విరాట్‌ కోహ్లి అరుదైన ఫీట్‌! | Virat Kohli As Impact Player For First Time In His IPL Career | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి అరుదైన ఫీట్‌!

Apr 15 2026 11:15 PM | Updated on Apr 15 2026 11:22 PM

Virat Kohli As Impact Player For First Time In His IPL Career

Photo Courtesy: IPL 2026

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రావ‌డం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి త‌న కెరీర్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెన‌ర్‌గానే బ‌రిలోకి దిగేవాడు. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్ర‌ధాన జ‌ట్టులో స‌భ్యుడిగానే ఆడాడు. అయితే  ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి చీల‌మండ గాయంతో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. 

ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో క‌నిపించ‌డంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే క‌నిపించింది. అయితే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ బ్యాట‌ర్ల‌కు ఉప‌యోగ‌క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే కోహ్లి ల‌క్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జ‌ట్టులో లేక‌పోయేస‌రికి అభిమానులు కంగారు ప‌డిన‌ప్ప‌టికీ కెప్టెన్ ప‌టిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు. 

తొలిసారి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement