breaking news
ish sodhi
-
భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.ఓపెనర్లుగా టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం ఊరట కలిగించే అంశం. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర రావడం కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్ చేస్తుంది.న్యూజిలాండ్ మిడిలార్డర్లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్ మిచెల్, ఆతర్వాత మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.లోయర్ ఆర్డర్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్‌గా మిచెల్ సాంట్నర్ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్ ఫామ్ పేసర్ కైల్ జేమీసన్ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్ పేస్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.ఐష్ సోది డౌటే..!భారత్‌పై ఐష్ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్. -
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్‌మన్ పావెల్ విధ్వంసం.. కానీ..
న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్‌లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.కేవలం 28 బంతుల్లోనేఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN— FanCode (@FanCode) November 6, 2025ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చాడు.ఆఖరి బంతి వరకు ఉత్కంఠదీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్‌కే పరిమితమయ్యాడు. దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్‌మన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్టన్ ఓవల్ వేదిక.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకిన న్యూజిలాండ్ ప్లేయర్
న్యూజిలాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఐష్ సోధి అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 24) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సోధి.. అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (సోధితో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. సోధికి ముందు న్యూజిలాండ్‌కే చెందిన టిమ్ సౌథీ (164), ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ (161) ఈ మైలురాయిని తాకారు.సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 96 మ్యాచ్‌ల్లో 161, సోధి 126 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశారు. సోధి ఈ ఘనత సాధించే క్రమంలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా వేయకపోవడం విశేషం.భారత్ తరఫున టాప్‌లో అర్షదీప్అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అర్షదీప్ 63 టీ20ల్లో 99 వికెట్లు తీశారు. అర్షదీప్ తర్వాత యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్లుగా ఉన్నారు.జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పసికూన, ఆతిథ్య జింబాబ్వేతో ఇవాళ (జులై 24) జరిగిన నామామాత్రపు మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ రాబిన్సన్ 10, మార్క్ చాప్మన్ 0, బెవాన్ జాకబ్స్ 0, మిచెల్ సాంట్నర్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
మాకు నీతులు చెప్పడం కాదు.. అద్దంలో చూసుకోండి: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Ban vs NZ 2nd ODI- So please don’t teach us: బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ లిటన్ దాస్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఇష్ సోధి విషయంలో అతడు వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. ఇలాంటివి చేసి నువ్వేం నిరూపించాలనుకుంటున్నావంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు కివీస్ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో వర్షం కారణంగా తొలి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక ఢాకా వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. బాల్ విసరకముందే క్రీజును వీడి తద్వారా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో వన్డే బంగ్లాదేశ్‌కు కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో బంగ్లా బౌలర్ హసన్ మహ్మూద్ బంతి విసరకముందే నాన్ స్ట్రైకర్ ఇష్ సోధి క్రీజును వీడగా రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. వెనక్కి పిలిచిన బంగ్లా కెప్టెన్ దీంతో ఇష్ సోధి తన బ్యాట్‌ను క్లాప్ చేస్తూ ముందుకు సాగాడు. అయితే, కెప్టెన్ లిటన్ దాస్ కలుగజేసుకుని సోధిని వెనక్కిపిలిచాడు. ఈ క్రమంలో బౌలర్‌ను హగ్ చేసుకున్నాడు కివీస్ ప్లేయర్ ఇష్ సోధి. ఆ సమయంలో 17 పరుగుల వద్ద ఉన్న అతడు.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక సోధిని వెనక్కి పిలిపించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా బంగ్లాదేశ్ క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిశాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. మాకు నీతులు చెప్పడం ఆపండి ‘‘మీకేమైనా ప్రాబ్లం ఉందా? నాకైతే రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి.. అసలు నువ్వు(బ్యాటర్) ముందుగానే క్రీజు ఎందుకు దాటావు? పాశ్చాత్య క్రికెట్ ప్రపంచం ఎల్లపుడూ క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా.. 60కేఎంపీహెచ్ పరిమితి ఉన్న చోటు కూడా 120 కేఎంపీహెచ్‌తో బౌలింగ్ చేయడం.. తర్వాత పొరపాటుగా జరిగిపోయిందని బుకాయించడం. మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా.. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి ఇకపైనైనా మాకు నీతులు చెప్పడం మానేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి ముందు’’ అని ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? అదే విధంగా.. ‘‘ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ రనౌట్ అయిన ప్లేయర్‌ను వెనక్కి పిలవడమేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని ఇలా చేస్తారా? అసలు నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లడం క్రీడాస్ఫూర్తి అనిపించుకోదు. అర్థమైందా?’’ అని లిటన్ దాస్‌కు ఆకాశ్ చోప్రా చురకలు అంటించాడు. కాగా గతంలో ఇదే తరహాలో క్రీజును ముందే వీడిన నాన్ స్ట్రైకర్‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసినపుడు, దీప్తి శర్మ ఇంగ్లండ్‌లో ఇలాగే రనౌట్ చేసినందుకు పాశ్చాత్య దేశాల క్రికెటర్లు మన్కడింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, కొంతకాలం క్రితం ఈ పదాన్ని తొలగిస్తూ ఇలా అవుట్ కావడం రనౌట్ కిందకే వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ తాను అవుట్ కాగానే సోధి బ్యాట్‌ను క్లాప్ చేయడం, లిటన్ దాస్ అతడిని వెనక్కిపిలిపించడం వంటి విషయాలు ఆకాశ్ చోప్రాకు ఆగ్రహం తెప్పించడంలో తప్పులేదు. Ish Sodhi was run out at the non strikers end by Hasan Mahmud. The third umpire checked and gave OUT! But when Sodhi started walking out, skipper Litton Das and Hasan Mahmud called him back again. What a beautiful scene! Lovely spirit of the game. The hug at the end was wonderful… pic.twitter.com/GvrpjXcJwB — SportsTattoo Media (@thesportstattoo) September 23, 2023 -
ఔటైనా వెనుక్కి పిలిచారు.. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్తున్న కివీస్ బ్యాటర్‌ను వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్రీడా స్పూర్తిని చాటుకుంది. ఏం జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో కివీస్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇష్ సోధి జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసేందుకు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ సిద్దమయ్యాడు. అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్(మన్కడింగ్) చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ కొత్త నిబంధనల ప్రకారం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నిరాశతో పెవిలియన్ వైపుగా సోధి నడిచాడు. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి.. సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్ తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, సహచర ఆటగాళ్లు అంపైర్లతో చర్చలు జరిపి సోదీని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హసన్ మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి పిలిచాడు. మళ్లీ తిరిగి వచ్చిన సోదీ నవ్వుతూ హసన్ మహమూద్‌ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు బంగ్లాదేశ్ మంచి మనసుకు పిధా అయిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. చదవండి: Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన భారత్ #BabarAzam𓃵 Asif Hassan Mahmud mankad Ish Sodhi then made him come back. Umpire gave it out (Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ — Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023 -
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను విండీస్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కోల్పోయింది. -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
బుధవారం హైదరాబాద్ వేదికగా భారత్‌తో తొలి వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. సోధి ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన సోధి ఇంకా పూర్తిగా కోలకోలేదని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ సృష్టం చేశాడు. " దురదృష్టవశాత్తూ సోధి తొలి వన్డే జట్టు ఎంపికకు అందుబాటులో ఉండడు. తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే చివరి రెండు మ్యాచ్‌లకు జట్టు సెలక్షన్‌కు సోధి అందుబాటులో ఆశిస్తున్నాను" అని మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాథమ్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వెటరన్ ఆటగాడు టిమ్ సౌథీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆ జట్టు పేసర్లు మాట్ హెన్రీ, జామిసన్ గాయం కారణంగా భారత పర్యటన మొత్తానికి దూరమయ్యారు. న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): లాథమ్ (కెప్టెన్), అలెన్, హెన్రీ నికోల్స్, కాన్వే, చాప్మన్, మిచెల్, ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్‌వెల్. చదవండి: Rohit Sharma: 'సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్.. వరల్డ్‌కప్‌కు బలమైన జట్టే లక్ష్యంగా' -
టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర...
Rachin Ravindra Become Youngest New Zealand Test Debutant Since Ish Sodhi: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. కీవిస్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రవీంద్ర నిలిచాడు. అంతకముందు 2013లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన ఇష్ సోధి అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. కాగా 22 ఏళ్ల రచిన్ రవీంద్రకు తన సహచర ఆటగాడు టామ్ బ్లండెల్ టెస్ట్ క్యాప్(282)ను అందించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి బరిలోకి దిగింది. ఇక అజాజ్ పటేల్,రచిన్ రవీంద్ర, ఇష్ సోధి భారతీయ మూలాలు కలిగి ఉన్న వాళ్లన్న సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-2023) లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఇక తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్
Ish Sodhi takes one handed stunner to dismiss Rohit Sharma: భారత్‌తో జరిగిన మూడో టీ20లో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండో బంతిని రోహిత్ శర్మ బౌలర్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో సోధి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోధి స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈడెన్ గార్డన్స్ వేదికగా నవంబర్21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అధేవిదంగా కెప్టెన్‌గా రోహిత్‌కు, కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. చదవండి: SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక Even if you recognize a fast moving opportunity coming your way, you still need to... raise your hand to stake your claim to it. (enabled by @ish_sodhi)#bgLifeLessons #bgCricGyan pic.twitter.com/4eWAtJjCOz — bollyglot gifs (@BollyglotGifs) November 21, 2021 -
T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Ish Sodhi Gets Hit On Face Against Namibia In T20 WC 2021: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నమీబియాతో మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బౌలర్ ఐష్ సోధి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. నమీబియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో డేవిడ్ వీస్ కొట్టిన బంతి బౌలర్ ఐష్ సోధి వేళ్లను తాకుతూ నుదుటిపై బలంగా తాకింది. దీంతో సోధి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారంత ఉలిక్కిపడ్డాడు. అయితే, ఆశ్చర్యకరంగా సోధి ఎటువంటి గాయం లేకుండా లేచి నిలబడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. I’m just glad he’s ok!!! That was so scary!!! @ish_sodhi #IshSodhi @BLACKCAPS #t20worldcup2021 #T20 pic.twitter.com/OzcOflcb7n— Aaron 🇳🇿 (@SportsFan437) November 5, 2021 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో మూకుమ్మడిగా రాణించడంతో 52 పరుగుల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది. చదవండి: ముజీబ్ కోసం ఫిజియోను పంపిస్తామన్న అశ్విన్.. తెలుగులో బదులిచ్చిన రషీద్ ఖాన్


