ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు | RCB Worst Record-Lost 1st-50th-100th Match In Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు

Apr 18 2026 9:51 PM | Updated on Apr 19 2026 11:16 AM

RCB Worst Record-Lost 1st-50th-100th Match In Chinnaswamy Stadium

ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. 

ఈ సంగతి పక్కనబెడితే  చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్‌, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. 

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్‌కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. 

ఇక 2011 నుంచి ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement