RCB Vs LSG Updates
పంత్ ఔట్..
లక్నో సూపర్‌జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్ రాయ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గాయపడిన పంత్ మరోసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.
నాలుగు వికెట్లు డౌన్
లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రజత్ పటీదార్‌కు క్యాచ్ ఇచ్చుకుని అబ్దుల్ సమద్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది.
- లక్నో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన కృనాల్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది.
లక్నో సూపర్‌జెయింట్స్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పంత్ గాయానికి గురయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతి పంత్ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్కరమ్ రషీక్ సలామ్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోయి 32 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నోలు ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 6 సార్లు తలపడగా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు లక్నో సూపర్‌జెయింట్స్ విజయాలు సాధించాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో తలపడిన రెండు సందర్భాల్లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ నెగ్గాయి.
ఆర్సీబీ తుదిజట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.
లక్నో తుది జట్టు: మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.


