ఊహించని దెబ్బ.. ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం | SRH Pick Dilshan Madushanka Injury Replacement For Brydon Carse | Sakshi
Sakshi News home page

ఊహించని దెబ్బ.. ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం

Apr 14 2026 7:55 PM | Updated on Apr 14 2026 10:05 PM

SRH Pick Dilshan Madushanka Injury Replacement For Brydon Carse

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది.  

పేస్ అటాక్‌లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్‌మెంట్‌కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్  కార్స్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మ‌ధుషంక‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 75 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కే జాయిన్ అవ్వ‌నున్నాడు. 

ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్‌లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్‌గా పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.

గతంలో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పలు లీగ్‌లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మ‌ధుషంక లంక త‌ర‌ఫున 28 వ‌న్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్ర‌ఫుల్ హింగే, సాకిబ్‌హుస్సేన్ వంటి యంగ్ బౌల‌ర్ల‌కు తోడుగా మ‌ధుషంక జ‌త‌వ్వ‌డం జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం. మరి మ‌ధుషంక చేరిక‌తో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బ‌ల‌పడిన‌ట్లే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement