సీఎస్‌కే అడ్డాలో జోస్‌ ఇంగ్లిస్‌ అరుదైన ఫీట్‌! | Lucknow Super Giants Star Josh Inglis Achieves Huge Feat Against CSK | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే అడ్డాలో జోస్‌ ఇంగ్లిస్‌ అరుదైన ఫీట్‌!

May 10 2026 5:46 PM | Updated on May 10 2026 6:05 PM

Lucknow Super Giants Star Josh Inglis Achieves Huge Feat Against CSK

Photo Courtesy: IPL 2026

ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ బ్యాట‌ర్ జోస్ ఇంగ్లిస్ స‌రికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో ఆదివారం సీఎస్కేతో మ్యాచ్‌లో ద‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లిస్ 33 బంతుల్లోనే 85 ప‌రుగులు చేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ సాధించిన ఇంగ్లిస్ ఒక అరుదైన ఫీట్‌ సాధించాడు. 

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో త‌క్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న తొలి క్రికెట‌ర్‌గా ఇంగ్లిస్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సామ్‌ బిల్లింగ్స్‌ (21 బంతులు) పేరిట ఉండేది. సీఎస్‌కే సొంత గ్రౌండ్ అయిన‌ప్ప‌టికీ ఇప్పటివ‌ర‌కు ఆ జ‌ట్టులో కూడా ఎవరు తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించలేకపోయారు. ఇక సామ్ బిల్లింగ్స్ 21 బంతుల్లో అర్థ‌సెంచ‌రీ సాధించాడు. 

2018 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై బిల్లింగ్స్ దీనిని సాధించాడు.  తాజాగా జోస్ ఇంగ్లిస్ కేవ‌లం 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించి సీఎస్‌కే బ్యాటర్లకు కూడా సాధ్యం కానిది త‌న పేరిట లిఖించుకున్నాడు. అయితే ఇంగ్లిస్ ఉన్నంత‌సేపు లక్నో స్కోరుబోర్డు ప‌రుగులు పెట్టింది. 

ఆరు ఓవ‌ర్ల‌లోనే వంద ప‌రుగుల మార్క్‌ను దాటిన ల‌క్నో.. ఇంగ్లిస్ ఔట‌య్యాక జ‌ట్టు ఇన్నింగ్స్ పేక మేడ‌ను త‌ల‌పించింది. చివ‌ర్లో సషాబాజ్ అహ్మ‌ద్ (25 బంతుల్లో 43 నాటౌట్‌) రాణించ‌డంతో ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది.

చదవండి: లక్నో డ‌గౌట్‌లో ఫోన్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement