‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు! | Ex-Cricketer Allegations-Players Not Happy With Coach Gambhir | Sakshi
Sakshi News home page

‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

May 7 2026 9:38 PM | Updated on May 8 2026 12:37 AM

Ex-Cricketer Allegations-Players Not Happy With Coach Gambhir

టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ అతుల్ వ‌స్స‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. గంభీర్ దూకుడు స్వ‌భావం, అత‌డి కఠిన వైఖ‌రితో జ‌ట్టులోని కొంతమంది ఆట‌గాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వ‌స్స‌న్ ఆ ఆటగాళ్ల పేర్ల‌ను వెల్ల‌డించడానికి నిరాక‌రించాడు. 

అతుల్ వ‌స్స‌న్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్న‌ప్ప‌టి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జ‌ర‌గాలి, ఇంకేమీ చేయ‌కూడ‌దు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. మొద‌టి నుంచి గంభీర్ స్వ‌భావం అలాగే ఉంటుంది. ధ‌నిక కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ గంభీర్ ఆట‌లో మంచి టెక్నిక్ ఉండ‌డంతో పాటు మంచి తెలివిమంతుడు. 

అయితే అత‌నికి ఉండే ఈగో వేరే లెవెల్‌లో ఉంటుంది. అదెలా అంటే అత‌ను ఏదైనా అనుకుంటే అవ‌త‌లి వ్య‌క్తుల కూడా త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్‌లో అలాగే కొనసాగడం ఆట‌గాళ్ల‌తో గొడ‌వ‌లు ప‌డేలా చేసింది. 

అందుకే ఐపీఎల్‌లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి ప‌ట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత‌మంది ఆట‌గాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. 

వారి పేర్లు చెప్ప‌డం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్ర‌వ‌ర్త‌న‌తో క‌చ్చితంగా సంతోషంగా లేర‌ని చెప్ప‌గ‌ల‌ను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement