IPL 2026: సీఎస్‌కేపై సన్‌రైజర్స్‌ ఘన విజయం | IPL 2026: Chennai Super Kings Vs Sunrisers Hyderabad Match Live Upates | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేపై సన్‌రైజర్స్‌ ఘన విజయం

May 18 2026 7:08 PM | Updated on May 18 2026 11:39 PM

IPL 2026: Chennai Super Kings Vs Sunrisers Hyderabad Match Live Upates

ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్‌కే విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ 19 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(26 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు నితీశ్ కుమార్ రెడ్డి.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. సన్‌రైజర్స్ విజయానికి 17 బంతుల్లో 27 పరుగులు కావాలి.

ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ డౌన్‌
క్లాసెన్‌ రూపంలో సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన క్లాసెన్‌.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న కిషన్‌, క్లాసెన్‌
హెన్రిచ్‌ క్లాసెన్‌(43), ఇషాన్‌ కిషన్‌(48) దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌: 126/2

అభిషేక్ శ‌ర్మ (26) ఔట్‌.. రెండో వికెట్ డౌన్‌
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 56 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ అకిల్ హొసెన్ బౌలింగ్‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

7 ఓవ‌ర్ల‌లో ఎస్ఆర్‌హెచ్ 53/1
ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది. అబిషేక్ శ‌ర్మ (25), ఇషాన్ కిష‌న్ (22) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌
181 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ ట్రావిస్ హెడ్ (6) రూపంలో 18 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌద‌రీ బౌలింగ్‌లో హెడ్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ 181 ప‌రుగులు
సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శ‌ర్మ (32), శివ‌మ్ దూబే (26) త‌లా కొన్ని ప‌రుగులు చేయ‌డంతో సీఎస్‌కే గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ 3 వికెట్లు తీయ‌గా, సాకిబ్ హుసేన్ 2, ప్ర‌ఫుల్ హింగే, ఇషాన్ మ‌లింగ చెరొక వికెట్ తీశారు. టాపార్డ‌ర్ విఫ‌లం కావ‌డం సీఎస్‌కే కొంప‌ముంచింది.

  • 16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (35), శివ‌మ్ దూబే (16) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

4 వికెట్లు డౌన్‌
చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో రెండు వికెట్లు కోల్పోయింది. కార్తీక్‌ శర్మ 32, రుతురాజ్‌ గైక్వాడ్‌ 15 పరుగులు తీసి ఔటయ్యారు. క్రీజులో బ్రెవిస్‌ 11, శివం దూబె 7 పరుగులతో ఉన్నారు. ​స్కోరు 13 ఓవర్లకు 105-4గా ఉంది

9 ఓవర్ల‌లో సీఎస్‌కే 89/2
9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే 2 వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది. కార్తిక్ శ‌ర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజులో ఉన్నారు.

ఉర్విల్ క్లీన్‌బౌల్డ్‌.. రెండో వికెట్ డౌన్‌
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 48 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్‌ను సాకిబ్ హుస్సేన్‌ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియ‌న్ చేర్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై
సంజూ శాంసన్‌ (27) రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ 31 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

టాస్ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్‌ సింగ్‌ స్థానంలో అకిల్‌ హొసేన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ తెలిపాడు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement