రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ అభిమాని కొడుకు | Son Of Virat Kohli’s Massive Fan From West Indies Breaks Multiple Records | Sakshi
Sakshi News home page

రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ అభిమాని కొడుకు

Apr 28 2026 6:06 PM | Updated on Apr 28 2026 6:37 PM

Son Of Virat Kohli’s Massive Fan From West Indies Breaks Multiple Records

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్‌ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్‌ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.

వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.

ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్‌ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారింది.

వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్‌ (522/9) అందించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్‌ తరఫున చేశాడు.

వెస్టిండీస్‌ తరఫున అడపాదడపా టెస్ట్‌ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement