చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు! | IPL 2026: Akash Madhwal Likely To Join CSK Replacing Khaleel Ahmed | Sakshi
Sakshi News home page

చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!

Apr 17 2026 8:07 PM | Updated on Apr 17 2026 10:11 PM

IPL 2026: Akash Madhwal Likely To Join CSK Replacing Khaleel Ahmed

ఐపీఎల్ 2026 సీజన్‌కు సీఎస్‌కే బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆకాశ్ మధ్వల్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌, రాజస్తాన్ రాయ‌ల్స్‌కు ఆకాశ్ మధ్వల్ ప్రాతినిధ్యం వ‌హించాడు. 

ఇక‌ మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి 10 నుంచి 12 వారాల సమయం పట్టనుండడంతో ఖలీల్ అహ్మద్ దాదాపు సీజన్ మొత్తానికి దూరమైనట్లే. అందుకే సీఎస్‌కే ఖలీల్ స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకోనుంది. 

అయితే శనివారం సీఎస్‌కే ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇక తొలుత ముంబై ఇండియ‌న్స్‌కు నెట్ బౌల‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ ఆకాశ్ మధ్వల్ 2023 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కీల‌క బౌల‌ర్‌గా ఉన్నాడు. ఆ సీజ‌న్‌లో 8 మ్యాచ్‌లాడిన ఆకాశ్ 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఆకాశ్ మ‌ధ్వ‌ల్ 5 ప‌రుగుల‌కే 5 వికెట్లు ప‌డ‌గొట్టి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు.

చదవండి: అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement