తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన.. | YSRCP Leaders Protest At Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..

Mar 17 2026 10:33 AM | Updated on Mar 17 2026 3:42 PM

YSRCP Leaders Protest At Tirupati

వైఎస్సార్‌సీపీ నేతల నిరసనలు అప్‌డేట్స్‌..

అనంతపురం..

  • అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
  • టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్
  • తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహం
  • చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

నంద్యాల జిల్లా...

  • నంద్యాలలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.
  • కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.
  • టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహం
  • బీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్‌.

 

ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎ‍స్సార్‌సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

తిరుపతితో పార్టీ ఇన్‌ఛార్జ్‌ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ  అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.

కామ నాయుడుని కాపాడుతున్న చంద్రబాబుపై ఫైర్

ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్‌ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్‌ చేశారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement