‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’ | Krishnamachari Srikanth Slams Riyan Parag Batting Failure IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’

Apr 14 2026 5:59 PM | Updated on Apr 14 2026 7:08 PM

Krishnamachari Srikanth Slams Riyan Parag Batting Failure IPL 2026

Photo Courtesy: IPL 2026

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌పై మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్‌లో సోకుల‌కే ఉన్నాడు త‌ప్ప బ్యాట్‌తో పెద్ద‌గా ఆడింది లేదంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా సోమ‌వారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ 57 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. 

అయితే ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సాధించిన‌ప్ప‌టికీ అందులో రియాన్ ప‌రాగ్ పాత్ర శూన్యం. బ్యాటింగ్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కెప్టెన్‌గా ఉన్నాడు కాబ‌ట్టి జ‌ట్టులో ఉన్నాడు లేదంటే డ‌గౌట్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేదని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

ఈ నేప‌థ్యంలో క్రిష్‌ శ్రీకాంత్ మాట్లాడుతూ... 'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్‌గా బ్యాటింగ్‌‌కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్‌నే సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. 

లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం. ఎస్ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని కొనియాడాడు.

చదవండి: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్‌ హుస్సేన్‌?

Advertisement
 
Advertisement
Advertisement