IPL 2026: న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి.. కార‌ణ‌మ‌దే! | Reason Behind Why CSK And KKR Players Wearing Black Armbands | Sakshi
Sakshi News home page

IPL 2026: న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి.. కార‌ణ‌మ‌దే!

Apr 14 2026 9:09 PM | Updated on Apr 14 2026 9:17 PM

Reason Behind Why CSK And KKR Players Wearing Black Armbands

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ త‌ల‌ప‌డుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం ఆస‌క్తి క‌లిగించింది. అయితే ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఏకకాలంలో న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం వెనుక ఒక కార‌ణ‌ముంది. గ‌త వారం (ఏప్రిల్‌ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 

ఆయ‌న మృతికి సంతాపంగా సీఎస్‌కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్‌ మరణం పట్ల గౌర‌వ‌సూచ‌కంగా ఆట‌గాళ్లంతా న‌ల్ల రిబ్బ‌న్లు ధరించి బ‌రిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ త‌న కెరీర్‌లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. 

ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌ద్రాస్‌ త‌ర‌పున ఆడ‌న 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు.  తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయ‌న 8 మ్యాచ్‌ల‌లో 242 ప‌రుగులు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement