ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌! | 2nd Time-IPL-Top 4-Batters Marks Double Digit-Not-Reached 20 Runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌!

May 5 2026 9:04 PM | Updated on May 5 2026 9:20 PM

2nd Time-IPL-Top 4-Batters Marks Double Digit-Not-Reached 20 Runs

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌ సాధించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఢిల్లీ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం.

నిస్సాంక (19), రాహుల్‌ (12), నితీశ్‌రానా (15), కరుణ్‌ నాయర్‌ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు.  ఇలా ఒక మ్యాచ్‌లో టాప్‌ నలుగురు బ్యాటర్లు డబుల్‌ డిజిట్‌ మార్క్‌ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 

మొదటిసారి కూడా ఈ ఫీట్‌ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున టాప్‌ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్‌ (15), వార్నర్‌ (13), నమన్‌ ఓజా (13), యోగేశ్‌ నగర్‌ (18) 20 పరుగుల మార్క్‌ దాటకుండానే ఔటయ్యారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌), స్ట‌బ్స్ (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

అయితే టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. 

చదవండి: తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement