హాజిల్‌వుడ్‌ దెబ్బ.. పంత్‌ అబ్బ! | Rishabh Pant That Forced Him To Leave Field Mid-Match Vs RCB | Sakshi
Sakshi News home page

IPL 2026: హాజిల్‌వుడ్‌ దెబ్బ.. పంత్‌ అబ్బ!

Apr 15 2026 9:35 PM | Updated on Apr 15 2026 10:03 PM

Rishabh Pant That Forced Him To Leave Field Mid-Match Vs RCB

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది.  ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ఆర్సీబీ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ వేసిన బంతి పంత్‌ను గాయపర్చింది. లక్నో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. 

12 పరుగుల చేసి మార్కరమ్‌ ఔటైన తర్వాత పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌ హాజిల్‌వుడ్‌ వేశాడు. హాజిల్‌వుడ్‌ వేసిన తొలి మూడు బంతులను పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. నాలుగో బంతిని పంత్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్సయ్యి పంత్‌ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బులెట్‌లా దూసుకురావడంతో దెబ్బకు పంత్‌ మోచేతి వాచిపోయింది. 

ఈ సమయంలో పంత్‌ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పంత్‌ డగౌట్‌కు వెళ్లిపోతున్న క్రమంలో హాజిల్‌వుడ్‌కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 

క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన పంత్‌ ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్‌ తర్వాతి మ్యాచ్‌ ఆడేది అనుమానమే. మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement