Photo Courtesy: IPL 2026
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన చర్యతో పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణం చేస్తున్న విమానంలో చాహల్..వేప్( ఈ-సిగరేట్) తాగిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది. వీడియోలో చాహల్ వేప్‌ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు.
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సహచర క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్లాగ్ గా దర్శనమిచ్చింది. అయితే అసలు వ్లాగ్‌లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించినట్లు ఇన్‌స్టా ఖాతాదారులు పేర్కొన్నారు.
అసలు వీడియోలో చాహల్ ఒక్కడే కాకుండా అతడి పక్కన ఉన్న శశాంక్ సింగ్, ఇతర పంజాబ్ ప్లేయర్లు కూడా ఈ-సిగరేట్ తాగే అవకాశం లేకపోలేదని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్రయాణంలో సిగరేట్ (ఈ-సిగరెట్ అయినా) తాగడం నిషేధం. సిగరేట్ పొగ వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారముంది. చాహల్ ప్రవర్తన విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది.
ఇప్పటికే ఈ సీజన్‌లోనే పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్రూమ్‌లో వేప్‌ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెలకొంది. అయితే బీసీసీఐ మాత్రం పరాగ్‌ను మందలిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో సరిపెట్టింది. కానీ ఈసారి చాహల్ వేప్ ఉపయోగించినట్లు తేలితే మాత్రం అతడితో పాటు పంజాబ్ జట్టు మొత్తానికి శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాహల్‌తో పాటు పంజాబ్ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.
చాహల్ చర్య నిజమని తేలితే ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వీడియో నకిలీదా లేక నిజమైనదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిన పంజాబ్ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀
This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026


