శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్‌బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్‌ను కూడా క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్‌లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1
230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులు
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.
గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్
84 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.
మరో వికెట్ డౌన్
జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డోనోన్‌కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.
సాయి సుదర్శన్ ఔట్
సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు.
సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ
గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్‌మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు.
గుజరాత్ ఓపెనర్లు దూకుడు
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్‌మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.
ఒకే ఓవర్‌లో 18 పరుగులిచ్చిన ఆర్చర్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్‌లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.
టాస్ నెగ్గిన రాజస్తాన్..
టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ను జైస్వాల్ నడిపించనున్నాడు.
ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్‌తో పాటు యష్‌రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్‌లో కూడా గుజరాత్‌దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రా
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్


