చెత్త ఆట‌లోనూ మిల్ల‌ర్ అరుదైన రికార్డు | Miller Completed 12000 Runs-T20 Cricket 3rd South African Batter | Sakshi
Sakshi News home page

IPL 2026: చెత్త ఆట‌లోనూ మిల్ల‌ర్ అరుదైన రికార్డు

Apr 27 2026 9:14 PM | Updated on Apr 27 2026 9:27 PM

Miller Completed 12000 Runs-T20 Cricket 3rd South African Batter

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో పిచ్ ఆది నుంచి పేస‌ర్ల‌కు అనుకూలంగా మార‌డంతో ఆర్సీబీ బౌల‌ర్లు హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లు చెల‌రేగిపోయారు. చెరో మూడు ఓవ‌ర్లు వేసిన ఈ ఇద్ద‌రు చెరో మూడు వికెట్లు త‌మ ఖాతాలో వేసుకోవ‌డం విశేషం. 

బంతి అనూహ్యంగా బౌన్స్‌, స్వింగ్ అవ్వ‌డంతో 10 ప‌రుగుల్లోపే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆట‌లోనూ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. టీ20ల్లో 12వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెట‌ర్‌గా డేవిడ్ మిల్ల‌ర్ నిలిచాడు. 11 ప‌రుగుల స్కోరు వ‌ద్ద ఉన్న‌ప్పుడు మిల్ల‌ర్ ఈ ఘ‌న‌త సాధించాడు. 

మిల్ల‌ర్ టీ20ల్లో 12వేల ప‌రుగులు పూర్తి చేయ‌డానికి 565 మ్యాచ్‌లు (513 ఇన్నింగ్స్‌లు) తీసుకున్నాడు. మిల్ల‌ర్ కంటే ముందు క్వింట‌న్ డికాక్ (12,454 ప‌రుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 ప‌రుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో 12వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాట‌ర్‌గా మిల్ల‌ర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్ల‌ర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచ‌రీలు బాదాడు. 

ఇక 2012లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మిల్ల‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 149 మ్యాచ్‌లాడి 3,100 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ స‌హా 14 అర్థ‌శ‌త‌కాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచ‌రీలను మిల్ల‌ర్ ల‌క్ష్య‌ఛేద‌న‌లో సాధించ‌డం మ‌రో విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ పొరేల్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 4, భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశారు.

చదవండి: అమ్మాయి చేసిన‌ పనికి అభిషేక్ శ‌ర్మ షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement