ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.
గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో.
ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.


