IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం | IPL2026: Lucknow Super Giants Vs Royal Challengers Bangalore-Match Live-Update | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం

May 7 2026 7:19 PM | Updated on May 8 2026 12:28 AM

IPL2026: Lucknow Super Giants Vs Royal Challengers Bangalore-Match Live-Update

గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది.

టిమ్ డేవిడ్ ఔట్‌.. ఆరో వికెట్ డౌన్‌
ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావ‌డంతో ఆర్సీబీ 158 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.  ఆర్‌సీబీ విజ‌యానికి 21 బంతుల్లో 55 ప‌రుగులు అవ‌స‌రం.

ఒకే ఓవ‌ర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్‌
ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో బౌలింగ్‌కు వ‌చ్చిన ప్రిన్స్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. ఓవ‌ర్ తొలి బంతికి ప‌డిక్క‌ల్ (34)ను పెవిలియ‌న్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 ప‌రుగుల వ‌ద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజ‌యానికి 48 బంతుల్లో 106 ప‌రుగులు అవ‌స‌రం.

ప‌టీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ
213 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ ఆర్సీబీ 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీదార్ (60) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, ప‌డిక్క‌ల్ 34 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

7 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీ 60/2
ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 2 వికెట్ల న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. ప‌డిక్క‌ల్ (26), ప‌టీదార్ (25) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
210 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో కోహ్లీ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ జాక‌బ్ బెథెల్ 4 ప‌రుగులు చేసి ష‌మీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 2 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.

ఆర్సీబీ టార్గెట్ 213 ప‌రుగులు
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌కు ప‌లుమార్లు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో ఆట‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించి ఆర్‌సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్‌ టార్గెట్‌ నిర్దేశించింది.

రెండో వికెట్ కోల్పోయిన లక్నో
111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

  • లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.

మిచెల్ మార్ష్ సెంచ‌రీ.. ల‌క్నో 139/1
ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శ‌త‌కం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. పూర‌న్ 14 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో
వ‌ర్షం అంత‌రాయం త‌ర్వాత మొద‌లైన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన అర్షిన్ కుల‌క‌ర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ప‌టీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ల‌క్నో 11 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. 

వరుణుడి అడ్డంకి 
ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్‌ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్‌ మార్ష్‌ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్‌ మార్ష్‌ 76, అర్షిన్‌ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

దంచుతున్న మిచెల్ మార్ష్‌
ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 56 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

4 ఓవర్లలో లక్నో 39/0
4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 39 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం
ల‌క్నో, ఆర్సీబీ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి ల‌క్నో 1.3 ఓవ‌ర్లలో వికెట్లు న‌ష్ట‌పోకుండా 12 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కుల‌కర్ణి (4) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

టాస్‌ నెగ్గిన ఆర్సీబీ
టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జ‌ట్టు ఎలాంటి మార్పు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. మ‌రోవైపు ల‌క్నో జ‌ట్టు మాత్రం మూడు మార్పుల‌తో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కుల‌క‌ర్ణి, మ‌నిర‌మ‌న్ స్థానంలో షాబాజ్ అహ్మ‌ద్, మోసిన్‌ ఖాన్‌ స్థానంలో దిగ్వేష్‌ రాఠీ జ‌ట్టులోకి వ‌చ్చారు.

ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్‌లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్‌ జె యింట్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్‌వుడ్.

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement