ఆర్సీబీ ఓట‌మి.. వ‌రుస ఓట‌ముల‌కు ల‌క్నో చెక్‌! | IPL 2026: Lucknow Super Giats Beat Royal Challengers Bangalore By 9 Runs | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఓట‌మి.. వ‌రుస ఓట‌ముల‌కు ల‌క్నో చెక్‌!

May 8 2026 12:31 AM | Updated on May 8 2026 12:35 AM

IPL 2026: Lucknow Super Giats Beat Royal Challengers Bangalore By 9 Runs

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వ‌రుస ఓట‌ముల‌కు పుల్‌స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 

213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ ప‌టీదార్ (61) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, ప‌డిక్క‌ల్ (34) ప‌ర్వాదలేద‌నిపించాడు. ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ మూడు వికెట్ల‌తో మెర‌వ‌గా, ష‌మీ, షాబాజ్ అహ్మ‌ద్‌లు చెరొక వికెట్ తీశారు.

అంత‌క‌ముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. కాగా ల‌క్నో ఆరు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత గెలుపును అందుకోవ‌డం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement