ఆర్చర్ 11 బంతుల ఓవర్‌.. హనీ ట్రాప్ నిజమేనా? | Jofra Archer Bowls Longest Over In IPL History Fans Troll-Honey Trap Real | Sakshi
Sakshi News home page

ఆర్చర్ 11 బంతుల ఓవర్‌.. హనీ ట్రాప్ నిజమేనా?

May 9 2026 9:29 PM | Updated on May 10 2026 12:07 PM

Jofra Archer Bowls Longest Over In IPL History Fans Troll-Honey Trap Real

Photo Courtesy: IPL 2026

రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో ఆర్చ‌ర్ 5 వైడ్లు వేశాడు. ఆరు బంతులు వేయాల్సిన చోట 11 బంతులు వేసిన ఆర్చ‌ర్ 18 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో తొలి ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్‌గా ఆర్చ‌ర్ నిలిచాడు. 

ఇక ఆర్చ‌ర్ మ‌రో రికార్డు కూడా మూట‌గ‌ట్టుకున్నాడు. ఐపీఎల్‌లో బంతుల ప‌రంగా అత్యంత సుదీర్ఘమైన ఓవ‌ర్ వేసిన ఏడో బౌల‌ర్‌గా ఆర్చ‌ర్ నిలిచాడు. గ‌తంలో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్‌, సందీప్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ 11 బంతుల ఓవర్‌ వేశారు.

👉మ‌హ్మ‌ద్ సిరాజ్ (11 బంతులు, 2023లో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో)
👉 తుషార్ దేశ్‌పాండే (11 బంతులు, 2023లో ల‌క్నోతో మ్యాచ్‌లో)
👉 శార్దూల్ ఠాకూర్ (11 బంతులు, 2025లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో)
👉 సందీప్ శ‌ర్మ (11 బంతులు, 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో)
👉 హార్దిక్ పాండ్యా (11 బంతులు, 2025లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)
👉 అర్ష్‌దీప్ సింగ్ (11 బంతులు, 2026లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)

అయితే సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చ‌ర్‌ను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవ‌లే హనీట్రాప్ అంశం తెర‌మీద‌కు రావ‌డం, ఆర్చ‌ర్ కూడా గుజ‌రాత్ తో మ్యాచ్‌కు ముందు ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు. ఒక అభిమాని శ్రుతి మించి ఆర్చ‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. 

ఆర్చ‌ర్ శ‌నివారం ఉద‌యం జైపూర్ హోట‌ల్‌లో అమ్మాయితో క‌నిపించాడ‌ని.. సాయంత్రానికి నోబాల్ స‌హా ఐదు వైడ్లు వేయ‌డం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది* అంటూ పేర్కొన్నాడు. ఆర్చ‌ర్ త‌న కెరీర్‌లోనే అత్యంత చెత్త ఓవ‌ర్ వేసి జైస్వాల్ కెరీర్ నాశ‌నం చేశాడంటూ కొంద‌రు అభిమానులు కామెంట్లు చేశారు.

హనీట్రాప్ అంటే..
'హనీ ట్రాపింగ్' అంటే క్రికెటర్లను ప్రేమ సంబంధమైన లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా మోసగించడం, లొంగదీసుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం లేదా ఉచ్చులో పడేయడం వంటి పరిస్థితులను సూచిస్తుంది. తాజాగా జోఫ్రా ఆర్చర్ 11 బంతుల ఓవర్ వేసిన‌ తర్వాత, అతని పేరు హనీ ట్రాప్ వివాదంతో ముడిపడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఐపీఎల్ ఆటగాళ్లు హనీ ట్రాప్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బీసీసీఐ భ‌య‌ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ అంశం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఈ సమస్యను అరికట్టడానికి, టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు ఎవరూ హోటల్ గదుల్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలని  బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఇప్ప‌టికే క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: పంజాబ్ కింగ్స్ అత్య‌వ‌స‌ర స‌మావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు!

Advertisement
 
Advertisement
Advertisement