తొలిసారి 5 వికెట్లు.. భార‌త్‌ను గెలిపించిన దీప్తి శ‌ర్మ‌ | Deepti Sharma Maiden T20I five Wicket Hual India Beat South Africa | Sakshi
Sakshi News home page

తొలిసారి 5 వికెట్లు.. భార‌త్‌ను గెలిపించిన దీప్తి శ‌ర్మ‌

Apr 26 2026 5:11 AM | Updated on Apr 26 2026 12:05 PM

Deepti Sharma Maiden T20I five Wicket Hual India Beat South Africa

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ‌నివారం జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వుమెన్ 14 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశ‌ర్మ (36 నాటౌట్‌), రిచా ఘోష్ (34 నాటౌట్‌) రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌ఫారీలు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగుల‌కు ప‌రిమితమ‌యింది. 

ఓపెన‌ర్ సునె లుస్ (40) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, తంజిమ్ బ్రిట్జ్ 30 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 5 వికెట్లు తీయ‌గా, క్రాంతి, చ‌ర‌ణి, క‌శ్వీ గౌత‌మ్‌, షెఫాలీ త‌లా ఒక వికెట్ తీశారు. సిరీస్‌లో భాగంగా చివ‌రి టీ20 సోమ‌వారం జ‌ర‌గ‌నుంది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన దీప్తి శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా  దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement