ముందుకెళదాం అంటున్నారు. కావచ్చు మనకేంటి నష్టం? అంటారా? ప్రజలకు ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం పక్కా కమర్షియల్ గా మారిపోవడానికి ....ఆ వైద్యవిద్యపై కొందరు ఖర్చుపెట్టే లక్షలాది ఫీజులు కాదా. ఇలా ప్రతీది ప్రైవేటు అంటూ పోతే సర్కారుకు బరువు బాధ్యతలు పేలపిండిలెక్కన మారిపోవా? అని కొందరు బాధపడుతున్నారు. .అసలు బాబుగోరి రూటే వేరండి...మనకు అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. వారిది మొదట్నుంచీ ఇదే స్టైల్. కాశీకి పోయి ఏదో ఒకటి వదిలేసేవారున్నట్లే...సర్కారు వచ్చాక దేన్నైనా ప్రైవేటు భుజాలపై పెట్టి వదిలించుకునే అలవాటున్నవారు మరి. అందుకే ఈసారి మెడికల్ కాలేజీ పై పడ్డారు. అన్నిటికీ మించి గత సర్కారు చేసిన ఏ మంచి పనినైనా సరే కెలకాల్సిన గొప్ప బాధ్యత అధికారంలోకి వచ్చాక ఉంటుంది కదా అనుకుంటున్నారేమో తెలీదు కానీ ...వైఎస్సార్ సీపీ అధికాంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవాలన్న అంశాన్ని ఇపుడు ప్రైవేటు వారికిచ్చేశారు. గతంలో మహారాజులు నచ్చిన వారికి అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇపుడు ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు రెడీ అయిపోయారు. మరోపక్క విశాక స్టీల్ ప్రైవేటుపరం చేసే కుంపటి రగులుతునే ఉంది..సీట్లు తక్కువొచ్చాయి కదా జగన్ పార్టీ ఏం చేస్తుందిలే అనుకుంటే...అంతకంతకూ పవర్ ఫుల్ గా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఇపుడు కో టి గళాల గర్జన అంటూ జగన్ మరో అంకానికి తెరలేపడంతో కూటమి అధినేత బాబుగారు జర గుస్సాఅవుతున్నారని వినికిడి. గత రెండు నెలలుగా వైఎస్పార్ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కోటి సంతకాల సేకరణోద్యమం ఉధృతంగా సాగుతున్నది బాబుగారి దాకా చేరక పోతుందా? వారు కినుక వహించకుండా పోతారా? అన్నది కదా పాయింట్..గత వైఎస్సార్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్ది బడుగు పిల్లల నోట ఇంగ్లీష్ మాటలు పలికించిన తీరు ఎంతకాదన్నా కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బందిగానే మారింది. ప్రైవేటు పాఠశాలల ఊసెత్తని తరం వచ్చేస్తోందన్న ఆందోళన అప్పట్లో వారిలో ఎంతుండేదని. కూటమి రాగానే హమ్మయ్యా మనకిక భయంలేదు...సర్కారు పాఠశాలలకు మళ్ళీ నిరాదరణ వైభోగం తప్పదనుకున్నారని సమాచారం. ఇపుడు మరి బాబుగారికి ఆలోచన ఏ బ్రహ్మీ ముహూర్తాన పుట్టిందో తెలీదు కానీ గత వైఎస్సార్ సీపీ సర్కారు హయంలో ఏర్పడ్డ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకున్నారు. .ఇది మున్ముందు సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. వైద్యం బడుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుంది...ఇవేవీ ఇపుడు వారి సిలబస్ లో లేని అంశాలు. అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ...ఆ వారసత్వ బాటలో నడచిన తనయుడు మాజీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సర్కారు విద్య సంస్కరణలు ప్రజలకు గుర్తుండే ఉంటుందిగా. మరీ ముఖ్యంగా ఇలా ప్రైవేటు పడగ విప్పినపుడు ఇంకా బాగా గుర్తొస్తుంటుంది. - ఆరేం. -
Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్..
చెన్నై: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత విజయ్ తన తొలి బహిరంగ సభ కోసం పుదుచ్చేరిని వేదికగా ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మంగళవారం నాటి ఈ ర్యాలీలో, విజయ్ తన ప్రధాన విమర్శనాస్త్రాలను డీఎంకే (డీఎంకే)పై సంధించారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.రంగస్వామిపై పొగడ్తల వర్షంసభలో విజయ్.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని, ఆయన ఎన్ఆర్ కాంగ్రెస్ (NR Congress) ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన పుదుచ్చేరి సభకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినందుకు రంగస్వామికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి సర్కారును చూసి, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలని ఆయన సూచించారు. విజయ్ తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ, రంగస్వామిని లేదా ఎన్ఆర్ కాంగ్రెస్‌ను మాత్రం విమర్శించకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ప్రారంభం నుండీ ముగిసేవరకు రంగస్వామి పట్ల సానుకూలత స్పష్టంగా కనిపించింది.నూతన రాజకీయాలకు ఆరంభంవిజయ్ తన ప్రసంగంలో డీఎంకేను మాత్రమే తీవ్రంగా విమర్శించారు. విజయ్ ర్యాలీని రంగస్వామి తన మొబైల్లో చూస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నూతన రాజకీయాలకు తెర లేవనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో ఉన్న విభేదాలను ప్రస్తావించడం ద్వారా విజయ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక బలమైన రాజకీయ కూటమి ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తోంది.ఎంజీఆర్ బాటలో..రంగస్వామితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో విజయ్ రాబోయే ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరి.. తమిళనాడుతో పోలిస్తే విజయ్‌కు రాజకీయంగా సులభంగా కలసివచ్చే ప్రాంతమనే భావన చాలామందిలో ఉంది. ఎంజీఆర్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాకముందు, అతని ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) పుదుచ్చేరిలో ఎలా అధికారాన్ని చేపట్టిందో విజయ్ తన ప్రసంగంలో గుర్తుచేయడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉంది. పుదుచ్చేరిలో విజయం సాధించడం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించవచ్చనేది విజయ్ లక్ష్యంగా కనిపిస్తోంది.పొత్తుతో లబ్ధిరంగస్వామి నాయకత్వాన్ని తన ప్రజాదరణను జోడించడం ద్వారా, పుదుచ్చేరి ఓటర్లను ఆకర్షించడం సులభమవుతుందని విజయ్ విశ్వసిస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లాంటి స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, టీవీకే కనీసం కొన్ని ఎమ్మెల్యే స్థానాలనైనా గెలవాలని ఆశిస్తోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే పుదుచ్చేరికి 'రాష్ట్ర హోదా' డిమాండ్‌ను విజయ్ మరోమారు లేవనెత్తారు.ఇరువురికి కలసివచ్చేలా..విజయ్ పుదుచ్చేరిలో రంగస్వామిని దగ్గర చేసుకోవడం అనేది 2026 ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీతో ఎన్ఆర్ కాంగ్రెస్‌కు సంబంధాలు దెబ్బతింటున్న ప్రస్తుత సమయంలో ఈ కొత్త పొత్తు ప్రతిపాదన రంగస్వామికి కూడా ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. తమిళనాడులోకి ప్రవేశించడానికి పుదుచ్చేరిని గేట్వేగా విజయ్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రంగస్వామి పుదుచ్చేరిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు విజయ్‌తో జతకలవాలని యోచిస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కీలకం కానున్నాయయని సమాచారం.ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం! -
టీడీపీకి షాక్.. కడప మేయర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్‌గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. సభ్యులంతా పాకా సురేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి మెజార్టీతో సురేష్ ఎన్నికయ్యారు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. ఇక, కడప మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. కాగా, కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది.వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్‌బాషా, మాజీ మేయర్ కె సురేష్‌బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబ్దిపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. కానీ, అవేవీ సఫలం కాకపోవడంతో అధికార కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. -
ముద్దనూరు ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం
వైఎస్సార్‌జిల్లా: జిల్లాలోని ముద్దనూరు ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ముద్దనూరు ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. ముద్దనూరు మండల స్థానానికి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 స్థానాలున్నాయి. ఇందులో వైఎస్సార్సీపీకి 6గురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉన్నారు. దాంతో వైఎస్సార్సీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కూటమి నేతలు ప్రలోభాలకు దిగినప్పటికీ వైఎస్సార్సీపీ తమ సభ్యులకు విప్ జారీ చేయడంతో ఊహించినట్లే ఈ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికకు సంబంధించి పలువురి సభ్యులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభావం ఉందని ఆరోపేణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీకి భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ అనుచరులు తమ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు గురి కాకుండా ఓటేయడంతో వైఎస్సార్సీపీనే ఈ స్థానాన్ని దక్కించుకుంది. విస్సన్నపేట ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీదేఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బార్గా మారిన అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం..!
అనకాపల్లి: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని బార్గా మార్చారనే ఆరోపణలు ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన నేత సూర్య చంద్ర బార్గా మార్చి అక్కడ దావత్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని బార్గా మార్చడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి జనసేన శ్రేణులు. రాజకీయ పార్టీ కార్యాలయం ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉండాలి కానీ, దాన్ని ఇలా వినియోగించడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది పార్టీ సిద్ధాంతాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగిందని, ఇది పార్టీకి అవమానకరమని మండిపడుతున్నారు. -
అప్పుల కుప్పలు.. ప్రజలకు కష్టాలే కష్టాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్న తాజా నివేదిక ఆందోళనకరం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అధ్యయనం ప్రకారం వేగంగా రుణగ్రస్థమవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ముందున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వాలు చేస్తున్న పదేళ్ల టర్మ్ అప్పులు మరీ ఎక్కువ భాగంగా మారుతున్నాయని, చేసిన అప్పులు సక్రమంగా వాడకపోవడం, ఉద్దేశించిన పథకాలకు కేటాయించకపోవడం, ఆశించినంత రాబడి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం చట్టం వల్ల కొత్త అప్పులు పుట్టడం లేదని కూడా వాపోయారు. అయితే... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి? అప్పటి సీఎం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని.. తాను సంపద సృష్టించి ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తానని కదా? ఏమైంది? అధికారం దక్కగానే స్వరం మారింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాగని కొత్తగా సంపద సృష్టించారా? ఊహూ.. అదీ లేదు. పైగా నిధుల ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారన్న వస్తున్న విమర్శలనూ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో రూ.40 వేల కోట్ల అప్పు చేసేందుకు అవకాశం ఉండగా రూ.49 వేలు, తెలంగాణ రూ.31 వేల కోట్ల స్థానంలో రూ.60 వేల కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తాల్లోనూ పదేళ్లలో తిరిగి చెల్లించవలసిన సెక్యూరిటీలే ఎక్కువ. దీనివల్ల వచ్చే పదేళ్లలో రాష్ట్రాలు మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కునే ప్రమాదం ఉంది. అయితే హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూముల వేలం ద్వారా తెలంగాణ ఏటా రూ.5 నుంచి రూ.పది వేల కోట్ల వరకూ సంపాదిస్తోంది. పైగా రాజధాని పేరుతో ఇష్టమొచ్చినట్లు అప్పు చేయాల్సిన అవసరమూ ఆ రాష్ట్రానికి లేదు. పరిశ్రమల పేరు చెప్పి అణాకు, బేడాకు భూములు కూడా ఇవ్వడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.ఆదాయమేమో తక్కువ. దుబారా ఎక్కువ. విజన్ విజన్ అని చంద్రబాబు చెప్పే మాటలు చేతల్లో మాత్రం అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు తాను చేతల మనిషిని కూడా అన్నది రుజువు చేసుకోవల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే అధికారం దక్కిన తరువాత కేవలం 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎకాఎకి రూ.2.5 లక్షల కోట్ల వరకూ ఉంది. ఈ డబ్బు ఎలా సద్వినియోగమైందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని కాగల 17 వైద్యకళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, రూ.6500 కోట్లకు పైగా ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిలు, రూ.3000 కోట్ల ఎన్టీఆర్ ఆరోగ్యసేవ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. మరో వైపు సూపర్ సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని ఏటా సుమారు లక్షన్నర కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిలో కొన్నిటిని అరకొరగా చేసి.