IPL 2026: కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం | IPL 2026: Chennai Super Kings Vs KKR Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం

Apr 14 2026 7:05 PM | Updated on Apr 14 2026 11:30 PM

IPL 2026: Chennai Super Kings Vs KKR Match Live Updates

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్‌దీప్‌ సింగ్‌ (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీయగా, అన్షుల్‌ కంబోజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. 

  • సీఎస్‌కేతో మ్యాచ్‌లో కేకేఆర్‌ కష్టాల్లో పడింది. నూర్‌ అహ్మద్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్‌ 85 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్‌ మరుసటి బంతికి కామెరున్‌ గ్రీన్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (5), పావెల్‌ (2) క్రీజులో ఉన్నారు.

  • అంతకముందు కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ అకిల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

  • సునీల్‌ నరైన్‌ (24) రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన నరైన్‌ స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 6 ఓవర్లలో  రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.

ఫిన్‌ అలెన్‌ ఔట్‌..
193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (1) శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

కేకేఆర్ టార్గెట్ 193 ప‌రుగులు
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై సూప‌ర్‌కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 ప‌రుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయ‌గా, వైభ‌వ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

  • 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37), సర్ఫరాజ్‌ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్‌ కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

సంజు క్లీన్‌ బౌల్డ్‌
111 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. 11.2 ఓవర్‌లో కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో సంజు శాంసన్‌ క్లీన్‌ బ్లౌల్డ్‌ అయ్యాడు.  ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. 

రెండో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే  రెండో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్‌ మాత్రే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్‌ (23 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

రుతురాజ్‌ (7) ఔట్‌..
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్‌రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్‌ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్‌కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.

ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్‌కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌కీపర్‌), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement