వార్న్‌ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు! | Shane Warne Son Jackson Break Silence About-His-Father Sudden Death | Sakshi
Sakshi News home page

వార్న్‌ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Apr 14 2026 6:47 PM | Updated on Apr 14 2026 7:32 PM

Shane Warne Son Jackson Break Silence About-His-Father Sudden Death

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్‌లాండ్‌లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్‌ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. 

‘టూ వరల్డ్స్ కొలైడ్‌’ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ..  ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. 

అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. 

నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్‌లో తేలడం అప్ప ట్లో  ఆసక్తిగా మారింది.

2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తొలి ఎడిషన్‌ను షేన్‌ వార్న్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో వార్న్‌ 55 మ్యాచ్‌లాడి 57 వికెట్లు పడగొట్టాడు.

చదవండి:  ‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’

Advertisement
 
Advertisement
Advertisement