ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
2⃣ points in the bag ✅
Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠
Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026


