ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వింత రికార్డు! | Delhi Capitals Team Strange Record Never Seen In IPL History | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వింత రికార్డు!

May 8 2026 9:50 PM | Updated on May 8 2026 10:52 PM

Delhi Capitals Team Strange Record Never Seen In IPL History

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా కేకేఆర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వింత రికార్డు న‌మోదు చేసింది. ఢిల్లీ ఇవాళ్టితో క‌లిపి ఆడిన‌ ఐదు మ్యాచ్‌ల‌ను ప‌రిశీలిస్తే ఒక విషయం మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మ‌రో మ్యాచ్‌లో వంద ప‌రుగుల్లోపే ఆలౌట‌వ్వ‌డం ఢిల్లీకి మాత్రమే చెల్లింది. 

విష‌యంలోకి వెళితే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. ఒక ద‌శ‌లో 74 ప‌రుగుల‌కు ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయిన ఢిల్లీ మిగ‌తా 9 వికెట్ల‌ను కేవ‌లం 68 ప‌రుగుల వ్య‌వ‌ధిలో కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక చెన్నైసూప‌ర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో 155 ప‌రుగులు చేసి ఓట‌మి పాల‌య్యింది. 

ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విధించిన 226 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించడం విశేషం. దానికి ముందు ఆర్సీబీతో మ్యాచ్‌లో సొంత‌గ‌డ్డ‌పై 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 264 ప‌రుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మిపాల‌వ్వ‌డం గ‌మ‌నార్హం. 

పంజాబ్‌తో మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్‌) విధ్వంస‌కర ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఎవ‌రికీ సాధ్యం కాని ఆట‌తీరుతో వింత రికార్డును మూటగ‌ట్టుకుంది.

చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఏకైక బ్యాటర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement