ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, యజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి సరదాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను.
ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంతో చాహల్ షాక్ తినక తప్పలేదు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.
Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026


