బంగ్లా 221 ఆలౌట్‌.. న్యూజిలాండ్‌దే తొలి వ‌న్డే | New Zeland Won By 26 Runs Vs Bangladesh In 1st ODI | Sakshi
Sakshi News home page

బంగ్లా 221 ఆలౌట్‌.. న్యూజిలాండ్‌దే తొలి వ‌న్డే

Apr 17 2026 10:27 PM | Updated on Apr 17 2026 10:36 PM

New Zeland Won By 26 Runs Vs Bangladesh In 1st ODI

బంగ్లాదేశ్ టూర్‌ను న్యూజిలాండ్ ఘ‌నంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ 26 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 247 ప‌రుగులు చేసింది. హెన్రీ నికోల‌స్ (68) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. 

బంగ్లా బౌల‌ర్ల‌లో రిష‌ద్ హొసెన్‌, షోరిపుల్ ఇస్లామ్‌, త‌స్కిన్ అహ్మ‌ద్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సైఫ్ హ‌స‌న్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. లిట‌న్ దాస్ (46) ప‌ర్వాలేదనిపించాడు. 

అయితే వీరు ఔటైన త‌ర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేక‌మేడ‌ను త‌ల‌పించింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బ్లెయిర్ టిక్న‌ర్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, నాథ‌న్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అర్థ‌సెంచ‌రీ, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి ఆల్‌రౌండ్ ప్ర‌దర్శ‌న క‌న‌రబ‌రిచిన డియాన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే సోమ‌వారం జ‌ర‌గ‌నుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement