ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్‌కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), సీఎస్‌కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పషత రాలేదు. కానీ ధోని మాత్రం జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన సీఎస్‌కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూపర్‌కింగ్స్ ప్రత్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్’ అని తెలుగులో క్యాప్షన్ జత చేసింది.
ఆ వీడియోలో ధోని సింహంలా నడుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబస్తు గట్టిగా కనిపిస్తోంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కేవలం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా తరలిరానున్నారు. మ్యాచ్‌లో ఆడినా ఆడకపోయినా తలా ఒక్కసారి మైదానంలో దర్శనమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ధోని బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది.
ఒకవేళ ధోని జట్టులోకి వస్తే మాత్రం సర్ఫరాజ్‌ఖాన్ డగౌట్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్‌కే ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
🚨 IT'S OFFICIAL
MS DHONI IS TRAVELING TO HYDERABAD WITH THE CSK TEAM
pic.twitter.com/lXc4qHavBp— ` (@WorshipDhoni) April 16, 2026
𝙈𝙚𝙢𝙪 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙣𝙖𝙢, Hyderabad 🥳🦁#WhistlePodu #Yellove pic.twitter.com/oIT9uwxnTm
— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026


