కోహ్లి, రసిక్‌ సలామ్‌ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం | Royal Challengers Bengaluru Beat Lucknow Super Giants By 5 Wickets | Sakshi
Sakshi News home page

కోహ్లి, రసిక్‌ సలామ్‌ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం

Apr 15 2026 10:57 PM | Updated on Apr 15 2026 11:05 PM

Royal Challengers Bengaluru Beat Lucknow Super Giants By 5 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. 

మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. 

మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement