మిచెల్‌ మార్ష్‌ కళ్లు చెదిరే సిక్సర్‌! | Ball Goes Out Of Stadium As Mitchell Marsh Slams 102 Meter Six Viral | Sakshi
Sakshi News home page

మిచెల్‌ మార్ష్‌ కళ్లు చెదిరే సిక్సర్‌!

Apr 15 2026 10:20 PM | Updated on Apr 15 2026 10:52 PM

Ball Goes Out Of Stadium As Mitchell Marsh Slams 102 Meter Six Viral

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ క‌ళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన‌ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవ‌త‌ల ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement