breaking news
Business
-
ఒక్క క్లిక్.. ఖాతా ఖాళీ : ఆన్లైన్ ఆఫర్లు..మోసాలకు పండుగే
దసరా, దీపావళి పండుగలు దగ్గరికొచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, ప్రత్యేక ఆఫర్లు హోరెత్తుతుంటాయి. అయితే తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు లభిస్తున్నాయనే ఆశతో చాలామంది ఆర్డర్లు చేసేస్తుంటారు. అయితే ఇదే సమయంలో సైబర్ మోసగాళ్లు కూడా రంగంలోకి దిగుతారు. నమ్మకమైన ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలిన నకిలీ సైట్లు, మోసపూరిత యూపీఐ రిక్వెస్టులు, నకిలీ డెలివరీ మెసేజ్‌లు, ఓటీపీల పేరుతో పలు మార్గాల్లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటారు. ఆదమరిస్తే ఉన్నదంతా ఊడ్చేసుకొని పోతారు. ఇలాంటి సందర్భాల్లోనే జాగ్రత్తగా ఉండటం మంచిది. సోషల్ మీడియాలో నకిలీ షాపింగ్ ప్రకటనలుఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తుంటాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే వస్తువులు, బ్రాండెడ్ ఉత్పత్తులు, భారీ డిస్కౌంట్లు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తారు. కానీ డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువు రాక పోవచ్చు. కొన్నిసార్లు ఆ అకౌంట్ కూడా కనిపించకుండా పోవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు ఆ అకౌంట్ ఎంతకాలంగా ఉందో, పాత పోస్టులు ఉన్నాయో, నిజమైన కస్టమర్ రివ్యూలు ఉన్నాయో ఖచ్చితంగా పరిశీలించాలి.భారీ ‘రిఫండ్’ పేరుతో యూపీఐ మోసం‘మీ ఆర్డర్లో సమస్య వచ్చింది.. రిఫండ్ ఇస్తున్నాం.. ఈ యూపీఐ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేయండి’ అంటూ ఫోన్ లేదా మెసేజ్ రావచ్చు. ఇక్కడే అసలు మోసం దాగి ఉంటుంది. యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే మీ ఖాతాలోకి డబ్బు రావడం కాదు.. మీ ఖాతా నుంచి డబ్బు వెళ్లే ప్రమాదం ఉంటుంది. రిఫండ్ పొందడానికి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఇదీ చదవండి: ఈజీగా బరువు తగ్గాలంటే : ఉప్మా-పోహా ఏది బెస్ట్కాల్ కట్ చేయడం మంచిది!‘మీ అకౌంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తున్నాయి’ అంటూ సైబర్ మోసగాళ్లు కస్టమర్ కేర్ ప్రతినిధులుగా ఫోన్ చేయొచ్చు. కొన్నిసార్లు మీరు ఇటీవల చేసిన ఆర్డర్ వివరాలను కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కస్టమర్ కేర్ పేరుతో ఎవరైనా ఓటీపీ అడిగితే ఎలాంటి వివరాలు ఇవ్వకుండా కాల్ కట్ చేయడం సురక్షితం. ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటిలింక్పై క్లిక్ చేస్తే ప్రమాదమే!ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్లో ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి. ఇదే విషయాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ‘మీ పార్సెల్ డెలివరీ కాలేదు. మళ్లీ డెలివరీ కావాలంటే చిన్న మొత్తంలో రీ–డెలివరీ లేదా కస్టమ్స్ ఫీజు చెల్లించండి’’ అంటూ ఎస్ఎంఎస్ పంపవచ్చు. అందులో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే అసలైన కొరియర్ వెబ్సైట్లా కనిపించే నకిలీ పేజీ తెరుచుకోవచ్చు. అక్కడ కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు లేదా ఇతర చెల్లింపు సమాచారాన్ని అడగవచ్చు. మీరు నిజంగానే పార్సెల్ కోసం ఎదురు చూస్తుంటే.. ఎస్ఎంఎస్లో వచ్చిన లింక్‌ను ఉపయోగించకుండా మీరు ఆర్డర్ చేసిన అధికారిక యాప్ లేదా కొరియర్ సంస్థ అధికారిక వెబ్సైట్లోనే ట్రాకింగ్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేయడం మంచిది. నకిలీ వెబ్సైట్‘70 శాతం, 80 శాతం డిస్కౌంట్’ అంటూ వచ్చే ప్రకటనలు కనిపించగానే వెంటనే క్లిక్ చేసేస్తాం. కానీ అసలు షాపింగ్ సైట్ల పేర్లను పోలిన నకిలీ డొమైన్లను సృష్టించి మోసగాళ్లు ప్రకటనలు ఇస్తుంటారు. వెబ్సైట్ చూడటానికి అచ్చం అసలైనదిలానే కనిపించవచ్చు. వస్తువులు, ధరలు, చిత్రాలు కూడా నిజమైనవిగానే అనిపించొచ్చు. కానీ వెబ్ అడ్రస్‌లో చిన్న మార్పు ఉండొచ్చు. అందుకే పేమెంట్ చేసే ముందు బ్రౌజర్లోని యూఆర్ఎల్ ను అక్షరం అక్షరం పరిశీలించడం చాలా ముఖ్యం. ఒక్క క్లిక్.. ఖాతా ఖాళీ ఫెస్టివల్ సేల్‌లో డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘ఇప్పుడే కొనండి.. చివరి అవకాశం.. మరికొన్ని నిమిషాలే’ వంటి సందేశాలు మనలో తొందరను పెంచుతాయి. ఈ అత్యవసర భావననే సైబర్ మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. అందుకే భారీ డిస్కౌంట్ కనిపించిన ప్రతిసారీ వెంటనే పేమెంట్ చేయకుండా.. వెబ్సైట్ నిజమైనదేనా? విక్రేత ఎవరు? యూఆర్ఎల్ సరైనదేనా? చెల్లింపు రిక్వెస్ట్ ఎందుకు వచ్చింది? వంటి ప్రశ్నలను ముందుగా పరిశీలించాలి. ఫెస్టివల్ సేల్‌లో మంచి డీల్ దొరకడం ఆనందమే.. కానీ ఆ డీల్ పేరుతో మన డబ్బు, వ్యక్తిగత వివరాలు పోకుండా అప్రమత్తంగా ఉండటం మరింత ముఖ్యం. ఇదీ చదవండి: చాలా భయపడిపోయా.. స్మిట్ మచ్చార్ భార్య ఎమోషనల్ -
విద్యార్థులకు ఉచితంగా ‘జోహో క్యాటలిస్ట్’
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ జోహో విద్యార్థుల కోసం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ స్వదేశీ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్ ‘క్యాటలిస్ట్’ సేవలను విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు వెల్లడించారు. క్లౌడ్ ఇన్ఫ్రా వ్యయాల భయం లేకుండా యువ డెవలపర్లు రియల్-టైమ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు.అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) లేదా గూగుల్ క్లౌడ్ వంటి విదేశీ దిగ్గజాలపై ఆధారపడకుండా జోహో ఆరంభంలోనే సొంత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించుకుంది. డేటాబేస్లు, ఐడెంటిటీ, మెసేజింగ్, సెర్చ్, స్టోరేజ్, కంప్యూట్ వ్యవస్థలను సొంతంగా రూపొందించుకుంది. ఈ అంతర్గత సాంకేతికత ఆధారంగానే ‘క్యాటలిస్ట్’ ప్లాట్‌ఫామ్ రూపుదిద్దుకుంది. ప్రారంభంలో జోహో ఉత్పత్తుల విస్తరణ కోసం రూపొందించిన ఈ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఇతర డెవలపర్ల ఆదరణను కూడా పొందుతోంది.‘మనం మన సొంత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించుకున్నాం. విద్యార్థులు తమ ఆలోచనలను నిజమైన ఉత్పత్తులుగా మార్చడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే మా ముఖ్య లక్ష్యం’ అని శ్రీధర్ వెంబు అన్నారు. విద్యార్థులకు ఉచితంగా సాంకేతికతను అందించడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణల వేగం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌలిక వసతుల ఖర్చులు లేకుండా కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్చుకునే వారికి జోహో నిర్ణయం మెరుగైన అవకాశంగా మారనుంది.ఇదీ చదవండి: నేలవాలిన అపరంజి ధరలు -
విదేశాల్లోని భారతీయుల జాబితా ఇదే..
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రవాస శక్తిగా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మాతృదేశం దాటి సుదూర తీరాల్లో స్థిరపడిన కోట్లాది మంది భారతీయులు నేడు వివిధ దేశాల ఆర్థిక, సాంకేతిక, సామాజిక విభాగాల్లో దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఉన్నత సాంకేతిక కేంద్రాల నుంచి గల్ఫ్ దేశాల నిర్మాణ, సేవా రంగాలు, ఆసియా-ఆఫ్రికా దేశాల చారిత్రక వర్తక కేంద్రాల వరకు భారతీయుల పాత్ర విశిష్టమైనది. విదేశాంగ శాఖ సేకరించిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల వివరాలు చూద్దాం.భారత విదేశాంగ శాఖ సేకరించిన అధికారిక గణాంకాల ప్రకారం అత్యధికంగా భారతీయులు నివసిస్తున్న టాప్-10 దేశాల జాబితా కింది విధంగా ఉంది.ఇదీ చదవండి: నేలవాలిన అపరంజి ధరలుస్థానందేశంప్రవాస భారతీయులు1అమెరికా6.1 మిలియన్లు (61 లక్షలు)2యూఏఈ4.3 మిలియన్లు (43 లక్షలు)3కెనడా3.2 మిలియన్లు (32 లక్షలు)4మలేషియా 2.9 మిలియన్లు (29 లక్షలు)5సౌదీ అరేబియా 2.8 మిలియన్లు (28 లక్షలు)6మయన్మార్ 2.0 మిలియన్లు (20 లక్షలు)7దక్షిణాఫ్రికా1.8 మిలియన్లు (18 లక్షలు)8శ్రీలంక1.6 మిలియన్లు (16 లక్షలు)9యునైటెడ్ కింగ్డమ్ 1.3 మిలియన్లు (13 లక్షలు)10కువైట్ 1.0 మిలియన్ (10 లక్షలు) -
నేలవాలిన అపరంజి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
విజయ్ మాల్యా చెప్పేదంతా అబద్ధం.. అసలు నిజం ఇదే..
పరారీలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా బ్యాంకుల బకాయిలకు సంబంధించి బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ మొత్తాలు పూర్తిగా రికవరీ అయ్యాయంటూ మాల్యా చేస్తున్న వాదనలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల బ్యాంకింగ్ కన్సార్టియం ఖండించింది. ఈ మేరకు బొంబాయి హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.డెట్ రికవరీ ఆఫీసర్ ద్వారా ఇప్పటివరకు రూ.10,270 కోట్లను తాత్కాలికంగా రికవరీ చేసినప్పటికీ ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి మాల్యా నుంచి ఇంకా రూ.8,751.86 కోట్ల మేర బకాయిలు రాబట్టాల్సి ఉందో బ్యాంకులు స్పష్టం చేశాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో దావా వేయడానికి ముందే రూ.544.58 కోట్లు రికవరీ కాగా న్యాయపరమైన ఇతర ఖర్చులను మినహాయించి ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అఫిడవిట్ నాటికి రూ.8,135.63 కోట్లు బకాయిలు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొన్నాయి. వడ్డీ పెరగడంతో ఆగస్టు చివరి నాటికి ఈ మొత్తం రూ.8,751.86 కోట్లకు చేరిందని కన్సార్టియం వివరించింది.మాల్యా వాదనలు భిన్నంగా..తమ నుంచి బ్యాంకులు ఇప్పటికే అసలు కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకున్నాయని, కాబట్టి తనపై ఉన్న నేరపూరిత కేసులను కొట్టివేయాలని కోరుతూ మాల్యా 2020లో బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు వినిపించిన అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈ తాజా జవాబు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. బ్యాంకులకు రూ.8,700 కోట్లకు పైగా ఇంకా చెల్లించాల్సి ఉందన్న ఈ అధికారిక ప్రకటనతో మాల్యా న్యాయపోరాటానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.ఇదీ చదవండి: స్కూల్ పుస్తకాల్లో ‘ఇన్కమ్ టాక్స్’ పాఠాలు -
స్కూల్ పుస్తకాల్లో ‘ఇన్కమ్ టాక్స్’ పాఠాలు
ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, పన్నుల విధానంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించే దిశగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) కీలక అడుగు వేసింది. 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకం ‘అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ - పార్ట్ 2’లో వ్యక్తిగత ఆదాయ పన్ను లెక్కింపు అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. పన్నులు చెల్లించడం అనేది కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాక, దేశ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు దోహదపడే బాధ్యత అని ఈ కొత్త అధ్యాయం స్పష్టం చేస్తోంది.ఈ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు సరికొత్త ‘న్యూ టాక్స్ రెజీమ్’ కింద పన్ను స్లాబ్‌లను అర్థం చేసుకుంటూ స్వయంగా టాక్స్ లెక్కింపులను నేర్చుకుంటారు. క్లిష్టతను నివారించేందుకు ఓల్డ్ టాక్స్ రెజీమ్ మినహాయింపులను ఇందులో పక్కన ఉంచారు. దీనివల్ల విద్యార్థులకు ప్రయోగాత్మక, ఆచరణాత్మక పరిజ్ఞానం అందుతుందని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ వివరించారు.పన్నులకే పరిమితం కాదు..కేవలం పన్నులకే పరిమితం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ పెట్టుబడి మార్గాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న వయస్సులోనే పెట్టుబడులు ప్రారంభించడం ద్వారా పొదుపు, సంపద సృష్టి ఏ విధంగా సాధ్యమవుతుందో ఉదాహరణలతో వివరించారు.దేశాభివృద్ధికి ముఖ్యంఆదాయం ఆర్జించడం ఎంత ముఖ్యమో... ఖర్చులు, పొదుపు, భవిష్యత్ అవసరాల కోసం బాధ్యతాయుతంగా రుణాలు తీసుకోవడం, ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందడం వంటి సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ప్రధానమని దీని ఉద్దేశం. విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక క్రమశిక్షణను, దేశాభివృద్ధిలో భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని విద్యావేత్తలు నమ్ముతున్నారు.ఇదీ చదవండి: ‘ఎన్పీఎస్ తత్కాల్’.. క్షణాల్లో రిటైర్మెంట్ ప్లానింగ్! -
నెలకు రూ.93.2 లక్షల అద్దె.. హైదరాబాద్‌లో ఫెడ్ఎక్స్ మరో లీజు
అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ ఫెడ్ఎక్స్ హైదరాబాద్‌లో తన కార్యాలయ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. నగరంలోని ఫీనిక్స్ సెంటారస్ వాణిజ్య సముదాయంలో మరో 1.19 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీంతో ఈ భవనంలో సంస్థ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు 3.70 లక్షల చదరపు అడుగులకు చేరింది.ఈ లావాదేవీలో భాగంగా భవన యజమాని ఎథీనా గ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో ఫెడ్ఎక్స్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై చైన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. చదరపు అడుగుకు నెలకు రూ.78 అద్దె చొప్పున ఈ లీజు ఖరారైంది. దీని ప్రకారం నెలవారీ అద్దె సుమారు రూ.93.2 లక్షలుగా ఉండనుంది. ఐదేళ్ల లీజు కాలంలో మొత్తం అద్దె చెల్లింపులు సుమారు రూ.55.6 కోట్లకు చేరనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫెడ్ఎక్స్ రూ.8.39 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ప్రతి మూడేళ్లకు అద్దెలో 15 శాతం పెంపు నిబంధనను కూడా ఒప్పందంలో చేర్చారు.ప్రాప్‌స్టాక్ వివరాల ప్రకారం, ఫీనిక్స్ సెంటారస్‌లో ఫెడ్ఎక్స్ గతంలోనూ పలుమార్లు కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకుంది. 2025 జూలైలో 16వ అంతస్తులో 1.25 లక్షల చదరపు అడుగులను చదరపు అడుగుకు నెలకు రూ.58 అద్దెతో లీజుకు తీసుకుంది. అంతకుముందు, 2024 జూన్‌లో ఐదో అంతస్తులో 69,871 చదరపు అడుగులను నెలకు చదరపు అడుగుకు రూ.62 అద్దెతో లీజుకు తీసుకుంది. 2023 అక్టోబర్‌లోనూ ఇదే అంతస్తులో 55,538 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అదే అద్దె రేటుతో లీజుకు తీసుకుంది.తాజా లావాదేవీతో ఫీనిక్స్ సెంటారస్‌లో ఫెడ్ఎక్స్ కార్యాలయ విస్తీర్ణం మరింత పెరిగింది. హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయ కార్యకలాపాలను విస్తరిస్తున్న తీరుకు ఈ ఒప్పందం మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
బజాజ్ ఫైనాన్స్ నిధుల సమీకరణ
ముంబై: ప్రయివేట్ రంగ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ నిధుల సమీకరణ బాట పట్టింది. అర్హతగల సంస్థాగత ఇన్వెసర్లకు షేర్ల జారీ(క్విప్)తోపాటు ప్రిఫరెన్షియల్ వారంట్ల జారీ ద్వారా రూ. 17,500 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. తాజా ప్రతిపాదన ప్రకారం క్విప్ ద్వారా రూ. 11,700 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. మరో రూ. 5,800 కోట్ల విలువైన వారంట్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనున్నట్లు వివరించింది. వీటిని అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. క్విప్‌లో భాగంగా రూ. 1 ముఖ విలువగల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. -
పండగ జోష్‌లో అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండు గ సీజన్లో అమ్మకాలను పెంచుకోవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తమ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సరీ్వసులైన అమెజాన్ నౌ విభాగాన్ని మరో 120 పైగా నగరాలకు విస్తరించింది. దీనితో విశాఖ, కొచ్చి తదితర నగరాల్లో కూడా ఈ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచి్చనట్లు సంస్థ తెలిపింది. నిత్యావసరాలు, ఆహారోత్పత్తులు, ఫ్యాషన్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తులను దీని ద్వారా పొందవచ్చు. దాదాపు 800 మైక్రో–ఫుల్ఫిల్మెంట్, అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల ద్వారా ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (ఎవ్రీడే ఎజెన్షియల్స్) హర్‡్ష గోయల్ తెలిపారు. మరోవైపు, అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అమెజాన్ ప్రారంభించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ తదితర ఆఫర్లను ఈ సందర్భంగా అందించనుంది. -
రిటైల్ స్పేస్ లీజింగ్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. 0.71 మిలియన్ చ.అ.లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 38 శాతం తగ్గాయి. అయితే, ప్రధాన ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లలో స్టాండెలోన్ స్టోర్ల లీజింగ్ స్థూలంగా 33 శాతం పెరిగి 1.51 మిలియన్ చ.అ.లకు చేరింది. షాపింగ్ మాల్స్, మెయిన్ రోడ్ (హై స్ట్రీట్) ప్రాంతాలను కలిపితే మొత్తం రిటైల్ స్పేస్ లీజింగ్ 5 శాతం నెమ్మదించి 2.33 మిలియన్ చ.అ. నుంచి 2.22 మిలియన్ చ.అ.లకు పరిమితమైంది. సరఫరాపరమైన సవాళ్లు ఇందుకు కారణం. మొత్తం స్థూల లీజింగ్‌లో 68 శాతం వాటా హై స్ట్రీట్స్లోని రిటైల్ లొకేషన్స్దే ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. మొత్తం ఎనిమిది నగరాలకు గాను ఆరింటిలో లీజింగ్ పెరగ్గా ముంబై, పుణేలో మాత్రం తగ్గింది. జనవరి–సెపె్టంబర్ మధ్యకాలంలో చూస్తే కొత్త షాపింగ్ మాల్స్ రాకపోయినప్పటికీ ఈ ఎనిమిది నగరాల్లో మొత్తం రిటైల్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా పెరిగి 6.57 మిలియన్ చ.అ.లకు చేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎండీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. ప్రీమియం గ్రేడ్ ’ఏ’ మాల్స్‌లో స్పేస్ లభ్యత పెద్దగా లేకపోవడంతో రిటైలర్లు .. పెద్ద సెంటర్లలోని హై స్ట్రీట్లలో స్టోర్లను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ఎస్ఆర్ఈడీ గ్లోబల్ సహ–వ్యవస్థాపకుడు శ్రీరామ్ పీఎం మోంగా చెప్పారు. అయితే, మాల్స్, హై స్ట్రీట్ లీజింగ్ లావాదేవీలు ఒకదానితో మరొకటి పోటీపడటం కాకుండా, ఒకదానికి మరొకటి అనుబంధంగా పని చేయొచ్చని వివరించారు. ఇటు మెయిన్ రోడ్లలో స్టోర్స్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తూనే అటు మాల్స్‌లో కూడా స్టోర్స్‌ని విస్తరించుకోవడం బ్రాండ్స్‌కి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
డేటా సెంటర్ల పాలసీలో తెలంగాణ టాప్!
న్యూఢిల్లీ: దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయమైన పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు ఇతరత్రా నియంత్రణపరమైన ప్రోత్సాహకాల కల్పనలో ముందంజలో ఉంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ ఎనర్జీ తాజా నివేదిక ‘ఇండియా ఫార్వార్డ్: రీఇమేజినింగ్ గ్రోత్’లో ఈ విషయాన్ని వెల్లడించింది. మౌలిక వసతులు, మూలధనం, నియంత్రణ యంత్రాంగాల రూపంలో విస్తృత ప్యాకేజీలను అందిస్తున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక గుజరాత్ ఊరించే విద్యుత్ ప్రోత్సాహకాలు, సులభతరమైన వ్యాపార విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈఓడీబీ)పై ఫోకస్ చేస్తూ పెద్దయెత్తున క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజాలను (హైపర్‌స్కేలర్స్) ఆకర్షిస్తోంది. మొత్తంమీద డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్నెస్ ఇండియా (డీసీపీఏఐ) ఇండెక్స్‌లో ముందంజలో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలు 50–100 మధ్యలో స్కోర్ చేశాయి. ఐటీ, ఐటీఈఎస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు)కు సంబంధించి 19 రాష్ట్రాల విధానాలను మదింపు చేసి ఈ ఇండెక్స్‌ను రూపొందించారు. ప్రధానంగా విద్యుత్, భూమి, మూలధనం (క్యాపిటల్), నిర్వహణ–సాంకేతికపరమైన మద్దతు, నియంత్రణపరమైన, ఈఓడీబీ కార్యాచరణ.. ఈ నాలుగు అంశాలను ర్యాంకింగ్స్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 42–45 మధ్య స్కోర్ చేసిన రెండో అంచె రాష్ట్రాల్లో ఒడిశా, హరియాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. 30–40 స్కోర్‌తో మూడో అంచెలో రాజస్తాన్, తమిళనాడు, పశి్చమబెంగాల్ నిలిచాయి.నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... → డేటా సెంటర్ల పరిశ్రమ భారీ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. → ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లు (జీడబ్ల్యూ) కాగా.. వచ్చే దశాబ్దకాలంలో 5 జీడబ్ల్యూ సామర్థ్యం గల డేటాసెంటర్లు ఏర్పాటు కానున్నాయి. అదనంగా మరో 6–7 జీడబ్ల్యూ సామర్థ్యాన్ని జోడించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. → మొత్తంమీద చూస్తే 2031–32 నాటికి దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 26.3 జీడబ్ల్యూకు చేరే అవకాశం ఉంది. → దీనిప్రకారం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆపరేషనల్ లోడ్స్ సహా డేటా సెంటర్ల నుంచి మొత్తం విద్యుత్ డిమాండ్ 2025–35 మధ్యలో వార్షికంగా (సీఏజీఆర్) 18 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. -
పెట్రోలియం లైసెన్సు ఉల్లంఘనలకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: పెట్రోలియం లైసెన్స్ నిబంధనలకు సంబంధించి సాధారణ ఉల్లంఘనలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించి భారీ జరిమానాలు విధించేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. అయితే, ప్రజా భద్రత, కీలకమైన మౌలిక సదుపాయాలకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలు, అనధికారిక పెట్రోలియం కార్యకలాపాలు మాత్రం క్రిమినల్ నేరాల కిందే కొనసాగనున్నాయి. పెట్రోలియం చట్టం 1934ని మార్చేందుకు ఉద్దేశించిన సవరణల ముసాయిదాలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.ప్రతిపాదిత సవరణలను ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ప్రజలు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన విషయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కాకుండా అడ్మిని్రస్టేటివ్ వ్యవస్థ కింద చర్యలు ఉంటాయి. తొలిసారిగా ఉల్లంఘిస్తే నిర్దిష్ట అధికారి రూ. 2.5 కోట్ల వరకు సివిల్ పెనాల్టీ విధించవచ్చు. పదే పదే ఉల్లంఘిస్తే ఇది రూ. 5 కోట్ల వరకు పెరుగుతుంది. తీవ్రతను బట్టి ఆంక్షలు విధించేందుకు లేదా లైసెన్సును రద్దు చేసేందుకు కూడా అధికారి సిఫార్సు చేయొచ్చు.లైసెన్సు లేకుండా అనధికారికంగా పెట్రోలియం కార్యకలాపాలు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మోసపూరితంగా లైసెన్సు తీసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. కీలక పెట్రోలియం మౌలిక సదుపాయాలు దెబ్బతినేందుకు కారణమైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. 1970 నుంచి ఈ చట్టాన్ని మార్చలేదు. -
‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తిస్తూ ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్, ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జునేజా లేఖ ద్వారా తెలిపారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో కెప్టెన్ మచ్చార్ అసమాన తెగువను చూపించారు. సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్‌తో కో-పైలట్ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్ మచ్చార్ అతి కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ.. ‘సంక్షోభ సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయ స్ఫూర్తి, బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయని మాన్‌కైండ్ ఫార్మా ఎండీ రాజీవ్ జునేజా పేర్కొన్నారు. ఆయన కాపాడిన ప్రాణాల విలువను డబ్బును పోల్చలేమని, ఈ రూ.కోటి నజరానా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే చిన్న ప్రయత్నం మాత్రమేనని తెలిపారు.కాగా, ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ పాత్రను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన తెగువ విమానంలో ఉన్నవారిని రక్షించడంలో కీలకంగా నిలిచిందని నెతన్యాహు పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే ఎత్తైన బంగారు కడ్డీ.. గిన్నిస్ రికార్డు
బంగారం అంటే సాధారణంగా చిన్న కడ్డీలు, ఆభరణాలే గుర్తుకొస్తాయి. కానీ యూఏఈలోని షార్జాలో ఏకంగా 2.12 మీటర్ల ఎత్తైన బంగారు కడ్డీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. షార్జా ఎక్స్పో సెంటర్లో జరుగుతున్న 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో దీనిని ప్రదర్శిస్తున్నారు. బులియన్ ట్రేడింగ్ కంపెనీ (బీటీసీ) ప్రదర్శిస్తున్న ఈ కడ్డీకి ప్రపంచంలోనే ఎత్తైన బంగారు కడ్డీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.ఈ బంగారు కడ్డీ ఎత్తు 2.12 మీటర్లు (6 అడుగుల 11.5 అంగుళాలు). బరువు సుమారు 30 కిలోలు కాగా, ప్రస్తుత బంగారం ధరల ప్రకారం దీని విలువ 15 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు రూ.39 కోట్లు) పైగా ఉంటుందని ‘ఎమారత్ అల్ యౌమ్’ పేర్కొంది. అయితే ఈ కడ్డీని విక్రయించేందుకు కాకుండా గిన్నిస్ రికార్డు ప్రదర్శనలో భాగంగా ఉంచినట్లు తెలిపింది.ఎత్తు చూసుకోవచ్చుబంగారు కడ్డీని సాధారణ రూపంలో కాకుండా భారీ గోల్డెన్ రూలర్ తరహాలో నిలువుగా ఏర్పాటు చేశారు. సందర్శకులు కడ్డీ పక్కన నిలబడి తమ ఎత్తును చూసుకోవచ్చు. దీంతో బంగారు కడ్డీ పక్కన నిలబడి ఫొటోలు తీసుకునేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కడ్డీ పక్కనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. -
రెబెల్ 500 బైక్స్ వెనక్కి.. కారణం ఇదే!
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో 96 రెబెల్ 500 బైక్‌లకు రీకాల్ ప్రకటించింది. ఏప్రిల్ 2025 నుంచి ఆగస్టు 2025 మధ్య తయారైన ఈ బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూకు సంబంధించిన సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.అసెంబ్లీ సమయంలో స్క్రూను సరైన టార్క్‌తో బిగించకపోవడంతో, కాలక్రమేణా అది వదులయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టీరింగ్ కదలికపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే 2026 సెప్టెంబర్ 30 వరకు భారత్‌లో ఈ సమస్య కారణంగా ఎలాంటి ఘటనలు నమోదు కాలేదని సంస్థ స్పష్టం చేసింది.ముందుజాగ్రత్త చర్యగా.. ప్రభావితమైన అన్ని బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూను ఉచితంగా మార్చి ఇవ్వనున్నారు. బైక్ వారంటీలో ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా ఈ సర్వీస్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. రీకాల్ కార్యక్రమం 2026 నవంబర్ మొదటి వారంలో హోండా అధీకృత బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభం కానుంది. ప్రభావిత కస్టమర్లను ఫోన్ కాల్స్, SMSలు, ఇమెయిల్స్ ద్వారా కంపెనీ నేరుగా సంప్రదించనుంది.మీ రెబెల్ 500 బైక్ ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే, హోండా అధికారిక వెబ్‌సైట్‌లోని రీకాల్ క్యాంపెయిన్ విభాగంలో వీఐఎన్ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు. బైక్ రీకాల్ పరిధిలో ఉంటే, సమీపంలోని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ను సంప్రదించి సర్వీస్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రూ మార్పిడి ప్రక్రియను కంపెనీ ఉచితంగా నిర్వహించనుంది.ఇదీ చదవండి: పెరిగిన హారియర్ ఈవీ ధర! -
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హెచ్1బీ వ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టంగా మారిందని, అవసరమైతే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా.. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో, తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించేందుకు కొన్ని కంపెనీలు ఈ వీసా విధానాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు.అమెరికన్ ఉద్యోగాలపై ప్రభావంఒక అమెరికన్ అకౌంటెంట్‌కు ఏడాదికి 60 వేల డాలర్లు చెల్లించే కంపెనీ, అదే పనిని 45 వేల డాలర్లకు విదేశీ ఉద్యోగితో చేయించుకుంటే అది అత్యుత్తమ ప్రతిభను తీసుకురావడం కాదని వాన్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి విధానం అమెరికన్ల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హెచ్1బీ ద్వారా అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ నిపుణులను తీసుకురావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని వివరించారు.ఇదే సమయంలో హెచ్1బీ దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని వాన్స్ సమర్థించారు. తక్కువ ఖర్చుతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో.. కంపెనీలు హెచ్1బీను ఉపయోగించకుండా నిరోధించడమే ఈ భారీ ఫీజు లక్ష్యమని చెప్పారు. అలాగే.. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ఎంపికలో అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, దరఖాస్తు చేస్తున్న కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా? లేదా?.. అనే విషయాన్ని కూడా పరిశీలించేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది.జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఆసక్తిహెచ్1బీ వీసాలు ఐటీ నిపుణులకు ఎంతో ముఖ్యమైనవి కావడంతో.. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లేదా అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ టెక్ నిపుణులపై భవిష్యత్తులో ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కూడా హెచ్1బీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దానిపై ప్రభుత్వం మరింత కఠినమైన నియంత్రణలు తీసుకొస్తోంది.ఇదిలా ఉండగా.. కొన్ని H-1B దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజుపై అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఫీజును అమలు చేసే సమయంలో ప్రభుత్వం అనుసరించాల్సిన పరిపాలనా ప్రక్రియలను పాటించలేదనే వాదనలు కోర్టుల్లో వినిపించాయి. దీంతో.. ఫీజు అమలుపై న్యాయపరమైన ఆంక్షలు వచ్చాయి.ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది? -
పెరిగిన హారియర్ ఈవీ ధర!
దేశంలోని పలు వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాల ధరలను పెంచనున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కొత్త సవరణతో, టాటా హారియర్ ఈవీ ధర రూ. 11,000 వరకు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లలో ఒకేలా లేదు. కాగా.. టాప్-స్పెక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 30.54 లక్షలు (ఎక్స్-షోరూమ్).ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ ఇటీవల తన BaaS ధరల కార్యక్రమాన్ని మొత్తం EV శ్రేణికి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద, హారియర్ EV యొక్క ప్రారంభ ధరను రూ. 7.30 లక్షలు తగ్గించడంతో, దాని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలకు చేరింది. దీనితో పాటు, ప్రతి కిలోమీటరుకు రూ. 5.90 బ్యాటరీ అద్దె రుసుము కూడా ఉంటుంది.ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది? -
గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?
మనం రోజూ చూసే, వినియోగించే కరెన్సీ నోటు మీద గాంధీజీ ఫోటో కనిపిస్తుంది. కానీ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కరెన్సీపై గాంధీజీ ఫొటో ముద్రించలేదు. బహుశా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో ఎప్పుడు వచ్చింది?, దీని చరిత్ర ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అశోక సింహాల గుర్తుభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. కరెన్సీ నోట్లపై ఉన్న బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ చిత్రాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన స్థానంలో మహాత్మా గాంధీ ఫోటో ముద్రించాలనే ఆలోచన కూడా వచ్చింది. ఇందుకోసం.. కొన్ని డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. కానీ.. చివరికి గాంధీ ఫోటోకు బదులు, సారనాథ్‌లోని అశోక సింహాల గుర్తును ఉపయోగించాలని నిర్ణయించారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. భారత ప్రభుత్వం విడుదల చేసిన తొలి కరెన్సీ నోటు 1949లో వచ్చిన ఒక రూపాయి నోటు. ఈ నోటుపై బ్రిటిష్ రాజు ఫోటో.. స్థానంలో అశోక సింహాల గుర్తును ముద్రించారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారత కరెన్సీపై గాంధీజీ ఫొటో కనిపించలేదు.అప్పట్లో నోట్లపై ఇవే..అప్పటి నోట్లపై భారతదేశ సంస్కృతి, కళలు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ప్రతిబింబించే చిత్రాలు ఉండేవి. జంతువులు, ఆనకట్టలు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలకు కూడా నోట్లపై చోటు కల్పించారు. అంటే.. అప్పటి కరెన్సీ నోట్లు కేవలం డబ్బు విలువను చూపించడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని కూడా ప్రతిబింబించేలా ఉండేవి.1969లో తొలిసారి గాంధీజీ చిత్రం1969లో గాంధీజీ ఫొటో తొలిసారి భారత కరెన్సీపై కనిపించింది. ఆ ఏడాది ఆయన 100వ జన్మదినం సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక స్మారక నోటును విడుదల చేసింది. ఈ నోటుపై గాంధీజీ కూర్చున్న చిత్రం ఉండగా, వెనుక భాగంలో సేవాగ్రామ్ ఆశ్రమం కనిపించేలా డిజైన్ చేశారు. అయితే ఇది సాధారణంగా చలామణిలో ఉండే నోటు కాదు. గాంధీజీ జన్మ శతాబ్ది సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక నోటుగా మాత్రమే ఉండేది.రూ.500 నోటుపై గాంధీజీఆ తర్వాత 1987లో గాంధీజీ చిత్రం మరోసారి కరెన్సీలోకి వచ్చింది. అక్టోబర్‌లో విడుదలైన కొత్త రూ.500 నోటుపై గాంధీజీ చిత్రం ముద్రించారు. ఇందులో గాంధీజీ ఒక బృందంతో కలిసి నడుస్తున్న చిత్రం ఉండేది. ఇది సాధారణంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోటుపై గాంధీజీ చిత్రం కనిపించిన ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు.1996లో అసలు మార్పుభారత కరెన్సీ చరిత్రలో మరో పెద్ద మార్పు 1996లో జరిగింది. ఆ సమయంలో ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ ప్రారంభించింది. ఈ సిరీస్‌లో నోటు ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని ప్రధానంగా ఉంచారు. అదే సమయంలో అశోక స్తంభం గుర్తును కూడా కొనసాగించారు. రూ.10, రూ.100 నోట్లతో ఈ సిరీస్ ప్రారంభమై, ఆ తర్వాత ఇతర డినామినేషన్లకు కూడా విస్తరించింది. ఈ కొత్త సిరీస్‌లో నకిలీ నోట్లను అరికట్టేందుకు సెక్యూరిటీ థ్రెడ్, వాటర్‌మార్క్ వంటి అదనపు భద్రతా లక్షణాలను కూడా తీసుకొచ్చారు.ఇతర నాయకుల ఫోటోలుభారత కరెన్సీపై గాంధీజీ ఫొటోను కొనసాగించాలా?, ఇతర ప్రముఖ నాయకుల చిత్రాలను కూడా చేర్చాలా?, అనే చర్చలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకుల పేర్లు కూడా వివిధ సందర్భాల్లో చర్చకు వచ్చాయి. 2016లో రాజ్యసభలో ఈ అంశంపై ప్రశ్న వచ్చినప్పుడు, అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గాంధీజీ ఫొటోను మార్చాల్సిన అవసరం లేదని ఒక కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు.2022లో కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ఉంచాలనే ప్రతిపాదన కూడా రాజకీయ చర్చకు దారితీసింది. డిజిటల్ రూపాయి డిజైన్‌లో గాంధీజీ చిత్రం లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ గాంధీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు! -
ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు!
బంగారం ధరలు భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.50 లక్షల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో.. 2027 నాటికి పసిడి ధరలు మరింత భారీగా పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది.ఈ ప్రచారానికి బల్గేరియాకు చెందిన ప్రముఖ భవిష్యవేత్త బాబా వంగా పేరు జోడించడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వాస్తవ ఆర్థిక అంచనాలకు మధ్య తేడా ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది.పసిడి ధరలు 40 శాతంప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, నగదు కొరత లేదా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం తగ్గే పరిస్థితులు ఏర్పడితే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని కొంతమంది. దీంతో పసిడి ధరలు మరో 25 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే జరిగితే.. భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.మూడు లక్షల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.నిజానికి.. బాబా వంగా బంగారం ధరలు 2027లో భారీగా చేరుతాయని చెప్పినట్లు నిర్ధారించే ఆధారాలు అందుబాటులో లేవు. కానీ.. ఈమె చెప్పినట్లు, బంగారం భారీగా పెరుగుతుందని అప్పుడప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.ఆర్థిక సంస్థలు ఇలా..బాబా వంగా పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెడితే.. కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశంపై తమ అంచనాలను వెల్లడించాయి.జేపీ మోర్గాన్ ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో.. ఔన్సు బంగారం ధర 2026 చివరి నాటికి 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా యూబీఎస్ కూడా 2027 తొలి అర్ధభాగంలో ఔన్సు బంగారం ధర 5,000 డాలర్ల స్థాయిని తాకవచ్చని విశ్లేషించినట్లు పేర్కొందిబంగారం ధరలు మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కాలానుగుణంగా ఈ అంచనాలు మారే అవకాశం ఉంటుంది.బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయిప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో.. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షితమైన ఆస్తుల వైపు చూస్తారు. బంగారాన్ని కూడా అలాంటి ఆస్తుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అంతర్జాతీయ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు కూడా పసిడి ధరలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.ఇదీ చదవండి: బంగారం అలారం బెల్.. కియోసాకి హెచ్చరిక!దేశంలో ఈ రోజు బంగారం ధరలు ఇలాఈ రోజు భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. పసిడి రేట్లు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో కింద చూడండి. -
తయారీ రంగం పరుగులు.. 7 నెలల గరిష్టానికి పీఎంఐ
కొత్త ఆర్డర్లు రావడం దేశీయంగా సెప్టెంబర్‌లో తయారీ రంగంలో ఉత్సాహం నింపింది. దీంతో పరిశ్రమ వృద్ధి ఏడు నెలల గరిష్టానికి ఎగిసింది. ఇందుకు సంబంధించిన హెచ్ఎస్బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.1కి చేరింది. ఆగస్టులో ఇది 52.8గా నమోదైంది. పీఎంఐ పరిభాషలో ఇండెక్స్ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.దేశీయంగా వినియోగానికి, ఎగుమతులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం తయారీ రంగానికి బూస్ట్‌గా పని చేసింది. వ్యాపారాలపై ఆశాభావం నాలుగు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆర్డర్లు, ఉత్పత్తి పెరగడంతో ఫ్యాక్టరీల్లో నియామకాలు కూడా జోరందుకున్నాయని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.ముడి వస్తువులు, విక్రయాల రేట్లు గణనీయంగా పెరిగినప్పటికీ గత చరిత్రతో పోలిస్తే ధరల పెరుగుదల నామమాత్రంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలతో కంపెనీలు ముడి వస్తువులను గణనీయంగా కొనుక్కుని, నిల్వలు పెంచుకున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్టైల్స్ మొదలైన వాటికి నెలకొన్న డిమాండ్‌తో మొత్తం అమ్మకాలు ఫిబ్రవరి తర్వాత అత్యధిక స్థాయిలో భారీగా వృద్ధి నమోదు చేశాయి. బ్రెజిల్, యూరప్, యూఏఈ, అమెరికాలోని క్లయింట్ల నుంచి ఎగుమతుల ఆర్డర్లు కూడా పెరిగాయి. -
'అలాంటి ఒక్క వాహనం చూపించండి'
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల, వాహనాలు దెబ్బతింటాయనే విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని ఎవరైనా చెబితే.. దానికి సరైన ఆధారాలు చూపించాలని బిహార్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2026లో ఆయన సవాల్ విసిరారు.కోట్ల వాహనాలు నడుస్తున్నాయి2022 నుంచి 4 కోట్లకు పైగా ఫోర్ వీలర్స్, 20 కోట్ల ద్విచక్ర వాహనాలు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో ఎలాంటి సమస్య లేకుండా నడుస్తున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా అధిక ఇథనాల్ మిశ్రమాలతో వాహనాలను పరీక్షించాయని ఆయన తెలిపారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఇథనాల్ వల్ల వాహనాలకు నష్టం జరుగుతోందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.రైతులకు లాభంఇథనాల్ వినియోగం వెనుక.. కేవలం వాహనాల విషయం మాత్రమే లేదు. ఈ విధానం ద్వారా రైతులు లాభపడతారు. ముఖ్యంగా మొక్కజొన్న వంటి పంటలను ఇథనాల్ తయారీకి ఉపయోగించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.సాధారణంగా రైతులు ఆహారం కోసం పంటలు పండిస్తారు. కానీ.. ఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడం వల్ల రైతులు దేశానికి శక్తి వనరులను అందించే స్థాయికి కూడా రైతు ఎదగవచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు. అందుకే.. రైతులను కేవలం ‘అన్నదాతలు’గా కాకుండా ఉర్జాదాతలు (శక్తి ఉత్పత్తిదారులు)గా కూడా చూడాలని ఆయన అన్నారు.రూ.45,000 కోట్ల ఆదాయంబిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ వల్ల రైతులకు అదనంగా రూ.45,000 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని గడ్కరీ పేర్కొన్నారు. అంటే.. రైతులకు తమ పంటలను విక్రయించడానికి మరో మార్కెట్ ఏర్పడిందన్నమాట. దీనివల్ల వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని ఆయన చెబుతున్నారు.ఇథనాల్‌తో పాటు వ్యవసాయ వ్యర్థాలను కూడా ఇంధనంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. వరి గడ్డితో విమాన ఇంధనం తయారు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో.. సాంకేతికత, పరిశోధన, కొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.బిహార్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి కూడా గడ్కరీ మాట్లాడారు. పర్యాటక రంగంతో పాటు.. మఖానాకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బిహార్‌లో ఉత్పత్తి అయ్యే మఖానాకు దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉందని, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు! -
‘ఎన్పీఎస్ తత్కాల్’ పెన్షన్ ధమాకా.. క్షణాల్లో రిటైర్మెంట్ ప్లానింగ్!
