cricket news
-
IPL 2026: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సోమవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా 63వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్ సింగ్ స్థానంలో అకిల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.తుది జట్లు:సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ -
ధోని రిటైర్మెంట్.. ఐదేళ్ల క్రితం ప్రకటన వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌తో పోటీ పడుతున్న సీఎస్కే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోని మాత్రం ఈ సీజన్లో పిక్క కండరాల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎస్కే తమ సొంత హోంగ్రౌండ్లో ఎస్ఆర్హెచ్తో సీజన్లో చివరి మ్యాచ్ ఆడనుంది. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న వేళ సీఎస్కే అభిమానులు అతడిని చివరిసారిగా మైదానంలో చూడాలని ఆశపడుతున్నారు. అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా అన్నది పక్కనబెడితే ఐదేళ్ల క్రితం ధోని తన రిటైర్మెంట్పై చేసిన ప్రకటన తాజాగా వైరల్‌గా మారింది. 2021లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే టైటిల్ వేడుక సందర్భంగా అప్పటి కెప్టెన్ హోదాలో ధోనీ మాట్లాడాడు. తన చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఆశిస్తున్నట్లు ధోనీ తెలిపాడు. 'నేను నా క్రికెట్‌ను ఎప్పుడూ ప్రణాళికబద్దంగానే ఆడాను. నా కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను సొంతఊరు రాంచీలో ఆడడం ఎన్నటికీ మరిచిపోను. ఇక నాకు రెండో హోంగ్రౌండ్ అయిన చెన్నై స్టేడియంలో సీఎస్కే తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడుతానని ఆశిస్తున్నా. అది వచ్చే ఏడాదో లేక ఐదేళ్లలోనా అనేది కచ్చితంగా తెలియదు' అని ధోనీ ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి ముందే సూచించాడు. చెన్నై వేదికగా తలపడనున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో ధోని ఆడితే గనుక అతని ఐదేళ్ల ప్రకటన ఇవాళ నిజమయ్యే అవకాశముంది. సీఎస్కేతో తన సుదీర్ఘ ప్రయాణం కూడా ముగియనుంది. మరి ధోనీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది మరో రెండు గంటల్లో తేలిపోనుంది.ఇదే మంచి తరుణం: అశ్విన్ధోనీకి అనుచర గణంలో ఒకడిగా గుర్తింపు పొందిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్న ధోనీ సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడేందుకు ఇదే మంచి అవకాశమని నాకు అనిపిస్తోంది. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి. నేను విన్నంత వరకు, అతను గత రెండు మూడు మ్యాచ్‌లుగా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 44 ఏళ్ల ధోని సీఎస్కే జట్టుకు దూరంగా ఉండడం వెనుక ఒక ప్రణాళిక దాగుంది. ఈ సీజన్లో ధోనీ లేకుండానే సీఎస్కే తమ ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న సీఎస్కే తుది జట్టులో మార్పులు చేయడం కష్టతరమే. అయితే ధోనికి ఇది చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతుండడంతో ఎస్ఆర్హెచ్తో పోరులో ధోనీ ఫ్యాన్స్ అతడిని చివరిసారి చూసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం! -
బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ ఆ జట్టు తరఫున టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్క్ అందుకోవడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫికర్ రహీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫికర్ రహీమ్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ.తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బంగ్లా క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరపు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 14 సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉండడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో 219 పరుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా, అలాగే బంగ్లా తరఫున మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో ముష్ఫికర్ రహీమ్ తర్వాత మోమినుల్ హక్ (13 సెంచరీలు), ప్రస్తుత బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (10 సెంచరీలు), నజ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచరీలు), లిటన్ దాస్ (6 సెంచరీలు) ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. అంతకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (137) సెంచరీ చేయగా.. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ (52), లిటన్ దాస్ (69) అర్థసెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4 వికెట్లు తీయగా, సాజిద్ ఖాన్ 3, హసన్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్‌స్వీప్ అయినట్లే. Built on class and consistency 💪Mushfiqur Rahim among the finest in Tests. Celebrates in style pic.twitter.com/DN6067jYjc— Bangladesh Cricket (@BCBtigers) May 18, 2026చదవండి: IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్‌ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్‌ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్‌లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్‌ఆర్‌హెచ్‌లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్‌ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్‌ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్‌లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్‌లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్‌దీప్‌తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్‌కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్‌లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్‌గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్‌ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ! -
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్‌తో మ్యాచ్‌లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్‌లో 113 పరుగులు, 2024లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్‌లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్‌లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్‌కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్‌పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్‌పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్‌ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్‌కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్‌ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్‌పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్‌ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్‌లో లిజ్ లాజ్‌కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్‌కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్‌సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్‌లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్‌గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్‌గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్‌తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా! -
అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్‌పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’ -
‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు రావాలంటే బౌలర్లు నాలుగు ఓవర్లకు పరిమితం కాకుండా ఐదు ఓవర్లు వేసేలా నిబంధనలను సవరించాలని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివల్ల జట్టులోని బెస్ట్ బౌలర్ సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.మిడ్-డే కాలమ్‌లో గావస్కర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్‌లో బౌలర్‌ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్లకు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవకాశమున్నప్పటికీ, ఒక అదనపు ఓవర్‌ను వేయించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశమున్నప్పుడు, బౌలర్‌కు మాత్రం ఒక ఓవర్ ఎక్కువగా వేసేందుకు ఎందుకు అనుమతించకూడదన్నది నా ప్రశ్న.ఈ మేరకు నిబంధనలు సవరించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జట్టులో ముగ్గురు బెస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు వారితో తలా ఐదు ఓవర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్‌లో రాసుకొచ్చారు. ఈ నిబంధనను ఐపీఎల్లో ప్రయత్నించడానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావస్కర్ అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయత్నిచడం ద్వారా ఫలితాలు చూడవచ్చన్నారు. వచ్చే సీజన్ లేదా ఐపీఎల్ 2028 సీజన్ నుంచి ఈ నిబంధనను ఉపయోగిస్తే చూడాలని ఉందని గావస్కర్ తెలిపారు.చదవండి: పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు! -
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్‌ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెలకొల్పగా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్‌ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా నోమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయస్కుడిగా నోమన్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమన్ అలీ ప్రస్తుత వయస్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమన్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్టన్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వయసులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. అంతేకాదు పాక్ తరఫున తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న నోమన్ అలీ ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ రికార్డును సవరించాడు. 2021లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నోమన్ అలీ 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత కానీ అతడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో పాకిస్తాన్ గెలవడంలో నోమన్ అలీ పాత్ర కీలకం. 22 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు సాధించిన నోమన్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి పది వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే చివరి రోజు ఆటలో పాకిస్తాన్ విజయం కోసం కష్టపడుతోంది. బంగ్లా విధించిన 268 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో తడబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. సాద్ షకీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి మరో 128 పరుగులు అవసరం.చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్‌పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ -
‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’
2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. తమ దేశంలో మతపరమైన ఉద్రిక్తతల కారణంగా ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తొలగించడంపై బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల భద్రతకు సంబం ధించి కారణాలు ఎత్తిచూపుతూ ప్రపంచకప్‌లో తమ మ్యాచ్ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. అయితే ఆటగాళ్ల భద్రతపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్రకటన విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావడం, ఆ తర్వాత ప్రపంచకప్ సజావుగా సాగిపోయింది. తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడం వెనుక అప్పటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. ‘టీ20 ప్రపంచకప్ వివాదం జరిగినప్పుడు మొదట నేనే గళం విప్పాను. నిజానికి గత బీసీబీ పరిపాలన విభాగం వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఈ విషయంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక పరిష్కారం కనుగొనడానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట వినకుండా తప్పు చేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. ఇక 1996-97 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు బంగ్లాదేశ్ అంతటా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మల్ని క్రికెట్‌వైపు ఆకర్షించాయి. ప్రతీ ఒక్కరు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా తయారవ్వాలనుకున్నారు. అప్పటి నుంచే బంగ్లా క్రికెట్ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. సరైన చర్చ జరగకుండానే 2026 టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం బాధాకరం. ఆ జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ల వచ్చే ప్రపంచకప్‌లో ఆడకపోవచ్చు. అయితే ఇప్పుడు సమస్యలు అన్నీ సమసిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో నాకు మంచి అనుబంధముంది. ఇద్దరం కలిసి ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడాం. ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఆయన చాలాసార్లు బంగ్లాదేశ్‌కు వచ్చారు. నేను అధ్యక్ష హోదాలో ఇంకా ఆయన్ను కలవలేదు. బహుశా అది త్వరలో జరగవచ్చు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భద్రత చాలా బాగుంది. త్వరలోనే బీసీసీఐతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్‌తో ఇరు దేశాల మధ్య క్రీడా బంధం బలపడుతుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
మిల్లర్, అక్షర్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ 2026లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో ఢిల్లీకి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇది ఐదో విజయం కాగా, పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.Ice in their veins and pure fire in their bats! 🧊🔥Madhav Tiwari & Ashutosh Sharma with match-winning clutch cameos to seal the deal for #DC 🫡Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC | @DelhiCapitals pic.twitter.com/ZqwSxTCrhj— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
కనోలి చర్యకు చాహల్ పిచ్చి చూపులు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శ్రేయస్, కన్నోలి, సూర్యాంశ్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కన్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చర్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని కనోలి ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ సిక్సర్ సంధించాడు. పవర్ స్ట్రోక్ ఉపయోగించడంతో బంతి స్టేడియం అవతల పడింది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ డగౌట్లో ఉన్న చాహల్.. కనోలి కొట్టిన భారీ సిక్స్‌ను కన్నార్పకుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న తరహాలో చేతితో సైగలు చేయడం కెమెరా కంటికి చిక్కింది. చాహల్ చర్య అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చాహల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ, ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్‌తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్‌లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. ‘అప్పటికే ఆ ఓవర్లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.RCB vs MI match is completely fixed. This mdc franchise needs to be banned from IPL forever pic.twitter.com/xCrf6JcHOc— Vishnu (@WorshipRohit) May 11, 2026🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling night 🥳Down to the absolute wire in a contest of incredibly fine margins ⏳Watch the pure passion pour out from #RCB's unforgettable last-ball win ❤️ #TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/H0PNbJSVY6— IndianPremierLeague (@IPL) May 11, 2026చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది! -
టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది!
ఐపీఎల్ 2026 సీజన్ వన్‌సైడ్ మ్యాచ్‌లో చప్పగా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. అసలు సిసలు టీ20 మజాను చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్లో సంబరాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లేకుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద ఆ సంజ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంది. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియన్స్ తరఫున 37 మ్యాచ్‌లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్‌రేట్ 658 పరుగులు సాధించాడు. 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజన్లో లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చి 187 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 10 పరుగులకు మారింది. ఈ దశలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో రసిక్ సలామ్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.🚨👀🔥Former Mumbai Indians player Tim David was caught showing a middle finger during the match while playing for Royal Challengers Bengaluru 😳The clip instantly went viral, with fans debating💥#TimDavid #RCBvsMI #MumbaiIndians #RCB #IPL2026 #12BETIndia #KnowTheGame 🔥 pic.twitter.com/i7MNqTt3CT— 12BET India (@12B_India) May 11, 2026#breaking RCB's batter Tim David has been booked under Article 2.6 (showing an offensive gesture) during @RCBTweets match vs @mipaltan yesterday at Raipur. He will be penalized 30% of his match fees and given 2 demerit points..@IPL official media release will be out soon!— Gaurav Gupta (@toi_gauravG) May 11, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ విజయం
ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅర్థసెంచరీ సాధించిన అక్షర్ పటేల్ (56) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో బెన్ ద్వార్సుస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (39), అశుతోశ్ శర్మ (7) పరుగులతో ఆడుతున్నారు.ఆశలు రేపుతున్న అక్షర్, మిల్లర్211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఇద్దరు 28 బంతుల్లోనే 50 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశలు పెంచుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 12 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ కావడంతో ఢిల్లీ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 25 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో పొరేల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఢిల్లీ లక్ష్యం 211 పరుగులుఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కన్నోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.శ్రేయస్ అర్థశతకం17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ బాది ప్రియాన్ష్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్‌లో సాహిల్ పరాఖ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (13), కూపర్ (5) ఉన్నారు. స్కోరు107-2 (10 ఓవర్లకు)గా ఉంది.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔక్విబ్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్యా (51), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ప్రియాన్ష్.. 3 ఓవర్లలో 51/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టోకుండా 51 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (5) పరుగులతో ఆడుతున్నాడు.టాస్ ఓడిన పంజాబ్టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ పొరేల్, సాహిల్ పరాక్, డేవిడ్ మిల్లర్, అకిబ్ నబీ, మాధవ్ తివారి తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్‌తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవనుంది. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలడిపతే 18 సార్లు పంజాబ్, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధర్మశాలలో ఇరుజట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే🚨Toss update from Dharamshala 🚨@DelhiCapitals won the toss and elected to bowl first against @punjabkingsiplUpdates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/uia9sh01xL— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
తిరోగమనంలో ముంబై ఇండియన్స్.. ఆ ముగ్గురిపై వేటు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ది ఘన చరిత్ర. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తిరోగమనం దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్స్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఆదివారం ఆర్సీబీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో అనుభవం లేని రాజ్‌బవా చేతికి బంతిని అందించి కెప్టెన్ సూర్యకుమార్ మూల్యం చెల్లించుకున్నాడు. అనుభవలేమితో ఒత్తిడికి లోనైన రాజ్‌బవా వైడ్లు, నోబ్ వేసి ముంబై ఓటమికి కారణమయ్యాడు. ఈ ఓటమితో ముంబై 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించడంతో లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ రెండు వారాల ముందే ముంబై ఐపీఎల్ 19వ సీజన్లో ఎలిమినేట్ అయింది. అయితే ఐపీఎల్‌కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యులుగా ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ సహా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ముంబై జట్టులో ఉండడం గమనార్హం. అయితే ఈ సీజన్లో ముంబై దారుణ వైఫల్యంతో వచ్చే సీజన్‌కు జట్టులో ప్రక్షాళన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రం విడుదల చేయనుంది. వారే ప్రస్తుత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, ట్రెంట్ బౌల్ట్.సూర్యకుమార్35 ఏళ్ల వయసున్న సూర్యకుమార్ టీ20 క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. కేవలం టీ20 స్పెషలిస్ట్‌గానే టీమిండియాకు ఆడిన సూర్యకుమార్ గత నాలుగేళ్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ ఈ సీజన్లో మాత్రం సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్‌లాడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సీజన్లో రోహిత్ శర్మ గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరం కావడంతో జట్టులో సీనియర్‌గా బ్యాటర్‌గా బాధ్యతగా ఆడాల్సిన సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. పైగా పాండ్యా దూరమవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలు అతడిని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో వచ్చే సీజన్లో సూర్యకు ముంబై టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్ పాండ్యాఒకప్పుడు ముంబై ఇండియన్స్‌లో ఆడిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 2022 సీజన్లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే పాండ్యా ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. మరుసటి సీజన్లోనూ గుజరాత్‌ను రన్నరప్‌గా నిలపడంతో పాండ్యా పేరు మార్మోగిపోయింది. దీంతో ఉన్నపళంగా 2024సీజన్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. కానీ ముంబైలోకి వచ్చినప్పటి నుంచి పాండ్యా అటు కెప్టెన్‌గా.. ఇటు ఆల్‌రౌండర్‌గా పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు. 2025 సీజన్లో పాండ్యా సారథ్యంలో ముంబై ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా చేరడంతో ముంబై స్థాయికి ఇది తగదు. ఇక 2024 సీజన్‌తో పాటు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఈ సీజన్లో పాండ్యా 8 మ్యాచ్‌లాడి 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ విఫలమైన పాండ్యా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి తోడు తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన పాండ్యా వచ్చే సీజన్లో వేరే జట్టుకు ఆడే అవకాశముంది.ట్రెంట్ బౌల్ట్అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్లో బౌల్ట్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లాడిన బౌల్ట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తాడనుకుంటే బౌల్ట్ మాత్రం తన దారుణ ప్రదర్శనతో ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాడు. వచ్చే సీజన్లో బౌల్ట్ స్థానంలో యంగ్ పేసర్‌ను తీసుకోవాలని ఇప్పటికే ముంబై భావిస్తోంది.చదవండి: పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు! -
పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు రసతవత్తరంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. ముంబై బౌలర్ రాజ్‌బవా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయడంతో చివరి ఓవర్లో 15 పరుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటికే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండడం గమనార్హం.అగ్రస్థానంలో ఆర్సీబీ:ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సరిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్, పంజాబ్‌ల నుంచి పోటీ వద్దనుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచి నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.హైదరాబాద్ రెండు గెలిస్తే:సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.737) విషయంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గుజరాత్‌కు కీలకంగా మారనుంది.అనుకూల స్థితిలో పంజాబ్:పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్‌ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్‌కు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగులో కనీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.చెన్నైకి కనీసం రెండు విజయాలు:ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్‌రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే అవకాశం ఉంది.ఒత్తిడిలో రాజస్థాన్:రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. అప్పుడు కేకేఆర్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది. అయితే మ్యాచ్‌లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే..ఢిల్లీ క్యాపిటల్స్‌కు అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవసరముంటుంది.ముంబై, లక్నో అవుట్:ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం! -
ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2, గజన్ఫర్, రాజ్ బవాలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు, ఆఖరి ఓవర్లో రాజ్ బవా ఒత్తిడి లోనయ్యి వరుస వైడ్లు, నోబాల్ వేయడం కూడా ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది.WHAT ON EARTH HAVE WE JUST WITNESSED! 🤯Bhuvneshwar Kumar & Rasikh Dar, take a bow ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/tqkuPMEsHR— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
సిల్వర్ టు గోల్డెన్ డక్.. కోహ్లీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కాచుకు కూర్చున్న రాజ్‌బవాకు స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ డకౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలిసారి గోల్డెన్ డక్ అయిన కోహ్లీకి ఓవరాల్‌గా ఐపీఎల్లో ఎనిమిదో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత రెండు వరుస మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. 2022 సీజన్లో కోహ్లీ లక్నో, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌ల్లో ఇదే మాదిరిగా డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వర్ డక్‌ను గోల్డెన్ డక్‌గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డకౌట్‌తో కోహ్లీ మరిన్ని చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.👉ముంబై ఇండియన్స్‌పై కోహ్లీ డకౌట్ కావడం ఇది మూడోసారి. గతంలో ఎస్ఆర్హెచ్పై కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక లక్నోపై రెండుసార్లు, పంజాబ్, గుజరాత్, కేకేఆర్, రాజస్తాన్‌లపై ఒక్కోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు.👉 ఐపీఎల్లో కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన తర్వాతి మ్యాచ్‌లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తాజా సీజన్లోనూ వరుసగా లక్నో, ముంబైతో మ్యాచ్‌ల్లోనూ మరోసారి రిపీట్ చేశాడు.👉 ఐపీఎల్‌ల్లో అత్యధిక సార్లు గోల్డెన్‌డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిషన్, సునీల్ నరైన్‌లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరి కంటే ముందు రషీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్‌వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.👉ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్‌లో మెరుపులు తగ్గినప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 379 పరుగులు సాధించాడు. అయితే గత నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లీ చేసిన పరుగులు 51 మాత్రమే కావడం గమనార్హం.Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ— IndianPremierLeague (@IPL) May 10, 2026Silver duck now has been upgraded to golden duck 😂 pic.twitter.com/wxhEbgDBHC— Hitman (@Vijay456V60026) May 10, 2026చదవండి: లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర! -
లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేటు వయసులోనూ తన బౌలింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ వెటరన్ బౌలర్ నాలుగు వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లో ఇంకా పదును తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 19వ సీజన్లో 20 వికెట్లు పూర్తి చేసుకున్న భువనేశ్వర్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 20 వికెట్లు తీయడం భువనేశ్వర్‌కు ఇది నాలుగోసారి. తొలిసారి 2014లో 20 వికెట్ల మార్క్ దాటిన భువనేశ్వర్, ఆ తర్వాత 2016, 2017లోనూ ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజాగా నాలుగోసారి 20 ప్లస్ వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు. భువనేశ్వర్ కంటే ముందు యజ్వేంద్ర చాహల్ ఐదుసార్లు, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు నాలుగేసిసార్లు ఈ ఫీట్‌ను సాధించారు. ముంబైతో మ్యాచ్‌లో భువనేశ్వర్ తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అర్థసెంచరీతో ముంబై ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తిలక్ వర్మను క్లీన్‌బౌల్డ్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.𝘽𝙝𝙪𝙫𝙞-𝙛𝙪𝙡 exhibition of new-ball magic! 🤌🎥 Just sit back and admire the swing of things! ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/STbZ16mzbj— IndianPremierLeague (@IPL) May 10, 2026The 𝘀𝘁𝘂𝗺𝗽𝘀 𝗹𝗶𝗴𝗵𝘁 𝘂𝗽 courtesy of the Purple Cap holder 👏🔥🎥 Bhuvneshwar Kumar with his 4️⃣th wicket tonight 🙇Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/7q5TqfkHNs— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’ -
ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్‌జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A record knock 🤯A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛 Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.👉 ఇదే మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్‌లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్పటేల్ దానిని బద్దలు కొట్టాడు.6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026👉 సీఎస్కే తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్‌లో ఉర్విల్ 282.6 స్ట్రైక్‌రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్‌రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్‌రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్‌రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్‌రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: వైభవ్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు -
వైభవ్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్‌ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్‌గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.ఐపీఎల్ 2026 సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో నాలుగోసారి సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్‌పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.చదవండి: సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్! -
IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఉత్కంఠ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.కార్బిన్ బాష్‌కు నాలుగు వికెట్లుముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కార్బిన్ బాష్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18 పరుగులు చేసిన జితేశ్ శర్మ కార్బిన్ బోష్ బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు కృనాల్ పాండ్యా అర్థశతకంతో మెరిశాడు. 33 బంతుల్లో అర్థశతకం సాధించిన కృనాల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీజాకబ్ బెతెల్ (27) రూపంలో ఆర్సీబీ 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోష్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ పెవిలియన్ చేరాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (41) పరుగులతో ఆడుతున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీకెప్టెన్ పటీదార్ (8) రూపంలో ఆర్సీబీ 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోస్క్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీముంబైతో మ్యాచ్‌లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చాహర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ కీపర్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ గోల్డెన్ డక్.. తొలి వికెట్ డౌన్167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.ఆర్సీబీ టార్గెట్ 167 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ముంబైవిల్ జాక్స్ (10) రూపంలో ముంబై ఇండియన్స్ 132 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన విల్ జాక్స్ జాకబ్ బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.నమన్ ధిర్ హాఫ్ సెంచరీ మిస్ ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. నమన్ ధిర్ 47 పరుగులు చేసి రసిఖ్ సలాం దార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ 41, విల్ జాక్ 5 పరుగులతో ఉన్నారు. స్కోరు 114-4 (13 ఓవర్లకు)గా ఉంది. 10 ఓవర్లకు 82 పరుగులు ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు ముగిసేనాటికి మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో నమన్ ధిర్ 34, తిలక్ వర్మ 25 పరుగులతో ఉన్నారు. క్రీజులో నమన్, తిలక్ వర్మ 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (13) పరుగులతో ఆడుతున్నారు.సూర్య గోల్డెన్ డక్.. మూడో వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్‌లో స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో తాను ఆడిన తొలి బంతికే సూర్య కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు రోహిత్ శర్మ (28)ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. నమన్ ధిర్ (5), తిలక్ వర్మ (1) పరుగుతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న రికెల్టన్ 2 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో పటీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ గెలిచిన ఆర్సీబీటాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 35 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 19 సార్లు, ఆర్సీబీ 16 సార్లు గెలిచాయి. 2023 నుంచి ఐదు మ్యాచ్‌లు ఆడితే ఆర్సీబీ మూడు గెలిస్తే, ముంబై రెండు విజయాలు సాధించింది. తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పరంగా చూసుకుంటే ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే 14 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ను వెనక్కి నెట్టి టేబుల్ టాపర్‌గా నిలవనుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు క్లిష్టం చేసుకున్న ముంబై 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.తుది జట్లు:ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: ట్రెంట్ బౌల్ట్, రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @mipaltan in Raipur.Surya Kumar Yadav continues to lead #MI in Hardik Pandya's absence.Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI pic.twitter.com/TilnplTivN— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్!
లక్నో సూపర్‌జెయింట్స్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఆదివారం సీఎస్కేతో మ్యాచ్‌లో దనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లిస్ 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ సాధించిన ఇంగ్లిస్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్‌గా ఇంగ్లిస్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సామ్ బిల్లింగ్స్ (21 బంతులు) పేరిట ఉండేది. సీఎస్కే సొంత గ్రౌండ్ అయినప్పటికీ ఇప్పటివరకు ఆ జట్టులో కూడా ఎవరు తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించలేకపోయారు. ఇక సామ్ బిల్లింగ్స్ 21 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. 2018 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై బిల్లింగ్స్ దీనిని సాధించాడు. తాజాగా జోస్ ఇంగ్లిస్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సీఎస్కే బ్యాటర్లకు కూడా సాధ్యం కానిది తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఇంగ్లిస్ ఉన్నంతసేపు లక్నో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆరు ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ను దాటిన లక్నో.. ఇంగ్లిస్ ఔటయ్యాక జట్టు ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. చివర్లో సషాబాజ్ అహ్మద్ (25 బంతుల్లో 43 నాటౌట్) రాణించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.North, South, East, or West 📍Josh Inglis was at his best 👏Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/rAgC15cqmw— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు! -
లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు!
ఐపీఎల్ 2026 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం, ఆ ఫోన్‌ను వైభవ్ సూర్యవంశీ చూడడం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటన మరువకముందే తాజాగా ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్‌జెయింట్స్ డగౌట్లో ఒక వ్యక్తి అదే పనిగా మొబైల్ ఫోన్ వాడడం కనిపించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్క్వేర్ లెగ్‌వైపు మిచెల్ మార్ష్ బౌండరీ కొట్టాడు. ఈ సమయంలో రిప్లేలో లక్నో డగౌట్లో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అతడు పదే పదే ఫోన్లో మాట్లాడుతుండడం కనిపించడంతో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ చేపట్టే అవకాశం ఉంది.పీఎంవోఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఐపీఎల్లో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంవోఏ) ప్రొటోకాల్ ప్రకారం, టీమ్ మేనేజర్లు తమ ఫోన్లను కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. డగౌట్ ఏరియా సహా మైదానంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ పరికరాలు ఉపయోగించేందుకు వీలు లేదు. అయితే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ చర్య తర్వాత బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించిన భిందర్‌కు రూ. లక్ష జరిమానా విధించడంతో పాటు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే రోమీ భిందర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ మరోసారి ఇది రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. తాజాగా మరోసారి నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.భద్రత, నియమ నిబంధనల ఉల్లంఘన, హనీ ట్రాప్ వంటి ఉదంతాలతో బీసీసీఐ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల యాజమాన్యాలకు కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు! -
దుమ్ములేపిన రషీద్, గిల్.. టాప్-2కు దూసుకొచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.గుజరాత్ ఓపెనర్ల దూకుడు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.చేధనలో చతికిలపడి..230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్‌తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్లో గుజరాత్ చేతిలో రాజస్తాన్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా! -
వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్లో ఓవరాల్‌గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి. ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్లో 38 సిక్సర్లు, 2024 సీజన్లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్లో 37 సిక్సర్లు) ఉన్నారు.👉ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉 ఐపీఎల్ సీజన్లో ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.MAKING IT A HABIT 🤩🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా? -
ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా?
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఆర్చర్ 5 వైడ్లు వేశాడు. ఆరు బంతులు వేయాల్సిన చోట 11 బంతులు వేసిన ఆర్చర్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. ఇక ఆర్చర్ మరో రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన ఏడో బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. గతంలో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ 11 బంతుల ఓవర్ వేశారు.👉మహ్మద్ సిరాజ్ (11 బంతులు, 2023లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో)👉 తుషార్ దేశ్‌పాండే (11 బంతులు, 2023లో లక్నోతో మ్యాచ్‌లో)👉 శార్దూల్ ఠాకూర్ (11 బంతులు, 2025లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో)👉 సందీప్ శర్మ (11 బంతులు, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో)👉 హార్దిక్ పాండ్యా (11 బంతులు, 2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)👉 అర్ష్‌దీప్ సింగ్ (11 బంతులు, 2026లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)అయితే సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చర్‌ను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవలే హనీట్రాప్ అంశం తెరమీదకు రావడం, ఆర్చర్ కూడా గుజరాత్ తో మ్యాచ్‌కు ముందు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. ఒక అభిమాని శ్రుతి మించి ఆర్చర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్చర్ శనివారం ఉదయం జైపూర్ హోటల్లో అమ్మాయితో కనిపించాడని.. సాయంత్రానికి నోబాల్ సహా ఐదు వైడ్లు వేయడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది* అంటూ పేర్కొన్నాడు. ఆర్చర్ తన కెరీర్లోనే అత్యంత చెత్త ఓవర్ వేసి జైస్వాల్ కెరీర్ నాశనం చేశాడంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేశారు.హనీట్రాప్ అంటే..'హనీ ట్రాపింగ్' అంటే క్రికెటర్లను ప్రేమ సంబంధమైన లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా మోసగించడం, లొంగదీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం లేదా ఉచ్చులో పడేయడం వంటి పరిస్థితులను సూచిస్తుంది. తాజాగా జోఫ్రా ఆర్చర్ 11 బంతుల ఓవర్ వేసిన తర్వాత, అతని పేరు హనీ ట్రాప్ వివాదంతో ముడిపడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆటగాళ్లు హనీ ట్రాప్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బీసీసీఐ భయపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను అరికట్టడానికి, టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు ఎవరూ హోటల్ గదుల్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది.Not a very good start for Rajasthan and for Jofra Archer😬😬 17 runs in 1 over for Gujarat 🔥 A lot of Freebies from Archer😐 pic.twitter.com/EARUdGdnWp— STUMP THEORY (@SANIL__18) May 9, 2026చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు! -
IPL 2026: రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం
శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్‌బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్‌ను కూడా క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్‌లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్84 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.మరో వికెట్ డౌన్జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డోనోన్కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.సాయి సుదర్శన్ ఔట్ సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్‌మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. గుజరాత్ ఓపెనర్లు దూకుడురాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్‌మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో 18 పరుగులిచ్చిన ఆర్చర్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన రాజస్తాన్..టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ను జైస్వాల్ నడిపించనున్నాడు. ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్‌తో పాటు యష్‌రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్‌లో కూడా గుజరాత్‌దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.తుది జట్లు:గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రారాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్ -
పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు!
ఐపీఎల్ 2026 సీజన్లో ఊహించని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ నిషేధిత ప్రాంతాల్లో ఈ-సిగరేట్ తాగడం పెను దుమారం రేపింది. ఇప్పటికే పరాగ్‌పై యాక్షన్ తీసుకున్న బీసీసీఐ రూ. 25 లక్షల జరిమానా విధించింది. అయితే చాహల్ విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఈ వివాదంలో చాహల్‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ వీడియో లీకవ్వడం, అతడే వేప్ (ఈ-సిగరేట్)ను చాహల్‌కు అందించడం వీడియోలో కనిపించింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అర్ష్‌దీప్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే పరిణామాలను వ్లాగ్‌గా తీయడం ఆపేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల డ్రెస్సింగ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా శనివారం ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీస్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆటగాళ్లందరితో సమావేశమైనట్లు తెలిసింది. ఐపీఎల్ ముగిసేవరకు ఆటగాళ్లు వ్లాగ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మీటింగ్‌లో అర్ష్‌దీప్ హైలైట్ అయ్యాడు. చాహల్ చర్యకు పరోక్షంగా అర్ష్‌దీప్ కారణమయ్యాడు. కాగా అర్ష్‌దీప్‌కు ఇన్‌స్టాలో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడితే జట్టు నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి వస్తోందని అర్ష్‌దీప్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ-సిగరేట్ తాగిన చాహల్‌ను కూడా పంజాబ్ మందలించినట్లు సమాచారం. ఇక నుంచి పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ఆటగాళ్లంతా తమ వీడియోలను షేర్ చేసుకోవాలని ఆదేశించింది. అందుకు ఆటగాళ్లందరి నుంచి ఇప్పటికే సంతకాలు కూడా తీసుకోవడంతో పాటు ఏ ప్లేయర్ కూడా తమ వ్యక్తిగత అకౌంట్స్‌లో వీడియోలు పంచుకోవద్దని సూచించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో టేబుల్టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో పరాజయాలు చవిచూసి ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: అయ్యర్‌కు షాక్.. శాంసన్‌కు డబుల్ ప్రమోషన్! -
అయ్యర్‌కు షాక్.. శాంసన్‌కు డబుల్ ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌పై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అయితే శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంసన్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే అయ్యర్ కెప్టెన్ అయితే సంజూ శాంసన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ శాంసన్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై కర్చీఫ్ వేసి అయ్యర్‌కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అయ్యర్‌కే అధిక ప్రాధన్యమిచ్చే అవకాశమున్నప్పటికీ శాంసన్ రేసులోకి వస్తే అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో కెప్టెన్ కావాలనుకున్న అయ్యర్‌కు ఇప్పుడు శాంసన్ రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు అతడు కెప్టెన్ కాకపోయినప్పటికీ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం శాంసన్‌కు ఉపయోగపడనుంది. అనుభవానికి తోడు కెప్టెన్‌గా రాజస్తాన్‌ను విజయవంతంగా నడిపించడమే శాంసన్‌ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక టీమిండియా వచ్చే జూన్, జూలై నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ముంబై బ్యాటర్‌గా సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడు చోటు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే పరుగుల పరంగా శాంసన్, శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.శాంసన్ ఎందుకంటే?భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్‌కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్న శాంసన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్‌లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జట్టులో ఇప్పటివరకు చోటు లేకపోవడం మైనస్‌గా మారింది. అయ్యర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. ఒకవేళ అయ్యర్ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అతడికి బూస్టప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అతను టీ20 కెప్టెన్ అయితే అతని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుంది.చదవండి: చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! -
చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం!
టీమిండియా క్రికెటర్లు జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరు డోపింగ్ టెస్టుకు అందుబాటులోకి రాకపోవడంపై నాడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జైస్వాల్, షఫాలీ వర్మల పేర్లపై ‘మిస్ టెస్ట్’ నమోదు చేసింది. దీనిపై ఏడు రోజల్లోగా సమాధానమివ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీతో పాటు బీసీసీఐకి కూడా నాడా నివేదించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేధం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. నాడా నిబంధనల ప్రకారం.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్స (ఆర్టీపీ)లో ఉన్న ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నామో ముందే సమాచారం అందించాలి. దీనినే 'వేర్ అబౌట్ క్లాజ్' అంటారు. గతేడాది డిసెంబర్ 17న డోప్ కంట్రోల్ ఆఫీసర్ పరీక్ష కోసం వెళ్లగా, జైస్వాల్ తాను చెప్పిన చోట అందుబాటులో లేరు. అలాగే నవంబర్ 7న షెఫాలీ వర్మ కూడా తాను ఇచ్చిన అడ్రస్‌లో లేకపోవడంతో ఆమె టెస్ట్ కూడా మిస్ అయ్యింది. కేవలం టెస్టుకు గైర్హాజరు కావడమే కాకుండా, దీనిపై వివరణ ఇవ్వాలని నాడా పంపిన నోటీసులను కూడా వీరిద్దరూ నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా తాజాగా వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది.నిషేధం పడనుందా?ప్రస్తుతానికి వీరిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే నాడా/వాడా నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదిలో (12 నెలలు) మూడుసార్లు టెస్టుకు అందుబాటులో లేకపోతేనే దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు కేవలం ఒకసారి మాత్రమే టెస్ట్ మిస్ అయ్యారు. అయితే మరో రెండుసార్లు ఇలాగే జరిగితే మాత్రం సదరు ఆటగాళ్లపై 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.చదవండి: ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! -
ఫిన్ అలెన్ సెంచరీ.. ఢిల్లీపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫిన్ అలెన్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.విఫలమైన బ్యాటర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 4.6 ఓవర్లలో 49 పరుగులు సాధించారు. రాహుల్ ఔటైన తర్వాత నిస్సాంక ఒక ఎండ్‌లో నిలబడినప్పటికీ ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నిస్సాంక ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఆఖర్లో అశుతోశ్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆడుతూ పాడుతూ..143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆరంభంలో దురదృష్టం వెంటాడింది. అజింక్యా రహానే రనౌట్ కాగా, అంగ్క్రిష్ రఘువంశీ వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగారు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరున్ గ్రీన్‌తో కలిసి ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ ఆ తర్వాత గేర్ మార్చాడు. ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడిన అలెన్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్న ఫిన్ అలెన్ రెండో ఫిఫ్టీకి కేవలం 15 బంతులే తీసుకోవడం విశేషం. ఫిన్‌కు తోడు గ్రీన్ కూడా రెచ్చిపోవడంతో 34 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్ని అంందుకుంది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన ఫిన్ అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో ఏడో స్థానానికి చేరుకోగా, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు ఓటములతో 8వ స్థానానికి పడిపోయింది.A 𝙆night of sheer dominance 🔥@KKRiders chase down the 🎯 with 34 deliveries to spare and make it 4⃣ wins on the trot 👊💜Scorecard ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/e3cpW0J2Xq— IndianPremierLeague (@IPL) May 8, 2026చదవండి: వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ! -
వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడింది. కెప్టెన్ రహానేతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ తమ తప్పు లేకున్నా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ముందుగా రహానే విషయానికొస్తే.. అప్పటికే రహానే ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించాడు. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్ మిచెల్ స్టార్క్ వేయగా.. ఆ ఓవర్ చివరి బంతిని ఫిన్ అలెన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ తన చేతుల్ని అడ్డుపెట్టడంతో బంతి అతని చేతులకు తగిలి వికెట్లను గిరాటేసింది. నాన్స్ట్రైక్ఎండ్లో ఉన్న రహానే అప్పటికే క్రీజు దాటి బయటికి వచ్చేశాడు. అతను తిరిగి క్రీజులోకి చేరుకునేలోపే బంతి వికెట్లను తాకడంతో చేసేదేం లేక రనౌట్‌గా వెనుదిరిగాడు. అలా రహానే ఆట ముగిసింది. అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్ నాలుగో బంతిని అంగ్క్రిష్ రఘువంశీ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి వికెట్ల మీదకు వెళ్లింది. అంగ్క్రిష్ బంతిని అడ్డుకునేలోపే వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో అంపైర్ రఘువంశీని క్లీన్‌బౌల్డ్ అయినట్లు ప్రకటించాడు. ఇలా వరుస ఓవర్లలో ఇద్దరు కేకేఆర్ టాపార్డర్ బ్యాటర్లను దురదృష్టం వెక్కిరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.𝗖𝗮𝗻 𝘆𝗼𝘂 𝗯𝗲𝗹𝗶𝗲𝘃𝗲 𝗶𝘁? 😮🎥 2⃣ of the unluckiest dismissals you will ever see in the space of 5⃣ deliveries 🫣Delight for #DC 💙Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/sScNewgsFK— IndianPremierLeague (@IPL) May 8, 2026 చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు! -
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు నమోదు చేసింది. ఢిల్లీ ఇవాళ్టితో కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మరో మ్యాచ్‌లో వంద పరుగుల్లోపే ఆలౌటవ్వడం ఢిల్లీకి మాత్రమే చెల్లింది. విషయంలోకి వెళితే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఒక దశలో 74 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన ఢిల్లీ మిగతా 9 వికెట్లను కేవలం 68 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఇక చెన్నైసూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో 155 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విధించిన 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం. దానికి ముందు ఆర్సీబీతో మ్యాచ్‌లో సొంతగడ్డపై 75 పరుగులకే కుప్పకూలింది. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలవ్వడం గమనార్హం. పంజాబ్‌తో మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరికీ సాధ్యం కాని ఆటతీరుతో వింత రికార్డును మూటగట్టుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఏకైక బ్యాటర్‌గా -
కాలర్ పట్టుకున్న పూరన్.. కృనాల్ వివరణ!
ఐపీఎల్ 2026 సీజన్లో గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లక్నో జట్టు డబుల్ హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టినట్లయింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ నికోలస్ పూరన్, ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. కృనాల్ విసిరిన బౌన్సర్‌ను లాంగ్ ఆన్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్న పూరన్‌తో కృనాల్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ సీరియస్‌గా ఒకరినొకరు చూసుకోవడం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో పూరన్ కృనాల్ కాలర్‌ను పట్టుకొని నెట్టివేయడం కనిపించింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడంతో వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పూరన్ తన కాలర్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, అసలు పూరన్‌తో గొడవేంటనే విషయాన్ని కృనాల్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇద్దరి మధ్య గొడవేం లేదు. కేవలం మా మాధ్య ఉన్నది ప్రేమ మాత్రమే. 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నా సోదరుడు నికోలస్ పూరన్‌కు అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో నేను పూరన్ అడిగింది ఏంటో తెలుసా?.. ‘ నా బౌన్సర్ ఎలా ఉంది’ అని అడిగాను. అంతకుమించి మా మధ్య ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో చెలరేగగా, పూరన్ (38), పంత్ (32 నాటౌట్) రాణించారు. అనంతరం 213 పరుగుల రివైజ్డ్టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులకు పరిమితమైంది. పటీదార్ (61), పడిక్కల్ (34) రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ (28 నాటౌట్), షెపర్డ్ (23 నాటౌట్) ధాటిగా ఆడినా ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.Things are heating up in this Revenge Week clash! 🔥A contest within the contest is brewing between #NicholasPooran and #KrunalPandya! 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #LSGvRCB | LIVE NOW 👉 https://t.co/gEprGnf2A7 pic.twitter.com/C2oqmrYF0X— Star Sports (@StarSportsIndia) May 7, 2026 Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7— Deepu (@deepu_drops) May 8, 2026చదవండి: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డి సిల్వా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న కపిల చంద్రసేన అరవింద డి సిల్వా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. అరవింద డిసిల్వా భార్య అనుష్క డి సిల్వా, కపిల చంద్రసేన భార్య ప్రియాంక నియోమలి స్వయానా అక్కా చెల్లెల్లు కావడం గమనార్హం.విషయంలోకి వెళితే.. మే 7న (గురువారం) కపిల చంద్రసేన కొల్లుపిటియాలోని పెడ్రిస్ ప్లేస్‌లో ఉన్న అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అరవింద డిసిల్వా ఇంట్లోని బెడ్రూమ్లో కపిల చంద్రసేన నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడనుంది.ఇటీవలే చంద్రసేన విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి 2 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరణించడానికి ఒక్కరోజు ముందు కొలంబో ప్రధాన న్యాయమూర్తి కపిల చంద్రసేనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని తప్పించకునేందుకు అరవింద డిసిల్వా ఇంటికి వచ్చారా లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కపిల చంద్రసేన మరణ వార్త తెలియగానే లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్లో మూలస్తంభాల్లో ఒకడిగా అరవింద డిసిల్వా గుర్తింపు పొందాడు. లంక జట్టు 1996 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో అరవింద డిసిల్వాది కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌లోని లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 1996 ప్రపంచకప్ ఫైనల్లో చేజింగ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన డిసిల్వా తన జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అరవింద డిసిల్వా లంక తరఫున 93 టెస్టులు, 308 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి 15వేలకు పైగా పరుగులు సాధించిన అరవింద డిసిల్వా 31 సెంచరీలు, 86 అర్థసెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ డిసిల్వా రెండు ఫార్మాట్లు కలిపి 135 వికెట్లు పడగొట్టాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో శ్రీలంక ఓటమి అనంతరం అరవింద డిసిల్వా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.చదవండి: ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్! -
ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వరుస ఓటములకు పుల్‌స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్లు నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ పటీదార్ (61) అర్థసెంచరీతో రాణించగా, పడిక్కల్ (34) పర్వాదలేదనిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లతో మెరవగా, షమీ, షాబాజ్ అహ్మద్‌లు చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. కాగా లక్నో ఆరు వరుస ఓటముల తర్వాత గెలుపును అందుకోవడం విశేషం. -
కంగ్రాట్స్ సూర్యా భాయ్.. తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సూర్యకుమార్ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు. ‘ కంగ్రాట్స్ సూర్యా భాయ్’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్! -
తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా లక్నో తరఫున ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. రొమారియో షెపర్డ్ వేసిన యార్కర్ బంతిని బౌండరీ తరలించడం ద్వారా ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే గతంలో లక్నో తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లక్నో తరఫునే సాధించాడు. గతేడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. ఇక లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్, స్టోయినిస్, పంత్‌లు తలా ఒక సెంచరీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు! -
‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు!
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ అతుల్ వస్సన్ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ దూకుడు స్వభావం, అతడి కఠిన వైఖరితో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వస్సన్ ఆ ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరించాడు. అతుల్ వస్సన్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జరగాలి, ఇంకేమీ చేయకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. మొదటి నుంచి గంభీర్ స్వభావం అలాగే ఉంటుంది. ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గంభీర్ ఆటలో మంచి టెక్నిక్ ఉండడంతో పాటు మంచి తెలివిమంతుడు. అయితే అతనికి ఉండే ఈగో వేరే లెవెల్లో ఉంటుంది. అదెలా అంటే అతను ఏదైనా అనుకుంటే అవతలి వ్యక్తుల కూడా తనకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్లో అలాగే కొనసాగడం ఆటగాళ్లతో గొడవలు పడేలా చేసింది. అందుకే ఐపీఎల్లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి పట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్రవర్తనతో కచ్చితంగా సంతోషంగా లేరని చెప్పగలను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!
ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ భువనేశ్వర్‌కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో 199 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్‌లు, ఎస్ఆర్హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్‌లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్‌లు ఆడాడు.అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్‌లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్‌లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్‌లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్‌లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్‌లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్‌లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్‌లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్‌లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్‌లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్‌లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా? -
IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం
గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.టిమ్ డేవిడ్ ఔట్.. ఆరో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావడంతో ఆర్సీబీ 158 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 21 బంతుల్లో 55 పరుగులు అవసరం.ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్ తొలి బంతికి పడిక్కల్ (34)ను పెవిలియన్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శర్మను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 106 పరుగులు అవసరం.పటీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (60) అర్థసెంచరీ సాధించగా, పడిక్కల్ 34 పరుగులతో ఆడుతున్నాడు.7 ఓవర్లలో ఆర్సీబీ 60/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. పడిక్కల్ (26), పటీదార్ (25) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ జాకబ్ బెథెల్ 4 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.ఆర్సీబీ టార్గెట్ 213 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 19 ఓవర్లకు కుదించి ఆర్సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్ నిర్దేశించింది.రెండో వికెట్ కోల్పోయిన లక్నో111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.మిచెల్ మార్ష్ సెంచరీ.. లక్నో 139/1ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శతకం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. పూరన్ 14 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోవర్షం అంతరాయం తర్వాత మొదలైన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అర్షిన్ కులకర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో పటీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. వరుణుడి అడ్డంకి ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్ మార్ష్ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్ మార్ష్ 76, అర్షిన్ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచుతున్న మిచెల్ మార్ష్లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లలో లక్నో 39/04 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో ఆడుతున్నారు.మ్యాచ్‌కు వర్షం అంతరాయంలక్నో, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడే సమయానికి లక్నో 1.3 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 12 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కులకర్ణి (4) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన ఆర్సీబీటాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో జట్టు మాత్రం మూడు మార్పులతో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కులకర్ణి, మనిరమన్ స్థానంలో షాబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్ స్థానంలో దిగ్వేష్ రాఠీ జట్టులోకి వచ్చారు.ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్ జె యింట్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.తుది జట్లు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్‌వుడ్.లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt— IndianPremierLeague (@IPL) May 7, 2026 -
దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా?
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన చర్యతో పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణం చేస్తున్న విమానంలో చాహల్..వేప్( ఈ-సిగరేట్) తాగిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది. వీడియోలో చాహల్ వేప్ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సహచర క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్లాగ్ గా దర్శనమిచ్చింది. అయితే అసలు వ్లాగ్‌లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించినట్లు ఇన్‌స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. అసలు వీడియోలో చాహల్ ఒక్కడే కాకుండా అతడి పక్కన ఉన్న శశాంక్ సింగ్, ఇతర పంజాబ్ ప్లేయర్లు కూడా ఈ-సిగరేట్ తాగే అవకాశం లేకపోలేదని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్రయాణంలో సిగరేట్ (ఈ-సిగరెట్ అయినా) తాగడం నిషేధం. సిగరేట్ పొగ వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారముంది. చాహల్ ప్రవర్తన విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లోనే పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో వేప్ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెలకొంది. అయితే బీసీసీఐ మాత్రం పరాగ్‌ను మందలిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో సరిపెట్టింది. కానీ ఈసారి చాహల్ వేప్ ఉపయోగించినట్లు తేలితే మాత్రం అతడితో పాటు పంజాబ్ జట్టు మొత్తానికి శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాహల్‌తో పాటు పంజాబ్ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.చాహల్ చర్య నిజమని తేలితే ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వీడియో నకిలీదా లేక నిజమైనదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిన పంజాబ్ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026చదవండి: కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్! -
కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్!
ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ను ప్రైవేటు లీగ్‌లు ఆడకుండా జట్టుతోనే ఎక్కువగా అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించనుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఆఫర్‌కు కమిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడడం మానేసి గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కమిన్స్‌కు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్‌ల (ముఖ్యంగా బిగ్‌బాష్, ఐపీఎల్, ఎంఎల్సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఇతర లీగ్‌ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్‌లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్‌కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌పై విజయంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడు’ -
ప్రతీకార విజయం.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్‌కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.ఇషాన్, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్‌కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్, నితీశ్‌రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్‌లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్ ప్లేస్కుఇది ఎస్ఆర్హెచ్కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జంట ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఈ సీజన్లో అభిషేక్, ట్రావిస్ హెడ్ జంట 627 పరుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 పరుగులు జోడించడం ద్వారా 600 ప్లస్ మార్కును దాటింది. తద్వారా ఒక సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన జోడీగా అభిషేక్-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ (457 పరుగులు), గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్-సాయి సుదర్శన్ జంట (402 పరుగులు) సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
రికార్డులు బద్దలు కొట్టిన క్లాసెన్
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థశతకం కాగా.. అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 19 అర్థశతకాలతో శిఖర్ దావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ 42 అర్థశతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి దాకా 5 హాఫ్ సెంచరీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ప్రబ్‌సిమ్రన్, అయ్యర్లు నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూనకం! -
పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూనకం!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంతగడ్డపై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాలని భావిస్తున్న ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మరోసారి చెలరేగాడు. పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిలవనప్పటికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దడదడలాడించాడు. 👉 ఈ నేపథ్యంలో పంజాబ్‌పై గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ పరుగుల వరద పారించాడు. అభిషేక్ వరుసగా 66, 141, 74, 35 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్లస్ స్కోరు సాధించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్ఆర్హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్లో 220 ప్లస్ స్కోరు చేయడం ఎస్ఆర్హెచ్కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడు’ -
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్‌స్టార్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్‌లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’ -
IPL 2026: పంజాబ్‌పై ఎస్ఆర్హెచ్ గెలుపు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్‌కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సూర్యాంశ్ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులుచేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.శ్రేయస్ (5) ఔట్.. మూడో వికెట్ డౌన్భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 5 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.పంజాబ్‌కు షాక్.. ఓపెనర్లిద్దరు ఔట్236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మలింగకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్రబ్‌సిమ్రన్ (3) ఔట్ అయ్యాడు.పంజాబ్ టార్గెట్ 236 పరుగులుఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు.అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.క్లాసెన్ అర్థసెంచరీ.. ఎస్ఆర్హెచ్ 212-3పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. నితీశ్‌కుమార్ (26) పరుగులతో ఆడుతున్నాడు.అర్ధ శతకం బాది ఇషాన్ ఔట్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107-2పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్పంజాబ్తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.దంచికొడుతున్న హెడ్6 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (7) పరుగులతో ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ (35) ఔట్పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ పంజాబ్దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్హెచ్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.తుదిజట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ -
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.సీఎస్కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్ రుతురాజ్, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!
క్రికెట్లో ఒకప్పుడు బ్యాటర్లకు భయం పుట్టించిన యార్కర్లు ఇప్పుడు కనిపించడం లేదు. చేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే నమ్ముకునేవారు. అదే సంప్రదాయ యార్కర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మలింగ, బుమ్రా లాంటి యార్కర్ల స్పెషలిస్టులు విసిరే యార్కర్లకు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరేవి. ఐపీఎల్‌లోనూ యార్కర్లకు స్వర్ణయుగం నడిచింది. ఆఖరి బంతి దాకా విజయం దోబుచులాడే టీ20 క్రికెట్లో ఇటీవలే కాలంలో మ్యాచ్‌లన్నీ వన్‌సైడ్‌గా మారిపోవడం చూస్తున్నాం. ఐపీఎల్‌లోనూ ఈ తరహా మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజన్లోనూ అన్ని జట్లు 200 పరుగుల టార్గెట్‌ను అవలీలగా ఛేదించేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో యార్కర్ బంతులు కనిపించకపోవడంతో అటు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒకటే చర్చ జరుగుతుంది. అదేంటంటే ఒకప్పుడు భయం పుట్టించిన యార్కర్లకు క్రమంగా కనుమరుగవుతున్నాయా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న నటరాజన్ వీరంతా యార్కర్ల స్పెషలిస్టులే. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా వీరు తమ యార్కర్లతో ప్రభావం చూపలేకపోయారు.బ్యాటర్లు ఫినిషింగ్‌ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్‌కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధనపై కూడా సీనియర్ క్రికెటర్లు, బౌలర్లు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒకప్పుడు యార్కర్లు బ్యాటర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్కర్లు కనిపించకుండా పోతున్నాయి.చదవండి: బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్! -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్ సాధించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఢిల్లీ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో టాప్-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం.నిస్సాంక (19), రాహుల్ (12), నితీశ్‌రానా (15), కరుణ్ నాయర్ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు. ఇలా ఒక మ్యాచ్‌లో టాప్ నలుగురు బ్యాటర్లు డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి కూడా ఈ ఫీట్‌ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున టాప్ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్ (15), వార్నర్ (13), నమన్ ఓజా (13), యోగేశ్ నగర్ (18) 20 పరుగుల మార్క్ దాటకుండానే ఔటయ్యారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్ -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విజయం దిశగా సీఎస్కేఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే విజయం దిశగా కొనసాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ (84), కార్తిక్ శర్మ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు. శాంసన్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే 96/2ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్ (22), కార్తిక్ శర్మ (5) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది.రుతురాజ్ ఔట్..ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.సీఎస్కే టార్గెట్ 156 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (30), సమీర్ రిజ్వీ (16) పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీసీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్ప్నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్‌నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గుర్జప్నీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్ నెగ్గిన ఢిల్లీ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాంచైజీగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే కొనుగోలు మురిపెం తీరకుండానే రాజస్తాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్‌తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్‌తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.చదవండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్! -
బీసీసీఐపై కేఎల్ రాహుల్ ఆగ్రహం!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు చెందిన సూపర్‌స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్‌బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్‌బాల్ క్రికెట్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్‌లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్‌కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
మాట తప్పిన రిషబ్ పంత్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చి వరుసగా తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి లక్నో సూపర్‌జెయింట్స్ సంచలనం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం లక్నో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన లక్నో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో లక్నో కెప్టెన్ పంత్ ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పేరును ప్రస్తావించాడు. తాను పేలవ ఫామ్‌ను అధిగమించి ముంబైతో మ్యాచ్‌లో పరుగులు సాధిస్తానని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. నిజానికి ఈ సీజన్‌ను మేము మంచి ఈజ్‌తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 204 పరుగులు సాధించాడు.అయితే ముంబైతో మ్యాచ్‌లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.చదవండి: లక్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కారణమిదే! -
లక్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కారణమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ దూరమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వచ్చిన సూర్యకుమార్.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్‌లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమర్శలు వచ్చాయి. జట్టు ఆటగాళ్ల పట్ల దురుసు ప్రవర్తనతో చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ఒక దశలో పాండ్యాను తప్పించి రోహిత్‌కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL. Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell. Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm— IndianPremierLeague (@IPL) May 4, 2026చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్! -
పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్‌మనీనా!
పాకిస్తాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ విజేతగా బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జాల్మి నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించిన పెషావర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజన్లో బాబర్ టాప్ స్కోరర్‌గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్‌మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు తెలిపారు. ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్ఎల్ 2026 సీజన్లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం. అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్‌గా ఒక పీఎస్ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by 🚶🏻 (@talks.cric__) చదవండి: షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి! -
షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్లో 9 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్‌లు అదరగొడుతుంటే, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్లోనూ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్‌రేట్‌తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్‌గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్లీ ఈ ఫేర్వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్‌కు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.𝙀𝙣𝙙 𝙤𝙛 𝙖𝙣 𝙚𝙧𝙖, 𝙀𝙫𝙖𝙣 𝙎𝙥𝙚𝙚𝙘𝙝𝙡𝙮! Your legacy at RCB will always be remembered. 🙌❤️Evan Speechly was our Head Physio for 18 long years, from 2008 to 2025 - one of the OGs of RCB. He flew down to Bengaluru for a special farewell, and we were all teary eyed!… pic.twitter.com/fjVJR80V1j— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026 చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’ -
‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట దాదాపు ముగిసినట్లే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరే అవకాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. శనివారం సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత ముంబై ఇండియన్స్ విషయంలో ఒక అంశం చర్చకు దారి తీసింది. టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కీలక ఆటగాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఇక మిగిలిన ఆటగాళ్లలో కెప్టెన్ పాండ్యా సంగతి పక్కనబెడితే సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రాలు దారుణంగా విఫలమవ్వడం ముంబై కొంప ముంచుతుంది. ఈ సీజన్లో బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 9 మ్యాచ్‌లాడి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్యకుమార్ పేలవ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లు కలిపి కేవలం 20 సగటుతో పరుగులు సాధించాడు. తిలక్ వర్మ సెంచరీ సాధించినప్పటికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ఈ ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలం కావడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే స్పందించాడు. సీఎస్కేతో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్దనే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వల్లే ముంబై ఇండియన్స్ దారుణ ఆటతీరు ప్రదర్శిస్తోందని చెప్పలేం. ఎందుకంటే సూర్య, తిలక్, బుమ్రాలు ఇప్పటికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్కసారి సూర్యకుమార్ టచ్‌లోకి వస్తే ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతడు కుదురుకోవడానికి రెండు, మూడు ఇ న్నింగ్స్‌లు చాలు. కానీ ఈ సీజన్లో మాకు ఆ సమయం దాటిపోయింది. ఇక తిలక్ వర్మ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. తనదైన రోజున ధాటిగా ఆడగల సత్తా ఉన్న తిలక్ వర్మ అనుభవం పెరిగిన కొద్దీ ఆటలో మరింత రాటుదేలుతాడన్న నమ్మకం నాకుంది. అయితే తిలక్ వర్మ టీ20 క్రికెట్లో అన్ని రకాల పాత్రలను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించకపోవడం వల్ల ముంబై ఇండియన్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. కానీ బుమ్రా ఒక్కడే కాదు ముంబై బౌలర్లంతా కలిసికట్టుగా ఆడడంలో విఫలమయ్యారు. మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడంతో పాటు వికెట్లు తీసే అవకాశముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: అదే జరిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్! -
అదే జరిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం సీఎస్కేతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియన్ ఇప్పుడు ప్లేఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమే. అయితే కొంత అదృష్టం కలిసి రావడంతో మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్రమంలో ముంబై ఇండియన్స్ ముందున్న దారి చాలా కఠినమని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గమనార్హం. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ముంబై అదృష్టం కలిసి వచ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచి నప్పటికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే సమయంలో ముంబై తాము ఆడబోయే ఐదింటిలో ఒక్కటి ఓడినా సీజన్లో వారి ప్రయాణం ముగిసినట్లే. ముంబై తమ తర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాలలో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న కోల్‌కతా నైట్ రైడర్స్, మే 24న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ ఐదింటిలో గెలవడంతో పాటు రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.చదవండి: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైరల్! -
‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది. శనివారం సీఎస్కేతో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్‌గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు. జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్‌కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ముంబైని దెబ్బకొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు. అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్‌కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టాప్-4లో ఉన్న పంజాబ్‌కు ఆరు మ్యాచ్‌లు, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఐదేసీ మ్యాచ్‌లు, రాజస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్‌లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’ -
‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ కూడా అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సీజన్లో నాలుగో విజయం అందుకున్న సీఎస్కే 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్‌గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రుతురాజ్ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్ కంబోజ్ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.Trusting the process and letting the bat do the talking 💛🎥 Skipper Ruturaj Gaikwad talks about finding his rhythm and the match-winning knock 🗣️#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL | @Ruutu1331 pic.twitter.com/VZ2T0hqcYZ— IndianPremierLeague (@IPL) May 2, 2026చదవండి: ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు! -
ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. శనివారం చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓడినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 50వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ముంబై ఇండియన్స్‌కు 114 పరుగులు అవసరం కాగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్. ఇందులో 286 ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా.. మరో 22 మ్యాచ్‌లు ఛాంపియన్స్ లీగ్వి ఉన్నాయి. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ మ్యాచ్ ఫలితం మాత్రం ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం మిగిల్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించాడు. రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తిక్ శర్మ (54 నాటౌట్) సీఎస్కేను గెలిపించారు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఏడో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇంపాక్ట్ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం! -
ఇంపాక్ట్ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద 'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 సహా ఫైనల్‌కు సంబంధించి ముఖ్య విషయం వెల్లడించారు. ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా తెలిపారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇక 2023లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైకియా స్పందించారు. ఈ నిబంధన వల్ల అభిమానులు మ్యాచ్‌లను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని జట్లు 260 పరుగులు చేస్తే, మరికొన్ని తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంపాక్ట్ రూల్‌పై ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని, జట్లు దీనితో సౌకర్యవంతంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్లో లీగ్ మ్యాచ్‌లు మే 24తో ముగియనున్నాయి. ఇప్పటికైతే పాయింట్ల పరంగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.చదవండి: తిలక్ వర్మకు చేదు అనుభవం! -
సీఎస్కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్కే శనివారం రెండో అంచె పోటీలోనూ మరోసారి ముంబైని ఓడించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026 -
తిలక్ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్ గోవిందా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన బంతి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్టన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్రమంలో తిలక్ వర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిలక్ వర్మ చేతికి బలంగా తాకింది. నొప్పితో బాధపడిన తిలక్‌ను ఫిజియో వచ్చి పరిశీలించాడు. అదే సమయంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలు కావడం గమనార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్ వాచ్ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించగా.. రికెల్టన్ 37 పరుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్‌ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెవన్ జాకబ్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. -
సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భువనేశ్వర్ కుమార్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్ పదును చూపిస్తూ ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్‌ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్ ఓపెనర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్‌ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్‌లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.ఈ ఐపీఎల్ సీజన్లో భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాది (2025) ఆర్సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్‌లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్‌కు నిదర్శనం. ఆర్సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.ఇటీవలే అతను టీ20 క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా, రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్ షమీ సోదరుడు! -
IPL 2026: ముంబైపై సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.గైక్వాడ్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే160 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సీఎస్కే 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ గజన్ఫర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (11) ఔట్.. తొలి వికెట్ డౌన్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శాంసన్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 160 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఆరో వికెట్ డౌన్..5 పరుగులు చేసిన రాబిన్ మింజ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నమన్ ధిర్ (48), పాండ్యా (9) పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్ ధిర్ 25, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్టన్ 15, నమన్ ధిర్ 13 పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామక్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రఘుశర్మ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనుండగా, అశ్వనీ స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్, గుర్జప్నీత్ సింగ్ స్థానంలో రామక్రిష్ణ ఘోష్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్కే 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్ -
చిక్కుల్లో పడిన క్రికెటర్ షమీ సోదరుడు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్ ద్వారా మహమ్మద్ కైఫ్‌ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.చదవండి: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన -
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో సమావేశమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించారు.హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్‌గా జట్టును నడిపించనుండడం విశేషం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, రేణుకాసింగ్‌లు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. తెలుగు క్రికెటర్లు శ్రీచరణి, అరుంధతి రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గాయం కారణంగా దూరమైన అమన్‌జ్యోత్ కౌర్ స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బ్యాటర్ హర్లీన్ డియోల్, స్పిన్నర్ స్నేహ్‌రాణాలకు జట్టులో చోటు దక్కలేదు.15 మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.ఆ తర్వాత 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్-బిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.ఇక గతేడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు..జూన్ 14: భారత్ వర్సెస్ పాకిస్తాన్, వేదిక: ఎడ్జ్బాస్టన్జూన్ 17: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్, వేదిక: హెడ్డింగేజూన్ 21: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్‌జూన్ 25: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్‌జూన్ 28: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) చదవండి: ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా! -
ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లో గురువారం హైదరాబాద్ కింగ్స్‌మెన్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, ఆసీస్ మహిళా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కామేంటేటర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లీసా స్తాలేకర్ మాటల సందర్భంగా రమీజ్ రాజాను హగ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇది సరదాగా చేసినప్పటికీ బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు రమీజ్ రాజా, లీసా స్తాలేకర్ హగ్ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్యమా అని లీసా హగ్ ఇవ్వగానే రమీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టినట్లుగా వీడియో, ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే ఇవన్నీ నకిలీ ఫొటోలని కాసేపటికే తేలిపోయింది. ఎందుకంటే వీరిద్దరు హగ్ చేసుకున్న అనంతరం రమీజ్ రాజా ముద్దు పెట్టినట్లుగా వీడియోలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియర్‌గా అర్థమైంది. అయితే రమీజ్ రాజాకు హగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారడంతో లీసా స్తాలేకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చర్చకు దారి తీయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇందులో తప్పేముంది. ఏదో సరదాగా హగ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (69 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నవాజ్ 18 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మాజ్ సదాఖత్ (64 నాటౌట్), ఉస్మాన్ ఖాన్ (64) జట్టును గెలిపించారు.ఇక లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.Lisa Sthalekar's Instagram story. pic.twitter.com/N7C4JVOBtq— Sheri. (@CallMeSheri1_) May 2, 2026WTFFFF pic.twitter.com/293RiGywFW— Invader🇵🇸- (@sshayaannn) April 29, 2026 -
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్‌తో రాజస్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్‌కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
రెండో టీ20 వర్షార్పణం
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.కాగా, 3 మ్యాచ్‌ల వన్డే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. -
లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!
శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బోర్డు సంక్షోభంలో కూరుకుపోయింది. లంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు.ఇక శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
పాక్ ‘ఏఐ’ చిప్.. వైభవ్ అదిరిపోయే రిప్లై!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులోనే అద్భత బ్యాటింగ్‌తో అదరగొడుతున్న వైభవ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై అనుమానముందని, ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చని, వెంటనే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అనలిస్ట్‌కు వైభవ్ తన స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్‌కు ఆ ఏఐ చిప్‌ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్‌కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్‌ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.అసలేం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్‌కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్‌ను అందుకునేందుకు వైభవ్‌కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 2024 సీజన్లో అభిషేక్ శర్మ (195 బంతులు), 2025 సీజన్లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్లో మ్యాక్స్‌వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.𝘉𝘢𝘵 𝘱𝘦 𝘈𝘐 𝘤𝘩𝘪𝘱 𝘩𝘢𝘪 𝘬𝘺𝘢 𝘵𝘶𝘮𝘩𝘢𝘳𝘦?Vaibhav answers 😂💗 pic.twitter.com/uZcqABbaGS— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2026చదవండి: ‘వైభవ్‌పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
రోహిత్ ఆడడంపై ముంబై క్లారిటీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు డగౌట్‌కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్ఆ ర్హెచ్తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్‌తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్‌మ్యాన్‌కు ట్రీట్మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
‘వైభవ్‌తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభమివ్వగా.. ఆఖర్లో శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజస్తాన్‌ను గెలిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్‌ను వైభవ్ సూర్యవంశీకి అందించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్‌లో ఉన్న ప్రతిభ అసాధారణం.’ అని తెలిపాడు. కాగా జైస్వాల్ వయసు 24 ఏండ్లు కాగా.. వైభవ్ సూర్యవంశీకి 15 ఏండ్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మ్యాచ్ గెలవడంపై కూడా జైస్వాల్ స్పందించాడు. ‘ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం. అందరూ ప్రతి మ్యాచ్‌లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.ఇక సీజన్లో జైస్వాల్ 9 మ్యాచ్‌ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్‌ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.The duo that is fun to watch on the pitch and even off it 😄 💪🎥 Hear from Yashasvi Jaiswal on how it is batting with Vaibhav Sooryavanshi 🩷🤝#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/HICh8l5VIc— IndianPremierLeague (@IPL) April 28, 2026చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే? -
చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 సీజన్ రెండో ఫేజ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవగా.. వరుస పరాజయాలతో లక్నో సూపర్‌జెయింట్స్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్, ఆర్సీబీ, రాజస్తాన్, ఎస్ఆర్హెచ్ విజయాలతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.మరి రెండో సగం కూడా పూర్తయ్యేసరికి ఈ జట్లే టాప్-4లో ఉంటాయా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇదిలా ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ 19వ సీజన్‌కు సంబంధించి బెస్ట్ స్టేడియాల జాబితా (ఒకటి నుంచి పది వరకు)ను ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఆర్సీబీకి ఆడుతున్న హాజిల్‌వుడ్ తన హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి నంబర్‌వన్ స్థానాన్ని ఇచ్చాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మాత్రం హాజిల్‌వుడ్ 10వ స్థానం కేటాయించడం అతడిని చిక్కుల్లో పడేసినట్లయింది. తాను చెన్నై గ్రౌండ్లో ఆడటాన్ని ఆస్వాదించలేకపోయానని, అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరి స్థానం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. హాజిల్‌వుడ్ ఇలా తమ హోంగ్రౌండ్‌కు ఆఖరి స్థానం ఇవ్వడంపై సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని ఇలా చెన్నై స్టేడియాన్ని అవమానించేలా ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మన సన్‌రైజర్స్ హైదరాబాద్ హొంగ్రౌండ్ అయిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి హాజిల్‌వుడ్ ఏడో ర్యాంక్ కేటాయించాడు.హాజిల్‌వుడ్ టాప్-10 స్టేడియాలు..1. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు2. నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్3. వాంఖడే స్టేడియం, ముంబై4. హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల5. పీసీఏ స్టేడియం, మొహలీ6. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా7. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్8. ఎక్నా స్టేడియం, లక్నో9. అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ10. ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైఐపీఎల్ 19వ సీజన్లో జోష్ హాజిల్‌వుడ్ ఆర్సీబీకి కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులిచ్చిన 4 వికెట్లు తీసిన హాజిల్‌వుడ్ ఐపీఎల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో హాజిల్‌వుడ్ 44 మ్యాచ్‌లాడి 65 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు నాలుగు వికెట్ల హాల్ అందుకున్నాడు. సీజన్లో ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్‌ను గురువారం గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.Hazlewood rankings Indian Stadiums: Chinnaswamy is No. 1 ❤️Ahmedabad has to be right up there 🙏Meanwhile, Chennai too hot for me so no. 10 😂 pic.twitter.com/J0VaPtbY5B— Aditya Saha (@Adityakrsaha) April 29, 2026చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు! -
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్.. షాక్‌లో చాహల్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, యజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి సరదాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంతో చాహల్ షాక్ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్‌గా మారిన జితేశ్ శర్మ చర్య! -
వైరల్‌గా మారిన జితేశ్ శర్మ చర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్లో 8 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మడం ఆపండి!’ -
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్‌కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్‌తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్‌ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్‌కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్‌కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్‌ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్‌గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్‌లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్‌గా, ఫినిషర్‌గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్‌లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్‌ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు -
చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పిచ్ ఆది నుంచి పేసర్లకు అనుకూలంగా మారడంతో ఆర్సీబీ బౌలర్లు హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లు చెలరేగిపోయారు. చెరో మూడు ఓవర్లు వేసిన ఈ ఇద్దరు చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవ్వడంతో 10 పరుగుల్లోపే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆటలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెటర్‌గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. 11 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు మిల్లర్ ఈ ఘనత సాధించాడు. మిల్లర్ టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేయడానికి 565 మ్యాచ్‌లు (513 ఇన్నింగ్స్‌లు) తీసుకున్నాడు. మిల్లర్ కంటే ముందు క్వింటన్ డికాక్ (12,454 పరుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 పరుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాటర్‌గా మిల్లర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్లర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచరీలు బాదాడు. ఇక 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మిల్లర్ ఇప్పటివరకు 149 మ్యాచ్‌లాడి 3,100 పరుగులు చేశాడు. సెంచరీ సహా 14 అర్థశతకాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచరీలను మిల్లర్ లక్ష్యఛేదనలో సాధించడం మరో విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లు తీశారు.𝐀 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐀 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫. 𝐀 𝐓𝟐𝟎 𝐠𝐫𝐞𝐚𝐭 💪🔥1️⃣2️⃣0️⃣0️⃣0️⃣ runs of pure impact 💣🏏David Miller continues to deliver in crunch moments, cementing his legacy as one of the finest finishers in T20 cricket 👏👑#IPL2026 I #DavidMiller pic.twitter.com/pgKR8OEuGn— CricTracker (@Cricketracker) April 27, 2026చదవండి: అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్! -
అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచరీతో పాటు మూడు అర్థశతకాలు సాధించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకునే సమయంలో అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.Abhishek Sharma getting pulled by a girl at team hotel. Imagine if roles are reversed? pic.twitter.com/GCqMI05G4f— Deepu (@deepu_drops) April 26, 2026 చదవండి: ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే? -
ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
క్రికెట్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్. ఈ నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మరి అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంతర్జాతీయ క్రికెట్లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం.అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే?క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ చట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ అనే నిబంధన ఉంది. 37.2 నిబంధన ప్రకారం ఓ బ్యాటర్ ఉద్దేశపూర్వంగా తన వికెట్ కాపాడుకోవడానికి బంతిని చేతితో అడ్డుకున్నట్లయితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ గా కింద పరిగణిస్తూ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలా 11 మంది ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్ రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్లో మాత్రం ఇద్దరే ఇలా పెవిలియన్‌కు చేరుకున్నారు. వీరిలో రహీం రెండవ ఆటగాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్‌కు చెందిన లియోనార్డ్ హటన్ మొదటి ప్లేయర్. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఆటగాడు అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొహిందర్ అమర్నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.అంతర్జాతీయ క్రికెట్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆటగాళ్లు..రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.ఐపీఎల్లో నాలుగుసార్లు..ఇక ఐపీఎల్ విషయానికొస్తే ఇప్పటివరకు జరిగిన 19 సీజన్లలో నలుగురు ఆటగాళ్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా ఉండగా.. తాజాగా అంగ్క్రిష్ రఘువంశీ చేరాడు.యూసఫ్ పఠాన్ఐపీఎల్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 సీజన్లో రైజింగ్ పుణే వారియర్స్‌తో కేకేఆర్ తలపడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో 72 పరుగులతో ఆడుతున్న యూసఫ్ పఠాన్ బౌలర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు విసిరిన బంతికి అడ్డువచ్చాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డువచ్చినట్లు పుణే ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు.అమిత్ మిశ్రా2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌలర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మధ్యలో పరిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీపర్ నాన్‌స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్లడంతో అంపైర్ ఔట్ ఇవ్వక తప్పలేదు.రవీంద్ర జడేజా2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పరుగు వద్దని వారించడంతో జడేజా వెనక్కి పరిగెత్తే క్రమంలో తన దిశను మార్చుకున్నాడు. అప్పటికే బంతిని అందుకున్న కీపర్ శాంసన్ బంతిని విసరడం, అదే సమయంలో జడేజా అడ్డు రావడంతో అంపైర్ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.అంగ్క్రిష్ రఘువంశీతాజాగా 2026 సీజన్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ ఇదే తరహాలో ఔటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్‌గా ప్రకటించారు.𝗜.𝗖.𝗬.𝗠.𝗜A rare dismissal as Angkrish Raghuvanshi was given out 𝗼𝗯𝘀𝘁𝗿𝘂𝗰𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝗶𝗲𝗹𝗱 😮WATCH how it all unfolded ▶️ https://t.co/uNqNFhXhoL#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/tvKuRe4x5S— IndianPremierLeague (@IPL) April 26, 2026చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’ -
‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’
ఐపీఎల్ 2026 సీజన్లో కృనాల్ పాండ్యా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఒక క్రికెటర్‌గా తాను ఏంతో పరిణితి చెందానని, ఒకప్పటి పాండ్యాను కాదని.. చాలా మారిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో కృనాల్ పాండ్యా క్రికెటర్‌గా తన ప్రయాణంతో పాటు ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాండ్యా మాట్లాడుతూ.. ‘కాలక్రమేణా నేను మంచి వ్యక్తిగా మారాను. ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరుకు ఈ ఘనత దక్కుతుంది. ఒక మనిషిగా మాత్రం మారలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడటానికి ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. నా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అమితంగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రులు ప్రతీ విషయంలో నాకు అండగా నిలిచారు. మీరు విజయాన్ని రుచి చూసినప్పుడు, రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి మీరు పిచ్చివాళ్లు అయిపోతారు లేదా అది మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎదిగే కొద్దీ, మరింత వినయవంతుడిగా మారాను, అందుకే నాకు కుటుంబం చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కేకేఆర్‌పై తొలి మ్యాచ్ ఆడిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆర్సీబీ తరఫున నా తొలి మ్యాచ్ ఆడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. షారుఖ్ సర్ వేదికపై ఉండటం, ప్రేక్షకులు నినాదాలు చేయడం నాకు గుర్తుంది. పవర్‌ప్లేలో నా మొదటి ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాను. 10 ఓవర్లలో కేకేఆర్ 110 పరుగులు చేసింది, వాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. తర్వాతి ఓవర్లో నేను అజింక్య రహానేను డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అవుట్ చేశాను. అప్పుడు వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను ఒక బౌన్సర్ వేయాలనుకున్నా. అయితే వెంటనే వెంకటేశ్ అయ్యర్ తన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.’ అని పేర్కొన్నాడు. వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలవడాన్ని గుర్తుచేసుకున్న కృనాల్ పాండ్యా 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడం తన కెరీర్లో మరిచిపోలేని క్షణమని తెలిపాడు. కోహ్లితో కలిసి ట్రోఫీని అందుకోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 149 మ్యాచ్‌లాడిన కృనాల్ 1792 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 101 వికెట్లు తీశాడు.చదవండి: థామస్ కప్‌లో సంచలనం.. క్వార్టర్స్‌కు భారత్ -
వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడేందుకు ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026చదవండి: గిల్‌పై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు! -
‘వైభవ్‌పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచనల బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతున్న వైభవ్ సూర్యవంశీ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో శతకంతో రెచ్చిపోయాడు. ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. వైభవ్ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్‌ను ఏమైనా ఇన్స్టాల్ చేశారేమోనని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. టీనేజీ వయసులో ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్‌కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం. ఇప్పుడు వైభవ్‌కు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశముంది.నిజానికి అతడి బ్యాటింగ్‌లో పెద్దగా టెక్నిక్స్ కనిపించవు. కానీ అతడి మణికట్టు బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కుల చూపిస్తూ డేంజరస్ బ్యాటర్‌గా తయారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. -
తొలిసారి 5 వికెట్లు.. భారత్‌ను గెలిపించిన దీప్తి శర్మ
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వుమెన్ 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశర్మ (36 నాటౌట్), రిచా ఘోష్ (34 నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమయింది. ఓపెనర్ సునె లుస్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, తంజిమ్ బ్రిట్జ్ 30 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా, క్రాంతి, చరణి, కశ్వీ గౌతమ్, షెఫాలీ తలా ఒక వికెట్ తీశారు. సిరీస్‌లో భాగంగా చివరి టీ20 సోమవారం జరగనుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.4⃣ Overs1⃣9⃣ Runs5⃣ fantastic wickets 👏Deepti Sharma picks up her 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗙𝗜𝗩𝗘-𝗪𝗜𝗖𝗞𝗘𝗧 𝗛𝗔𝗨𝗟 in T20Is 🫡Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#TeamIndia | #SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/Kj1CzmR8M7— BCCI Women (@BCCIWomen) April 25, 2026𝗦𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘁𝗮𝗹𝗹 𝗮𝗻𝗱 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 ✨Deepti Sharma is adjudged the Player of the Match for her fabulous all-round performance as #TeamIndia clinch victory 🔝👌Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/sYwLVZ2cUm— BCCI Women (@BCCIWomen) April 25, 2026 -
ఎస్ఆర్హెచ్ ఘన విజయం.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురేల్ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్ఆర్హెచ్ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్‌పై ఎస్ఆర్హెచ్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. గతంలో సీఎస్కే (2010 నుంచి 2013 మధ్య) రాజస్తాన్ రాయల్స్‌పై ఆరు వరుస విజయాలు సాధించింది. 2019 నుంచి 2022 మధ్య ఆర్సీబీ.. రాజస్తాన్‌పై 5 వరుస విజయాలు అందుకుంది. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వరుస విజయాలు నమోదు చేసింది.ఐపీఎల్లో 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్లస్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్లలో ఎస్ఆర్హెచ్ చోటు దక్కించుకుంది. రాజస్తాన్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 పరుగుల టార్గెట్), ఎస్ఆర్హెచ్ (పంజాబ్‌పై 246 పరుగుల టార్గెట్) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (లక్నోపై 228 పరుగుల టార్గెట్) ఉంది.జైపూర్ వేదికపై రాజస్తాన్‌పై 228 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. 2023లో ఇదే రాజస్తాన్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును సవరించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ సమిత్ పటేల్ దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌లో నిర్వహించిన అనుమతి లేని లీగ్‌లో పాల్గొనడం కారణంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై 12 నెలల నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 41 ఏళ్ల సమిత్ 2008 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ తరఫున 60 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతనికి అసలైన గుర్తింపు కౌంటీ క్రికెట్లోనే దక్కింది. ముఖ్యంగా నాటింగ్హమ్షైర్ కౌంటీ క్లబ్‌కు అతను రెండు దశాబ్దాలకు పైగా సేవలందించాడు.తన కౌంటీ కెరీర్లో 25 వేలకుపైగా పరుగులు, 800కుపైగా వికెట్లు సాధించి అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ సత్తా చాటి తన జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.ఇటీవల గోవాలో జరిగిన వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో పాల్గొనడం సమిత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసీబీ నిబంధనల ప్రకారం, అనుమతి లేని టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్లు ఏడాది పాటు ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ఆడటానికి అనర్హులు అవుతారు.ఈ నిషేధంతో తన దేశీయ కెరీర్‌కు ముగింపు పలకక తప్పలేదని సమిత్ వెల్లడించాడు. ఈ పరిణామాలు ముందే తెలిసి ఉంటే ఆ లీగ్‌లో ఆడేవాడిని కాదు. ఇంకా ఒక సీజన్ ఆడే అవకాశం ఉండేదని సమిత్ బాధపడ్డాడు. ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సమిత్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.రిటైర్మెంట్ ప్రకటన అనంతరం నాటింగ్హమ్షైర్ కౌంటీ సమిత్ సేవలను ఘనంగా కొనియాడింది. క్లబ్ డైరెక్టర్ మిక్ న్యూవెల్ మాట్లాడుతూ.. సమిత్ సాధించిన విజయాలు నాటింగ్హమ్షైర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. అతని నిబద్ధత, పోరాట పటిమ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయని ప్రశంసించారు. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్‌వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్‌లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్‌వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్‌ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్ (14) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్‌కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్‌దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్లో తిలక్ వర్మ (101 నాటౌట్) సెంచరీతో విధ్వంసం చెలరేగగా, నమన్ ధిర్ (45) బాధ్యతాయుతంగా ఆడారు. గుజరాత్‌బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజన్లో రెండో విజయం సాధించిన ముంబై 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పట్టిలకలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
ప్రియాన్ష్, కూపర్ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
‘మాటలు రావడం లేదు.. ఆ ఇద్దరి వల్లే గెలిచాం’
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే సీజన్లో కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. రాజస్తాన్‌పై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. రింకూ సింగ్, అనుకుల్ రాయ్‌ల వల్లే కేకేఆర్ గెలిచిందంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మాట్లాడుతూ.. 'నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఫీలింగ్ ఇది. ఈ మ్యాచ్‌లో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. రింకు సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. రింకు, అనుకుల్ ఇద్దరూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరి బ్యాటింగ్ సూపర్బ్. నాకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం. పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. కార్తీక్ త్యాగి అద్భుతంగా ఆడుతున్నాడు. తన సామర్థ్యం గురించి అతనికి స్పష్టత ఉంది. ఇలాంటి యువ ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. అతను ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. అది చూడటం చాలా ఆనందంగా ఉంది. త్యాగి బౌలింగ్ చేస్తున్న వేగం అద్భుతం. ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అదే క్రికెట్ అవగాహనను పెంచుతుంది. కొన్నిసార్లు స్ట్రైక్‌రేట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నాకు అనిపిస్తుంది. కానీ మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లడం ముఖ్యం. ఈరోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఈ విజయం మాకు ఒక పెద్ద ఉపశమనం లాంటిది. జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. జట్టు సభ్యుల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ విజయం వాళ్లకే అంకితం. జట్టులో చాలా సానుకూల వాతావరణం ఉంది' అని రహానే చెప్పుకొచ్చాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: కేకేఆర్ రాత మార్చిన రింకూ సింగ్! -
కేకేఆర్ రాత మార్చిన రింకూ సింగ్!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ఐదు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక దశలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూస్తుందని అంతా భావించారు. కానీ జట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ తన సహచర బ్యాటర్ అనుకుల్ రాయ్‌తో కలిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాతను మార్చాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్‌ను రింకూ సింగ్ చక్కగా వినియోగించుకున్నాడు. రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బర్గర్ వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.తనకు లైఫ్ వస్తే ఎంత డేంజర్ అనేది రింకూ సింగ్ రాజస్తాన్ బౌలర్లకు రుచి చూపించాడు.ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రింకూ సింగ్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో తన విలువను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వచ్చేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 85 పరుగులతో ఉంది. విజయానికి ఆరు ఓవర్లలో 69 పరుగులు కావాలి. అనుకుల్ రాయ్ నుంచి మంచి సహకారం అందడంతో రింకూ సింగ్ స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝలిపించాడు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేసి కేకేఆర్‌కు సీజన్లో మొదటి విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడాడు. ‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్ ఇచ్చిన అనుకుల్ రాయల్ (16 బంతుల్లో 29 నాటౌట్) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు -
'క్యాచ్‌లు జారవిడవడం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం కేకేఆర్ చేతిలో రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. మ్యాచ్ ఓటమిపై పరాగ్ స్పందించాడు. క్యాచ్‌లు జారవిడవడం తమ కొంప ముంచిందని రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఈ పిచ్‌పై 170 పరుగులు చేస్తే విజయం సాధించొచ్చు అని భావించాం. కానీ 10 పరుగులు వెనుకబడ్డాం. మా బౌలర్లు కష్టపడ్డారు. కానీ ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులు చేశాం. క్యాచ్‌లు జారవిడవడం మా కొంపముంచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. కానీ మా జట్టులో ఇవాళ పేసర్లు ఎక్కువగా ఉండడం, బిష్ణోయ్ మాత్రమే రెగ్యులర్ స్పిన్నర్‌గా ఉండడం మాకు ప్రతికూలంగా మారింది. బ్రిజేశ్ శర్మ ఇవాళ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 14, 16వ ఓవర్లో అతను సూపర్‌గా బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ పూర్తైన తర్వాత క్రీజులో ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండడం, ఆ సమయంలో మా వద్ద స్పిన్ బౌలర్ లేకపోవడం కూడా ఓటమికి దారి వేసిందని చెప్పొచ్చు. ఇవాళ బ్యాటింగ్‌లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాం. రెండు ఓటములు వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గినట్లు కాదు. మళ్లీ ఫుంజుకుంటాం. ఇక ’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు. 18 ఓవర్లలో లక్నో 179/418 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో లక్నో 89/18 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యంఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.18 ఓవర్లలో పంజాబ్ 230/518 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కూపర్ (87) ఔట్పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మణిమరన్ సిర్థార్థ్కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.5 ఓవర్లలో పంజాబ్ 43/15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.ప్రబ్‌సిమ్రన్ డకౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముల్లన్పూర్ వేదికగా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.లక్నో సూపర్‌జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్ -
బుడ్డోడి వికెట్‌తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం ద్వారా ఈ మిస్టరీ స్పిన్నర్ తన ఖాతాలో 200వ వికెట్ జమ చేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వరుణ్ చక్రవర్తి 155 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (151 మ్యాచ్‌లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలుత పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్‌కు మారిన ఈ మిస్టరీ స్పిన్నర్ అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున వంద వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్‌లు ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో 89 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు.WICKET x 2️⃣!🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv— IndianPremierLeague (@IPL) April 19, 2026 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్! -
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది. -
వారెవ్వా మిల్లర్.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు నవ్వి!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ అది. కేవలం ఒక్క పరుగుతో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడానికి డేవిడ్ మిల్లర్ ప్రధాన కారణమయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో అనవసర ఒత్తిడికి పోయిన మిల్లర్ ఢిల్లీకి చేజేతులా ఓటమిని అందించాడు. ఈ చర్య మిల్లర్‌ను కంటతడి పెట్టేలా చేసింది. మరో అవకాశం వస్తే ఢిల్లీకి విజయాన్ని అందించి తన తప్పును సరిదిద్దుకుంటానని మిల్లర్ పేర్కొన్నాడు. అయితే తన తప్పు సరిదిద్దుకునే రోజు ఇంత తొందరగా వస్తుందని బహుశా మిల్లర్ కూడా ఊహించి ఉండడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ మరోసారి ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో మిల్లర్‌తో పాటు స్టబ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్టబ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 పరుగులు అవసరం. స్ట్రైక్‌లో ఉన్న మిల్లర్ ఈసారి ఢిల్లీని గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు. షెపర్డ్ వేసిన మూడో బంతిని మిల్లర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఇక మరుసటి బంతిని ఈసారి మిల్లర్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మరో సిక్సర్ సంధించాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగుకు మారిపోయింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా షెపర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6,6,4 BY DAVID MILLER WHEN DELHI NEEDED 13 FROM 4 🥶- DC got David Miller for Base Price. pic.twitter.com/9HVbfezmuI— Johns. (@CricCrazyJohns) April 18, 2026చదవండి: సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్! -
సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ వరుసగా రెండు విజయాలు సాధించి సీఎస్కే గాడిన పడింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే కెప్టెన్సీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ సీఎస్కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అది ఈ సీజన్ మధ్యలోనే జరిగే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సీజన్లో కాకపోయినా భవిష్యత్తులో మాత్రం శాంసన్ సీఎస్కేను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కేకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని, ఈ విషయంలో సీఎస్కేకు మొదటి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్పటికే సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనల్ చేర్చినట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్కే యాజమాన్యం ఈ సీజన్ మధ్యలోనే రుతురాజ్‌ను తప్పించి శాంసన్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్చపోనవసరం లేదని తెలిపాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రుతురాజ్ ఈ సీజన్లోనే కెప్టెన్సీ వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ధోని తర్వాత కెప్టెన్లు ఎందరు మారినా సీఎస్కే మరో టైటిల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యింది. 2022 సీజన్లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకోలేక జడేజా దానిని మధ్యలోనే వదిలేశాడు. దీంతో గత్యంతరం లేక మళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలా 2023 సీజన్లోనూ సీఎస్కేను నడిపించిన ధోని ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. కానీ ఆ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక 2025 సీజన్లో రుతురాజ్ సారథ్యంలోని సీఎస్కే దారుణ ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్! -
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను శివాంగ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్‌కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ రుతురాజ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ -
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపుర్ జద్రన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోవడంతో ప్రస్తుతం షాపుర్ జద్రన్ భారత్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని అతని కుటుంబసభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్‌మీడియాలో కూడా షాపుర్ జర్దన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జద్రన్ చాలా రోజుల ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవలే డిశ్చార్జి అయిన అతడు మరోసారి ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాక్‌కు చెందిన మరో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకొని బాధపడ్డాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది తన చిరకాల మిత్రుడు షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఎదుగుదలలో షాపుర్ జద్రన్ కీలక పాత్ర పోషించాడు. దశాబ్దానికి పైగా ఆఫ్గన్‌కు ప్రాతినిధ్యం వహించిన షాపుర్ జద్రన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టి పెవిలియన్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాపుర్ జద్రన్ అప్గానిస్తాన్ తరఫున 43 వన్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ తరఫున మూడు టీ20 ప్రపంచకప్పుల్లో పాల్గొన్న షాపుర్ జద్రన్ 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది? -
స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్.. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా.. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ.. కేకేఆర్ సహ భాగస్వామి జూహీ చావ్లా, ఆమె కూతురు జాన్వి మెహతా వీరంతా క్యాష్‌రిచ్ లీగ్‌కు అదనపు ఆకర్షణ. వీరంతా తమ జట్లు ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూనే తమ అందంతో అభిమానుల హృదయాలను కట్టిపడేస్తుంటారు. అయితే వీరందరిలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతిజింటాది ప్రత్యేక శైలి. యువరాజ్ సింగ్, మ్యాక్స్‌వెల్ సహా చాలా మంది పంజాబ్ ఆటగాళ్లకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ ఉత్సాహపరుస్తుండేది. ఇలా ఐపీఎల్ ఆరంభం నుంచి ప్రతీ సీజన్లో పంజాబ్‌ను ప్రోత్సహిస్తూ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రీతి జింటా ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు (ఒక మ్యాచ్ రద్దు) సాదించిన పంజాబ్ 9 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కూడా కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఇంతలా రెచ్చిపోతున్న సమయంలో ప్రీతి జింటా మైదానంలో కనబడకపోయేసరికి పంజాబ్ అభిమానులు చిన్న బోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ప్రీతిజింటా తన సామాజిక మాధ్యమంలో జట్టును అభినందిస్తూ పోస్ట్ చేసిందే తప్ప బయటకు రాలేదు. మరి ప్రీతిజింటాకు ఏమైనట్లు అని అభిమానులు ఆరా తీస్తున్న సమయంలో ఆమెనే స్వయంగా స్పష్టత ఇచ్చింది. ‘చాలా కాలంగా నా పిల్లలకు దూరంగా ఉండి షూటింగ్‌లు, ఇతర పనులతో బిజీగా గడిపాను. ప్రస్తుతం వాళ్లకు సెలవులు ఉన్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని నా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. తల్లిగా వాళ్లతో ఉండటం నా బాధ్యత, అందుకే మ్యాచ్‌లకు హాజరు కాలేకపోతున్నాను. అయితే పిల్లలతో సెలవులు ముగియగానే మళ్లీ స్టేడియానికి వచ్చి జట్టుతో పాటు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాను’ అని చెప్పుకొచ్చారు.పంజాబ్ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటం, దీనికి తోడు త్వరలోనే ప్రీతి జింటా ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానుల జోష్ డబుల్ కానుంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.Yes Yes Yessss !!!! Congratulations @PunjabKingsIPL for this win 👊So much maturity from @prabhsimran01 & wow @arshdeepsinghh Happy to see you shine 🤩 Amazing team work under the capable leadership of Sadda Sarpanch @ShreyasIyer15 & @RickyPonting 🔥 That was an awesome catch… pic.twitter.com/MNPsG1U1qU— Preity G Zinta (@realpreityzinta) April 16, 2026చదవండి: చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు! -
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్‌దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్‌గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అర్థసెంచరీ, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. -
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు కామెరున్ గ్రీన్ ఎట్టకేలకు మెరిశాడు. సీజన్లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.ఇక గతేడాది జరిగిన వేలంలో గ్రీన్‌ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అధిక ధరకు అమ్ముడైన గ్రీన్ ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. 23 కోట్లు దండగంటూ అభిమానులు సోషల్ మీడియాలో గ్రీన్‌ను ఏకిపారేశారు. అభిమానుల మాటలు గ్రీన్ మనుసుకు తగిలాయేమో కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో చివరిదాకా నిలబడి కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో గ్రీన్ ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 18, 2, 4, 32, 0 పరుగులు సాధించాడు. Making a strong statement 💪Cameron Green getting a move on for #KKR 💜 Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @KKRiders pic.twitter.com/utzOHFRbGx— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆకాశ్ మధ్వల్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ఆకాశ్ మధ్వల్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి 10 నుంచి 12 వారాల సమయం పట్టనుండడంతో ఖలీల్ అహ్మద్ దాదాపు సీజన్ మొత్తానికి దూరమైనట్లే. అందుకే సీఎస్కే ఖలీల్ స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకోనుంది. అయితే శనివారం సీఎస్కే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడనుంది. ఇక తొలుత ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించిన ఆకాశ్ మధ్వల్ 2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు కీలక బౌలర్‌గా ఉన్నాడు. ఆ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన ఆకాశ్ 14 వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వల్ 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.చదవండి: అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ! -
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్‌లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్‌లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్‌గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్‌వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్‌తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్‌కు బీసీసీఐ షాక్! -
ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే తక్కువ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వైఫల్యం కొనసాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ల విధ్వంసంతో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓటమితో ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ముంబై ఓటమి తర్వాత ఢీలా పడిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోటల్ రూమ్‌కు బయల్దేరిన సమయంలో మీడియా కంట పడ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత పని చేశాడు. తన పక్కనే కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ కూడా డల్‌గా కనిపించాడు. పక్కనే కూర్చున్న సూర్యతో కూడా ఏం మాట్లాడకుండా బస్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బయటకు చూస్తూ కంటతడి పెట్టినట్లు కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆటగాడిగానూ పాండ్యా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 27 సగటుతో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసిన పాండ్యా ఇచ్చుకున్న పరుగులుఎకానమీ రేటు 11.16గా ఉండడం గమనార్హం. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడం దగ్గరి నుంచి పాండ్యాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆల్‌రౌండర్ మూడు ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా, నమన్ ధిర్ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం పంజాబ్ ప్రబ్‌సిమ్రన్, అయ్యర్ విధ్వంసంతో 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే నాలుగు ఓటములతో పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జరగబోయే మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.Hardik Pandya was hiding his face while going hotel in the team bus. He looked quite upset and emotional. After the match last night pic.twitter.com/X0Gdcltzpr— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 17, 2026చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
గర్జించిన శ్రేయస్, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
డికాక్ కొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా?
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో డికాక్‌కు ఇది 9వ సెంచరీ. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జదా ఫర్హాన్‌లు కూడా 9 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, బాబర్ ఆజమ్ (11), డేవిడ్ వార్నర్ (10) శతకాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 108 పరుగులు, 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్తాన్, సీఎస్కే), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ, లక్నో) ఈ ఫీట్ సాధించారు. మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనించాల్సిన అంశం.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్‌పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ న్స్ (100 నాటౌట్) పంజాబ్‌పై తొలి సెంచరీ సాధించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) ముంబై తరపున రెండుసార్లు తన బెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో డికాక్‌ది రెండో సెంచరీ. సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.𝑸𝒖𝒊𝒕𝒆 𝒅𝒆 𝑲𝒏𝒐𝒄𝒌! 👏#MIvPBKSpic.twitter.com/ZmfClFOpm8— Mumbai Indians (@mipaltan) April 16, 2026What a player, what a knock, and what a way to start the season! 💯Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్ -
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అర్ష్‌దీప్ సెంచరీ నమోదు చేసింది బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ రికెల్టన్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేసర్‌గా, నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్కట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక పవర్ ప్లేలో అర్ష్‌దీప్ వికెట్ తీసుకోవడం 11 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.Back-to-back breakthroughs 🎯A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX— IndianPremierLeague (@IPL) April 16, 2026 #MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ప్రబ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్‌సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధోని!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), సీఎస్కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పషత రాలేదు. కానీ ధోని మాత్రం జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన సీఎస్కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూపర్‌కింగ్స్ ప్రత్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్’ అని తెలుగులో క్యాప్షన్ జత చేసింది. ఆ వీడియోలో ధోని సింహంలా నడుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబస్తు గట్టిగా కనిపిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కేవలం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా తరలిరానున్నారు. మ్యాచ్‌లో ఆడినా ఆడకపోయినా తలా ఒక్కసారి మైదానంలో దర్శనమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ధోని బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. ఒకవేళ ధోని జట్టులోకి వస్తే మాత్రం సర్ఫరాజ్‌ఖాన్ డగౌట్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్కే ఈ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.🚨 IT'S OFFICIAL MS DHONI IS TRAVELING TO HYDERABAD WITH THE CSK TEAM pic.twitter.com/lXc4qHavBp— ` (@WorshipDhoni) April 16, 2026𝙈𝙚𝙢𝙪 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙣𝙖𝙢, Hyderabad 🥳🦁#WhistlePodu #Yellove pic.twitter.com/oIT9uwxnTm— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026చదవండి: ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి! -
ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 సీజన్‌కు సంబంధించి ముంబై జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక రాష్ట్ర అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రతిభ కనబరుస్తూ కూడా జాతీయ జట్టుకు లేదా ఐపీఎల్లో అవకాశాలు రాని ఆటగాళ్లకు ఉపయోగపడేలా కాంట్రాక్టులు అమలు చేయనున్నట్లు గతంలోనే ఎంసీఏ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందించడంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అడుగు ముందుకు వేసింది. నివేదిక ప్రకారం ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టులోని ఆటగాళ్లను మూడు కేటగిరీలు (గ్రేడ్-ఏ, గ్రేడ్-బి, గ్రేడ్-సి) గా విభజించనుంది. గ్రేడ్-ఏ కేటగిరీ జాబితాలో ఉండే ఆటగాళ్లు రూ. 12 లక్షల నుంచి 20 లక్షలు అందుకోనున్నారు. గ్రేడ్-బి కేటగిరి కింద ఆటగాళ్లు రూ. 8 నుంచి 12 లక్షల వరకు, గ్రేడ్-సిలో ఉండే ఆటగాళ్లు రూ. 8 లక్షలు వార్షిక ఫీజుగా అందుకోనున్నారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ ముందే హామీ ఇచ్చినట్లుగా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌ను అమల్లోకి తీసుకురానున్నాం. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై చాలా ఆలోచించాము. డొమెస్టిక్ క్రికెట్లో ఆడే ఆటగాళ్లందరికీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాదు. అందుకే ముంబై తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌ను అందివ్వాలని నిర్ణయించాం. ఇది ఆటగాళ్లకు ఆర్థికంగానూ ఉపయోగపడనుంది’ అని చెప్పుకొచ్చారు.నిబంధనలు..అయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ అమలు చేయనున్న వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఆటగాళ్లు చోటు దక్కించుకోవడంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.ఆటగాళ్లు తప్పనిసరిగా ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉండాలి. ఫిట్నెస్ ప్రమాణాలు తప్పనిసరి.గత రెండు సీజన్లలో ఐపీఎల్లో పాల్గొనడం లేదా భారత జట్టుకు ఆడిన వారికి ఎంసీఏ కాంట్రాక్టులో చోటు ఉండదు. ఆటగాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు సెలెక్షన్ కమిటీ వారిని సిఫార్సు చేయడానికి అవకాశముంది.రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. రంజీ మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు రోజుకు రూ. 40 వేల నుంచి 60 వేలు చొప్పున బోర్డు చెల్లిస్తుంది. తాజాగా ఎంసీఏ కూడా అంతే మొత్తం ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ముంబై ఆటగాళ్లు తాము ఆడే ప్రతీ రంజీ మ్యాచ్‌కు బీసీసీఐతో పాటు ఎంసీఏ పారితోషికం కూడా అందుకోనున్నారు. తాజాగా తీసుకొచ్చిన కాంట్రాక్టు విధానం ఆటగాళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలం అని చెప్పొచ్చు. -
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్ వచ్చాడు. గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో జట్టులో చేరాడు. అతని పేరు కృష్ణ్ భగత్. 21 ఏళ్ల కృష్ పంజాబ్‌కు చెందిన ఆల్‌రౌండర్. ఇతన్ని ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అంకోలేకర్ స్థానాన్ని కృష్ భర్తీ చేశాడు. ముంబైకి చెందిన అంకోలేకర్‌ను ఈ సీజన్ వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌కు దక్కించుకున్నారు. అయితే అతను గాయం కారణంగా సీజన్ మొత్తం నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కృష్ జట్టులోక వచ్చాడు.కృష్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. కృష్ పంజాబ్ తరఫున 7 ఫస్ట్‌క్లాస్, 9 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. గత రెండు సీజన్లలో అతను ముంబై ఇండియన్స్ ట్రైల్స్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఎంఐ బృందంలో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టిన ఈ మాజీ ఛాంపియన్, ఆతర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. తాజాగా ఆర్సీబీ చేతిలో చతికిలబడిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇవాళ (ఏప్రిల్ 16) జరుగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వారి సొంత ఇలాకా వాంఖడేలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. -
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి తన కెరీర్లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్రధాన జట్టులో సభ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో కనిపించడంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే కనిపించింది. అయితే ఐపీఎల్లో ఇంపాక్ట్ రూల్ బ్యాటర్లకు ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి లక్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జట్టులో లేకపోయేసరికి అభిమానులు కంగారు పడినప్పటికీ కెప్టెన్ పటిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026 -
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026 -
మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్సర్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆఖరి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీటర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.102M SIX BY MITCHELL MARSH. 🤯 pic.twitter.com/YwUmYWUYx8— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2026 -
హాజిల్‌వుడ్ దెబ్బ.. పంత్ అబ్బ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ఆర్సీబీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతి పంత్‌ను గాయపర్చింది. లక్నో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 12 పరుగుల చేసి మార్కరమ్ ఔటైన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ హాజిల్‌వుడ్ వేశాడు. హాజిల్‌వుడ్ వేసిన తొలి మూడు బంతులను పంత్ జాగ్రత్తగా ఆడాడు. నాలుగో బంతిని పంత్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్సయ్యి పంత్ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బులెట్లా దూసుకురావడంతో దెబ్బకు పంత్ మోచేతి వాచిపోయింది. ఈ సమయంలో పంత్ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్ అయిన పంత్ డగౌట్‌కు వెళ్లిపోతున్న క్రమంలో హాజిల్‌వుడ్‌కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన పంత్ ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ తర్వాతి మ్యాచ్ ఆడేది అనుమానమే. మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు.Rishabh Pant gets a blow on his Elbow What a bowling this by RCB ❤️, Hazlewood ☠️ test match lines and result for him ! Krunal gets 2 wickets! #RCBvsLSG #IPL2026 pic.twitter.com/BvRTGLn4lo— Cricket IQ (@S17Anurag) April 15, 2026Rishabh Pant retired hurt, it's a big loss for the rcb.I hope he is fine and a comeback stringer, till then the opposition will miss him the t20s.💔 pic.twitter.com/qV8TPYrWjh— Sujeet Suman (@sujeetsuman1991) April 15, 2026 -
ధోని ఆగమనం.. అతడిపై వేటు తప్పదా!
