పాక్‌ ‘ఏఐ’ చిప్‌.. వైభ‌వ్ అదిరిపోయే రిప్లై! | Vaibhav Sooryavanshi Stunning Reply Pakistan Expert AI Chip Remark | Sakshi
Sakshi News home page

పాక్‌ ‘ఏఐ’ చిప్‌.. వైభ‌వ్ అదిరిపోయే రిప్లై!

Apr 29 2026 5:17 PM | Updated on Apr 29 2026 5:35 PM

Vaibhav Sooryavanshi Stunning Reply Pakistan Expert AI Chip Remark

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. 15 ఏళ్ల వ‌య‌సులోనే అద్భ‌త బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్న వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. 

అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్‌పై అనుమాన‌ముంద‌ని, ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఉండొచ్చ‌ని, వెంట‌నే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమ‌న్ నియాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అన‌లిస్ట్‌కు వైభ‌వ్ త‌న స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్‌కు ఆ ఏఐ చిప్‌ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్‌కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్‌ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.

అసలేం జరిగింది?
ఐపీఎల్ 2026 సీజన్‌లో అగ్ర‌శ్రేణి బౌల‌ర్లంద‌రినీ ఉతికారేస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అత‌డి మెద‌డులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అన‌లిస్ట్ నౌమ‌న్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్‌కు డోపింగ్‌ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు.  ‘వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒక‌సారి వైభ‌వ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. 

అత‌డి బుర్ర‌లో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసారా అన్న‌ది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి ప‌రీక్షించాల్సిందే. వైభ‌వ్ నాకు మ‌నిషిలా అనిపించ‌డం లేదు. అయితే అత‌డి మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభ‌వ్ సూర్య‌వంశీ ఒక అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అత‌డి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. 

ఇక ఒక టీనేజీ కుర్రాడు కండ‌లు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్య‌వంశీ 18 ఏండ్లు నిండ‌కుండానే అత‌డి దేహ‌దారుఢ్యం బ‌లంగా క‌నిపిస్తోంది. రాబోయే సంవ‌త్స‌రాల్లో వైభ‌వ్ ఆట‌లో మ‌రింత రాటు దేల‌డం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్ 19వ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్‌ను అందుకునేందుకు వైభవ్‌కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. 

ఇప్పటిదాకా ఈ రికార్డు  ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్‌లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ (195 బంతులు),  2025 సీజన్‌లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

చదవండి: ‘వైభ‌వ్‌పై అనుమానముంది.. డోపింగ్‌ టెస్ట్ చేయాల్సిందే!’

Advertisement
 
Advertisement
Advertisement