దేశంలో అసంఘటిత రంగ కార్మికులు, యువత, టైర్ 2, టైర్ 3 నగరాల ప్రజలకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘ఎన్పీఎస్ తత్కాల్’ విధానం ద్వారా రాబోయే రెండేళ్లలో దాదాపు 2-3 కోట్ల మంది కొత్త చందాదారులను జాతీయ పెన్షన్ విధానంలో (ఎన్పీఎస్) చేర్పించాలని పీఎఫ్ఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్పీఎస్ దివాస్ సందర్భంగా రెగ్యులేటరీ ఛైర్పర్సన్ ఎస్.రామన్ ఈ వివరాలను వెల్లడించారు.ఏంటీ ‘ఎన్పీఎస్ తత్కాల్’? ఎలా పనిచేస్తుంది?ఇప్పటివరకు కొత్త పెన్షన్ ఖాతా తెరిచి ‘ప్రాన్’ (Permanent Retirement Account Number) పొందడానికి పేపర్ వర్క్ లేదా సుదీర్ఘ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ భారాన్ని తగ్గించేందుకు పీఎఫ్ఆర్డీఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన బీహెచ్ఐఎం యూపీఐ యాప్ ద్వారా తక్షణ నమోదు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.మూడు సులువైన దశల్లో ఖాతా నమోదుభీమ్ (BHIM) యాప్‌లోని రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ విభాగంలో 'NPS' ట్యాబ్‌ను ఎంచుకోవాలి.పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలు ఇచ్చి కేవైసీ పూర్తయిన బ్యాంకు ఖాతాను అనుసంధానించాలి.తొలి కనీస విరాళంగా రూ.250లను యూపీఐ ద్వారా చెల్లించగానే క్షణాల్లో ‘ప్రాన్’ జెనరేట్ అయి ఖాతా యాక్టివేట్ అవుతుంది.ఎవరెవరికి లభ్యం?ప్రస్తుత తొలి విడతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి ఫిజికల్ కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ కేవైసీ ద్వారా క్షణాల్లో ప్రక్రియ పూర్తవుతుంది.ఆర్థిక భద్రతలో నూతన అధ్యాయంసాంప్రదాయ పీఎఫ్ లేదా ఇతర నిలకడైన పెన్షన్ పథకాల పరిధిలో లేనివారికి విశ్రాంత జీవితంలో నిలకడైన రాబడి అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మార్కెట్ ఆధారిత రాబడితో పాటు రిటైర్మెంట్ సమయంలో నిర్ణీత యాన్యుటీ పింఛను పొందే వెసులుబాటు ఉండటంతో ‘ఎన్పీఎస్ తత్కాల్’ భారతీయ పింఛను వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర! -
నెలకు రూ.70 వేల ఇంటి రెంట్.. రూ.4 లక్షల డిపాజిట్!
భారత ఐటీ హబ్ బెంగళూరులో గృహాల అద్దెలు చుక్కలనంటుతున్న వైనం మరొకసారి చర్చనీయాంశమైంది. ఒక సాధారణ 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ.70,000 అద్దెతో పాటు రూ.4 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ చేయడం ఐటీ ఉద్యోగులు, అద్దెదారులను ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియా వేదిక ‘రెడ్డిట్’లో వెలుగుచూసిన ఈ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాల్లో వేడిని రాజేసింది.ఆఫీసుకు సమీపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో నెలకు రూ.70 వేలు చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ ఫ్లాట్ యజమానులు ఇచ్చే సదుపాయాలు మాత్రం దానికి తగినట్లుగా లేకపోవడం గమనార్హం. కేవలం కొన్ని సోఫాలు, చిన్న టీవీ ఉంచి దాన్ని ఫుల్లీ ఫర్నిష్డ్‌గా ప్రచారం చేయడం, కనీసం రెండో బెడ్రూమ్లో బెడ్ లేదా వర్క్ డెస్క్ పట్టేంత స్థలం కూడా లేకపోవడాన్ని సదరు అద్దెదారు ఎత్తిచూపారు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. రూ.65,000 అద్దె, 3 నెలల డిపాజిట్‌కు ప్రతిపాదన చేసినప్పటికీ ఓనర్ నిరాకరించడంతో ఆ డీల్‌ను వదులుకున్నట్లు ఆయన తెలిపారు.ఫ్రాన్స్ కంటే బెంగళూరులోనే ఎక్కువ!ఈ ఉదంతంపై స్పందించిన నెటిజన్లు బెంగళూరు రెంట్ మార్కెట్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో అంతకంటే మెరుగైన జీవన ప్రమాణాలు, ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ అక్కడ ఇంటి అద్దెలు బెంగళూరు కంటే తక్కువగా ఉన్నాయని ఒక యూజర్ పోల్చి చెప్పారు.ఐటీ కంపెనీల జీతాలు ఎల్లప్పుడూ నిలకడగా ఉండవని, ఉద్యోగ భద్రత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి అసంబద్ధమైన అద్దెలను డిమాండ్ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికేతరుల అవసరాలను ఆసరాగా చేసుకుని యజమానులు ఇష్టారాజ్యంగా డిపాజిట్లు, అద్దెలు పెంచుతున్నారని, అద్దెదారులు కూడా విచక్షణ లేకుండా అడిగినంత చెల్లించడం మానుకోవాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర! -
ఒకేచోట 37 రోజులుగా కుండపోత వర్షం.. ఎక్కడ? ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో పలు దేశాలు వర్షాభావ పరిస్థితులు, అనావృష్టితో అల్లాడిపోతుంటే జపాన్ రాజధాని టోక్యో మాత్రం తీవ్ర వర్షంతో మునిగిపోతోంది. ఆగస్టు 27 నుంచి నేటి వరకు (అక్టోబర్ 2) వరుసగా 37 రోజులుగా టోక్యోలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జపాన్ వాతావరణ శాఖ (జేఎంఏ) రికార్డుల ప్రకారం 1886 తర్వాత నమోదైన అత్యంత సుదీర్ఘ వర్షపాత కాలమిది.ప్రతికూలతల్లోనూ భారీ వర్షాలుసాధారణంగా ఎల్‌నినో సమయంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మారి అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే టోక్యోలో ఈ భిన్నమైన పరిస్థితులకు అల్పపీడన ద్రోణులే ప్రధాన కారణమని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. పసిఫిక్ నుంచి వీస్తున్న తీవ్ర తేమతో కూడిన గాలులను, ఉత్తరం నుంచి వస్తున్న చల్లని గాలులు హోన్షూ ద్రోణి వద్ద నిలిపివేయడంతో స్థిర మేఘాలు ఏర్పడి వరుసగా వర్షం కురుస్తోంది. దీనికి తోడు సెప్టెంబరులో వరుసగా తుఫానులు రావడం ఈ వర్షపాతాన్ని మరింత తీవ్రతరం చేసింది.భారత్ - టోక్యో: భౌగోళిక వ్యత్యాసాలేమిటి?భారతదేశం, జపాన్ల భౌగోళిక పరిస్థితులు, రుతుపవన వ్యవస్థలు పూర్తిగా భిన్నమైనవి. జపాన్ ఒక ద్వీపసమూహం. చుట్టూ ఉన్న మహాసముద్రాలు నిరంతరం తేమను అందిస్తాయి. భారత్ ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడే ద్వీపకల్పం. ఎల్‌నినో సమయంలో భారతీయ రుతుపవనాలు బలహీనపడి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. కానీ టోక్యో ఉన్న కాంటో ప్రాంతం మధ్య రేఖాంశాల వద్ద ఉండటం వల్ల పసిఫిక్ హై-ప్రెజర్ బెల్ట్ కదలికలతో అనుకోని వర్షపాతం నమోదవుతుంది. భారత్‌లో విస్తారమైన భూభాగం వల్ల ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. జపాన్‌లో సముద్రపు గాలులు, తుపానులు సమశీతోష్ణ మండలానికి సరిహద్దులో ఉండడంతో నిరంతర వర్షాలు పడతాయి. వాతావరణ మార్పుల వల్ల తీవ్రరూపం దాల్చుతున్న ఈ ఆకస్మిక, విపరీత మార్పులు ప్రపంచ దేశాలకు ముందస్తు వాతావరణ హెచ్చరిక వ్యవస్థల ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి.ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర! -
పరుగెత్తిన పసిడి ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రిలయన్స్ జియో రోడ్‌షోల పూర్తి
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీసుల అనుబంధ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూవైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే విదేశాలలో నిర్వహిస్తున్న రోడ్‌షోలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కంపెనీ ఎండీ, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. యూకే, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో తొలి దశ రోడ్‌షోలు చేపట్టినట్లు వెల్లడించాయి. ఇప్పటికే కంపెనీ లిస్టింగ్ ప్రణాళికలను సెబీ అనుమతించింది. జూన్‌లో సెబీకి అందించిన ప్రాథమిక పత్రాల ప్రకారం 27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇవి ఇష్యూ తదుపరి ఈక్విటీ మూలధనంలో 2.9 శాతం వాటాకు సమానంకాగా.. 3.8 బిలియన్ డాలర్లు సమీకరించే వీలున్నట్లు అంచనా. వెరసి దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పే అవకాశముంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ సైతం 137 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పరిశ్రమ వర్గాలు మదింపు చేస్తున్నాయి. కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 66.4 శాతంకాగా.. మెటా, గూగుల్ సంయుక్తంగా 17.7 శాతం వాటా కలిగి ఉన్న విషయం విదితమే.ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలిస్టింగ్కు వీలుగా ఐనాక్స్ క్లీన్ఎనర్జీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీ తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఐనాక్స్జీఎఫ్ఎల్ గ్రూప్ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దేవాన్ష్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ సెప్టెంబర్ 29న సెబీకి ప్రాస్పెక్టస్ అందించిన సంగతి తెలిసిందే. అయితే సెబీ వెబ్సైట్ వివరాల ప్రకారం ఎలాంటి కారణాలు ప్రకటించకుండా ప్రాస్పెక్టస్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఐపీవోకు వస్తే కంపెనీ ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంక్ పునరుత్పాక ఇంధన దిగ్గజంగా నిలిచే అవకాశముంది.ఇదీ చదవండి: బ్లాక్‌మనీని వైట్‌గా ఎలా మారుస్తున్నారో తెలుసా? -
లిస్టింగ్‌పై 16 కంపెనీలు గురి
పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్ నేపథ్యంలో సెకండరీ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నప్పటికీ.. ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఏకంగా 16 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయడమే దీనికి నిదర్శనం! కొన్ని సంస్థలు గోప్యతా మార్గంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. కొద్ది నెలలుగా జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రోత్సాహంతో పలు రంగాల కంపెనీలు నిధుల సమీకరణకు ఇది తగిన సమయంగా భావిస్తున్నాయి. వెరసి ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 50 కంపెనీలు సెబీ తలుపుతట్టడం గమనార్హం!ఇదీ జాబితాతాజాగా లిస్టింగ్ బాట పట్టిన కంపెనీల జాబితాలో అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, బీఎస్ స్పాంజ్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, గ్రేస్ రెనెవబుల్ ఎనర్జీ, సోలియోస్ ఎనర్జీ, రుద్ర గ్రీన్ షిప్ రీసైక్లింగ్, ఎన్ఎన్టీ డెవలపర్స్, వినీర్ ఇంజినీరింగ్, రాథోడ్ జ్యువెలరీ మ్యాన్యుఫాక్చరింగ్, సునీల్ గోల్డ్ ఇండియా, తన్వీ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా, పీఈఎస్ ఇన్స్టలేషన్స్, సర్వా ఫోమ్ ఇండస్ట్రీస్, కాటలైన్, దోస్తీ రియల్టీ, మనీట్రీ రియల్టీ సర్వీసెస్ చేరాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపెనీలు వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనున్నాయి.అనరాక్ ప్రాపర్టీరియల్టీ రంగ కంపెనీ అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు వేసింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లకు సైతం వినియోగించనుంది. బీఎస్ స్పాంజ్మెటల్ రంగ సంస్థ బీఎస్ స్పాంజ్ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 650 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ఇండస్ట్రియల్, మెడికల్ గ్యాస్‌ల సరఫరా కంపెనీ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 7.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత పెట్టుబడిదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో నిధులు కంపెనీకి చేరబోవు. గ్రేస్ రెనెవబుల్ ఎనర్జీపబ్లిక్ ఇష్యూలో భాగంగా పునరుత్పాదక రంగ కంపెనీ గ్రేస్ రెనెవబుల్ ఎనర్జీ 84.15 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 27.85 లక్షల షేర్లు విక్రయానికి ఉంచనున్నారు.సోలియోస్ ఎనర్జీపునరుత్పాదక రంగ కంపెనీ సోలియోస్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా కోటి ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 90 లక్షల షేర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను స్థాపిత సామర్థ్యంగల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. రుద్ర గ్రీన్ షిప్హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్(హెచ్‌కేసీ) సరి్టఫికేషన్గల రుద్ర గ్రీన్ షిప్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా 1.9 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 90 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనుంది.పీఈఎస్ ఇన్స్టలేషన్స్నర్స్ కాల్, మెడికల్ గ్యాస్ తదితర టర్న్‌కీ హెల్త్‌కేర్ సరీ్వసులందిస్తున్న పీఈఎస్ ఇన్స్టలేషన్స్ ఐపీవోలో భాగంగా 57.94 లక్షల ఈక్విటీలను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 24.83 లక్షల షేర్లను వాటాదారులు విక్రయించనున్నారు. తన్వి ఎక్స్పోర్ట్స్బంగారు ఆభరణ తయారీ, ఎగుమతుల సంస్థ తన్వి ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ఐపీవోలో భాగంగా 35.8 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.8 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. సునీల్ గోల్డ్ బంగారు ఆభరణ తయారీ, విక్రయ కంపెనీ సునీల్ గోల్డ్ ఇండియా ఐపీవోలో భాగంగా 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 50 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.సర్వా ఫోమ్రీబాండెడ్ ఫోమ్ తయారీ కంపెనీ సర్వా ఫోమ్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 13.5 లక్షల షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు రీబాండెడ్ పాలీయురిథేన్ ఫోమ్ ప్రొడక్టుల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 30 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది.ఎన్ఎన్టీ డెవలపర్స్ఈపీసీ సేవలందించే ఎన్ఎన్టీ డెవలపర్స్ ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 25 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలుకి, రూ. 75 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మరో రూ. 22 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.వినీర్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ సర్వీసులందించే వినీర్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా 71 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను అడ్వాన్స్డ్ ఫోర్జింగ్, మెషీనింగ్ ప్లాంట్, మెషీనరీ, వర్కింగ్ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.రాథోడ్ జ్యువెలరీబంగారు ఆభరణ తయారీ కంపెనీ రాథోడ్ జ్యువెలరీ ఐపీవోలో భాగంగా 1.03 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 115 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, రూ. 90 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.కాటలైన్ లిమిటెడ్ఐపీవోలో భాగంగా రహదారుల భద్రతా ప్రొడక్టుల తయారీ కంపెనీ కాటలైన్ లిమిటెడ్ 43 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 43 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను తయారీ ప్లాంట్ ఆధునీకరణ, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ పరికరాల కొనుగోలుకు వినియోగించనుంది.గోప్యతా విధానంలో..రియల్టీ డెవలపర్ సంస్థ దోస్తీ రియల్టీ, ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ మనీట్రీ రియల్టీ సర్వీసెస్ సైతం సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి.ఇదీ చదవండి: బ్లాక్‌మనీని వైట్‌గా ఎలా మారుస్తున్నారో తెలుసా? -
యూపీఐ లావాదేవీలు డౌన్
ముంబై: యూపీఐ చెల్లింపు లావాదేవీలు సెప్టెంబర్‌లో 2,407 కోట్లుగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో జరిగిన 2,450 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 1.8 శాతం క్షీణించాయి. విలువపరంగా కూడా 28.82 లక్షల కోట్ల నుంచి 1.50 శాతం తగ్గి రూ. 29.37 కోట్లకు పరిమితమయ్యాయి. త్వరలో అధిక విలువ చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మరోవైపు, ఐఎంపీఎస్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 7.05 లక్షల కోట్ల విలువ చేసే 35.40 కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ, ఐఎంపీఎస్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) నిర్వహిస్తోంది. ఆర్బీఐ నిర్వహించే ఆర్టీజీఎస్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 235.71 లక్షల కోట్ల విలువ చేసే 3.25 కోట్ల లావాదేవీలు, నెఫ్ట్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 46.75 కోట్ల విలువ చేసే 86.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త బాస్ అనూప్ బాగ్చి
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా అనూప్ బాగ్చి నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు సేవలు అందించేందుకుగానూ ఈ అక్టోబర్ 27న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, దాని అనుబంధ సంస్థల్లో 1992 నుంచి సేవలు అందించిన బాగ్చి, ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ మూడేళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఆయన నాయకత్వంలో దుబాయ్ బ్రాంచ్‌లో ఉత్పత్తుల ‘మిస్–సెల్లింగ్’ (తప్పుడు విక్రయాలు) కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోవడం, డిపాజిట్ల సమీకరణకు అందించిన ఇన్సెంటివ్‌ల వ్యవహారంలో జగదీశన్‌పై బ్యాంక్ బోర్డు జరిమానా విధించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో రేసు నుంచి జగదీశన్ తప్పుకోవడంతో, ఆర్బీఐకి పంపిన ఇద్దరి పేర్లలో అనూప్ బాగ్చిని ఎంపిక చేసింది. -
ఐపీవో నిధుల సమీకరణ రికార్డ్
ముంబై: పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి ఆరు నెలల్లో 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 94,205 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఇంతక్రితం ఇదే కాలం(ఏప్రిల్–సెపె్టంబర్)లో అంటే 2025–26లో రూ. 69,533 కోట్ల సమీకరణ రికార్డ్‌గా నిలుస్తూ వచ్చింది. 65 కంపెనీలు ఐపీవోల ద్వారా సమకూర్చుకున్న ఈ నిధులకంటే తాజా సమీకరణ 35 శాతం అధికంకావడం విశేషం! ప్రస్తుత ఏడాది తొలి 6 నెలల్లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈసహా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ తదితరాలున్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం నిజానికి ఈ ఏడాది తొలి 3 నెలలు ప్రైమరీ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. సెకండరీ మార్కెట్ల హెచ్చుతగ్గుల మధ్య రూ. 3,94 కోట్లు సమీకరించినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా చెప్పారు. పూర్తి ఏడాదికి..: ప్రైమరీ మార్కెట్ల జోరును కొనసాగిస్తూ ఇప్పటికే 145 కంపెనీలు లిస్టింగ్‌కు సెబీ అనుమతిని పొందాయి. తద్వారా రూ. 2.78 లక్షల కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించాయి. మరో 102 కంపెనీలు సెబీ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. అనుమతిస్తే ఉమ్మడిగా రూ. 1.87 లక్షల కోట్లు అందుకోవాలని ఆశిస్తున్నాయి. కాగా.. ఎస్ఎంఈ ఐపీవోలు, సంస్థాగత ప్లేస్మెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల నిధుల సమీకరణను సైతం పరిగణిస్తే ఈ ఏడాది 75 శాతం అధికంగా రూ. 2.43 లక్షల కోట్ల నిధుల సమీకరణకు తెరలేచింది. -
ఇళ్లకు భలే గిరాకీ..!
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్ (క్యూ3) త్రైమాసికంలో నివాస గృహాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 3 శాతం పెరిగి 1,00,220 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే క్యూ3 ఇళ్ల విక్రయాలు 97,080 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో డిమాండ్ బలంగా ఉండటమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. విలువ పరంగా చూస్తే, ఈ ఏడు నగరాల్లో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ గతేడాది రూ.1.52 లక్షల కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.1.55 లక్షల కోట్లకు చేరింది.హైదరాబాద్‌లోనే అత్యధిక వృద్ధి దేశంలోని ప్రధాన నగరాలన్నింటితో పోలిస్తే క్యూ3 త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్ అత్యధికం వృద్ధి రేటును కనబరిచింది. గతేడాది జూలై–సెప్టెంబర్ కాలంలో 11,305 యూనిట్లుగా ఉన్న ఇళ్ల విక్రయాలు, ఈసారి ఏకంగా 15 శాతం పెరిగి 12,970 యూనిట్లకు చేరాయి. ఐటీ, మౌలిక వసతుల విస్తరణతో పాటు ఐటీ నిపుణులు, ప్రీమియం కొనుగోలుదారులు చూపిన ఆసక్తి హైదరాబాద్‌ను వృద్ధిలో ముందంజలో నిలిపింది. ఇదే సమయంలో బెంగళూరులో అమ్మకాలు 12 శాతం వృద్ధితో 14,835 యూనిట్ల నుంచి 16,670 యూనిట్లకు పెరగ్గా, దేశంలోనే అతిపెద్ద మార్కెట్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లో విక్రయాలు 5 శాతం పెరిగి 30,260 నుంచి 31,750 యూనిట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో కేవలం ముంబై, బెంగళూరు నగరాలే ఏకంగా 48 శాతం సింహభాగాన్ని ఆక్రమించాయని అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి ప్రత్యేకంగా వెల్లడించారు. నాలుగు నగరాల్లో క్షీణత హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో అమ్మకాలు పుంజుకోగా.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, చెన్నై, కోల్‌కతాలలో ఇళ్ల విక్రయాలు మందగించాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, చెన్నై, కోల్‌కతా వంటి ఇతర ప్రధాన నగరాల్లో మాత్రం విక్రయాలు మందగించడం గమనార్హం. గత ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 16,620 యూనిట్లుగా ఉన్న పూణే ఇళ్ల విక్రయాలు ఈసారి 6 శాతం క్షీణించి 15,690 యూనిట్లకు పడిపోగా, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో అమ్మకాలు 1 శాతం స్వల్పంగా తగ్గి 13,920 నుంచి 13,765 యూనిట్లకు నమోదయ్యాయి. ఇక చెన్నై మార్కెట్ ఏకంగా 10 శాతం పతనాన్ని చవిచూసి విక్రయాలు 6,010 యూనిట్ల నుంచి 5,395 యూనిట్లకు పరిమితమవ్వగా, తూర్పు ప్రాంతంలోని కోల్‌కతాలోనూ అమ్మకాలు 4 శాతం మేర క్షీణించి 4,130 నుంచి 3,980 యూనిట్లకు పడిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకురావడం పెంచారు. ఈ ఏడు నగరాల్లో జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో కొత్తగా 1,14,320 యూనిట్లు మార్కెట్లోకి రాగా, గతేడాది (96,690)తో పోలిస్తే ఇది 18 శాతం పెరిగింది. రాబోయే పండుగ సీజన్ ఆధారంగా నివాస గృహాలకు డిమాండ్ మరింత పుంజుకుంటుందని అనూజ్ పూరి ఆశాభావం వ్యక్తం చేశారు.మారిన కొనుగోలుదారుల ప్రాధాన్యతలు సొంత గృహాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరగడమే ఇళ్ల విక్రయాల వృద్ధి కారణము. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక రాబడి, భద్రత కోసం రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదారులు కేవలం చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మాత్రమే కాకుండా నిర్మాణ నాణ్యత, లొకేషన్, ఆధునిక వసతులు, బిల్డర్ నమ్మకత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ మరింత పరిణతి చెంది ‘డిమాండ్–ఆధారిత’ దశలోకి అడుగుపెట్టిందని సంజీవిని గ్రూప్ చైర్మన్ ఉమేష్ గౌడ తెలిపారు. -
జీఎస్టీ వసూళ్ల జోష్!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దుమ్మురేపాయి. పటిష్టమైన దేశీ వినియోగంతో పాటు దిగుమతుల ఆదాయం దన్నుతో సెపె్టంబర్లో రూ.2.03 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.7 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్లు, జూలైలో రూ. 2.11 లక్షల కోట్ల చొప్పున లభించింది. కాగా, 2026–27 తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం వృద్ధితో రూ. 12.46 లక్షల కోట్లు నమోదుకాగా, నికర జీఎస్టీ ఆదాయం 10.6 శాతం పెరిగి రూ. 10.66 లక్షల కోట్లకు చేరింది. ఇతర ముఖ్యాంశాలివీ... → సెపె్టంబర్లో దేశీ ఆర్థిక కార్యకలాపాల నుంచి స్థూల జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం వృద్ధి చెంది రూ. 1.38 లక్షల కోట్లను తాకాయి. దిగుమతుల నుంచి ఆదాయాలు 26 శాతం ఎగిసి రూ.65,525 కోట్లకు చేరాయి. → ఇక జీఎస్టీ రిఫండ్లు 3 శాతం తగ్గుదలతో రూ.27,001 కోట్లుగా నమోదయ్యాయి. → రిఫండ్లను సర్దుబాటు చేస్తే, నికర జీఎస్టీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లుగా నమోదైంది. 18.1 శాతం వృద్ధి చెందింది. -
కార్ల అమ్మకాలకు పండుగ కళ..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభానికి ముందే దేశీయ ప్యాసింజర్ వాహన (పీవీ) రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. కార్ల తయారీ సంస్థల నుంచి సెప్టెంబర్‌లో డీలర్లకు పీవీల డిస్పాచ్‌లు దాదాపు 21 శాతం పెరిగి 4.60 లక్షల యూనిట్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఇదే నెలలో పరిశ్రమ మొత్తం డిస్పాచ్‌లు 3.78 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలన్నీ సెప్టెంబర్‌లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల కంపెనీలు డీలర్లకు సరఫరాలను పెంచడం, మార్కెట్లో డిమాండ్ నిలకడగా ఉండటం వృద్ధికి దోహదం చేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ 2.0 అమలుకు ముందు దాదాపు 22 రోజుల పాటు అమ్మకాలు ప్రభావితమవడంతో ఏర్పడిన తక్కువ బేస్ కూడా ఈసారి వృద్ధి గణాంకాలకు కలిసొచ్చింది. ‘‘ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో నవరాత్రులతో ప్రారంభమై నవంబర్ రెండో వారంలోని దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్లో వాహనాలకు డిమాండ్ బలంగా ఉంటుంది’’ అని ఆటో పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, గతేడాది సెప్టెంబర్ 22న కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత పండుగల సీజన్లో ఒకేసారి డిమాండ్ (పెంట్–అప్ డిమాండ్) వచ్చినందున, ఆ బేస్‌తో పోలిస్తే ఈసారి వృద్ధి రేటు కొంత మందగింవచ్చని భావిస్తాయి. -
తప్పనిసరి రీచార్జ్ ప్లాన్లను ప్రత్యేకంగా డిస్ప్లే చేయాలి
న్యూఢిల్లీ: నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన రీచార్జ్ ప్లాన్లు, స్పెషల్ టారిఫ్ వోచర్లను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ప్రత్యేకంగా కనిపించేలా కచ్చితంగా డిస్ప్లే చేయాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. ప్రస్తుతం టెల్కోలు వీటిని డిస్ప్లే చేస్తున్నప్పటికీ, పారదర్శకత పాటించడం లేదని, అంత సులువుగా కనిపించకుండా చేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ట్రాయ్ తాజా ఆదేశాలు ఇచ్చింది.స్పష్టంగా కనిపించేలా ’ట్రాయ్ తప్పనిసరి చేసిన ప్యాక్‌లు’ అంటూ ప్రత్యేక ట్యాబ్ లేదా సెక్షన్‌ని రూపొందించి, అందులో వివిధ వోచర్లను పొందుపర్చాలని పేర్కొంది. వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ప్రీపెయిడ్ రీచార్జ్ సెక్షన్లో ఇది మొదటి సెక్షన్‌గా ఉండాలని తెలిపింది. అలాగే, ఇతరత్రా విక్రయ కేంద్రాల్లో సైతం వీటిని ప్రత్యేకంగా డిస్ప్లే చేయాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల వారు, ఎక్కువగా చెల్లించే సామర్థ్యాలు లేని వారిని దృష్టిలో ఉంచుకుని డేటా కలపకుండా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం తక్కువ ధరతో, 30 రోజుల వరకు వేలిడిటీతో ప్రత్యేక టారిఫ్ వోచర్లను ప్రవేశపెట్టాలంటూ టెల్కోలను ట్రాయ్ ఇటీవలే ఆదేశించింది. -
ఇక జీతాలు ఆలస్యమైతే చర్యలు ఇవే..
దుబాయ్: యూఏఈలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల వేతన చెల్లింపులపై ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. ఉద్యోగుల జీతాలు ఆలస్యమైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా.. ముందుగా సంబంధిత సంస్థలకు ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్లు, హెచ్చరికలు జారీ చేసి సమస్యను పరిష్కరించుకునే అవకాశం కల్పించే విధానాన్ని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) స్పష్టం చేసింది. ఉల్లంఘన కొనసాగితే నిర్ణయించిన కాలక్రమం ప్రకారం పరిపాలనా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.ముందుగా నోటీసు.. ఆ తర్వాత చర్యకొత్త వేతన రక్షణ వ్యవస్థ (WPS)లో భాగంగా వేతన చెల్లింపులను ఎలక్ట్రానిక్ విధానంలో పర్యవేక్షిస్తారు. జీతాల చెల్లింపులో ఆలస్యం గుర్తించిన తర్వాత సంస్థలకు అలర్ట్‌లు, నోటిఫికేషన్లు పంపిస్తారు. దీని ఉద్దేశం కంపెనీలకు తమ తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు ఉద్యోగుల వేతన హక్కులను వేగంగా రక్షించడం.జీతం చెల్లించాల్సిన గడువు ఇదే2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మంత్రి తీర్మానం నంబర్ 340 ప్రకారం.. ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రైవేట్ రంగ సంస్థలు గత నెలకు సంబంధించిన వేతనాలను తదుపరి నెల మొదటి తేదీలోగా చెల్లించాలి. ఆ గడువు దాటితే WPSలో చెల్లింపు ఆలస్యంగా పరిగణిస్తారు. మొత్తం చెల్లించాల్సిన వేతనాల్లో కనీసం 85 శాతం నిర్ణీత గడువులో చెల్లించిన సంస్థను సమ్మతి ప్రమాణాలకు అనుగుణంగా పరిగణించే విధానాన్ని కూడా నిబంధనలు నిర్దేశించాయి.ఆలస్యం కొనసాగితే దశలవారీ చర్యలువేతనాలు చెల్లించకుండా ఆలస్యం కొనసాగితే చర్యలు క్రమంగా కఠినతరం అవుతాయి. రెండో రోజు నుంచి సంస్థలకు హెచ్చరికలు, నోటిఫికేషన్లు వెళ్లవచ్చు. ఐదో రోజు వరకు చెల్లింపులు సరిచేయకపోతే కొత్త వర్క్ పర్మిట్ల జారీపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. 11వ రోజుకు చేరినప్పుడు ఆరు నెలల వ్యవధిలో పునరావృత ఉల్లంఘనలకు పరిపాలనా జరిమానాలు, సంస్థ వర్గీకరణను మూడో కేటగిరీకి తగ్గించడం వంటి చర్యలు ఉండొచ్చు.16వ రోజు కూడా వేతన బకాయిలు పరిష్కారం కాకపోతే, నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ప్రభావిత ఉద్యోగుల తరఫున వ్యక్తిగత లేదా సామూహిక కార్మిక వివాదాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21వ రోజు నాటికి పరిస్థితిని బట్టి బకాయి వేతనాల రికవరీకి ఎగ్జిక్యూటివ్ చర్యలు, ఆస్తులపై ముందస్తు జప్తు, బాధ్యులపై ప్రయాణ నిషేధం, తదుపరి చట్టపరమైన చర్యలు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.కార్మికులు ఎక్కువగా ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టినిర్మాణం, రవాణా–నిల్వ, భద్రతా సేవలు, పారిశుద్ధ్యం, రిక్రూట్మెంట్ వంటి అధిక సంఖ్యలో కార్మికులు పనిచేసే రంగాల్లో ప్రమాద ఆధారిత పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వేతనాలు ఆలస్యమైతే ఉపాధి సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.నెలకు రూ.లక్షల కోట్ల వేతన చెల్లింపులుయూఏఈ వేతన రక్షణ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా 37 బిలియన్ దిర్హామ్‌లకు పైగా వేతన చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలోని దాదాపు 6 లక్షల ప్రైవేట్ రంగ సంస్థలు ఈ వ్యవస్థ పరిధిలో ఉన్నాయని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 90కుపైగా బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు WPS ద్వారా వేతన చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి. -
భారత్‌లోకి గ్లోబల్ బ్రాండ్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త శకం!
భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఖరీదైన ఇల్లు అంటే.. మంచి లొకేషన్, మంచి నిర్మాణం ఉంటే సరిపోయేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొనుగోలుదారులు ఇంటితో పాటు ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్, అంతర్జాతీయ బ్రాండ్ గుర్తింపు, హోటల్ తరహా సదుపాయాలు, వెల్నెస్, ఎంటర్టైన్మెంట్ వంటి అనుభవాలను కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ లగ్జరీ అడ్వైజరీ సంస్థ లూర్ హోల్డింగ్స్.. భారతీయ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ, మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ 'సిరిల్'తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఈ భాగస్వామ్యం ద్వారా.. లగ్జరీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హాస్పిటాలిటీ, వెల్నెస్, రిటైల్ బ్రాండ్లను భారత్‌లోని మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో అనుసంధానం చేయాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.లూర్ హోల్డింగ్స్ సంస్థకు 300కు పైగా ప్రముఖ లగ్జరీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో సంబంధాలు ఉండగా.. సిరిల్ కంపెనీకు భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్, డెవలపర్లు, స్థానిక మార్కెట్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఈ రెండు సంస్థల అనుభవం కలిస్తే.. మన దేశంలో మరింత ప్రత్యేకమైన బ్రాండెడ్ లగ్జరీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.భారత్‌లో పెరుగుతున్న సంపద, మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ అనుభవాలపై ఆసక్తి కారణంగా లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఇకపై.. కేవలం భవనం పేరు లేదా ఖరీదైన నిర్మాణం మాత్రమే కాకుండా, అక్కడ లభించే మొత్తం అనుభవమే కీలకంగా మారనుంది. అందుకే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరం లగ్జరీ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన, అనుభవాధారిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రూపొందించేందుకు రెండు సంస్థలు ప్రయత్నించనున్నాయి. -
ఎగుమతిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్!
పశ్చిమాసియాకు ఎగుమతులపై అదనపు బీమా కవరేజీని 2027 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) నుంచి తీసుకున్న క్రెడిట్ రిస్క్ బీమాకి సంబంధించిన అదనపు కవరేజీ వాస్తవానికి సెప్టెంబర్ 30తో ముగిసింది. సాధారణంగా క్రెడిట్ రిస్కులో 85-90 శాతం వరకు మొత్తానికి ఈసీజీసీ కవరేజీ ఇస్తుంది.అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 19న ప్రకటించిన ’రిలీఫ్’ స్కీము కింద 95 శాతం వరకు పొందవచ్చు. అదనపు కవరేజీకి అయ్యే రుసుముల భారాన్ని కేంద్రం భరిస్తుంది. కాగా, ఎగుమతి సుంకాల రిఫండ్ స్కీమ్ (ఆర్వోడీటీఈపీ)ని డిసెంబర్ 31 దాకా మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు డీజీఎఫ్టీ తెలిపింది.ఇది కూడా సెప్టెంబర్ 30తో ముగిసింది. స్కీము పొడిగింపును స్వాగతించిన పరిశ్రమ వర్గాలు.. దీన్ని మరింత దీర్ఘకాలం పాటు పెంచాలని కోరాయి. 2021లో ప్రవేశపెట్టిన ఈ స్కీము కింద 0.3–3.9 శాతం వరకు రిఫండ్ లభిస్తుంది. తయారీ, పంపిణీ ప్రక్రియకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల నుంచి రీయింబర్స్మెంట్ లభించని సుంకాలు, పన్నులు మొదలైన వాటి భారాన్ని కొంత తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
బంగారం అలారం బెల్.. కియోసాకి హెచ్చరిక!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి.. తాజాగా, ''కరెన్సీ విలువపై ప్రజలకు, ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు నమ్మకం తగ్గితే ఏం జరుగుతుంది?'', అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది.బంగారానికి డిమాండ్డబ్బును దాచుకోవడం కంటే.. విలువైన ఆస్తులలో పెట్టుబడులుగా పెట్టడం మంచిదని అంటారు కియోసాకి. సంక్షోభం ఏర్పడినప్పుడు బంగారం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కారణంగానే బంగారాన్ని వేల సంవత్సరాలుగా విలువైన ఆస్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటే.. మార్కెట్లో గోల్డుకు డిమాండ్ పెరగవచ్చు.అందుకే కియోసాకి బంగారాన్ని అలారం బెల్‌తో పోలుస్తున్నారు. ఎందుకంటే.. ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు వస్తే.. బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.బంగారం తరువాత వెండిబంగారం ధరలు పెరిగినప్పుడు.. పెట్టుబడిదారుల చూపు వెండి వైపు పడుతుంది. వెండికి పారిశ్రామిక రంగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ టెక్నాలజీ వంటి రంగాల్లో సిల్వర్ ఉపయోగం విరివిగా ఉంటుంది. దీంతో పెట్టుబడి డిమాండ్‌తో పాటు పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ధరపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.మైనింగ్ కంపెనీలుబంగారం, వెండి ధరలు పెరిగితే.. వాటిని భూమి నుంచి వెలికితీసే కంపెనీలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందని కియోసాకి చెబుతారు. ఎందుకంటే లోహాల ధరలు పెరిగినప్పుడు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉంటే మైనింగ్ కంపెనీల ఆదాయాలు, లాభాల అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు.సాధారణ పెట్టుబడిదారులు మార్కెట్లో మార్పు స్పష్టంగా కనిపించే వరకు వేచి ఉండకూడదని కియోసాకి చెబుతారు. పెట్టుబడుల విషయంలో ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోవడం కంటే.. ఆర్థిక పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకోవడం మంచిదని చెబుతారు.ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు! -
అనంత్ అంబానీ మాట.. చిన్నారి జీవితంలో కొత్త ఆశ!
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.23 నెలల వేదాంశ్ సింగ్ అనే చిన్నారి 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం సుమారు రూ.9 కోట్లు అవసరమని సమాచారం. ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం కుటుంబానికి కష్టంగా మారడంతో.. ఆ చిన్నారి చికిత్స కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలైంది.ముంబైకి చెందిన 26 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మయూరేష్ గుజర్.. తన టీమ్‌తో కలిసి వేదాంశ్ కోసం నిధులు సేకరిస్తున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలిసి.. చిన్నారి పరిస్థితిని వివరించి, తమకు తోచినంత సాయం చేయాలని కోరారు. ఈ ప్రయత్నాలతో ఇప్పటివరకు దాదాపు రూ.2.22 కోట్లు సేకరించినట్లు సమాచారం. అయితే.. సెప్టెంబర్ 21న జరిగిన ఓ సంఘటన చిన్నారి జీవితంలో వెలుగు నింపింది.మయూరేష్ గుజర్, అతడి టీమ్ లాల్బాగ్చా రాజా వద్ద ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో.. అనంత్ అంబానీ వారి బ్యానర్లను గమనించినట్లు.. తన కారును ఆపి, టీమ్‌తో దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా.. వేదాంశ్ పరిస్థితి, అతడి చికిత్సకు అవసరమైన మొత్తం, ఇప్పటివరకు వారు చేస్తున్న ఫండ్ రైజింగ్ గురించి అనంత్ అంబానీకి వివరించినట్లు గుజర్ తెలిపారు.వివరాలు తెలుసుకున్నాక.. వేదాంశ్ చికిత్సకు ఎంత ఖర్చయినా తాను చూసుకుంటానని అనంత్ అంబానీ చెప్పినట్లు గుజర్ తెలిపారు. అంతేకాదు.. వేదాంశ్ను తమ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను కూడా మార్చుకున్నారని వెల్లడించారు.దీనికి సంబంధించిన గుజర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఎన్నో రోజులుగా వేదాంశ్ కోసం తాము కష్టపడుతున్నామని, ఎండ, వానలను లెక్కచేయకుండా నిధులు సేకరిస్తున్నామని చెప్పారు. ఆ సమయంలో అనంత్ అంబానీతో మాట్లాడటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే వేదాంశ్ చికిత్స ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు మయూరేష్ గుజర్, అతడి టీమ్‌ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకాలం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కాలని కోరుకుంటున్నారు. అనంత్ అంబానీ ఉదారతను కూడా కొనియాడారు. View this post on Instagram A post shared by Mayuresh Gujar 🎬 (@mayuusic_vines_) -
గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భవిష్యత్ రవాణా గురించి మాట్లాడుతున్నప్పుడు.. 'ఫ్లయింగ్ బస్' ఆలోచనను మరోసారి ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు.. గాల్లో ప్రయాణించే బస్సులాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకురావాలన్నది తన ఆలోచన అని గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఇదెలా సాధ్యం, ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనే విషయాలను వెల్లడించలేదు.ఫ్లయింగ్ బస్సాధారణంగా బస్సు అంటే రోడ్డుపై ప్రయాణించే వాహనంగానే ఊహించుకుంటారు. కానీ గడ్కరీ చెప్పిన ఆలోచన.. దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే.. బస్సు రోడ్డుపై కాకుండా గాల్లో ప్రయాణిస్తూ, ఒకేసారి సుమారు 250 మంది ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాలి అనేది లక్ష్యం.గడ్కరీ తన ఆలోచనను వివరిస్తూ.. భవనాల పైభాగం లేదా టెర్రస్ నుంచి ప్రయాణికులు ఎక్కి, అక్కడి నుంచి గాల్లో ప్రయాణించే రవాణా వ్యవస్థ ద్వారా మరో ప్రాంతానికి చేరుకునే విధానాన్ని ఊహిస్తున్నట్లు చెప్పారు. ఇదే జరిగితే రోడ్లు కూడా అవసరం లేదు.గడ్కరీ ఆలోచనకు ప్రధాన కారణం.. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య. రోడ్లపై వాహనాలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కొత్త రోడ్లు నిర్మించడానికి స్థలం కూడా పరిమితంగానే ఉంటుంది.అలాంటి పరిస్థితుల్లో రోడ్డుపైనే మరో రవాణా మార్గాన్ని నిర్మించడం కంటే.. గాల్లో ప్రయాణించే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్‌ను దాటుకుంటూ వేగంగా ప్రయాణించవచ్చన్నది ఈ ఆలోచన వెనుక ఉద్దేశం. గడ్కరీ ప్రతిపాదిస్తున్న భవిష్యత్ రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ మాస్ ట్రాన్స్పోర్ట్, రోప్‌వేలు, కేబుల్ కార్లు వంటి ఇతర విధానాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: గడ్కరీ కొత్త ప్లాన్.. రైతులకు లాభం!ఇది నిజంగా సాధ్యమేనా?గడ్కరీ చెప్పిన విషయం సాధ్యమవుతుందా?, లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇది ట్రాఫిక్ తగ్గించడానికి ఉత్తమమైన మార్గం అని స్పష్టమవుతుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో.. రాబోయే రోజుల్లో ఫ్లయింగ్ బస్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.🚨 Nitin Gadkari said he wants to operate a FLYING BUS:You are laughing at this, but I want to operate a bus that can fly in the air and carry 250 people from one place to another. People will sit on top of this building, on the terrace, and they will fly away. pic.twitter.com/XyT7gwf0LR— Tejash (@lord_geopolitic) September 30, 2026 -
జియో బంపరాఫర్.. 6 నెలల ఫ్రీ రీఛార్జ్‌తో 4G ఫోన్!
దేశంలో డిజిటల్ కనెక్టివిటీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న జియో.. తన 10వ వార్షికోత్సవం సందర్భంగా మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.4జీ ఫోన్.. రూ.1,499జియో అందిస్తున్న ఆఫర్లో భాగంగా జియో భారత్ 4జీ ఫోన్‌ను రూ.1,499కి అందిస్తున్నారు. అంతేకాదు.. ఫోన్‌తో పాటు ఆరు నెలల పాటు ఉచిత కనెక్టివిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో ప్రతి నెల 14జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సాధారణంగా 2జీ వినియోగదారులు నెలకు దాదాపు రూ.199 రీఛార్జ్ చేసుకుంటే, ఆరు నెలలకు సుమారు రూ.1,200 ఖర్చవుతుంది. ఇప్పుడు జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో రూ.1,499కే 4జీ ఫోన్‌తో పాటు ఆరు నెలల కనెక్టివిటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. 2G నుంచి 4Gకి అప్‌గ్రేడ్ అయ్యే ఫోన్ ఖర్చు కేవలం రూ.299 మాత్రమే అవుతుంది.500లకు పైగా టీవీ ఛానల్స్జియో భారత్ కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితమయ్యే సాధారణ ఫీచర్ ఫోన్ కాదు. ఇందులో జియో టీవీ ద్వారా 500లకు పైగా టీవీ ఛానళ్లు చూడొచ్చు. లైవ్ క్రికెట్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం కూడా ఉంది. జియోపే ద్వారా యూపీఐ పేమెంట్స్, పేమెంట్ అలర్ట్స్, సౌండ్‌బాక్స్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కనెక్ట్‌గా ఉండేందుకు సేఫ్టీ ఫీచర్లు, లొకేషన్ మానిటరింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.ఇక ఫోన్ విషయానికి వస్తే.. ఇది 2.4 అంగుళాల డిస్ప్లే పొందుతుంది. 2000mAh బ్యాటరీ, 4G కనెక్టివిటీ ఉన్నాయి. అంటే.. సాధారణ ఫీచర్ ఫోన్ కంటే మరిన్ని డిజిటల్ సదుపాయాలను తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇప్పటికీ 2G ఫోన్ వాడుతున్న వారికి 4G ప్రపంచంలోకి అడుగుపెట్టేలా జియో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.ఇదీ చదవండి: భూకంపం వచ్చినా ఇల్లు సేఫ్.. జపాన్ కొత్త టెక్నాలజీ! -
వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 570.59 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 71,909.70 వద్ద, నిఫ్టీ 198.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 22,421.95 వద్ద నిలిచాయి.వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ఎంఫసిస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బజాజ్ ఆటో లిమిటెడ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సంసేరా ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)ఇదీ చదవండి: భూకంపం వచ్చినా ఇల్లు సేఫ్.. జపాన్ కొత్త టెక్నాలజీ! -
భూకంపం వచ్చినా ఇల్లు సేఫ్.. జపాన్ కొత్త టెక్నాలజీ!
జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. అందుకే.. అక్కడి ప్రజలు భూకంపాలను చూసి భయపడటం కంటే, వాటి వల్ల జరిగే నష్టాన్ని ఎలా తగ్గించాలనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతారు. గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భూకంపాలను ఒక పెద్ద ప్రకృతి విపత్తుగా మాత్రమే కాకుండా, ఒక ఇంజినీరింగ్ సమస్యగా భావించి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. భూకంపం వచ్చినప్పుడు ఇంటిని కొంత ఎత్తుకు పైకి లేపే విధానం పరిచయం చేశారు. ఈ విషయాన్ని హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.సెన్సార్లు గుర్తిస్తాయిసాధారణంగా భూకంపం వచ్చినప్పుడు నేల కదిలినట్టే ఇల్లు కూడా కదులుతుంది. దాంతో ఇంటి గోడలు, స్తంభాలు, పునాదులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ.. ఈ కొత్త విధానంలో భూకంపం వచ్చినట్లు సెన్సార్లు గుర్తించిన వెంటనే ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేసి ఇంటిని నేల నుంచి కొంత పైకి లేపుతుంది.ఇలా చేయడం.. వల్ల భూమి కదలిక నేరుగా ఇంటికి చేరకుండా కొంతవరకు నిరోధించవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. అంటే.. భూకంపం సమయంలో ఇల్లు నేలతోపాటు కదలకుండా, నేల కదలిక నుంచి వేరుగా ఉంటుందన్నమాట. దీని అర్థం ఇల్లు గాలిలో ఎగురుతుందని కాదు. ఇంటిని ఒక పరిమితిలో పైకి ఎత్తడం మాత్రమే. భూకంపం ముగిసిన తర్వాత ఇంటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.ఇప్పటికే ఉన్న టెక్నాలజీలుజపాన్లో ఇప్పటికే భవనాలను భూకంపాల నుంచి రక్షించడానికి.. బేస్ ఐసోలేషన్, షాక్ అబ్జార్బర్లు, ప్రత్యేక పునాది నిర్మాణాలు వంటి అనేక సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇంటినే కొంత పైకి లేపే ఆలోచన.. వీటన్నింటికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?భూకంపాలను మనం ఆపలేం. కానీ ఇళ్లు, భవనాలు, ప్రజల జీవితాలకు కలిగే నష్టాన్ని మాత్రం తగ్గించగలం. ఈ ఆలోచనతోనే జపాన్ ఎన్నో సంవత్సరాలుగా కొత్త కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందితే, భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రజలకు మరింత సురక్షితమైన ఇళ్లు నిర్మించడం సాధ్యమవుతుంది.Japan has spent decades turning earthquakes from a disaster into an engineering challenge. They are now developing a special technology that allows homes to rise above ground enough to protect the home in case of earthquakes. pic.twitter.com/t65sU4eYJf— Harsh Goenka (@hvgoenka) September 30, 2026 -
బ్లాక్‌మనీని వైట్‌గా ఎలా మారుస్తున్నారో తెలుసా?
నల్లధనాన్ని వదిలించుకునేందుకు పన్ను ఎగవేతదారులు ఎంచుకుంటున్న పన్నాగాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. పట్టుబడితే భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు తప్పవనే ఐటీ శాఖ హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా.. సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ల మరుగున కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ‘తెల్లగా’ మార్చుకుంటున్నారు.ఈవెంట్ల పేరిట నల్లధనం తెల్లగా!ఉదాహరణకు ఒక వ్యాపారి వద్ద లెక్కల్లో చూపని రూ.1 కోటి నల్లధనం ఉందనుకుందాం. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసులు తథ్యం. దీంతో సదరు వ్యాపారి ఒక ప్రముఖ గాయకుడు, డాన్స్ టీమ్‌తో భారీ మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ప్రత్యక్షంగా ఆన్లైన్లో అమ్ముడైన టికెట్లు కేవలం 500 మాత్రమే. రికార్డుల్లో మాత్రం ఏకంగా 2,000 టికెట్లు అమ్ముడైనట్లు చూపిస్తాడు. ఆ అదనపు 1,500 నకిలీ టికెట్ల మూలంగా వచ్చినట్లు చూపించిన నగదుతో రూ.1 కోటి నల్లధనాన్ని ఈవెంట్ అధికారిక ఆదాయంగా లెక్కల్లో జమ చేస్తాడు.మరొకవైపు, షో నిర్వహణకు అయిన అసలు ఖర్చును స్పాన్సర్లు, నిజంగా అమ్ముడైన 500 టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ముతో భర్తీ చేస్తాడు. ఫలితంగా నల్లధనం ఈవెంట్ ఆదాయంగా మారి వైట్ మనీగా మారిపోతుంది.ఐటీ శాఖ హెచ్చరికలుగతంలో కొన్ని విభాగాలకు చెందిన ఈవెంట్లు, టికెట్ సేల్స్, పన్ను వివాదాలపై దాడులు నిర్వహించిన ఐటీ శాఖ ఇప్పుడు ఇటువంటి ఆడిట్ అవకతవకలపై దృష్టి సారించింది. టికెట్ల విక్రయాలు, ఆడిటోరియం సీటింగ్ సామర్థ్యం, డిజిటల్ చెల్లింపుల ఆధారాలను పరిశీలిస్తే ఈ నకిలీ టికెట్ల గుట్టు తేలిపోతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాపారాల మరుగున జరుగుతున్న ఈ లాండరింగ్‌పై కఠిన నిఘా ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర! -
మామ డబ్బిస్తే ఇల్లు భార్యదే.. భర్తకు హక్కు ఉండదు!
వైవాహిక జీవితంలో భార్యాభర్తల పేరిట ఉమ్మడిగా నమోదైన ఆస్తికి సంబంధించి కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. రిజిస్ట్రేషన్ పత్రాల్లో భార్యాభర్తలిద్దరి పేర్లు ఉన్నప్పటికీ ఆ ఆస్తి కొనుగోలుకు అవసరమైన పూర్తి మొత్తాన్ని భార్య తండ్రి చెల్లించినట్లు ఆధారాలతో నిరూపితమైతే సదరు ఆస్తిపై పూర్తి హక్కు భార్యకే దక్కుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త మూడు నెలల వ్యవధిలో దాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించింది. జస్టిస్ సతీష్ నైనన్, జస్టిస్ పి.కృష్ణకుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది.కేసు నేపథ్యంబాధితురాలు తన తండ్రి సమకూర్చిన నిధులతో కొనుగోలు చేసిన సుమారు 7 సెంట్లు స్థలం, నివాస గృహంపై పూర్తి హక్కులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణలో ఆమె తండ్రి బ్యాంక్ ఖాతా నుంచి ఆస్తి కొనుగోలు రోజున రూ.25 లక్షలు విత్‌డ్రా అయినట్లు బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా రుజువైంది. కాగా, తాను విదేశాల్లో ఉన్న తన బావమరిది ద్వారా డబ్బులు ఇచ్చానని భర్త వాదించినప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ, సాక్ష్యాలను కానీ కోర్టు ముందు ఉంచలేకపోయారు. తొలుత ఫ్యామిలీ కోర్టు భర్త సగం ఆస్తికి రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించగా, ఈ తీర్పును సవాలు చేస్తూ ఇరుపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి.కోర్టు కీలక వ్యాఖ్యలుఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (సాక్ష్యాధారాల చట్టం) సెక్షన్ 92 నిబంధనలను, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ సెక్షన్ 14 పరిధిని పరిశీలించిన బెంచ్.. వైవాహిక వివాదాలను పరిష్కరించే క్రమంలో నిజమైన ఆధారాలను స్వీకరించే పూర్తి అధికారం ఫ్యామిలీ కోర్టులకు ఉంటుందని ఉద్ఘాటించింది. కుమార్తె సంక్షేమం కోసమే ఆమె తండ్రి పూర్తి సొమ్మును చెల్లించినట్లు స్పష్టంగా రుజువైనందున ఆ ఆస్తికి ఆమె ఏకైక యజమానిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర! -
కరవు కోరలు.. నీటి కోత.. బిల్డింగ్ నిర్మాణాలకు బ్రేక్!
రాష్ట్రంలో ముదిరిన కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతం మేర తాగునీటి సరఫరాలో కోత విధించడంతో పాటు తీవ్ర నీటిభయాలున్న ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. కరవు నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.వర్షాకాలంలో దాదాపు 18 శాతం వర్షపాత లోటు నమోదవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని 358 తాలూకాలకు గాను 265 తాలూకాల్లో కరవు పరిస్థితిని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పట్టణ నీటి సరఫరాలో 10 శాతం కోతపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జలవనరుల శాఖను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ఆదేశించారు. మరోవైపు కరవు ప్రాంతాల్లో వ్యక్తిగత, వాణిజ్య భవన నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల పనులను తక్షణమే నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే అధికారులను ఆదేశించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊరటపట్టణాల్లో పొదుపు చర్యలు చేపడుతూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.6,728 కోట్లు కేటాయించినట్లు ఉపాధి హామీ శాఖ మంత్రి భరత్ గోగావాలే వెల్లడించారు. ఈ నిధులతో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 375 రకాల పనులను చేపట్టనున్నారు.పశుగ్రాసానికి ప్రాధాన్యంతాగునీరు, పశుగ్రాసం సరఫరాకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెరువులు, కుంటల్లోని నీటిని తాగునీటి అవసరాలకే పరిమితం చేయనున్నారు. పశుగ్రాస కొరతను ఎదుర్కొనేందుకు ముగ్గురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి రాజస్థాన్ తరహా నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. కరవు సహాయక చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్ రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తూనే వ్యవసాయ రుణాల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసే అంశంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరపాల్సిందిగా సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర! -
ఉద్యోగం తీసేసి ‘మళ్లీ రండి’ అంటున్నారు!
ప్రపంచ సాంకేతిక దిగ్గజం అమెజాన్ చేపట్టిన బూమరాంగ్ హైరింగ్ (మాజీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం) కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల వ్యయ నియంత్రణ, ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ పేరుతో సుమారు 30,000 మంది కార్పొరేట్ సిబ్బందిపై లేఆఫ్స్ వేటు వేసిన సంస్థ ఇప్పుడు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ (ఏడబ్ల్యూఎస్), మెషిన్ లెర్నింగ్ విభాగాల కోసం మాజీ ఉద్యోగుల వైపే మొగ్గు చూపుతోంది.లేఆఫ్స్ తర్వాత మారిన సమీకరణాలుగత కొన్ని త్రైమాసికాలుగా లేఆఫ్స్‌ను ఫ్రేమ్ చేసిన విధానం, ఇప్పుడు కొత్త నియామకాల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉన్నాయి. సంస్థ పునర్నిర్మాణంలో భాగమే ఇదని, సాధారణ రిక్రూట్మెంట్ విధానంలో పూర్వ ఉద్యోగులను సంప్రదించడం సాధారణమేనని అమెజాన్ ప్రతినిధి హెలీ సిల్వా స్పష్టం చేశారు. అయితే, అంతర్గతంగా లేఆఫ్స్ బాధితులతో పాటు నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం రిక్రూటర్లు ప్రత్యక్ష ఈ-మెయిళ్లు ద్వారా ఇంటర్వ్యూ ఆఫర్లను అందిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.కార్పొరేట్ సంస్కృతిపై ప్రశ్నలుబూమరాంగ్ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల శిక్షణ సమయం (ఆన్‌బోర్డింగ్ టైమ్) తగ్గడమే కాకుండా సంస్థ శైలిపై వారికి ముందే అవగాహన ఉండడం ప్లస్ పాయింట్. కానీ, నిపుణులు ఈ ధోరణిని భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి లేఆఫ్స్‌కు గురైన లేదా వర్క్ ఫ్రమ్ హోమ్/ఆఫీస్ నిబంధనల వల్ల సంస్థను వీడిన అనుభవజ్ఞులు మళ్లీ ఉద్యోగ భద్రతపై నమ్మకంతో తిరిగి వస్తారా అనేది ప్రధాన ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ పోటీ పెరిగిన వేళ నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులు వేగంగా దొరక్కపోవడమే ఈ పునరాలోచనకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: సోషల్ మీడియా ఫిర్యాదులకు మోక్షమెప్పుడు? -
మరింత అలసిపోయిన పసిడి ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
హాల్‌మార్కింగ్ ఛార్జీల పెంపుతో నకిలీ ముద్రలు
బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఛార్జీలు పెరగడంతో నకిలీ ముద్రలు వాడే అక్రమార్కులు పెరుగుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వినియోగదారుల అవగాహన తక్కువగా ఉండే టైర్-2, 3, 4 నగరాల్లో ఈ ముప్పు అధికమని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఛార్జీలను ఆభరణాలు కొనే వినియోగదారులే చెల్లిస్తారు. అయితే, హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ‘కేర్’ మొబైల్ యాప్‌లో సరిచూసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు.అఖిల భారత రత్నాభరణ మండలి (జీజేసీ) ఛైర్మన్ రాజేశ్ రోక్డే ప్రకారం, దేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కేవలం 10 శాతమే బీఐఎస్ యాప్‌పై తగిన అవగాహన ఉంది. దీంతో హాల్‌మార్కింగ్ నమూనాను ఫోర్జరీ చేసే మోసగాళ్లకు వినియోగదారులు సులభంగా చిక్కే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని జీజేసీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బీఐఎస్ దృష్టికి తీసుకెళ్లింది. ఒక్కో ఆభరణానికి ప్రస్తుతం ఉన్న రూ.75 రుసుమును గతంలోని రూ.45కు తగ్గించాలని కోరింది. తాజా సవరణ 66.67 శాతం పెంపునకు సమానమని తెలిపింది.రూ.400 కోట్లు భారంప్రభుత్వ గణాంకాల ప్రకారం, గుర్తింపు పొందిన అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలు 2022 జులైలో 1,220 ఉండగా 2026 జులై నాటికి 1,577కి పెరిగాయి. హెచ్‌యూఐడీతో హాల్‌మార్క్ చేసిన ఆభరణాల సంఖ్య మొత్తం 65 కోట్లు దాటింది. 2025-26లో 13.22 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్ జరిగింది. కొత్త ధరతో వ్యవస్థపై అదనంగా రూ.400 కోట్లు, దీనికి తోడు సుమారు రూ.80 కోట్ల జీఎస్టీ భారం పడుతుందని జీజేసీ అంచనా.అదనపు వ్యయంఅదనపు పరికరాలు, సిబ్బంది, ప్రాసెసింగ్, నిల్వ వ్యయాలతో కూడిన సమగ్ర వ్యయ అంచనాను ఇవ్వాలని బీఐఎస్‌ను మండలి కోరింది. తప్పనిసరి ఫొటోగ్రఫీకి అయ్యే అదనపు ఖర్చునూ ప్రశ్నించింది. ఫొటోలను కూడా మోసగాళ్లు నకిలీ చేయవచ్చని వాదించింది. అంతేకాక, హాల్‌మార్కింగ్ సమయం ఆరు గంటల నుంచి 24–36 గంటలకు పెరగడంతో వ్యాపారుల నిర్వహణ మూలవ్యయం పెరుగుతుందని పేర్కొంది.బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆభరణం హాల్‌మార్క్ నిజమైనదో కాదో సులభంగా సరిచూసుకోవచ్చు. ముందుగా దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్‌లో Verify HUID ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఆభరణంపై ముద్రించిన 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్‌ను నమోదు చేయాలి.వెంటనే ఆ ఆభరణానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.ఏ వివరాలు తెలుస్తాయంటే..ఆభరణం రకం (ఉంగరం, గొలుసు వంటివి)బంగారం స్వచ్ఛత (22 క్యారెట్, 18 క్యారెట్ తదితరాలు)హాల్‌మార్కింగ్ చేసిన కేంద్రం (ఏహెచ్‌సీ) వివరాలుజ్యువెలర్ నమోదు వివరాలుహాల్మార్కింగ్ చేసిన తేదీఎందుకు ఉపయోగకరం?హెచ్‌యూఐడీ ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి యాప్‌లో చూపే వివరాలు, మీరు కొన్న ఆభరణం, బిల్లులో ఉన్న వివరాలతో సరిపోలాలి. సరిపోలకపోతే లేదా నంబర్ చెల్లదని చూపితే ముద్ర నకిలీ కావచ్చని అనుమానించాలి. ముఖ్యంగా కొనుగోలు సమయంలోనే దుకాణంలో ఈ పరీక్ష చేసుకోవడం మంచిది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా ఉంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన లైసెన్స్ వివరాలను కూడా ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియా ఫిర్యాదులకు మోక్షమెప్పుడు? -
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత నాలుగు సెషన్ల నుంచి మార్కెట్లు వరుసగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు పడిపోయి 22,568 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 74 పాయింట్లు నష్టపోయి 72,417 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.58బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 97.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.28 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.24 శాతం పుంజుకుంది.Today Nifty position 01-10-2026(time: 09:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సోషల్ మీడియా ఫిర్యాదులకు మోక్షమెప్పుడు?
భారతదేశంలో సోషల్ మీడియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘గ్రీవెన్స్ అప్పలేట్ కమిటీ’(జీఏసీ) తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఇండియా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, దాదాపు 50,000 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తీసుకునే నిర్ణయాలపై వినియోగదారులు వేగవంతమైన పరిష్కారాన్ని పొందేందుకు ఉద్దేశించిన ఈ వ్యవస్థ ప్రస్తుతం పెండింగ్ ఫైళ్లతో సతమతమవుతోంది.వినియోగదారుల్లో నిరాశసాధారణంగా సోషల్ మీడియా సంస్థలు కంటెంట్ మోడరేషన్ విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని వినియోగదారులు ఆరోపిస్తుంటారు. అటువంటి సందర్భాల్లో ప్లాట్‌ఫారమ్ గ్రీవెన్స్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జీఏసీని ఆశ్రయించడం పరిపాటిగా ఉండేది. అయితే, ఇప్పుడు పెండింగ్ అప్పీళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, వినియోగదారుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ ఆలస్యం వల్ల డిజిటల్ వేదికలపై తమ వాదనలు వినిపించే హక్కు కోల్పోతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏం చేయాలంటే..ప్రస్తుత పరిస్థితి వెనుక మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సామర్థ్యానికి మించిన పనిభారం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఇండియా తన విశ్లేషణలో గ్రీవెన్స్ అప్పలేట్ కమిటీ కార్యకలాపాల్లో పారదర్శకత లేకపోవడం, నిర్ణయాల వెల్లడిలో జాప్యం కలుగుతుండడాన్ని ఎత్తిచూపింది. ఈ వ్యవస్థపై తిరిగి విశ్వాసాన్ని పెంచాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. పరిష్కార ప్రక్రియకు నిర్దిష్ట సమయ పరిమితులను విధించడం, డేటా అప్డేట్లను క్రమబద్ధీకరించడం, కమిటీ వనరులను పెంచడం వంటి చర్యలు అత్యవసరం.డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నియంత్రణ, వినియోగదారుల రక్షణ అత్యంత కీలకమైన అంశాలు. జీఏసీ సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ తరుణంలో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి సామాన్య వినియోగదారుడికి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లేనిపక్షంలో ఈ కమిటీ కేవలం పేరుకే పరిమితమై అసలైన ఉద్దేశ్యాన్ని నెరవేర్చలేకపోయే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: రూ.లక్షన్నర కిందే బంగారం.. పెట్రోల్‌తోపాటు వాటర్ సేల్! -
పండుగ వేళ గ్యాస్‌పై బాదుడు.. సిలిండర్ ధరల పెంపు
ఢిల్లీ: దసరా పండుగ సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరింత పెరిగింది. అక్టోబర్ నెల తొలి రోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.62.50 పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.2,810కి చేరింది. సెప్టెంబర్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈనెలలో కూడా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50, కోల్‌కత్తాలో రూ.968, హైదరాబాద్‌లో రూ.994గా ధరలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో ముఖ్యంగా వ్యాపారుల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.తాజాగా ధరల పెంపు తర్వాత ఇలా.. ఢిల్లీలో రూ.2,810ముంబైలో రూ.2,763.50, హైదరాబాద్‌లో రూ.3,058.50, కోల్‌కతాలో రూ.2,946.50, చెన్నైలో రూ.2,979కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. #BREAKING | Ahead of the festive season, commercial LPG prices hiked again from October 1, with the price of a 19-kg cylinder in Delhi rising by Rs 62.50 to Rs 2,810.#LPG pic.twitter.com/HgKAVqJOcW— OTV (@otvnews) October 1, 2026ఇదీ చదవండి: వంట గ్యాస్‌పై సుంకం.. కేంద్రం కొత్త ప్లాన్ -
హైదరాబాద్ కంపెనీకి ప్రచారకర్తగా రోహిత్ శర్మ
హైదరాబాద్: రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కంపెనీ ఫ్రెయర్ ఎనర్జీ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ’సోలార్ హో, తో ఫ్రెయర్ హో’ పేరిట జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కంపెనీ ఆవిష్కరించింది.సౌరభ్ మర్దా, రాధికా చౌదరీ ప్రారంభించిన హైదరాబాద్ సంస్థ ఫ్రెయర్ ఎనర్జీ గత పదేళ్లలో 40 పైచిలుకు నగరాల్లో 20,000కు పైగా సోలార్ సిస్టమ్‌లను ఇన్స్టాల్ చేసింది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశీయంగా రెండో అతి పెద్ద రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు.. ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: వరుసగా పదో త్రైమాసికంలోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా కేంద్రం యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 1 నుంచి మొదలై డిసెంబర్ 30తో ముగిసే త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.దీని ప్రకారం వడ్డీ రేట్లు సుకన్య సమృద్ధి పథకంపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతంగా, పీపీఎఫ్‌పై 7.1 శాతంగా, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై 4 శాతంగా, కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతంగా ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు 7.7 శాతంగా కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని స్కీములపై రేట్లను సవరించింది. -
ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ రెడీ
కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు కళతప్పినప్పటికీ సరికొత్త రికార్డులవైపు ప్రయాణిస్తున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఏడాది(2026) ఐపీవోకు రావడం ద్వారా 84 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.న్యూఢిల్లీ: భారీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ అడుగులు వేసింది. సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. దీంతో దేశీయంగా ప్రయివేట్ రంగంలో అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ దిగ్గజంగా నిలిచే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దేవాన్‡్ష జైన్ విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఐనాక్స్జీఎఫ్ఎల్ గ్రూప్ కంపెనీ ప్రధానంగా.. సొంత, అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. గ్రూప్ కంపెనీలివీ కెమికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన ఐనాక్స్జీఎఫ్ఎల్ గ్రూప్‌లో ఇప్పటికే మూడు లిస్టెడ్ కంపెనీలు గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఉన్నాయి. సోలార్ మాడ్యూల్ తయారీ, విండ్ టర్బయిన్ జనరేషన్, ఈపీసీ, రెన్యూవబుల్ ఎనర్జీ కార్యకలాపాలు, నిర్వహణ తదితరాలలో గ్రూప్ సమీకృత సేవలు అందిస్తోంది. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ రెండు ప్రధాన బిజినెస్ విభాగాలు కలిగి ఉంది. ఇవి పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సోలార్ తయారీకాగా.. 2026 ఆగస్ట్‌కల్లా భారత్, ఆఫ్రికాలలో కలిపి స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారు(ఐపీపీ)గా 9.29 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో 2.37 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంసహా 0.8 గిగావాట్ల నిర్మాణంలో ఉన్న యూనిట్లున్నాయి. మరో 2.99 గిగావాట్ల పైప్‌లైన్ సామర్థ్యం, 3.13 గిగావాట్ల భవిష్యత్ సామర్థ్యాలను ప్రకటించింది. భారత్, యూఎస్‌లలో కలిపి 6 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామరŠాధ్యన్ని కలిగి ఉంది. ఇక్కడ సోలార్ సెల్ తయారీ సామర్థ్యాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర లిస్టెడ్ దిగ్గజాలతో పోటీ పడవలసి ఉంటుంది. గోప్యతా మార్గంలో రియల్టీ రంగ దిగ్గజం వాధ్వా గ్రూప్‌నకు చెందిన హోల్డింగ్ కంపెనీ తాజాగా గోప్యతా మార్గంలో సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వెరసి వాధ్వా గ్రూప్ హోల్డింగ్స్‌ను లిస్ట్ చేయడం ద్వారా వాధ్వా గ్రూప్ పబ్లిక్ మార్కెట్లవైపు అడుగులు వేస్తోంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 250కుపైగా ప్రాజెక్టులను గ్రూప్ అభివృద్ధి చేసింది. వీటిలో రెసిడెన్షియల్, కమర్షియల్, టౌన్షిప్ తదితరాలున్నాయి. అయితే కంపె నీ గోప్యతా విధానాన్ని ఎంచుకోవడంతో తొలి దశ లో ఐపీవో వివరాలు వెల్లడికాని సంగతి తెలిసిందే. వర్ధమాన్ అప్లయెన్సెస్ కన్జూమర్ అప్లయెన్సెస్ తయారీ కంపెనీ వర్ధమాన్ అప్లయెన్సెస్ లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.5 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌లో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటుతోపాటు రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సొంత అనుబంధ సంస్థ లేజర్ ఇండియా రుణ చెల్లింపులుసహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ సమీకృత ఎల్రక్టానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సరీ్వసులు(ఈఎంఎస్) అందిస్తోంది. దేశ, విదేశీ కన్జూమర్ బ్రాండ్లకు ఫ్యాన్లు, కిచెన్ అప్లయెన్సెస్ తదితర ఎఫ్ఎంఈజీ సంబంధిత ఓఈఎం, ఓడీఎం సొల్యూషన్లు సమకూర్చుతోంది. శ్రీజీకృప ప్రాజెక్ట్స్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే శ్రీజీకృప ప్రాజెక్ట్స్ ఐపీవోకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 410 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 90 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 500 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోళ్లు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అకడమిక్, హెల్త్‌కేర్, రెసిడెన్షియల్, ఆఫీస్ బిల్డింగ్స్ తదితర ప్రత్యేక ప్రాజెక్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ కార్యకలాపాలు అందిస్తోంది.సెబీవైపు చూపు ఐపీవో ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని సెబీకి పయనీర్ ఫ్యాబ్రికేటర్స్, పెంటకిల్ కన్సల్టెంట్స్(ఐ), టెంటీ లిమిటెడ్, పీసీఐ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సంఘ్వీ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొమాయ్ ఆర్ట్, బయోకాన్ ఎలక్ట్రిక్ సైతం తాజాగా దరఖాస్తు చేశాయి. తద్వారా స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు ప్రకటించాయి. ఇష్యూ నిధులను కంపెనీలు వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితర విభిన్న అంశాలకు వెచ్చించనున్నాయి. -
ఏఐతో ‘బీపీఎం’కు కొత్త జోష్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భారత బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) పరిశ్రమ కనుమరుగవుతుందనే భయాలను నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ కొట్టిపారేశారు. ఏఐ రాకతో బీపీఎం రంగం తనను తాను సరికొత్తగా పునరి్నరి్మంచుకుంటూ మరింత బలోపేతం అవుతుందన్నారు. ‘నాస్కామ్ బీపీఎం కాన్ఫ్లూయెన్స్ 2026’ సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. భారత్‌కు ఇప్పుడు ప్రపంచ స్థాయి ‘ఇంటెలిజెంట్ ఆపరేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ హబ్’ గా ఎదిగే గొప్ప అవకాశం వచ్చిందన్నారు. ‘‘సుమారు రెండేళ్ల క్రితం జనరేటివ్, ఏజెటింక్ ఏఐ తెరపైకి వచి్చనప్పుడు.. బీపీఎం పరిశ్రమ అంతరించిపోతుందన్నారు కంపెనీలు పూర్తిగా కనుమరుగవుతాయని చాలామంది అంచనా వేశారు. కానీ రెండేళ్ల తర్వాత చూస్తే ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. పైగా పరిశ్రమ మరింత బలోపేతమైంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని నంబియార్ ధీమా వ్యక్తం చేశారు. బీపీఎం రంగంలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ లావాదేవీలు, ప్రామాణిక వర్క్‌ఫ్లోలు, ప్రాథమిక వినియోగదారుల సేవలు ఏఐ ఏజెంట్ల ద్వారా ఆటోమేట్ అవుతాయని ఆయన అంగీకరించారు. అయితే ఏఐ వల్ల బీపీఎం రంగానికి ఏం జరుగుతుందనే దానికంటే, ఏఐ శక్తితో ఈ పరిశ్రమ ఎలాంటి విప్లవాత్మక మార్పులు సాధించగలదనేదే అసలు ప్రశ్న అని వ్యాఖ్యానించారు. రూ.5 లక్షల కోట్ల బీపీఎం పరిశ్రమ గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత బీపీఎం పరిశ్రమ ఆదాయం దాదాపు 60 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.5 లక్షల కోట్లు) చేరిందన్నారు. ఒకప్పుడు కేవలం ‘కాల్ సెంటర్ల’కే పరిమితమైన ఈ రంగం, ఇప్పుడు ఏఐ, అనలిటిక్స్, క్లౌడ్ ఆపరేషన్స్, ఆటోమేషన్ ఆధారిత సేవలకు నిలయంగా మారిందన్నారు. ఒక ప్రక్రియను ఆటోమేట్ చేయగలమా? అనే ప్రశ్న నుంచి.. ఏఐని ఉపయోగించి ఆ ప్రక్రియను పూర్తిగా రీ–డిజైన్ చేయవచ్చా? అనే దిశగా చర్చలు మారాయన్నారు. గతంలో సంస్థాగత సాంకేతికత కేవలం రికార్డులు, కస్టమర్ అనుసంధానానికే పరిమితమైందన్నారు. ఇప్పుడు ఏఐ ఏజెంట్ల రాకతో సొంతంగా నిర్ణయాలు తీసుకుని పనిచేసే ’సిస్టమ్స్ ఆఫ్ యాక్షన్’ అనే మూడో విభాగం రూపుదిద్దుకుంటోందన్నారు. -
స్మార్ట్‌ఫోన్‌కు మెమరీ సెగ..!
న్యూఢిల్లీ: మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడటంతో స్మార్ట్ఫోన్ల విడిభాగాల దిగుమతి వ్యయం భారంగా మారింది. దీని ప్రభావంతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల ధరలు సగటున 16 శాతం పెరిగినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. అయితే చైనా బ్రాండ్ వన్‌ప్లస్ ధరలను సగటున 8 శాతమే పెంచిందని పేర్కొంది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో 2026 రెండో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర (ఏఎస్పీ) రికార్డు స్థాయిలో 318 డాలర్లకు చేరినట్లు కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. ధరల పెరుగుదల అన్ని విభాగాల్లో కనిపించినప్పటికీ.. రూ.10 వేలలోపు ఫోన్లపై ప్రభావం అత్యధికంగా ఉంది. చౌక ఫోన్లపై తీవ్ర ప్రభావం మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల ప్రభావం బడ్జెట్ (ఎంట్రీ లెవల్) ఫోన్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా రూ.10,000లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల విభాగంలో ధరలు సగటున 32 శాతం వరకు పెరగడంతో.. ఈ కేటగిరీ షిప్మెంట్లు తొలి అర్ధభాగంలో ఏకంగా 65% పడిపోయాయి. భారత మార్కెట్లో చారిత్రకంగా అతిపెద్ద విభాగాల్లో ఒకటైన రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణి షిప్మెంట్లు కూడా 20 శాతం క్షీణించాయి. అయితే రూ.20 వేలకుపైగా ధర ఉన్న స్మార్ట్ఫోన్ల విభాగం మాత్రం వృద్ధిని కొనసాగించింది. అధిక ప్రారంభ ధరలతో పాటు పాత ఫోన్ మారి్పడి (ట్రేడ్–ఇన్) ఆఫర్లు, నో–కాస్ట్ ఈఎంఐలు ఖరీదైన ఫోన్ల కొనుగోలును సులభతరం చేయడం ఇందుకు దోహదపడినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ‘వన్ ప్లస్’ భిన్న వ్యూహం చాలా బ్రాండ్లు ధరలను పెంచినప్పటికీ.. చైనా బ్రాండ్ వన్‌ప్లస్ మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. పాత, తక్కువ ధరల వద్దే ముందస్తుగా మెమరీ కాంపోనెంట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల వన్‌ప్లస్ తన ధరల పెంపును కేవలం 8 శాతానికే పరిమితం చేయగలిగింది. దీంతో మొత్తం మార్కెట్ రెండంకెల పతనాన్ని నమోదు చేయనున్నప్పటికీ.. వన్‌ప్లస్ షిప్మెంట్లు మాత్రం 5 శాతం వృద్ధి సాధిస్తాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూ.20 వేలకుపైగా ధర ఉన్న విభాగంలో 2026 రెండో త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్లలో టాప్–5 బ్రాండ్లలో వన్‌ప్లస్ అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచినట్లు పేర్కొంది. ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడంతో పాటు విభిన్న ధరల శ్రేణుల్లో విస్తృత పోర్ట్‌ఫోలియో ఉండటం వల్ల వ్యయ ఒత్తిడిని ఒక్క ధరల విభాగంపైనే మోపాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపింది.ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ ప్రభావం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లకు డీఆర్ఏఎం, ఎన్ఏఎన్డీ మెమరీలకు భారీగా డిమాండ్ పెరగడంతో సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. దీనికి తోడు రూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే కాంపోనెంట్ల ధరలు మరింత పెరిగాయి. భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో సుమారు 99 శాతం దేశీయంగానే తయారవుతున్నప్పటికీ.. వాటిలో ఉపయోగించే కీలక కాంపోనెంట్లలో కొన్నింటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి బలహీనత ఈ దిగుమతి వ్యయాన్ని మరింత పెంచింది. ఈ అదనపు వ్యయ భారంలో అధిక భాగాన్ని చాలా బ్రాండ్లు వినియోగదారులపైకి బదిలీ చేశాయి.2028 వరకు ధరలపై ఒత్తిడి అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల ధరలు 2028కు ముందు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూపాయి బలహీనత కూడా దిగుమతి వ్యయాలను పెంచుతుండటంతో.. స్మార్ట్‌ఫోన్ ధరలపై ఒత్తిడి మరికొంత కాలం కొనసాగవచ్చని పేర్కొంది. ‘‘విడిభాగాల ధరలు ఆకస్మికంగా పెరిగినప్పుడు కంపెనీలు సాధారణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ధరలను పెంచకుండా మార్జిన్‌ను వదులుకోవడం లేదా మార్జిన్‌ను కాపాడుకోవడానికి విక్రయాల పరిమాణాన్ని కోల్పోవడం. అయితే వన్‌ప్లస్ ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడం, విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల ఈ ఒత్తిడిని అధిగమించగలిగింది’’ అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. -
ఇక కార్ల మైలేజీ రయ్!
న్యూఢిల్లీ: శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకుంటూ, పర్యావరణహితమైన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు తదితర ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మైలేజీ నిబంధనలను ప్రకటించింది. మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్–3) రూల్స్‌ని కేంద్ర విద్యుత్ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.వీటి ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో కార్ల కంపెనీలు తాము విక్రయించే మొత్తం వాహనాల సగటు మైలేజీని దాదాపు 16.7 శాతం మేర మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. 2025 ముసాయిదా ప్రతిపాదనలతో పోలిస్తే.. భారీ వాహనాలకన్నా, తేలికపాటి వాహనాలకు మైలేజీ లక్ష్యాల్లో కాస్త సడలింపునివ్వడంతో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు సగటు మైలేజీ లక్ష్యాల విషయంలో మరికాస్త అదనపు వెసులుబాటు ఉంటుంది. మరిన్ని కీలకాంశాలు..2027–28లో 100 కి.మీ.కు 3.996 లీటర్లుగా నిర్దేశించిన సగటు ఇంధన వినియోగం క్రమంగా 2031–32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిన్న, పెద్ద కార్ల వర్గీకరణకు సంబంధించి రిఫరెన్స్ వెయిట్ (బరువు) ను 1,082 కేజీల నుంచి 1,229 కేజీలకు పెంచారు. ఇంధనాన్ని ఆదా చేసే, గుర్తింపు పొందిన టెక్నాలజీల పరిధిని నాలుగు నుంచి పన్నెండుకు పంచారు. స్టార్ట్–స్టాప్ సిస్టమ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మైక్రో–హైబ్రిడ్ సిస్టమ్‌లు, ఎలక్ట్రిక్ వాటర్ పంపులు మొదలైన టెక్నాలజీలకు చోటు కల్పించారు. దీనితో లక్ష్యాల సాధనలో తయారీ సంస్థలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఈ సాంకేతికతలతో వాహనాలు తయారు చేసే సంస్థలు ప్రతి కిలోమీటరుకు 1 గ్రాము మేర కర్బన ఉద్గారాల తగ్గింపును కంపెనీలు క్లెయిమ్ చేసుకోవచ్చు. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇథనాల్లాంటి పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించడం ఈ నిబంధనల లక్ష్యం. పర్యావరణహితమైన, అధునాతన సాంకేతికతలను వేగంగా ప్రవేశపెట్టేందుకు అదనపు ప్రోత్సాహకాలుంటాయి. భారత్‌లో తయారు చేసిన వాహనాలకు, ఇక్కడ విక్రయించేందుకు దిగుమతి చేసుకున్న వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
UAE: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాహనదారులకు ఇంధన ధరల రూపంలో మరోసారి షాక్ తగిలింది. అక్టోబర్ నెలకు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ యూఏఈ ఇంధన ధరల కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అన్ని రకాల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.అక్టోబర్‌లో సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 4.40 దిర్హమ్లకు చేరింది. సెప్టెంబర్‌లో ఇది 3.80 దిర్హమ్‌లుగా ఉండగా.. లీటరుకు 0.60 దిర్హమ్ పెరిగింది. అంటే సుమారు 15.8 శాతం పెరుగుదల. ఇక స్పెషల్ 95 పెట్రోల్ ధర 3.69 దిర్హమ్ల నుంచి 4.28 దిర్హమ్లకు చేరింది. దీంతో లీటరుకు 0.59 దిర్హమ్ పెరగ్గా.. పెరుగుదల సుమారు 16 శాతంగా నమోదైంది.అదేవిధంగా ఈ-ప్లస్ 91 పెట్రోల్ ధర 3.61 దిర్హమ్ల నుంచి 4.21 దిర్హమ్లకు పెరిగింది. లీటరుకు 0.60 దిర్హమ్ పెరగడంతో ఇది 16.6 శాతం పెరిగింది. డీజిల్ ధర కూడా 4.30 దిర్హమ్ల నుంచి 4.80 దిర్హమ్లకు చేరింది. అంటే లీటరుకు 0.50 దిర్హమ్ పెరుగుదలతో 11.6 శాతం అధికమైంది.ప్రపంచ చమురు ధరల ప్రభావంయూఏఈలో ఇంధన ధరలను ప్రతి నెలా సమీక్షించి సవరించే విధానం అమల్లో ఉంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుని వచ్చే నెలకు సంబంధించిన రిటైల్ ధరలను నెలాఖరులో ఇంధన ధరల కమిటీ ప్రకటిస్తుంది. అక్టోబర్ ధరలు కూడా ఈ నెలవారీ ధరల విధానం కిందనే నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.కాగా సెప్టెంబర్‌లో కూడా యూఏఈలో ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా అక్టోబర్‌లో మరింత భారీగా పెరగడంతో వరుసగా రెండో నెలలోనూ వాహనదారులపై ఇంధన భారం పెరిగింది. ఈ-ప్లస్ 91 పెట్రోల్‌లో 16.6 శాతం పెరుగుదల నమోదవడం అక్టోబర్ నెలలో అన్ని ఇంధన రకాలలో అత్యధికం. -
ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంతటితో పోదు!
భారత్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు.. రానున్న రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశాలు పెంచుతున్నాయి. బలమైన ఎల్‌నినో పరిస్థితులు, తగ్గుతున్న నీటి నిల్వలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తికి సవాళ్లు విసరడంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయొచ్చని సిటీ రీసెర్చ్ నివేదిక హెచ్చరించింది.2015 తర్వాత అత్యంత లోటు2026 నైరుతి రుతుపవనాలు దీర్ఘకాలిక సగటు (LPA) కంటే 12 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉందని సిటీ తెలిపింది. దీంతో 2015 ఎల్ నినో సంవత్సరం తర్వాత ఇదే అత్యంత లోటుతో ముగిసే రుతుపవనాల సీజన్ అవుతుందని పేర్కొంది. సెప్టెంబర్ చివర్లో కురిసిన భారీ వర్షాలు వర్షపాత లోటును కొంతమేర తగ్గించినప్పటికీ.. ఉత్తర, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తాయి. పంట కోతకు సమీపంలో కురిసిన ఈ భారీ వర్షాలు ఇప్పటికే పొలాల్లో ఉన్న ఖరీఫ్ పంటలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవచ్చని సిటీ అభిప్రాయపడింది.దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు విస్తృతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 36 వాతావరణ ఉపవిభాగాల్లో 23 చోట్ల 10 శాతానికి మించి లోటు నమోదైంది. మరో 15 ఉపవిభాగాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉంది. సెప్టెంబర్ 23 నాటికి దేశంలో దాదాపు సగం ప్రాంతం కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సిటీ తెలిపింది. 2023లో ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో ఈ వాటా 30 శాతంగా ఉండగా.. ప్రస్తుతం సుమారు 10 శాతం ప్రాంతాన్ని తీవ్రమైన లేదా అసాధారణంగా పొడి పరిస్థితులు ఉన్న ప్రాంతాలుగా వర్గీకరించినట్లు పేర్కొంది.రబీపై నీటి నిల్వల ప్రభావంఇక ఆందోళన అంతా రబీ సీజన్‌పైకి మళ్లింది. దేశంలోని నీటి రిజర్వాయర్లలో ప్రస్తుతం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో కేవలం 71 శాతం నీరు మాత్రమే ఉన్నట్లు సిటీ నివేదిక వెల్లడించింది. పదేళ్ల సగటు 80 శాతంతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ. 2016 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి అని తెలిపింది.గోధుమల సాగులో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తక్కువ నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే దేశ గోధుమ ఉత్పత్తిలో దాదాపు మూడో వంతు వాటా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడ రిజర్వాయర్లలో నీటి నిల్వలు సుమారు 84 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.బలమైన ఎల్‌నినో.. వేడి ముప్పుమరోవైపు ఈసారి ఎల్‌నినో అసాధారణంగా బలంగా ఉండొచ్చని సిటీ అంచనా వేస్తోంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా ప్రకారం 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ కూడా నినో 3.4 సూచీ 1950లో విశ్వసనీయ పరిశీలనలు ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యంత వెచ్చని స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సిటీ తెలిపింది.వెచ్చని, పొడి శీతాకాలం కొనసాగితే 2027 మార్చి-ఏప్రిల్‌లో పంటలపై వేడి గాలుల (హీట్‌వేవ్) ప్రభావం పెరగొచ్చు. ముఖ్యంగా గోధుమలు, ఇతర రబీ పంటలకు ఇది నష్టం కలిగించే అవకాశం ఉంది. 2022లో వచ్చిన తీవ్ర వేడిగాలులను ఈ సందర్భంగా సిటీ ప్రస్తావించింది. ఆ సమయంలో గోధుమ దిగుబడులు దెబ్బతినడంతో ఆహార ధరలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది.ఉల్లి, పప్పులు, బియ్యంపైనా ఒత్తిడిఇప్పటికే కొన్ని కీలక పంటల్లో ఒత్తిడి కనిపిస్తున్నట్లు సిటీ నివేదిక పేర్కొంది. దేశ ఉల్లి ఉత్పత్తిలో సుమారు 75 శాతం, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు, బియ్యం ఉత్పత్తిలో సగం వాటాను అందించే రాష్ట్రాలు 10 శాతానికి మించిన వర్షపాత లోటును ఎదుర్కొన్నట్లు తెలిపింది.దీంతో ఉల్లి, చక్కెర, బియ్యం, పప్పుధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని సిటీ అంచనా వేసింది. సెప్టెంబర్ వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం స్థాయికి చేరే దిశగా ఉందని పేర్కొంది. సిటీ ఉదహరించిన రోజువారీ ధరల గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. -
రూ.లక్షన్నర కిందే బంగారం.. పెట్రోల్‌తోపాటు వాటర్ సేల్!
ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిభారత్లోకి యాపిల్ పే గ్రాండ్ ఎంట్రీభారత డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘యాపిల్ పే’ సేవలను అధికారికంగా భారతదేశంలో ప్రారంభించింది. దేశంలో ఈ సేవలను అందించేందుకు మొదటి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఆమోదిత వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నేటి నుంచి యాపిల్ పే సేవలను వినియోగించుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిపెట్రోల్తోపాటు వాటర్ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్దేశంలోనే అతిపెద్ద చమురు విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఎసీఎల్) తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన 43,000కు పైగా రిటైల్ అవుట్లెట్ల భారీ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటూ ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిసూచీల నష్టాల బాట.. ఐదు కారణాలుభారతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 22,620 స్థాయికి చేరుకోగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 72,480 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అస్థిరతలు, ఇంధన ధరల తీవ్రత, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
సుభాష్ చంద్ర రుణదాతలకు నోటీసులు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాజాగా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణను అక్టోబర్ 29, 30న చేపట్టనున్నట్లు పేర్కొంది.నేషనల్ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి చెందిన ఐదుగురు సభ్యుల బెంచ్ సెప్టెంబర్ 1న జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ చంద్ర అపిల్లేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేశారు. చంద్ర వ్యక్తిగత దివాలా అంశంపై అంతక్రితం ఆయనకు అనుకూలంగా ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ, చంద్ర ఆస్తులను ఇతరులకు బదలాయించకుండా ఐదుగురు సభ్యుల బెంచ్ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఇదీ చదవండి: ఐపీవో స్ట్రీట్.. 5 కంపెనీల లిస్టింగ్ బాట -
కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ల స్పీడ్!
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాదిలో కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. తాజాగా 5 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో రాయల్ చైన్, ఎవర్బ్రాండ్స్ ఇండియా, జేబీ ఎకోటెక్స్, స్టాక్‌గ్రో, టెక్నోపెయింట్స్ చేరాయి. వివరాలు చూద్దాం..జ్యువెలరీ కంపెనీ బంగారు ఆభరణ తయారీ, విక్రేత రాయల్ చైన్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 850 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 150 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. సాంకేతిక ఆధారిత ఒరిజినల్ డిజైన్ తయారీ(ఓడీఎం)తో బంగారు ఆభరణాలు రూపొందించే కంపెనీ ప్రధాన కస్టమర్లలో జ్యువెలరీ దిగ్గజాలు టైటాన్, కల్యాణ్, పీఎన్ గాడ్గిల్, సెంకో గోల్డ్, కళామందిర్ జ్యువెలర్స్, తంగమాయిల్ తదితరాలున్నాయి. రికో, సార్, అనమిత్ర, ఆలిషాన్, ఇండిగో తదితర సొంత బ్రాండ్లను సైతం కలిగి ఉంది.సబ్వే రెస్టారెంట్లు సబ్వే రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ ఎవర్బ్రాండ్స్ ఇండియా ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 327 కోట్లు కొత్త సబ్వే స్టోర్ల ఏర్పాటుపై వెచ్చించనుంది. మరో రూ. 125 కోట్లు సొంత అనుబంధ సంస్థ కలినరీ బ్రాండ్స్ ఇండియా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. గతంలో కలినరీ బ్రాండ్స్‌గా కార్యకలాపాలు కలిగిన కంపెనీ సొంత బ్రాండు ఫ్రెష్ అండ్ హానెస్ట్కాగా.. సబ్వే, లవజ్జా, దిల్మా బ్రాండ్లను కలిగి ఉంది. స్టాక్‌గ్రో బ్రాండ్‌తో స్టాక్ మార్కెట్ రీసెర్చ్, అడ్వయిజరీ ప్లాట్‌ఫామ్ స్టాక్‌గ్రో మాతృ సంస్థ అసెట్గ్రో ఫిన్‌టెక్ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లమధ్య సమీకరించనుంది. అయితే ఇందుకు గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో ప్రస్తుతం ఇష్యూ వివరాలు అందుబాటులో లేవు. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిధులకు ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: నమో భారత్ రైళ్లలో ట్రిప్ పాస్పెట్ బాటిల్స్ రీసైక్లింగ్ ప్రధానంగా పెట్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేసే జేబీ ఎకోటెక్స్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.29 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 320 కోట్లను కంపెనీతోపాటు, అనుబంధ సంస్థకు చెందిన రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2012లో ఏర్పాటైన కంపెనీ పెట్ బాటిల్స్ రీసైక్లింగ్సహా రీసైకిల్డ్ పెట్ ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని వివిధ ప్యాకేజింగ్‌లలో వినియోగిస్తారు. ఇదీ చదవండి: ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జోరు.. కీలక మైలురాయిపెయింట్స్, కోటింగ్స్ పెయింట్లు, కోటింగ్స్ తయారీ కంపెనీ టెక్నోపెయింట్స్ అండ్ కెమికల్స్ ఐపీవో ద్వారా రూ. 500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 175 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
కొత్త మోడల్ విడుదల రద్దు చేసిన ఓపెన్ఏఐ
ఏఐ పరిశోధనా సంస్థ ఓపెన్ఏఐ తమ ప్రతిష్టాత్మక ఏఐ మోడల్ ‘జీపీటీ-6.1 ఆస్ట్రా’ విడుదలను చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు చేసింది. 2026 అక్టోబరులో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించిన ఈ మోడల్లో తీవ్రమైన సేఫ్టీ, అలైన్మెంట్ లోపాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం అంతర్గత పరీక్షల్లో ఈ మోడల్లో లోపాలున్నట్లు గుర్తించారు.తప్పుదోవ పట్టించే ప్రవర్తనమునుపటి మోడళ్లతో పోలిస్తే ఇది సమాచారాన్ని దాచడం, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడం ఎక్కువైంది. యూజర్లు అనుమతించిన మేరకే పనిచేయడంలో తీవ్రంగా విఫలమైంది. వినియోగదారు అనుమతి లేకుండానే సంక్లిష్టమైన పనులను సొంతంగా పూర్తిచేయడానికి, బయటి నెట్‌వర్క్‌లు, సిస్టమ్‌లను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. ఏఐ పూర్తి చేసిన పనికి సంబంధించి స్పష్టమైన నివేదిక ఇవ్వడంలో విఫలమైందని ఓపెన్ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ హెడ్ జైన్ తెలిపారు.గతంలో కొన్ని అధునాతన ఏఐ ఏజెంట్లు సెక్యూర్ టెస్టింగ్ పరిధులను దాటి అనధికార ప్రభుత్వ పోర్టళ్లను యాక్సెస్ చేయడానికి, మానవ పర్యవేక్షణను దాటవేయడానికి ప్రయత్నించిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్-మానిటరింగ్, బలమైన సాండ్బాక్సింగ్ వ్యవస్థలు సిద్ధమయ్యే వరకు శక్తివంతమైన మోడళ్ల శిక్షణను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
హైదరాబాద్‌కు ‘డోర్‌డాష్’.. 3000 ఉద్యోగాలు
అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ దిగ్గజం ‘డోర్‌డాష్’ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలోనే తొలి డెవలప్మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. ఈ నూతన కార్యాలయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.ఐటీ, గ్లోబల్ కార్యకలాపాలకు ఊతంప్రస్తుతం 500 మంది నిపుణులతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కేంద్రం రాబోయే కొద్ది సంవత్సరాల్లో తన ఉద్యోగుల సంఖ్యను 3,000 మార్కుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ సెంటర్ ప్రధానంగా రెండు విభాగాలపై దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డోర్డాష్కి ఇది మూడో అతిపెద్ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటిగ్రిటీ గ్లోబల్ సర్వీస్ సెంటర్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లకు ఈ కేంద్రం ద్వారా సాంకేతిక సేవలు అందనున్నాయి.హైదరాబాద్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్: మంత్రిప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న డోర్‌డాష్ సంస్థ వృద్ధికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగరానికి దక్కిన గొప్ప గుర్తింపు. ఇది లోకల్ డిజిటల్ కామర్స్, హైపర్‌లోకల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. స్విగ్గీ, జొమాటో వంటి భారతీయ యాప్‌లకు స్ఫూర్తినిచ్చిన డోర్‌డాష్ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం ఇక్కడి ఐటీ ప్రతిభకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
మంగళూరు ఎంఆర్‌పీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు
కర్ణాటకలోని ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారం మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం తీవ్రస్థాయి పేలుడు సంభవించింది. రిఫైనరీ యూనిట్‌లోని బాయిలర్ పేలడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది ఉద్యోగులు గాయపడగా, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.పేలుడు ధాటికి సమీపంలోని జోకట్టె, బాజ్పే, సురత్కల్ సహా పరిసర ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి. కొద్ది దూరంలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అద్దాలు సైతం రాలిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి దట్టమైన పొగలు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీతోపాటు కద్రి, పాండేశ్వర్ ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నాయి.ఈ సంఘటన నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్ యాజమాన్యం, సాంకేతిక నిపుణుల బృందం ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించింది. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బ్రిజేష్ చౌతా, స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రమాద వార్త బయటకు రావడంతో ఎంఆర్‌పీఎల్ షేర్ల విలువ ఒకేసారి 5 శాతం వరకు క్షీణించింది.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
సూచీల నష్టాల బాట.. ఐదు కారణాలు
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 22,620 స్థాయికి చేరుకోగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 72,480 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అస్థిరతలు, ఇంధన ధరల తీవ్రత, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.ఇటీవల సూచీలు పతనమవ్వడానికి కారణాలు(అంచనా)క్రూడ్ ఆయిల్ ధరల మంటమిడిల్ఈస్ట్ ప్రాంతంలో ఇరాన్-అమెరికా మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో నౌకాయాన మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పునప్రారంభం, కాల్పుల విరమణ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించడంతో ఉద్రిక్తతలు ముదిరిపోయాయి. ఫలితంగా ముడి చమురు (బ్రెంట్ క్రూడ్) ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి సమీపిస్తూ పీపా (బ్యారెల్) ఇటీవల 104 డాలర్ల మార్కును దాటేశాయి. భారతదేశం తన చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడ్ ఆయిల్ పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచి, స్టాక్ మార్కెట్లలో భయాందోళనలను రేకెత్తించింది.అమెరికా బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలఅమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు మళ్లీ గరిష్ఠ స్థాయికి ఎగబాకడం ఈక్విటీ మార్కెట్లకు పెద్ద సవాలుగా మారింది. యూఎస్ 10-ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 5.2 శాతానికి పైగా నమోదు కాగా 30-ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.5 శాతాన్ని తాకాయి. బాండ్ ఈల్డ్‌లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు ఈక్విటీల కంటే ప్రభుత్వ బాండ్లలో సురక్షితమైన, స్థిరమైన రాబడి లభిస్తుంది. దీనివల్ల రిస్క్ ఉండే ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకుని బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామం నూతన ఇన్వెస్ట్మెంట్లను అడ్డుకోవడమే కాకుండా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలుభారత మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరంతరం అమ్మకాల బాట పట్టడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక సవాళ్లు, అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో వారు భారతీయ ఈక్విటీల నుంచి పెద్దమొత్తంలో లాభాలు స్వీకరిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నెట్ సెల్లర్లుగా మారి విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్‌ను పూర్తిగా నిలబెట్టలేకపోయాయి. ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.రూపాయి విలువ పతనండాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలపడటం, చమురు దిగుమతి వ్యయం పెరగడంతో రూపాయి విలువ పడిపోయింది. బలహీనపడిన రూపాయి దేశీయ కంపెనీల దిగుమతి వ్యయాన్ని పెంచి వారి లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, దిగుమతి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే పాలసీ సమావేశాల్లో వడ్డీ రేట్ల కోత విరామం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మార్కెట్‌ను నిరాశపరిచింది.గ్లోబల్ మార్కెట్ల మందగమనంఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు నిఫ్టీలో అత్యంత కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో భారీగా విక్రయాలు జరగడం నిఫ్టీని 22,620 వద్దకు దిగజార్చింది.ఇప్పుడేం చేయాలి?రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహం ఆధారంగానే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని రెలిగేర్, జియోజిత్ ఆర్థిక విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ అస్థిరతల సమయంలో అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన షేర్లపై దృష్టి సారించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యూహాత్మక అడుగులు
టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియ వ్యాపార వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. టాటా సన్స్ హ్యాండిల్ చేస్తున్న కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (సీఐసీ) హోదాను వదులుకునేందుకు ఆర్బీఐ ఇటీవల అంగీకరించకపోవడంతో టాటా సన్స్ ఐపీఓకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దాదాపు 18.37 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ చర్యలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.రూ.25,000 కోట్ల ఆఫర్టాటా సన్స్ లిస్టింగ్‌ను నివారించే ఉద్దేశంతో ఎస్పీ గ్రూప్ ఛైర్మన్ షాపూర్ మిస్త్రీ 3 శాతం వాటాను దాదాపు రూ.25,000 కోట్లకు తిరిగి టాటా సన్స్‌కే విక్రయించేందుకు ప్రతిపాదన తెచ్చారు. అయితే, టాటా సన్స్ బోర్డు 4:1 మెజారిటీతో ఈ బైబ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించింది. ఫలితంగా, టాటా సన్స్ లిస్టింగ్ అనివార్యమైంది. ఐపీఓ ప్రతిపాదనను స్వాగతిస్తూ షాపూర్ మిస్త్రీ ‘ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాల నేపథ్యంలో టాటా సన్స్ లిస్టింగ్ అనేది వాటాదారులు, ట్రస్టుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇది పారదర్శకతకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.రుణాల ఒత్తిడి.. ఎస్పీ గ్రూప్ వ్యూహంగత కొన్నేళ్లుగా ఎస్పీ గ్రూప్‌పై తీవ్రమైన రుణ భారం ఉంది. ఈ గ్రూప్ రుణాల విలువ దాదాపు రూ.60,000 కోట్లుగా అంచనా. ఇటీవలే ఎస్పీ గ్రూప్ రూ.15,100 కోట్ల ప్రైవేట్ క్రెడిట్ బాండ్లను 18.95% అధిక వడ్డీ రేటుతో సేకరించింది. టాటా సన్స్‌లోని తమ వాటాను తదనుగుణంగా సెక్యూరిటీగా కూడా ఉంచింది. సెప్టెంబర్ చివరినాటికి రూ.3,500 కోట్ల రుణాన్ని చెల్లించగా రాబోయే రోజుల్లో మిగిలిన చెల్లింపులు చేయాల్సి ఉంది.విశ్లేషకుల ప్రకారం, ప్రస్తుతం టాటా సన్స్ విలువ రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎస్పీ గ్రూప్ వద్ద ఉన్న 18.37% వాటా విలువ రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ పబ్లిక్ లిస్టింగ్ పూర్తయితే ఎస్పీ గ్రూప్‌నకు కావాల్సిన లిక్విడిటీ లభించి తమ రుణాల భారాన్ని సులువుగా తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
మానవ నమ్మకాలతోనే సైబర్ దాడి!
సైబర్ నేరాలు ఇక కేవలం సాంకేతిక పరిజ్ఞానాల మధ్య పోరాటం కాదని, అవి మానవ నమ్మకం, ఆలోచనా సరళి, మన ప్రవర్తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడిగా మారాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాదాపూర్‌లోని ఓ హోటల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ పోలీసు శాఖల భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మానవ నమ్మకాలు ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల ఆర్థిక నష్టాల్లో దాదాపు 60 శాతం నష్టాలు స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వల్లే జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. బాధితుల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ వారిలో నమ్మకం కలిగించి డబ్బులు బదిలీ చేసేలా వియత్నాం, మయన్మార్, కాంబోడియా వంటి విదేశాల నుంచి ఈ సైబర్ ముఠాలు కాల్ సెంటర్ల ద్వారా నెట్వర్క్ నడుపుతున్నాయని స్పష్టం చేశారు. అయితే, అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని, గత రెండేళ్లలో తెలంగాణ పోలీసు శాఖ రూ.455 కోట్ల బాధితుల సొమ్మును రికవరీ చేయగలిగిందని తెలిపారు. ‘ఏమీ తెలియదనే అమాయకత్వం మిమ్మల్ని కాపాడదు. ఆలోచించి, అన్ని అంశాలు సరిచూసుకున్నాకే ముందడుగు వేయాలి’ అని సూచించారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సైబర్ లా నిపుణులు పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధపై అతిగా ఆధారపడటం మానవ మేధస్సును క్షీణింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ చిన్న విషయానికి ఏఐని సంప్రదించి మానవ ఆలోచనా శక్తిని తగ్గించుకోకూడదని హెచ్చరించారు. ఏఐ డీప్‌ఫేక్‌ల నిరోధానికి దేశంలో తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ‘కోర్టుల్లో ఏఐ వినియోగంపై డ్రాఫ్ట్ నిబంధనలు - 2026’ రూపొందించిందని గుర్తుచేశారు.డీఎస్‌సీఐ అడ్వైజర్ ఎయిర్ వైస్ మార్షల్ దేవేష్ వత్స మాట్లాడుతూ.. రామాయణంలోని లక్ష్మణ రేఖయే ప్రపంచంలో మొదటి ఫైర్‌వాల్ అని వ్యాఖ్యానించారు. సైబర్ నిపుణులు జితేన్ జైన్ మాట్లాడుతూ.. ఫోన్ నంబర్లను షాపింగ్ మాల్స్‌లో ఇవ్వొద్దని, ఇది సోషల్ ఇంజినీరింగ్ దాడులకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ అవగాహన వీడియోలు, పోస్టర్లను ఆవిష్కరించారు. 2.95 లక్షల మంది పెన్షనర్లు, మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వీటి ద్వారా అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
పెట్రోల్‌తోపాటు వాటర్ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్
దేశంలోనే అతిపెద్ద చమురు విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఎసీఎల్) తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన 43,000కు పైగా రిటైల్ అవుట్లెట్ల భారీ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటూ ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది.ఇంధనేతర ఆదాయమే ప్రధాన లక్ష్యంఐఓసీఎల్ ప్రస్తుతం వార్షికంగా ఉన్న రూ.200 కోట్ల ఇంధనేతర (నాన్ ఫ్యుయెల్) రాబడిని ఏకంగా రూ.760 కోట్లకు పెంచుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా స్థూల మార్కెట్ విలువను రూ.11,000 కోట్లకు పైగా చేరుకోవాలని భావిస్తోంది. రోజువారీగా దాదాపు 3.2 కోట్లకు పైగా వినియోగదారులు సందర్శించే 19.5 కోట్ల చదరపు అడుగుల ఐఓసీఎల్ అవుట్లెట్ స్పేస్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.హైవే అవుట్లెట్లపై ప్రత్యేక దృష్టిమొత్తం నెట్‌వర్క్‌లో దాదాపు సగం, అంటే 21,435 హైవే అవుట్లెట్లు ఈ వాటర్ బాటిళ్ల విక్రయంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రయాణికులకు తాగునీటి అవసరం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ముందుగా ప్రారంభించి ఆపై అర్బన్, సెమీ-అర్బన్ బంకులకు విస్తరించనున్నారు. ప్రారంభంలో 250 ఎంఎల్, 500 ఎంఎల్, ఒక లీటర్ పెట్ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో ప్రీమియం వాటర్, నేచురల్ మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఫంక్షనల్ హైడ్రేషన్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది.అగ్రిగేటర్ల భాగస్వామ్యంఈ బిజినెస్ మోడల్ కోసం ఐఓసీఎల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) దాఖలు చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, సప్లై చైన్, లాజిస్టిక్స్ బాధ్యతలను మల్టీ-ఇయర్ మోడల్లో ఎంపిక చేసిన అగ్రిగేటర్లు చూసుకుంటారు. అయితే, బ్రాండ్ యాజమాన్యం, ప్రొడక్ట్ ప్రైసింగ్, డీలర్ మార్జిన్లపై పూర్తి నియంత్రణ మాత్రం ఐఓసీఎల్ వద్దే ఉంటుంది.భారీ మార్కెట్ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, భారతదేశ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ 2025 నాటికి రూ.32,040 కోట్లకు చేరగా 2032 నాటికి ఇది రూ.57,850 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే హెచ్‌యూఎల్, డాబర్, పీవీఆర్ వంటి దిగ్గజాలతో భాగస్వామ్యం కలిగిన ఐఓసీఎల్ తాజా నిర్ణయంతో ప్యాకేజ్డ్ వాటర్ రంగంలో తన మార్కెట్ వాటాను గణనీయంగా దక్కించుకునేందుకు చర్యలు చేపడుతోంది.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
కేంద్రం కొత్త కేఫ్-3 నిబంధనలు
దేశంలో వాహన ఉద్గారాలను తగ్గించి ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడో విడత కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్-3) నిబంధనలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలపరిమితితో అమల్లోకి రానున్న ఈ నిబంధనలు ఆటోమొబైల్ తయారీ సంస్థలకు నూతన సవాళ్లతో పాటు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.కఠినతరమైన ఇంధన వినియోగ లక్ష్యాలునూతన కేఫ్-3 నిబంధనల్లో కార్బన్ ఉద్గారాల పరిమితులను కేంద్రం గణనీయంగా కుదించింది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలై ఏటా ఈ లక్ష్యాలు మరింత కఠినతరం కానున్నాయి. కార్పొరేట్ ఫ్లీట్ సగటు ఇంధన వినియోగాన్ని లెక్కిస్తూ కేవలం ఒక్కో మోడల్ కాకుండా కంపెనీ తయారుచేసే లేదా దిగుమతి చేసుకునే మొత్తం వాహనాల సగటు ఉద్గారాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. గడువు ముగిసే నాటికి పర్యావరణహిత ప్రమాణాలు మరింత గరిష్ఠ స్థాయికి చేరనున్నాయి.ఈవీలకు భరోసాఈ నిబంధనల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను క్రెడిట్ లెక్కింపు కోసం ఒక వాహనాన్ని మూడింతలుగా (3x సూపర్ క్రెడిట్) పరిగణిస్తారు. అలాగే ప్లగ్-ఇన్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు 2.5x వరకు, ఇతర స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లకు 1.6x వరకు వెయిటేజీ వర్తిస్తుంది. దీనివల్ల ఈవీలు, హైబ్రిడ్ మోడళ్లను ఎక్కువగా విక్రయించే కంపెనీలు సులభంగా క్రెడిట్లు పొంది తమ ఫ్లీట్ సగటు ఉద్గార లక్ష్యాలను చేరుకునే వెసులుబాటు లభిస్తుంది.బయోఫ్యూయల్‌కు వెసులుబాటుఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈ20+), బయో-సీఎన్జీ వంటి జీవ ఇంధనాలను ఉపయోగించే వాహనాలకు కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్ల ద్వారా ఉద్గార తగ్గింపు ప్రయోజనాన్ని అందించనున్నారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ వంటి ఇంధన పొదుపు సాంకేతికతలకు కూడా అదనపు వెసులుబాటు కల్పించారు. ఏడాదికి 1,000 కన్నా తక్కువ వాహనాలు ఉత్పత్తి చేసే చిన్న తయారీదారులకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
భారత్‌లోకి యాపిల్ పే గ్రాండ్ ఎంట్రీ
భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘యాపిల్ పే’ సేవలను అధికారికంగా భారతదేశంలో ప్రారంభించింది. దేశంలో ఈ సేవలను అందించేందుకు మొదటి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఆమోదిత వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నేటి నుంచి యాపిల్ పే సేవలను వినియోగించుకోవచ్చు.యాపిల్ వ్యూహాత్మక అడుగుతో ఐఫోన్ (ఐఫోన్ ఎక్స్ఆర్ లేదా ఆపై మోడళ్లు, ఐఓఎస్ 18 ప్లస్), యాపిల్ వాచ్ (సిరీస్ 6 లేదా ఆపై మోడళ్లు, వాచ్ఓఎస్ 11+) వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు లభించింది. వినియోగదారులు తమ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ‘యాపిల్ వాలెట్’ యాప్‌లో లేదా యాక్సిస్ బ్యాంక్ యాప్ ద్వారా సులభంగా అనుసంధానించుకోవచ్చు.భద్రతే ప్రధాన ధ్యేయం..యాపిల్ పే ద్వారా స్టోర్లలో చెల్లింపులు చేసే సమయంలో ఎలాంటి పిన్ లేదా ఓటీపీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఐఫోన్లో ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో ఆథెంటికేషన్ పూర్తి చేసి పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌కు ఫోన్‌ను సమీపంలో ఉంచడం ద్వారా క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతాయి.భద్రత పరంగా యాపిల్ అత్యాధునిక టోకనైజేషన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది(టోకనైజేషన్ అనేది మీ సున్నితమైన వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని, ముఖ్యంగా క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు నెట్‌వర్క్‌లో భద్రంగా ఉంచడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక డిజిటల్ భద్రతా సాంకేతికత). అసలు కార్డ్ నంబర్లు టూల్లో గానీ, యాపిల్ సర్వర్లలో గానీ స్టోర్ కావు. ప్రతీ లావాదేవీకి ఎన్‌క్రిప్ట్ చేసిన డివైస్ అకౌంట్ నంబర్ ఉపయోగపడుతుందని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, యాపిల్ పే ద్వారా చెల్లింపులు చేసినప్పటికీ కార్డుపై లభించే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు యథావిధిగా వర్తిస్తాయి.ఏయే ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది?తొలి విడతలోనే బ్లింకిట్, జొమాటో, క్రోమా, టాటా 1ఎమ్జీ, రిలయన్స్ బ్రాండ్స్, కాయోస్, ఇక్సిగో, లీ15, ఇంటర్ఫ్లోరాలతో పాటు యాపిల్ అధికారిక స్టోర్లలో యాపిల్ పే సేవలు అందుబాటులోకి వచ్చాయి. జస్పే, పేటైమ్, పేయూ, రోజర్‌పే, పైన్ ల్యాబ్స్, క్యాష్‌ఫ్రీ వంటి ప్రధాన పేమెంట్ గేట్వేలతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, మర్చంట్లు ఈ నెట్‌వర్క్‌లో చేరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో విస్తరించిన యాపిల్ పే భారత డిజిటల్ విప్లవంలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
‘బ్యాంకులు పంట రుణాలు వసూలు చేయవద్దు’
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవుతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో రైతులకు ఉపశమనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాల వసూళ్ల కోసం రైతుల ఇళ్లకు వెళ్లవద్దని బ్యాంకులు, పరపతి సంఘాలను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే సారథ్యంలోని ‘కరవు సహాయక క్యాబినెట్ సబ్‌కమిటీ’ ఆదేశించింది. రుణ వసూళ్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసేలా అధికారిక సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా ఆర్బీఐని కోరేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను కమిటీ ఆదేశించింది.రాష్ట్రంలోని మొత్తం 358 తాలూకాలలో 74 శాతానికి పైగా, అంటే 265 తాలూకాల్లో తీవ్ర కరవు పరిస్థితులు దాపురించాయని ప్రభుత్వం వెల్లడించింది. 2016 (2020లో సవరించిన) కరవు నిర్వహణ నియమావళిలోని ‘ట్రిగ్గర్-1’ (25 శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటు, వరుసగా 21 రోజుల పొడి వాతావరణం) ఆధారంగా ఈ తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. మరో 43 తాలూకాలు ‘ట్రిగ్గర్-2’ (పంటల విస్తీర్ణం-నష్టం, భూగర్భ జలాలు, జలాశయాల నీటిమట్టం ఆధారంగా) పరిధిలోకి వస్తున్నాయని, వీటికి జాప్యం లేకుండా వెంటనే జీవో జారీ చేయాలని ఐఏఎస్ అధికారిణి వినీతా వేద్ సింఘాల్ పేర్కొన్నారు.తీవ్ర నీటి ఎద్దడి.. భవిష్యత్తు కార్యాచరణపట్టణ ప్రాంతాల్లో 10% నీటి సరఫరా కోత విధించాలని, ప్రస్తుతం సేకరించిన నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు లభ్యమయ్యేలా బఫర్ స్టాక్‌గా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 560 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తుండగా రాబోయే 10 నెలల పాటు మంచినీరు, పశువుల మేత కొరత రాకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తీవ్ర నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గృహ, వాణిజ్య నిర్మాణ అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే సూచించారు. సరస్సుల చుట్టూ జరిగే నీటి దొంగతనాలను అరికట్టేందుకు విద్యుత్తు కనెక్షన్లు తొలగించాలని మంత్రి గిరీష్ మహాజన్ ఆదేశించారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అక్కడక్కడే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:44 సమయానికి నిఫ్టీ(Nifty) 6 పాయింట్లు పడిపోయి 22,710 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు పుంజుకొని 72,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.38బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 96.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.17 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.09 శాతం నష్టపోయింది.Today Nifty position 30-09-2026(time: 09:44 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదానీ కేసును క్లోజ్ చేసిన సెబీ
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వినోద్ అదానీపై కేసును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్‌షోర్ ఫండ్స్‌ను నియంత్రిస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలియజేసింది. డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి సోదరుడైన వినోద్ ఆఫ్‌షోర్ ఫండ్స్ ద్వారా నాలుగు గ్రూప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారన్న అభియోగాలు రుజువుకాలేదని స్పష్టం చేసింది.వినోద్ అదానీతోపాటు మరో 11మందిపై అక్రమాల ఆరోపణ కేసును ఉపసంహరిస్తున్నట్లు 81 పేజీల తుది ఆదేశాలలో సెబీ పేర్కొంది. రెండు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్స్(ఈఐఎఫ్ఎఫ్), ఈఎం రిసర్జెంట్ ఫండ్(ఈఎంఆర్) పెట్టుబడి నిర్ణయాలను వినోద్ ప్రభావితం చేయలేదని తమ దర్యాప్తులో తేలినట్లు వివరించింది. అంతేకాకుండా అదానీ పవర్లో ఒపల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి నిర్ణయాలలోనూ వినోద్ పాత్ర ఉన్నట్లు వెల్లడికాలేదని సెబీ హోల్‌టైమ్ సభ్యులు కమలేష్ చంద్ర వార్ష్నీ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం? -
మళ్లీ డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు!
ఇంధన సరఫరా, రీటైల్ నెట్ వర్క్‌లపై ఒత్తిడి నెలకొనడంతో జియో–బీపీ, నయారా సంస్థలు డీజిల్ అమ్మకాలపై పరిమితులు విధించాయి. రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ.40 వరకు వ్యత్యాసం ఏర్పడటంతో పారిశ్రామిక, హోల్‌సేల్ (బల్క్) వినియోగదారులు పెట్రోల్ బంకుల వైపు మళ్లుతున్నారు. రిటైల్ బంకుల్లో డీజిల్ చౌకగా లభిస్తుండటంతో ఫ్యాక్టరీలు, టెలికం కంపెనీలు, హోటళ్లు, మాల్స్, డేటా సెంటర్లు, ఆసుపత్రులు పెద్ద మొత్తంలో డీజిల్‌ను అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంకుల్లో డీజిల్ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.ఈ నేపథ్యంలో జియో–బీపీ ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 50 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయిస్తోంది. నయారా ఎనర్జీ అవుట్లెట్లలో ఈ పరిమితి 70 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు ఉంది. కాగా, ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇండియన్ ఆయిల్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కూడా డీజిల్ అమ్మకాలపై పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో మొత్తం 1.04 లక్షల పెట్రోల్ పంపులు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ప్రభుత్వ రంగ సంస్థల ఆదీనంలో ఉన్నాయి. ఐఓసీకి 43,289, బీపీసీఎల్‌కు 25,587, హెచ్‌పీసీఎల్‌కు 25,238 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రష్యా మద్దతు ఉన్న నయారా ఎనర్జీకి 7,105 అవుట్లెట్లు, రిలయన్స్–బీపీ భాగస్వామ్య జియో–బీపీకి 2,227 పంపులు ఉన్నాయి.లీటరుకు రూ.40 ధరల వ్యత్యాసం ఎందుకంటే..?అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పెరిగినప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే క్రమంలో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ ఏడాది మే నుంచి మారలేదు. అయితే హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు, టెలికాం టవర్లు, డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేసే ‘బల్క్ డీజిల్’ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెరిగాయి. దీంతో బల్క్ డీజిల్‌తో పోలిస్తే సాధారణ పెట్రోల్ పంపుల్లో లభించే డీజిల్ లీటరుకు ఏకంగా రూ.40 వరకు చవకగా మారింది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని పారిశ్రామిక వినియోగదారులు తమకు అవసరమైన డీజిల్‌ను సాధారణ పెట్రోల్ పంపుల నుంచి ఒకేసారి 400 నుంచి 600 లీటర్ల చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో బంకులో డీజిల్ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ప్రతి బంకుకు పరిమిత నిల్వ సామర్థ్యం ఉండటంతో పాటు కొత్తగా ఇంధన సరఫరా రావడానికి కనీసం రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. భారీ కొనుగోళ్ల కారణంగా నిల్వలపై ఒత్తిడి పెరగడంతో జియో–బీపీ, నయారా సంస్థలు రోజువారీ డీజిల్ అమ్మకాలపై పరిమితులు విధించక తప్పలేదు.భారీ కొనుగోళ్లతో పరిమితులుసాధారణ వాహనదారులతో పోలిస్తే బల్క్ వినియోగదారులు పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయడంతో పెట్రోల్ బంకుల్లో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. కొత్తగా ఇంధన సరఫరా రావడానికి కనీసం రెండు రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. సాధారణ వాహనదారులకు ఇంధన లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా జియో–బీపీ, నయారా కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. ‘‘మా అవుట్లెట్లలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. అయితే పరిశ్రమలు, ఇతర రవాణాయేతర రంగాల నుంచి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ దృష్ట్యా.. రవాణా అవసరాలకు ఆటంకం కలగకుండా డీజిల్ అందరికీ సమానంగా లభించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం’’ అని జియో–బీపీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. బల్క్, రిటైల్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఇలాగే కొనసాగితే.. రిటైల్ బంకులపై సరఫరా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం? -
స్పామర్స్పై ట్రాయ్ కొరడా
స్పామ్ కాల్స్‌ని కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా, వినియోగదారులు ప్రత్యేకంగా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేకుండా, అలాంటి స్పామర్స్ని సొంత ఏఐ ఆధారిత కాలర్ ఐడీ సిస్టం ద్వారా గుర్తించి, తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. దీనికి సంబంధించి సవరించిన టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ నిబంధనల నోటిఫికేషన్ ప్రకారం స్పామర్‌గా గుర్తించిన వారి వివరాల ధ్రువీకరణ (కేవైసీ) ప్రక్రియను టెల్కోలు మళ్లీ మొదటినుంచి చేపట్టాల్సి ఉంటుంది.నిబంధనలను అతిక్రమించే వారి ఫోన్ కనెక్షన్‌ను అవసరమైతే డిస్కనెక్ట్ చేయాలి. పరిస్థితిని బట్టి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు కూడా చేయాలి. గెజిట్ నోటిఫికేషన్ అనంతరం, సవరించిన నిబంధనలు 60–90 రోజుల వ్యవధిలో దశలవారీగా అమల్లోకి వస్తాయి. నిబంధనల ప్రకారం ఏదైనా ఇన్కమింగ్ కాల్‌ను ఏఐ ‘అనుమానాస్పద స్పామ్’ అని గుర్తించిన పక్షంలో దాన్ని అందుకున్న టెలికం సంస్థ, ఆ కాల్‌ను పంపిన టెల్కోకు (ఓఏపీ) వివరాలను అందించాల్సి ఉంటుంది. స్పామ్ కాల్ని గుర్తించిన రెండు గంటల వ్యవధిలో ఇది జరగాలి. సదరు ఓఏపీ, తమకు ఫిర్యాదు వచ్చిన ఒక్క రోజు వ్యవధిలో ఆ కాల్ చేసిన వారి కేవైసీ వివరాలను ఇతర టెలికం ఆపరేటర్లతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత టెల్కోలన్నీ కూడా గత పది రోజుల వ్యవధిలో సందేహాస్పద స్పామర్తో కనెక్ట్ అయి ఉన్న ఇతర కనెక్షన్లేవైనా ఉన్నాయేమో తమ తమ సిస్టమ్‌లలో పరిశీలించాలి. అయిదు లేదా అంతకు మించి సీఎల్ఐలను (కాల్డ్ లైన్ ఐడెంటిఫికేషన్) గుర్తించిన పక్షంలో అన్ని ఓఏపీలు కలిసి చర్య తీసుకోవాలి. నిబంధనల ప్రకారం మొదటి ఉల్లంఘనకు స్పామర్కి అన్ని టెల్కోలు 15 రోజుల పాటు సేవలు నిలిపివేస్తాయి. తదుపరి మళ్లీ ఉల్లంఘిస్తే సిమ్‌లు మొదలైన వాటిని ఏడాది పాటు డిస్కనెక్ట్ చేస్తాయి. ఈ వ్యవధిలో ఆ స్పామర్ను అన్ని టెల్కోలు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి, కొత్తగా ఎలాంటి టెలికం వనరులను ఇవ్వవు. అయితే, అత్యవసర సేవలకు మినహా ఔట్‌గోయింగ్ సేవలు ఉండని టెలిఫోన్ నంబరు మాత్రం ఇస్తాయి. కాల్ బ్లాకింగ్..కాల్ మేనేజ్మెంట్ యాప్‌లు కాకుండా వినియోగదారులు తమ సొంత విచక్షణ మేరకు కాల్స్‌ని బ్లాక్ చేసేందుకు ఉపయోగపడే ఆప్షన్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీలకు చెందిన టెలీమార్కెటింగ్ కాల్స్‌ని వద్దనుకుంటే, 1909 నంబరుకు బ్లాక్ ప్రొమో(BLOCK PROMO) అనే కోడ్‌ని పంపించాలి. దీనివల్ల వాణిజ్యపరమైన, ప్రభుత్వపరమైన లావాదేవీలు, సర్వీసులకు సంబంధించిన కాల్స్‌కి ఎలాంటి ఆటంకం ఉండదు.ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం? -
రూ. లక్షన్నర దిగువకు పసిడి
న్యూఢిల్లీ: అమెరికా డాలర్ బలోపేతం కావడం, స్థానికంగా డిమాండ్ మందగించడంతో దేశ రాజధానిలో పసిడి ధర రెండు నెలల తర్వాత మళ్లీ రూ.1.50 లక్షల దిగువకు దిగొచ్చింది. మంగళవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర మరో రూ.1,400 తగ్గి రూ.1,48,600కు చేరింది.ఈ ఏడాది జూలై 31 (రూ.1,48,300) తర్వాత పసిడి మళ్లీ ఈ కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మరోవైపు, కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2.32 లక్షల వద్దే స్థిరంగా ముగిసింది. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఏడు వారాల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 30.34 డాలర్లు (సుమారు ఒక శాతం) పెరిగి 4,145.26 డాలర్లకు చేరింది. -
60 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. 2047 నాటికి 60.4 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం దిగుమతులపరమైన సవాళ్లను పరిష్కరిస్తూ, పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంపొందించడంపై ఫోకస్ చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త జాతీయ ఉక్కు విధానంపై (ఎన్ఎస్పీ) కసరత్తు జరుగుతోందని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు.సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారం రోజుల్లో ఎన్ఎస్పీని బహిరంగపర్చనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం సుమారు 22 కోట్ల టన్నులు. ఉత్పత్తి పెంపునకు, అలాగే అందులో స్పెషల్ స్టీల్, వేల్యూ యాడెడ్ ఉక్కు వాటాను పెంచేందుకు ఉపయోగపడే ప్రణాళిక ఎన్ఎస్పీలో ఉండనుంది. ఎంఎస్ఎంఈలకు రూ.5,000 కోట్లతో పథకంకర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా కార్యకలాపాలను నిర్వహించుకునేలా చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) ఉక్కు యూనిట్లను ప్రోత్సహించేందుకు ’వికసిత్ భారత్ ఇస్పాత్’ పేరిట రూ. 5,000 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కూడా రూపొందిస్తున్నట్లు సందీప్ తెలిపారు. పెద్ద సంస్థల కోసం త్వరలోనే సీసీటీఎస్ (కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్)ను ప్రకటించనున్నట్లు వివరించారు. నాణ్యత లేని చౌక దిగుమతులను కట్టడి చేస్తూ, దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పించేలా సేఫ్‌గార్డ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ మొదలైనవన్నీ కొత్త పాలసీలో ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఎగుమతుల రంగంలో పోటీతత్వమనేది విదేశీ మారకాన్ని ఆర్జించడానికే కాకుండా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యాలను పెంపు, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ప్రపంచ దేశాల రక్షణాత్మక వైఖరుల మధ్య కూడా భారత్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య 11% వృద్ధి చెందాయని చెప్పారు. -
అమెరికాలో ఎస్సార్ మెగా స్టీల్ ప్లాంట్!
వాషింగ్టన్: భారతీయ వ్యాపార దిగ్గజం ఎస్సార్ గ్రూప్ అమెరికాలో భారీ ఉక్కు ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.72 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఎస్సార్‌లో భాగమైన మెసాబీ మెటాలిక్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ప్రణాళికల్లో భాగంగా అయోవా రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్లతో స్టీల్ కాంప్లెక్స్‌ను, 3 బిలియన్ డాలర్లతో మినెసోటాలో ముడి ఇనుము గని, పెలెట్ల ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ‘అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఉక్కు ప్లాంటు’గా ఉంటుందన్నారు. ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ రవి రూయా, ఆయన కుమారుడు.. మెసాబీ మెటాలిక్స్ చైర్మన్ రేవంత్ రూయాతో కలిసి ట్రంప్ ఈ మేరకు ప్రకటించారు. ’అమెరికా ఉక్కు రంగానికి, మా సంస్థకు ఇదొక కీలక మైలురాయి. మేము సమగ్ర ఉక్కు వ్యాపారాన్ని నిర్మిస్తున్నాం. మినెసోటాలోని ముడి ఇనుమును అయోవాలో ప్లాంటుతో అనుసంధానించడం ద్వారా 100 శాతం అమెరికన్ ఉక్కును ఉత్పత్తి చేస్తాం’ అని రేవంత్ రూయా ఈ సందర్భంగా చెప్పారు. భారత్, అమెరికా మధ్య ఆర్థిక బంధాలు బలోపేతం కావడానికి కూడా ఈ పెట్టుబడులు దోహదపడతాయని రవి రూయా పేర్కొన్నారు. దేశీయంగా పరిశ్రమకు ఊతమిచ్చే లక్ష్యంతో ఉక్కు దిగుమతులపై ట్రంప్ 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎస్సార్ గ్రూప్ పెట్టుబడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టారిఫ్‌లు కట్టడం ఇష్టం లేక ఇప్పుడు అందరూ ఇక్కడ ప్లాంట్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు’ అని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు.10 మిలియన్ టన్నుల సామర్థ్యం.. వైట్‌హౌస్, మినెసోటా కేంద్రంగా పనిచేసే మెసాబి మెటాలిక్స్ వర్గాల ప్రకారం ప్రతిపాదిత ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులుగా ఉంటుంది. 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కనీసం 1,750 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 8,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి పదేళ్లలో 95 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక కార్యకలాపాలకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మినెసొటా గని నుంచి ఏటా 7.5 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి అవుతుందని, పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యాక 350 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. ఇది అమెరికాలో గత 50 ఏళ్లలో నిర్మించిన తొలి గని కానుంది. 1969లో భారత్‌లో ఏర్పాటైన ఎస్సార్ గ్రూప్‌నకు మెటల్స్, మైనింగ్, ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, రిటైల్ తదితర రంగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 30 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. -
ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!
రెండు రోజులుగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇది పసిడి ప్రియులకు తప్పకుండా ఊరటను ఇస్తుంది. ఈ కథనంలో గోల్డ్ రేటు ఎంత తగ్గింది?, రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.3880 తగ్గి రూ.1,48,800 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.1,36,400 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉంటాయి.చెన్నైలో కూడా బంగారం ధర భారీగానే తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రెండు రోజుల్లో రూ.3930 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3600 తగ్గింది. ప్రస్తుతం ధరలు రూ.1,48,800 (24 క్యారెట్స్), రూ.1,36,400 (22 క్యారెట్స్) వద్ద నిలిచాయి.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3880 తగ్గి రూ.148950 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.136550 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు కూడా హైదరాబాద్, విజయవాడలలో రూ.10వేలు (రెండు రోజుల్లో) తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. చెన్నై, ఢిల్లీలలో కూడా కేజీ వెండి రేటు రూ.2.40 లక్షల వద్దనే ఉంది.ధరలు తగ్గుతాయా?ప్రస్తుతం బంగారం రేట్లు తగ్గి.. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, రానున్నది పండుగ సీజన్. ఈ సమయంలో పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు కూడా మళ్లీ పెరిగవచ్చని నిపుణులు అంచనా.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే? -
AI కంపెనీలకు ఉర్వశి రౌతేలా టీమ్ వార్నింగ్!
సినీ తారల ఫోటోలు, వీడియో క్లిప్స్ వంటి వాటిని కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సర్వ సాధారణం. దీనికోసం సెలబ్రిటీల అనుమతి తీసుకుంటారు. అయితే.. నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఓ కంపెనీ ఉపయోగిస్తోందని ఆమె టీమ్ ఆరోపించింది. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.రూ.7000 కోట్ల పరిహారంఉర్వశి టీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కంపెనీ ఆమె పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తోంది. వీటి ద్వారా ఆ కంపెనీ భారీగా వాణిజ్య ప్రయోజనం పొందిందని టీమ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా ప్రస్తుతం రూ.7,000 కోట్లు ఇవ్వాలని వెల్లడించింది.ఉర్వశి టీమ్ హెచ్చరికఈ సందర్భంగా ఏఐ కంపెనీలకు కూడా ఉర్వశి టీమ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఏఐ కంపెనీని నడుపుకోవచ్చు, తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఉర్వశి పేరు, ఫొటోలు, వీడియోలు లేదా ఆమె గుర్తింపును అనుమతి లేకుండా తమ వ్యాపారంలో ఉపయోగించకూడదని తెలిపింది.ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు, గొంతులను ఉపయోగించి కొత్త కంటెంట్ తయారు చేయడం సులభంగా మారింది. అయితే.. ఇలాంటి కంటెంట్‌ను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వల్ల న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?గతంలో ఇలా..ఉర్వశి రౌతేలా గతంలో కూడా ఏఐ ద్వారా తయారు చేసిన ఓ ఫొటోపై స్పందించింది. ఆ ఫొటోలో ఆమె ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపికా పదుకొణె ముందు మోకాళ్లపై ఉన్నట్లుగా చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలను ఒకరితో ఒకరిని పోల్చుతూ ఇలాంటి కంటెంట్ తయారు చేయడం ఆపాలని కోరింది. View this post on Instagram A post shared by Team UrvashiRautelaGlobal (@teamurvashirautelaofficial) -
కార్పొరేట్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంపు
కంపెనీలు ఐటీఆర్ ఫైలింగ్‌తోపాటు.. ఆడిట్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ తాజాగా 21 రోజుల అదనపు గడువును ఇచ్చింది. దీంతో 2026–27 అసెస్మెంట్ ఏడాదికిగాను కార్పొరేట్లకు నవంబర్ 21వరకూ గడువును పెంచింది. ప్రస్తుతం అక్టోబర్ 31లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయవలసి ఉంది. ఇదేవిధంగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు సైతం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21కు గడువును పెంచింది.ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ ఆడిట్ నివేదిక దాఖలుకు అదనంగా మూడు వారాల గడువును ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ చట్టబద్ధ ఆడిట్ నివేదికసహా ఐటీఆర్ ఫైలింగ్‌కు ట్యాక్స్ ప్రాక్టీషనర్లు గడువు పెంచమంటూ కోరుతున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ తాజాగా సడలింపులకు తెరతీసింది. -
కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?
మొబైల్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది లేకుంటే దాదాపు చాలామందికి రోజు గడవదు. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల.. కరెంట్ లేకపోతే ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా చాలామంది దిక్కుతోచదు. ఈ కథనంలో కరెంట్ లేకపోయినా మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవడానికి సులభమైన మార్గాలు ఏవి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.పవర్ బ్యాంక్కరెంట్ లేని సందర్భాల్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. అయితే.. కరెంట్ ఉన్నప్పుడే పవర్ బ్యాంక్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుకుంటే, కరెంట్ పోయినప్పుడు దానితో మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకే ఇంట్లో ఒక పవర్ బ్యాంక్‌ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.కారును ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చుదాదాపు అన్ని కార్లలోనూ.. యూఎస్బీ పోర్ట్ లేదా మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. దానికి ఫోన్‌ను కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల కారులోని బ్యాటరీ అనవసరంగా ఖాళీ అవ్వదు. అవసరమైనంత సేపు మాత్రమే ఫోన్‌ను కనెక్ట్ చేసి ఉంచడం మంచిది.ల్యాప్‌టాప్ ఉపయోగించండిమన దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే దాని ద్వారా కూడా ఫోన్‌కు కొంత ఛార్జింగ్ ఇవ్వవచ్చు. ల్యాప్‌టాప్‌లో యూఎస్బీ పోర్ట్ ఉంటే, కేబుల్ సహాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేయవచ్చు. ఇది సాధారణ ఛార్జర్ కంటే నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. కానీ అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.పోర్టబుల్ సోలార్ ఛార్జర్గ్రిడ్ అవసరం లేని ఛార్జింగ్ ఎంపికను కోరుకునే వారికి పోర్టబుల్ సోలార్ ఛార్జర్లు కూడా మంచి ఎంపిక. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి. వీటిని స్మార్ట్ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు.కరెంట్ లేని సమయంలో.. ఫోన్ బ్యాటరీని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించాలి. అవసరం లేని వైఫై, బ్లూటూత్ వంటి వాటిని ఆఫ్ చేయాలి. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. వీలైనంత వరకు బ్యాటరీ పూర్తిగా అయ్యే వరకు ఉపయోగించకపోవడం మంచిది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే! -
అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే?
అక్టోబర్ 2026లో పండుగలు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులకు పది రోజుల కంటే ఎక్కువ సెలవులు రానున్నాయి. దుర్గాపూజ, దసరా, విజయదశమి, లక్ష్మీపూజ, కర్వా చౌత్ వంటి పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. పండుగలను బట్టి ఒక్కో రాష్ట్రం, నగరంలో వేర్వేరు తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి.. బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే ముందుగానేసెలవులను చెక్ చేసుకోవడం మంచిది.సెలవుల జాబితాఅక్టోబర్ 2: గాంధీ జయంతి - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 10: మహాలయ అమావాస్య - బెంగళూరు, కోల్‌కతాలో సెలవు. ఇదే రోజు రెండో శనివారం.అక్టోబర్ 17: మహా సప్తమి - అగర్తలలో సెలవు.అక్టోబర్ 19: దుర్గాపూజ / మహాష్టమి / మహానవమి - పలు రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 20: దసరా / విజయదశమి - అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.అక్టోబర్ 21: విజయదశమి / దుర్గాపూజ - అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం మొదలైన ప్రాంతాల్లో సెలవు.అక్టోబర్ 22,23: దుర్గాపూజ / దసైన్ - గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 24: నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.అక్టోబర్ 26: లక్ష్మీపూజ / మహర్షి వాల్మీకి జయంతి / యాక్సెసిబిలిటీ డే - కొన్ని ప్రాంతాల్లో సెలవు.అక్టోబర్ 29: కర్వా చౌత్ - సిమ్లాలో బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి - అహ్మదాబాద్‌లో సెలవు.ఆదివారాలు: అక్టోబర్‌లో వచ్చే అన్ని ఆదివారాల్లో బ్యాంకు శాఖలు సాధారణంగా పనిచేయవు.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు మాత్రమే వాయిదా పడతాయి.ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు? -
ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!
అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారికే మాత్రమే పరిమితం కావు. రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాసులు, గ్రూప్ బుకింగ్స్‌పైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రైల్వే స్టేషన్లతో పాటు.. లోకల్ రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తారు.రాయితీ లేదా ప్రత్యేక కోటాలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ అర్హతను నిరూపించేందుకు తప్పకుండా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలి. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫొటో ఐడీ, గుర్తింపు పొందిన విద్యాసంస్థ ఇచ్చిన విద్యార్థి ఐడీ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. ఫోన్లో ఉన్న ఐడీ ఫొటో లేదా జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్ డాక్యుమెంట్ వెంట ఉంచుకోవడం మంచిది.ఒకే టికెట్‌పై పలువురు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్‌లో టికెట్లో పేరు ఉన్న ప్రయాణికుల్లో కనీసం ఒకరు అవసరమైన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించాలి. అలాగే ఈ-పాస్ లేదా ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (PTO)తో ప్రయాణించే వారు కూడా ఒరిజినల్ ఐడీని వెంట ఉంచుకోవడంతో పాటు, ప్రయాణానికి ముందు వాటిని నిర్దేశించిన 'అథారిటీ టు ట్రావెల్'గా మార్చుకున్నారో లేదో చూసుకోవాలి.టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లు నిజమైనవేనా, వారు ఉపయోగిస్తున్న రాయితీ లేదా కోటాకు అర్హులేనా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తారు. అన్‌రిజర్వుడ్ టికెట్లను కూడా తనిఖీ చేస్తారు. అవసరమైనప్పుడు టికెట్ నిజమైనదా కాదా తెలుసుకోవడానికి టికెట్ చెకింగ్ సిబ్బంది టీటీఈ యాప్‌ను కూడా ఉపయోగించనున్నారు. సరైన టికెట్ లేదా అవసరమైన పత్రాలు లేకపోతే రైల్వే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు? -
రూ.100 కంటే తక్కువ.. జియో రీఛార్జ్ ప్లాన్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. ఈ కథనంలో రూ.100 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రెండు రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.రూ.55 ప్లాన్జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది సాధారణ రీచార్జ్ ప్లాన్ కాదు. ఎందుకంటే.. ఈ వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే యాక్టివ్‌లో ఉన్న ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్ పనిచేయదు.రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ సెట్ హెచ్డీ, సోనీ సబ్ హెచ్డీ వంటి ప్రముఖ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అయితే జియోస్టార్‌కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్లాన్‌లో ఉండవు. తక్కువ ఖర్చుతో మొబైల్లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక.రూ.77 ప్లాన్జియో రూ.77 ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే.సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: పిల్లలు, వృద్ధుల భద్రత కోసం జియోషీల్డ్ -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 242.65 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు లేదా 0.28 శాతం నష్టంతో 22,716.20 వద్ద నిలిచాయి.సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్, మాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హోనసా కన్స్యూమర్ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు?
కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో ఉన్న రేషన్ కార్డుల డేటాను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా కీలక చర్యలు చేపట్టనుంది. గత ఆరు నెలలుగా తమ రేషన్ కార్డుపై ఎలాంటి ఆహార ధాన్యాలను తీసుకోని.. సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.మూడు నెలలు గడువులబ్ధిదారుల పేర్లను డేటాబేస్ నుండి వెంటనే తొలగించరు. వారు నిజమైన లబ్ధిదారులని నిరూపించుకోవడానికి మూడు నెలల సమయం ఇస్తూ, మొదట వారి రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ వ్యవధిలోగా వారు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే, వారి కార్డులను తిరిగి యాక్టివేట్ చేయనున్నట్లు సమాచారం.వినియోగదారు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డును వెంటనే నిలిపివేయదు. అందుకే ముందుగా ధృవీకరణకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.ప్రభుత్వ చర్యకు కారణంనకిలీ, డూప్లికేట్, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న లేదా ప్రస్తుతం అర్హత లేని రేషన్ కార్డులను గుర్తించడానికి ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధమైంది. దీని వల్ల ప్రభుత్వ రేషన్ నిజమైన లబ్ధిదారులకు చేరుతుందని, రేషన్ ధాన్యాల వృధా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం, డిజిటలైజేషన్, ఈ-కేవైసీ వంటి విధానాలను ఉపయోగించి పీడీఎస్ డేటాబేస్‌ను శుభ్రం చేస్తున్నారు.అయితే.. ఈ విధానంపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజేంద్రన్ నారాయణన్ ప్రకారం.. రేషన్ తీసుకోని కారణాన్ని ముందుగా తెలుసుకోకుండా, కార్డును నిలిపివేయడం వల్ల నిజమైన లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, వలసలు లేదా రేషన్ డీలర్‌తో సమస్యల కారణంగా కొంతమంది రేషన్ తీసుకోకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు.మొత్తం మీద.. ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో అనర్హమైన, ఉపయోగంలో లేని కార్డులను తొలగించి వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలని చూస్తోంది. అదే సమయంలో.. నిజంగా అర్హులైన పేదలు పొరపాటున రేషన్ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ ప్రక్రియలో ఈ-కేవైసీతో పాటు లబ్ధిదారుల వాస్తవ పరిస్థితిని కూడా పరిశీలించడం అవసరం.ఇదీ చదవండి: ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్! -
కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?
దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వేగంగా విస్తరిస్తుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ తొలి వారంలో జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన తాజా పోల్‌లో మెజారిటీ ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ధరల సెగగత కొద్ది నెలలుగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ, మారిన పరిస్థితుల దృష్ట్యా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఇంధన ధరల తీవ్రత క్రమంగా విస్తరిస్తుండటంతో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత పరిమితిని దాటి పెరిగే ప్రమాదం ఏర్పడింది.రాయిటర్స్ సర్వేలో పాల్గొన్న 61 మంది సీనియర్ ఎకనామిస్టుల్లో దాదాపు 60 శాతం మంది (38 మంది) ఆర్బీఐ అక్టోబర్ 5-7 తేదీల్లో జరగబోయే సమీక్ష సమావేశంలోనే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది ఆర్థిక వేత్తల అంచనాల్లో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది.రూపాయి ఒత్తిడిప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన ఆర్థిక విధానాలను వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు, విదేశీ కరెన్సీల ప్రభావంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బలమైన ఆర్థిక వృద్ధి నమోదువుతుండటం ఆర్బీఐకి కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ పెరిగిన ధరలను అదుపు చేయకపోతే సామాన్యుడి కొనుగోలు శక్తి దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాధారణ ప్రజలు, ఈఎంఐ చెల్లింపుదారులపై ప్రభావంఆర్బీఐ ఒకవేళ రేట్లను పెంచితే అది బ్యాంకింగ్ వ్యవస్థపై తక్షణ ప్రభావం చూపుతుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకులు కూడా తమ లెండింగ్ రేట్లను పెంచుతాయి. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి నెలవారీ ఈఎంఐలు ప్రియం కానున్నాయి. పొదుపు దారులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంటుంది.నిపుణులు ఏమంటున్నారు?‘దేశంలో ఆహార, ఇంధన సరుకుల విభాగాలు మాత్రమే కాకుండా సాధారణ వస్తువులు, సేవల ధరలు (కోర్ ఇన్ఫ్లేషన్) కూడా పెరగడం ఆందోళనకరం. బలమైన వృద్ధి రేటు నమోదవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ పాలసీని కఠినతరం చేయడానికి సరైన సమయమిదే’ అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, ఈ పెంపు సైకిల్ చాలా వేగంగా కాకుండా పరిమితంగానే ఉంటుందని, రాబోయే నెలల్లో పరిస్థితిని బట్టి ఆర్బీఐ ఎంపీసీ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 7న ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ వెల్లడించే నిర్ణయాలను మార్కెట్ వర్గాలు, బ్యాంకర్లు గమనిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా.. -
సినిమా ఆలస్యం.. హైదరాబాద్ పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జరిమానా!
సినిమా చూసి కాస్త రిలాక్స్ అవుదామని థియేటర్‌కు వెళ్తే.. స్క్రీన్ మీద నిమిషాల తరబడి ప్రకటనలు వేస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఎప్పుడైనా విసుగు చెందారా? ‘అందరూ భరిస్తున్నారు కదా, మనమెందుకు గొడవ పడటం’ అని చాలామంది ఊరుకుంటారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది మాత్రం ఆ ఉదాసీనతను పక్కనపెట్టి చట్టపరంగా పోరాడారు!రాత్రి 10.35 గంటలకు ప్రారంభం కావాల్సిన చిత్రం కోసం టికెట్ బుక్ చేసుకుని వెళ్తే పీవీఆర్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఏకంగా 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలే ప్రదర్శించింది. దీంతో సినిమా ఆలస్యమై లేట్ నైట్ ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఉల్లంఘనపై ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. సంస్థకు రూ.75,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ప్రేక్షకుల సమయాన్ని తేలిగ్గా తీసుకునే థియేటర్ యాజమాన్యాలకు చెక్ పెట్టిన ఈ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.కేసు వివరాలుహైదరాబాద్కు చెందిన ఒక న్యాయవాది 2025 జూన్ 20న రాత్రి 10.35 గంటల షోకు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా చూడటానికి పీవీఆర్ థియేటర్లో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 10.30 గంటలకే థియేటర్‌కు చేరుకుని సీట్లలో కూర్చున్నప్పటికీ సినిమా మాత్రం నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు. వాణిజ్య ప్రకటనలు, ఇతర ట్రైలర్లు ప్రదర్శించడంతో రాత్రి 10.52 గంటలకు (దాదాపు 22 నిమిషాలు ఆలస్యంగా) సినిమా మొదలైంది. దీనివల్ల షో పూర్తయి ఇంటికి చేరేసరికి రాత్రి 2 గంటలకు బదులు 3 గంటలైందని, ఇది తన విశ్రాంతిని, వ్యక్తిగత పనులను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొంటూ ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.ప్రజా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక అవగాహన ప్రకటనలు గరిష్టంగా రెండు నిమిషాలు మాత్రమే ఉండాలి. నియమాలను ఉల్లంఘించి యాడ్స్ వేయడం అనుచిత వ్యాపార ధోరణి కిందకు వస్తుందని ఫిర్యాదుదారు వాదించారు. కాగా, ప్రకటనలు వేయడం తమ వ్యాపార హక్కుఅని పీవీఆర్ సంస్థ సమర్థించుకున్నప్పటికీ కమిషన్ ఆ వాదనను తోసిపుచ్చింది.వినియోగదారుల కమిషన్ తీర్పుకమిషన్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సంస్థకు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం.. ఫిర్యాదుదారునికి ఎదురైన మానసిక ఆందోళన, అసౌకర్యానికి గాను రూ.20,000 పరిహారం చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద రూ.5,000 అందజేయాలి. నిబంధనల ఉల్లంఘనకు గాను రూ.50,000 జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జరిమానా రూపంలో జమ చేయాలి. భవిష్యత్తులో ఈ తరహా అనుచిత వ్యాపార పద్ధతులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో నిర్ణీత సమయాన్ని పాటించకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే యాజమాన్యాలకు ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా.. -
ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జోరు.. కీలక మైలురాయి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అందుబాటులోకి తెచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ కోటి మైలురాయిని దాటేసింది. 2025 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభమైన ఈ పాస్‌కు ప్రైవేట్ వాహన యజమానుల నుంచి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ సోమవారం తెలిపింది.ఫాస్టాగ్ వార్షిక పాస్ కోసం ఒకేసారి రూ.3,075 చెల్లించాలి. ఈ పాస్ ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది. తరచూ ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాల్లో ఈ వార్షిక పాస్ వర్తిస్తుంది.చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ కలిగిన అన్ని వ్యక్తిగత, వాణిజ్యేతర వాహనాలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆ శాఖ తెలిపింది. వార్షిక పాస్ కోసం ఒకేసారి రుసుము చెల్లించిన తర్వాత, వాహనానికి అనుసంధానమైన ప్రస్తుత ఫాస్టాగ్పైనే పాస్ యాక్టివేట్ అవుతుంది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఈ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.ఇదీ చదవండి: ట్రాఫిక్ చలానా కట్టకపోతే ఇంట్లో కరెంట్ కట్! -
ఇన్ఫోసిస్‌లో ‘ఫ్రాంటియర్ ఇంజినీర్’లతో కొత్త శకం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ రాకతో గ్లోబల్ ఐటీ రంగం వేగంగా మారుతోంది. సాంప్రదాయ ఐటీ సర్వీసుల నమూనా నుంచి ఉన్నత స్థాయి సాంకేతిక పరిష్కారాల వైపు ఐటీ పరిశ్రమ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన పనితీరు, మానవ వనరుల నిర్మాణంలో కీలకమైన వ్యూహాత్మక మార్పు చేపడుతోంది.కంపెనీలో మొత్తం 3,20,000 మందికి పైగా ఉన్న ఉద్యోగుల్లో మూడో వంతు (సుమారు 25% నుంచి 33 శాతం) మందిని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన స్పెషలిస్ట్ పాత్రల్లోకి మార్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనితో పాటు ‘ఫ్రాంటియర్ ఇంజినీర్లు’గా పిలిచే 6,000 మంది నిపుణులతో కూడిన ఒక అత్యున్నత సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయనుంది.ఈ నిర్ణయానికి సంబంధించిన ముఖ్యాంశాలుప్రామాణిక కోడింగ్, పర్యవేక్షణ వంటి సాధారణ పనుల స్థానంలో ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నిపుణులను తయారుచేయడమే ఈ రీ-స్కిల్లింగ్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.ఐఐటీలు, ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్లు, అమెరికా క్యాంపస్‌ల నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులైన 6,000 మంది ఇంజినీర్లను ఎంపిక చేయనున్నారు. అంతర్జాతీయ ఏఐ ల్యాబ్‌లతో పోటీపడి మరీ వీరిని రిక్రూట్ చేసుకుంటున్నారు.ఐటీ పరిశ్రమలో ఇన్నాళ్లూ కొనసాగిన సిబ్బంది సంఖ్య ఆధారిత ఆదాయ నమూనా స్థానంలో నైపుణ్య ఆధారిత అత్యుత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.లేఆఫ్స్ కావు.. పునర్నిర్మాణమే!ఈ ప్రక్రియ ఉద్యోగుల తగ్గింపు (లేఆఫ్స్) కోసం కాదని ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే రీబ్యాలెన్సింగ్ చర్య మాత్రమేనని సంస్థ స్పష్టం చేసింది. వాషింగ్టన్లో ఇటీవల జరిగిన వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ వ్యూహాన్ని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. మొత్తానికి, సాంప్రదాయ ఐటీ శకానికి ముగింపు పలుకుతూ ఏఐ ఆధారిత నూతన సాంకేతిక యుగానికి ఐటీ ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా భారతీయ ఐటీ సంస్థలకు కూడా మార్గదర్శకంగా నిలవనుందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా.. -
ఏపీ టెలికాం సర్కిల్లో మార్కెట్ లీడర్‌గా జియో
ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో రిలయన్స్ జియో తన అగ్రస్థానాన్ని మరింత బలపరిచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన ఆగస్టు 2026 టెలికాం చందాదారుల నివేదిక ప్రకారం.. మొబైల్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్(ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగాల్లో జియో భారీగా కొత్త యూజర్లను ఆకర్షించింది.మొబైల్ విభాగంలో ఆధిపత్యంఆగస్టు నెలలో ఏపీ సర్కిల్లో జియో కొత్తగా 2.12 లక్షల వైర్లెస్ మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం చందాదారుల సంఖ్య 3.29 కోట్లకు చేరింది. నెట్వర్క్ వినియోగం పరంగా అత్యంత కీలకమైన ‘విజిటర్ లొకేషన్ రిజిస్టర్’లో జియో 96.95 శాతం యాక్టివ్ యూజర్ల నిష్పత్తిని నమోదు చేసి కస్టమర్ సంతృప్తికి అద్దం పట్టింది. జాతీయ స్థాయిలోనూ సమీప పోటీదారు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే నెట్ చందాదారుల చేరికలో జియో సుమారు 3.7 రెట్లు అధిక వృద్ధిని సాధించడమే కాక వరుసగా 17 లక్షల యాక్టివ్ వీఎల్ఆర్ కస్టమర్లను జోడించి ఏకైక పాజిటివ్ ఆపరేటర్‌గా నిలిచింది.హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎయిర్‌ఫైబర్ ఇలా..డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న వేళ స్థిర బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లైన్) విభాగంలో జియో ఏపీలో కొత్తగా 25,211 కనెక్షన్లను జోడించి మొత్తం కనెక్షన్ల సంఖ్యను 21.55 లక్షలకు పెంచుకుంది. ఇక వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ రంగాన్ని శాసిస్తున్న జియో ఎయిర్‌ఫైబర్ సాంకేతికతలోనూ వృద్ధి నమోదైంది. 5జీ ఎఫ్డబ్ల్యూఏలో 11,058 కొత్త చేరికలతో మొత్తం కస్టమర్లు 7.97 లక్షలకు చేరారు. యూబీఆర్ ఎఫ్డబ్ల్యూఏలో 26,513 కొత్త కనెక్షన్లతో మొత్తం యూజర్లు 4.67 లక్షలకు పెరిగారు. ఈ రెండింటినీ కలిపితే ఏపీలో జియో ఎఫ్‌డబ్ల్యూఏ కనెక్షన్ల సంఖ్య ఏకంగా 12.64 లక్షల మైలురాయిని దాటింది.దేశవ్యాప్తంగా ఎఫ్‌డబ్ల్యూఏ విభాగంలో 78.6 శాతం సింహభాగాన్ని కలిగి ఉన్న జియో ఆగస్టులో జాతీయ స్థాయిలో 4 లక్షల కనెక్షన్లను అందించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. వైర్లెస్ నెట్వర్క్ స్థిరత్వం, వేగవంతమైన డిజిటల్ విస్తరణే జియోను ఏపీ, తెలంగాణ పరిధిలో టాప్‌లో నిలబెడుతున్నాయని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా.. -
ఓపెన్ ఏఐతో సచిన్ భాగస్వామ్యం
క్రికెట్ క్రీడలో ఎన్నో రికార్డులు తిరగరాసిన భారత క్రికెట్ దిగ్గజం, ‘భారతరత్న’ సచిన్ తెందుల్కర్ సాంకేతిక పరిజ్ఞానంలోనూ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’తో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. చాట్‌జీపీటీ సామర్థ్యాన్ని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.సాంకేతికతను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఓపెన్ ఏఐ ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి సచిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో చాట్‌జీపీటీ సచిన్‌ను గుర్తించడానికి పది ప్రశ్నలు అడగడం, చివరికి చాట్‌జీపీటీ సచిన్‌ను సరిగ్గా గుర్తించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.సచిన్ మాటల్లో చాట్‌జీపీటీ వినియోగంచాట్జీపీటీ తన రోజువారీ జీవితంలో ఏ విధంగా సహాయపడుతుందో సచిన్ వివరించారు. ‘నాకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. ఒక ప్రశ్న ఆలోచిస్తే మరో ప్రశ్న పుట్టుకొస్తుంది. ఈ అలవాటును ప్రోత్సహించడంలో చాట్‌జీపీటీ నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అని సచిన్ పేర్కొన్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ప్రణాళికను రూపొందించడంలోనూ చాట్‌జీపీటీ ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు.భారత్‌లో ఓపెన్ ఏఐ విస్తరణఇటీవలే బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సచిన్ తెందుల్కర్‌తో చేతులు కలపడం ద్వారా భారత మార్కెట్లో డిజిటల్ పరిజ్ఞానాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేపడుతోంది. ఏఐ సాంకేతికతను కేవలం సాంకేతిక నిపుణులకే కాకుండా ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమస్యల పరిష్కారానికి సాధనంగా ఉపయోగించుకోవాలని సచిన్ కోరారు. ఈ భాగస్వామ్య పరిణామాలను క్రీడా, సాంకేతిక వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా.. -
బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 59 పాయింట్లు పడిపోయి 22,714 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 231 పాయింట్లు నష్టపోయి 72,531 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.23బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 106.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.92 శాతం కుప్పకూలింది.Today Nifty position 29-09-2026(time: 09:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు..
దేశీయ రైల్వే రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే శాఖ రూ.345 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించింది.ఆంధ్రప్రదేశ్‌కు నూతన వీక్లీ ఎక్స్ప్రెస్ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) పరిధిలో మచిలీపట్నం - కర్నూలు సిటీ మధ్య కొత్త ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు) ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్‌కు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.499 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు విజయవాడ మీదుగా నడుస్తుంది. మచిలీపట్నంలో సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 04:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో మంగళ, గురు, ఆదివారాల్లో ఉదయం 09:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల తదితర ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది.యూపీలో కవచ్ 4.0సరుకు రవాణాలో కీలకమైన ఒడిశాలోని బార్బిల్-బోలానిఖదాన్ 6 కిలోమీటర్ల సింగిల్ లైన్ సెక్షన్‌ను రూ.122 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ (రెండో ట్రాక్) చేయడానికి ఆమోదం తెలిపారు. ఇది ఇనుప ఖనిజం, పెల్లెట్ల రవాణా సామర్థ్యాన్ని ఏటా మరో 8.9 మిలియన్ టన్నులకు పెంచుతుంది.మరోవైపు రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన స్వదేశీ పరిజ్ఞానం ‘కవచ్ 4.0’ విస్తరణకు పెద్దపీట వేశారు. ఉత్తర ఈశాన్య రైల్వే పరిధిలోని వారణాసి డివిజన్‌కు చెందిన 614.75 రూట్ కిలోమీటర్లలో రూ.223 కోట్ల అంచనా వ్యయంతో ఈ సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు సరుకు రవాణా వేగవంతమై దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు లభించనుంది.ఇదీ చదవండి: అలర్ట్.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు -
అలర్ట్.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు
దేశంలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి అక్టోబరు 1 నుంచి పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్య ఖాతాదారుల నుంచి వ్యాపారుల వరకు అందరి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులేమిటో కింద చూద్దాం.ఎస్బీఐ ఏటీఎం నిబంధనల్లో మార్పులుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ జీతాల ఖాతా (Salary Package Account) దారులకు ఉచిత ఏటీఎం ఉపసంహరణల పరిమితిని తగ్గించింది. ఇప్పటివరకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు లభిస్తున్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5 కి తగ్గించింది. ఈ నిబంధన ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. అయితే, ప్రాథమిక సేవింగ్స్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు 4 ఉచిత ఉపసంహరణలు యథాతథంగా కొనసాగుతాయి. పరిమితి దాటితే రూ.15 + జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. డిజిటల్ లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి.బల్క్ ఎఫ్డీలపై ఆర్బీఐ మార్గదర్శకాలుబ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను రోజూ ఉదయం 10 గంటలకల్లా పారదర్శకంగా ప్రచురించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. సమానమైన బల్క్ డిపాజిట్లకు ఒకే విధమైన వడ్డీ రేటును వర్తింపజేయాలని, లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి (ఎల్‌సీఆర్) ఆధారంగా మాత్రమే వ్యత్యాసాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.యూపీఐ ఎండీఆర్ చార్జీలుఅక్టోబరు 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ (పీ2ఎం) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమల్లోకి రానుంది. సాధారణ వ్యక్తుల మధ్య జరిపే (పీ2పీ) లావాదేవీలు, రూ.2,000 లోపు వ్యాపార చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. దాదాపు 96 శాతం డిజిటల్ లావాదేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం వెల్లడించింది.ఎన్పీఎస్ ఖాతాల నమోదు రుసుము పెంపునేషనల్ పెన్షన్ సిస్టమ్ లైట్ ఖాతాలను పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ) ద్వారా ప్రారంభించే చందాదారులు ఇకపై ప్రాణ్ (PRAN) కార్డు నమోదుకై ఒకసారి రూ.200 ఆన్‌బోర్డింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఎల్పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ ప్రామాణీకరణసబ్సిడీ ధరకే వంటగ్యాస్ రీఫిల్ పొందేందుకు వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే 89.9% మంది (27.43 కోట్ల మంది) ఈ ప్రక్రియను పూర్తి చేశారు. పూర్తి చేయనివారు గ్యాస్ డెలివరీ సమయంలో లేదా ఏజెన్సీ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో -
యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో
వ్యాపారస్తులకు రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు విధించాలన్న కేంద్రం నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎండీఆర్ విధింపుపై నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐకి నోటీసులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే.. యూపీఐ లావాదేవీలు దాదాపు గత ఆరేళ్లుగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే, వ్యాపారవర్గాలకు కొనుగోలుదారులు రూ. 2,000కు పైబడి జరిపే చెల్లింపులపై 0.4 శాతం ఫీజును విధిస్తూ కేంద్రం ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం వ్యాపారవర్గాలే చెల్లించాల్సి ఉంటుందని, వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే, దీన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్ అంజన్ దత్తా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన బెంచ్ ఈ చార్జీల విధింపునకు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని కేంద్రానికి సూచించింది. యూపీఐ మొత్తం లావాదేవీల్లో 96% వరకు చార్జీల పరిధిలోకి రావని, నిర్దిష్ట సేవలకు సంబంధించిన లావాదేవీలపై చార్జీని రూ.5కు ప్రభుత్వం పరిమితం చేసిందని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వెంకటరమణ వివరించారు. యూపీఐ వ్యవస్థను నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థలకయ్యే వ్యయాల భారాన్ని తగ్గించేందుకే దీన్ని విధిస్తున్నట్లు, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకూరదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయంటే.. -
3 కంపెనీలకు ఒకే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పయనీర్ ఫిల్‌మెడ్, టాన్బో ఇమేజింగ్ ఇండియా, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్గమేర్పడింది. ఈ కంపెనీలు సెబీకి ప్రస్తుత ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. పయనీర్ ఫిల్‌మెడ్ ఐపీవో ద్వారా రైల్వే పరికరాల తయారీ కంపెనీ పయనీర్ ఫిల్‌మెడ్ రూ. 500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. దీనిలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. పయనీర్ ఫేకర్ ఐటీ ఇన్‌ఫ్రాడెవలపర్స్, ఆజ్టెక్ ఇండియా విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లు చొప్పున విక్రయించనున్నాయి. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్‌లోని సాలార్‌పూర్(భివాడీ)లో గేర్‌బాక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు, విండ్ జనరేటర్ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. టాన్బో ఇమేజింగ్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా టాన్బో ఇమేజింగ్‌కు చెందిన ప్రస్తుత వాటాదారులు 1,80,85,246 ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా వాటాదారులకు చేరనున్నాయి. 2003లో ఏర్పాటైన టాన్బో ఇమేజింగ్ ఇండియా ప్రధానంగా గ్లోబల్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ తయారు చేస్తోంది. డిజైన్, అభివృద్ధి, తయారీ చేపడుతోంది. సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్ సిస్టమ్స్ రూపొందిస్తోంది. ఫంక్షనల్ ఫుడ్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ 60 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 25 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్ సెంథిల్ కుమార్ చిన్నుసామి విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. తమిళనాడులోని నమక్కల్, మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో రెండు తయారీ యూనిట్లను నెలకొల్పనుంది. మిగిలిన నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనుంది. అనుబంధ సంస్థ క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్(ఇండియా) రుణాలు సైతం తీర్చనుంది. వీటితోపాటు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ సమీకృత ఫుడ్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీగా కార్యకలాపాలు విస్తరించింది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తులతోపాటు షుగర్ ఆల్టర్నేటివ్స్, స్పైసెస్ తదితర ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
ఐపీవో బూమ్‌తో కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: ప్రస్తుత కేలండర్ ఏడాది(2026) ప్రైమరీ మార్కెట్లలో నెలకొన్న బూమ్ సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. ఈ ఏడాది ఇప్పటికే ఐపీవోలు చేపట్టిన 84 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.10 లక్షల కోట్లను సమీకరించాయి. ఈ బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి క్యూకడుతున్న కంపెనీలు, ఇప్పటికే అనుమతులు పొందిన ఇష్యూలతో చూస్తే ఈ ఏడాది రూ. 3.86 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఏఐబీఐ) పేర్కొంది. వెరసి ఇప్పటివరకూ సమకూర్చుకున్న నిధులతో పోలిస్తే 3.5 రెట్లకు పెట్టుబడుల సమీకరణ జంప్ చేయనున్నట్లు తెలియజేసింది. సెబీ నుంచి ఇప్పటికే అనుమతుల పొందిన సంస్థలు సంఖ్య 130కు చేరగా.. మరో 75 కంపెనీలు దరఖాస్తు చేసిన జాబితాలో చేరినట్లు మధ్యకాలానికి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెబీ నుంచి అనుమతి పొందిన కంపెనీలు ఉమ్మడిగా రూ. 2.43 లక్షల కోట్ల సమీకరణపై కన్నేయగా.. అనుమతుల కోసం వేచిచూస్తున్న సంస్థలు మరో రూ. 1.44 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. ఇండియా క్యాపిటల్ మార్కెట్స్: రాజకీయ భౌగోళిక పరిస్థితులు, క్యాపిటల్ అండ్ గ్రోత్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఐపీవో సైకిల్‌ను మించి మరింత లోతైన, నిలకడైన మూలధన ఏర్పాటు వ్యవస్థవైపు మళ్లుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇదీ జోరు తీరు.. గత దశాబ్ద కాలం(2016–2026)లో మెయిన్‌బోర్డ్ ఐపీవోల ద్వారా ఇప్పటివరకూ కంపెనీలు ఉమ్మడిగా రూ. 8.36 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. వెరసి వార్షికంగా 2016లో నమోదైన రూ. 26,494 కోట్ల నిధుల సమీకరణ 2025కల్లా రూ. 1.76 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ఏడాది(2026) ఇప్పటివరకూ 84 మెయిన్‌బోర్డ్ కంపెనీలు రూ. 1.10 లక్షల కోట్లు అందుకున్నాయి. 2016లో 26 కంపెనీలు లిస్ట్‌కాగా.. 2025కల్లా 103కు ఎగశాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాలుసహా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతుండటంతో ప్రైమరీ మార్కెట్లు మూలధన ఏర్పాటుకు వాహకంగా మారినట్లు లునావట్ పేర్కొన్నారు. కాగా.. ఎస్ఎంఈ విభాగం సైతం 2025లో 267 ఇష్యూలకు నెలవుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ 156 కంపెనీలు ఐపీవోలు చేపట్టినట్లు నివేదిక తెలియజేసింది. దీంతో ఎస్ఎంఈ విభాగం 2016–2026 కాలంలో రూ. 39,849 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది. సగటు ఎస్ఎంఈ ఇష్యూ పరిమాణం రూ. 2016లో రూ. 8 కోట్లుకాగా.. 2026కల్లా రూ. 45 కోట్లకు జంప్ చేయడం గమనార్హం! ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్ మర్చంట్ బ్యాంకర్ల సంఖ్య సైతం 2016లో నమోదైన 188 నుంచి 2026 సెప్టెంబర్‌కల్లా 250కు ఎగసింది. 33 శాతం వార్షిక పురోగతి ఇది! ఇక ఐపీవోల సబ్‌్రస్కిప్షన్ తీరు చూస్తే 2026లో క్విబ్ విభాగంలో సగటున 49 రెట్లు, హెచ్ఎన్ఐల నుంచి 86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 26 రెట్లు చొప్పున అధిక స్పందన నమోదవుతున్నట్లు ఏఐబీఐ నివేదిక వెల్లడించింది. -
చిట్కాలు చెప్పండి.. బహుమతి పొందండి!
న్యూఢిల్లీ: వ్యయ నియంత్రణ, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడే చిట్కాలు చెబితే ఉద్యోగులకు బహుమతులు ఇస్తామని సంస్థ ఎయిరిండియా కాబోయే సీఈవో, ఎండీ టెవోల్డే గెబ్రెమరియమ్ తెలిపారు. అవసరమైన భద్రతా అనుమతులు పొందిన తర్వాత ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగులతో జరిగిన ‘టౌన్‌హాల్’ సమావేశంలో మాట్లాడుతూ ... ఎయిరిండియాలో వ్యయ నియంత్రణ, క్రమశిక్షణ అనే రెండు అంశాలు ప్రతీ ఉద్యోగి జీవనశైలిగా మారాలని పిలుపునిచ్చారు. ‘‘వ్యయాల నియంత్రణ అనేది కేవలం యాజమాన్యం లేదా ఆర్థిక విభాగం బాధ్యత మాత్రమే కాదు. ప్రతి ఉద్యోగి ఖర్చులు తగ్గించేందుకు తమ వంతు సహకారం అందించాలి. అలాంటి పొదుపు చర్యలు సంస్థకు పెద్ద మొత్తంలో ప్రయోజనాన్ని కల్పిస్తాయి. ఉద్యోగులు ఏ హోదాలో ఉన్నా.. కస్టమర్లకు సరైన సేవలు అందించేలా, సంస్థ శ్రేయస్సుకు దోహదపడే నిర్ణయాలు తీసుకునేలా వారికి సంపూర్ణ అధికారాలు ఇస్తాం’’ అని గెబ్రెమరియమ్ స్పష్టం చేశారు. భద్రత అందరి ఉమ్మడి బాధ్యత ఇటీవల ఎయిరిండియా పైలట్లలో ఒకరు డ్రగ్స్ పరీక్షలో, మరొకరు మద్యం (బ్రీత్ అనలైజర్) పరీక్షలో విఫలమైన ఘటనలపై ఆయన స్పందించారు. ‘‘భద్రత అనేది అందరి ఉమ్మడి బాధ్యత. సంస్థలో ఏ చిన్న లోపం లేదా సమస్య కనిపించినా ఉద్యోగులు వెనకాడకుండా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని పెంపొందిస్తాం. విమాన భద్రత విషయంలో రాజీపడేది లేదు’’ అని స్పష్టం చేశారు. ఆదాయం, ఖర్చులపై దృష్టి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విమాన ఇంధన ధరల పెరుగుదల, భారతీయ విమానయాన సంస్థలపై విధించిన గగనతల ఆంక్షలు ఎయిరిండియాపై ప్రతికూల ప్రభావం చూపాయని గెబ్రెమరియమ్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిరిండియా రూ.22,238.23 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ నెట్వర్క్, కార్గో బిజినెస్, వాణిజ్య విభాగాల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. -
దేశీయంగా ఏరో ఇంజిన్ టెస్టింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆధునిక ఏరో ఇంజిన్ టెస్టింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు దేశీ దిగ్గజం టాటా ప్రాజెక్ట్స్ తాజాగా కెనడియన్ కంపెనీ ఎండీఎస్ ఏరో సపోర్ట్ కార్పొరేషన్‌తో చేతులు కలిపింది. ఇందుకు రెండు సంస్థలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు టాటా ప్రాజెక్ట్స్ వెల్లడించింది. తద్వారా కంపెనీకున్న అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాలకు గ్యాస్ టర్బయిన్ ఇంజిన్ టెస్టింగ్‌లో ఎండీఎస్ ఏరో సపోర్ట్కున్న గ్లోబల్ నైపుణ్యాలు జత కలవనున్నట్లు పేర్కొంది. వెరసి దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న ఏరోస్పేస్, ప్రపుల్షన్ ఎకోసిస్టమ్‌కు మద్దతుగా అవసరమైన అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. భాగస్వామ్యంలో భాగంగా టాటా ప్రాజెక్ట్స్.. కీలక సివిల్, స్ట్రక్చరల్ పనులతోపాటు ఎంఈపీ, హైఎయిర్ ప్రెజర్ సిస్టమ్స్, హెచ్‌వీఏసీ, హైటెంపరేచర్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్, కూలింగ్ వాటర్ సిస్టమ్స్తోకూడిన ఇన్ఫ్రా సంబంధ సౌకర్యాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. మరోపక్క ఎండీఎస్ డిజైన్, ఇంజినీరింగ్, సప్లై, ఇంటిగ్రేషన్సహా అడ్వాన్స్డ్ గ్యాస్ టర్బయిన్ ఇంజిన్ టెస్ట్ సౌకర్యాలు, సిస్టమ్స్‌లో ప్రత్యేక నైపుణ్యాలను అందజేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి దశలోకి.. దేశీ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ తదుపరి దశలోకి ప్రవేశిస్తున్నట్లు టాటా ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్, చీఫ్ గ్రోత్, స్ట్రాటజీ ఆఫీసర్ రాజీవ్ మీనన్ పేర్కొన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, ప్రపుల్షన్, టెస్టింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తదితరాలు లక్ష్యంగా అభివృద్ధి చెందుతున్నట్లు వ్యాఖ్యానించారు. రెండు సంస్థల కలయిక ద్వారా స్థానికంగా పటిష్ట ఎగ్జిక్యూషన్, గ్లోబల్ ఇంజిన్ టెస్టింగ్ నైపుణ్యాలతో దేశీయంగా వృద్ధిలో ఉన్న ఏరోస్పేస్ రంగానికి మద్దతివ్వనున్నట్లు ఎండీఎస్ ఏరో సపోర్ట్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ జో హజార్ తెలియజేశారు. అంతేకాకుండా ఏరోస్పేస్, టెక్నాలజీ విభాగాలలో కెనడా, ఇండియా మధ్య పటిష్టతకు వీలు చిక్కనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
పండగ షాక్.. రేట్లు రయ్!
న్యూఢిల్లీ: సాధారణంగా పండగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఈసారి అందుకు విరుద్ధంగా రేట్ల బాదుడుకు తెరతీశాయి. దీనితో ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లతో పాటు ఇతరత్రా గృహోపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి కంపెనీలు వీటి రేట్లను 5 నుంచి 8 శాతం వరకు పెంచనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో రాగి, ఉక్కులాంటి ముడి వస్తువుల వ్యయాలు.. రవాణా ఖర్చులు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ క్షీణించడం తదితర అంశాలు ఇందుకు కారణం. 2026లో రేట్లను పెంచడం ఇది మూడోసారి కానుంది. బ్లూస్టార్, గోద్రెజ్ అప్లయెన్స్, హైయర్, దైకిన్, సూపర్ ప్లాస్ట్రోనిక్స్లాంటి కంపెనీలు ఇప్పటికే వివిధ ఉత్పత్తుల శ్రేణివ్యాప్తంగా 4–10 శాతం మేర రేట్ల పెంపును ప్రకటించాయి. ఎల్జీ, బాష్ హోమ్ కంఫర్ట్ (హిటాచీ బ్రాండ్) ఏసీల ధరలు సుమారు 5–7 శాతం వరకు పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల రాగి, ఉక్కు, ప్లాస్టిక్స్లాంటి కమోడిటీల రేట్లు పెరిగిపోతుండటంతో ఉత్పత్తుల ధరల పెంపు తప్పడం లేదని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. అయితే, గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే వ్యయాలు 15 శాతం పెరిగినప్పటికీ జీఎస్‌టీపరంగా లభించే ప్రయోజనాలతో పోలిస్తే కస్టమర్లపై పడే ప్రభావం సుమారు ఐదు శాతమే ఉంటుందని యన పేర్కొన్నారు. గత పెంపు తర్వాత కమోడిటీల రేట్లు 8–10 శాతం పెరగడంతో పరిశ్రమవ్యాప్తంగా ధరల పెంచక తప్పని పరిస్థితి నెలకొందని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ (అప్లయెన్సెస్ బిజినెస్) కమల్ నంది తెలిపారు. వివిధ కేటగిరీవ్యాప్తంగా ధరల పెంపు 5–7 శాతం వరకు ఉంటుందన్నారు. కొన్ని కంపెనీలు అక్టోబర్‌లో, కొన్ని నవంబర్‌లో పెంచవచ్చని..ఏదైనప్పటికీ పెంచడం మాత్రం ఖాయమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, థామ్సన్, కోడక్ తదితర టీవీల బ్రాండ్లను భారత్‌లో తయారు చేసి, విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సైతం 7 శాతం వరకు రేట్లను పెంచనున్నట్లు తెలిపింది. ఉపకరణాల ధరలను ఇప్పటికే 4–5 శాతం పెంచినట్లు వివరించింది. పెంచినా కష్టమే.. పెంచకపోయినా కష్టమే.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచకపోతే నష్టపోవాల్సి వస్తుంది. అలాగని పెంచితే, అమ్మకాలపై స్పల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. ఏది ఏం జరిగినా పెంచడం తప్ప మరో మార్గం లేదు’’ అని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి రూమ్ ఏసీలపై రేట్లను 5 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ముడి వస్తువుల రేట్ల పెరుగుదల కొనసాగితే దీపావళి అనంతరం అలాగే జనవరిలోను విడతలవారీగా ఐదు శాతం చొప్పున మళ్లీ మళ్లీ పెంపు ఉండొచ్చన్నారు. మొత్తం మీద ఇప్పటి నుంచి జనవరి వరకు 15 శాతం వరకు పెంపునకు అవకాశం ఉందని చెప్పారు. ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు మొదలైన వాటి ధరల పెంపు 2–3 శాతం మేర ఉంటుందని ఆయన ధృవీకరించారు. గతేడాది టన్నుకు 8,000–9,000 డాలర్లుగా ఉన్న రాగి ధర ప్రస్తుతం 14,500 డాలర్లకు ఎగిసిందని, ఇది ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయని సతీష్ తెలిపారు. ఒక్కో ఏసీకి 3–4 కేజీల రాగి అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 16 నుంచే తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం మేర పెంచినట్లు దైకిన్ ఎయిర్కండీషనింగ్ సీఎండీ కన్వల్జీత్ జావా తెలిపారు. రాగి ధరలు 25–35 శాతం పెరగ్గా, డాలరు .. కమోడిటీల రేట్లు కూడా పెరుగుతుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే వినియోగదారుల నుంచి డిమాండ్ బాగానే ఉందని, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. సాధారణంగా వినియోగదారులు డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లను ఆశించే పండగ సీజన్లో ఇలా రేట్లను పెంచడం వల్ల డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ అవీ్నత్ సింగ్ మార్వా చెప్పారు. డిమాండు, ధర మధ్య సమతౌల్యం పాటించేలా చూసేందుకు మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా హెడ్ (ప్రోడక్ట్ మార్కెటింగ్ అండ్ ప్లానింగ్–ఏసీ కేటగిరీ) అభిషేక్ వర్మ చెప్పారు. రవాణా వ్యయాలు, సరఫరా వ్యవస్థ అంతరాయాల వల్ల దీపావళి తర్వాత చిన్న టీవీల రేట్లు 20 శాతం వరకు, పెద్ద టీవీల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. శాంసంగ్ ఎస్26 ఫోన్ల రేట్లు 17% జంప్.. ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను 17 శాతం వరకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లాంచ్ ధర రూ. 87,999తో పోలిస్తే బేసిక్ వెర్షన్ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 17 శాతం అధికంగా రూ. 1,02,999కి చేరినట్లు పేర్కొన్నాయి. దీనితో ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్ల రేట్లు రూ. లక్షకు పైబడే ఉన్నాయని వివరించాయి. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్ 18 సిరీస్ ధరలు కూడా ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే భారత్‌లో దాదాపు 20 నుంచి 43 శాతం అధిక స్థాయిలోనే ఉన్నాయని తెలిపాయి. రూ. 3.25 లక్షల కోట్లకు డ్యూరబుల్స్ మార్కెట్..దేశీయంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల మార్కెట్ 2030 నాటికి ఏటా 8–10 శాతం వృద్ధితో ఏకంగా రూ. 3–3.25 లక్షల కోట్ల స్థాయికి చేరనుంది. వాటికి అదనంగా విలువను జోడించే మెటీరియల్స్, విడిభాగాల తయారీకి సంబంధించి కొత్తగా రూ. 40,000–50,000 కోట్ల స్థాయిలో వ్యాపార అవకాశాలు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ), పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఆదాయాలు, చిన్న కుటుంబాలు, రుణ లభ్యత పెరుగుతుండటం, ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ నెలకొనడం తదితర అంశాల కారణంగా వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్‌గా భారత్ కొనసాగవచ్చని వివరించింది. ఈ వృద్ధికి రూమ్ ఏసీల విభాగం దన్నుగా నిలుస్తుందని తెలిపింది. అయితే, వ్యాపార అవకాశాలు ఉన్నప్పటికీ దేశీయంగా విడిభాగాలు, మెటీరియల్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోకపోతే దిగుమతులపైనే ఆధారపడాల్సి రావచ్చని నివేదిక పేర్కొంది. మరోవైపు, ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా 2030 వరకు ఏటా 1–2 శాతం మేర, అమెరికా 3 శాతం, జపాన్ 1–3 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. -
టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం!
టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ విషయంలో టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్.. కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకుండా కొనసాగించే దిశగా పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించింది.ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TESS), టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ (TCE) రెండు కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని టాటా ట్రస్ట్స్.. టాటా సన్స్ బోర్డును కోరింది. అయితే.. దీనికోసం అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ముందస్తు నిరభ్యంతర పత్రం (NOC) పొందాల్సి ఉంటుంది.టాటా సన్స్ ప్రస్తుతం ప్రధానంగా టాటా గ్రూప్‌లోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్న హోల్డింగ్ కంపెనీగా ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం TESS, TCEలను టాటా సన్స్‌లో విలీనం చేస్తే.. టాటా సన్స్‌కు నేరుగా వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు ఉండే అవకాశం ఏర్పడుతుంది. అంటే కంపెనీ మళ్లీ ఒక ఆపరేటింగ్ కంపెనీగా మారుతుందన్నమాట.దీంతో టాటా సన్స్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (CIC) నిబంధనల పరిధిలోకి రాకుండా ఉండే అవకాశం ఉంటుందని టాటా గ్రూప్ భావిస్తోంది. ఫలితంగా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సిన అవసరం కూడా తప్పుతుందని టాటా ట్రస్ట్స్ భావిస్తోంది.నిజానికి.. టాటా సన్స్‌కు గతంలోనే సొంత వ్యాపార కార్యకలాపాలు ఉండేవి. 2004లో టీసీఎస్‌ను ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీయడానికి ముందు టాటా సన్స్ నేరుగా వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని ఆర్జించేది. ఇప్పుడు ప్రతిపాదించిన విలీనంతో టాటా సన్స్‌ను మళ్లీ అదే తరహా ఆపరేటింగ్ మోడల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకుండా.. అన్‌లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీగా కొనసాగించాలన్నది టాటా ట్రస్ట్స్ ప్రతిపాదనగా ఉంది. టాటా సన్స్‌లో మెజారిటీ వాటా.. టాటా ట్రస్ట్స్‌దే కావడంతో ఈ విషయంలో వాటి నిర్ణయానికి ప్రాధాన్యం ఉంది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా? -
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా?
బ్యాంకుల్లో డబ్బు దాచుకునే ఖాతాదారులకు.. వడ్డీ రేట్లు చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారికి ఫిక్స్డ్ డిపాజిడ్ ఉత్తమమైన మార్గం. పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసే వారికి ఏ వడ్డీ రేటు లభిస్తుందో ముందుగానే తెలుసుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.వెబ్సైట్లో వడ్డీ రేట్లుకొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ముందుగానే తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటించాలి. ముఖ్యంగా.. బల్క్ డిపాజిట్లు చేసే ఖాతాదారులకు వర్తించే వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఈ మార్పులు చేసింది.బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను బ్యాంకులు పనిరోజుల్లో.. ఉదయం 10 గంటలకు తమ వెబ్సైట్లో వెల్లడించాలి. దీనికి 10 నిమిషాల గడువు కూడా ఉంటుంది. అంటే గరిష్టంగా ఉదయం 10:10 గంటలలోపు ఆ రోజు వర్తించే రేట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉండాలి.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బ్యాంకులు ఒకే రకమైన డిపాజిట్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇష్టానుసారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకే రోజున, ఒకే మొత్తానికి సంబంధించిన డిపాజిట్ల విషయంలో శాఖలు, ఖాతాదారుల మధ్య అనవసరమైన తేడా చూపకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే.. బ్యాంకు ప్రకటించిన రేట్లు, ఖాతాదారులకు వాస్తవంగా అందించే రేట్లు ఒకేలా ఉండాలి.బల్క్ డిపాజిట్ల విషయంలో..అయితే.. కొన్ని అర్హత ఉన్న బల్క్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులకు వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా వివిధ రకాల డిపాజిటర్లకు వర్తించే లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఆధారంగా.. వడ్డీ రేట్లలో తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న నాన్ రెసిడెంట్ రూపాయి డిపాజిట్లకు కూడా వర్తించే సందర్భాల్లో ఈ సౌలభ్యం ఉంటుంది.అయితే.. రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లకు మాత్రం LCR ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు నిర్ణయించే అవకాశం బ్యాంకులకు ఇవ్వలేదు. చిన్న మొత్తాల డిపాజిట్లకు కూడా.. ఇలా వేర్వేరు రేట్లు అనుమతిస్తే వడ్డీ రేట్ల నిర్ణయం మరింత క్లిష్టంగా, వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది.ఇదీ చదవండి: ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్! -
ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్!
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధంచాలనే.. నిర్ణయానికి వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ రిటెయిలర్లు నిరసనకు సిద్ధమవుతున్నారు. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించే ప్రతిపాదన తమ వ్యాపారాలపై అదనపు భారం పెంచుతుందని రిటెయిలర్లు చెబుతున్నారు.ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ (AIMRA) అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించాలని ప్రకటించింది. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ షాపుల యజమానులు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించకుండా నిరసన తెలపనున్నారు.కేవలం క్యాష్, కార్డు పేమెంట్స్ మాత్రమేనిరసనలో భాగంగా మొబైల్ షాపుల్లో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ స్టాండ్లను నల్లటి గుడ్డతో కప్పివేయనున్నట్లు సమాచారం. ఆ రోజు కస్టమర్ల నుంచి యూపీఐ లేదా క్యూఆర్ స్కాన్ ద్వారా చెల్లింపులు తీసుకోకుండా.. నగదు లేదా కార్డు ద్వారా మాత్రమే పేమెంట్లు స్వీకరించాలని రిటెయిలర్లు నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది.వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించకుండా.. ప్రస్తుతం ఉన్న జీరో-ఎండీఆర్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసినట్లు ఏఐఎంఆర్ఏ వెల్లడించింది.ఆదాయం తగ్గే అవకాశం!రిటెయిలర్ల ప్రకారం.. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ఈ ఛార్జీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేసే వ్యాపారులకు 0.4 శాతం ఎండీఆర్ కూడా గణనీయమైన భారంగా మారుతుందని వారు చెబుతున్నారు. దీనివల్ల నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తర్వీంద్ సింగ్ పేర్కొన్నారు.మొబైల్ ఫోన్ రిటెయిల్ వ్యాపారంలో ఇప్పటికే లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అదనంగా 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధిస్తే తమ లాభాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రిటెయిలర్లపై నెలకు సుమారు రూ.40 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అసోసియేషన్ అంచనా.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొబైల్ రిటెయిలర్లు కోరుతున్నారు. తమ వ్యాపారాల్లో యూపీఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో కొత్త ఎండీఆర్ ఛార్జీలు అమలైతే, దాని ప్రభావం నేరుగా తమ లాభాలపై పడుతుందని చెబుతున్నారు. అందుకే జీరో-ఎండీఆర్ ఛార్జీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి! -
కేవలం రూ.7.84 లక్షలకే.. 7 సీటర్ కారు!
రెనాల్ట్ ఇండియా ఎట్టకేలకు తన ట్రైబర్ కారును టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో అప్డేట్ చేసింది. ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంపీవీ ప్రారంభ ధర రూ.7.84 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త రెనాల్ట్ ట్రైబర్ టర్బోలో 1.0-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇంజిన్ 99 హార్స్ పవర్, 180 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 21 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.కొత్త ఇంజన్‌తో పాటు, రెనాల్ట్ వాహనం లోపల కూడా మార్పులు చేసింది. ఈ మోడల్లో అప్డేటెడ్ సస్పెన్షన్ ట్యూనింగ్, యాంటీ-రోల్ బార్లు, కొత్త థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, మెరుగైన బ్రేకింగ్, ఏబీఎస్, టీసీఎస్, వీడీసీ కంట్రోల్స్ కోసం సెట్టింగ్‌లు ఉన్నాయి. తక్కువ ధరలో ఫ్యామిలీ కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.ఇదీ చదవండి: పిల్లలు, వృద్ధుల భద్రత కోసం జియోషీల్డ్ -
పిల్లలు, వృద్ధుల భద్రత కోసం జియోషీల్డ్
పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినా, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లినా.. వారి లొకేషన్‌ను తెలుసుకోవడంతో పాటు అవసరమైన సమయంలో SOS అలర్ట్‌లను పొందే సదుపాయం ఇప్పుడు ఒకే చోట అందుబాటులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల భౌతిక, ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జియో JioShield సేవలను ప్రారంభించింది. ఇందులో లొకేషన్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్‌లు, స్క్రీన్ టైమ్ నిర్వహణ, యాప్‌లు, కాంటాక్ట్‌ల నియంత్రణ వంటి సదుపాయాలు ఉన్నాయి.JioShield ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. ముఖ్యమైన భద్రతా అలర్ట్‌లను పొందవచ్చు. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా అలర్ట్ అందుతుంది. పిల్లలు ఏ యాప్‌లను ఉపయోగించవచ్చు, ఎవరితో ఫోన్లో మాట్లాడవచ్చు, స్క్రీన్‌పై ఎంత సమయం గడపవచ్చు వంటి అంశాలను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. తద్వారా పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు వాటిపై నియంత్రణ కూడా కలిగి ఉండవచ్చు. ఇదే సదుపాయాలను వృద్ధులైన తల్లిదండ్రులతో అనుసంధానంగా ఉండేందుకు, అవసరమైనప్పుడు వారికి సహాయం చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు.మొబైల్లో ఈ సేవలను ఏర్పాటు చేసుకోవడం కూడా సులభమే. తల్లిదండ్రుల ఫోన్లో జియోథింగ్స్ యాప్‌ను, పిల్లలు లేదా వృద్ధుల ఫోన్లో జియోషీల్డ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండు యాప్‌లను అనుసంధానించిన తర్వాత తల్లిదండ్రులు తమ ఫోన్ నుంచే లొకేషన్, స్క్రీన్ టైమ్, యాప్‌లు, కాంటాక్ట్‌లకు సంబంధించిన సదుపాయాలను నిర్వహించవచ్చు.JioShield వార్షిక ధర రూ.1,000. అంటే నెలకు సగటున సుమారు రూ.83 అవుతుంది. ఇందుకోసం రూ.1,000ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. జియో 10వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా వినియోగదారులకు మొత్తం రూ.1,000 విలువైన జియో రీఛార్జ్ వోచర్లు లభిస్తాయి. ఈ ప్రయోజనం ఆధారంగా కంపెనీ JioShield సేవను వాస్తవంగా ఉచితంగా లభించే సేవగా పేర్కొంటోంది. దీనితో పాటు రూ.4,000 విలువైన 12 నెలల Canva Pro సబ్స్క్రిప్షన్, 28 రోజుల Unlimited 5G అప్‌గ్రేడ్ కూడా లభిస్తాయి.రూ.1,000 విలువైన రీఛార్జ్ వోచర్లు రూ.100 చొప్పున 10 వోచర్ల రూపంలో అందిస్తారు. వీటిని రూ.399 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన Unlimited 5G ప్లాన్ల రీఛార్జ్ సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంది.పిల్లలు లేదా వృద్ధులు ఉపయోగించే ఫోన్లో Android 10 లేదా ఆపై వెర్షన్ ఉండాలి. అలాగే, ఆ ఫోన్లో యాక్టివ్ జియో నంబర్ తప్పనిసరిగా ఉండాలి. తల్లిదండ్రుల కోసం JioThings యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. iOS వెర్షన్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. -
కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి!
సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సేవింగ్స్, బీమా పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ప్రమాదవశాత్తూ చనిపోయినా లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంలో చేరేందుకు సాధారణంగా ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం ఉండదు.ఈ స్కీములో చేరినవారు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే.. ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తూ మరణం సంభవించినప్పుడు నామినీ లేదా అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుంది. అయితే.. క్లెయిమ్ పొందేందుకు పథకంలోని నిబంధనలు, అర్హతలను తప్పనిసరిగా పాటించాలి.అర్హతలు18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. దీనికోసం బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నా, ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరవచ్చు.జాయింట్ అకౌంట్ ఉన్న సందర్భంలో.. అర్హత ఉన్న ప్రతి ఖాతాదారు విడిగా ప్రీమియం చెల్లించి పథకంలో చేరవచ్చు. ప్రీమియం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది. బీమా కవరేజ్ కాలం జూన్ 1 నుంచి మరుసటి సంవత్సరం మే 31 వరకు ఉంటుంది. కవరేజ్ కొనసాగాలంటే నిర్ణయించిన ప్రీమియం చెల్లించాలి.ఏ ప్రమాదాలకు బీమా వర్తిస్తుందంటే?రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రమాదాల వల్ల మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు.. పథకం నిబంధనల ప్రకారం బీమా ప్రయోజనం లభిస్తుంది. ప్రమాదం కారణంగా మరణించిన సందర్భంలో అర్హత ఉన్న నామినీకి రూ.2 లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. అంగవైకల్యం విషయంలో కూడా నిబంధనల ప్రకారం బీమా ప్రయోజనం లభిస్తుంది.ఆత్మహత్యకు ఈ పథకం వర్తించదు. రోడ్డు, రైలు లేదా నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాల విషయంలో అవసరమైన ఆధారాలు, పోలీస్ రికార్డులు వంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. పాము కాటు, చెట్టుపై నుంచి పడటం వంటి ప్రమాదాల్లో కూడా సంబంధిత వైద్య లేదా ఇతర ఆధారాల ఆధారంగా క్లెయిమ్‌ను పరిశీలిస్తారు.తెలుసుకోవాల్సిన విషయాలుఈ పథకంలో చేరడం సులభమే.. అయినప్పటికీ బీమా కవరేజ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా.. ఏ ప్రమాదాలకు బీమా వర్తిస్తుంది, క్లెయిమ్ సమయంలో ఎలాంటి పత్రాలు అవసరం, ప్రీమియం ఎప్పుడు కట్ అవుతుంది వంటి విషయాలను బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా తెలుసుకోవాలి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,124.02 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 72,771.72 వద్ద, నిఫ్టీ 360.25 పాయింట్లు లేదా 1.56 శాతం నష్టంతో 22,780.25 వద్ద నిలిచాయి.గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, క్రిసిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)ఇదీ చదవండి: కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు! -
కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలం వచ్చిందంటే.. వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారుతుంది. చలికాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఈసారి శీతాకాలం ప్రారంభం కాకముందే కొన్ని చర్యలను ప్రకటించింది.పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు2026 నవంబర్ 1 నుంచి పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజలు అవసరం లేని సమయంలో వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అంతే కాకుండా.. నవంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు ఆఫీసుల పనివేళల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి.50 శాతం మంది ఆఫీసుకుమరో ముఖ్యమైన నిర్ణయం.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లేలా చేయడం. మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల రాకపోకలు, వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.దుమ్ము ఎక్కువగా వచ్చే నిర్మాణ, కూల్చివేత పనులను కూడా కొంతకాలం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాల పొగ మాత్రమే కారణం కాదు. రోడ్లపై, నిర్మాణ ప్రదేశాల్లో ఏర్పడే దుమ్ము, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కూడా ముఖ్యమైన కారణాలే.గతంలో కూడా.. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆడ్-ఈవెన్ విధానం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ విధానంలో వాహనాల నంబర్ల ఆధారంగా కొన్ని రోజుల్లో కొన్ని వాహనాలకే రోడ్లపై తిరిగే అవకాశం ఇచ్చారు. అయితే.. ఢిల్లీ కాలుష్య సమస్య చాలా పెద్దది కావడంతో ఒక్క చర్యతోనే దాన్ని పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదు.ఇక శీతాకాలంలో పంజాబ్, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కూడా ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే కాకుండా.. పొరుగు రాష్ట్రాలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త! -
రిటైర్ అయ్యేవాళ్లకు కష్టమే: కియోసాకి అలర్ట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అమెరికా పదవీ విరమణ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, బాండ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బేబీ బూమర్ (1946 నుంచి 1964 మధ్య జన్మించినవారు) తరానికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. 1970లలో 401(k) వంటి రిటైర్మెంట్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటిపై తగిన ఆర్థిక అవగాహన లేకుండానే ప్రజలు పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని కియోసాకి తన ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.60:40 విధానంపైనా విమర్శలు1960లలో కొత్తగా అభివృద్ధి చెందిన ‘ఫైనాన్షియల్ ప్లానర్’ వృత్తి ద్వారా బేబీ బూమర్లకు 60:40 పెట్టుబడి విధానాన్ని సూచించేవారని కియోసాకి చెప్పారు. అంటే 60 శాతం షేర్లు, 40 శాతం బాండ్లలో పెట్టుబడి పెట్టే విధానమని వివరించారు. ఆ సమయంలో ఆర్థిక విద్యకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయిందని, ఫైనాన్షియల్ ప్లానర్లకు లైసెన్స్ పొందే ప్రక్రియ కూడా చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేదని ఆయన పేర్కొన్నారు.బాండ్ల విక్రయాలు.. బంగారంపై దృష్టి2026లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమెరికా ప్రభుత్వ బాండ్లను విక్రయించి, భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. బాండ్ల ధరలు పడిపోతే షేర్ మార్కెట్లపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, ఎస్అండ్పీ 500 వంటి ప్రధాన సూచీలు భారీగా పడిపోతే రిటైర్మెంట్ దశలో ఉన్న లక్షలాది మంది బేబీ బూమర్లకు నష్టాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.దీంతో కొంతమంది రిటైర్డ్ వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు, మనవళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. అయితే, ఇవి తన అంచనాలని, తాను తప్పు కావాలని కోరుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనాలని..2008లో లెహ్మాన్ బ్రదర్స్ సంక్షోభం సమయంలో తాను చేసిన హెచ్చరికలను గుర్తుచేసుకున్న కియోసాకి.. చాలా ఏళ్లుగా ప్రజలకు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల గురించి చెబుతున్నానన్నారు. ప్రస్తుతం అమెరికాలో అద్దె అపార్ట్మెంట్లు, చమురు బావుల్లో పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. తాను ఫైనాన్షియల్ ప్లానర్ కాదని, పెట్టుబడి సూచనల ద్వారా తాను డబ్బు సంపాదించడం లేదని పేర్కొన్నారు.ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తన మాజీ భార్య కిమ్‌తో కలిసి 1996లో ‘క్యాష్‌ఫ్లో’ బోర్డ్ గేమ్‌ను రూపొందించామని, 1997లో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని రాశానని కియోసాకి తెలిపారు. పాఠశాలలు, వాల్‌స్ట్రీట్ బోధించని ఆర్థిక అంశాలను ప్రజలు స్వయంగా నేర్చుకునేలా చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.“ఎంత ఎక్కువ నేర్చుకుంటే.. ఎంత ఎక్కువగా ఇతరులకు నేర్పిస్తే.. అంత ఎక్కువగా సంపన్నులవుతారు” అనే సందేశంతో తన ఎక్స్ పోస్టును ముగించిన కియోసాకి.. ముందుచూపుతో ఆర్థిక విషయాలను నేర్చుకోవాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.DID THE BABY BOOMERS get F’d? A: in 1974 the Boomer’s were the first generation to receive ERISA aka the “401k,” without any financial education. ERISA=Employee Retirement Income Security ACT BTW: Anytime the government passes an act…the words mean the opposite. For Example “Social Security?” In 1964, Boomers were being taught by a new profession called “Financial Planners” also without any financial education to pitch the 60/40… 60% stocks 40% bonds. It took only 7 weeks to get a financial planner’s license back then. I could not believe it. I could see this crisis we are in today…coming….the crisis of Boomers getting F’d. Today, in 2026….Central Banks throughout the world are dumping US Bonds to buy gold….by the tons. When bonds go down… the stock market, like the S&P 500 will crash, which will leave millions of boomers out of time and out of money to recover. Millions of Boomers may be homeless or moving in with kids and grandkids. Hope I am wrong, but I do not think I am. My predictions, starting with the crash of Lehmann Brothers on CNN, on Wolf Blitzer’s Situation Room show in 2008, has been on time and target. That is why I have ended my X’s with “Buy gold, silver, and Bitcoin” for years. Nothing has changed, except I do own rental apartments and oil wells in US. I am not a financial planner nor do I make money from my recommendations. That is why my x-wife Kim and I created the Cashflow Boardgame, in 1996, and I wrote Rich Dad Poor Dad in 1997 and many other books. Our mission has been to create products so people could teach people….what our schools and Wall Street will not teach you. Rough times ahead for the unprepared and great times for those that are. Please read, learn, join a Cashflow Club, teach yourself, and others. “The more you learn and the more you teach….the richer you become.” Please take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) September 28, 2026 -
Income Tax: మూలధన లాభాలు.. లెక్కింపు
స్వల్పకాలికం కావచ్చు, దీర్ఘకాలికం కావచ్చు.. మూలధన లాభాలను లెక్కించడమనేది చెప్పినంత సులువు కాదు. అలాగని, అంతుపట్టని బ్రహ్మ విద్య కూడా కాదు. వీటినెలా లెక్కించాలంటే..ఇక్కడ వివరణ ఇవ్వాలి. భాషాపరంగా మెరుగుదల అంటే.. మెరుగు, తరుగు కాదు. ఇంగ్లీషులో Improvements అంటే బాగా అర్థమవుతుంది. సరళంగా చెప్పాలంటే 2016లో ఇల్లు కట్టినప్పుడు నాలుగు గదులున్నాయి. 2021లో మరో రెండు గదులు వేశారు. 2016లో కొన్న విలువ (కొనుగోలు విలువ, కొన్న ధర)ను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ (Cost of Acquisition) అంటారు. ఆ విలువకి 2021లో రెండు గదులకైన ఖర్చుని కలుపుతారు. 2021లో అయిన ఖర్చుని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ (Cost of Improvements) అని అంటారు.దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించేటప్పుడు ఆయా ‘కాస్ట్’ని, కొన్న ధరని, ఇంప్రూవ్మెంట్స్ ధరని, ప్రస్తుత సంవత్సరం (ఏ సంవత్సరంలో అమ్ముతారో ఆ సంవత్సరంలో) సర్దుబాటు చేస్తారు. ద్రవ్యోల్బణంతో అనుసంధానించి సర్దుతారు. ద్రవ్యోల్బణం రేటు ప్రకారం అప్పట్లో కొన్న ధరను పెంచుతారు. ఇలా పెంచడాన్ని ఇండెక్సింగ్ అంటారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. స్వల్పకాలిక మూలధన లెక్కింపులో ఇండెక్సింగ్ ఉండదు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు మాత్రమే ఇండెక్సింగ్ ప్రయోజనాన్ని ఇస్తారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం మీద వివరణ ఇవ్వాలి.ప్రతిఫలం అంటే.. ప్రతిఫలం అంటే, విక్రయించగా వచ్చినది. మీరు అమ్మిన ధర సేల్ డీడ్‌లో కనిపించే మొత్తం అని అనవచ్చు. మనం అమ్మే ధరను ఒప్పందం/డీడ్‌లో రాసుకుంటాం. దానికి ఇరు పక్షాలు ఒప్పుకుని సంతకాలు పెడతారు. సాక్షులు ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో సేల్ డీడ్‌లో రాసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మూలధన లాభాల లెక్కల అసెస్మెంట్ కావొచ్చు. కానీ, ప్రతిఫలం విషయంలో వచ్చినది, వచి్చనట్లు ఎవరూ చూపించడం లేదనే చెప్పాలి. అగ్రిమెంటు విలువ వర్సెస్ అమ్మిన విలువ అగ్రిమెంటులో ఒక కోటి రూపాయలు రాస్తున్నారు. తర్వాత అమ్మిన విలువను రూ. 70 లక్షలు లేదా అంతకన్నా తక్కువగా చూపిస్తున్నారు. ‘‘ఎందుకండి, కోటి రూపాయల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడం. దండగ’’ ఇది కొనుగోలుదారు ఆవేదన, ఆక్రందన. ఇక అమ్మేవాళ్లూ ఏం తక్కువ కాదు. ఆ 30 లక్షల మీద పన్ను భారం (క్యాపిటల్ గెయిన్స్) కట్టడం అనవసరం అని 70 శాతాన్ని బ్యాంకులో చెక్ ద్వారా చూపిస్తూ, మిగతాది ‘బ్లాక్’గా నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా తప్పు. నేరం. ఇలా తక్కువ చేయడం, ఒకప్పుడు, అంటే 2002 వరకు జరిగేది. అరకొర సిబ్బంది వల్ల, అరకొర సమాచారం వల్ల జరిగేది.మరొక కారణం ఏమిటంటే, అప్పట్లో డిపార్టుమెంట్ల మధ్య సమాచారం ఇచి్చపుచ్చుకునే పద్ధతి, సమన్వయం అంతగా ఉండేది కాదు. రానురాను సమాచార మారి్పడి పద్ధతిని వ్యవస్థీకృతం చేశారు. ఆన్లైన్ వాడకం పెరిగింది. సమన్వయం పెరగడంతో పాటు కృత్రిమ మేధస్సును కూడా వాడుతున్నారు. సబ్–రిజి్రస్టార్ కార్యాలయం నుంచి రూ. 30,00,000 దాటిన క్రయవిక్రయాల వ్యవహారాలు ఎప్పటికప్పుడు డిపార్టుమెంట్లకు చేరిపోతున్నాయి. ఆ సేల్డీడ్లోని అన్ని విషయాలు ‘ఇంటిగ్రేట్’ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. -
బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగుల అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చింది. ప్రధానంగా ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సమ్మె ప్రతిపాదించారు. అయితే సెప్టెంబర్ 27 రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు జరగడంతో సమ్మెను వాయిదా వేశారు. మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించే అంశంపై ఇరు వర్గాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రభుత్వ బ్యాంకుల్లో జీతాలు ఎలా ఉంటాయి?పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులకు 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం ప్రకారం సవరించిన పే స్కేల్స్ అమల్లో ఉన్నాయి. ఈ ఒప్పందం 2024 మార్చిలో కుదిరింది. 2022 నవంబర్ 1 నుంచి అమలయ్యేలా కొత్త వేతన స్కేల్స్ రూపొందించారు. క్లరికల్ సిబ్బందికి ప్రారంభ బేసిక్ పే రూ.24,050గా నిర్ణయించారు. అంతకుముందు ఇది రూ.17,900గా ఉండేది.అయితే బేసిక్ పేనే ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం కాదు. దీనికి డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ఇతర అలవెన్సులు, ప్రత్యేక చెల్లింపులు జత అవుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్/NPS వంటి కోతలు ఉంటాయి.ఆఫీసర్‌గా చేరితే ఎంత?పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I అధికారులకు 12వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ప్రారంభ బేసిక్ పే రూ.48,480 నుంచి మొదలవుతుంది. స్కేల్-I నుంచి స్కేల్-VII వరకు అధికారుల సవరించిన బేసిక్ పే స్కేల్ రూ.48,480 నుంచి రూ.1,73,860 వరకు ఉంటుంది. అర్హతలు, అనుభవం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల ఆధారంగా వేతనం పెరుగుతుంది.దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన తాజా ఎస్బీఐ (SBI) పీఓ నియామక నోటిఫికేషన్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I ప్రారంభ బేసిక్ పే రూ.48,480గా పేర్కొంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్, ఎన్పీఎస్, మెడికల్, లీవ్ ట్రావెల్, లీజ్ రెంటల్ వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ముంబై కేంద్రంగా ప్రారంభ స్థాయి వార్షిక వేతనం (CTC) సుమారు రూ.20.43 లక్షలుగా పేర్కొంది. ఇందులో బ్యాంకు చెల్లించే వివిధ ప్రయోజనాలు, వసతి/లీజ్ సదుపాయాలు, రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్లు తదితరాలు కూడా ఉండొచ్చు.ప్రైవేట్ బ్యాంకుల్లో లెక్క వేరే..హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పే స్కేల్ ఉండదు. ఉద్యోగి నిర్వహించే పాత్ర, నగరం, అనుభవం, బ్యాంకు, విక్రయ లక్ష్యాలు, పనితీరు ఆధారంగా ప్యాకేజీ మారుతుంది.కస్టమర్ సర్వీస్, బ్రాంచ్ ఆపరేషన్స్ వంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నుంచి రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, బ్రాంచ్ మేనేజర్ వంటి స్థాయిలకు వెళ్లే కొద్దీ వేతనంలో గణనీయమైన తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 2026లో ఇండీడ్ డేటా ప్రకారం భారతదేశంలో బ్రాంచ్ మేనేజర్ సగటు బేసిక్ జీతం నెలకు సుమారు రూ.27,581గా ఉంది. నగరం, సంస్థ, అనుభవాన్ని బట్టి ఈ మొత్తం గణనీయంగా మారుతోంది. క్రెడిట్ అనలిస్ట్ వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు సుమారు రూ.9 లక్షల వార్షిక సగటు బేసిక్ పే ఉంటోంది.ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో భారీ ప్యాకేజీలు?ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సాధారణ రిటైల్ బ్యాంకింగ్ ఉద్యోగంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన విభాగం. కార్పొరేట్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లు వంటి ప్రత్యేక కార్యకలాపాల్లో పనిచేసే వారికి అనుభవం, సంస్థ, బాధ్యతను బట్టి అధిక వేతనాలు లభించవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో బోనస్ కూడా మొత్తం పరిహారంలో పెద్ద భాగంగా ఉండొచ్చు.అనుభవం పెరిగేకొద్దీ జీతం పెరుగుదలబ్యాంకింగ్లో కెరీర్ ప్రారంభ దశలో జీతం కంటే ఉద్యోగి పనిచేసే కేడర్, ప్రమోషన్లు, ప్రత్యేక నైపుణ్యాలు, బాధ్యతల విస్తృతి కీలకంగా మారతాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ నుంచి ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగే కొద్దీ నిర్దిష్ట పే స్కేల్, ఇంక్రిమెంట్లు, అలవెన్సులు పెరుగుతాయి. ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లో మాత్రం ప్రమోషన్‌తో పాటు పనితీరు ఆధారిత వేరియబుల్ పే, బోనస్, సంస్థ మార్పు ద్వారా ప్యాకేజీలో పెద్ద మార్పులు రావచ్చు.ఇదీ చదవండి: సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!! -
4 ఐపీవోలు.. 2 లిస్టింగ్‌లు: కొత్త షేర్ల ధరలివే..
ఈ వారం సైతం ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. నేడు(28న) రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు తెరలేచింది. ఈ బాటలో ఈ నెల 30న మరో 2 కంపెనీల ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు గత వారం ఐపీవోలు పూర్తి చేసుకున్న రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నాయి. శ్రిట్ ఇండియా @ రూ. 123–130 ఎస్ఆర్ఐటీ(శ్రిట్) ఇండియా పబ్లిక్ ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 123–130కాగా.. రూ. 218.4 కోట్లు సమీకరించనుంది. గతేడది (2025–26)లో కంపెనీ ఆదాయం దాదాపు రూ. 463 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 43 కోట్లను తాకింది. షా ఇన్వెస్టర్స్ హోమ్ @ రూ. 159–167 షా ఇన్వెస్టర్స్ హోమ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 159–167. తద్వారా రూ. 90.2 కోట్లు సమీకరించనుంది. గతేడది (2025–26)లో కంపెనీ ఆదాయం దాదాపు రూ. 72.4 కోట్లకు క్షీణించింది. నికర లాభం సైతం రూ. 13.1 కోట్లకు తగ్గింది. విశాల్ నిర్మితి @ రూ. 208–220 విశాల్ నిర్మితి పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభమై అక్టోబర్ 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 208–220కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 145 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 178 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. 2025–26లో ఆదాయం రూ. 344 కోట్లను దాటింది. నికర లాభం రూ. 25 కోట్లకు చేరింది. నిత్యాస్ జెమ్స్ @ రూ. 70–75 నిత్యాస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభమై అక్టోబర్ 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 70–75. తద్వారా రూ. 108.4 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో కంపెనీ ఆదాయం రూ. 203 కోట్లను అధిగమించింది. నికర లాభం రూ. 22.3 కోట్లను తాకింది. రూ. 420 కోట్ల సమీకరణలో ఏస్వెక్టార్ డిజిటల్ కామర్స్ సంస్థ ఏస్వెక్టార్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 420 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 30–32. తాజాగా 8.97 కోట్ల షేర్ల జారీ ద్వారా రూ. 287 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద 4.16 కోట్లు సమీకరిస్తోంది. కునాల్ బెహల్, రోహిత్ బన్సాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా స్నాప్‌డీల్, యూనికామర్స్, స్టెలారో బ్రాండ్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ ఇష్యూ సెపె్టంబర్ 29తో ముగుస్తోంది. మరోవైపు, ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అగ్రి, సీఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ గ్రీన్ ఏషియా ఇంపెక్స్ ఐపీవో ద్వారా రూ. 60.01 కోట్లు సమీకరిస్తోంది. సోమవారంతో ముగిసే ఈ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 85–90గా ఉంది.అక్టోబర్ 1న విడుదల ఈ నెల 28న పబ్లిక్ ఇష్యూలు ముగించుకున్న మనీ వ్యూ, ఏవన్ స్టీల్స్ అక్టోబర్ 1న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నాయి. డిజిటల్ రుణాల(లెండింగ్) ప్లాట్‌ఫామ్ మనీవ్యూ రూ. 32–34 ధరల శ్రేణితో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,092 కోట్లు సమీకరించింది. ఇక సమీకృత స్టీల్ తయారీ కంపెనీ ఏ–వన్ స్టీల్స్ ఇండియా రూ. 385–405 ధరల శ్రేణితో రూ. 405 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. -
Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తరువాత భగ్గుమన్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ రాబడుల్లో పెరుగుదల మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 300 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.6 లక్షల కోట్లు ఆవిరైంది. శుక్రవారం నాటి రూ.48.18 లక్షల కోట్ల నుంచి రూ.47.6 లక్షల కోట్లకు తగ్గింది.ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్ 973.63 పాయింట్లు లేదా 1.32 శాతం క్షీణించి 72,922.11 వద్ద, నిఫ్టీ 1.32% లేదా 306.25 పాయింట్లు కోల్పోయి 22,834.25 వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే..పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, బాండ్ ఈల్డ్స్ ఎగబాకడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశాలు సన్నగిల్లడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ, చమురు, బాండ్ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, పోరాటాన్ని ముగించేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్‌తో వివాదాన్ని దౌత్యపరమైన మార్గంలోనే పరిష్కరించగలమని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా సంక్షోభం త్వరగా సమసిపోయే అవకాశాలపై మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపించింది. దక్షిణ కొరియా మార్కెట్ సుమారు 2 శాతం నష్టపోగా, జపాన్ నిక్కీ 0.10 శాతం క్షీణించింది. చైనా మార్కెట్లు కూడా 1 శాతానికి పైగా నష్టాలతో ట్రేడయ్యాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో చమురు సరఫరాపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి.చమురు ధరల సెగసరఫరా అంతరాయాల భయాలతో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.2 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 106.6 డాలర్లకు చేరాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర 1.45 శాతం పెరిగి 93.76 డాలర్లకు చేరుకుంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దిగుమతి వ్యయం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు కరెంట్ ఖాతా లోటు పెరిగే ఆందోళన ఉంది.బాండ్ ఈల్డ్స్ కూడా పైకి..చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో బాండ్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రేట్ల మార్పులకు సున్నితమైన అమెరికా రెండేళ్ల బాండ్ ఈల్డ్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 4.90 శాతానికి చేరింది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి చేరుకుంది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో పెట్టుబడుల ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది.ఎఫ్‌పీఐల అమ్మకాలుదేశీయ మార్కెట్లపై మరో ప్రధాన ఒత్తిడి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) విక్రయాలు. జూలై, ఆగస్టు నెలల్లో నికర కొనుగోలుదారులుగా ఉన్న ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో అమ్మకాల వైపు మళ్లారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.17,131 కోట్ల విలువైన భారతీయ స్టాక్స్‌ను విక్రయించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల మొత్తం విక్రయాలు రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. -
బంగారం ధరల్లో భారీ కుదుపు! తులం ఒక్కసారిగా..
దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు వచ్చింది. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా పడిపోయాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు అమాంతం క్షీణించాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు భారీ ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 271 పాయింట్లు క్షీణించి 22,869 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 871 పాయింట్ల నష్టంతో 73,024 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడం, చాలా గ్లోబల్ ఈక్విటీలు క్షీణించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి.హిందాల్కో ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇనిస్టిట్యూట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.62 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.61 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ తక్కువ క్షీణితతో మెరుగనిపించింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.04బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.32 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.17% వద్దకు చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51% లాభపడింది.నాస్డాక్ 0.48% పెరిగింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!!
దేశంలో పౌరులకు ఆదాయపు పన్ను ఉంటుందని అందరికీ తెలుసు. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ సంపాదించే వారంతా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో ఎక్కువ జీతాలు తీసుకునేవారంతా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అయితే ముఖ్య మంత్రులు, మంత్రులు వంటి హోదాల్లో ఉన్న వారికి కూడా పెద్ద మొత్తంలో జీతాలు ఉంటాయి. మరి వీరంతా తమకొచ్చే జీతంపై ఆదాయపు పన్నును తామే చెల్లిస్తున్నారా.. లేక ప్రభుత్వం చెల్లిస్తోందా? ప్రభుత్వం చెల్లిస్తోంది అంటే వారు కట్టాల్సిన ట్యాక్స్ ప్రజలుగా మనం కడుతున్నట్లే..సాధారణ ఉద్యోగి జీతం ఒక పరిమితిని దాటితే ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. ప్రైవేట్ ఉద్యోగి అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా.. తన ఆదాయానికి వర్తించే నిబంధనల ప్రకారం ట్యాక్స్ చెల్లిస్తారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రుల విషయంలో మాత్రం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. అంటే.. ఆ పన్ను వ్యక్తిగతంగా సీఎం లేదా మంత్రి భరించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తుంది.ఏపీలో ఉన్న నిబంధనలేంటి?ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న వేతనాల చెల్లింపు చట్టం, 1953లోని సెక్షన్ 3(4) ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఈ చట్టం కింద లభించే జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.అంటే ముఖ్యమంత్రి హోదాలో అందుకునే జీతం, సంబంధిత అలవెన్సులు, పెర్క్విజిట్లపై వర్తించే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే సీఎం లేదా మంత్రి ఇతర వ్యక్తిగత ఆదాయాలు పొందితే వాటికి ఈ నిబంధన వర్తించదు. ఈ ప్రత్యేక మినహాయింపు చట్టంలో పేర్కొన్న జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకే పరిమితం.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. కొన్ని ప్రకారం సీఎంగా ఆయనకు లభిస్తున్న పారితోషికం నెలకు సుమారు రూ.3.35 లక్షలు. ఇందులో జీతంతో పాటు వివిధ రకాల అలవెన్సులు కలిసి ఉంటాయి.తెలంగాణలోనూ ఇదే నిబంధనతెలంగాణలో కూడా ఇదే తరహా నిబంధన కొనసాగుతోంది. వేతనాల చెల్లింపు చట్టం, 1953లోని సెక్షన్ 3(4) ప్రకారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఈ చట్టం కింద లభించే జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. 2026-27 బడ్జెట్ పత్రాల్లో ఆయన ప్రాథమిక నెల జీతం రూ.4.11 లక్షలుగా తొలిసారి వివరాలు వెల్లడైనట్లు ది హిందూ నివేదించింది. అయితే బేసిక్ జీతంతో పాటు ఇతర అలవెన్సులు, సౌకర్యాలు వేర్వేరుగా ఉండొచ్చు.మరి ప్రజల డబ్బుతో ట్యాక్స్ కడుతున్నారా?రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రజలు చెల్లించే వివిధ పన్నులు, ఫీజులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ప్రభుత్వ ఆదాయాలు ఉంటాయి. వీటన్నింటి నుంచి ప్రభుత్వ ఖజానా ఏర్పడుతుంది. అదే ఖజానా నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ఖర్చులతో పాటు చట్టప్రకారం సీఎం, మంత్రుల జీతానికి సంబంధించిన ఆదాయపు పన్ను వంటి చెల్లింపులు కూడా జరుగుతాయి.ఇలా చూస్తే.. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక జీతం-అలవెన్సులకు సంబంధించిన పన్ను భారం చివరకు ప్రభుత్వ ఖజానాపైనే పడుతుంది. అంటే ఆ చెల్లింపు ప్రభుత్వ వ్యయంగా మారుతుంది.ఇదీ చదవండి: ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!! -
ఫోన్‌పేలో 20 వేలకు పైగా ఉద్యోగాలు
ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ కోసం భారీ ప్రణాళికల్లో ఉంది. వీటి ప్రకారం రాబోయే ఏడాది వ్యవధిలో 20,000 మందికి పైగా సేల్స్ సిబ్బందిని నియమించుకోనుంది. 50 లక్షలకు పైగా పేమెంట్ డివైజ్‌లను (స్మార్ట్స్పీకర్లు, పీవోఎస్ డివైజ్‌లు సహా) ఏర్పాటు చేయనుంది.వీటిలో సుమారు 50 శాతం పైగా డివైజ్‌లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపు సేవలను మరింతగా అందుబాటులోకి తేనుంది. సరళమైన నిబంధనలతో కొత్త కారి్మక చట్టాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకునేందుకు దోహదపడతాయని ఫోన్‌పే తెలిపింది.అలాగే, ఇటీవల ప్రకటించిన ఎండీఆర్ కింద వసూలయ్యే మొత్తంలో 5 శాతాన్ని ప్రత్యేక నిధికి కేటాయించడమనేది చిన్న వ్యాపారుల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు సహాయకరంగా ఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: ఏఐ ట్రైనింగ్ నిలిపివేత.. ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం -
సరిపోదా.. రెండు శనివారాలు?
మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకు సమ్మె వాయిదా పడటంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సమ్మె వాయిదా చర్చల్లో మరో అంశం తెరపైకి వచ్చింది. బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం పనిచేస్తున్న శనివారాలు కూడా సెలవులుగా మారనున్నాయి. దీంతో ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థపై ఓ రకమైన అభిప్రాయంతో ఉన్న ఖాతాదారుడికి మరింత అసహనం పెరుగుతోంది. ‘నెలలో రెండు శనివారాలు సెలవే కదా.. మిగిలిన రోజుల్లో బంద్ ఉంటే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నాడు..ప్రస్తుతం ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు అధికారికంగా సెలవు ఉంటోంది. మొదటి, మూడో, ఒక్కోసారి ఐదో శనివారాల్లో శాఖలు పనిచేస్తున్నాయి. వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలైతే ఈ శనివారాలు కూడా సెలవే కానుంది. అంటే.. నెలలో అన్ని శనివారాల్లోనూ బ్యాంకు బ్రాంచ్ తలుపులు మూసే పరిస్థితి. ప్రస్తుతానికి దీనిపైనే చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆరోజే సమయం ఉన్నవారికి?ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా వారంలో మిగిలిన రోజుల్లో పని ఒత్తిడి ఉండేవారికి శనివారం బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఖాతాలో మార్పులు, కేవైసీ, డాక్యుమెంటేషన్, నగదు లావాదేవీలు, రుణాలకు సంబంధించిన కొన్ని పనులు వంటి వాటి కోసం బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తే.. పనిచేసే శనివారం వారికి మరో అవకాశం.ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోతే? బ్యాంకు పని కోసం సెలవు పెట్టుకోవాలి.. లేదంటే మరో పని రోజు దొరికే వరకు ఆగాలి. ఇప్పటికే బ్రాంచ్ పని వేళలు, కౌంటర్ సమయాలు, రద్దీ కారణంగా బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం కష్టంగా ఉంటే.. పనిచేసే శనివారం కూడా అందుబాటులో లేకపోవడం ఖాతాదారులకు అదనపు ఇబ్బందే. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ పనుల్లో బిజీగా ఉండేవారికి శనివారం దొరికే ఆ ఒక్క అవకాశం కూడా కీలకమే.అక్కడ మరింత ఘోరం!ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. పట్టణాలు, నగరాలతో పోలిస్తే అక్కడ బ్యాంకింగ్ శాఖలు, సిబ్బంది, ప్రత్యామ్నాయ సేవల అందుబాటు పరిమితంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. దీంతో బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనుల కోసం అందుబాటులో ఉన్న పని రోజుల్లోనే సమయం కేటాయించడం కస్టమర్లకు మరింత కష్టంగా మారొచ్చు. దూర ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చే వారికి శనివారం లభించే అదనపు అవకాశం పోతే.. తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావొచ్చు.డిజిటల్ బ్యాంకింగ్ ఉన్నా..యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు కొనసాగుతాయి. కాబట్టి రోజువారీ డిజిటల్ లావాదేవీలకు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చు. కానీ ప్రతి పని మొబైల్లోనే పూర్తయ్యే పరిస్థితి లేదు. బ్రాంచ్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిన పనుల విషయంలో మాత్రం కస్టమర్‌కు అందుబాటులో ఉండే ఒక రోజు తగ్గుతుంది.ముఖ్యంగా శనివారం–ఆదివారం వరుసగా సెలవులు ఉండటంతో పాటు మధ్యలో మరో సెలవు వస్తే.. బ్రాంచ్ సేవలకు గ్యాప్ మరింత పెరగొచ్చు. అత్యవసరంగా బ్రాంచ్ సేవ అవసరమైనప్పుడు కస్టమర్లు తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సి రావచ్చు.ఉద్యోగులకు సరే.. కస్టమర్లకు?‘‘మాతో బలవంతంగా ఆదివారం పని చేయిస్తారా? దీనిని ఖండిస్తూ మరోరోజు సమ్మె చేపడతాం’’ అంటూ బ్లాక్ సండే పేరిట నిన్న విధులు నిర్వర్తించిన బ్యాంకింగ్ ఉద్యోగులు ఇప్పుడు రగిలిపోతున్నారు. మరి ఇలాంటివాళ్లు శనివారాలను సెలవుగా తీసుకున్న తర్వాత.. కస్టమర్ల కోసం ఒక పని రోజులో కాసేపు అదనంగా పనిచేయడానికి సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు ఖాతాదారుల ప్రశ్న.ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంతో ఉద్యోగులకు వారానికి రెండు రోజుల సెలవు లభిస్తుంది. అయితే తగ్గే బ్రాంచ్ సేవల రోజును కస్టమర్లకు ఎలా భర్తీ చేస్తారన్నదే అసలు విషయం. మిగిలిన రోజుల్లో పని గంటలు పెంచి సేవల లోటును భర్తీ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికే పని రోజుల్లోనే బ్రాంచ్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న పరిస్థితుల్లో మరో రోజు తగ్గితే ఖాతాదారుల కష్టాలు మరింత పెరగొచ్చు. ఉద్యోగుల సౌలభ్యం కోసం ఒక అదనపు సెలవు.. అదే సమయంలో కస్టమర్లకు ఒక పని రోజు తక్కువ. మరి ఈ లెక్కలో ఖాతాదారుడి సౌలభ్యం ఎక్కడ?.ఇదీ చదవండి: భారత్‌కు సరికొత్త సంక్షోభం! ఈసారి.. -
టీపీ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఇవే..
భారత్‌లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా విస్తరించడం చాలా ముఖ్యం. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం దేశీయంగా వాహనం కలిగిన ప్రతి వ్యక్తికి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. యాక్ట్ ఓన్లీ లేదా లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్‌గా కూడా పిలిచే ఈ కవర్ కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు.ఇన్సూరెన్స్ చేసిన వాహనాన్ని వినియోగించినప్పుడు థర్డ్ పార్టీకి గాయం, మరణం లేదా ఆస్తి నష్టం సంభవించినప్పుడు, చట్టపరంగా, ఆర్థికంగా ఏర్పడే భారాల నుంచి వాహన యజమానికి రక్షణ లభిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పార్లమెంటరీ నివేదిక ప్రకారం, 2026 మార్చి నాటికి ’వాహన్’ డేటాబేస్ ప్రకారం ప్రస్తుతం దేశీయంగా రహదార్లపై తిరుగుతున్న వాటిల్లో 45 శాతం వాహనాలకు బీమా లేదు. ఈ నేపథ్యంలోనే వాహనాలకు థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు కూడా ఇటీవల స్పష్టం చేసింది. టూ–వీలర్లకు కాలపరిమితిని ఆరు సంవత్సరాలకు, ఫోర్–వీలర్లకు నాలుగు సంవత్సరాలకు పొడిగించాలని పేర్కొంది. ప్రధానంగా మూడు పార్టీలు.. థర్డ్–పార్టీ (టీపీ) బీమా ఒప్పందంలో ప్రధానంగా మూడు పక్షాలు ఉంటాయి. మొదటి పక్షం పాలసీదారు. బీమా పాలసీలో ఎవరి పేరు ఉంటుందో వారే పాలసీదారు. రెండో పక్షం.. పాలసీని అందించే ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక మూడో పార్టీ.. అంటే, ఇన్సూరెన్స్ చేసిన వాహనం వల్ల నష్టం లేదా గాయానికి గురయ్యే వ్యక్తి లేదా ఆస్తి. ఇలాంటి సందర్భాల్లో మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం వాహన యజమానిపై పడే భారానికి టీపీ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తుంది. సాధారణంగా ఎవరైనా వ్యక్తికి సంబంధించిన వాహనం వల్ల థర్డ్ పార్టీకి నష్టం జరిగితే అది కొన్ని సందర్భాల్లో లక్షలు, కోట్ల వరకు కూడా ఊహించని ఖర్చులకు దారి తీయొచ్చు. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని నివారించుకునేందుకు టీపీ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. టీపీ కవర్ ఉన్నంత మాత్రాన వాహనానికి కూడా బీమా ఉన్నట్లు కాదు. దానికోసం ఓన్–డ్యామేజ్ కవర్‌తో సహా సమగ్ర పాలసీ అవసరమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి టీపీ బీమా మాత్రమే ఉందనుకుందాం. అతని కారు ఓ టూ–వీలర్‌ను ఢీకొని, రైడర్‌కు గాయాలై, టూ–వీలర్ దెబ్బతింటే, రూ. 1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందనుకుందాం. ఇలాంటి సందర్భంలో ఈ మొత్తాన్ని టీపీ పాలసీ కవర్ చేస్తుంది. అయితే, అతని సొంత కారుకు పడిన డెంట్‌ను మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చును మాత్రం ఇది కవర్ చేయదు. ఇలాంటి నష్టాల నుంచి సొంత వాహనాన్ని రక్షించుకోవడానికి సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం అవసరం.దీర్ఘకాలిక పాలసీతో ప్రయోజనాలు.. దీర్ఘకాలిక థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానులకు పలు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో ప్రీమియం మారుతుందేమో అనే అనిశ్చితి ఉండదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న క్లెయిమ్‌ల కారణంగా ప్రతి ఏడాది ఖర్చులు పెరిగినా, వాటి ప్రభావం నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతి ఏడాది పాలసీని రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో అదనపు అడ్మిని్రస్టేటివ్ చార్జీలు కూడా తగ్గుతాయి. దీంతో దీర్ఘకాలంలో పాలసీ మరింత ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక కవర్ వల్ల కలిగే సౌలభ్యం కూడా ముఖ్యమైన ప్రయోజనం. ఒకే పాలసీ ఉండటంతో ప్రతి ఏడాది రెన్యువల్ తేదీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిపోతుందేమోననే ఆందోళన, ప్రతి సంవత్సరం పేపర్‌వర్క్ చేసే ఇబ్బంది కూడా ఉండదు. దీంతో అదనపు శ్రమ లేకుండా ఇన్సూరెన్స్‌ను కొనసాగించడం, నిబంధనలను పాటించడం మరింత సులభమవుతుంది.ఇదీ చదవండి: బుల్లి ఎలక్ట్రిక్ కారు.. భలే రేంజు!మొత్తంమీద, దీర్ఘకాలిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కవరేజీని అందించడంతో పాటు, పాలసీ వ్యవహారాన్ని సులభతరం చేస్తుంది. ఫీచర్ల గురించి ఎక్కువగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పాలసీని సులభంగా తీసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, సరైన ఇన్సూరెన్స్‌తో పాటు డ్రైవ్ చేసే వారికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉండాలి. కమర్షియల్ వాహనాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరులకు కూడా భద్రత కల్పిస్తాయి. -
ఒడిదుడుకులు కొనసాగుతాయ్..!
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరలు, బాండ్లపై రాబడులు (ఈల్డ్స్), స్థూల ఆర్థిక గణాంకాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని భావిస్తున్నారు. ‘‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం తర్వాత డాలర్ బలం పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) నిధుల ఉపసంహరణ ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు 100 డాలర్ల ఎగువనే ఉండటం, అమెరికా పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 5.2%కి చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెమటలు పట్టిస్తున్నాయి. భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు పెరిగి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత ఎక్కువవుతాయి. ఇవి భారత్ లాంటి వర్ధమాన మార్కెట్లకు విదేశీ నిధుల రాకను పరిమితం చేసే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్వల్పకాలంలో మార్కెట్ ఒత్తిడిలోనే కొనసాగవచ్చు’’ అని హెచ్ఎస్టీ వెల్త్ వ్యవస్థాపకుడు హరిసెల్వన్ రాధాకృష్ణన్ తెలిపారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 2న (శుక్రవారం) ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈక్విటీ, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. కొనసాగుతున్న చమురు సవాళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ముడిచమురు ధరలే అత్యంత కీలకమైన అంశంగా మారనున్నాయి. అమెరికా–ఇరాన్ వివాద పరిష్కారానికి యత్నాలు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై సానుకూల వార్తలతో గత శుక్రవారం (సెపె్టంబర్ 25న) బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 2.1 శాతం తగ్గి 104.32 డాలర్ల వద్ద స్థిరపడింది. దీర్ఘకాలం పాటు చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగితే భారత్ దిగుమతుల భారం పెరిగి, రూపాయి క్షీణతకు కారణమవ్వడమే కాకుండా ద్రవ్యోల్బణ అంచనాలను క్లిష్టతరం చేస్తాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా పునరుద్ధరణపై స్పష్టత వస్తే ఇంధన ధరలు తగ్గి రూపాయి, స్టాక్ మార్కెట్లకు ఊరట లభిస్తుంది. స్పష్టమైన దిశానిర్దేశం వచ్చే వరకు ముడిచమురు, పశ్చిమాసియా పరిణామాలు మార్కెట్లో తీవ్ర అస్థిరతకు కారణమవుతాయి. దేశీయ స్థూల గణాంకాలపై దృష్టి దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఆగస్టు పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటా సోమవారం విడుదల కానుంది. హెచ్ఎస్బీసీ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు సైతం కీలకంగా మారనున్నాయి. మరోవైపు పండుగ సీజన్ ఆరంభంలో ఇన్వెస్టర్లు వాహన అమ్మకాల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఆరోవారమూ అమ్మకాలే.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీలు) లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. గతవారంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ. 11,490 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఎఫ్ఐఐల అమ్మకాల పరంపర వరుస ఆరోవారమూ కొనసాగినట్లైంది. అయితే, పబ్లిక్ ఇష్యూల కారణంగా సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.16,398 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి.నిఫ్టీకి 23,000 వద్ద కీలక మద్దతు నిఫ్టీకి ఈ వారంలో 23,000 స్థాయి అత్యంత కీలకమైన మద్దతుగా నిలవనుంది. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్ 21, 55, 100, 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (ఈఎంఏ)ల కన్నా దిగువున ట్రేడవుతుండటం మార్కెట్లో సాంకేతిక బలహీనతను సూచిస్తోంది. ఒకవేళ 23,000 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీ 22,600 స్థాయికి దిగిరావొచ్చు. రికవరీ సాధిస్తే ఎగువున 23,450 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. ‘‘ నిఫ్టీ 23,450 దిగువున ఉన్నంతవరకు మార్కెట్లో బలహీనత కొనసాగుతుంది. మార్కెట్ పెరిగిన ప్రతిసారీ లాభాల స్వీకరించే వ్యూహాన్ని అనుసరించడం ఉత్తమం’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రావి సింగ్ సూచించారు. ఏడో వారమూ వీడని నష్టాలు క్రూడ్ సెగలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఏడో వారమూ దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. గత వారంలో సెన్సెక్స్ 399 పాయింట్లు , నిఫ్టీ 210 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. -
హెల్త్‌కేర్.. ‘షేర్’ ఎవరిది?
హెల్త్‌కేర్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చేది ఆసుపత్రులు... ఫార్మా కంపెనీలే. మరి డయాగ్నస్టిక్స్... వైద్య పరికరాలు... హెల్త్‌టెక్.. ఆరోగ్య బీమా... టెలీ టూరిజం.. టెలీ మెడిసిన్ వీటి సంగతేంటి? వీటి చుట్టూ అల్లుకున్న వందలాది అనుబంధ రంగాల మాటేంటి? గత ఏడాది ఏకంగా 600 బిలియన్ డాలర్లను దాటేయటంతో పాటు ఏటా 22.5 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని నమోదు చేస్తోందంటే భారత హెల్త్‌కేర్ రంగం ఎంత పెద్దదో తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు. పైపెచ్చు 2023లో దేశ జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హె ల్త్‌కేర్ ఖర్చు 2030 నాటికి 5 శాతాన్ని మించిపోతాయనేది ఆర్థిక సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో ఎక్కువ వృద్ధిని నమోదు చేసే పరిశ్రమలేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్ లీడర్లెవరు? ఏ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఎక్కువ రాబడులొస్తాయి? దీనిపై ‘సాక్షి వెల్త్’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి కథనమిది. దశాబ్దాలుగా దేశంలో హెల్త్‌కేర్ అంటే ఫార్మా సంస్థలే. హెల్త్‌కేర్ వృద్ధిపై ఇన్వెస్టర్లు ఏం మాట్లాడినా మందుల తయారీ కంపెనీలు... జనరిక్ మందులు... ఏపీఐల గురించే. కానీ పరిస్థితి మారింది. మన హెల్త్‌కేర్ ఎకానమీలో ఇపుడు ఆసుపత్రులు, ఆరోగ్య బీమా, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజ్‌లు, స్పెషాలిటీ కేర్, హెల్త్‌టెక్, మెడికల్ టూరిజం, హోమ్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా చేరాయి. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆవిష్కృతమయ్యింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. మరి జనం ఖర్చులు పెరగటం వల్లే ఇదంతా సాధ్యమయ్యిందా? కానే కాదు. జనం ఆయుష్షు పెరిగింది. జీవనశైలి మారింది. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రివెంటివ్ కేర్‌పై శ్రద్ధ... బీమా కవరేజీ పెరిగాయి. స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల బదులు చాలామంది వ్యవస్థీకృత ప్రయివేటు ఆసుపత్రులకు మళ్లారు. ఆసుపత్రుల పడకలు పెరిగాయి. వైద్యపరీక్షల్లో ఆధునికత పెరిగింది. వైద్య పరికరాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ హెల్త్‌కేర్ ప్రతిదశలోకీ డిజిటల్ టెక్నాలజీ చొచ్చుకుపోయింది. వీటన్నిటి ఫలితమే సమగ్ర హెల్త్‌కేర్ ఎకానమీ. హెల్త్ డెలివరీ @ రూ.10 లక్షల కోట్లు! హెల్త్‌కేర్ పరిశ్రమపై తాజాగా సెబీ నిర్వహించిన సమావేశంలో 2025లో హెల్త్‌కేర్ డెలివరీ పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల రెవెన్యూను నమోదు చేసినట్లు అంచనా వేశారు. ఇది 2028 ఆర్థిక సంవత్సరానికల్లా 10–12 శాతం వార్షిక వృద్ధితో 9.8 లక్షల కోట్లను చేరుతుందని పేర్కొన్నారు. అదే సమావేశంలో... మెడికల్ డివైజెస్, డయాగ్నస్టిక్స్ మార్కెట్లు గత ఏడాది రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చూశాయని, ఇవి 11–12 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని అంచనా వేశారు. ఇక ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, సర్జికల్స్, హెల్త్‌టెక్, స్పెషాలిటీ కేర్, రిహాబిలిటేషన్, హోమ్ హెల్త్‌కేర్, మెడికల్ టూరిజంలను కూడా కలిపితే ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు ఏదో ఒక రంగంలో కాకుండా మొత్తం వ్యవస్థలో అవకాశాలు ఎక్కువన్నది అర్థమవుతుంది. మందులొక్కటే కాదు... మొత్తం వ్యవస్థపై ఖర్చు మనం ఎక్కువగా ఏ మందులు వాడుతున్నామన్నది గతంలో ఇన్వెస్టర్లు చూసిన కోణం. కానీ ఇపుడు... దేనిపై ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యం. ఆరోగ్య బీమాతో మొదలుపెడితే... ఒక పేషెంట్ తన వ్యాధి నుంచి బయటపడేందుకు ఆసుపత్రి... డయాగ్నస్టిక్ సెంటర్... సీటీ/ఎంఆర్ఐ/పెట్ స్కాన్... మెడికల్ డివైజ్... సర్జికల్ ఇంప్లాంట్.. కన్సూమబుల్స్... ఫార్మసీ... ఫాలో అప్ పరీక్షలు.. హోమ్ హెల్త్‌కేర్... డిజిటల్ పర్యవేక్షణ .. వీటన్నింటిపై ఖర్చుచేస్తాడు. ఆ పేషెంట్ నుంచి వీటన్నిటికీ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ మొత్తం వ్యవస్థను చూడాల్సి ఉంటుంది. హెల్త్‌కేర్ ఎందుకు పెరుగుతోందంటే...ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ అనారోగ్యం బారిన పడకుండా ప్రివెంటివ్ పరీక్షలు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ సేవలు, ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవటంపై మన వాళ్లలో బాగా శ్రద్ధ పెరుగుతోంది. తాజా ఎన్ఎస్ఓ హెల్త్ సర్వేలో... 2017–18తో పోలిస్తే త మకు వ్యాధులున్నాయని చెప్పినవారి సంఖ్య 2025లో బాగా పెరిగింది. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను వినియోగించుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. దీనర్థం హెల్త్‌కేర్ మార్కెట్ పెరుగుతోందనే. జీవనశైలి వ్యాధులు దేశంలో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి సాధారణంగా ఒకసారి వైద్యం చేస్తే సరిపోదు. ఏళ్ల తరబడి... దశాబ్దాల తరబడి హెల్త్‌కేర్ వినియోగం అవసరం. ఉదాహరణకు మధుమేహంతో ఉన్న వ్యక్తి తరచూ డాక్టర్ని కలవాలి. రక్త పరీక్షలు చేయించాలి. రెగ్యులర్‌గా మందులు తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలం పర్యవే„ý ణ అవసరమైన వ్యాధి ఇది. అందుకే ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్ డిమాండూ పెరుగుతుంది. పెరిగిన ఆయుఃప్రమాణం హెల్త్‌కేర్ ఎకానమీతో జనం ఆయుఃప్రమాణం పెరిగింది. ఆసుపత్రులు, చికిత్సల కోసం యువత ఎక్కువ ఖర్చు చేయకున్నా వయసు మళ్లినవారికి తప్పటం లేదు. గుండె, కేన్సర్, కీళ్లు, కళ్లు, కిడ్నీ, రిహాబిలిటేషన్, దీర్ఘకాల మందులు, హోమ్ హెల్త్‌కేర్, సహాయకులపై వీరు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ ఆసుపత్రులను దాటి అవకాశాలు పెరుగుతున్నాయి. మున్ముందు హెల్త్‌కేర్ అనేది పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటంతోనే ఆగిపోదు. హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, రిమోట్ పర్యవేక్షణ పెరుగుతాయి. ఈ రంగంలో భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను గుర్తించవచ్చు కూడా. బీమా.. సమగ్ర మార్పు ఆసుపత్రి బిల్లు కోసం అప్పులపాలై జీవితాంతం ఇబ్బందులు పడ్డ దృష్టాంతాలు ఇప్పటికీ ఉన్నా... గతంకన్నా తగ్గాయి. కారణం... బీమాపై అవగాహన పెరగటం. ఇపుడు హెల్త్‌కేర్‌పై చేస్తున్న ఖర్చులు అత్యధికం బీమా కంపెనీల నుంచో, ప్రభుత్వ స్కీముల నుంచో చేస్తున్నవే తప్ప వ్యక్తుల నుంచి కాదు. అందుకే 2013–14లో 1.3 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఖర్చు 2022–23 నాటికి 3.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య రంగంపై పెడుతున్న ఖర్చులో ప్రభుత్వ వాటా 28 శాతం నుంచి 43.7 శాతానికి పెరగ్గా... వ్యక్తులు సొంతంగా చేస్తున్న ఖర్చు 64 శాతం నుంచి 43.4 శాతానికి పడిపోయింది. ఆర్థికంగా ఇది అత్యంత ప్రాధాన్యమున్న పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ లేదా బీమా కవరేజీ ఉన్న సందర్భాల్లో జనం చికిత్స విషయంలో పెద్దగా వెనకాడరు. త్వరగా నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల మొత్తం ఆరోగ్య ఎకానమీపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. విస్తరణ అవకాశాలెక్కువే... జాతీయ హెల్త్ పాలసీ ప్రకారం ప్రతి వెయ్యి మందికి రెండు ఆసుపత్రి పడకలుండాలి. కానీ ఇపుడున్నది 1.4 మాత్రమే. అందులో ప్రభుత్వానిది 0.6. ఈ గ్యాప్‌తో విస్తరణకు ఎంత అవకాశముందో అర్థమవుతుండగా ప్రయివేటు రంగం దీన్ని అందుకోవటానికి వేగంగా అడుగులేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 18 ప్రముఖ ఆసుపత్రులో మరో 34వేల పడకలు జత చేయనున్నాయనేది తాజా ‘ఇక్రా’ అ«ంచనా. కాకపోతే ఇలా పడకలు పెరుగుతున్న కొద్దీ... ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు కూడా మరింత పెరుగుతుంది. వీటివల్ల ప్రధానం ఆసుపత్రి భవనం.. మెడికల్, ఐసీయూ, డయాగ్నస్టిక్ పరికరాలు, సర్జికల్ ఉత్పత్తులు, డాక్టర్లు, నర్సులు, ఫార్మసీ, బీమా, హెల్త్‌కేర్ ఐటీ... ఇలా అన్నీ పెరుగుతాయి. అందుకే ఆసుపత్రి ఆదాయం ఒక్కటే కాకుండా ఆసుపత్రి విస్తరణ వల్ల మొత్తం హెల్త్‌కేర్ ఎకానమీపై ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆరోగ్య రంగ దిగ్గజాలను ఇలా చూడొచ్చు...ఆసుపత్రులు 2026 హెల్త్‌కేర్ రివ్యూ ప్రకారం ఆసుపత్రుల రెవెన్యూ 15 శాతం వృద్ధి చెందుతోంది. బెడ్ ఆక్యుపెన్సీ 60–75 శాతం వరకూ ఉంది. → అపోలో హాస్పిటల్స్ → మ్యాక్స్ హెల్త్‌కేర్ → ఫోరి్టస్ హెల్త్‌కేర్ → ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ → మెదాంతా/ గ్లోబల్ హెల్త్ → నారాయణ హృదయాలయ → కిమ్స్ → రెయిన్బో చిల్డ్రన్స్ → యథార్థ్ హాస్పిటల్స్ డయాగ్నస్టిక్స్ కన్సాలిడేషన్, విస్తరణ, హోమ్ కలెక్షన్, డిజిటల్ బుకింగ్, ప్రత్యేక పరీక్షలతో వ్యవస్థీకృత డయాగ్నస్టిక్ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇవి 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 25 శాతానికిపైగా ఎబిటా మార్జిన్లను సాధించాయి. → డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ → మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ → విజయ డయాగ్నస్టిక్స్ → థైరోకేర్ → క్రిస్నా డయాగ్నస్టిక్స్ → సురక్షా డయాగ్నస్టిక్స్ మెడికల్ డివైజెస్, సర్జికల్ ప్రొడక్ట్స్ ఈ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ అన్‌లిస్టెడ్‌గానే ఉన్నాయి. కాబట్టి ఇందులో లిస్టయ్యే కంపెనీలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. → పాలీ మెడిక్యూర్ → ప్రివెస్ట్ డెంట్ప్రో → న్యురెకా → జీకేబీ ఆప్తాల్మిక్స్ → శ్రీ పేస్ట్రానిక్స్ → హేమంత్ సర్జి్కల్ ఆరోగ్య బీమా హెల్త్‌కేర్‌కు ఫైనాన్సింగ్ ఇంజిన్‌గా పనిచేస్తున్న ఈ రంగం... ప్రివెంటివ్ కేర్‌పై పెరుగుతున్న అవగాహన కారణంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో స్టాండలోన్ కంపెనీలు తక్కువే. → స్టార్ హెల్త్ → నివా బూపా → ఐసీఐసీఐ లాంబార్డ్ (డైవర్సిఫైడ్) సీఆర్ఓ/ సీడీఎంఓ భారత ఫార్మా ఎగుమతులిపుడు జనరిక్ మందులకే పరిమితం కాదు. డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ రీసెర్చ్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ, స్పెషాలిటీ కెమిస్ట్రీ, బయాలాజిక్స్ వంటి రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు భారత సంస్థలపై ఆధారపడుతున్నాయి. దీంతో సీఆర్ఓ/సీడీఎంఓ అవకాశాలు పెరుగుతున్నాయి. → సింజీన్ ఇంటర్నేషనల్ → అరాజెన్ లైఫ్‌సైన్సెస్ → సాయి లైఫ్ సైన్సెస్ → ఆంథెమ్ బయోసైన్సెస్ → న్యూలాండ్ ల్యా»ొరేటరీస్ → గ్లాండ్ ఫార్మా → పిరమల్ ఫార్మా → లారస్ ల్యాబ్స్ → దివీస్ ల్యాబొరేటరీస్ హెల్త్‌టెక్, డిజిటల్ హెల్త్ పేషెంట్ రికార్డులు, డయాగ్నస్టిక్ చిత్రాలు, ల్యాబ్ రిపోర్ట్లు, బిల్లింగ్, బీమా క్లెయిమ్‌లు, ప్రిస్క్రిప్షన్లు... ఇలా అన్నింటికీ డిజిటల్ సేవలు అవసరమే. → టాటా ఎలక్సీ → పెర్సిస్టెంట్ సిస్టమ్స్ → కొఫోర్జ్ → ఇన్ఫోసిస్ → టీసీఎస్ → విప్రో → ఎంఫసిస్ ఇంకా హోమ్ హెల్త్‌కేర్, వృద్ధుల సంరక్షణ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నా వీటిలో లిస్టెడ్ కంపెనీలు ప్రత్యేకంగా ఏమీ లేవు. చాలా ఆసుపత్రులు ఈ సేవల్ని అందిస్తుండగా... కొన్ని స్టార్టప్‌లు సైతం వేగంగా ఎదుగుతున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో అవకాశాలను, మార్పులను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి.తదుపరి భాగంలో... ఆసుపత్రుల కేరాఫ్ ఎవరిది? అపోలో.. మాక్స్.. ఫోర్టిస్.. ఆస్టర్.. మెదాంతా.. నారాయణ.. కిమ్స్.. రెయిన్బో.. యథార్థ్ ఇవన్నీ అగ్రశ్రేణి ఆసుపత్రులే. మరి వీరిలో బాగా లబ్ధి పొందేదెవరు? ఎవరి ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉండబోతోంది? తదుపరి 50వేల పడకల్లో ఎవరి వాటా ఎంత? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి?.. వచ్చేవారం ‘సాక్షి వెల్త్’లో తెలుసుకుందాం. రమణమూర్తి మంథా -
బ్యాంకుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: అయిదు రోజుల పనివారంతో పాటు తమ డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) హామీ ఇవ్వడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చిన ఈ సమ్మె నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ‘‘ప్రస్తుతం పని దినాలుగా ఉన్న మొదటి, మూడో, అయిదో శనివారాల కూడా సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించి, సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరిపి.. ముఖ్యంగా ఖాతాదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రూపొందిస్తుంది. స్కేల్–4, ఆపై స్థాయి అధికారులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో మార్పులపై ఐబీఏతో చర్చలు జరిపి, యూనియన్లు, అసోసియేషన్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అలాగే 2024 మార్చి 8 నాటి సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన అంశాలపై చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు కుదిరిన అంగీకారం నేపథ్యంలో ప్రతిపాదిత నిరసన కార్యక్రమాలు, సమ్మెను వాయిదా వేసేందుకు అంగీకరిస్తున్నాం’’ అని యూఎఫ్‌బీయూ ఒక ప్రకటనలో తెలిపింది. -
మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త, జియో ఫ్రీ రీచార్జ్ ఆఫర్ గురించి తెలుసా?
మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త!మన పేరుతో సిమ్ తీసుకోవడం, దాన్ని అవసరం లేనప్పుడు వేరే వ్యక్తికి ఇవ్వడం సాధారణంగానే అనిపిస్తుంది. కానీ.. ఇకపై ఈ విషయంలో తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. భారీ జరిమానా చెల్లించడంతో పాటు, మూడేళ్లు జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్తమొబైల్ రీఛార్జ్‌లపై కేంద్ర శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నామని భావించే వినియోగదారులు ఏడాదిలో 12 సార్లు కాకుండా.. 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొత్త వ్యాలిడిటీ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.జియో ఫ్రీ రీచార్జ్ ఆఫర్ గురించి తెలుసా?కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే 6 నెలలు రీచార్జ్ ఉచితంగా పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే జియో వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా 2026 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!ట్రైన్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసి.. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు 2026 అక్టోబర్ 15 నుంచి ఓ కొత్త మార్పు గమనించనున్నారు. రూ.2000 కంటే ఎక్కువ విలువైన టికెట్ల విషయంలో ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు..దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల జోరు కొంత మందగించింది. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q3) దేశంలోని తొమ్మిది కీలక నగరాల్లో మొత్తం 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4 శాతం తగ్గినట్లు ఎన్ఎస్ఈ నమోదిత రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ విశ్లేషణ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త!
మన పేరుతో సిమ్ తీసుకోవడం, దాన్ని అవసరం లేనప్పుడు వేరే వ్యక్తికి ఇవ్వడం సాధారణంగానే అనిపిస్తుంది. కానీ.. ఇకపై ఈ విషయంలో తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. భారీ జరిమానా చెల్లించడంతో పాటు, మూడేళ్లు జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది.సెప్టెంబర్ 21న జారీ చేసిన అడ్వైజరీలో టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) పలు కీలక విషయాలను వెల్లడించింది. నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం, టెలికాం ఐడెంటిఫైయర్లను దుర్వినియోగం చేయడం, మొబైల్ ఫోన్లోని IMEI నంబర్‌ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడం వంటి వాటికి.. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వెల్లడించింది.మూడేళ్లు జైలు శిక్షటెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం.. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.ఇటీవల సైబర్ క్రైమ్ దర్యాప్తులో ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఘటన బయటపడింది. అక్కడ ఒక పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్ కొంతమంది పౌరుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి 25 మొబైల్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన తర్వాత DoT, టెలికాం కంపెనీలు ఆ PoS ఏజెంట్‌ను బ్లాక్ చేశాయి. అలాగే ఆ 25 మొబైల్ నంబర్లను డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న కనెక్షన్లను మళ్లీ వెరిఫికేషన్‌కు పంపగా, ఆ ప్రక్రియలో సరైన వివరాలు నిర్ధారించలేని నంబర్లను డీయాక్టివేట్ చేశారు.దీంతో మనకు తెలియకుండానే మన గుర్తింపు పత్రాలతో ఎవరో సిమ్ తీసుకునే అవకాశం ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.DoT సూచనమీ పేరుతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డును.. మరో వ్యక్తికి ఇచ్చినా కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, మీ పేరుతో ఉన్న సిమ్‌ను మీరు ఎవరికైనా ఇచ్చారు. ఆ వ్యక్తి దాన్ని ఉపయోగించి సైబర్ మోసం లేదా మరేదైనా అక్రమ కార్యకలాపానికి పాల్పడితే, దర్యాప్తులో ఆ సిమ్ ఎవరి పేరుపై ఉందనే విషయం కూడా బయటకు వస్తుంది. అందుకే.. మీ పేరుతో తీసుకున్న సిమ్‌ను అప్పుగా ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం, అమ్మడం లేదా మరొకరి కోసం ఉపయోగించడం వంటి వాటికి దూరంగా ఉండాలని DoT సూచించింది.DoT సిమ్ కార్డులతో పాటు మొబైల్ ఫోన్లోని ఐఎంఈఐ నంబర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే.. ఈ నంబర్ ఒక మొబైల్ పరికరాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీన్ని మార్చడం లేదా ట్యాంపర్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా.. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI), ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను మార్చేందుకు యాప్స్, వెబ్సైట్లు లేదా ఇతర సాధనాలను ఉపయోగించకూడదని DoT సూచించింది.ఇదీ చదవండి: మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త -
బంగారం ధరల్లో భారీ మార్పు.. రూ.3000 తగ్గిన రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ.. అదే స్థాయిలో పెరుగుతూ నేడు (ఆదివారం) స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో (సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు) పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,680 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,39,950 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది.చెన్నైలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,730 వద్దకు (రూ.3110 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,40,000 వద్దకు (రూ.2850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ సెప్టెంబర్ 20న రూ.1,55,990 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,830 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 నుంచి రూ.1,40,100 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది. -
మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త
మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్ర శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నామని భావించే వినియోగదారులు ఏడాదిలో 12 సార్లు కాకుండా.. 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొత్త వ్యాలిడిటీ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశీయ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.30 రోజుల వ్యాలిడిటీసెప్టెంబర్ 22న ట్రాయ్ జారీ చేసిన టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026 ప్రకారం.. టెలికాం సంస్థలు 28 రోజుల ప్లాన్ల స్థానంలో, 30 రోజుల వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్ సేవలకు సంబంధించిన ప్లాన్లను అందుబాటులో ఉంచాలి.నిజానికి ఈ సమస్యను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మార్చి 11న పార్లమెంటులో ప్రస్తావించారు. 28 రోజుల వ్యాలిడిటీ కారణంగా వినియోగదారులు ఏడాదికి అదనంగా ఒకసారి రీఛార్జ్ చేయాల్సి వస్తోందని వివరించారు. వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో పాటు మరిన్ని సౌకర్యవంతమైన ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్పెషల్ ప్లాన్మొబైల్ వాడే ప్రతి ఒక్కరికీ డేటా అవసరం ఉండదు. కొంతమంది ఫోన్‌ను కేవలం కాల్స్ చేయడానికి, ఎస్ఎంఎస్ పంపడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు డేటా ఉన్న ప్లాన్ కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ప్రత్యేకమైన వాయిస్+ఎస్ఎంఎస్ ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరారు.ట్రాయ్ నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందించాలి. వీటిలో 30 రోజుల ఆప్షన్ ఉండాలి. అలాగే.. ప్రతి నెల ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించే ప్లాన్ కూడా ఉండాలి. దీనితో పాటు కనీసం ఒక దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్ కూడా అందుబాటులో ఉండాలి.ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్: 5 రోజులు బ్యాంకులు బంద్!అంటే.. ఇకపై డేటా అవసరం లేని వినియోగదారులకు తమ అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను ఎంచుకుంటే నెలకు ఒకసారి అదే తేదీకి రీఛార్జ్ చేసుకోవడం సులభంగా ఉంటుంది. అయితే.. ఏ కంపెనీ ఎంత ధరకు ఏ ప్రయోజనాలతో ప్లాన్ అందిస్తుంది? అనేది మాత్రం ఆయా టెలికాం సంస్థలపై ఆధారపడి ఉంటుంది.Good news for Prepaid Mobile Users in IndiaThe Govt just introduced Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026, consumers will now have:• 30-day recharge plans, reducing the need for 13 monthly recharges to 12 in a year• Voice and SMS-only plans… pic.twitter.com/mfWVfMWNqR— Raghav Chadha (@raghav_chadha) September 27, 2026 -
ఖాతాదారులకు అలర్ట్: 5 రోజులు బ్యాంకులు బంద్!
ఈ వారం బ్యాంకులో ఏదైనా పని ఉందా?, అయితే.. ఒకసారి బ్యాంకు సెలవులు చూసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు ఐదు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె, అక్టోబర్ 2న గాంధీ జయంతి, ఆ తరువాత వచ్చే ఆదివారం కారణంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBU) ఆధ్వర్యంలో మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానం అమలుతో పాటు, ఐదు రోజుల బ్యాంకింగ్ వారం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి పలు డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.అయితే.. ఈ సమ్మె ప్రభావం అన్ని బ్యాంకులపై ఒకే విధంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. చాలా ప్రైవేట్ బ్యాంకులు ఈ మూడు రోజుల్లో సాధారణంగానే పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి బ్రాంచ్‌కు వెళ్లే ముందు మీ బ్యాంకు పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.అక్టోబర్ 4 ఆదివారం. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అంటే మొత్తం మీద వచ్చేవారంలో బ్యాంకులు పనిచేసేది కేవలం రెండు రోజులు మాత్రమే అని తెలుస్తోంది.అయితే బ్యాంకు బ్రాంచ్ మూసి ఉంటే అన్ని బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయని కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా బ్యాంకింగ్ పనులను ఆన్లైన్లోనే చేసుకునే అవకాశం ఉంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, ఖాతాల మధ్య నగదు బదిలీ చేయడం వంటి పనులు సాధారణంగా చేసుకోవచ్చు. అలాగే ఏటీఎంలు కూడా సాధారణంగా అందుబాటులో ఉంటాయి. నగదు విత్‌డ్రా చేయడం వంటి సేవలను ఏటీఎం ద్వారా ఉపయోగించుకోవచ్చు. అయితే ఏటీఎంలో నగదు అందుబాటులో ఉండటం ఆయా బ్యాంకుల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు! -
రెనాల్ట్ ట్రైబర్ లాంచ్.. ఎప్పుడంటే?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. కంపెనీ కొత్త కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది. ఇది తొలిసారి టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ డెలివరీ చేయనుంది.రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా 99 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ పొందవచ్చు. ఇదే ఇంజన్‌ను కైగర్, డస్టర్ బేస్ వేరియంట్లలో అందిస్తున్నారు. కాబట్టి పనితీరు బాగుంటుందని తెలుస్తోంది.ట్రైబర్ టర్బో కారు ఫీచర్స్ పరంగా, పరిమాణం పరంగా ఎలాంటి మార్పులు పొందలేదని సమాచారం. మంచి డిజైన్ కలిగిన ట్రైబర్ ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కిగర్లోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మధ్య ధరల వ్యత్యాసం దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది కాబట్టి.ఇదీ చదవండి: సరికొత్త టాటా ఏరిస్ వచ్చేసింది! -
రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!
ట్రైన్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసి.. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు 2026 అక్టోబర్ 15 నుంచి ఓ కొత్త మార్పు గమనించనున్నారు. రూ.2000 కంటే ఎక్కువ విలువైన టికెట్ల విషయంలో ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూపీఐ ద్వారా ఒక వ్యక్తి, వ్యాపార సంస్థకు చెల్లింపు చేసినప్పుడు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ మర్చెంట్ లావేదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఉంటుంది. కానీ టెలికమ్యూనికేషన్లు, భీమా, రైల్వే టికెటింగ్ వంటి వాటిని స్పెషల్ కేటగిరీలో పెట్టారు. అందుకే.. రైల్వే టికెట్‌కు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లించినప్పుడు 0.4 శాతం కాకుండా.. ఒక్కో లావాదేవీకి కేవలం రూ.5 ఎండీఆర్ వర్తిస్తుంది.ఉదాహరణకు.. మీరు రూ.3,000 విలువైన రైల్వే టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేశారనుకుంటే.. అప్పుడు ఎండీఆర్ రూ.5 ఉంటుంది. కానీ మీరు రూ.3005 చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. 5 రూపాయల అనేది మర్చెంట్ సైడ్ ఛార్జ్. కాబట్టి ప్రయాణికుడి నుంచి అదనంగా డబ్బు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా మర్చెంట్లను ఈ ఛార్జీని కస్టమర్లపై వేయకుండా చూసుకోవాలని సూచించాయి.అదే విధంగా రూ.10,000 విలువైన టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేసినా ఎండీఆర్ రూ.5గానే ఉంటుంది. సాధారణ మర్చెంట్ లావాదేవీ అయితే 0.4 శాతం ప్రకారం రూ.10వేలకు 40 రూపాయలు అయ్యేది. కానీ రైల్వే టికెటింగ్‌కు ప్రత్యేక రూల్ ఉండటంతో ఇక్కడ రూ.5 మాత్రమే వర్తిస్తుంది. అయితే రూ. 2,000 వరకు ఉన్న అర్హత కలిగిన యూపీఐ లావాదేవీల మీద ఎండీఆర్ ఉండదు.ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు! -
50 ఏళ్లుగా వెండి ధరను అణిచేస్తున్నారా?
వెండి ధరలు, దాని పారిశ్రామిక ప్రాధాన్యంపై ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెండి మార్కెట్‌ను 50 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారంటూ కియోసాకి ఆరోపించారు. వెండిని బ్యాంకులు పెద్దఎత్తున నిల్వ చేసుకుంటున్నాయని, మరోవైపు సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం కేవలం పేపర్ ఆస్తులపైనే ఆధారపడేలా ఆర్థిక వ్యవస్థను తయారు చేశారని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్ పతనాలను చూసి భయపడుతుంటే, సంపన్న పెట్టుబడిదారులు మాత్రం వాటిని అవకాశాలుగా చూస్తారని కియోసాకి అన్నారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు వ్యూహాత్మక ఆస్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి సంపదను మరింతగా పెంచుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ డెరివేటివ్స్ మార్కెట్ ఏర్పడటం వల్ల అధిక రిస్క్‌తో కూడిన ఆర్థిక సాధనాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.వెండి కేవలం ఆభరణాల తయారీకే పరిమితమైన లోహం కాదని కియోసాకి వివరించారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెండిని ఉపయోగిస్తున్నారని, సోలార్ ప్యానెళ్లు, సైనిక అవసరాల్లోనూ దీనికి డిమాండ్ ఉందని అన్నారు. ప్రపంచంలో ఇప్పటికే 95 శాతం వెండి వినియోగించేశారన్న ఆయన బంగారంలా వెండిని పెద్దఎత్తున నిల్వ చేయలేమని, అందువల్ల కొన్ని సందర్భాల్లో వెండికి బంగారం కంటే ఎక్కువ విలువ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. టోమాహాక్ క్షిపణుల్లోనూ గణనీయమైన మొత్తంలో వెండి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.వెండి మార్కెట్‌ను పెద్ద బ్యాంకులు కృత్రిమంగా నియంత్రించి ధరను తక్కువగా ఉంచుతున్నాయని కియోసాకి ఆరోపించారు. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్ గతంలో చెల్లించిన 920 మిలియన్ డాలర్ల జరిమానాను ప్రస్తావించారు.ఇక మ్యూచువల్ ఫండ్లు, 401(k) వంటి పేపర్ ఆస్తులపై మాత్రమే ఆధారపడటం కంటే వాస్తవ ఆస్తులపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. సంపన్నులు ఆస్తులను కొనుగోలు చేస్తే, పేద, మధ్యతరగతి ప్రజలు తరచూ ఆస్తులుగా భావించే బాధ్యతలను (లయబిలిటీస్) కూడబెట్టుకుంటారని తన పాత సిద్ధాంతాన్ని మరోసారి ప్రస్తావించారు. జీతాల కొనుగోలు శక్తి తగ్గుతున్న సమయంలో వ్యూహాత్మక లోహాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!! -
జియో ఫ్రీ రీచార్జ్ ఆఫర్ గురించి తెలుసా?
కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే 6 నెలలు రీచార్జ్ ఉచితంగా పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే జియో వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా 2026 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ప్రతి కొత్త ఫోన్‌కు వర్తించే సాధారణ ఆఫర్ కాదు. జియో నిర్దేశించిన ఫోన్‌ను (Eligible Device) ఈ కాలంలో కొనుగోలు చేసి, జియో నెట్‌వర్క్‌లో తొలిసారి యాక్టివేట్ చేసిన వారికి మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.ఆరు రీఛార్జ్‌ల ప్రయోజనంఅర్హత పొందిన కస్టమర్లకు గరిష్ఠంగా ఆరు రీఛార్జ్ సైకిళ్ల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఒక్కో సైకిల్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి సైకిల్లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా, మొత్తం 14GB డేటా, 300 SMSలు అందుతాయి. అయితే అంతర్జాతీయ కాల్స్, అంతర్జాతీయ SMSలు ఈ ప్రయోజనాల్లో ఉండవు. ఆరు సైకిళ్లను కలిపితే మొత్తం 168 రోజుల వ్యాలిడిటీ, 84GB డేటా, 1,800 SMSలు లభిస్తాయి.ఈ ప్రయోజనాలు ఒకేసారి మొత్తం క్రెడిట్ కావు. జియో నిబంధనల ప్రకారం, కస్టమర్ IMEI–మొబైల్ నంబర్ (MSISDN) లింక్‌ను నిరంతరం ఒక రీఛార్జ్ సైకిల్ పాటు కొనసాగించిన తర్వాత తదుపరి రీఛార్జ్ ప్రయోజనం క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ప్రయోజనాలను ఉపయోగించుకోకపోతే తర్వాతి సైకిల్‌కు క్యారీ ఫార్వర్డ్ చేసేందుకు వీలుండదు.సిమ్ విషయంలో ఈ నిబంధన తప్పనిసరిఈ ఆఫర్లో అత్యంత ముఖ్యమైన షరతు జియో సిమ్‌ను ఫోన్లోని సిమ్ స్లాట్ 1 లేదా ప్రైమరీ సిమ్ స్లాట్‌లోనే ఉంచడం. ఆరు సైకిళ్ల ప్రయోజనాల కాలంలో IMEI, మొబైల్ నంబర్ లింక్ కూడా కొనసాగాలి. జియో సిస్టమ్‌లో ఈ లింక్ సరిపోలకపోతే ప్రయోజనాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉంది.కొత్త జియో సిమ్ తీసుకున్నా, మరో నెట్వర్క్ నుంచి జియోకు పోర్ట్ చేసినా లేదా ఇప్పటికే ఉన్న జియో సిమ్‌ను అర్హత ఉన్న కొత్త పరికరంలో యాక్టివేట్ చేసినా నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. అయితే పరికరం, సిమ్, IMEI–MSISDN జతపై జియో చేసే అర్హత తనిఖీ తప్పనిసరి.ఇతర ప్రయోజనాలురీచార్జ్ ప్రయోజనాలతోపాటు మరిన్ని బినిఫిట్లు ఉన్నాయి. ఆఫర్లో భాగంగా అజియో (AJIO)పై రూ.1,000 కొనుగోలుకు రూ.200 తగ్గింపు, అభీబస్లో 25 శాతం వరకు తగ్గింపు, జూమ్ఇన్లో రూ.409 విలువైన ఫోటో ఫ్రేమ్ వంటి పార్టనర్ వోచర్లు కూడా ఉన్నాయి. వీటికి ఆయా భాగస్వామ్య సంస్థల ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. జియో అధికారిక నిబంధనల్లో ఈ ప్రయోజనాలకు సంబంధించిన రూ.950 వన్‌టైమ్ చార్జ్(OTC)ను పేర్కొంది. ఈ మొత్తం ఆఫర్ ప్రయోజనాలు, రీఛార్జ్ బెనిఫిట్లు, పార్టనర్ వోచర్ల డెలివరీ/ఎనేబుల్మెంట్కు కేటాయించిన మొత్తంగా నిబంధనల్లో వివరించింది. -
ఏఐ ట్రైనింగ్ నిలిపివేత.. ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం
కృత్రిమ మేధస్సు (AI) ఏజెంట్లు తమకు నిర్దేశించిన పనుల పరిధిని దాటి వ్యవహరిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) సంచలన నిర్ణయం తీసుకుంది. తన అత్యాధునిక AI మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ వెల్లడించింది. మరింత పటిష్టమైన భద్రతా నియంత్రణలు, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాటి పనితీరును ధ్రువీకరించిన తర్వాతే శిక్షణను పునఃప్రారంభిస్తామని తెలిపింది.ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించి పలు అనూహ్య ఘటనలను ఓపెన్ఏఐ వెల్లడించింది. శిక్షణ, మూల్యాంకన ప్రక్రియల్లో ఉన్న కొన్ని ఏఐ ఏజెంట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), సెన్సస్ బ్యూరో తదితర ప్రభుత్వ వనరుల నుంచి సమాచారాన్ని సేకరించాయి. కొన్ని సందర్భాల్లో ఏజెంట్లు తమకు అప్పగించిన పనిని మించి వ్యవహరించాయి. ఉదాహరణకు ఎస్ఈసీ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మరో వెబ్సైట్లో ప్రచురించిన ఘటనను ఓపెన్ఏఐ గుర్తించింది. అయితే ఎస్ఈసీ ప్రకారం ఎలాంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ కాని సమాచారం యాక్సెస్ కాలేదు.అమెరికా విద్యాశాఖకు సంబంధించిన ఘటన మరింత ఆందోళన కలిగించింది. స్వతంత్ర ఏఐ పరిశోధనా సంస్థ ట్రాన్స్ల్యూస్ (Transluce) ప్రకారం, ఓపెన్ఏఐకి చెందినవిగా కనిపించిన ఏజెంట్లు విద్యాశాఖ సివిల్ రైట్స్ వెబ్సైట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనను ఓపెన్ఏఐ స్వయంగా ఇంకా ధ్రువీకరించలేదు. విద్యాశాఖ కూడా తమ వెబ్సైట్ లేదా డేటాబేస్‌పై ప్రభావం పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాంకునే ముంచిన ఏఐ మాయ! -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
నేడు బ్యాంకులు పనిచేస్తాయి
నల్లగొండ టౌన్ : బ్యాంకులు ఆదివారం పనిచేయనున్నాయి. డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో మూడు రోజుల పాటు లావాదేవీలు స్తంభించనున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ నెల 27న (ఆదివారం) పని చేయనున్నాయి. ఖాతాదారులు ఆదివారం బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చని ఆయా బ్యాంకుల నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్నారు. -
పెద్ద బ్యాంకునే ముంచిన ఏఐ మాయ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మోసాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఇటలీలో జరిగిన భారీ బ్యాంకింగ్ మోసం మరోసారి బయటపెట్టింది. ఇటలీకి చెందిన అతిపెద్ద రుణదాత ఇంటెసా సాన్పాలోకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం ఫిడ్యూరామ్ నుంచి మోసగాళ్లు సుమారు 95 మిలియన్ యూరోలు (సుమారు రూ.10,360 కోట్లు) విదేశీ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఇందులో సుమారు 53 మిలియన్ యూరోలు తిరిగి రికవరీ చేసినప్పటికీ, దాదాపు 36 మిలియన్ యూరోలు ఇంకా ఆచూకీ లేకుండా పోయినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి.అసలు మోసం ఎలా జరిగిందంటే..ఈ ఘటన 2026 ఫిబ్రవరిలో జరిగింది. అప్పట్లో ఫిడ్యూరామ్ చైర్మన్‌గా ఉన్న పాలో మోలెసినికి ఇంటెసా సాన్పాలో సీఈఓ కార్లో మెస్సినా నుంచి వచ్చినట్లుగా కనిపించిన ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. విదేశాల్లో జరుగుతున్న ఓ అత్యవసర ఆర్థిక లావాదేవీని పూర్తి చేయడానికి ఫిడ్యూరామ్ ట్రెజరీ నుంచి వెంటనే నిధులు బదిలీ చేయాలని అందులో కోరారు.ఈ సందేశాన్ని మరింత నమ్మేలా చేయడానికి మోసగాళ్లు మరో అడుగు ముందుకేశారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ న్యాయ సంస్థకు చెందిన సీనియర్ భాగస్వామి నుంచి కాల్ వచ్చినట్లుగా ఏర్పాటు చేశారు. మోలెసినికి ఆ న్యాయవాది పరిచయం ఉండటంతో, ఫోన్లో వినిపించిన గొంతు కూడా నిజమైనదిగానే అనిపించింది. అయితే ఆ గొంతును ఏఐ సాంకేతికతతో క్లోన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.చైనా, హాంకాంగ్‌కు బదిలీలుఅభ్యర్థన నిజమైనదేనని భావించిన మోలెసిని ఫిడ్యూరామ్ ఆర్థిక విభాగాన్ని సంప్రదించి వరుసగా నిధులు బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో సుమారు 95 మిలియన్ యూరోలు చైనా, హాంకాంగ్ సహా విదేశీ ఖాతాలకు తరలిపోయాయి.అయితే ఫిడ్యూరామ్ వ్యవస్థలు కొద్దిసేపటికే లావాదేవీల్లో అసాధారణతలను గుర్తించాయి. వెంటనే ఇతర బ్యాంకులు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. చైనా, పోర్చుగల్, ఇటలీ అధికారుల మధ్య సహకారంతో భారీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. రాయిటర్స్ ప్రకారం సుమారు 53 మిలియన్ యూరోలు రికవరీ అయ్యాయి. కొన్ని ఇటాలియన్ మీడియా నివేదికల్లో రికవరీ మొత్తం సుమారు 59 మిలియన్ యూరోలుగా పేర్కొనడం గమనార్హం.మిగిలిన నిధులు పలు విదేశీ ఖాతాల ద్వారా తరలిపోయి, చివరకు క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు సమాచారం. దీంతో వాటి ఆచూకీ కనుగొనడం మరింత క్లిష్టంగా మారింది. సుమారు 36 మిలియన్ యూరోలు ఇంకా కనిపెట్టాల్సి ఉందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.మోలెసినిపై కేసు లేదుఈ మోసానికి సంబంధించి పాలో మోలెసిని లేదా ఫిడ్యూరామ్కు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం లేదు. అయితే మిలన్ ప్రాసిక్యూటర్లు కంప్యూటర్ మోసం అనుమానంతో ఐరోపా వెలుపల నివసిస్తున్న ఓ విదేశీ వ్యక్తిపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాయిటర్స్ పేర్కొంది.కాగా మోలెసిని 2026 మార్చిలో వ్యక్తిగత కారణాలను చూపుతూ ఫిడ్యూరామ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన వైదొలగడానికి సంబంధించిన మరిన్ని వివరాలను సంస్థ వెల్లడించలేదు.గతంలోనూ ఇటలీలో ఏఐ వాయిస్ మోసంఇటలీలో ఏఐ వాయిస్ క్లోనింగ్ ఆధారిత మోసం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో రక్షణ మంత్రి గైడో క్రొసెట్టో గొంతును ఏఐతో అనుకరిస్తూ పలువురు ప్రముఖ ఇటాలియన్ వ్యాపారవేత్తలను మోసగాళ్లు సంప్రదించారు. మధ్యప్రాచ్యంలో బందీలుగా ఉన్న జర్నలిస్టులను విడిపించేందుకు డబ్బు అవసరమంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. మాజీ ఇంటర్ మిలాన్ యజమాని మాసిమో మొరాట్టి దాదాపు 1 మిలియన్ యూరోలు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ మొత్తాన్ని అధికారులు అనంతరం స్తంభింపజేశారు. -
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల జోరు కొంత మందగించింది. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q3) దేశంలోని తొమ్మిది కీలక నగరాల్లో మొత్తం 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4 శాతం తగ్గినట్లు ఎన్ఎస్ఈ నమోదిత రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ విశ్లేషణ వెల్లడించింది.ప్రాప్‌ఈక్విటీ పరిశీలించిన మార్కెట్లలో ముంబై, నవీ ముంబై, థానే, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, కొనుగోలుదారులలో కొంత మందగించిన డిమాండ్ ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది. జూలై-సెప్టెంబర్ కాలం సాధారణంగా వర్షాకాలం కావడంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొంత నెమ్మదించడం కూడా ఈ త్రైమాసికంలో ప్రభావం చూపుతుంది. సాధారణంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో పండుగల డిమాండ్‌తో గృహ విక్రయాలు పుంజుకునే అవకాశం ఉంటుంది.హైదరాబాద్‌లో 11 శాతం వృద్ధినగరాల వారీగా చూస్తే హైదరాబాద్ మార్కెట్ మాత్రం జాతీయ ధోరణికి భిన్నంగా సాగింది. ఇక్కడ గృహ విక్రయాలు గతేడాది క్యూ3లోని 13,890 యూనిట్ల నుంచి 15,470 యూనిట్లకు పెరిగాయి. అంటే 11 శాతం వృద్ధి నమోదైంది. నవీ ముంబైలో అమ్మకాలు 12 శాతం పెరిగి 8,730 నుంచి 9,810 యూనిట్లకు చేరాయి. బెంగళూరులో మాత్రం పెద్దగా మార్పు లేకుండా 1 శాతం వృద్ధితో 17,170 నుంచి 17,340 యూనిట్లకు చేరాయి.మరోవైపు పుణెలో అమ్మకాలు 16 శాతం తగ్గి 21,190 నుంచి 17,860 యూనిట్లకు పడిపోయాయి. చెన్నైలో 17 శాతం క్షీణించి 5,640 నుంచి 4,680 యూనిట్లకు చేరాయి. థానేలో 18,240 నుంచి 16,230 యూనిట్లకు తగ్గగా, ముంబైలో 10,690 నుంచి 9,830 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో అమ్మకాలు 12 శాతం తగ్గి 9,230 నుంచి 8,090 యూనిట్లకు చేరాయి. కోల్‌కతాలోనూ 17 శాతం క్షీణత నమోదై 4,640 నుంచి 3,860 యూనిట్లకు పడిపోయాయి.కొత్త ఇళ్ల సరఫరాలోనూ కోతఅమ్మకాలతో పాటు డెవలపర్లు మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టుల సంఖ్య కూడా తగ్గింది. 2026 క్యూ3లో తొమ్మిది నగరాల్లో కొత్త గృహాల సరఫరా 98,165 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 1,00,330 యూనిట్లుగా ఉండటంతో ఏడాది ప్రాతిపదికన దాదాపు 2 శాతం తగ్గింది. అయితే 2026 క్యూ2లో నమోదైన 1,15,010 యూనిట్లతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కొత్త సరఫరా 15 శాతం తగ్గడం గమనార్హం.నగరాల వారీగా కొత్త లాంచ్‌లలో థానేలో త్రైమాసిక ప్రాతిపదికన 28 శాతం, చెన్నైలో 22 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్లో 19 శాతం తగ్గుదల నమోదైంది. దీనికి భిన్నంగా హైదరాబాద్‌లో కొత్త లాంచ్‌లు ఏడాది ప్రాతిపదికన 68 శాతం పెరిగాయి. నవీ ముంబైలో 25 శాతం, కోల్‌కతాలో 32 శాతం తగ్గాయి. మార్కెట్లో ఉన్న ఇన్వెంటరీని దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు ఈ గణాంకాల్లో కనిపిస్తున్నాయి.సరఫరా కంటే అమ్మకాలే ఎక్కువక్యూ3లో 1,03,170 ఇళ్ల విక్రయాలు జరగగా, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇళ్ల సంఖ్య 98,165గా ఉంది. అంటే కొత్త సరఫరా కంటే సుమారు 5,000 యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, కొత్త సరఫరా అంతకంటే వేగంగా తగ్గడంతో మార్కెట్లో ఇన్వెంటరీపై ఒత్తిడి కొంత తగ్గినట్లు ప్రాప్‌ఈక్విటీ విశ్లేషణ సూచిస్తోంది.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్‌లో ఎదగాలంటే.. కియోసాకి సూచనలు -
జియో రూ.239 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
భారతదేశపు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో.. వినియోగదారుల కోసం లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.239 ప్లాన్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జియో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 22 వ్యాలిడిటీ లభిస్తుంది. వ్యాలిడిటీ ముగిసే వరకు రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకునే సౌకర్యం కూడా ఉంటుంది.వాయిస్ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి అదనపు సేవలు పొందవచ్చు. తక్కువ వ్యవధిలో.. రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
AIతో ప్రాణ నష్టం.. బిల్ గేట్స్ హెచ్చరిక!
ప్రస్తుతం ప్రపంచాన్ని అత్యంత వేగంగా మారుస్తున్న టెక్నాలజీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రధానంగా చెప్పుకోదగ్గది. మనిషి ఆలోచించే విధానాన్ని అనుకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడం వంటి అనేక పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. వైద్యం, విద్య, పరిశ్రమలు, రక్షణ, సాఫ్ట్వేర్ వంటి ఎన్నో రంగాల్లో దీని వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఏఐ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, దాని దుర్వినియోగం అంతే ప్రమాదకరంగా మారవచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.బిల్ గేట్స్ హెచ్చరికమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఏఐ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికత దురుద్దేశం కలిగిన వ్యక్తులు లేదా శక్తుల చేతుల్లోకి వెళితే.. భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ అభివృద్ధి వేగంగా జరుగుతున్న సమయంలో.. దాని భద్రతపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.ఏఐ దుర్వినియోగం వల్ల ప్రమాదాలుఏఐ ప్రస్తుతం సమాచారాన్ని తయారు చేయడం, విశ్లేషించడం, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం వంటి పనులను వేగంగా చేయగలుగుతోంది. ఇదే సామర్థ్యాన్ని చెడు ఉద్దేశాలతో ఉపయోగిస్తే.. సైబర్ దాడులు, తప్పుడు సమాచార వ్యాప్తి, మోసాలు, నిఘా వంటి కార్యకలాపాలు మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది.నిపుణుల్లో పెరుగుతున్న ఆందోళనఏఐ భద్రతపై పలువురు పరిశోధకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అత్యంత సామర్థ్యం కలిగిన ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చెందితే వాటిని పూర్తిగా నియంత్రించడం ఎంతవరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై చర్చ జరుగుతోంది.ఏఐ రంగంలోని కొందరు పరిశోధకులు, సంస్థలు AI సామర్థ్యాలను వేగంగా పెంచుతున్నప్పుడు.. దానికి అనుగుణంగా భద్రతా చర్యలు కూడా అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఏఐ వ్యవస్థల సామర్థ్యం పెరగడం మాత్రమే కాకుండా, వాటి ప్రవర్తనను పరీక్షించడం, ప్రమాదాలను గుర్తించడం, మానవ పర్యవేక్షణను కొనసాగించడం కూడా అవసరమని చెబుతున్నారు.సైనిక రంగంలో ఏఐ వినియోగంఏఐపై ఆందోళనకు మరో ముఖ్యమైన కారణం.. దాని సైనిక వినియోగం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏఐను నిఘా, సైబర్ భద్రత, స్వయంప్రతిపత్తి వ్యవస్థలు వంటి రంగాల్లో ఉపయోగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.మానవుడు ప్రతి దశలో ప్రత్యక్షంగా నిర్ణయం తీసుకోకుండా.. పనిచేసే వ్యవస్థలు విస్తరించినప్పుడు పొరపాట్లు లేదా దుర్వినియోగం జరిగే ప్రమాదం గురించి నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందుకే సైనిక రంగంలో ఏఐ వినియోగానికి స్పష్టమైన నియమాలు, మానవ పర్యవేక్షణ, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తుపై ఆలోచనలుఏఐ వల్ల మానవాళికి ఎదురయ్యే ప్రమాదాల గురించి చర్చ ఈ రోజు మొదలైంది కాదు. ఎందుకంటే.. 2014లోనే బ్రిటిష్ తత్వవేత్త నిక్ బోస్ట్రోమ్ రాసిన సూపర్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలో మానవుల కంటే అత్యంత తెలివైన ఏఐ వ్యవస్థలు ఏర్పడితే వాటిని నియంత్రించడం ఎంత కష్టమవుతుందో విశ్లేషించారు.ఏఐ రంగంలోని ప్రముఖ సంస్థల అధినేతలు కూడా AI వల్ల మానవాళికి ఏర్పడే తీవ్రమైన ప్రమాదాలను ప్రపంచ స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అణుయుద్ధం, ప్రపంచ మహమ్మారుల వంటి పెద్ద స్థాయి ప్రమాదాలతో పాటు AI ప్రమాదాలను కూడా తీవ్రంగా పరిగణించాలని వారు సూచించారు.AI ప్రమాదం మాత్రమే కాదుఏఐను పూర్తిగా ప్రమాదకరమైన టెక్నాలజీగా చూడటం సరైనది కాదు. ఎందుకంటే.. వైద్యరంగంలో వ్యాధులను గుర్తించడంలో, శాస్త్రీయ పరిశోధనలో, విద్యలో విద్యార్థులకు సహాయం చేయడంలో, భాషలను అనువదించడంలో, రోజువారీ పనులను సులభతరం చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతోంది. కాబట్టి.. సమస్య AIలో మాత్రమే లేదు. దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు?, ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు?, దానికి ఎలాంటి నియంత్రణలు ఉన్నాయి?, తప్పులు జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? వంటి వాటిలో కూడా ఉంటుంది.ఇదీ చదవండి: అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత! -
సైబర్ మోసాలపై ఎయిర్టెల్ నిఘా!
భారతదేశంలో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. స్పామ్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లతో పాటు నకిలీ బ్యాంక్ కాల్స్, ఓటీపీ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు వంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు కూడా కేవలం నెట్వర్క్ సేవలు అందించడమే కాకుండా, తమ కస్టమర్లను సైబర్ మోసాల నుంచి రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ తన ఏఐ ఆధారిత సేఫ్ నెట్వర్క్ సేవలను విస్తరిస్తోందికంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 98.4 బిలియన్ స్పామ్ కాల్స్, 4.4 బిలియన్ స్పామ్ మెసేజ్‌లను గుర్తించింది. అలాగే ఎస్ఎంఎస్లు, మెసేజింగ్ యాప్స్, ఈమెయిల్స్, బ్రౌజర్ రీడైరెక్ట్ల ద్వారా వచ్చే 1.62 మిలియన్లకు పైగా మాలిషియస్ లింకులను బ్లాక్ చేసినట్లు తెలిపింది.అంతే కాకుండా .. ఓటీపీ మోసాలను గుర్తించేందుకు ఏఐ బేస్డ్ రక్షణ, నకిలీ కస్టమర్ కేర్ లేదా బ్యాంక్ కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడే బిసినెస్ నేమ్ డిస్ప్లే వంటి ఫీచర్లను కూడా ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వీటి కోసం వినియోగదారులు ప్రత్యేకంగా యాప్‌ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా నెట్వర్క్ స్థాయిలోనే రక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. -
రూ. 2.87 లక్షల కోట్ల డీల్ : చైనా-అమెరికా కీలక ఒప్పందం
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా చారిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఎనిమిది సూత్రాల ఏకాభిప్రాయం ప్రకారం, 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.87 లక్షల కోట్లు)పరస్పర సుంకాల తగ్గింపు ఒప్పందం, ఏఐ (AI) పై చర్చలు ప్రారంభించడంపై అమెరికాతో ఒప్పందం కుదిరినట్టు చైనా శనివారం తెలిపింది. ఒక వాణిజ్య మండలిని ఏర్పాటుకు, కౌలాలంపూర్‌లో ఇంతకుముందు జరిగిన చర్చల ఫలితాలను పొడిగించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించా యని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.టారిఫ్ తగ్గింపు ఒప్పందంఅమెరికా, చైనా దేశాలు 30 బిలియన్ డాలర్ల పరస్పర టారిఫ్ తగ్గింపు (tariff-reduction) ఒప్పందానికి అంగీకరించినట్లు చైనా శనివారం ప్రకటించింది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కుదిరిన తాత్కాలిక విరామాన్ని (trade truce) మరో రెండు నెలలు పొడిగించినట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.ఏఐ రంగంలో చర్చలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. రాబోయే నవంబర్‌లో తదుపరి విడత చర్చలు జరగనున్నాయి. అలాగే, ఏఐ సంబంధిత ఘటనలపై కమ్యూనికేషన్ ఛానెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏఐకి బదులుగా "సూపర్ ఇంటెలిజెన్స్" అనే పద వాడకాన్ని బీజింగ్ స్వాగతించింది.వాణిజ్య మండలి ఏర్పాటుఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలపర్చేందుకు ఒక ట్రేడ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నాయకుల సమావేశం మరియు G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడంలో పరస్పర మద్దతుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చే ఈ సమావేశాలకు హాజరుకావాలని యోచిస్తున్నారు.దీంతోపాటు విదేశాంగ విధానం విషయానికి సంబంధించి ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా చూసేందుకు కట్టుబడి ఉండాలని, అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశం కూడా రవాణా టోల్స్ విధించకూడదని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. అలాగే, ఏపీఈసీ (APEC), జీ-20 (G20) సమావేశాలకు పరస్పరం హాజరయ్యేందుకు షీ జిన్‌పింగ్, డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలంకాగా నవంబర్ 10న ముగియనున్న వాణిజ్య సంధిని రెండు నెలల పాటు పొడిగించడానికి ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తీసుకున్న చర్యల కొనసాగింపుగా ఈ ఒప్పందం కుదిరిందని, తద్వారా మరింత పెద్ద వాణిజ్య ఒప్పందంపై పనిచేయడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల ప్రకటించారు.ఇదీ చదవండి: లవర్‌తో పెళ్లి : పోలీస్కానిస్టేబుల్ని మట్టుబెట్టిన కొడుకు -
బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు!
ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి రిలయన్స్ డిజిటల్ ఓ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై పలు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. దీంతో ఫోన్ రూ.56,990కే లభిస్తుందన్నమాట.ఐఫోన్ 17 ప్రోరిలయన్స్ డిజిటల్ ట్వీట్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ మోడల్ ధర రూ.1,34,900. ఇన్‌స్టోర్ డిస్కౌంట్ కింద రూ. 9,910 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.55,000 వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, అదనంగా రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే.. ఐఫోన్ 17 ప్రో రూ.56,990కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌ను బట్టి మారుతుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. దీని అసలు ధర రూ.1,49,900. రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్ తర్వాత రేటు రూ.1,39,990కి తగ్గుతుంది దీనికి రూ.55,000 ఎక్స్చేంజ్ వాల్యూ, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపితే.. చివరికి ధర రూ.71,990కి ప్రో మ్యాక్స్ లభిస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!Your reason to go Pro just got bigger. 📱Get the iPhone 17 Pro starting at an effective price of just ₹56,990* at Reliance Digital.Unlock even more value with great exchange value, exchange bonus, bank cashback and flexible payment options.Want to know your current phone’s… pic.twitter.com/K7zV16eu0E— Reliance Digital (@RelianceDigital) September 23, 2026 -
అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!
ముంబైలోని చెంబూర్‌లో ఉన్న ఒక చిన్న చోలే భటూరే రెస్టారెంట్. దీని పేరు ఢిల్లీ సే (Delhi Se). ఇది ఒకప్పుడు దాదాపు రూ. 18 లక్షల అప్పులో కూరుకుపోయి మూతపడటానికి సిద్ధమైంది. కానీ నేడు.. కోట్లు సంపాదిస్తూ బాగా పాపులర్ అయింది. దీనికి కారణం నటి అనుష్క శర్మ చోలే భటూరే ఆర్డర్ చేయడమే. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.మూతపడే స్థితి నుంచి..జస్పాల్ సింగ్ ఖాల్సా, మహీందర్ సింగ్ ఖాల్సా అనే ఇద్దరు సోదరులు 2021 అక్టోబర్‌లో 'ఢిల్లీ సే'ను ప్రారంభించారు. మొదట అది కేవలం 250 చదరపు అడుగుల చిన్న షాప్ మాత్రమే. అందులో మూడు టేబుళ్లు, తొమ్మిది సీట్లు మాత్రమే ఉండేవి. ప్రారంభంలో.. వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ, 2022 జనవరి నుంచి కస్టమర్లు తగ్గడం మొదలైంది. సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు రూ.18 లక్షల అప్పు పేరుకుపోవడంతో రెస్టారెంట్‌ను మూసేయాలని సోదరులు నిర్ణయించుకున్నారు.అయితే అదే సమయంలో వారి జీవితాన్ని మార్చే ఒక సంఘటన జరిగింది. 2022 సెప్టెంబర్‌లో స్టాండప్ కమెడియన్ అభిషేక్ ఉపమన్యు ఢిల్లీ సేకి వచ్చి చోలే భటూరే తిన్నారు. అప్పట్లో.. ఆయన ఎవరో కూడా సోదరులకు తెలియదు. కానీ.. మరుసటి రోజు నుంచే రెస్టారెంట్‌కు కస్టమర్లు పెరగడం మొదలైంది. తర్వాత వారికి తెలిసింది ఏమిటంటే, అభిషేక్ ఉపమన్యు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తమ రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు అని.అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్ఆ తర్వాత ఈ రెస్టారెంట్ గురించి అనుష్క శర్మకు కూడా తెలిసింది. ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోలే భటూరే అంటే చాలా ఇష్టం. ముంబైలో అసలైన ఢిల్లీ రుచిలో చోలే భటూరే కోసం అనుష్క వెతుకుతున్న సమయంలో ఢిల్లీ సే గురించి తెలుసుకున్నారు.ఒక రోజు విరాట్ కోహ్లీ ఇంటి నుంచి రెస్టారెంట్‌కు ఫోన్ వచ్చింది. రెండు ప్లేట్ల చోలే భటూరే జుహూకు పంపాలని అడిగారు. కానీ జస్పాల్‌కు అది నిజమైన ఫోన్ కాల్ అనిపించలేదు. ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని అనుకున్నారు. ఎందుకంటే రెండు ప్లేట్ల ధర అప్పట్లో కేవలం రూ.120 మాత్రమే. పైగా చెంబూర్ నుంచి జుహూకు డెలివరీ చేయాలి.ఫోన్ చేసిన వ్యక్తి డెలివరీ ఖర్చు కూడా ఇస్తామని, బ్యాంక్ వివరాలు పంపాలని చెప్పడంతో జస్పాల్‌కు మరింత అనుమానం వచ్చింది. చివరికి ఆమె విరాట్ కోహ్లీ ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పినా ఆయన నమ్మలేకపోయారు. అయినా.. చివరకు ఆర్డర్‌ను తీసుకుని జుహూకు వెళ్లి చోలే భటూరే డెలివరీ చేశారు.ఆ తర్వాత అసలు ట్విస్ట్ వచ్చింది. 'ముంబైలో చివరకు ఢిల్లీ రుచిలో ఉండే చోలే భటూరే దొరికాయని' అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ రెస్టారెంట్ గురించి తనకు అభిషేక్ ఉపమన్యు ద్వారా తెలిసిందని కూడా చెప్పారు. ఆ ఒక్క పోస్టుతో ఢిల్లీ సే రెస్టారెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మారిపోయిన రెస్టారెంట్ పరిస్థితికొద్ది సమయంలోనే రెస్టారెంట్ ముందు భారీగా జనం చేరుకున్నారు. ఫోన్లు ఆగకుండా మోగాయి. కొంతమంది ఆరు, పది ప్లేట్ల చొప్పున ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో ఉన్న సరుకులు సరిపోలేదు. పరిస్థితి ఎంతగా పెరిగిందంటే, బయట భారీగా జనం చేరడంతో పోలీసులు కూడా అక్కడికి రావాల్సి వచ్చింది.మొదట రోజుకు కేవలం 8 కిలోల చోలే మాత్రమే తయారు చేసేవారు. కానీ మూడు రోజుల్లోనే అది 100 కిలోలకు చేరింది. సరుకు సరిపోకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లవారిని కూడా సహాయం అడిగారు. 'మీ ఇంట్లో చోలే నానబెట్టి పెట్టండి, నేను వచ్చి తీసుకెళ్తాను' అని అడిగేవారు. కొంతమంది కస్టమర్లు రెండు మూడు ప్లేట్ల కోసం కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.నెలకు రూ.2 కోట్లుఇంతకుముందు నెలకు కేవలం రూ.1 నుంచి 1.5 లక్షల వరకు అమ్మకాలు జరిగే పరిస్థితి నుంచి ఇప్పుడు నెలకు సుమారు రూ.2 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సోదరులు చెబుతున్నారు.ఇప్పటికే ఢిల్లీ సేకి చెంబూర్, ములుండ్, అంధేరీ వెస్ట్, వాషీ ప్రాంతాల్లో నాలుగు ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు 3,000కు పైగా ప్లేట్ల చోలే భటూరే అమ్ముతున్నామని వారు చెబుతున్నారు. రోజూ సుమారు 125 కిలోల చోలే నానబెడుతున్నారు. ఒకప్పుడు రూ.18 లక్షల అప్పులతో రెస్టారెంట్‌ను మూసేయాలని అనుకున్న ఇద్దరు సోదరులు, ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నారు.ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు! -
ఈ మూడు రోజులూ ATMలు మీ ఇష్టం!
దేశవ్యాప్తంగా జరగనున్న మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక ఊరటనిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె జరిగే మూడు రోజుల్లో ఏటీఎం నుంచి నగదు తీసుకునేటప్పుడు సాధారణంగా వర్తించే ఉచిత లావాదేవీల పరిమితిని దాటినా అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ప్రకటించిన వాటిలో ఉన్నాయి.ఏటీఎం ఛార్జీలపై ప్రత్యేక మినహాయింపుసాధారణంగా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే ఆరు మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు లావాదేవీల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిమితిని దాటిన తర్వాత బ్యాంకులు ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 వరకు, దానికి వర్తించే జీఎస్టీతో కలిపి ఛార్జీ విధించవచ్చు. అయితే సెప్టెంబర్ 28–30 మధ్య ఈ అదనపు ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి.బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సమ్మె సమయంలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినా లావాదేవీ ఛార్జీలు వర్తించవని ప్రకటించింది. ఎస్బీఐ సైతం సమ్మె కాలంలో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో నగదు అవసరమయ్యే ఖాతాదారులు తమ సాధారణ ఉచిత పరిమితి ముగిసినా ఈ మూడు రోజుల్లో అదనపు ఏటీఎం రుసుము గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.ఆదివారమూ బ్యాంకులు ఓపెన్సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు సెప్టెంబర్ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను సెప్టెంబర్ 27న బ్రాంచ్ సేవలను వినియోగించుకోవాలని సూచించాయి.సెప్టెంబర్ 26 నాలుగో శనివారం కావడంతో ఇప్పటికే బ్యాంకులకు సెలవు ఉంది. ఆ తర్వాత 27న ఆదివారం, 28 నుంచి 30 వరకు సమ్మె జరగనుండటంతో బ్రాంచ్ సేవలకు వరుసగా పలు రోజులపాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల చెక్కులు, నగదు డిపాజిట్లు, ఇతర బ్రాంచ్ ఆధారిత పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: యూపీఐ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్థిక మంత్రిBanking doesn’t stop. Your needs don’t have to wait.Even during the proposed strike period, SBI continues to keep essential banking services accessible through ATMs, YONO, Internet Banking, Mobile Banking, WhatsApp Banking and 24×7 Contact Centre services.For Seamless… pic.twitter.com/P1FTsjtSws— State Bank of India (@TheOfficialSBI) September 24, 2026 -
గడ్కరీ కొత్త ప్లాన్.. రైతులకు లాభం!
భారతదేశంలో చక్కెర పరిశ్రమ కేవలం చక్కెర ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఇతర విలువైన ఉత్పత్తుల వైపు కూడా అడుగులు వేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ముఖ్యంగా.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG), ఇథనాల్, బయో మాన్యూర్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి ఉత్పత్తుల తయారీపై చక్కెర మిల్లులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.భారత్ ఈ10 నుంచి ఈ20 పెట్రోల్ వైపు మారిన నేపథ్యంలో.. ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఏర్పడుతున్నాయని గడ్కరీ వివరించారు. ఈ20 అనేది.. పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలిపిన ఇంధనం. వ్యవసాయ రంగం నుంచి లభించే వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా దేశం దిగుమతి చేసుకునే చమురును తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.కేవలం చక్కెరపై ఆధారపడొద్దుచక్కెర మిల్లులు కేవలం చక్కెర తయారీపైన మాత్రమే ఆధారపడితే.. భవిష్యత్తులో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. కాబట్టి.. చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.చెరకు ఉత్పత్తిలో మిగిలిపోయే బగాస్, ప్రెస్‌మడ్ వంటి వ్యర్థాలు, అలాగే.. వ్యవసాయ అవశేషాలను సీబీజీ తయారీలో ఉపయోగించవచ్చు. వీటిని వ్యర్థాలుగా పారేయడం కంటే.. ఇంధనంగా మార్చడం ద్వారా రైతులకు, చక్కెర మిల్లులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులు కొంత లాభపడే అవకాశం ఉంటుంది.సీబీజీ అంటే ఏమిటి?సీబీజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్. సులభంగా చెప్పాలంటే ఇది వ్యర్థాల నుంచి తయారయ్యే పునరుత్పాదక గ్యాస్. దీనిని పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వరి గడ్డి, చెరకు బగాస్, వెదురు, నాపియర్ గడ్డి, ప్రెస్‌మడ్, మున్సిపల్ ఆర్గానిక్ వ్యర్థాలు వంటి వాటిని ఉపయోగించి తయారు చేయవచ్చు. ఆ తర్వాత.. ఆ బయోగ్యాస్‌లోని మలినాలను తొలగించి, మీథేన్ శాతాన్ని పెంచి, దాన్ని కంప్రెస్ చేస్తే సీబీజీగా మారుతుంది. అంటే.. భూమి లోపల నుంచి సహజ వాయువును వెలికి తీయడానికి బదులుగా వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్‌ను తయారు చేసుకోవడం అన్నమాట.ఇదీ చదవండి: టోల్ ప్లాజాల్లో కొత్త విధానం.. వాహనదారులకు భారీ ఊరట!


