IPL 2026: ఏడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ | IPL 2026: Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ సీఎస్‌కే అప్‌డేట్స్‌

Apr 18 2026 7:04 PM | Updated on Apr 18 2026 9:02 PM

IPL 2026: Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Live Updates

SRH Vs CSK Updates

ఏడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ 177 పరుగుల వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది. 18వ ఓవర్‌లో క్లాసెన్‌ (59) కంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ 150 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. 13వ ఓవర్‌లో నితీష్‌కుమార్‌ (12) ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

12 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్‌ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.

సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ జేమీ ఓవర్టన్‌ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

  • ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ముకేశ్‌ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్‌ రుతురాజ్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.

అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ..
సీఎస్‌కేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్‌ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 38 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ 26, హెడ్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడు తున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 22 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో సీఎస్‌కే 15 విజ‌యాలలు, ఎస్ఆర్‌హెచ్ 7 విజ‌యాలు సాధించాయి. చివ‌రి ఐదు మ్యాచ్‌ల విష‌యానికొస్తే ఎస్ఆర్‌హెచ్ 3, సీఎస్‌కే రెండింట నెగ్గాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ

చెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట​ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్

 

 

Advertisement
 
Advertisement
Advertisement