మిగిలిన వాటిని మంగళం పలకడానికి ఇప్పుడు తాజాగా అప్పులు పుట్టడం లేదన్న గాత్రం అంందుకున్నట్లు అనిపిస్తుంది. రాష్ట్ర జీఎస్టీ రాబడి తగ్గడం కూడా మరో ప్రమాద సూచిక. జీఎస్టీ స్లాబ్‌లు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఎల్లోమీడియా డబ్బా కొట్టినా ఇప్పుడు మాటమార్చి రాబడి తగ్గిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సెంట్రల్ యూనివర్శిటీ లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ఫ్రొషెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి వంటి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక్క కరోనా సంక్షోభ సమయంలో తప్పు నిర్ణీత పరిమితిలోపే అప్పులు చేసేవని, 2025లో పలు రాష్ట్రాలు హద్దులు దాటి అప్పులు చేస్తూ భావితరాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాలు ఏ స్కీమ్ కింద అప్పులు చేస్తాయో దానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం వల్ల అప్పు తీర్చడానికి అవసరమైన ఆదాయం రాదు. దాంతో అప్పులకు వడ్డీ తోడై భారం తడిసి మోపెడవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసలు అప్పుల్లేకుండానే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ రూ.40 వేల కోట్లు అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో రోడ్ల వంటివి నిర్మించినప్పటికీ ఆ తరువాత ఆదాయమేమీ రావడం లేదు. దీంతో అప్పులపై వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతోంది. భూమి ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత మిగిలిన భూమిని అమ్మి మాత్రమే ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవాలి. లేదంటే అప్పు ఓ గుదిబండగా మారుతుంది. ఈ దృష్టితోనే రాజధాని పేరుతో విపరీతమైన ఖర్చులు వద్దని నిపుణులు వారించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కంప చెట్లు కొట్టించేందుకే రూ.40 కోట్లు వ్యయం చేశారంటే ఈ ప్రభుత్వం దుబారా స్థాయి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. వందల కోట్ల రూపాయలతో వరదనీరు తోడటం, కిలోమీటర్ రహదారికి ఎక్కడా లేనంతగా రూ.75 కోట్ల నుంచి రూ.174 కోట్ల వరకూ ఖర్చు చేస్తూండటం, మహా నగరాల్లోనూ లేని విధంగా చదరపు అడుగు భవన నిర్మాణానికి రూ.పదివేలకు మించి వ్యయం చేస్తూండటం కూడా ప్రభుత్వం తీరుకు అద్దం పట్టేవే. ఇలా లక్షల కోట్లు వ్యయం చేసి ఆ తర్వాత తిరిగి రాబట్టుకునే మార్గం లేకపోతే ఆ భారం రాష్ట్ర ప్రజలు మోయవలసిందే. ఈ మధ్యకాలంలో పరిశ్రమలకు ఇస్తున్న భారీ రాయితీలు కూడా ఆర్థిక పరిస్థితిపై మరిన్ని సందేహాలను లేవనెత్తుతున్నాయి. విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.22 వేల కోట్లకుపైగా రాయితీలు ఇవ్వడం దీనివల్ల వచ్చే ఉద్యోగావకాశాలు రెండువేలు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో 200 ఉద్యోగాలే వస్తాయని తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వం ఈ భారం అంతా మోయవలసి వస్తుంది.ఇక కొన్ని పరిశ్రమలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారు. అలాకాకుండా ప్రభుత్వం హేతుబద్దమైన రీతిలో ఈ ధరలు నిర్ణయించి ఉంటే అది అమ్మకమైన, లీజు అయినా ప్రభుత్వానికి కొంత ఆర్జన ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు ఇచ్చుకుంటూ పోయి, మరో వైపు ప్రభుత్వానికి ఏళ్లతరబడి వచ్చే ఆదాయం లేని పరిస్తితి ఏర్పడితే అది ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చన్నది నిపుణుల అంచనా.తీసుకునే రుణాలు ఏ పాతికేళ్లకో చెల్లించేలా తీసుకోగలిగితే అది ఒక రకంగా ఉండవచ్చు.కాని కేవలం పదేళ్లకే తిరిగి చెల్లించేలా ఒప్పందం అయితే ఏటాటే ఆర్ధిక భారం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికే అప్పులు చేసే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం,ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి జనాన్ని మోసం చేయడం, అరకొరగా చేసి అన్నీ చేసేశామని బొంకడం, ఇంకో వైపు ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం,దానిని కప్పిపుచ్చుతూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం..ఇదే - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను పోలీసులు కిడ్నాప్ చేశారు’
మాచవరం: మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీకి బలం లేకపోయినా కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్‌రడ్డి ధ్వజమెత్తారు. మాచవరంలో వైఎస్సార్సీపీకే బలం ఉందని, అందుకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారన్నారు. ఈ కిడ్నాప్ వెనుక పోలీసుల హస్తం ఉందని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. దాచేపల్లి సీఐ భాస్కర్.. వైఎస్సార్సీపీ ఎంపీటీలసీలను కిడ్నాప్ చేశారన్నారు. కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారకపోతే గంజాయి కేసు బనాయిస్తామని సీఐ బెదిరింపు చర్యలకు దిగారని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. కాగా, మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు(గురువారం, డిసంబర్ 11వ తేదీ జరుగనుంది. ఇటీవల మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, పోటికి దిగిన టీడీపీ వివాదాలు స్పష్టిస్తోంది. మాచవరం మండలంలె 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో 13 స్థానాల్లో 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులుండగా, కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు. అయితే పోలీసుల సాయంతో ఎంపీపీని గెలుచుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. అందుకే పోటీకి దిగి అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది. కుట్రలు , కుతంత్రాలు చేస్తూ ఎన్నిక జరగ్గకుండా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్‌కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్‌కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్‌కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో మహాధర్నా
సిరిసిల్ల: ఆటో కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో వారితో కలిసి మహాధర్నా చేస్తామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5వేల మంది ఆటోడ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరిట రూ.5 లక్షల సొంత డబ్బులతో చేయించిన ప్రమాద బీమాకు సంబంధించిన కార్డులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు కేసీఆర్ అండ ‘ఆటో అన్నలతో బీఆర్ఎస్కు ఉన్న అనుబంధం కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారు. ‘తెలంగాణ కావాలే’అని ర్యాలీలు తీసి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులపై కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 6.5 లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులు అడగకుండానే, పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారు. రైతుబీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చింది కేసీఆర్ ఒక్కరే. డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన కార్మిక పక్షపాతి కేసీఆర్. ఆటో డ్రైవర్లతోపాటు అసంఘటిత రంగంలోని దాదాపు 13.50 లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, ట్యాక్సీలు, లారీలు) రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు బీమా ఊడగొట్టింది. మా ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలతో నేడు రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చింది..’అని కేటీఆర్ చెప్పారు. అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు ‘రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైంది. రైతులు, యువత, మహిళలు సహా అందరికీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. రైతు రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం ఉండగా.. రూ.12 వేల కోట్లు ఇచ్చి అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24 వేలు బాకీ పడింది. మరోవైపు ఈ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు.. అందుకే పోరాటం తప్పదు..’అని కేటీఆర్ అన్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతిలోపు తాము ప్రమాద బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్)గా ఏర్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు తులా ఉమ, అరుణ, ఆటోకార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా తీవ్ర విమర్శలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటి సంతకాల ఉద్యమం గురించి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా పోరాటాన్ని మొట్టమొదటి సారిగా రాష్ట్రం చూస్తోందని రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే వాటిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఈ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని, ఇది తిరుగుబాటుకు నాందిగా మారిందని రోజా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదు. అందుకే ప్రజలు విసుగుతో సంతకాల ఉద్యమానికి ముందుకొస్తున్నారు.ఎన్నికలకు ముందు పోర్టులు, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దోచుకోవడం దాచుకోవడమే వారి పనిగా చేసుకుంటున్నారని రోజా విమర్శించారు.జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు. గాడిద పాలు కడవెడు ఉన్నా,గంగిగోవుపాలు గరిటెడు చాలు అన్న చందంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. రెండు లక్షల అరవైవేల కోట్లు అప్పులు చేసిన నీకు, నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ కట్టిన వాడికి నాలుగువేల కోట్లు లేవా. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమీషన్లు ఇస్తామంటే బినామీలకు అంటగట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంకా నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అవుతుందని రోజా మండిపడ్డారు. -
కోటి సంతకాల ఉద్యమం.. కోటి మంది గుండె చప్పుడు: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని.. ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైయస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపునకు ప్రజలు భారీగా తరలి వచ్చి సంతకాలతో మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు.ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ పెట్టుబడులు, ఫేక్ సూపర్ సిక్స్ కాదులోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్యత్వాలు మాదిరిగా కాకుండా, చంద్రబాబు ప్రకటించే ఫేక్ పెట్టుబడుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూపర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్రజలు స్పష్టంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పేపర్లపైన చేసిన సంతకాలు. కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడికల్ సీటు కలను పణంగా పెడుతూ, వైద్యాన్ని పేదలకు అందని ద్రాక్షగా మారుస్తూ జరుగుతున్న కుట్రలను గుర్తించిన ప్రజలు ప్రైవేటీకరణ వద్దని నినదిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంతకాలు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు కనుమరుగు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎకరా వంద రూపాయల చొప్పున మెడికల్ కాలేజీల భూములను అప్పనంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతిటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వారికే ఇచ్చేసింది. అందులో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తున్న ధన యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. దానికి సాక్ష్యమే వైయస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు వచ్చిన అపూర్వ స్పందన. ప్రైవేటీకరణ నిర్ణయం చాలా గొప్పదన్నట్టు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి.గవర్నర్‌కి డిజిటల్ రికార్డులు సమర్పిస్తాంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసిన వైయస్సార్సీపీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతాభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10న రచ్చబండ పేరుతో ప్రతి గ్రామంలో మొదలైన కోటి సంతకాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువత, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా చేయాలనుకుంటే అంతకుమించి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన రెండు నెలలుగా స్టాప్ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చర్చలు జరుపుతూ నష్టాలను వివరిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. తమకు ఎదురైన అనుభవాలను పార్టీ నాయకులు మీడియాకు వివరించడం కూడా జరిగింది. 26 జిల్లాల్లో ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి నేతృత్వంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ప్రజలే తమ పేరు నియోజకవర్గం, గ్రామం, మొబైల్ నంబర్, సంతకాలను పేపర్లపై పొందుపరిచారు. ఈ మొత్తం సంతకాలను డిజిటలైజ్ చేసి గవర్నర్‌కి అందించడం జరుగుతుంది. కోటి మంది ప్రజల గుండె చప్పుడుగా ఈ కోటి సంతకాలను ప్రభుత్వం పరిగణించి పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా నిర్ణయాన్ని కాదని ముందుకెళితే ఈ కోటి సంతకాలు ప్రభుత్వం పతనానికి శాసనంగా మారతాయని వైయస్సార్సీపీ హెచ్చరిస్తుంది. నియంత పాలనకు మూల్యం చెల్లించక తప్పదుప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మంత్రి స్వయంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయిందని ప్రభుత్వమే అంగీకరించినట్టు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లక్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్రభుత్వ వైద్యశాలలను మార్చేశారు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారబోతోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే దించేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని స్పష్టంగా చెబుతున్నా. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదని వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్లర్ మాదిరిగా నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబుకి హిట్లర్‌కి పట్టిన గతే పడుతుందని విడదల రజని హెచ్చరించారు. -
18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
పవన్‌పై అంబటి వ్యంగాస్త్రాలు
సాక్షి,గుంటూరు: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు. 2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబు,పవన్ ఎంత బురద జల్లిన వైఎస్ జగన్‌కు అంటుకోదని స్పష్టం చేశారు. -
బోరుగడ్డ అనిల్‌కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్‌గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గన మాట్లాడారు. ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని పెంచింది.... తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు. చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్ వన్‌గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు.. కాగ్ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు. చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. -
వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. -
అటు నేనే...ఇటు నేనే..!
అటు నేనే ...ఇటు నేనే....అది నేనే....ఇది నేనే...అంతా మాయ...అన్నట్టుంది ఏపీ డీసీఎం పవన్ సారు తీరు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అన్నట్లు పవన్ జీ తానొవ్వక...కమలదళాధిపతుల మనసు నొప్పించక వారిని ఎలాగైనా ఒప్పించేందు నిరంతరం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాషాయాలింగనం చేసుకున్న దరిమిలా ఇపుడు జనసేనాని హిందుత్వానికి అపర ధర్మకర్తలా వ్యవహరిస్తూ మోదీ మనసు చూరగొంటున్నారు. ఇటు బాబు...అటు మోదీ ఇరుగడలా చూస్తుండగా...మన పవన్ సార్ అరివీర భయంకరుడిలా...అపర హిందుత్వ వాదిలా సందర్భం దొరికినపుడల్లా వీర విజృంభణ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉడిపి శ్రీకృష్షుడి చెంతన నిలిచి పసితనంలోనే తాను తన కుటుంబ సభ్యులు నారాయణ నారాయణ అని జపించి తరించినట్లు ఉటంకించుకున్నారు. .అదేంటి సార్ అప్పుడెప్పుడో నాన్నగారు పరమనాస్తికులు అమ్మ ఇచ్చే హారతి వెలుగులోనే నాన్నగారు చుట్టా కాల్చేవారని అన్నారు కదా అంటే నిజమే అదినేనే...ఇది నేనే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఎవరేం అంటారు. అంతేలేండి ఎవరి అభిరుచి వారిది కాదనలేం. కానీ తవరి అభిరుచులు మారిపోతున్నాయి కదా అంటారా? సో వాట్ మారకూడదా అని పవన్ సారు అన్నప్పుడు నిజమే అని బేషరతుగా ఒప్పేసుకోవడమే మంచిదంటున్నారు మరికొందరు. తాజాగా హిందూ విశ్వాసాలను , ఆచారాలను పాటించడg రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు అని ఓ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినందుకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో అభిశంసనకు పిలుపునివ్వడాన్ని ఏమనాలి? ఇది కోర్టుల్ని మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? సూడో సెక్యూలరిజం కాదా అని డీసీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ ఎక్స్ లో ట్వీటారు. సరే ఎవరైనా సరే ఒక ధర్మ గురించి అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అది వారి వ్యక్తీకరణ స్వేచ్ఛ. అయితే వచ్చిన చిక్కంతా ఏంటంటే...మనం గతంలో ఒకలా వ్యవహరించి అకస్మాత్తుగా విధానాలను మార్చుకుని ఏమీ జరగనట్లు వ్యవహరిస్తున్నప్పుడే కొన్ని విమర్శలు ఎదురవుతాయి. వాటికి స్పందించడమా లేదా అన్నది మళ్ళీ వ్యక్తిగతం అవుతుంది..తమిళనాడులోని తిరుప్పర కుండ్రం కొండపైన దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంగా అక్కడి దర్గా కమిటీకి.... సుబ్రమణ్య స్వామి ఆలయ కమిటీకి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించి మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ పరిమిత సంఖ్యలో వెళ్ళి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశిలివ్వడంపై ఇండియా కూటమి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. ఈ విషయంగా మితవాదులు, వామపక్షవాదులు వారి స్పందనలు తెలపడంలో ఎలాంటి వింత ఉండదు. కానీ గతంలో వామభావాలతో కాగి ఊగి రేగి పోయిన నేత ఉన్నట్టుండి కాసాయాంబర ధారిగా మారి మాట్లాడ్డమే కాసింత చోద్యం అనిపిస్తోంది..2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఎస్పీ , వామపక్షాలతో జట్టు కట్టారు. అప్పట్లో తను పోటీ చేసిన రెండు సీట్లలో ఒటమి పాలైన విషయం తెలిసిందే. 137 సీట్లకు గాను కేవలం ఒక్కసీటే జనసేన ఖాతాలో వేసుకోగలిగింది. 2014...2019 జనసేనాని పవన్ కల్యాణ్ తన రాజకీయ పంథా వామపక్షభావాలతో ముడిపడి ఉండేవే అన్నట్టు వ్యవహరించేవారు. చెగువేరా వీరాభిమానిగా సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. అప్పటి ఎన్నికల ప్రచార వాహనాలకు చెగువీరా బొమ్మలుండేవి. క్యూబన్ విప్లవవాది ఫిడేల్ కాస్ట్రో , బెంగాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు చారు మజుందార్ తన స్పూర్తిప్రదాతలుగా తెలిపారు. ఇదంతా గతం గత:. ప్రస్తుతం జనసేన అధినేత, డీసీఎం పవన్ కల్యాణ్ హిందుత్వవాదిగా కనిపిస్తూ ఆ సెగ్మెంట్ లో కొత్త ఓటుబ్యాంకుకు ప్రయత్నిస్తున్నారని కొందరి వాదన..మార్క్సిస్ట్ విప్లవవాది చెగువేరా రోల్ మోడల్ గా గుండెలో నిలుపుకొన్న పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఎలా హార్డ్ కోర్ హిందుత్వ వాదిగా పరివర్తనం చెందారన్నదే చాలా మందికి మింగుడుపడని ప్రశ్న. - ఆరెం -
పంచాయతీ ఎన్నికల్లోనూ అలవికాని హామీలు!
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అని సామెత. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వార్తలు ఈ సామెతనే గుర్తు చేస్తున్నాయి. ప్రజాపాలన ఉత్సవాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ‘‘హాఫ్‌కు’’ ‘‘ఫుల్‌కు’’ ఓటేయవద్దని చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని సీఎం స్వయంగా చెప్పడం ఆహ్వానించదగ్గది. అన్ని పార్టీలవారు వీటిని పాటించడం అవసరం. కాని అలాంటి మాటలు చెప్పడానికి ముందు పాటించి చూపడమూ ముఖ్యమే. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు ఎంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నదీ మద్యం ఎలా పారుతోంది? అందరికీ తెలిసిన విషయమే. ఈ సంగతులన్నీ ప్రజలకు తెలియవా? ఈ మధ్యనే జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, ఒక్కో ఓటుకు రూ.2500 నుంచి రూ.నాలుగైదు వేల వరకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. వారీ స్థాయిలో కాకపోయినా బిజెపి కూడా బాగానే ఖర్చు చేసింది కదా! రేవంత్, మంత్రులు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు కదా! ఇన్ని చేసినవారు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో మద్యం, డబ్బు పంచవద్దని చెబితే జనానికి పడతాయా? అయినా సీఎం హితబోధ చేయడాన్ని తప్పు పట్టనక్కర్లేదు. రేవంత్ మరో మాట కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తోందని, మంచి ప్రభుత్వం కనుక ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, మరో మూడేళ్లు ఈ ప్రభుత్వానికి సహకరించే సర్పంచ్‌లు ఎన్నికైతే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారిని ఎన్నుకోవాలని, కిరికిరిగాళ్లను వద్దని కోరారు. పంచాయతీ ఎన్నికలు పేరుకే రాజకీయేతరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తన స్పీచ్‌లలో ఎవరినైనా రాజకీయాలకు అతీతంగా మంచివారిని ఎన్నుకోండని చెబితే బాగుండేది. అలా కాకుండా తమ మద్దతుదారులనే ఎన్నుకోవాలని పరోక్షంగా ప్రచారం చేసినట్లు అనిపిస్తుంది. వేరే పార్టీ మద్దతుదారులను సర్పంచ్‌లుగా ఎన్నుకుంటే నిధులు రావని, పనులు జరగవని బెదిరిస్తున్నట్లు అనిపించదూ! వర్తమాన రాజకీయాలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణితో ఉంటున్నాయన్నది కూడా వాస్తవమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీవారినే ఉప ఎన్నికలలో, జెడ్పీ, మండల, పంచాయతీ ఎన్నికలలో గెలించాలని, లేకుంటే అభివృద్ది ఆగిపోతుందని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక బలహీనతగా కనిపిస్తుంది. ఇదే ధోరణితో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాష్ట్రాలలో ప్రచారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పర్వంలో డబ్బు, మద్యం,తదితర ప్రలోభాలు యథావిధిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వేలంపాటల ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో మాత్రం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. కాని అత్యధిక పంచాయతీలలో ఈ పరిస్థితి లేదు. అదేమీ తప్పు కాదు. పంచాయతీలలో ఎన్నికులు జరగవచ్చు. కాని అవి పద్దతిగా జరిగితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. మంత్రులు,ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో ఎలాగైనా ఏకగ్రీవాలు జరగాలని తంటాలు పడుతున్నారట. కొన్ని పంచాయతీలలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు రాష్ట్ర స్థాయి పార్టీలు, నేతలను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు కొందరు హామీలపై బాండ్లు రాసిచ్చారు.దానిని ఆయా చోట్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పాటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్ధి ఇంటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు, పెళ్లి జరిగితే ఆడబిడ్డకు ఐదువేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారట. కొన్ని గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చు చేస్తున్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాలలో ఎన్నికలు జాతరను తలపిస్తున్నాయి. చిన్న పంచాయతీలలో పది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్దమవుతున్నారు.కాస్త పెద్ద పంచాయతీలలో కోట్లు వ్యయం చేయడానికి వెనుకాడబోమని చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పోటీదారులకు రూ.15 నుంచి రూ.35 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామంలో సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తానని ఒక అభ్యర్ధి హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో 700 ఇళ్లు ఉన్నాయి. ఇందుకోసం ఏడాదికి సుమారు ఎనిమిది లక్షల చొప్పున ఐదేళ్లకు నలభై లక్షలు వ్యయం చేస్తానని హామీ ఇచ్చారన్నమాట. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం పేరుతో రూ.ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, ఆడపిల్లలకు మెట్టెలు, పెళ్లికొడుక్కి రూ.5116 ఇస్తామంటున్నారట. ఇల్లు కట్టుకుంటే స్లాబ్ వేసుకున్నప్పుడు రూ.21 వేలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నారట. మరి కొన్ని గ్రామాలలో విద్యార్ధులకు ఉచిత బ్యాగ్‌లు, బూట్లు, ఉన్నత విద్యకు ఆర్థికసాయం, సీసీ కెమెరాలు మొదలైనవి సమకూర్చుతామని హామీ ఇస్తున్నారు. గద్వాల జిల్లా సల్కావరం గ్రామంలో ఒక అభ్యర్ధి 22 హామీలతో బాండ్ పేపర్ పై రాసిచ్చారట.ఇవన్ని అచ్చంగా అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అసాధ్యమైన హామీల్లానే ఉన్నాయి. ఇక ఒకే కుటుంబానికి చెందిన వారు పోటీ పడుతున్న ఘటనలు జరిగాయి. బలవంతంగా విత్ డ్రా చేసుకోమంటున్నారని ఒక అభ్యర్ధి ఆత్మహత్యకు పాల్పడ్డారట. నిధులు అంతంత మాత్రంగా ఉండే పంచాయతీ ఎన్నికలలో ఈ పరిస్థితి ఎందుకు ఉందో ఊహించుకోవచ్చు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎలాగైతే రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయో,అదే రీతిలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయని అనుకోవాలి. అధికారంలోకి వచ్చాక, హామీలు అమలు చేసినా,చేయకపోయినా ఏమీ కాదులే అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేతలు వ్యవహరిస్తుంటారు.దానినే గ్రామాలలో అభ్యర్ధులు క్లూగా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘‘హాఫ్‌కు’’, ‘‘ఫుల్‌కు’’ ఓటు వేయవద్దని రేవంత్ రెడ్డి చెబితే ఎవరైనా వింటారా? సుద్దులు చెప్పడం కాకుండా నిబంధనలను పటిష్టంగా అమలు చేసినప్పుడు, రాష్ట్ర స్థాయి నేతలు ముందుగా తాము పాటించి చూపితే ప్రజలలో విశ్వసనీయత వస్తుంది .లేకపోతే అవన్ని ఊకదంపుడు ఉపన్యాసాలుగానే మిగిలిపోతాయి అని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ ప్రలోభాలు
అనంతపురం మరోసారి టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వైఎస్సార్సీపీ నేతలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారు. ‘ మీకు ఎంతైనా ఇస్తాం.. మాకు ఓటయ్యండి’ అంటూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు పలువురు టీడీపీ నేతలు. డబ్బు ఎంతైనా ఇస్తామంటూ ఫోన్లో ఓ టీడీపీ నేత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రలోభాలకు గురిచేస్తున్న కూటమికి చెందిన సోమశేఖర్ ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రేపు(డిసెంబర్ 11వ తేదీ) కళ్యాణదుర్గం మున్సిపల చైర్మన్ ఎన్నిక జరుగనున్నతరుణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభ పెడుతోంది. గతంలో పలు సందర్భాల్లో టీడీపీ ఈ తరహా చర్యలకు పాల్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ తరహా చర్యలపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కూటమి నేతలు.. తమ వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కాగా, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం(డిసెంబర్ 10వ తేదీ) నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మంగళవారం డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి ఆర్డీఓ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉందన్నారు. చైర్మన్ ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగ కుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నికకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర -
బెంగాల్ ఎన్నికల్లో లబ్ధికే వందేమాతరంపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సామాన్య ప్రజల సమస్యలపై చర్చించి, పరిష్కరించిన రోజున మాత్రమే భారత మాతకు నిజమైన నివాళి అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ వందేమాతరంపై చర్చను చేపట్టారని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర దేశం ముందున్న ప్రధానమైన సమస్యలపై అందరి దృష్టినీ మళ్లించేందుకు కూడా ఈ చర్చను కేంద్రం నిర్వహిస్తోందని ఆరోపించారు.మంగళవారం ఆయన వందేమాతర గీతానికి 150 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొని, దాదాపు గంటపాటు మాట్లాడారు. వందే మాతర గీతాన్ని రెండు చరణాలకే పరిమితం చేశారంటూ నెహ్రూపై ప్రధాని మోదీ, అమిత్‌షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య కృపలానీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహామహులతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయమన్నారు. అప్పట్లో వందేమాతరం ఆలపించేందుకు ఇష్ట పడిన వారు సైతం నేడు వందేమాతరం అంటున్నారని, ఇదే జాతీయ గీతం గొప్పదనమని ఖర్గే చెప్పారు.‘దక్షిణాసియా దేశాలను బాహాటంగానే చైనా తన వైపు లాక్కుంటోంది. తన ఛాతీ 56 అంగుళాలని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడారా?’అని ఖర్గే ప్రశ్నించారు. యూపీఏ హయాంలో 55 రూపాలయ వరకు ఉన్న డాలరు విలువ నేడు ఏకంగా ఆకాశమంత ఎత్తుకు పెరిగి రూ.90కి చేరుకుందన్నారు. వందేమాతరం గురించి మాట్లాడటమంటే, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పరిణామాలను గురించి మాట్లాడుతున్నారంటూ అధికార పక్షాల సభ్యులు అభ్యంతరం తెలపగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వారితో ఏకీభవించారు. -
ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడీ
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి ఆర్నెల్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ముందస్తు అంచనాలను తప్పులతడక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ... తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ అంకెలను తయారుచేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారంటూ దెప్పిపొడిచారు.దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా రాష్ట్ర జీఎస్డీపీ సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 10.40 శాతంగా ఉన్నట్లయితే... రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు.‘కొందరిని కొంతకాలంపాటు మభ్యపెట్టగలవు... కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగలవు... కానీ, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేవు’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు విధానాలను కడిగిపారేస్తూ మంగళవారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం‘‘చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లకు సంబంధించిన జీఎస్డీపీ అంచనాలను విడుదల చేసింది. ముందస్తు అంచనాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా. కానీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్... రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వక్రీకరించలేరు. రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారానే ఏపీ ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. కాగ్ గణాంకాలు చంద్రబాబు సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనో తయారైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి.𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ గారి మాటలను గుర్తు చేయాల్సి వస్తోంది. లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుకు సరిపోతాయి.ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా?⇒ నిజంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లైతే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?⇒ 2014–19 మధ్య మీ పాలనలో జీఎస్డీపీ వృద్ధి అంత గొప్పగా ఉన్నట్లైతే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 4.45 శాతానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది?⇒ వైఎస్సార్సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో దేశ జీడీపీలో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78 శాతంగా ఉన్న మాట వాస్తవం కాదా?⇒ మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లైతే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టు అయినా ఎందుకు పెరగలేదు?((చంద్రబాబు వాస్తవిక సమర్థత గురించి, అలాగే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ ట్వీట్‌కు స్లైడ్లను జత చేశాం. వీటిని అందరూ ఓసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.)) బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట⇒ 2014–19 కాలానికి చెందిన జీఎస్డీపీ సీఏజీఆర్‌ను, 2019–24 కాలానికి చెందిన సీఏజీఆర్‌తో పోల్చి.. తాను 2019–24 మధ్య అధికారంలో కొనసాగి ఉంటే 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.5 శాతం అయ్యేదంటూ చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.⇒ 2019–24 మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్ కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే దాన్నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాను అధికారంలో ఉంటే 13.5 శాతం వృద్ధి సాధించేవాడినని చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.⇒ సీఏజీఆర్ అనేది మొదటి సంవత్సరం, చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు. కానీ, ప్రతి సంవత్సరానికీ గణాంకాలను విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణమైన, నిజమైన పోలిక సాధ్యమవుతుంది. ఆ వివరాలను ఒక్కసారి చూస్తే... 2014–19 కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.54 శాతం మాత్రమే. అదే 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 4.78 శాతం. ఇది మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన 2020–21, 2021–22లో దేశ జీడీపీలో ఏపీ వాటా వరుసగా 4.93 శాతం, 4.79 శాతం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చిన విధానాలు, దీంతోపాటు అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా... కోవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యంత దారుణ పనితీరును చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ, తానుఇంకా మెరుగ్గా పనిచేసే వాడిని అని ఆయన ఎలా చెప్పగలరు?భారీగా అవినీతి... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడమే దీనికి నిదర్శనం⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడించిన అంచనాల ప్రకారం 2024–25 తొలి ఆర్నెల్లలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 9.89 శాతం.. 2025–26 తొలి ఆర్నెల్లలో 10.91 శాతం. ఈ రెండేళ్ల మొత్తాన్ని కలిపిచూస్తే జీఎస్డీపీ సీఏజీఆర్ 10.40 శాతం మాత్రమే కనిపిస్తోంది.⇒ సహజంగానే, ఈ స్థాయి జీఎస్డీపీ వృద్ధితో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు కూడా కనీసం 10 శాతం సీఏజీఆర్‌తో పెరగాలి. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది.⇒ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే ఎస్జీఎస్టీ ఆదాయాల సీఏజీఆర్ 4.35 శాతం మాత్రమే పెరిగాయి. సేల్స్ ట్యాక్స్ ఆదాయాల సీఏజీఆర్ –2.80 శాతానికి తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే, రాష్ట్ర సొంత ఆదాయాల సీఏజీఆర్ కేవలం 2.58 శాతం మాత్రమే. ⇒ కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికీ.. మద్యం రిటైల్‌ను ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్‌లను తిరిగి అనుమతించడం తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సుంకం సీఏజీఆర్ కేవలం 5.10 శాతం మాత్రమే పెరిగింది. లిక్కర్ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాల సీఏజీఆర్ ఎక్కడా 10 శాతానికి దగ్గరగా కూడా లేదు. అది కేవలం 2.58 శాతం మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం (కేపిటల్ ఎక్స్పెండేచర్) భయంకరంగా పడిపోయి సీఏజీఆర్ –16 శాతంగా నమోదైంది.⇒ నిజమైన వృద్ధి కనిపించిన ఏకైక అంశం... కేంద్ర పన్నులలో రాష్ట్రానికి లభించిన వాటా. అది కూడా సీఏజీఆర్ 17.78 శాతం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు సంబంధించినది. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు.విద్యుత్ రంగంపై వాస్తవాలకు భిన్నంగా బాబు మాటలువిద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. ఎఫ్‌పీపీసీఏ (ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్) పేరుతో, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై రూ.18,272 కోట్లు భారం వేసింది. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సరే గత ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణం కోసం రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల బాండ్ల విడుదల కోసం రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పుల కోసం పణంగా పెట్టింది.ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) మీద బాండ్ హోల్డర్లకు హక్కు కల్పించింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకర చర్య. చంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ రంగం దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం ఆయన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో (2014–19) విద్యుత్ రంగపు అప్పులు సీఏజీఆర్ 23.88 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో (2019–24) ఆ అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 7.28 శాతం మాత్రమే. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక ప్రగతిచంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టారని చేసిన ఆరోపణ కూడా పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన తయారు చేసిన అబద్ధమే ఇది. ఎంవోఎస్పీఐ గణాంకాల ప్రకారం.. ఏపీలో పరిశ్రమల జీవీఏ (స్థూల విలువ జోడింపు) వృద్ధి (2019–24) సీఏజీఆర్ 11.14 శాతం. అదే కాలంలో దేశ పరిశ్రమల జీవీఏ వృద్ధి సీఏజీఆర్ 8.96 శాతం. అంటే, వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో దేశ సగటు కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిని సాధించిందన్నది స్పష్టమవుతోంది. పారిశ్రామిక వృద్ధికి సంబంధించి ఇలాంటి స్పష్టమైన విజయాలు ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచిపెట్టారని చంద్రబాబు గారు ఎలా అంటారు? అది నిజానికి అసత్య ఆరోపణ... ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మాత్రమే. -
అది అతిపెద్ద దేశద్రోహం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడుతూ భారత్‌లోనే అతిపెద్ద దేశద్రోహానికి ఒడిగట్టిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంస్కరణలు అంశంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత హోదాలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈసీపై, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై విమర్శల జడి కురిపించారు. అతిపెద్ద నేరమేదంటే.. అది ఇదే‘‘అతిపెద్ద దేశద్రోహ నేరమంటూ ఉందంటే అది ఓట్ల చోరీనే. మీరు చేసిన ‘ఓట్ల చోరీ’ స్థాయి అతిపెద్ద నేరం దేశంలో ఇంతవరకు జరగలేదు. నిజమైన పౌరుల వాస్తవిక ఓటును హరించి దేశ ప్రజాస్వామ్య వస్త్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు. నవభారత్ను విధ్వంసం చేస్తున్నారు. భారత్ అనే భావనను కూలదోస్తున్నారు. లోక్‌సభలో అటు పక్క అధికార కుర్చీల్లో కూర్చున్న వాళ్లంతా కలిసి దేశ వ్యతిరేక దుశ్చర్యలు తెగిస్తున్నారు’’ అని అన్నారు.ఈవీఎం సంగతేంటి?‘‘ఈవీఎంతో మీరెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. మాకూ ఈవీఎంను తనిఖీచేసే అవకాశం ఇవ్వండి. మా సాంకేతిక నిపుణులు సైతం ఈవీఎంల పనిపడతారు. అసలు ఈవీఎంలోపల ఏం పెట్టా్టరో తేలుస్తారు. ఇప్పటిదాకా మాకు ఈవీఎంలపై కనీస హక్కు లేదు’’ అని రాహుల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లనుద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘వాళ్లకో విషయం చెబుతున్నా. ఇప్పుడున్న సవరణ చట్టాన్ని భవిష్యత్తులో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ మారుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు కమిషనర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్లనే బాధ్యులను చేస్తాం. కారకుల భరతం పడతాం’’ అని రాహుల్ పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ బ్రెజిల్ యువతి ప్రస్తావనహరియాణాలో బ్రెజిల్ యువతి పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు వచ్చిందన్న అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బ్రెజిల్ యువతి మాత్రమేకాదు ఎంతో మందిపేర్లు ఇలా హరియాణా ఓటర్ల జాబితాలో పలుమార్లు పునరావృతమయ్యాయి. ఒక మహిళ పేరు ఏకంగా 200 సార్లు ఉంది. ఇవన్నీ చూశాక హరియాణా ఎన్నికలు చోరీ అయ్యాయనేది సుస్పష్టం. ఇది ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లోనే జరిగింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే చేపట్టామని ఈసీ ఘనంగా చెప్పుకుంది. మరి అలాంటప్పుడు మళ్లీ 1.2 లక్షల డూప్లికేట్ ఫొటోలు ఎలా తుది జాబితాలో ప్రత్యక్షమయ్యాయి? ఈ ప్రశ్నకు ఈసీ దగ్గర సూటి సమాధానమే లేదు’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు.మనది గొప్పదైన ప్రజాస్వామ్యంఅందరూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. వాస్తవానికి మనది గొప్పదైన ప్రజాస్వామ్యం. అమెరికా తమది పురాతన ప్రజాస్వామ్యం అంటుంది. నిజానికి మనదే గొప్పది. అత్యధిక మంది ఓటర్లు, భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, రాష్ట్రాల సమ్మేళనంగా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెస్తున్న ఇదే ప్రజాస్వామ్యభావనకే బీజేపీ తూట్లు పొడుస్తోంది. ధ్వంసం చేస్తున్నామని వాళ్లకూ తెలుసు. ఆనాడు గాంధీజీని ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే మూడు బుల్లెట్లు ఛాతీలో దింపి మహాత్ముడి ప్రాణాలను బలితీసుకున్నాడు.బీజేపీ వాళ్లు నాటి చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. గాంధీజీ హత్యతో అక్కడితో ఆ ఘోర క్రతువు ఆగిపోలేదని నేడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఓటు చోరీతో సాధించిన అధికారంతో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ గుప్పిటపట్టే దుస్సాహసానికి తెరతీసింది. నాడు గాంధీజీ హత్యోదంతం తొలి మెట్టు అయితే తర్వాతి మెట్టు ఇప్పటి రాజ్యాంగబద్ధ వ్యవస్థను కబళించడం’’ అని అన్నారు. ‘‘ ఓటు చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసంచేసేందుకు బీజేపీ, ఈసీ మూకుమ్మడిగా బయల్దేరాయి. ప్రజల గొంతుకను తొక్కిపెడుతున్నాయి’’ అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ పెట్టారు.3 ప్రశ్నలకు సమాధానం చెప్తారా?చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై రాహుల్ మూడు సూటి ప్రశ్నలను సంధించారు.1.‘‘ఎలక్షన్ కమిషన్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?. సీజేఐను తొలగించడానికి వెనుక మతలబు ఏంటి? సీజేఐ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి సీజేఐకు ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియ నుంచి ప్రభుత్వం ఏ కారణంతో పక్కకు తప్పించింది?. ఆనాడు ఎలక్షన్ కమిషన్ల ఎంపిక సంబంధ భేటీకి నేనూ హాజరయ్యా. ఇటు పక్క నేను కూర్చున్నా. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసీనులయ్యారు. అక్కడ నా వాదనలకు వీసమెత్తయిన విలువ లేకుండా పోయింది. వీళ్లిద్దరు ఏం ఆలోచించారో అది మాత్రమే ఆచరణలోకి వచ్చింది. కేవలం ఫలానా వ్యక్తులు మాత్రమే ఎలక్షన్ కమిషనర్లుగా రావాలని ఎందుకు ప్రధాని, హోం మంత్రి అంతగా దృష్టిసారిస్తున్నారు?2.‘‘దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనట్లుగా మోదీ 2023 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషనర్లు ఈసీలో విధుల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పక్షపాతంతో కూడినవి అని తేలినా సరే వాళ్లపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేని దురవస్థ ఏర్పడింది. వాళ్లపై కేసుల ఈగ వాలకుండా మోదీ రక్షణ కల్పించారు. కమిషనర్లకు ఇంతటి రక్షణను ప్రధాని, హోం మంత్రి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?3.‘‘ఎన్నికలు పూర్తయిన కేవలం 45 రోజులకే సంబంధిత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసంచేయాలంటూ మోదీ సర్కార్ చట్టాన్నే మార్చేసింది. అంత అవసరం ఏమొచ్చింది?. ఇది డేటాకు సంబంధించిన అంశమంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. ఇది డేటాకు సంబంధించిన అంశం కాదు. దీనికి ఎన్నికల చోరీతో సంబంధముంది. ఎన్నికలకు నెల రోజుల ముందే మెషీన్ చదవగలిగే ఓటర్ల జాబితాను రాజకీయపక్షాలకు అందివ్వాల్సిందే. సీసీటీవీ ఫుటేజీ తొలగింపు చట్టాన్ని సవరించాల్సిందే. అసలు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? -
పేదరికం ఏంటో నాకు తెలుసు.. అందుకే ఈ తపన: సీఎం రేవంత్
సాక్షి, ఫ్యూచర్‌సిటీ: సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యం అని.. విద్య మీద ఖర్చు చేసేది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేటలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చాం2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు.... ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత. పేదలలో నిరుపేదలకు సహాయం చేయడం మా ప్రాధాన్యత. సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన మా లక్ష్యం. ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు పెట్టుబడి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ, స్కిల్ లేదు. దాన్ని మేం నెలకొల్పుతాం. 140 కోట్ల జనాభాలో ఎంతమంది మెడల్స్ వస్తున్నాయి?. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ నుండి గోల్డ్ మెడల్స్ తెచ్చేలా కృషి చేస్తాంపేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన.... విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నాం. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందిఅందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’’ అని రేవంత్ ప్రసంగించారు. -
చంద్రబాబు బాగోతం లెక్కలతో బయటపెట్టిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దొంగ లెక్కలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని.. ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని అన్నారు.కాగ్ (Comptroller and Auditor General) విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే.. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉందిఅప్పులు గణనీయంగా పెరిగాయిఅభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయిందివినియోగం, పెట్టుబడులు పడిపోయాయిరెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయిఅవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయిఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని జగన్ మండిపడ్డారు. ఆయన అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ, “కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు” అని చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే, ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు?2014–19లో టీడీపీ పాలనలో GSDP వృద్ధి గొప్పదైతే.. ఇప్పుడు రాష్ట్రం జాతీయ GDPలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019–24లో 4.78%గా ఉన్న సంగతేంటి?..టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏమిటి?.. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ నిలదీశారు.టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని.. కానీ కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అబద్ధపు ప్రచారాలు.. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ సమాచారాన్ని ఆయన మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 -
మాట మార్చేసిన ఎమ్మెల్యే
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ మాట మార్చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని మీడియాతో చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలోని భరత్పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు."ఇప్పుడు నా రాజీనామా ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రజలు నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. నేను రాజీనామా చేయాలని వారు కోరుకోవడం లేదు. వారి ఆకాంక్షలను గౌరవిస్తూ, నా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను" అని కబీర్ అన్నారు. డిసెంబర్ 17న కోల్‌కతాలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఇంతకుముందు ప్రకటించారు.ముర్షీదాబాద్‌లో ఈనెల 6న బాబ్రీ మసీదు తరహా మసీదు (Babri-style mosque) నిర్మాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించడంతో టీఎంసీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో డిసెంబర్ 22న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తానని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే ముర్షిదాబాద్‌లోని రెజినగర్‌లో మసీదుకు శనివారం కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య శంకుస్థాపన చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు.. డిసెంబర్ 6ను శంకుస్థాపనకు ఎంచుకున్నారు.బెంగాల్ ‘బాబ్రీ’ మసీదుకు రూ.1.30 కోట్ల విరాళాలుపశ్చిమ బెంగాల్లో మసీదు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.30 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సన్నిహిత నాయకులు తెలిపారు. నాలుగు విరాళాల బాక్సులు, ఒక సంచి నుంచి రూ37.33 లక్షల నగదు, ఆన్లైన్లో రూ.93 లక్షలు వచ్చాయని ప్రకటించారు. మరో ఏడు బాక్సులు ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. సభా వేదిక వద్ద విరాళాలకోసం 11 బాక్సులను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.చదవండి: 'మీరు ఫ్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హుమాయున్ కబీర్ (Humayun Kabir) 2012లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తరువాత కొంతకాలం బీజేపీకి వెళ్లి 2020లో అధికార పార్టీలోకి తిరిగొచ్చారు. టీఎంసీ నాయకత్వంతో నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. -
వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తోంది: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం ఎన్నో గొప్పలు చెబుతుందని.. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తానేమి తప్పుగా.. నిరాధార ఆరోపణలు చేయడం లేదని, స్పష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్నానని అన్నారాయన. మంగళవారం ఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ అనేది ఎన్నికల వ్యవస్థతో పాటు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదని అడిగారు. కేంద్రం విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని ప్రశ్నించారు.ఈసీలను రక్షించడానికి ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని?.. ఇది డేటా సంరక్షణ కాదు డేటా చోరీ అని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని విమర్శించారు. ఎస్ఐఆర్ చర్చలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పేరెత్తడంతో బీజేపీ సభ్యలు తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందిస్తూ రాహుల్ పార్లమెంట్లో అనవసరంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ టాపిక్ తీస్తున్నారన్నారు. ఆ సమయంలో బీజేపీ-విపక్ష ఎంపీల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.దీంతో లోక్ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను సున్నితంగా మందలించారు. -
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి: లోక్‌సభలో మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు.... ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు. మోదీ, నీతీశ్‌కుమార్‌లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు. ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్. అందుకే వైఎస్సార్సీపీ హయాంలో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్- పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్‌లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?.. ..వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన రాజేంద్రనాధ్(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్ విసిరారు.చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.సీఎం హోదాలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను తానే కొట్టేసుకోవటం పెద్ద నేరం. చంద్రబాబు చేసిన దివాళాకోరు తనం, నీతి మాలిన తనం కంటే ఇంకోటి లేదు. చంద్రబాబుకు దమ్ముంటే కేసును న్యాయబద్దంగా ఎందుకు ఎదుర్కోలేక పోయారు. పరకామని కేసులో తన ఆస్తిని రవికుమార్ టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు చేసిన దోపిడీలతో పోల్చితే రవికుమార్ చేసిన నేరం చిన్నదే. ఇండిగో సంక్షోభం టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తప్పిదమే. పైలెట్లకు రెస్టు ఉండాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమలు చేయాలి. విమానయాన సంస్థల పనితీరును సమీక్షించాలి. కానీ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండిగో సంస్థ విమానాలను పెంచుకుంటున్నంతగా సిబ్బందిని పెంచుకోలేదు. ఆ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు సమీక్ష చేయలేదు?. దీని గురించి ప్రజలు, ప్రయాణీకులు ప్రశ్నిస్తే చంద్రబాబు మా పార్టీపై పడి ఏడుస్తున్నారు. తెలుగువారి పరువే కాదు, మొత్తం దేశం పరువునే పోగొట్టారు. తప్పు చేశారు కాబట్టే అర్నాబ్ గోస్వామి చర్చను బాయ్ కాట్ చేశారు అని పేర్ని నాని అన్నారు. -
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్‌కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘బాబూ.. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాగించలేదు’
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకోవడం అవివేకం. పానుగంటి చైతన్య చేసిన నేరం ఏంటి.. విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం తప్పా?. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ ఏడాది చిత్తశుద్ధితో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యం వేధిస్తున్నాయి.కళాశాలకు అనుమతించడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా, పరీక్షలకు దూరం చేస్తున్నారు. కోర్సు కంప్లీట్ అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారు. చంద్రబాబు పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
రఫ్పాడించిన వైఎస్ జగన్
ఎవరన్నారు ర్యాగింగ్, ట్రోలింగ్లు.. కాలేజీలు, సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమని? రాజకీయాల్లోనూ వీర ర్యాగింగ్ చేయవచ్చు. కావాలంటే వైఎస్ జగన్ తాజా ప్రెస్‌మీట్ చూడండి!. కాలేజీలలో ర్యాగింగ్ నిషిద్ధం కానీ రాజకీయాలలో ప్రత్యర్థులను సమర్థంగా ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్‌పై అడ్డంకులేవీ లేవు. రఫ్ఫా రఫ్పా అన్న సినిమా డైలాగును ఫ్లెక్సీల్లో పెడితే ఏపీ పోలీసులు కేసులు పెట్టగలరేమో కానీ.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసే రాజకీయ ప్రత్యర్థులను బిత్తరపోయేలా రఫ్పాడిస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి?.వైఎస్ జగన్ ర్యాగింగ్‌కు తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. దీంతో ఏవేవో అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. మరి కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వాదనతో బిత్తరపోయిన ఎల్లో మీడియా సహజంగానే దాన్ని తక్కువ చేసేందుకు, వక్రీకరించేందుకు అన్ని శక్తులూ ఒడ్డింది. ఇదంతా వారి ఉడుకుమోతు తనానికి నిదర్శనం అనుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న ధోరణితో తప్ప, నిజానిజాలపై దృష్టి పెట్టడం మానేశాయి. జగన్‌పై రాస్తున్న ఏడుపుగొట్టు కథనాలే అందుకు నిదర్శనం.జగన్ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే..మొట్టమొదట అరటి రైతుల సమస్యల గురించి.. అరటి, మిర్చి, తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం పంటల బీమా సదుపాయాలు లేకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వలేదు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు?’’ అని అడుగుతూ అది సూపర్ మోసం అని, చంద్రబాబుపై చీటింగ్ కేసుపెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు అమలుపై నిలదీశారు. అమలు చేసినట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీలలోని డొల్లతనాన్ని, ఏడాది కాలం ఎగవేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. ఆయా స్కీములలో ఎగవేతల ద్వారా కూటమి సర్కార్ ప్రజలకు ఎంతెంత బాకీ పడింది లెక్కలు చెప్పారు. వీటికి కూడా టీడీపీ నుంచి నేరుగా జవాబు రాలేదు. కూటమి తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎలా హుళ్లక్కి చేసింది జగన్ సోదాహరణంగా వివరించారు. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు అడక్కుండా, ప్రైవేటు కంపెనీ కోసం టీడీపీ ఎంపీలు గనులు మంజూరు చేయడం గురించి అడగడంపై ఆయన మండిపడ్డారు. వీటన్నిటిపై తన ప్రశ్నల పరంపరతో చంద్రబాబును రాజకీయంగా జగన్ మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన ర్యాగింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం.చంద్రబాబు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద చల్లుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో మాట్లాడుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీలకి ముచ్చెమటలు పట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్‌లను సిట్ ముందుగా ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే పెద్ద అనుమానం. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైమ్‌లో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురమనలేకపోయాయి. అప్పట్లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం కాపీని కూడా జగన్ ప్రదర్శించడం విశేషం. ఆ రోజుల్లో ఒక అధికారిక బృందం వెళ్లి బోలేబాబా కంపెనీలను తనిఖీ చేసి వచ్చీ మరీ ధ్రువీకరించాయన్న సంగతి బయటపడింది. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి.చంద్రబాబు కూడా హెరిటేజ్ పేరుతో డెయిరీ సంస్థను నడుపుతున్నారు. ఆయనకు బోలే బాబా కంపెనీ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సరైన కంపెనీ కాకపోతే అప్పుడే తప్పించి ఉండాలి కదా! అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెయ్యి ట్యాంకులను తిప్పి పంపడం, మళ్లీ తర్వాత వాటిలో కొన్నిటిని అనుమతించడం వంటి విషయాలను కూడా జగన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలకు ,ఎల్లో మీడియాకు దిమ్మదిరిగినంత పనైంది. వీటిపై వీరెవ్వరూ నోరు విప్పితే ఒట్టు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి తిరస్కరణకు గురైన నెయ్యిని వాడారని, అయినా చైర్మన్, అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైమ్‌లోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసులో నిందితుడి ఆస్తి మొత్తం స్వామి వారికి రాసిస్తే అది తప్పన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం ఏమిటో తెలియదు.చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా! అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది?. అలాంటప్పుడు! అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు. అంతేకాదు. తిరుమల, ఇతర ఆలయాలలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. అంతే తప్ప ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లరు. కానీ, ఈ కేసులో లోక్ అదాలత్ నిర్ణయం మేరకు ఆస్తి మొత్తం రాయించుకుంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చోరీ చేశారో అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్న సిట్ ఆ విషయం విచారించి ఉంటుంది కదా! ఇంకేమైనా ఆస్తులు ఎవరికైనా రాసిచ్చారా అన్నది పట్టుకునేవారు కదా! ఈ కేసును ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి పులమాలని విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు ఆయనను కూడా విచారించవలసి ఉంటుంది కదా!అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేశ్ తదితర మంత్రులను కూడా పిలిచి మాట్లాడి ఉండాలి కదా! ఇవేవీ ఎందుకు చేయలేదు! ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల రూపాయల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియా పరకామణిలో డెబ్బేవేల రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా భావిస్తున్నట్లుగా ఉంది. దీనిని జగన్ చిన్న కేసు అన్నారని రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేకా హత్యకేసుకు ముడిపెట్టడం ఇదో వింతగా ఉంది.పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన ఆస్తులను రాసిస్తే, వందల కోట్ల స్కామ్ కేసులను ఎదుర్కుంటున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? ఎవరు ధర్మంగా ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా?. ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాలలో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్పాడించారని అనాల్సి వస్తోంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పుదుచ్చేరిలో విజయ్ సభ.. తుపాకీ కలకలం
చెన్నై: తమిళనాడులో కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విజయ్ సభ నేపథ్యంలో సభా వేదిక వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు వ్యక్తిని టీవీకే పార్టీ నేతగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) నేడు విజయ్ బహిరంగ సభ జరుగుతుంది. కరూర్ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తుపాకీతో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా అధికారులు గుర్తించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.Everyone stay safe and go home, please 🙏 #தமிழகவெற்றிக்கழகம் #TVKVijay #உங்கவிஜய்_நா_வரேன் #TVKVijay #ThalapathyVijaypic.twitter.com/eqckGwYgVt— Ꮋꭼꭺꭱꭲ Ꮋꭺꮯꮶꭼꭱ 💫 (@hearthacker031) December 9, 2025మరోవైపు.. పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. విజయ్ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది. -
ఎస్ఐఆర్పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్‌ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్‌సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్‌సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్‌సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
కేంద్రమంత్రి రామ్మోహన్‌కు టీడీపీ ఎంపీల భజన
సాక్షి, న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సమయంలో.. ఆయనను జాకీలు పెట్టి లేపేందుకు టీడీపీ ఎంపీలు నడుంబిగించారు. ఇందుకోసం రెండు రోజుల క్రితం ‘ఎక్స్’లో అనుకూలమైన ట్వీట్లు చేయగా.. సోమవారం రాత్రి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, బీకే పార్ధసారధి, నాగరాజు, ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సాన సతీష్, బీద మస్తాన్‌రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కేవలం ఎల్లో మీడియాను పిలిపించుకుని ఆయనకు నచ్చిన వార్తలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మీడియా సమావేశం బాధ్యతను ఎంపీలకు అప్పజెప్పారు. ఈసందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. చాలా మంది చాలా రకాలుగా రామ్మోహన్ నాయుడుపై బురద జల్లుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారికి సరైన అవగాహన ఉండదని, వాళ్లు ముందూ వెనకా తెలియకుండా మాట్లాడతారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు, సోషల్ మీడియా వాళ్లు పూర్తి వివరాలు తెలుసుకోకుండా బురద జల్లుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా సమాధానం చెప్పాల్సింది రామ్మోహన్ కదా? మీరెందుకు చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘పార్టీ పరంగా మేం చెప్పాల్సింది మేం చెబుతున్నాం, కేంద్ర మంత్రిగా ఆయన సమాధానం చెప్పాల్సిన చోట అంటే రాజ్యసభలో అందరికీ సమాధానం చెప్పారు. మేం మా వెర్షన్ మేం చెప్పాలి కాబట్టి మేం చెబుతున్నాం’’ అని లావు చెప్పుకొచ్చారు. -
సీఎం కుర్చీపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నుంచి కౌర్ సస్పెండ్
చండీగఢ్: పంజాబ్‌లో రూ.500 కోట్లు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపిన రాష్ట కాంగ్రెస్ నేత నవ్ జోత్ కౌర్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ సోమవారం ప్రకటించారు. అయితే, ఆలోపే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ తరన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు రూ.10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్‌కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ అనంతరం కౌర్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ వారియర్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు కోర్టు పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నైతికత, బాధ్యత వంటివి ఏ కోశానా లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.ఈ సందర్బంగా కౌర్.. ‘‘నా భర్త (పీసీసీ మాజీ చీఫ్, రాష్ట్ర మాజీ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ) ఏ ఇతర పార్టీ నుంచైనా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు, అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేనన్నా’’ అని ఆమె ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ పై కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. -
విజయ్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్ కోడ్ గుర్తింపుతో..
సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణకు.. పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో -
ఖాళీ కుర్చీతో.. టీడీపీని ఏకిపారేసిన అర్నబ్ గోస్వామి
సాక్షి, ఢిల్లీ: తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ ఎంపీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిపై ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిగా కాకుండా.. మరెవరిని ప్రశ్నించాలంటూ నిలదీశారాయన. ఇండిగో సంక్షోభ వ్యవహారంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్నాయుడి వైఫల్యాన్ని ఇంతకు ముందు అర్నబ్ ప్రశ్నించారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి అసలు లోకేష్ ఎవరంటూ నిలదీశారు. అయితే ఈ వైఫల్యాన్ని.. లోకేష్‌ను ఎత్తి చూపడాన్ని టీడీపీ తట్టుకోలేకపోయింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరుతో టీడీపీ నేతలు.. రిపబ్లికన్ టీవీని బ్యాన్ దిశగా అడుగులు వేసింది. దీంతో అర్నబ్ అనూహ్య చర్యకు దిగారు. స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి మరీ.. కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ టీడీపీ అండ్ కోను కడిగిపారేశారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు కరెక్ట్ అని ఏకిపారేశారు. -
వందేమాతరం స్ఫూర్తిని కాలరాసేలా ఏపీలో పాలన: ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని.. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. సోమవారం లోక్‌సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా(Vande Mataram debate) ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని.. ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు ఏపీలో రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా పాలన జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కీలకమైన వైద్య రంగాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి . ..ప్రజలను గాలికి వదిలేశారు. ఏపీలో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం ప్రభుత్వాన్నించకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు యదేచ్చగా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇది వందేమాతరం స్ఫూర్తిని కాలరాయడమే అని గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. -
మాకేం సంబంధం లేదు.. అంతా కేంద్రమే: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఇండిగో సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా ఎంత ట్రోలింగ్‌కు దారి తీసిందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోకేష్ ఎవరంటూ ఎవరు? అంటూ జాతీయ మీడియా చానెల్స్ ఏకిపారేశాయి. అదే టైంలో.. టీడీపీ నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడిని సైతం రాజీనామా చేయాలంటూ బలమైన డిమాండే వినిపిస్తోంది. ఈ దరిమిలా ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు చంద్రబాబు. మంచి జరిగితే క్రెడిట్‌ను నిసిగ్గుగా తన ఖాతాలో వేసుకునే నారా చంద్రబాబు నాయుడు.. ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ఈ సంక్షోభాన్ని కేంద్రమే పరిష్కరించాలంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు. టైం ఇచ్చినా చేయలేకపోయారు. ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ విషయంపై మేమేం మానిటరింగ్ చేయడం లేదు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది. వాళ్లే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. ఏపీలో ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. కానీ, సంక్షోభ బాధ్యతలను మాత్రం భాగస్వామిగా స్వీకరించడం లేదు. పైగా ఇండిగో సమస్యతో దేశం పరువు తీసిన రామ్మోహన్‌నాయుడుతో బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిన పని కూడా చేయలేదు. ఇవేవీ చేయకపోగా.. ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ‘‘అబ్బే.. ఇండిగో సమస్యతో మాకేం సంబంధం లేదని.. అంతా కేంద్రందే’’నంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. -
18 నెలల్లో ఏపీలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి లేదు: బొత్స
సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు... గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు. -
‘రీల్స్ రామ్మోహన్ చేతకానితనం వల్లే ఈ తిప్పలు’
సాక్షి, శ్రీకాకుళం: ఇండిగో సంక్షోభ నేపథ్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఏపీలోనూ వైఎస్సార్సీపీ రామ్మోహన్ చేతకాని తనం గురించి నిలదీస్తున్నాయి. అటు కేంద్ర మంత్రిగానే కాదు.. ఇటు తన నియోజకవర్గంలోనూ ప్రజలకు మేలు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. విమానాలు రద్దు అవడంతో ప్రజలు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్లైన్లు కుప్పకూలాయి. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలి.. రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమస్య వచ్చినప్పుడు మీడియాకు మొఖం చాటు వేస్తె ఎలా? మీ సమాధానం కోసం దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటినా మాట్లాడండి’’ అని తమ్మినేని డిమాండ్ చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవి కుమార్ రామ్మోహన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందింది. కారెక్కినప్పుడు దిగినప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాడు. అహ్మదాబాద్‌లో ఫ్లయిట్ కూలి 240 మంది చనిపోతే.. అక్కడికి వెళ్లి రీల్ చేస్తారు. అందుకే రామ్మోహన్ నాయుడు రీల్స్ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు. రీల్స్ పై పెట్టిన శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చేతకానితనం కారణంగా దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారింది. కింజరాపు కుటుంబానికి రాజయోగం కల్పించిన శ్రీకాకుళం ప్రజలకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకోచ్చారా?. ఒక్క కేంద్ర సంస్థను అయినా జిల్లాకు తీసుకొచ్చారా? మిమ్మల్ని ఎందుకు గెలిపించారా? అని జిల్లా ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు’’ అని రవికుమార్ అన్నారు. -
బందరులో వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు
సాక్షి, కృష్ణా: బందరులో విగ్రహ రాజకీయం హాట్ టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. వాజ్ పేయ్ విగ్రహం పెట్టొద్దంటూ తెలుగు దేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. శంకుస్థాపనకు ప్రయత్నించిన బీజేపీ నేతలను అడ్డుకుని నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసింది. అయితే ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ శ్రేణులను నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. -
రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజం.. పవన్ వ్యాఖ్యలపై మౌనం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వేర్వేరు వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ.. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం మౌనం పాటించి తన రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శించింది. రేవంత్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌లో ఉన్న స్వేచ్చ గురించి మాట్లాడుతూ హిందూమతంలో ఉన్న దేవుళ్ల గురించి ప్రస్తావించారు.దీనిని మతపరమైన సమస్యగా బీజేపీ చిత్రీకరించే యత్నం చేసింది.మరో వైపు పవన్ కళ్యాణ్ కోనసీమలో జరిగిన ఒక సభలో తెలంగాణవారి దిష్టి తగిలిందని వివాదాస్పద కామెంట్ చేశారు.ఈ అంశంపై బీఆర్ఎస్ తొలుత స్పందించగా, కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాక మంత్రులు రియాక్ట్ అయి ఉండవచ్చు. బీజేపీ అయితే అసలు నోరే విప్పలేదు.రేవంత్ వ్యాఖ్యలను చూద్దాం.'హిందువులలో ఎంతమంది దేవతలు ఉన్నారు!మూడు కోట్ల మంది ఉన్నారా!మరి అందరు దేవుళ్లు ఎందుకు ఉన్నారు?పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడున్నారు.రెండు పెండిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకో దేవుడున్నాడు.మందు తాగేటోళ్లకు మరో దేవుడున్నాడు.ఎల్లమ్మ,పోచమ్మ దేవతలు ఉన్నారు. కల్లు పోయాలి, కోడి కోయాలి అనేటోళ్లకు దేవుడున్నాడు.పప్పన్నం తినేటోడికి కూడా దేవుడున్నాడు.అన్ని రకాల దేవుళ్లు ఉన్నారు.కాంగ్రెస్ లో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుడిపైనేఏకాభిప్రాయం లేదు.ఒకాయన వెంకటేశ్వరస్వామిని మొక్కుతాడు. మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతాడు.నేను అయ్యప్పమాల వేస్తానని ఒకరు అంటే మరోకాయన శివమాల వేస్తానంటాడు.దేవుళ్ల మీదనే ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను" అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ గట్టిగా స్పందించడమేకాకుండా నిరసనలకు కూడా పిలుపు ఇచ్చింది. హిందువులను తిండిబోతులుగా, తాగుబోతులుగా చిత్రీకరించే యత్నం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బదులు బీజేపీని పెంచడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారేమో అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ బరి తెగించి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దీనిపై స్పందిస్తూ రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారని, హనుమంతుడుపెళ్లి చేసుకోలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ నేతలు ఇలాంటి టైమ్ కోసం ఎదురు చూస్తున్నట్లు మాట్లాడారు. పనిలో పని జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ మాత్రానికే బీజేపీ తెలంగాణలో పెరిగిపోతుందని చెప్పలేం.కాని ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి ఇలాంటి సందర్భాలను రాజకీయ పార్టీలు వాడుకుంటాయి.నిజంగానే బీజేపీకి మత రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతే, హిందూమతాన్ని అంతగా ఉద్దరించే నేతలు అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదానికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణ చేశారు.తద్వారా స్వామివారి ప్రసాదానికి తీవ్ర అపచారం చేశారని కోట్లాది మంది హిందువులు బాధపడ్డారు.అయినా ఇంతవరకు బీజేపీ నేతలు ఏ రాష్ట్రంలోకాని, కేంద్రంలో కాని ఎవరూ నోరు విప్పి అదేమిటి?అలా తప్పుడు ఆరోపణలు చేయవచ్చా అని ప్రశ్నించలేదు. పైగా తెలంగాణ బీజేపీ నేత మాధవి నిజంగానే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నట్లుగా ఏపీకి వెళ్లి హడావుడి చేశారు. విశాఖలో ఒక బీజేపీ నేత గోడౌన్ లో 1.80 లక్షల కిలోల ఆవు మాంసం పట్టుబడితే మాత్రం ఏదో మొక్కుబడి ప్రకటన చేసి ఊరుకున్నారు తప్ప,గట్టిగా నిరసన చెప్పలేకపోయారు. తెలంగాణలో రేవంత్ చేసిన వ్యాఖ్య సరైనదా?కాదా?అన్నది వేరే చర్చ.కాని బీజేపీ ఎలా అవకాశవాదంతో పనిచేస్తున్నదన్నదానికి ఇది ఉదాహరణ.రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని,దేశవ్యాప్తంగా రాజకీయంగా వినియోగించే విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. కేంద్ర పార్టీ నేతలు జాతీయ మీడియాకు కూడా దీనిపై ఉప్పందించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టారట.దానికి అనుగుణంగా బీజేపీ నిరసనలు కూడా నిర్వహించి ఉద్రిక్తతలు సృష్టించే యత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలకు, మూడుకోట్ల మంది హిందూ దేవుళ్లు ఉండడానికి పోల్చడం ఏమిటో అర్ధం కాదు. ఎవరి నమ్మకం ప్రకారం వారు పూజలు చేసుకుంటారు. గుడులకు వెళతారు.చాలామంది హిందువులు ఏ దేవుడినైనా భక్తితోనే ప్రార్ధిస్తారు. ఏ దేవుడు పెళ్లి చేసుకున్నాడు! ఎవరు చేసుకోలేదు! వంటి అంశాలను ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంది.మతపరమైన అంశాల విషయాలు సున్నితంగా ఉంటాయి. ఆ సంగతి రేవంత్ కు తెలియనిది కాదు.బీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు తెలంగాణలో ఎజెండాను మార్చి బీఆర్ఎస్ ను దెబ్బతీస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని ఏమైనా అనుకున్నారా?లేక అనాలోచితంగానే మాట్లాడారా అన్నది అప్పుడే చెప్పలేం.తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఆయన బదులు ఇచ్చినప్పటికీ, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది కదా!ఉత్తరాదిన కూడా తనను బీజేపీ పాపులర్ చేస్తోందని రేవంత్ అన్నారు కాని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బదనాం చేయడానికి బీజేపీ వాడుకుంటుందన్న సంగతి విస్మరించరాదు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు పెంచేవే అని చెప్పాలి. రాజోలు నియోజకవర్గంలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని అంటూ ,అది కూడా రాష్ట్ర విభజనకు కారణం అయిందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వారి దిష్టి కోనసీమకు తగిలిందన్నట్లుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వి మతిలేని వ్యాఖ్యలని అన్నారు.హైదరాబాద్ లో నివసిస్తూ పవన్ ఇలా మాట్లాడతారా? హైదరాబాద్ కే దిష్టి పెట్టినట్లు మాట్లాడారని విమర్శించారు. ఎందువల్లోకాని కాంగ్రెస్ నేతలు తొలుత దీనిపై ఏమీ మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ పవన్ వైఖరిని తప్పు పట్టారు.పవన్ తెలంగాణలోని ఆస్తులన్నిటిని అమ్ముకుని విజయవాడ వెళ్లవచ్చని సలహా ఇచ్చారు.ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన సినిమాలు తెలంగాణలో ఆడబోవని హెచ్చరించారు.ఆ శాఖ మంత్రిగా స్పందిస్తున్నానని అన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారని, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు దీనిపై స్పందించాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.చంద్రబాబు,బీజేపీ లు దీనిపై నోరు మెదపలేదు.సిపిఐ నేత నారాయణ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ ను తొలగించాలని సూచించారు.అది కూడా జరగని పనే.బీజేపీకి, చంద్రబాబుకు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. పైగా పవనే అప్రతిష్ట పాలు అవుతారు. అది వారికి ప్రయోజనమే కదా!అందుకే బీజేపీ మీడియాకు చెందినఒక పత్రిక పవన్ పై తెలంగాణ నేతల విమర్శలకు కాస్త బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. పవన్ వి తలతిక్క మాటలు అని ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.ఇందులో కొంత వాస్తవం ఉందన్న అభిప్రాయం కలుగుతుంది.రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవారు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అంత తెలివైన పని కాదు. కోనసీమకు పవన్ కళ్యాణ్ దిష్టే తగిలి కొబ్బరి చెట్లు మాడిపోయాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీల చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ వీరి విమర్శలను పట్టించుకున్నట్లు లేరు.కాకపోతే జనసేన పేరుతో ఒక ప్రకటన చేస్తూ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. పవన్ వ్యాఖ్యల వీడియోలు లేకపోతే జనసేన అలాంటి ప్రకటన చేసినా నమ్మేవారేమో!ఆ పరిస్థితి లేదు. పవన్ గతంలో తెలంగాణలో వారికి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం, ఏపీకి వెళ్లి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కొత్త విషయం ఏమీ కాదు.అయితే తాజా వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని చెప్పకతప్పదు.లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్ లో, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తుంటారు. వారికి అసౌకర్యం కలిగేలా పవన్ వంటివారు మాట్లాడడం సరైనది కాదు. ఆయన ఇంకా సినిమాలలో నటిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సినిమావారికి కూడా నష్టం కలగవచ్చు. పవన్ క్షమాపణ చెప్పకపోతే కోమటిరెడ్డి హెచ్చరించినట్లు ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేయగలుగుతారా? అది సాధ్యమేనా?కాకపోతే తెలంగాణలో సెంటిమెంట్ పరంగా అవసరమైనప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా వాడుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దీనిపై మాట్లాడలేదు. ఆయన చంద్రబాబు సూచనల మేరకే వ్యవహరిస్తారని చాలామంది నమ్ముతారు.రేవంత్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా మతం,ప్రాంతం వంటి అంశాలలో వివాదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జల్సాలు, విందులకు కేరాఫ్‌గా ప్రజాభవన్: హరీష్‌రావు
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.అలాగే, ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్‌కు రేవంత్ వచ్చారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్‌లకు ప్రజాభవన్‌ను వాడుతున్నారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన.. రెండేళ్ల పాలనలో రేవంత్ చేసింది ఒక్కటైనా చెప్పగలడా?. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలి. ఫైనాన్స్‌లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలి’ అని కామెంట్స్ చేశారు. -
ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై దాడి!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని పాలేరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయలు దాడి చేశారు. దీంతో, గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఇది మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం గమనార్హం.వివరాల ప్రకారం.. పాలేరులోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్ధిని బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయుల దాడి చేశారు. అయితే, బీఆర్ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నిక కావడంతో గులాబీ శ్రేణులు దాడికి దిగినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యంపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బెళగావిలో భీకరమే
బెళగావి శివార్లలోని సువర్ణసౌధ అసెంబ్లీ భవనంలో నేటి (సోమవారం) నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే సమావేశాలకు భారీ పోలీసు బందోబస్తుతో పాటు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కుర్చీ మార్పిడి గొడవ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లకు ఆయుధం చిక్కినట్లయింది.శివాజీనగర: బెళగావిలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. అతివృష్టి, రైతులకు నష్టాలు, చెరకు రైతుల ఆందోళనలు చర్చకు రాబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి దుమ్మెత్తిపోయాలని ప్రతిపక్షాలు ఆతృతగా ఉన్నాయి. మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, ఎండుమిరప ధరలు తగ్గిపోవడం, అన్నదాతలకు పరిహారంలో లోపాలు, గ్యారంటీ నిధులలో జాప్యం, ఉత్తర కర్ణాటక వెనుకబాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు రాకపోవడం, బెంగళూరుతో సహా రాష్ట్రంలో వరుసగా ఏటీఎంలు, బ్యాంకుల్లో దోపిడీ పర్వాలు సైతం సిద్దరామయ్య ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారే అవకాశముంది. ఢీ అంటే ఢీ సువర్ణసౌధలో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సమాయత్తమైంది. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. దీంతో ఢీ అంటే ఢీ అనేలా అసెంబ్లీ జరగనుందని అంచనాలున్నాయి. ముఖ్యమంత్రి మార్పిడి రాజకీయం కోలాహలం రేకెత్తించవచ్చు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయేంద్ర తదితరులు బెళగావికి చేరుకున్నారు. వివిధ హోటళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు బస ఏర్పాటైంది. హోరెత్తనున్న ఆందోళనలు ప్రజా, రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సువర్ణగార్డన్, అలారవాడ వద్ద ధర్నాలకు స్థలం కేటాయించారు. బీజేపీ, జేడీఎస్ నేతలు చెరకు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని 9న సువర్ణసౌధ ముట్టడి నిర్వహిస్తారు. ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, రైతులు, ప్రజలు ఇలా అనేక వర్గాలవారు సౌధ ముందు ఆందోళనలకు సిద్ధమయ్యారు.ప్రత్యేక రాష్ట్ర వాదనలురాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తే అవకాశముంది. యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి, ధార్వాడ, గదగ్, హావేరి, దావణగెరె జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, కాబట్టి ప్రత్యేక రాష్ట్రం చేయడం అవసరమని హస్తం ఎమ్మెల్యే రాజు కాగె ఇటీవల డిమాండ్ చేశారు. పాలకులు ఈ ప్రాంతాలపై సవతి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. జనాభా పెరిగేకొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో కర్ణాటకను రెండు, ఉత్తరప్రదేశ్‌ను 5, మహారాష్ట్రను 3 రాష్ట్రాలుగా విభజించక తప్పదని, బెళగావి అసెంబ్లీపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ చెప్పారు.గతంలో లేనంత భద్రత అసెంబ్లీతో పాటు పరిసరాలలో మునుపెన్నడూ ఏర్పాటు చేయని పోలీస్ భద్రతను ఈసారి చేపట్టారు. బెళగావి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. స్థానిక మరాఠా సంఘాలపై ఓ కన్నేశారు. 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 మంది ఐపీఎస్‌లు మకాం వేశారు. -
టీడీపీలో 'అఖండ' చిచ్చు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ టీడీపీలో ‘అఖండ’ చిచ్చు రేగింది. పబ్లిసిటీ కోసం బాలకృష్ణ అభిమానులు చేసిన ఆరాటం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. అనంతపురం, మడకశిర ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ఈ వివాదం ఒకరిపై ఒకరు బాలకృష్ణకు, పార్టీకి ఫిర్యాదులు చేసేంత వరకూ వెళ్లింది. ఈ తతంగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అఖండ–2 సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీలు నగరం మొత్తం భారీగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు జగన్ ‘అనంత’ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు గత నెల 29న సూచించారు. అయితే తాను శబరిమలకు వెళుతున్నానని చెప్పి ప్రసాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో ఫ్లెక్సీలు వేశారు. అలాగే శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, హౌసింగ్‌బోర్డులో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుడు రాయల్ మురళి ఎమ్మెల్యే రాజు తరఫున ఫ్లెక్సీలను పినాకిని యాడ్స్ ఏజెన్సీ ద్వారా వేయించారు. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాలకృష్ణ దృష్టిలో మైనస్ మార్కులు పడతాయని, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అంశంలో తీవ్ర నష్టం జరిగిందనే భావనతో రాజు ఫ్లెక్సీలు తొలగించి తనవి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. వెంటనే దగ్గుపాటి అనుచరుడు గంగారాం పినాకినీ యాడ్స్ యజమాని మురళీకి ఫోన్ చేసి.. రాజు లాలిపాప్స్ తొలగించి దగ్గుపాటివి ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో మురళి టీడీపీ నేత రాయల్ మురళీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ అంశాన్ని రాయల్ మురళి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. తన ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకునేది లేదని రాజు తీవ్రంగా హెచ్చరించారు. దగ్గుపాటి ప్రసాద్‌పై ఎంఎస్ రాజు నేరుగా బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘అనంత’ పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు సునీల్.. రాజుతో, దగ్గుపాటితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలోనే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ జిల్లా ఇన్చార్జ్ అయిన గుంటూరు మేయర్ నాని (కోవెలమూడి రవీంద్ర)కి ఫిర్యాదు చేశారు. దీంతో రాయల్ మురళి కూడా నానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎమ్మెల్యేల వాదులాట అంశం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి ఇద్దరి మధ్య వివాదం ఫ్లెక్సీలది కాదని, ‘అనంత’ మార్కెట్ యార్డు అంశంలో తలెత్తిన విభేదాలు ఇద్దరి మధ్య రాజకీయాలను కాదని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే స్థాయికి వెళ్లాయని, అది మనసులో పెట్టుకుని ప్రతిసారీ ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ.. అనంతపురం నగరంలోని పవిత్రమార్ట్, సప్తగిరి సర్కిల్ వద్ద రెండు ఫ్లెక్సీలను ‘అనంత’ ఎమ్మెల్యే అనుచరులు శనివారం చించేశారు. ఈ దృశ్యాలను రాయల్ మురళి టీడీపీ నేతలకు వాట్సాప్‌లో పంపి.. గంగారాం చించేయించాడని చెప్పాడు. దీంతో ఎంఎస్ రాజు ఆదివారం నేరుగా గంగారాం ఇంటికి వెళ్లి అతన్ని తన కారులో కూర్చోబెట్టుకుని వాదులాడుకున్నారు. ఇద్దరి మధ్య గట్టి వాదన జరుగుతున్న సమయంలో దగ్గుపాటి ప్రసాద్.. రాయల్ మురళీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయారు. రాయల్ మురళి కూడా దగ్గుపాటిపై అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ‘ఏం చేస్తావ్! నువ్వేం పీకలేవ్!’ అని గట్టిగానే మాట్లాడాడు. ఈ క్రమంలో రాయల్ మురళి ఫోన్‌ను ఎంఎస్ రాజు తీసుకుని దగ్గుపాటితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదించుకున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
నాడు కొలువుల జాతర.. నేడు నిలువునా కోత
చంద్రబాబు సర్కారు కొలువుదీరింది... కొలువులకు నిలువునా కోత పడింది. ‘ఉపాధి’ మాటే మరుగునపడింది.. పారిశ్రామికీకరణ పట్టాలు తప్పి... జిల్లా ప్రగతి దిశ మార్చుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టగా... చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది. ఉపాధి, ఉద్యోగాలు కరువై జిల్లా తిరోగమనంలో పయనిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: కరువు సీమ కడప గడపలో విద్యార్థులు, నిరుద్యోగులు విద్య, ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకూడదన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి నాంది పలికింది. జిల్లాలో పరిశ్రమలతో పాటు.. ఉన్నత విద్యాసంస్థలు నిర్మించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో భారీపరిశ్రమలు కొలువుదీరాయి. ఇందులో ఒక్క డిక్సన్ కంపెనీలోనే దాదాపు 1300 మంది ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగా, బద్వేలు సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్సంస్థలో దాదాపు 2,078 మంది స్థానికులైన నిరుద్యోగులు అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు, పులివెందుల మెడికల్ కళాశాల, రిమ్స్, మానసిక వైద్యశాల, క్యాన్సర్ హాస్పిటల్స్‌లో నియామకాల ప్రక్రియ చేపట్టింది. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుతో వైద్యుల నియామకం, సహాయ సిబ్బంది ఏర్పాటుతో సేవలు దగ్గరయ్యా యి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తూ వచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఒకగూటి కిందికి తీసుకువచ్చి వారందరినీ ఆప్కాస్ కింద చేర్చి ఉద్యోగభద్రత కల్పించిన విషయం తెలిసిందే.గ్రామసచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగ విప్లవం.. గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది. వీటి నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక చరిత్ర. ఇక జిల్లాలో 645 సచివాలయాల పరిధిలో 5,400 మంది సచివాలయ కార్యదర్శులుగా కొలువులు సాధించారు. వీటికి అనుబంధంగా సేవలందించేందుకు ప్రతి 50 ఇళ్లకు గ్రామవలంటీర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కార్‌లో తిరోగమనం...జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తే టీడీపీ సర్కార్ తిరోగమనంలో పడేసింది. పులివెందుల మెడికల్ కళాశాల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024–25 విద్యాసంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను తిరస్కరించి, ఈ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశారు. అప్పట్లో అంగీకరించింటే 2025–26 ఏడాదికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించేవి. తద్వారా పేద ప్రజలు, పేద విద్యార్థుల భవిష్యత్ యోగ్యకరంగా ఉండేది. మెడికల్ కళాశాల అటుంచితే, అందులో ఉన్న ఆధునాతన పరికరాలు సైతం తరలించుకువెళ్లడం మరో విశేషం. కడప అంటే కడుపు మంట చంద్రబాబు సర్కార్‌కు ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి ఏడాదిన్నర్రగా శూన్యం. మరో వైపు డీఎస్సీ పేరుతో సరికొత్త ప్రచార ఆర్భాటానికి తెరలేపారు. డీఎస్సీ అభ్యర్థులందర్నీ విజయవాడకు పిలిపించి ‘షో’చేశారు. మెరిట్ ప్రాతిపదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్‌లో 1.25 లక్షల మందికి ఉద్యోగాలు ఏకకాలంలో లభించాయి. నియామకపత్రాలు అందుకొని ఎక్కడివారు అక్కడే బాధ్యతల్లో చేరిపోయారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆచరణలో నిమగ్నం కాగా, నేడు చంద్రబాబు సర్కార్ ఫించన్లు పంపిణీ నుంచి ప్రచార యావే ధ్యేయంగా వ్యవహరిస్తోండడం గమనార్హం. నిరుద్యోగ యువతకు అండగా వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలోని వైవీయూ, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అనేక పోస్టులను భర్తీ చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. – నన్నయ్య,ప్రకాశ్‌నగర్, కడప నిరుద్యోగులను పట్టించుకోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి మాటే లేకపోగా, అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తున్నామని చెబుతున్నారేగానీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనుచూపు మేరలో కానరావడం లేదు. మొత్తం మీద చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తప్పేలా లేవు. – షేక్ మన్సూర్, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలం -
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఆమదాలవలస: మీడియా సమావేశాల్లో తనపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ పోలీసులను కోరారు. ఆయన ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమదాలవలస పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూన రవి దయాదాక్షిణ్యాల మీద తనకు డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయని చెబుతున్నారని, తనను ఉద్దేశించి ‘నా చెప్పుతో సమానం’ అని వ్యాఖ్యానించారని, వైఎస్సార్సీపీ క్యాడర్ బట్ట కట్టేవారు కాదు, తిండి తినేవారు కాదంటూ ఆగస్టు 18న మీడియా ముఖంగా అనుచితంగా మాట్లాడారని చింతాడ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్ఐకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలకు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. -
కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చేసింది శూన్యం
నిజామాబాద్ రూరల్: కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసింది శూన్యమని, రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయన కు లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి పట్టని కిషన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని మహాధర్నా చేస్తున్నారని మండిపడ్డారు.అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో శెభాష్ అనిపించుకుంటోందని, ఇది చూసి ఓర్వలేక బీజేపీ నేతలు మహాధర్నా పేరిట కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదన్న విషయంపై కిషన్‌రెడ్డి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌ను గర్వంగా జరుపుకుంటామని స్పష్టం చేశారు. -
ఏం సాధించిందని కాంగ్రెస్ సర్కార్ విజయోత్సవాలు
నల్లగొండ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ఏం సాధించిందని ప్రజా పాలన విజయోత్సవాలను జరుపుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్ల గొండలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అదే చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పాటు అవినీతిలో కూడా గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని ఎద్దేవా చేశారు.ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలలో ఏమేమి అమలు చేశారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు భూముల అమ్మకాల్లో గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ సర్కార్ ముందు నిలిచిందన్నారు. భూముల ఆక్రమణలో మంత్రుల నుంచి కింది స్థాయి కాంగ్రెస్ నాయకుల వరకు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మిట్ లక్ష్యం నెరవేరాలి
సాక్షి హైదరాబాద్: పార్ల మెంటు సమావే శాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025కు హాజరు కా లేకపోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే సదస్సు విజయవంతం కావాలని కోరుతూ వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఖర్గే ఆదివారం లేఖ రాశారు.సమ్మి ట్ విజయవంతం కావాలని లేఖలో ఆకాంక్షించారు. ఈ సద స్సు ద్వారా తెలంగాణ పెట్టుబడిదారుల గమ్యంగా.. ఇన్నోవేషన్ హబ్‌గా అవతరించాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో జరిగే చర్చలు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని.. తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశాభివృద్ధి ప్రయాణంలో సమ్మిట్ ఫలవంతమైన తోడ్పా టు అందించాలని సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఖర్గే ఆకాంక్షించారు. -
‘రూ. 11 లక్షల కోట్లు ఇస్తే.. రూ. 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయ్యింది’
హైదరాబాద్: ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌కు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యువతకు ఉద్యోగి ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌కు శ్రీకారం చుట్టారన్నారు.‘బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గాడిన పెట్టారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంట్ గా వున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు వస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయిందిప్రతి నెల 8వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కడుతున్నాం. కుటుంబ పాలనలో తెలంగాణను దోచుకుంటుంటే కిషన్‌రెడ్డి ఎందుకు రాష్ట్రాన్ని కాపాడలేదు. రాష్ట్రం అప్పుల దిశగా వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్‌రెడ్డి దొంగ లెక్కలతో రూ. 13 లక్షల కోట్లు తెచ్చామని అంటున్నారు. రూ. 13లక్షల కోట్లు ఏ శాఖకు తెచ్చారో కిషన్ రెడ్డి లెక్కలు చెప్పాలి. చౌరస్తాలో మైక్ తీసుకుని దొంగ లెక్కలు చెప్పడం కాదు 13 లక్షలు ఎప్పుడు తెచ్చారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రి ఏపీకి తరలించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 18వ లోక్ సభలో చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి మీ నాయకులు ఏపీకి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఇచ్చారా...?, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా...? ఏ రాష్ట్రంలో అయినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బీజేపీ ఇచ్చిందా కిషన్ రెడ్డి చెప్పాలి’ అని సవాల్ విసిరారు.ఇదీ చదవండి: ‘ఏ హామిని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’ -
‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’
నల్లగొండ: ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈరోజు (ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) నల్లగొండ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఏ మాత్రం తేడా లేదు. దేవుడిపై ప్రమాణం చేసి హామీలు ఇచ్చిన రేవంత్ ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలి, ఒక్క నిరుద్యోగికి కూడా భృతి ఇవ్వలేదు. సన్నబియ్యంలో కేంద్రం 43 రూపాయలు ఇస్తోంది. రాష్ట్ర వాటా కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లక్షన్నర కేంద్రం వాట కింద ఇస్తోంది. మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారుతెలంగాణలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు విపరీతంగా భూ దందా సాగుతోంది భూములు అమ్మనిదే పూటగడవట్లేదు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 42 వేల కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. ాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేళ్లలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్‌ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్ మండిపడ్డారు.‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో లేకుండా ఎలా పోయాయి?..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని శివశంకర్ హితవు పలికారు. -
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్ నెట్వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్‌కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్‌తో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని నాగార్జున యాదవ్ తెలిపారు. -
రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్.. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా?
సాక్షి,హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసిందని, ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాటు నియంత పాలన చేశారు. ఆయన కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ బంధీ అయ్యింది. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఏదో మార్పు చేస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అంతే కానీ కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో కాదు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండేళ్ల పాలన పై ఉత్సవాలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రతీ సందర్భంలో ఫ్రీ బస్సు, సన్న బియ్యం రెండే విషయాలు చెబుతున్నారు. ఆ సన్న బియ్యంలో కేంద్రం వాటా ఉంది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చారు అంతే. పరిపాలనలో మార్పు రాలేదు. తెలంగాణలో ఇంకేమీ మారలేదు. ఏ రంగంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరాడు. ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా రండి. మా కార్యకర్తలు సమాధానం చెబుతారు. ప్రెస్ క్లబ్ కైనా, ఇంకా ఎక్కడికైన పర్వాలేదు. మా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. భూములు, మద్యం అమ్మకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకోవాలని సూచిస్తున్నా.బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పారు.. ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసే పార్టీలే అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించి మోసం చేయడానికి సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారు. వంచించడమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ. హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో గతంలో ద్రుష్టి మళ్ళించారు. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ పేరుతో ప్రజల ఫోకస్ మళ్లిస్తున్నారు. కరప్షన్ లో, డ్రగ్స్, గన్ కల్చర్ లో తెలంగాణ రైజింగ్ అవుతోంది.రెండేళ్లలో భూ మాఫియా పడగలెత్తింది. వాటాల కోసం మంత్రుల మధ్య గొడవలు బయటపడుతున్నాయి. పారిశ్రామిక భూములను అప్పనంగా దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణ సంపదను దోచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నారు. బీఆర్ఎస్ చేసిన పాపలు.. అప్పులు మళ్లీ కాంగ్రెస్ కూడా చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అంటూ బీజేపీ నాయకుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులకు వైఎస్ జగన్ మేలు చేశారని.. చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు.‘‘తిరుమలలో గొల్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే. తిరుమలలో యాదవులకు వంశపారపర్య హక్కును తిరిగి తీసుకొచ్చింది జగనే. శ్రీకాకుళం చరిత్రలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది వైఎస్ జగనే. విశాఖలో యాదవ మహిళ అని కూడా చూడకుండా మేయర్ పదవి నుంచి దించేశారు’’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమీషన్లమయంగా కాంగ్రెస్ సర్కార్: ఎంపీ ధర్మపురి సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదుఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్‌బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. బీజేపీలో మేమంతా ఒక్కటే.. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్‌కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్‌రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు. -
‘పౌర విమానయాన శాఖను లోకేష్ రివ్యూ చేయడం ఏంటీ?’
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎన్నడు లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించలేక మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు ఎత్తేశారంటూ మండిపడ్డారు.‘‘మన తెలుగు వాడికి విమానయాన శాఖ మంత్రి పదవి వచ్చిందని సంతోషించాము. దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువును మంత్రి తీశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి క్షమాపణ చెప్పాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్ కాదు.. దేశ ప్రజలు కూడా అదే కోరుతున్నారు. విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదని దేశ ప్రజలు అంటున్నారు...ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇండిగో సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ఎవరు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల్లో లోకేష్ ఒకరు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా.. తండ్రి ఆఖరి చూపులకు వెళ్లలేని పరిస్థితి బిడ్డలకు ఏర్పడింది. నూతన వధూవరులను బంధువులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకొని మిగతా సంస్థలు విపరీతంగా రేట్లు పెంచాయి...విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 30,000 పెట్టీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చి నెత్తి మీద హెల్మెంట్ పెట్టుకొని రీల్స్ తీయడం తప్పితే రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఏం చేశారు.. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా జరగడానికి కారణం వైఎస్ జగన్. ఎల్లో మీడియాలో లోకేష్‌ను జాకీలు ఎత్తినట్లు నేషనల్ మీడియాలో ఎత్తలని టీడీపీ నేతలు చూశారు. టీవీ-5 సాంబశివరావు దగ్గర జాకీలు ఎత్తినట్లు ఎత్తితే నేషనల్ మీడియా ఊరుకుంటుందా?. మంత్రి రామ్మోహన్ రీల్స్ మానివేసి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి.. టీడీపీ పబ్లిసిటీ పిచ్చి వలన దేశంలో తెలుగు వారి పరువు పోయింది’’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. -
కక్ష సాధింపు.. కాకాణిపై మరో అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్‌లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి.. జగన్‌పై విమర్శలా?
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా.. విద్యారంగాన్ని బలోపేతం చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్‌మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, లోకేశ్‌ను నిలదీశారు. ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించి.. సెట్టింగ్‌లు, షూటింగ్‌లు పెట్టి ప్రత్యేక విమానాలపై వెళుతూ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. పాఠశాల సమావేశాలను సైతం రాజకీయ సభలుగా మార్చేసి వైఎస్ జగన్‌పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదన్నారు. ఆ బడిని తీర్చిదిద్దింది జగనే ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ పాఠశాలను నిర్మిస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నాడు–నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చుచేసి సెట్టింగ్ వేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసి తండ్రీకొడుకులు విఫలమయ్యారు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపచేయలేదు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైఎస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా తండ్రీకొడుకులకు లేదు’ అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.