ఐపీఎల్ 2026 సీజన్లో రెండు వరుస విజయాలతో జోష్ మీద కనిపిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్కే యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేరకు అనుకున్నదానికంటే ముందుగానే ధోని సీఎస్కే జట్టుతో జాయిన్ అవ్వనున్నాడు. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కండరాల గాయంతో టోర్నీలో సీఎస్కే ఆడిన తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ధోని కేకేఆర్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ధోని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బరిలోకి దిగనున్నాడు.సర్ఫరాజ్ స్థానానికి ఎసరు?అయితే ధోని జట్టులోకి రానుండడంతో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శాంసన్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి సీఎస్కే ముందున్న ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు సాధిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీంతో ధోని జట్టులోకి వస్తే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీఎస్కే సీజన్లో ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.చదవండి: బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్! -
IPL 2026: లక్నోపై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జితేశ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ముకుల్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంతకముందు 49 పరుగులు చేసిన కోహ్లి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పడిక్కల్ (10) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. అవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పడిక్కల్ హిమ్మత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోహ్లి (45), పటిదార్ (7) క్రీజులో ఉన్నారు.కోహ్లి దూకుడు..లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి దంచికొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్న కోహ్లి 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఫిల్ సాల్ట్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో సాల్ట్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కోహ్లి (12), పడిక్కల్ (5) క్రీజులో ఉన్నారు.ఆర్సీబీ టార్గెట్ 147 పరుగులుఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో కృనాల్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.పంత్ ఔట్..లక్నో సూపర్‌జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్ రాయ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గాయపడిన పంత్ మరోసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.నాలుగు వికెట్లు డౌన్ లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రజత్ పటీదార్‌కు క్యాచ్ ఇచ్చుకుని అబ్దుల్ సమద్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది. లక్నో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన కృనాల్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది. లక్నో సూపర్‌జెయింట్స్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పంత్ గాయానికి గురయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతి పంత్ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన లక్నోఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్కరమ్ రషీక్ సలామ్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోయి 32 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీ, లక్నోలు ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 6 సార్లు తలపడగా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు లక్నో సూపర్‌జెయింట్స్ విజయాలు సాధించాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో తలపడిన రెండు సందర్భాల్లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ నెగ్గాయి.ఆర్సీబీ తుదిజట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.లక్నో తుది జట్టు: మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్. -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు భారత్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్‌గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్‌కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్‌లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
రాత మారని కేకేఆర్.. సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్కే సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. ఆఖర్లో పావెల్ (31 నాటౌట్), రమణ్‌దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్లో సీఎస్కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు. -
‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్ ఇవ్వు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రుతురాజ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 12.6 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ రుతురాజ్ ఫెయిలవుతున్నాడు. సీఎస్కే ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి మూడింట ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ సహా వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే బాగుంటుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు. వన్‌డౌన్‌లో వస్తున్న ఆయుశ్ మాత్రేకు ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్‌గా పంపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు. View this post on Instagram A post shared by THE ADULT SOCIETY (@adultsociety) చదవండి: IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే! -
IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం ఆసక్తి కలిగించింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు ఏకకాలంలో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం వెనుక ఒక కారణముంది. గత వారం (ఏప్రిల్ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ మరణం పట్ల గౌరవసూచకంగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్‌లలో 242 పరుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026 -
ఊహించని దెబ్బ.. ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్‌లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్మెంట్కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మధుషంకను ఎస్ఆర్హెచ్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌కే జాయిన్ అవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్‌లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్‌గా పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పలు లీగ్‌లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మధుషంక లంక తరఫున 28 వన్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్‌హుస్సేన్ వంటి యంగ్ బౌలర్లకు తోడుగా మధుషంక జతవ్వడం జట్టుకు అదనపు బలం. మరి మధుషంక చేరికతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలపడినట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026 -
IPL 2026: కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్‌దీప్ సింగ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో కేకేఆర్ కష్టాల్లో పడింది. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ 85 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్ మరుసటి బంతికి కామెరున్ గ్రీన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్ (5), పావెల్ (2) క్రీజులో ఉన్నారు.అంతకముందు కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సునీల్ నరైన్ (24) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన నరైన్ స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ ఔట్..193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (1) శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేకేఆర్ టార్గెట్ 193 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (37), సర్ఫరాజ్ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్ కార్తిక్ త్యాగీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.సంజు క్లీన్ బౌల్డ్111 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 11.2 ఓవర్లో కార్తిక్ త్యాగీ బౌలింగ్‌లో సంజు శాంసన్ క్లీన్ బ్లౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రెండో వికెట్ డౌన్కేకేఆర్తో మ్యాచ్‌లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్ మాత్రే వైభవ్ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రుతురాజ్ (7) ఔట్..కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్‌రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గాయి.చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. -
వార్న్ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్‌లాండ్‌లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. ‘టూ వరల్డ్స్ కొలైడ్’ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ.. ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్‌లో తేలడం అప్ప ట్లో ఆసక్తిగా మారింది.2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్‌ను షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వార్న్ 55 మ్యాచ్‌లాడి 57 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’ -
‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో సోకులకే ఉన్నాడు తప్ప బ్యాట్‌తో పెద్దగా ఆడింది లేదంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా సోమవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 57 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించినప్పటికీ అందులో రియాన్ పరాగ్ పాత్ర శూన్యం. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి జట్టులో ఉన్నాడు లేదంటే డగౌట్‌కే పరిమితం కావాల్సి వచ్చేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ... 'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్‌గా బ్యాటింగ్‌కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్‌నే సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం. ఎస్ఆర్హెచ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని కొనియాడాడు.చదవండి: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్? -
షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే గ్రౌండ్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తే క్రమంలో స్పైక్ షూ ఉంటే మరింత బాగా పరిగెత్తగలవని ఎవరో చెబితే విన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అక్కడ వాలిపోయేవాడు. ఎందుకంటే వాళ్లిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు స్పైక్ షూ కొనుగోలుకు ఉపయోగపడుతాయని ఆ కుర్రాడి ఆరాటం. అయితే తల్లికి విషయం తెలిసి తనకున్న నగలు అమ్మి స్పైక్ షూ కొని కొడుకు కోరిక తీర్చింది. ఇలా కష్టాల సుడిగుండాలను చిన్నతనంలోనే అనుభవించి, ఇవాళ వాటిని దాటుకొని ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని రైజింగ్ స్టార్ అయ్యాడు సాకిబ్ హుస్సేన్.ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ ఓటమికి ఇద్దరు బౌలర్లు ప్రధాన కారణంగా నిలిచారు. వారిలో ఒకరు ప్రఫుల్ హింగే అయితే.. రెండో వ్యక్తి సాకిబ్ హుస్సేన్. ఇద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం, ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీయడం విశేషం. అయితే ప్రఫుల్ హింగేతో పోలిస్తే ఎకానమీ పరంగా సాకిబ్ హుస్సేన్ ఒక మెట్టు పైనే ఉంటాడు. జైస్వాల్, ఆర్చర్, ఫెరీరా, బిష్ణోయ్ వికెట్లను ఖాతాలో వేసుకున్న సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ప్రఫుల్ హింగే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్నారు. కానీ అతనితో సమానంగా సాకిబ్ హుస్సేన్ ప్రదర్శనను కూడా గుర్తించాల్సిన అవసరముంది.సైన్యంలో చేరాలనుకొని..బీహార్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్, సుబుక్తారా ఖతాన్ దంపతులకు సాకిబ్ హుస్పేన్ 2004లో జన్మించాడు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే సాకిబ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని సాకిబ్ పరితపించేవాడు. సైన్యంలో చేరేందుకు సమీప గ్రౌండ్లో రన్నింగ్‌కు వెళ్లేవాడు. అప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. రన్నింగ్ బాగా చేయాలంటే స్పైక్ షూ అవసరమని గుర్తించిన సాకిబ్ తన ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉండడంతో ఇంట్లోవాళ్లను అడగడం ఇష్టం లేక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేవాడు. వారిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు దాచుకునేవాడు. తల్లి నగలు అమ్మి..అయితే స్పైక్ షూ కొనడానికి డబ్బులు చాలా కావాలని భావించిన సాకిబ్ తన మనసులోని మాటను కన్నతల్లికి చెప్పడం, ఆ తల్లి తనకున్న కొద్దిపాటి నగలు అమ్మి కొడుకు కోరికను తీర్చింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించడంతో సాకిబ్ హుస్సేన్‌కు 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం లభించింది. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున రైట్ ఆర్మ్ పేసర్‌గా అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సాకిబ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇక 2025-26 రంజీ సీజన్లో బీహార్ తరఫున ఆడిన సాకిబ్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యచ్‌లో 41 పరుగులకే 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తొలిసారి సాకిబ్ వేలంలోకి వచ్చినప్పటికీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో 140 ప్లస్‌కు తగ్గకుండా బౌలింగ్ వేస్తున్న విషయాన్ని గుర్తించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలిపెట్టింది. వరుణ్ ఆరోన్ దృష్టిలో పడి..అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనను తాను మరింత సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్‌లో కుర్రాళ్లు కావాలని వరుణ్ ఆరోన్ తన వేటను ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్ల సంచలన ప్రదర్శన నమోదు చేసిన సాకిబ్ హుస్సేన్ వరుణ్ ఆరోన్‌ను ఆకర్షించాడు. అలా గతేడాది మినీ వేలంలో సాకిబ్ హుస్సేన్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు సాకిబ్ హుస్సేన్.Another debutant making his mark ✅🎥 Glimpses of Sakib Hussain’s 4/24 in his first outing in #TATAIPL 🔥Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @sunrisers pic.twitter.com/ByAMDOgJiB— IndianPremierLeague (@IPL) April 13, 2026A NIGHT FOR THE DEBUTANTS! 🤩Praful Hinge and Sakib Hussain giving #TATAIPL fans a game to remember 🤜🤛Watch Hussain's spell ▶️ https://t.co/pFEeR4dHxD#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/YBpnrflB7o— IndianPremierLeague (@IPL) April 13, 2026చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
హడలెత్తించిన ప్రఫుల్, సాకిబ్.. ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో సంచలనం నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగే సంచలన ప్రదర్శనతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన ప్రఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి బంతికి ప్రిటోరియస్‌ను వెనక్కి పంపాడు. తద్వారా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ నిలిచాడు. గతంలో తొలి ఓవర్లో బౌలర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరఫున 2024లో ఇదే రాజస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రఫుల్ పటేల్ బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజస్తాన్ బ్యాటర్లు డకౌట్లుగానే వెనుదిరగడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో నాలుగు అంతకంటే ఎక్కువ పడగొట్టిన బౌలర్ల జాబితాలోనూ ప్రఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్హింగే కంటే ముందు ఇషాంత్ శర్మ, షోయ్ అక్తర్, అజిత్ చండీలా, దావల్ కులకర్ణి, పాట్ కమిన్స్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ ఈ ఫీట్ సాధించారు.ఎవరీ ప్రఫుల్ హింగే?విదర్భకు చెందిన ప్రఫుల్ హింగే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. వేలంలో ఎస్ఆర్హెచ్ ప్రఫుల్ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్కు బ్యాకప్ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్ హింగే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.LADIES & GENTLEMEN - MEET PRAFUL HINGE:- The first bowler in history of the IPL to take 3 wickets in the opening over. 🥶🔥 pic.twitter.com/KuYFeai4HT— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026🚨 HISTORY CREATED BY PRAFUL HINGE. 🚨- Hinge becomes the first bowler in 19 years of the IPL to claim 3 wickets in the opening over. 🤯🔥 pic.twitter.com/osukqE6HBg— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026చదవండి: గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు -
గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అయ్యాడు. తద్వారా అభిషేక్ శర్మ తన పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అదేంటంటే..2026 సీజన్ టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మకు ఇది ఏడో గోల్డెన్ డక్. 2026 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 18 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యి అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.అంతకముందు కూపర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో శిఖర్ దావన్ 2018 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్ అయి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.భారత్ తరఫున టీ20 క్రికెట్లో ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంసన్ (2024లో ఆరు సార్లు), గురుకీరత్ సింగ్ (2103లో 5 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో తొలి బంతికే వికెట్ తీయడం ఆర్చర్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా వెటరన్ క్రికెటర్ మహ్మద్ షమీ ఐపీఎల్లో ఈ ఫీట్‌ను 5 సార్లు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది 24వ సారి. ఐపీఎల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. ముంబై ఇండియన్స్ 22సార్లు ఈ ఫీట్ నమోదు చేసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)


