చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ | Ish Sodhi Creates Record-Became Highest Wicket-Taker For New Zealand | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

May 2 2026 9:37 PM | Updated on May 2 2026 9:47 PM

Ish Sodhi Creates Record-Became Highest Wicket-Taker For New Zealand

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ​టీ20 మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్‌ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. 

అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.   ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాతి ‍స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్‌. 

కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్‌సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్‌, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్‌) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. 

మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెవన్ జాకబ్స్‌, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బం‍గ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

Advertisement
 
Advertisement
Advertisement