తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఎవ‌రీ ప్ర‌ఫుల్ హింగే! | Who Is Praful Hinge Becomes First Bowler Took 3 Wickets In 1st Over | Sakshi
Sakshi News home page

IPL 2026: తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఎవ‌రీ ప్ర‌ఫుల్ హింగే!

Apr 13 2026 10:33 PM | Updated on Apr 13 2026 10:40 PM

Who Is Praful Hinge Becomes First Bowler Took 3 Wickets In 1st Over

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్ర‌ఫుల్ హింగే సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిశాడు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్లోనే మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఔరా అనిపించాడు. 

ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ రెండో బంతికి వైభ‌వ్ సూర్య‌వంశీని గోల్డెన్ డ‌కౌట్‌గా వెన‌క్కి పంపిన ప్ర‌ఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత ఇన్నింగ్స్ చివ‌రి బంతికి ప్రిటోరియ‌స్‌ను వెన‌క్కి పంపాడు. త‌ద్వారా ప్ర‌ఫుల్ హింగే అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఒక‌సారి వాటిని ప‌రిశీలిద్దాం.

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవ‌ర్లోనే మూడు వికెట్లు తీయ‌డం ఇదే తొలిసారి. ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి బౌల‌ర్‌గా ప్ర‌ఫుల్ నిలిచాడు. గ‌తంలో తొలి ఓవ‌ర్లో బౌల‌ర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సంద‌ర్భాలున్నాయి. 

  • ఇక ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున 2024లో ఇదే రాజ‌స్తాన్‌పై భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇన్నింగ్స్‌ తొలి ఓవ‌ర్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కాగా ప్ర‌ఫుల్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు డ‌కౌట్‌లుగానే వెనుదిర‌గ‌డం విశేషం.

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలి ఆరు ఓవర్ల‌లో నాలుగు అంత‌కంటే ఎక్కువ ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలోనూ ప్ర‌ఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్‌హింగే కంటే ముందు ఇషాంత్ శ‌ర్మ‌, షోయ్ అక్త‌ర్‌, అజిత్ చండీలా, దావ‌ల్ కుల‌క‌ర్ణి, పాట్ క‌మిన్స్‌, దీప‌క్ చాహ‌ర్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ ఈ ఫీట్ సాధించారు.

ఎవరీ ప్రఫుల్‌ హింగే?
విదర్భకు చెందిన ప్రఫుల్‌ హింగే రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రఫుల్‌ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్యాకప్‌ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్‌ హింగే రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్‌ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. 

ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.

చదవండి: గోల్డెన్‌ డక్‌.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement