ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్‌హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?