ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
విజయం దిశగా సీఎస్‌కే
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం దిశగా కొనసాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ (84), కార్తిక్ శర్మ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు.
శాంసన్ హాఫ్ సెంచరీ.. సీఎస్‌కే 96/2
ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్‌కే 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్ (22), కార్తిక్ శర్మ (5) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది.
రుతురాజ్ ఔట్..
ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్‌కే 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.
సీఎస్‌కే టార్గెట్ 156 పరుగులు
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్‌నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (30), సమీర్ రిజ్వీ (16) పరుగులతో ఆడుతున్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్‌ప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.
4 వికెట్లు డౌన్
నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గుర్జప్‌నీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కేఎల్ రాహుల్ ఔట్..
12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.
తొలి వికెట్ డౌన్
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.
టాస్ నెగ్గిన ఢిల్లీ
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్‌నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు.
సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్‌కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్‌కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్‌నీత్ సింగ్.


