హడలెత్తించిన ప్రఫుల్‌, సాకిబ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం | IPL 2026: Sunrisers Hyderabad Won By 57 Runs Vs Rajasthan Royals | Sakshi
Sakshi News home page

IPL 2026: హడలెత్తించిన ప్రఫుల్‌, సాకిబ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం

Apr 13 2026 11:21 PM | Updated on Apr 13 2026 11:36 PM

IPL 2026: Sunrisers Hyderabad Won By 57 Runs Vs Rajasthan Royals

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్‌ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ సునాయసంగా గెలుపొందింది. 

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91)  సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్‌, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 

అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

చదవండి: తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఎవ‌రీ ప్ర‌ఫుల్ హింగే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement