Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది.
మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది.
ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃
Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026


