మాట త‌ప్పిన రిషబ్‌ పంత్‌! | Rishabh Pant Breaks Promise To Sanjeev Goenka Batting Failure Vs MI | Sakshi
Sakshi News home page

మాట త‌ప్పిన రిషబ్‌ పంత్‌!

May 4 2026 9:16 PM | Updated on May 4 2026 9:27 PM

Rishabh Pant Breaks Promise To Sanjeev Goenka Batting Failure Vs MI

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌గా తొలి రెండు సీజ‌న్ల‌లో ప్లేఆఫ్స్ చేరి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మాత్రం ల‌క్నో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్ర‌మే విజ‌యం సాధించిన ల‌క్నో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. 

తాజాగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్‌ కీల‌క మ్యాచ్ ఆడుతోంది. ఈ నేప‌థ్యంలో టాస్ స‌మ‌యంలో ల‌క్నో కెప్టెన్ పంత్ ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా పేరును ప్ర‌స్తావించాడు. తాను పేల‌వ ఫామ్‌ను అధిగ‌మించి ముంబైతో మ్యాచ్‌లో ప‌రుగులు సాధిస్తాన‌ని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు. 

అయితే మ్యాచ్‌లో కేవ‌లం 15 ప‌రుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక‌పోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. 

నిజానికి ఈ సీజన్‌ను మేము మంచి ఈజ్‌తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. 

కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్‌ పంత్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 204 పరుగులు సాధించాడు.

అయితే ముంబైతో మ్యాచ్‌లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.

చదవండి: ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement