ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజన్‌లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్‌కే సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది.
ఆఖర్లో పావెల్ (31 నాటౌట్), రమణ్‌దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో సీఎస్‌కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు.


