వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ! | 2 Unluckiest Dismissals For KKR Batters Vs RCB Ever Seen IPL-2026 | Sakshi
Sakshi News home page

వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ!

May 8 2026 10:27 PM | Updated on May 8 2026 11:27 PM

2 Unluckiest Dismissals For KKR Batters Vs RCB Ever Seen IPL-2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడింది. కెప్టెన్ రహానేతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తమ తప్పు లేకున్నా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ముందుగా రహానే విషయానికొస్తే.. అప్పటికే రహానే ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించాడు. 

అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్ మిచెల్ స్టార్క్ వేయగా.. ఆ ఓవర్ చివరి బంతిని ఫిన్ అలెన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ తన చేతుల్ని అడ్డుపెట్టడంతో బంతి అతని చేతులకు తగిలి వికెట్లను గిరాటేసింది. నాన్‌స్ట్రైక్‌ఎండ్‌లో ఉన్న రహానే అప్పటికే క్రీజు దాటి బయటికి వచ్చేశాడు. అతను తిరిగి క్రీజులోకి చేరుకునేలోపే బంతి వికెట్లను తాకడంతో చేసేదేం లేక రనౌట్‌గా వెనుదిరిగాడు. అలా రహానే ఆట ముగిసింది. 

అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్ నాలుగో బంతిని అంగ్‌క్రిష్ రఘువంశీ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి వికెట్ల మీదకు వెళ్లింది. అంగ్‌క్రిష్ బంతిని అడ్డుకునేలోపే వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో అంపైర్ రఘువంశీని క్లీన్‌బౌల్డ్ అయినట్లు ప్రకటించాడు. ఇలా వరుస ఓవర్లలో ఇద్దరు కేకేఆర్ టాపార్డర్ బ్యాటర్లను దురదృ‍ష్టం వెక్కిరించింది. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన  ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్‌, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వింత రికార్డు!

Advertisement
 
Advertisement
Advertisement